VOLUNTEER 🤝 CONNECTION
37.1K subscribers
3.41K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
> వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం. గంటకు 13 కి.మీ వేగంతో పశ్చిమ దిశగా పయనం. కళింగపట్నానికి 30 కి.మీ, విశాఖకు 90 కి.మీ, గోపాల్‌పూర్‌కు 160 కి.మీ దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతం. ఇవాళ రాత్రి 11-12 గంటల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే ఛాన్స్.
⚠️ తీవ్ర వర్ష హెచ్చరిక

వచ్చే 2 గంటల పాటు విశాఖపట్నం నగరం మొత్తం ఎడతెరిపిలేకుండా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ⚠️ అప్రమత్తంగా ఉండండి.

శ్రీకాకుళం వద్ద తుఫాను తీరం దాటే ముందు భారీ వర్ష మేఘాలు విశాఖ వైపు దూసుకొస్తున్నాయి. 🌧️
అన్ని ప్రధానోపాధ్యాయులు (HMలు) మరియు ఉపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా,
ప్రస్తుతం నెలకొన్న తుఫాను పరిస్థితుల దృష్ట్యా, విజయనగరం జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ గారు 24.09.2026 (గురువారం) తేదీని అన్ని యాజమాన్య పాఠశాలలకు పరిహార సెలవు (Compensation Holiday)గా ప్రకటించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు.
కావున, అన్ని ఉపాధ్యాయులు ఈ విషయాన్ని విద్యార్థులందరికీ తెలియజేయవలసిందిగా కోరడమైనది.
— జిల్లా విద్యాశాఖాధికారి (DEO), విజయనగరం
🚨 విశాఖపట్నంకు ఈ రాత్రి తీవ్ర వర్ష హెచ్చరిక ⚠️

సైక్లోన్ 01B శ్రీకాకుళం–కళింగపట్నం సమీపంలో తీరం దాటుతున్న నేపథ్యంలో, భారీ వర్షపు మేఘాలు విశాఖ వైపు దూసుకొచ్చే అవకాశం ఉంది. దీంతో ఉదయం వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో వరద పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది ⚠️

రాబోయే 10–12 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో 200 మి.మీ. లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ❗️

🚨 విశాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండండి. సురక్షితంగా ఉండండి!
🌧️ భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు
భారీ వర్షాలు మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా *పశ్చిమ గోదావరి జిల్లాలోని* పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించారు.

అలాగే సెప్టెంబర్ 24, 2026న
* విశాఖపట్నం
* అనకాపల్లి
* అల్లూరి సీతారామరాజు (ASR)
* తూర్పు గోదావరి
* విజయనగరం
జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. 🌧️⛈️

విద్యార్థులు మరియు తల్లిదండ్రులు సంబంధిత పాఠశాలల తాజా సూచనలను గమనించగలరు.
*ఏపీలో 7 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్‌ అలర్ట్*
అనకాపల్లి, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, అల్లూరి..
పార్వతీపురం మన్యం, కాకినాడ జిల్లాలకు ఫ్లడ్ అలర్ట్
ఉ.11:30లోగా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం - ఐఎండీ
Cyclone is over ✅
మరో 5 రోజుల్లో నైరుతి రుతుపవన (Monsoon) కాలం ముగియనుంది. అక్టోబర్ 1 నుండి అధికారికంగా ఈశాన్య రుతుపవన / Post-Monsoon కాలం ప్రారంభమవుతుంది.
🌪️ అదే సమయంలో Cyclone Season కూడా ప్రారంభమయ్యే కాలం కావడంతో, వాతావరణ మార్పులు మరియు తుఫానులపై అప్రమత్తంగా ఉండాలి.
> ఏపీలో 807 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,650 ఏ4 మద్యం షాపుల రెన్యువల్‌కు నోటిఫై. నిన్న అర్ధరాత్రితో ముగిసిన మద్యం షాపుల రెన్యువల్ గడువు. రాష్ట్రవ్యాప్తంగా 3,236 మద్యం షాపులు తిరిగి రెన్యువల్ చేసుకున్న యజమానులు. రెన్యువల్‌కు ముందుకు రాని 414 మద్యం షాపులు. గతంలో మిగిలిన షాప్స్‌ను కలుపుకుని 807 దుకాణాలకు ఎక్సైజ్‌శాఖ నోటిఫికేషన్. అక్టోబర్ 1 అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ, అక్టోబర్ 3న పరిశీలన. లాటరీ ద్వారా మద్యం షాపులు కేటాయించనున్న ఏపీ ఎక్సైజ్ శాఖ.
*🏫 నేడు స్కూళ్లకు సెలవు!*

🌧️ భారీ వర్షాలు & తీవ్ర వాయుగుండం కారణంగా APలో పలు జిల్లాల్లో స్కూళ్లకు Holiday!

📍 తూ.గో | ప.గో | కోనసీమ | అల్లూరి | పోలవరం
📍 ఏలూరు | వైజాగ్ | ఎన్టీఆర్ | అనకాపల్లి | కృష్ణా
🌧️ *AP స్వర్ణ గ్రామం, వార్డు సిబ్బందికి అత్యవసర ఆదేశాలు*

తీవ్ర వాయుగుండం, భారీ వర్షాల నేపథ్యంలో స్వర్ణ గ్రామం & స్వర్ణ వార్డు శాఖ డైరెక్టరేట్ నుంచి కీలక సర్క్యులర్ జారీ అయ్యింది.

📌 *ముఖ్య వివరాలు:*
• *హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలి:* జిల్లా SGSW అధికారులు, MSGOs, USWOs మరియు ఉద్యోగులందరూ తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు హెడ్‌క్వార్టర్స్‌లోనే అందుబాటులో ఉండాలి.
• *అనుమతి తప్పనిసరి:* ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కేంద్రాన్ని విడిచి వెళ్లరాదు.
• *పారిశుద్ధ్యం & తాగునీరు:* అపరిశుభ్రత పెరిగి సీజనల్ వ్యాధులు రాకుండా తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
• అందుబాటులో లేని ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ.
📢 *AP ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ వేళల్లో మార్పు!*

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం *అక్టోబర్ 1, 2026*న పంపిణీ చేయాల్సిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ సమయాన్ని సవరిస్తూ SERP అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

🔹 *ముఖ్య సమాచారం:*
• *సవరించిన సమయం:* అక్టోబర్ 1వ తేదీ *మధ్యాహ్నం 12:00 గంటల నుండి* మాత్రమే పంపిణీ ప్రారంభమవుతుంది.
• *కారణం:* UFBU ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28 నుండి 30 వరకు బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె జరగనుంది.
• *నగదు ఉపసంహరణ:* బ్యాంకులు తెరిచిన వెంటనే అక్టోబర్ 1 ఉదయం వేళల్లో సిబ్బంది నగదు డ్రా చేసుకుని, మధ్యాహ్నం నుంచి లబ్ధిదారులకు అందజేస్తారు.

లబ్ధిదారులు ఉదయమే వెళ్లి ఇబ్బంది పడకుండా ఈ సమాచారాన్ని గమనించగలరు.
⚖️ *తండ్రి ఆస్తిలో వివాహిత కూతురి హక్కులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు!*

హిందూ వారసత్వ చట్టం ప్రకారం తండ్రి ఆస్తిలో కూతుళ్లకు గల చట్టపరమైన హక్కులపై స్పష్టమైన వివరాలు:

🔹 *పూర్వీకుల ఆస్తి (Ancestral Property):*
• కుమారుడితో సమానంగా కుమార్తెకు కూడా పుట్టుకతోనే సమాన వాటా (Coparcener) లభిస్తుంది.
• కూతురికి వివాహం అయినా కాకపోయినా ఈ హక్కు వర్తిస్తుంది.
• సెప్టెంబర్ 9, 2005 నాటికి తండ్రి జీవించి ఉన్నా లేకపోయినా వాటా క్లెయిమ్ చేసుకోవచ్చు.

🔹 *స్వార్జిత ఆస్తి (Self-Acquired Property):*
• తండ్రి వీలునామా (Will) రాయకుండా మరణిస్తే, కొడుకులతో పాటు కూతురికీ సమాన వాటా దక్కుతుంది.
• ఒకవేళ తండ్రి జీవించి ఉన్నప్పుడు తన ఇష్టపూర్వకంగా ఎవరికైనా రాసిస్తే దాన్ని ప్రశ్నించే హక్కు ఉండదు.
🚨 *AP మత్స్యకారులకు కీలక గుడ్‌న్యూస్!*

🌧️ భారీ వర్షాల కారణంగా గత 5 రోజులుగా సముద్రంలోకి వేటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం కీలక సహాయం ప్రకటించింది.

🍚 ఒక్కో కుటుంబానికి 50 కేజీల బియ్యం ఉచితంగా అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

📌 ముఖ్యాంశాలు:
• లబ్ధిదారులు: వేటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార కుటుంబాలు
• ఉచిత బియ్యం: 50 కేజీలు
• ఆదేశాలు: సీఎం చంద్రబాబు
• తేదీ: సెప్టెంబర్ 26, 2026
వాట్సాప్ గ్రూపుల్లో కొందరు ప్రభుత్వ ఉద్యోగులను ప్రేరేపిస్తూ, గెరిల్లా తరహా ఆందోళనలు/ఉద్యమాలకు పాల్పడేలా చేస్తున్నారని సమాచారం ప్రచారం అవుతోంది.

ఇలాంటి చట్టవిరుద్ధమైన లేదా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో ఎవరైనా పాల్గొంటే, వారిపై నిర్దిష్ట కేసులు నమోదు చేయబడతాయి. అరెస్టులు కూడా చేపట్టి, వారికి బెయిల్ రాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు శాఖ హెచ్చరించింది.

పై సందేశం పోలీస్ శాఖ నుండి వచ్చిన హెచ్చరిక.

కాబట్టి అందరూ దయచేసి ఎటువంటి ప్రభుత్వ వ్యతిరేక లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాల్లోనూ పాల్గొనవద్దు. శాంతియుతంగా, చట్టబద్ధమైన మార్గాల్లో మాత్రమే మీ సమస్యలను తెలియజేయండి.

అందరూ ఈ విషయాన్ని గమనించి జాగ్రత్తగా ఉండగలరు. 🙏
ప్రభుత్వం మన డిమాండ్లను సానుకూలంగా పరిగణించి, మన సంక్షేమం కోసం ప్రతి అంశంపై అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా:

1. EA, WAS మరియు Welfare Assistant పోస్టులకు ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు:
ప్రభుత్వం దీనిపై చురుకుగా పనిచేస్తోంది. ప్రక్రియ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. గత సమావేశంలో ఇచ్చిన హామీ ప్రకారం ఒక నెలలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

2. AASకు సంబంధించిన ఉత్తర్వులు:
ఇప్పటికే AASకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.

3. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు టెర్మినల్ బెనిఫిట్స్:
విధి నిర్వహణలో/సేవలో ఉండగా మరణించిన ఉద్యోగులకు మూడు నెలల్లోపు టెర్మినల్ బెనిఫిట్స్ అందించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అలాగే కారుణ్య నియామకాలు (Compassionate Appointments) కూడా కల్పించేందుకు అంగీకారం తెలిపింది.

4. తరచుగా నిర్వహించే సర్వేలు:
గతంలో ఇచ్చిన హామీ ప్రకారం తరచుగా సర్వేలు నిర్వహించడాన్ని ప్రభుత్వం అంగీకరించడం లేదు.

కాబట్టి, ప్రభుత్వం మన డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని ఒక్కొక్క అంశంపై చర్యలు తీసుకుంటున్నందున, మనమంతా సంయమనం పాటించి, ప్రభుత్వంతో సహకరిస్తూ సమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన మార్గంలో ముందుకు సాగుదాం.
ఇంకా ఈ ఫోరమ్‌లో నేను ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను.

1. Notional Increment ప్రతిపాదన:
Notional Increment‌కు సంబంధించిన ప్రతిపాదనను SGSW Department ఇప్పటికే చాలా కాలం క్రితమే ప్రభుత్వానికి పంపించింది. ప్రస్తుతం ఆ ఫైల్ Finance Department పరిశీలనలో ఉంది.

గత సమావేశానికి హాజరైన సభ్యులకు కూడా ఇదే విషయం తెలియజేయబడింది.
*విజయవాడ : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల చలో విజయవాడలో అరెస్టుల పర్వం..!*

*ఇప్పటికే వందమంది అరెస్ట్.. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఇద్దరు యూనియన్ నేతలపై ప్రభుత్వం వేటు.*

*విజయవాడ దర్నా చౌక్ భారీ పోలీసు బందోబస్తు, ఆందోళనకు పోలీసులు అనుమతి నిరాకరణ.*

*ధర్నా చౌక్ కు వచ్చిన ఉద్యోగులను అరెస్టు చేస్తున్న పోలీసులు.*

*విజయవాడ వెళ్లేందుకు అనుమతి లేదని ఇప్పటికే స్పష్టం చేసిన అధికారులు.*

*విజయవాడ వెళ్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఉద్యోగుల గ్రూపులో అధికారులు హెచ్చరిక.*
Media is too big
VIEW IN TELEGRAM
*గౌరవ స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు మినిస్టర్ స్పందన*
*ఇంటి నుంచే LLR పరీక్ష(డ్రైవింగ్ టెస్ట్)*

LLR(లెర్నర్స్ లైసెన్స్ రిజిస్ట్రేషన్) కోసం
ఇకపై ఇంటి నుంచే ఆన్లైన్ పరీక్ష రాయొచ్చు. sarathi.parivahan.gov.in/ డిటైల్స్ ఫిల్ చేయాలి. ఆన్లైన్లో ఫీజు చెల్లిస్తే అప్లికేషన్ జనరేట్ అవుతుంది. తర్వాత కెమెరా ఉన్న డెస్క్టాప్/ల్యాప్టాప్లో పరీక్ష రాయాలి. 20 ప్రశ్నలకు 12 సరైన సమాధానాలిస్తే వెంటనే LLR జారీ అవుతుంది. కంప్యూటర్ లేనివారు గ్రామ, వార్డు సచివాలయాల్లో రాయొచ్చు.