VOLUNTEER 🤝 CONNECTION
37K subscribers
3.41K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
📢 ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ | కొత్త పింఛన్ల దరఖాస్తులు త్వరలో ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా వృద్ధాప్య, వితంతు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు.

🔹 వృద్ధాప్య పింఛన్లు
🔹 వితంతు పింఛన్లు
🔹 విధివిధానాలు ఇప్పటికే సిద్ధం
🔹 త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.

📌 అర్హులైన వారికి దరఖాస్తు చేసే అవకాశం కల్పించనున్నారు.
📢 అధికారిక నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.
📢 ఏపీ ఇంటర్ పరీక్షల హాల్ టిక్కెట్లు విడుదల - AP Intermediate Hall Tickets 2026 Released

The Board of Intermediate Education, Andhra Pradesh (BIEAP) has officially released the AP Inter 1st & 2nd Year Public Exam Hall Tickets 2026.

Students can now download their admit cards online.

https://bie.ap.gov.in/theoryticktespublicviewgftyuibghne
*Today news information*
నేడు ఉదయం 10:30 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ..

2026-27 ఆర్థిక బడ్జెట్ కి ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్..

₹3.48 లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక బడ్జెట్ ఉండే అవకాశం..

ఉదయం 11: 15 గంటలకి అసెంబ్లీలో ఆర్థిక బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న మంత్రి పయ్యావుల కేశవ్..

శాసన మండలిలో ఆర్థిక బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న మంత్రి అనిత.. అనంతరం ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం..

శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న మంత్రి అనగాని సత్యప్రసాద్.!
Declaration of Optional Holiday on 16.02.2026 (Monday) i.e., following Day of Mahashivaratri – Notification – Issued.
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026–27 పూర్తి సమాచారం.


✔️ మొత్తం బడ్జెట్ – ₹3,32,205 కోట్లు
✔️ ఆర్థిక లోటు – ₹75,868 కోట్లు
✔️ రెవెన్యూ లోటు – ₹22,002 కోట్లు
✔️ మూలధన వ్యయం – ₹53,915 కోట్లు
✔️ కేంద్ర పన్నుల వాటా – ₹64,362 కోట్లు
✔️ పన్ను ఆదాయం – ₹1,25,845 కోట్లు
✔️ పన్నుయేతర ఆదాయం – ₹11,473 కోట్లు


✔️ అమరావతి – ₹6,000 కోట్లు
✔️ రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు – ₹13,546 కోట్లు
✔️ విద్యుత్ రంగం – ₹13,934 కోట్లు
✔️ పట్టణాభివృద్ధి – ₹14,539 కోట్లు
✔️ పంచాయతీ రాజ్ – ₹22,941 కోట్లు
✔️ మున్సిపల్ శాఖ – ₹14,538 కోట్లు

🌾 వ్యవసాయం & నీరు
✔️ సాగు నీటి ప్రాజెక్టులు – ₹9,906 కోట్లు
✔️ పోలవరం – ₹6,105 కోట్లు
✔️ జల జీవన్ మిషన్ – ₹4,000 కోట్లు
✔️ అన్నదాత సుఖీభవ – ₹6,600 కోట్లు
✔️ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన – ₹1,927 కోట్లు
✔️ మత్స్యకారులు – ₹260 కోట్లు
✔️ హార్టికల్చర్ క్లస్టర్లు – ₹30,000 కోట్లు

🎓 విద్య & యువత
✔️ పాఠశాల విద్య – ₹32,308 కోట్లు
✔️ సమగ్ర శిక్ష – ₹2,946 కోట్లు
✔️ స్కాలర్‌షిప్‌లు – ₹3,836 కోట్లు
✔️ ఉన్నత విద్య – ₹2,566 కోట్లు
✔️ డొక్క సీతమ్మ భోజనం – ₹2,161 కోట్లు
✔️ మనబడి మన భవిష్యత్ – ₹1,500 కోట్లు
✔️ విద్యార్థి మిత్ర – ₹654 కోట్లు
✔️ పీఎం శ్రీ పాఠశాలలు – ₹707 కోట్లు
✔️ స్కిల్ డెవలప్‌మెంట్ – ₹1,232 కోట్లు
✔️ యూత్ & స్పోర్ట్స్ – ₹438 కోట్లు

👩‍👧 సంక్షేమం & ఆరోగ్యం
✔️ తల్లికి వందనం – ₹9,668 కోట్లు
✔️ మహిళా & శిశు సంక్షేమం – ₹4,581 కోట్లు
✔️ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు – ₹27,719 కోట్లు
✔️ గృహనిర్మాణం – ₹5,451 కోట్లు
✔️ స్త్రీ శక్తి – ₹1,420 కోట్లు
✔️ వైద్య ఆరోగ్య శాఖ – ₹19,306 కోట్లు
✔️ ఎన్టీఆర్ వైద్యసేవ – ₹4,000 కోట్లు

🏭 పరిశ్రమలు & ఉపాధి
✔️ ఎంఎస్‌ఎంఈ – ₹3,161 కోట్లు
✔️ ఐటీ శాఖ – ₹536 కోట్లు
✔️ మౌలిక సదుపాయాలు & పెట్టుబడులు – ₹1,283 కోట్లు
✔️ విశాఖ ఆర్థిక ప్రాంతం – ₹28,000 కోట్లు
✔️ రాయలసీమ హార్టికల్చర్ హబ్ – ₹30,000 కోట్లు

🛡️ ఇతర శాఖలు
✔️ హోం శాఖ – ₹9,165 కోట్లు
✔️ పోలీస్‌కు 3,000 కొత్త వాహనాలు
✔️ కొత్త పోలీస్ అకాడమీ – 94 ఎకరాలు
✔️ పర్యావరణం & అటవీ – ₹714 కోట్లు
✔️ ధరల స్థిరీకరణ నిధి – ₹500 కోట్లు
🚑 PM Rahat Scheme 2026 ప్రారంభం - రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి కేంద్ర ప్రభుత్వం భారీ భరోసా కల్పించింది.

✅ ప్రమాదం జరిగిన రోజు నుంచి 7 రోజుల పాటు
✅ గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు క్యాష్‌లెస్ చికిత్స
✅ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో వర్తింపు
✅ అత్యవసర సమయంలో వెంటనే 📞 112కి కాల్ చేయండి

గోల్డెన్ అవర్‌లో చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఎక్కువ.
*నేడు రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లు మరియు కాలేజీల్లో విద్యార్థులకు ఉచితంగా నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయనున్నారు. 🏫💊*

👦👧 ఎవరికి: 1 నుండి 19 ఏళ్లలోపు పిల్లలందరికీ (సుమారు 1.11 కోట్ల మందికి).

💊 ఏమి ఇస్తారు: 400MG ఆల్బెండజోల్ (Albendazole) మాత్ర ఉచితంగా ఇస్తారు.

⚠️ నులిపురుగుల వల్ల వచ్చే అనర్థాలు:
❌ ఆకలి మందగించడం
❌ కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు
❌ రక్తహీనత & ఎదుగుదల లోపం

✅ ఈ ఆల్బెండజోల్ మాత్రలతో ఈ సమస్యలను పూర్తిగా నివారించవచ్చు అని అధికారులు తెలిపారు. కాబట్టి పిల్లలందరూ తప్పకుండా ఈ మాత్రలు వేసుకునేలా చూద్దాం.
📢 *ఏపీలో మే 1 నుంచి గృహ గణన (Household Census)* 🏠📊

2027 జనాభా లెక్కల సేకరణలో భాగంగా రాష్ట్రంలో గృహ గణన (ఇళ్ల లెక్కలు) చేపట్టడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

*ముఖ్యమైన తేదీలు & వివరాలు:*

🗓️ ఏప్రిల్ 15 - 30 వరకు: ప్రజలు సొంతంగా తమ వివరాలు నమోదు చేసుకోవడానికి (సెల్ఫ్ ఎన్యూమరేషన్) అవకాశం.

🗓️ మే 1 - 30 వరకు: రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు అధికారులచే గృహ గణన.

🔹 దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు ఈ ప్రక్రియ జరగనుండగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మే నెలలో నిర్వహించనున్నారు
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ పరిధిలోని MRO కార్యాలయాల్లో (తహసీల్దార్ ఆఫీసుల్లో) ఉన్న "జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్" పోస్టు పేరును మారుస్తూ నిన్న (16-02-2026) ఉత్తర్వులు జారీ చేసింది.*

ముఖ్యాంశాలు:
🔹 పాత పేరు: Junior Assistant cum Computer Assistant

🔹 కొత్త పేరు: Junior Office Assistant (జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్)

🔹 ఉత్తర్వు సంఖ్య: G.O.Ms.No.11, ఆర్థిక శాఖ (Finance Dept)

ఇకపై MRO ఆఫీసుల్లో ఈ పోస్టును 'జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్' గా పరిగణిస్తారు. గతంలో జారీ చేసిన G.O.Ms.No.8 (2017) కు సవరణ చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
📢 త్వరలో ఏపీ సంక్షేమ హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ

ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో ప్రకటించారు.

🔹 మొత్తం పోస్టులు: 1,433
  • 142 కుక్ & లేబర్ పోస్టులు
  • 1,291 పారిశుద్ధ్య సిబ్బంది పోస్టులు

ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. అధికారిక నోటిఫికేషన్ వెలువడిన వెంటనే పూర్తి వివరాలు అందిస్తాం.
🔔 *ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 1,433 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్! 📢*

ఆంధ్రప్రదేశ్‌లోని సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి సవిత గారు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ హాస్టళ్లలో మెరుగైన వసతుల కోసం ఈ నియామకాలు చేపడుతున్నారు.

✅ ఖాళీల వివరాలు:
🔹 మొత్తం పోస్టులు: 1,433
👨‍🍳 కుక్ & లేబర్: 142 పోస్టులు
🧹 పారిశుద్ధ్య సిబ్బంది: 1,291 పోస్టులు

🌟 ముఖ్యాంశాలు:

చాలా కాలం తర్వాత హాస్టల్ విభాగంలో వస్తున్న నోటిఫికేషన్.

స్థానిక అభ్యర్థులకు మంచి అవకాశం.

త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ మరియు అర్హతల వివరాలు విడుదల కానున్నాయి.
📢 *GSWS ATTENDANCE IMPORTANT UPDATE* 📢

🌙 రంజాన్ మాసం - ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు:

రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు సాయంత్రం 4:00 గంటలకే లాగౌట్ (Logout) అయ్యే వెసులుబాటు కల్పించబడింది.

⚠️ గమనిక:
ఎవరికైనా 4 గంటలకు లాగౌట్ ఆప్షన్ రాకపోతే, మీ HRMS Profile లో 'Religion' తప్పనిసరిగా Muslim అని ఉండాలి. అలా ఉన్నవారికి మాత్రమే ఈ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది.

✅ వెంటనే ఇలా చెక్ చేసుకోండి:

1️⃣ Edit Employee Details ఓపెన్ చేయండి.
2️⃣ HRMS Profile Update లోకి వెళ్ళండి.
3️⃣ Religion: Muslim అని సెలెక్ట్ చేసి అప్‌డేట్ చేయండి.
📢 ఏపీ ప్రజలకు శుభవార్త – వీఎల్‌టీ 50%కి తగ్గింపు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవన నిర్మాణ సమయంలో వసూలు చేసే VLT (Vacant Land Tax) ను 100% నుంచి 50%కి తగ్గించింది. అసెంబ్లీలో సవరణ బిల్లుకు ఆమోదం లభించింది.

🔹 ఇకపై నిర్మాణ అనుమతి తీసుకున్న తేదీ నుంచి పూర్తి చేసే వరకు 50% పన్ను మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.
🔹 కార్పొరేషన్లు : 0.5% ➜ 0.25%
🔹 మున్సిపాలిటీలు : 0.2% ➜ 0.1%

⏳ *కాలపరిమితి* :
✔️ 5 అంతస్తుల వరకు – 3 సంవత్సరాల్లో పూర్తి
✔️ 5 కంటే ఎక్కువ – 6 సంవత్సరాల్లో పూర్తి

💰 ప్రభుత్వం అంచనా ప్రకారం ప్రజలు, బిల్డర్లకు ఏటా రూ.30 కోట్లు వరకు లాభం.

🏗️ నిర్మాణ రంగానికి పెద్ద ఊతం – గృహ కొనుగోలుదారులకు పరోక్ష లాభం!
🗳️ *ఓటర్లకు గుడ్ న్యూస్ – ఇక ఏడాదిలో 4 సార్లు కొత్త ఓటర్ నమోదు అవకాశం!*

📢 ఇప్పటి వరకు సంవత్సరానికి ఒక్కసారి (జనవరి 1) మాత్రమే ఓటర్‌గా నమోదు చేసుకునే అవకాశం ఉండేది.

✅ ఇకపై సంవత్సరానికి 4 సార్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు:
📅 జనవరి 1
📅 ఏప్రిల్ 1
📅 జులై 1
📅 అక్టోబర్ 1

🎯 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటర్‌గా నమోదు చేసుకునే అవకాశం

📌 ఇది ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం – యువతకు పెద్ద అవకాశం

🙏 18 ఏళ్లు నిండిన వారు తప్పకుండా ఓటర్‌గా నమోదు చేసుకోండి

📲 ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీకి వెంటనే Share చేయండి
Dear All,
Mapping Screens enabled.

1) Cluster Mapping
2) Pensioner Mapping
3) Cluster mapped pensioners unmapping
4) Add user Online
5) Add user Offline
Aadhaar Supervisor/Operator - District

Link - https://csc.gov.in/ask
🚨 *PM Kisan Alert – పీఎం కిసాన్ 22వ విడత రావాలంటే ఈ పని తప్పనిసరి!* 🌾

✅ e-KYC పూర్తి చేయాలి
✅ ఆధార్‌తో లింక్ చేసిన బ్యాంక్ ఖాతా ఉండాలి
✅ భూమి వివరాలు అప్‌డేట్ చేయాలి
✅ కొన్ని రాష్ట్రాల్లో కొత్త రైతులకు Farmer ID తప్పనిసరి

📅 *22వ విడత ఎప్పుడు?*

👉 ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారం 2026లో విడుదలయ్యే అవకాశం
Theory Hall Tickets (First & Second Year) IPE FEBRUARY/MARCH 2026 Download

Link - https://bie.ap.gov.in/theoryticktespublicviewgftyuibghne
🚨 ఏపీలో వర్షాల హెచ్చరిక – అల్పపీడనం ప్రభావం! 🌧️

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. త్వరలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

📍 ప్రభావిత జిల్లాలు:
కడప, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య – పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.
ఇతర జిల్లాల్లో – తేలికపాటి వర్షాలు.

⚡ పిడుగుల హెచ్చరిక:
• చెట్ల కింద నిలవవద్దు
• కరెంట్ స్తంభాలకు దూరంగా ఉండాలి
• పాడుబడిన భవనాల వద్ద ఆశ్రయం పొందవద్దు
• రైతులు పొలాల్లో అప్రమత్తంగా ఉండాలి

🌡️ ఇటీవల పెరిగిన ఎండలకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. అయితే జాగ్రత్తలు తప్పనిసరి.
🤰 గర్భిణీ స్త్రీలకు కేంద్రం నుండి ₹11,000 వరకు ఆర్థిక సహాయం!

భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) ద్వారా గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులకు మొత్తం ₹11,000 వరకు లబ్ధి పొందే అవకాశం ఉంది.

💰 మొదటి కాన్పుకు ₹5,000
💰 రెండవ కాన్పు (పాప పుట్టితే) ₹6,000
🏦 డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో (DBT)