VOLUNTEER 🤝 CONNECTION
36.9K subscribers
3.44K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*తీవ్ర తుఫాను హెచ్చరిక ⚠️*
హుద్‌హుద్, తిత్లీ తుఫానుల తర్వాత మరోసారి ఈ వ్యవస్థ మధ్య కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో భారీ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది! ⚠️

అక్టోబర్ 27–29 తేదీల్లో బాపట్ల నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న ప్రాంతాల ప్రజలు వర్షాలు, బలమైన గాలుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి! 🌧️💨

📍 మచిలీపట్నం – విశాఖపట్నం మధ్య తుఫాను తీరం దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి!
*ఆంధ్రప్రదేశ్ లో ' MPTC ', ' ZPTC ' ఎన్నికల నామినేషన్లకు నేటితో ముగియనున్న గడువు..!*

*నేడు సాయంత్రం 5 గంటలకు ముగియనున్న నామినేషన్ల దాఖలు గడువు.*

*మొదటి రెండు రోజులు 'MPTC' స్థానాలకు 32,095 నామినేషన్లు దాఖలు.*

*28 'ZPTC' స్థానాలకు 2,805 నామినేషన్లు దాఖలు.*
📢 *BREAKING NEWS 🚨 రైతులకు ముఖ్య సమాచారం*

🌾 *ఆంధ్రప్రదేశ్‌లో పొలం పన్ను చెల్లింపులో కొత్త ఆన్‌లైన్ విధానం!*

గతంలో రైతులు పొలం పన్ను చెల్లించాలంటే పట్టాదారు పాస్‌బుక్ తీసుకెళ్లి, అందులోని ఖాతా నంబర్ ఆధారంగా భూమి వివరాలు నమోదు చేసి, ఫసలీ సంవత్సరం వారీగా పన్ను చెల్లించేవారు.

తాజాగా అందుబాటులోకి వచ్చిన కొత్త ఆన్‌లైన్ విధానంలో ఆధార్ ఆధారంగా రైతుల భూముల వివరాలను గుర్తించి, పన్ను చెల్లించే ప్రక్రియను సులభతరం చేశారు.

📌 *కొత్త విధానం ఎలా పనిచేస్తుంది?*

✅ 1. ఆధార్ నంబర్ నమోదు: రైతు ఆధార్ నంబర్‌ను ఆన్‌లైన్ వ్యవస్థలో నమోదు చేస్తారు.

✅ 2. OTP ధృవీకరణ: భూమి రికార్డులకు అనుసంధానమైన ఆధార్ ఆధారిత మొబైల్ నంబర్‌కు వచ్చే OTPతో ధృవీకరణ చేస్తారు.

✅ 3. భూముల వివరాల గుర్తింపు: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ గ్రామాల్లో రైతుకు ఉన్న భూముల వివరాలు, సంబంధిత ఖాతాలు ఆన్‌లైన్ రికార్డుల్లో అందుబాటులో ఉంటే ప్రదర్శితమవుతాయి.

✅ 4. పన్ను మొత్తం: సంబంధిత గ్రామం, ఖాతా వివరాలను ఎంచుకున్నప్పుడు చెల్లించాల్సిన పొలం పన్ను మొత్తం కనిపిస్తుంది.

🏢 *రైతులు ఎక్కడ పన్ను చెల్లించవచ్చు?*

రైతులు స్వయంగా ఆన్‌లైన్‌లో పన్ను చెల్లించలేని పరిస్థితుల్లో, తమకు సమీపంలోని గ్రామ/వార్డు సచివాలయంలోని సంబంధిత డిజిటల్ అసిస్టెంట్ (Digital Assistant) వద్ద లేదా మీ-సేవ (MeeSeva) కేంద్రంలో ఆన్‌లైన్ సేవను పొందవచ్చు.

అక్కడ సంబంధిత ఆపరేటర్ ద్వారా ఆధార్ వివరాలు నమోదు చేసి, OTP ధృవీకరణ అనంతరం భూమి వివరాలను పరిశీలించి, పన్ను చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

📍 *ఈ విధానం వల్ల ప్రయోజనాలు*

🔹 ప్రతిసారీ పట్టాదారు పాస్‌బుక్ తీసుకెళ్లి ఖాతా నంబర్ నమోదు చేయాల్సిన అవసరం తగ్గుతుంది.

🔹 వేర్వేరు గ్రామాల్లో భూములున్న రైతుల వివరాలను ఒకే ధృవీకరణ ప్రక్రియ ద్వారా గుర్తించే అవకాశం ఉంటుంది.

🔹 చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని ఆన్‌లైన్‌లో తెలుసుకోవడం సులభమవుతుంది.

⚠️ *రైతులు తప్పనిసరిగా గమనించాలి:*

• భూమి రికార్డులకు ఆధార్ అనుసంధానం సక్రమంగా ఉండాలి.

• OTP వచ్చే మొబైల్ నంబర్ అందుబాటులో ఉంచుకోవాలి.

• రైతు స్వయంగా రాలేని సందర్భంలో, సంబంధిత ధృవీకరణ నిబంధనల ప్రకారం మాత్రమే ఇతరులు సహాయం పొందాలి. OTPను అనధికారికంగా పంచుకోవద్దు.

📢 *రైతులందరూ ఈ కొత్త విధానంపై అవగాహన కలిగి ఉండండి. అవసరమైనప్పుడు మీ గ్రామ/వార్డు సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్‌ను లేదా సమీప మీ-సేవ కేంద్రాన్ని సంప్రదించండి.*
📢 *ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ఉద్యోగుల కు ఎలాంటి సెలవులు మంజూరు చేయబడవు*
🚨 Alert 🚨
*తుఫానుతో అతిభారీ వర్షాలు హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే.*
🚨 ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేడి.. 4 పట్టణాల్లో 1,080 నామినేషన్లు! 🗳️🔥

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గడువు పొడిగించిన నాలుగు పట్టణ స్థానిక సంస్థల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 📢

📊 📍 పట్టణాల వారీగా నామినేషన్లు

🔹 తిరుపతి – 543
🔹 మైదుకూరు – 207
🔹 కడప – 196
🔹 రాజంపేట – 134

✅ మొత్తం నామినేషన్లు: 1,080

🏛️ పార్టీల వారీగా నామినేషన్ల వివరాలు

🟡 టీడీపీ – 482
🔵 వైసీపీ – 298
🟥 జనసేన – 113
🟠 బీజేపీ – 32
⚪ స్వతంత్రులు – 129+

📌 మొత్తం: 1,054 నామినేషన్లు

🗳️ నామినేషన్ల జోరు.. ఎన్నికల బరిలో రాజకీయ పార్టీల పోటీ ఆసక్తికరం!
*ఫామ్-A, ఫామ్-B సమర్పణపై ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు*

▪️MPTC, ZPTC ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు ఫామ్-A, ఫామ్-B సమర్పణపై మార్గదర్శకాలు జారీ.
▪️ఈనెల 27 మధ్యాహ్నం 3గంటల లోపు ఫామ్‌-B రిటర్నింగ్ అధికారికి అందించాలి: SEC
*బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం..!*

*ప్రస్తుతం విశాఖకు 820, కాకినాడకు 910 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం.*

*నేడు తీవ్రవాయుగుండంగా 'అర్నబ్' బలపడి, రేపు ఉదయానికి తుపానుగా మారే అవకాశం.*

*మంగళవారం ఉదయానికి 'అర్నబ్' తీవ్ర తుపానుగా బలపడే అవకాశం.*

*బుధవారం ఉదయానికి 'అర్నబ్' బాపట్ల - విశాఖ మధ్య తీరం దాటే అవకాశం*

*ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల నిర్వహణ సంస్థ.*
కాకినాడ, కోణసీమ మరియు యానాం తీర ప్రాంతాల సమీపంలో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎమ్‌డి అంచనా వేస్తోంది 🌀 సిద్ధంగా ఉండండి ✅
🌾 రైతులకు ముఖ్య గమనిక: అన్నదాత సుఖీభవ & PM కిసాన్ అప్‌డేట్!

అక్టోబర్ 30న పీఎం కిసాన్ నిధులతో పాటు అన్నదాత సుఖీభవ పేమెంట్ జమ కానుందా? మీ పేమెంట్ స్టేటస్ వివరాలు ఇలా చెక్ చేసుకోండి.

📌 ముఖ్య వివరాలు:
• పీఎం కిసాన్ సాయం: కేంద్రం నుంచి రూ. 2,000 జమ అయ్యే అవకాశం.
• రాష్ట్ర ప్రభుత్వం సాయం: అన్నదాత సుఖీభవ నిధుల విడుదలపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
• మొత్తం లబ్ధి: రెండు పథకాలు కలిపి అర్హులకు వార్షికంగా రూ. 20,000 ఆర్థిక సాయం.
• ముఖ్యమైన పని: బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ (NPCI Seeding) మరియు e-KYC తప్పనిసరిగా పూర్తయి ఉండాలి.
సైక్లోన్ ARNAB తీవ్ర గాలులతో బీభత్సం సృష్టించే అవకాశం! ⚠️

మచిలీపట్నం నుంచి విశాఖపట్నం వరకు ఉన్న తీర ప్రాంత ప్రజలు అక్టోబర్ 27వ తేదీ సాయంత్రం నుంచి 28వ తేదీ రాత్రి వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.

ఈ ప్రాంతంలో గంటకు 100–150 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉంది. వీటికి తోడు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భారీ నష్టం సంభవించే ప్రమాదం ఉంది. ⚠️🌪️
📢 *ఏపీ ప్రజలకు అలర్ట్: వాట్సాప్‌లోనే కుల ధ్రువీకరణ పత్రం (Caste Certificate)!*

ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా, మన మిత్ర (Mana Mitra) వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కుల ధ్రువీకరణ పత్రాన్ని రీ-ఇష్యూ (Re-issue) చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

*ముఖ్య వివరాలు:*
• *అధికారిక వాట్సాప్ నెంబర్:* 9552300009
• *సేవ:* Revenue Services ➔ Re-Issuance of Integrated Certificates
• *ఫీజు:* రూ. 40/- మాత్రమే
• *ధ్రువీకరణ:* ఆధార్ నెంబర్ & OTP ద్వారా
• *సర్టిఫికెట్:* నేరుగా PDF రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

*దరఖాస్తు & డౌన్‌లోడ్ ప్రాసెస్:*
1. 9552300009 నెంబర్‌కు "Hi" అని వాట్సాప్ మెసేజ్ చేయండి.
2. రెవెన్యూ సర్వీసెస్ (Revenue Services) ఎంచుకోండి.
3. "ఇంటిగ్రేటెడ్ ధ్రువీకరణ పత్రం మళ్లీ జారీ" ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
4. ఆధార్ నెంబర్ నమోదు చేసి OTP వెరిఫై చేయండి.
5. వివరాలు సరిచూసుకుని ఫీజు చెల్లించి PDF సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి.
2014 - హుద్‌హుద్ (విశాఖపట్నం)

2018 - తిత్లీ (శ్రీకాకుళం)

2026 - అర్నబ్ (కాకినాడ / కోనసీమ)

⚠️ తాజా అప్‌డేట్ ప్రకారం, ప్రధాన వాతావరణ నమూనాలు ప్రస్తుతం కాకినాడ / కోనసీమ సమీపంలో తుఫాను నేరుగా తీరం దాటే అవకాశాన్ని సూచిస్తున్నాయి.

📍 అక్టోబర్ 28న గంటకు 150 కి.మీ. వరకు విధ్వంసకర గాలులు వీచే అవకాశం ఉంది.
- బంగాళాఖాతంలో అల్పపీడనం.. తుపానుగా మారే అవకాశం.
- అక్టోబర్‌ 26 నాటికి తుపానుగా బలపడే సూచనలు.
- 27, 28 తేదీల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదిలే అవకాశం.
- ఉత్తర కోస్తాంధ్రలో గంటకు 70–90 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే సూచనలు.
- శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం.
- కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి పడే ప్రమాదం.
- ఒడిశా తీరానికి కూడా భారీ వర్ష సూచన.
- మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారుల హెచ్చరిక.
- కోత దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన.
- తుపాను మార్గం, తీవ్రత, తీరం దాటే ప్రాంతంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Holidays announced to all schools in Anakapalli district from oct 27 to 29th ( 3 days ) due to Cyclone Arnab🌀⚠️

అర్నబ్ తుఫాను కారణంగా అనకాపల్లి జిల్లాలోని అన్ని పాఠశాలలకు అక్టోబర్ 27 నుండి 29వ తేదీ వరకు (3 రోజులు) సెలవులు ప్రకటించబడ్డాయి🌀⚠️
రాష్ట్రంపై తుఫానం ప్రభావం, ముంబై సన్నద్ధతపై సీఎం చంద్రబాబు సమీక్ష. సహాయక చర్యలకు అందుబాటులో 10 NDRF, 11 SDRF బృందాలు. ముంప ప్రాంతాలలోని ప్రజల తరలింపు, పునరావాస కేంద్రాలపై ప్రత్యేక దృష్టి. సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లను తీరానికి వచ్చేలా చూడాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. భారీ వర్షాల దృష్ట్యా, వరదను నివారించడానికి రిజర్వాయర్ల నుండి నీటిని ఖాళీ చేసే చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు. 🌊🚨
గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో లక్షలాది చెట్లు ప్రమాదంలో ఉన్నాయి. గంటకు 130-180 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు చెట్లను సులభంగా వేళ్లతో సహా పెకిలించగలవు 🌴
*❇️APPSC DISTRICT EDUCATIONALOFFICER POSTS ROASTER POINTS IN A.P*

*NEW 100 ROASTER POINTS AS PER GO MS 77 DATE 02-08-2023 IN AP*


*1.నోటిఫికేషన్ మరియు పోస్టు వివరాలు:*
*నోటిఫికేషన్ వివరాలు: APPSC గ్రూప్-1 సర్వీసెస్ నోటిఫికేషన్ నెం. 07/2026, తేది: 06/10/2026.*

*దరఖాస్తు గడువు: ఆన్‌లైన్ దరఖాస్తులు 06/10/2026 నుండి 27/10/2026 రాత్రి 11:59 గంటల వరకు స్వీకరిస్తారు.*

*మొత్తం గ్రూప్-1 ఖాళీలు: 166 పోస్టులు.*

*డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DEO - పోస్ట్ కోడ్ 05):*
*మొత్తం పోస్టులు: 14*
*వయోపరిమితి (01.07.2026 నాటికి): 18 నుండి 44 సంవత్సరాలు*
*వేతన స్కేలు: రూ. 61,960 - 1,51,370*

*2.DEO పోస్టుల విభజన (మల్టీ జోన్ల వారీగా):*
*మొత్తం 14 DEO పోస్టులను మల్టీ జోన్-I మరియు మల్టీ జోన్-II లకు సమానంగా (చెరి 7 పోస్టులు) కేటాయించారు:*

*మల్టీ జోన్ - I (జోన్ 1 నుండి 3): శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు.*.

*మల్టీ జోన్ - II (జోన్ 4 నుండి 6): గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప, నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి జిల్లాలు.*

*3.DEO పోస్టుల రోస్టర్ పాయింట్లు (G.O. Ms 77 ఆధారంగా):*
*రెండు మల్టీ జోన్లలోనూ 1 నుండి 7 వరకు ఉన్న రోస్టర్ పాయింట్లు ఒకే విధంగా వర్తిస్తాయి:*

*పాయింట్ 1 (OC - ఓపెన్ 5%): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అభ్యర్థులందరూ అర్హులు.*

*పాయింట్ 2 (SC - గ్రూప్ I - లోకల్ 95%): సంబంధిత మల్టీ జోన్ స్థానిక అభ్యర్థులకు మాత్రమే.*

*పాయింట్ 3 (OC - లోకల్ 95%): స్థానిక అభ్యర్థులకు మాత్రమే.*

*పాయింట్ 4 (BC-A - లోకల్ 95%): స్థానిక అభ్యర్థులకు మాత్రమే.*

*పాయింట్ 5 (OC - లోకల్ 95%): స్థానిక అభ్యర్థులకు మాత్రమే.*

*పాయింట్ 6 (OC - లోకల్ 95%): స్థానిక అభ్యర్థులకు మాత్రమే.*

*పాయింట్ 7 (SC - గ్రూప్ II - లోకల్ 95%): స్థానిక అభ్యర్థులకు మాత్రమే.*

*4.మహిళా సమాంతర రిజర్వేషన్ (Horizontal Reservation):*
*ప్రతి 3 పోస్టులలో ఒక పోస్టు మహిళలకు (33%) కేటాయించబడుతుంది.*

*DEO పోస్టులలో మల్టీ జోన్-I కు 1 OC (మహిళ), మల్టీ జోన్-II కు 1 OC (మహిళ) సమాంతర రిజర్వేషన్ కింద ఖరారు చేయబడ్డాయి.*

*5.100 రోస్టర్ పాయింట్ల రిజర్వేషన్ల శాతం (G.O. Ms 77):*
*OC: 40%*
*EWS: 10%*
*BC-A: 7%*
*BC-B: 10%*
*BC-C: 1%*
*BC-D: 7%*
*BC-E: 4%*
*SC: మొత్తం 15%*

*1st Cycle: గ్రూప్ I – 1%, గ్రూప్ II – 6%, గ్రూప్ III – 8%*
*2nd Cycle: గ్రూప్ I – 1%, గ్రూప్ II – 7%, గ్రూప్ III – 7%*

*ST: 6%*
*MBBS ప్రవేశాల గడువు పొడిగించాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి*

▪️అక్టోబర్‌ 23తో ముగిసిన స్టేట్‌ రౌండ్‌ కౌన్సిలింగ్‌.
▪️రేపటితో ముగియనున్న MBBS, BDS ప్రవేశాల గడువు.
▪️ఏపీలో భర్తీ కాని 112 NRI కోటా సీట్లు. మరో 15 రోజులు గడువు పొడిగించాలని ఎన్టీఆర్‌ వర్సిటీ లేఖ.
▪️నీట్‌ యూజీ అర్హత శాతం తగ్గించాలని విజ్ఞప్తి.
▪️ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిని పరిశీలిస్తామన్న నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌.