🙏 ధర్మ స్థాపన 🙏
942 subscribers
104 photos
42 videos
259 files
1.01K links
For donations and support you may pay from any app by using UPI facility. Our UPI ID is: newenergyadvaitam@oksbi
Mobile No.9390151912
🌹🌹చదవండి-వినండి🌹🌹. http://darmam.com/dharmasthapana.html
Download Telegram
ఈ లింకును క్లిక్ చేసి విచారణ అంటే-నిత్యానిత్యవస్తు వివేచన అనే టాపిక్ ని చదవండి..
https://www.youtube.com/post/UgkxIFt8SvqjVpz0p4X-Ax2_bC-SiF1Ohpnc
Audio
క్వాంటం 22 డివైన్ ప్రారబ్దం, దేశకాల వస్తువులు, Receiver-Giver
https://youtu.be/wssS_XSJHmU
Audio
క్వాంటం-23 energy, frequency, vibration, sweet spot, instant results.
https://youtu.be/EPT5TAH5jXk?si=ko9j6_28b3CohHIb
ఈ లింకును క్లిక్ చేసి జ్ఞానగీత - 1 అనే టాపిక్ ని చదవండి..
https://www.youtube.com/post/UgkxmW6VVE2TQNXVIcWvdqBIy4QYYRtZ5LrI
ఈ లింకును క్లిక్ చేసి జ్ఞానగీత - 2 అనే టాపిక్ ని చదవండి..
https://www.youtube.com/post/Ugkxrocil2r9rtoRjwH19fuFJcpGsXbMOoyw
ఈ లింకును క్లిక్ చేసి జ్ఞానగీత - 3 అనే టాపిక్ ని చదవండి..
https://www.youtube.com/post/Ugkx5cskPNAHFXAUGSHVbpDuq6sEKXhkS9om
జ్ఞానగీత - 4
___

నిజానికి జీవులను ఆడించేది భగవంతుడు కాదు. మనిషిలో మనస్సున్నట్టు భగవంతునిలో అభిన్నంగా ఉన్న ప్రకృతియే(మహామాయే) ఈ కార్యకారణ సంబంధాలకు కారణమై ఉన్నది.

కారణము ఒక ఘటన.
కార్యము మరొక ఘటన.
అవి రెండూ విడి విడి భాగాలు.

కానీ "ఈ కార్యానికి ఇది కారణం" అని కార్యకారణాలను కలిపి చూపిస్తుంది మహామాయ.

తత్ఫలితంగా- 'కారణం లేకుండా కార్యం జరుగదు' అనే నిశ్చితాభిప్రాయానికి వచ్చేశాం.

కాబట్టే 'సాధన వలన మోక్షం' అనే తప్పుడు అభిప్రాయం ఏర్పడింది లోకంలో.

నిజానికి సాధనకి, మోక్షానికి సంబంధమే లేదు. అనే విషయం తెలుస్తుంది మోక్షంలో.

కర్మ లేకపోతే ఉండేది మోక్షమే.
కర్మ లేకుండా చేసుకోవడం కూడా కర్మే కదా! అంటావేమో...కాదు. ఇదొక్కటి మాత్రం కర్మే అయినా కర్మ కాదు.

బాటసారి మోసే అన్నపుమూట బరువు అన్నమాటేగాని, భోజనం వేళకు తనకు ఆకలి తీర్చి, శ్రమను తొలగించి, శక్తినిస్తుంది. బరువూ తొలగుతుంది.

అలా కాకుండా కర్తృత్వభావనతో కర్మలు చేశావనుకో...అది రాళ్లమూట వంటిది. పోయే కొద్దీ బరువూ పెరుగుతుంది. శ్రమా పెరుగుతుంది. శక్తి నశిస్తుంది. ఆకలీ తీరదు.

* * *

తోలుబొమ్మ ఎంత అందంగా ఉంటే మాత్రం దానిని పెళ్లి చేసుకోవాలని ఎవడైనా అనుకుంటాడా?

కర్మ అనేది ఓ జడ వస్తువు అని తెలుసుకున్నాక ఎవడైనా కర్మబంధంలో చిక్కుకుంటాడా?

కర్మ అనేది పడవ లాంటిది. తీరం చేరేవరకే దానితో పని. తీరం చేరుకున్నాక పడవను ఎవడూ ఇంటికి మోసుకెళ్లడు.

ఏ అవకాశం లేని ఏకాత్మస్థితికి(అకర్మకు) చేరేవరకే కర్మ. ఆ చరమదశలో కర్మబంధం దానికదే వీడిపోతుంది. కర్మ జడవస్తువు. కర్మఫలప్రదాత భగవంతుడు.

భగవంతునికి సంపూర్ణ శరణాగతి చెందాలి. అప్పుడే నీ ప్రతి కర్మా లోకకళ్యాణానికే దారి తీస్తుంది. కర్త తానని కర్మ చేయడమే పాపం. కాబట్టి అర్జునా! నీవు నా చేతిలో ఉన్న ఒక ఆయుధం లాంటివాడివి.

"అర్జునుడు" అనే ఆయుధంతో ఈ అధర్మపరులను నిశ్శేషంగా హతమార్చడానికే నేను అవతరించాను. నీవు కేవలం నిమిత్తమాత్రుడివి. కర్తృత్వభావన వదిలి యుద్ధం చేయి.

* * *

పరమాత్ముని యందే మనసు నిలపాలి.
దాని పట్ల ఆర్తిని, భక్తిని కలిగి ఉండాలి.
అప్పుడు మోక్షం సులభం.
మోక్షమంటే ఏదో అనుకోవద్దు. "ఆత్మనిష్ఠ" నుండి జారకుండా ఉండడమే మోక్షం.

సదా ఆత్మనిష్ఠలో ఉన్నవానికి-
వేదబ్రాహ్మణుడైనా ఆత్మే.
గోవు అయినా ఆత్మే.
ఏనుగైనా ఆత్మే.
కుక్క అయినా ఆత్మే.
కుక్క మాంసం తినే ఛండాలుడైనా ఆత్మే.

ఇలాంటి ఆత్మబుద్ధితో ఉన్నవాణ్ణే పండితుడు అనాలి. కేవలం శాస్త్రపరిచయం ఉన్నవాడు పండితుడు కాడు.

ఆత్మనిష్ఠయే సకలశాస్త్రసారం.
ఆత్మనిష్ఠుడే నిజమైన పండితుడు.

* * *

ఎవడు ఫలితాన్ని ఆశించక కర్మ కొఱకే కర్మ చేస్తాడో వాడు కర్మ చేయనివాడే అవుతాడు. కర్మను వదలి ఊరక ఉన్నంతమాత్రాన వాడు యోగి కాజాలడు.

యోగి అంటే కర్మరహితుడు అని కాదు;
సంకల్పరహితుడు అని అర్థం.

విషయాల పట్ల ఆసక్తి లేనివాడే నిజంగా యోగి.

* * *

సంకల్పాలు చేసే మనసే తనకు శత్రువు.
సంకల్పాలు లేని మనసే తనకు మిత్రుడు.

* * *

ప్రతీది భగవత్సంకల్పమే అయినప్పుడు
జీవుడు చేసే ప్రతి పనీ, ప్రతి తలంపూ
భగవత్సంకల్పంలో భాగమే కదా!

అని దృఢ నిశ్చయంతో చేసే ప్రతి పనీ, ప్రతి తలపూ పవిత్రమైన యజ్ఞంతో సమానమవుతాయి.

నది ఎన్ని మలుపులతో ప్రవహించినా చివరికి చేరేది సముద్రానికే అన్నట్లు, భగవదర్పణం చేసినవాని జీవితం కూడా అలా భగవంతుని వైపుకే పయనిస్తుంది.

ప్రతీది భగవదిచ్ఛ మేరకే జరుగుతున్నప్పుడు తనను ఒకడు సన్మానిస్తే ఏమి? ఒకడు అవమానిస్తే ఏమి?

సుఖదుఃఖాలు ఉండి, వాటిని సమానంగా చూడడం కాదు, ఇది సుఖము, ఇది దుఃఖము అని సుఖదుఃఖాల స్పర్శే ఉండదు. అలాంటి పూర్ణజ్ఞాని మట్టి, బంగారం రెండూ ఒకటే; ఆత్మపదార్థమే.

ఒకదాని పట్ల ప్రత్యేక భావముగాని,
మరొకదానిపట్ల హీన భావముగానీ ఉండవు. అపకారి యెడల, ఉపకారి యెడల సమభావం కలిగి ఉంటాడు. సుకర్మలను ఆచరించేవానిపట్ల దుష్కర్మలను ఆచరించేవానిపట్ల సమదృష్టి కలిగి ఉంటాడు. సమూహంలో ఉన్నా ఏకాంతంలో ఉంటాడు.

చూసేవారికి కర్మప్రవాహంలో కొట్టుకుపోతున్నట్టు ఉంటాడు. తనకు తాను గట్టున చేరి సాక్షిగా చూస్తుంటాడు. గాలి లేని చోట దీపంలా నిశ్చలంగా ఆత్మగా ప్రకాశిస్తుంటాడు. సదా ఆత్మనిష్ఠలో ఉండడమే ప్రధానలక్షణం పరిపూర్ణయోగికి.

ఉన్న ఒక్క సత్పదార్థమే సకలసృష్టిగా భాసిల్లుతోంది. కాబట్టి ఎవడు సకలంలో సత్యాన్ని, సత్యంలో సకలాన్ని చూస్తాడో అట్టివానికి, నాకు(భగవంతనికి) భేదమే లేదు. అట్టివాడు ఎక్కడున్నా "నాలో"నే ఉంటాడు. వాడు ఏ పని చేస్తున్నా నా కార్యాన్నే నెరవేరుస్తుంటాడు.

అర్జునుడు: కృష్ణా! అటువంటి సత్యనిష్ఠ నాకు కలగడం లేదు ఎలా?

కృష్ణభగవానుడు: నిజమే. ఈ మనసు కోతిలా చంచలమైనది. దీనిని(మనసును) అదుపులో(ఆత్మలో) ఉంచడం కష్టమైన పనే. సందేహం లేదు. కానీ తప్పదు. ప్రయత్నపూర్వకంగా ఈ మనసును ఆత్మలో నిలబెట్టాలి. "ప్రయత్నం" అని పేరేగాని, ప్రయత్నం మొదలుబెట్టగానే అది అత్యంత సులభం అయిపోతుంది. అదే ఈ ఆధ్యాత్మికంలో ఉండే తమాషా.
ఆత్మలో ఉండడం, ఆత్మగా ఉండడం ఎంత సులభం అంటే, నదిలో దిగాక తడవడం ఎంత సులభమో అంత సులభం.
నదిలో దిగేవరకే ప్రయత్నం. తడవడానికి ఏ ప్రయత్నమూ చేయం కదా!

ఓ మనసా! నిరంతరం మారిపోతుండే విషయాలతో ఎప్పటికైనా నశించిపోయే వస్తువులతో నిండిపోయి వున్న ఈ ప్రపంచంలో నువ్వు ఏం సుఖం బావుకున్నావు? నిలకడగా ఏనాడైనా సుఖానుభూతిని పొందావా? రంగులరాట్నంలో తిరుగుతూ ఎవడైనా చందమామ సౌందర్యాన్ని ఆస్వాదించగలడా? ఐహిక విషయాల్లో తిరుగుతూ నీవు ఆత్మసుఖాన్ని అనుభవించడం కూడా అంతే. బయటకు పరిగెత్తడం మాని లోలోపలికి వెళ్లి, నీ పుట్టు చోటుకు చేరి నీ నిజరూపమైన ఆత్మగా విరాజిల్లు. అని నీ మనసుకు నచ్చజెబితే అది నీ మాట వింటుంది. నీ మనసు నీ మాటగాక ఇంకెవరి మాట వింటుంది? నిజంగా నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి.

అర్జునుడు: మనసును ఆత్మలో నిలబెట్టే ప్రయత్నంలో ఉన్న యోగి తన ప్రయత్నం పూర్తి కాకనే మరణిస్తే వారి గతి ఏమి?

కృష్ణభగవానుడు: తినేది నోరే అయినా ఆహారం వలన లభించే శక్తి మాత్రం మిగతా అన్ని అవయవాలకు సమంగా పంచబడుతుంది. అలాగే యోగి యొక్క ఉపాసనాఫలాన్ని మిగతా అందరికీ సమంగా పంచేస్తుంది ప్రకృతి. అంతేగాని పూర్తిగా ఆ సాధనాఫలం తన ఒక్కని వద్దనే ఉండదు. కుండనీళ్లను సముద్రంలో కుమ్మరిస్తే సముద్రవ్యాప్తం అయినట్లు ప్రతి ఒక్కని పాపపుణ్యఫలం మిగతా అందరికి కూడా సమంగా పంచబడుతుంది. ఎవడి కర్మఫలాన్ని వాడే అనుభవిస్తాడు అనేది తప్పు. ఎవడికైనా అనుభవంలోకి వచ్చేది సరాసరి అనుభవమే.

* * *

మరణం అంటే ఈ జగత్ స్వప్నాన్ని ఉన్నపళంగా వదిలేయడం.
పునర్జన్మ అంటే ఉన్నపళంగా ఉన్న చోటనే మరో స్వప్నాన్ని కనడం.

* * *

గతంలో(ముందు కలలో) తాను చేసిన గాఢమైన సంకల్పాలే మరుజన్మకు(మరో కల కనడానికి) బీజాలు అవుతాయి.

చెడు సంకల్పాలు, శుభసంకల్పాలు రెండూ మరో జన్మకు(కలకు) కారణమైనప్పటికీ చెడుసంకల్పాలు జన్మపరంపరలకు దోహదం చేస్తుంది.

శుభసంకల్పాలు మోక్షానికి(మెలకువకు) దోహదం చేస్తుంది. మోక్షం అంటే శాశ్వతమైన మెలకువ.

ఆ తరువాత నిద్రా(అజ్ఞానమూ) ఉండదు. కలలూ(జన్మలూ)ఉండవు.

మెలకువకు దోహదం చేసే శుభసంకల్పాలలో ధ్యానం అనేది అత్యుత్తమ శుభసంకల్పం. ధ్యానం అంటే పాపపుణ్యములు అనే మలినాన్ని శుభ్రం చేయడం. కాబట్టి కఠిన తపస్సులు, చాంద్రాయణవ్రతాలు, శాస్త్రవిచారణలు, అగ్నిహోత్రాది కర్మలు...వీటన్నిటి కంటే ధ్యానమే శ్రేష్ఠమైనది.

అర్జునా! నేను నిన్ను శాసిస్తున్నాను-
నీవు ధ్యానయోగివి కా!

* * *

కృష్ణభగవానుడు: దేనిని తెలుసుకుంటే, ఇక తెలుసుకోవడానికి ఏమీ మిగిలి ఉండదో అట్టి జ్ఞానాన్ని నీకిపుడు చెబుతా విను-

తాను కనే కలలో ఎంతమంది ఉన్నా కలను కనే తనకు సాటిరారు ఎవరూ.

కలలో ఉన్నవారందరూ మెలకువ కోసం ప్రయత్నించినప్పటికీ, కలలో ఉన్న తాను చేసే గాఢ ప్రయత్నం వలన మాత్రమే మెలకువ వస్తుంది. ఎందుకంటే, కలలోని తానొక్కడు మాత్రమే కల కనే "తన"తో సంబంధపడి ఉండేది.

* * *

నా మాయాశక్తి రెండు విధములుగా ఉన్నది-
1. పదార్థముగాను(పంచభూతములుగాను)
2.శక్తిగాను(మనసు, బుద్ధి, అహంకారములుగాను) ప్రకటనమై ఈ యావత్తు సృష్టికి కారణమై ఉన్నది.

నా(నేను) కంటే శ్రేష్ఠమైనది వేఱే ఏమీలేదు. ఎందుకంటే "నేను" తప్ప వేఱే ఏమీలేదు. కాసులహారంలో అన్నీ ఒకే బంగారు తీగకు గ్రుచ్చబడి ఉన్నవి. కాసులూ, తీగ రెండూ బంగారమే అయినట్లు సకలము, నేను అభిన్నము.

సకలంలో నన్ను చూడడం నీకు చేతకాకపోతే, నీకు ప్రత్యేకమని, విశిష్ఠమని అనిపించే వాటిల్లో ముందు నా ఉనికిని గుర్తించడానికి మొదట ప్రయత్నించు. తరువాత మిగతా వాటిల్లో కూడా నా ఉనికిని స్పష్టంగా చూడడం నేర్చుకోవచ్చు.

నేను దేనిలోనూ ఉండను.
"నా"లోనే అన్నీ ఉన్నాయి.
సముద్రంలో చేపలుంటాయేగాని,
చేపల్లో సముద్రం ఉండదు కదా!

* * *

దేనికది పరిపూర్ణం కాదు.
పరిపూర్ణంలో అన్నీ ఉన్నాయి.

రూపాయిలో చిల్లర ఉంటుందేగాని,
చిల్లరలో రూపాయి ఉండదు కదా!

మాయ అనేది సదా నా స్వాధీనంలోనే ఉంటుంది, కాపలా కుక్క వలె. అపరిచితుడు కుక్క బారి నుండి తప్పించుకోవాలంటే, ముందుగా దాని యజమానిని పిలవాలి. అలాగే నన్ను శరణం పొందినవారిని నా మాయ ఏమీ చేయదు.

1. బాధల్లో ఉండేవాడు.
2. ధనాన్ని కోరేవాడు.
3. సాధన చేసేవాడు
4. జ్ఞానియైనవాడు

ఈ నలుగురూ నన్ను(భగవంతుణ్ణి) ఆశ్రయించి ఉంటారు. ఈ నలుగురిలో జ్ఞాని శ్రేష్టుడు. అతడు నాకు మిక్కిలి ప్రియం. ఎందుకంటే అతడు నా స్వరూపమే కాబట్టి. మిగతా ముగ్గురు కూడా ఉత్తములే. ఎందుకంటే వారు కూడా చివరకు నన్నే చేరుకుంటారు కాబట్టి. నన్ను చేరుకోవడం అంటే, వారు "నేనే" అయిపోవడమన్నమాట.

దుఃఖంలో ఉండేవాడు కోరేది నన్నే.
నేనే సుఖాన్ని, పరమసుఖాన్ని.

ధనాన్ని కోరేవాడు నన్నే.
నేనే ధనాన్ని, పరమధనాన్ని.

సాధకుడు సాధించేది నన్నే.
నేనే సిద్ధిని, పరమపదాన్ని.

ఇక జ్ఞానికి నేనే మార్గం, నేనే గమ్యం.
అనంతుడైన నన్ను(నేనును) విడిచి ఎక్కడకూ వెళ్లలేడు.

అటువంటి జ్ఞాన స్వరూపుడు మిక్కిలి దుర్లభుడు. ఎందుకంటే ఉనికి ఉండేది ఒక్క జ్ఞానికి మాత్రమే.

రెండు అనంతాలు ఉండనట్లు, జ్ఞానులు ఇద్దరు ఉండరు.

ఆ ఏకైక జ్ఞాని "నేనే".
నేను అంటే కృష్ణుడు కాదు.
నేను అంటే ఆత్మవాచకం.

ఎవరెవరు ఏయే దేవతామూర్తులను ఆరాధిస్తున్నా సరే
ఆయా దేవతారూపాల్లో ఉండి వారిని అనుగ్రహించేది "నేనే".

* * *

1. జరిగిపోయింది
2. జరుగుతున్నది
3. జరగబోయేది

ఈ మూడు కాలాల విశేషాలు నాకు తెలుసును.

ఈ మూడూ నాలోనే ఉనికి కలిగి ఉన్నాయి.
వాటిల్లో నేను ఉండను.

* * *
ఈ లింకును క్లిక్ చేసి జ్ఞానగీత - 4 అనే టాపిక్ ని చదవండి..
https://www.youtube.com/post/UgkxzSF5CsBcQQmLkQQVVMETXebMphoDD9eh