TSEMPLOYEES
260 subscribers
15 photos
2 videos
63 files
171 links
TSEMPLOYEES Teachers Latest Information Daily Current Affairs Employees News
Download Telegram
Channel created
Channel name was changed to «TS Govt Employees»
Channel photo updated
Channel name was changed to «TS Employees Teachers»
IT గురించి
_*తరచూ అడుగుచున్న ప్రశ్నలు.*_

*1. ఇంటి అద్దె (HRA మినహాయింపు) గణన ఎలా?*
జ।। చెల్లించిన అద్దె -10% ఫే - 10% డి.ఏ

సంవత్సరంలో చెల్లించిన అద్దె 1లక్ష లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే ఇంటి యజమాని PAN ఇవ్వాలి (నెలసరి అద్దె 8400/- కానీ అంతకంటే ఎక్కువ చెల్లించిన వారు)

*2. టాక్సేబుల్ ఆదాయం దాదాపు 7,00,000 ఉంటే టాక్స్ ఎలా గణించాలి?*

2,50,000 వరకు పన్ను లేదు (60 ఏళ్ల లోపు వారికి)
2,50,001-5,00,000 వరకు (2.50 లక్షలకు) 10%
5,00,001-10,00,000 వరకు (5 లక్షలకు) 20%
10,00,000 పైబడిన 30%

7,00,000 కు టాక్స్ గణిస్తే
2,50,000 వరకు పన్ను లేదు
2,50,001 - 5,00,000 వరకు (2.50 లక్షలకు) 10%
అంటే 2,50,000 X 10% = 25,000/-
5,00,001 - 7,00,000 వరకు (2 లక్షలకు) 20%
అంటే 2,00,000 X 20% = 40,000/-
చెల్లించాల్సిన టాక్స్ (25,000+40,000/-)+3%ఎడ్యుకేషన్ సెస్సు.
అంకం సతీష్ కుమార్

*3. CPS వారికి సంబంధించిన సెక్షన్ల వారిగా ఉన్న అవకాశాలు.*

ఉద్యోగుల కంట్రీబ్యూషన్ చేసిన నిధి 80CCD(1) ప్రకారం 80C సెక్షన్ తో 1,50,000/- లో చూపాలి.

అధనంగా 80CCD1(B) ద్వార 50,000/- లబ్ధి ఎలా పొందే అవకాశం ఉంది

ఉద్యోగులకు వారి ప్రాన్ (PRAN) ఖాతా లో ఉద్యోగుల వాటకి సమానంగా జమచేసిన నిధిని ముందుగా ఆదాయం గా చూపించి తర్వాత 80CCD(2) ప్రకారం ఆదాయం నుండి పూర్తి మినహాయింపు కలదు.

*4. అధనంగా 80CCD(1B) ద్వార 50,000/- లబ్ధి ఎలా పొందే అవకాశం ఉంది?*

ఉద్యోగులకు CPS కాకుండా 80C కింద 1,50,000/- సేవింగ్స్ ఉంటే CPS నిధిని 80CCD(1B) లో 50,000 వరకు మినహాయింపు పొందవచ్చు.

ఒకవేళ ఉద్యోగులకు 80C కింద CPS కాకుండా 1,30,000/- సేవింగ్స్ ఉండి CPS deduction 70,000/- ఉంటే అప్పుడు 20,000/- లను 80C కింద మిగతా 50,000/- లను 80CCD(1B) కింద చూపవచ్చు.
ప్రశ్న:
ఉద్యోగాలలో మహిళలకు రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారు?

*జవాబు:
*రూల్-22A ప్రకారం అన్ని కేటగిరీ లకు చెందిన రిజర్వేషన్ స్థానాలలో మహిళలు కి 33 1/2 % రిజర్వ్ చేయబడి ఉన్నది.SC/ST/BC/OC కేటగిరీ ల వారికి కేటాయించబడిన స్థానం లలో ఆయా కేటగిరీ కి చెందిన మొదటి స్థానం, ఆ తదుపరి ప్రతి మూడవ స్థానం మహిళలు కి రిజర్వ్ చేయబడింది. పై రెండు రకాల రిజర్వేషన్లు వర్తింప జేస్తూ కమ్యూనల్ రోస్టర్ తయారు చేయబడుతుంది.
*🚩కంపెన్సేటరీ లీవ్ (CCL):*

*🚩పరభుత్వ సెలవు దినాన తప్పనిసరిగా ఉద్యోగ విధులకు కొందరు హాజరు కావలసిన అవసరం ఉండవచ్చు. అలా ప్రభుత్వ సెలవు దినాన ఉద్యోగ విధులను నిర్వహించిన ఉద్యోగులకు ఆ సెలవుకు బదులు వేరొక రోజున సెలవుగా వాడుకునే అవకాశం కల్పించే వీలుంది. ఇలా వేరొక రోజున సెలవుగా వాడుకుంటున్నప్పుడు ఆ సెలవును కాంపెన్సేటరీ లీవ్ అంటారు.*

*🚩వరొక రోజును కాంపెన్సేటరీ లీవ్ గా ఉపయోగించుకుంటున్నప్పుడు తప్పనిసరిగా తనకు సాధారణ క్యాజువల్ లీవ్ మంజూరు చేయగల అధికారుల నుండి కాంపెన్సేటరీ లీవ్ కు మంజూరి పొంది తీరాలి.*

*🚩ఒక క్యాలెండర్ సంవత్సరంలో మొత్తం 10 కి మించి కాంపెన్సేటరీ లీవ్ లు తీసుకునే వీలు లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ 7కు మించి కాంపెన్సేటరీ సెలవులు ఖాతాలో ఉంచుకునే వీలులేదు._*

*🚩ఏ కాంపెన్సేటరీ సెలవునైనా తాను పనిచేసిన ప్రభుత్వ సెలవు దినానికి ఆరు నెలల లోపే తీసుకోవాలి.*

*🚩కంపెన్సేటరీ సెలవులను సాధారణ క్యాజువల్ లీవ్ తో కలిసి తీసుకోవచ్చు. అయితే మొత్తం సెలవు ఒక్కసారి 10 రోజులకు మించకూడదు.*

*🚩(మెమో నం. 13112/Accts/67-2, తేది 01-03-1958 read with జి.ఓ.నం. 50 తేది 01-02-1968)*
*కాంపెన్సేటరీ సెలవులను సాధారణ క్యాజువల్ లీవ్ ఉన్నప్పటికీ కూడా కాంపెన్సేటరీ సెలవులను తీసుకోవచ్చు.*

*🚩కంపెన్సేటరీ సెలవుల నిమిత్తం వేరే లీవ్ రిజిస్టర్ నిర్వహించాలి. (మెమో నం. 934/Poli -B/63-2, GA (Poli.B)Dept తేది 23-04-1963).*

Join https://t.me/Telanganaemployees
Forwarded from TSEMPLOYEES

*సందేహాలు-సమాధానాలు*
_____________________

ప్రశ్న:
ఇంటి నిర్మాణానికి అడ్వాన్స్ తీసుకుంటే ఎప్పటి లోగా తీర్చాలి?

*జవాబు:*
*ఇంటి నిర్మాణానికి అడ్వాన్సు తీసుకుంటే 300 నెలల్లో, మరమ్మతులకి తీసుకుంటే 90 నెలల్లో,ఇంటి స్థలం కోసం తీసుకుంటే 12 నెలల్లో తీర్చాలి.*
ప్రశ్న:
వాలంటరీ నియామకం పొందువరికి కారుణ్య నియామకం వర్తిస్తుందా?

*జవాబు:*
*వర్తించదు.*

ప్రశ్న:
CCL ను DDO నుండి ఎప్పటిలోగా తీసుకోవాలి?

*జవాబు:*
*ఏ CCL ఐనా తాను పనిచేసిన ప్రభుత్వ సెలవు దినానికి 6 నెలలలోపే DDO దగ్గర నుండి పొందాలి.*

ప్రశ్న:
వ్యక్తి గత అవసరాలకు హాఫ్ పే లీవ్ వాడుకుంటే జీతం ఎలా చెల్లిస్తారు?

*జవాబు:*
*మెమో.14568 ,తేదీ:31.1.2011 ప్రకారం పే,డీఏ సగం మరియు అలవెన్సులు పూర్తిగా చెల్లిస్తారు.*

ప్రశ్న:
ఇంటి మరమ్మతులు కోసం ఎంత అడ్వాన్స్ గా పొందవచ్చు?

*జవాబు:*
*ఇంటి మరమ్మతులు, విస్తరణకు ములవేతనం కి 20 రెట్లు గానీ, 4 లక్షలు గానీ ,ఏది తక్కువ ఐతే ఆ మొత్తాన్ని అడ్వాన్సుగా ఇస్తారు.*

Join https://t.me/Telanganaemployees
*సందేహాలు - సమాధానాలు*
_______________________

ప్రశ్న:
అడ్మిషన్ రిజిస్టర్ లో ఒక పుట్టిన తేదీ ఉంది. మున్సిపాలిటీ/కార్పొరేషన్ వారు ఇచ్చిన సెర్టిఫికెట్ లో మరొక పుట్టిన తేదీ ఉంది.మున్సిపాలిటీ సెర్టిఫికెట్ ప్రకారం పుట్టిన తేదీ నామినల్ రోల్స్ లో మార్చమని పేరెంట్స్ అడుగుతున్నారు.అలా మార్చవచ్చా?

జవాబు:
SSC రూల్స్ 6 ప్రకారం తనిఖీ అధికారి అనుమతితో మార్పు చేయవచ్చు.

ప్రశ్న:
ఒక టీచర్ జూన్ నుంచి డిసెంబరు వరకు ప్రసూతి సెలవులో ఉన్నారు.ఆమె ఇంక్రిమెంట్ అక్టోబర్ నెలలో ఉంది.ఆమెకు ఇంక్రిమెంట్ ఎప్పటి నుంచి ఇవ్వాలి?

జవాబు:
*జీఓ.853 ; ఆర్ధిక ; తేదీ:22.1.13 ప్రకారం ఇంక్రిమెంట్ అక్టోబర్ 1 నుండి మంజూరు చేస్తూ,ఆర్ధిక లాభం విధులలో చేరిన తేదీ నుంచి మంజూరు చెయ్యాలి.

ప్రశ్న:
ఐటీ కేవలం ఫిబ్రవరి జీతంలోనే మినహాయించాలా?

జవాబు:
ఐటీ నిబంధనలు ప్రకారం చెల్లించవలసిన ఐటీ ముందే అంచనా వేసి మార్చి నెల జీతం నుండి ప్రారంభించి నెలనెలా మినహాయించాలి.ప్రతి క్వార్టర్ కి రిటర్న్స్ ఐటీ శాఖకు సమర్పించాలి.ఈ భాద్యత DDO లదే.

Join https://t.me/Telanganaemployees