VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.45K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
📚 *విద్యా హక్కు చట్టం ప్రవేశాలకు ఫీజుల ఖరారు*

1. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ పాఠశాలల్లో భర్తీ చేస్తున్న 25% సీట్లకు ఫీజులను ఖరారు చేస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. స్టార్ రేటింగ్ ఆధారంగా ఫీజు లను నిర్ణయించారు.

2. ఒక స్టార్ ఉంటే రూ.8,500, రెండు స్టార్లకు రూ.10 వేలు, మూడు స్టార్లకు రూ.11,500, నాలుగు స్టార్లకు రూ.13 వేలు, ఐదు స్టార్లకు రూ.14,500 ఫీజులను నిర్ణయించారు.

3. రాష్ట్రంలో ఏ ప్రైవేట్ పాఠశాలకు ఐదు స్టార్ల రేటింగ్ లేదు. పాఠశాలల్లోని మౌలిక సదుపా యాలు, ఇతరత్ర సౌకర్యాల ఆధారంగా ఈ రేటింగ్ ఇచ్చారు.

4. ఒక్కో విద్యార్థిపై ఆయా పాఠశాలలు చేస్తున్న వ్యయాన్ని ఫీజుల నిర్ణయానికి పరిగణనలోకి తీసుకు న్నారు. ఈ ఫీజుల డబ్బులను ప్రభుత్వమే నేరుగా పాఠ శాల బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తుంది.

5. మొదట 50% ఫీజును సెప్టెంబరు, మిగతా ఫీజును జనవరిలో పాఠశా లకు ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తుంది.
విజయవాడ క్రైమ్..

సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలు నమ్మదు..

కొత్తపేట సీఐ కొండలరావు ప్రజలకు సూచన..

అకాల వర్షం కారణంగా బుడమేరు మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని కొంత మంది వ్యక్తులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, అటువంటి వదంతులు నమ్మవద్దని కొత్తపేట సీఐ ప్రజలను సూచించారు..
శాలరీ బిల్ సబ్మిట్ చేయుటకు చివరి తేదీ జులై 27 వరకు పెంచడం జరిగినది.
Media is too big
VIEW IN TELEGRAM
ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ స్కీమ్..

సూపర్ సిక్స్ హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా ప్రజలకు చేరువ చేస్తోందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఫ్రీ బస్సు స్కీమ్పై Way2Newsతో ఆయన మాట్లాడారు. ఆగస్టు 15న పథకం ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతానికి పల్లె వెలుగు, అల్ట్రా లగ్జరీ బస్సుల్లో దీనిని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఆటో డ్రైవర్ల కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్నామని చెప్పారు. #WomenFreeBusRide
p4_need_assessment_survey_1.apk
85.9 MB
💥 *P4 Need Assessment Survey APK File*
*P4 Need Assessment Survey*

📱 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 👇🏼
https://t.me/VolunteerConnection/17527

🧾 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤 👇🏼
https://swarnandhra.ap.gov.in/p4web/p4/#
🔔 *హౌస్ టాక్స్ ప్యూరిఫికేషన్ - మొబైల్ & ఆధార్ నెంబర్ అప్డేట్ సమాచారం :*

1. హౌస్ టాక్స్ ఆన్లైన్ చెల్లింపులు చేయు సందర్భంలో రసీదు వివరాలు పొందుటకు మరియు వాట్సాప్ ద్వారా హౌస్ టాక్స్ పేమెంట్ చేయుటకు తప్పనిసరిగా ఆధార్ నెంబరు మరియు మొబైల్ నెంబరు రికార్డులో సరిగా ఉండాల్సి ఉంటుంది.

2. హౌస్ టాక్స్ ప్యూరఫికేషన్ చేసే సమయంలో స్వర్ణ పంచాయతీ వెబ్సైట్ నందు ఆధార్ నెంబర్ ఉన్నప్పటికీ మొబైల్ నెంబర్ నమోదు చేయని వారికి ఇప్పుడు అప్డేట్ చేయవచ్చు.

3. దానికి గాను మొబైల్ నెంబర్ పంచాయతీ పరిధిలో పాత రికార్డులో ఉన్నటువంటి డేటా లేదా ఫీల్డ్ ఉద్యోగులు అయినటువంటి ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్లు వెలుగు సిబ్బంది ఫీల్డ్ అసిస్టెంట్ etc.. వారి వద్ద ఉండవచ్చు.

4. సచివాలయ ఉద్యోగుల మొబైల్ యాప్ అయినటువంటి GSWS Employees App నందు HH Geo Location ఆప్షన్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే ఇంట్లో కనీసం ఒకరిదైనా ఈకేవైసి పూర్తయి ఉంటే మొబైల్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఎంటర్ చేసి ఆ ఇంటికి ప్యూరిఫికేషన్ పూర్తి చేయవచ్చు. క్లస్టర్ల వారీగా హౌస్ హోల్డ్ లో ఉన్నటువంటి సభ్యుల ఆధార్ నెంబర్లు కూడా వస్తాయి ఆ డేటా ఇప్పుడు ఉపయోగపడుతుంది.

5. హౌస్ టాక్స్ వెరిఫికేషన్ లో భాగంగా మొబైల్ ఆధార్ నెంబర్ తో పాటుగా యజమాని పేరు యజమాని తండ్రి లేదా భర్త పేరు డిమాండ్ వివరాలు సరిగా అప్డేట్ చేసుకోవచ్చు.
*బ్యాంకు/ ATM కు వెళ్లకుండా మిస్డ్ కాల్ ఇచ్చి బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. దీనికి మొబైల్ నంబర్తో రిజిస్టర్ చేసుకోవాలి.*

1. SBI- 09223766666,
2. ICICI-09594612612,
3. HDFC-18002703333,
4. AXIS -18004195959,
5. UNION- 09223008586,
6. Canara - 09015734734,
7. BOB-8468001111,
8. PNB- 18001802223,
9. IB - 9677633000,
10. BOI-092661351353

‼️ *SHARE IT* ‼️
🗓️ 2025 ఆగస్టు నెలలో సెలవులు

1️⃣ 03.08.2025 - ఆదివారం

2️⃣ 08.08.2025 - వరలక్ష్మీ వ్రతం

3️⃣ 09.08.2025 - రెండవ శనివారం

4️⃣ 10.08.2025 - ఆదివారం

5️⃣ 15.08.2025 - స్వాతంత్ర్య దినోత్సవం

6️⃣ 16.08.2025 - శ్రీకృష్ణాష్టమి

7️⃣ 17.08.2025 - ఆదివారం

8️⃣ 24.08.2025 - ఆదివారం

9️⃣ 27.08.2025 - వినాయక చవితి

🔟 31.08.2025 - ఆదివారం

👉 మొత్తం రోజులు : 31

👉 సెలవు దినాలు : 10

👉 పని దినాలు : 21

Optional Holidays

15.08.2025 : Parsi New Year's day/Arbaeen
కాకినాడ: రాష్ట్ర వ్యాప్తంగా 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించబోతున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని అన్నవరంలో స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు ఉద్ఘాటించారు.
✒️కొత్త రేషన్ కార్డుదారులకు శుభవార్త.. త్వరలో వీరికి ఆరోగ్యశ్రీ!

Jul 27, 2025,

కొత్త రేషన్ కార్డుదారులకు శుభవార్త.. త్వరలో వీరికి ఆరోగ్యశ్రీ!
తెలంగాణ : కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీరికి కూడా ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేసేందుకు కసరత్తు చేస్తోంది. 30 లక్షల మంది లబ్ధిదారుల వివరాలను అధికారులు పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ, రేషన్ కార్డుల అనుసంధాన ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. దీంతో లబ్ధిదారుల సంఖ్య 3.14 కోట్లకు చేరనుంది.£
*ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ*

*రైతుల ఖాతాల్లో రూ.7 వేలు జమ*

* రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం తీపి కబురు తెలిపింది.
* ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ అమౌంట్ జమ చేయనున్నట్లు పేర్కొంది.
* ఆగస్టు రెండవ తేదీన అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తామని అదే రోజున పిఎం కిసాన్ విడుదల కానున్న నేపథ్యంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ రెండు కలిపి రూ.7 వేలు రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు
NTR Bharosa Pensions - Releases - July 2025.xls
6.1 MB
NTR Bharosa Pensions - Releases - July 2025

Dear All, NTR Bharosa Pension amount Rs.2734 cr for the month will be adjusted to all bank branches on 31.07.2025 Morning. Kindly inform to all our staff and Bank Branches to provide cash on 31.07.2025, so as to disburse the pensions on 01.08.2025.
ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఆగస్టు 1న కొత్తగా 1,09,155 మందికి స్పౌజ్ పింఛన్లు అందించనున్నట్లు సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం ఓ ప్రకటనలో తెలి పారు. లబ్ధిదారులకు నెలకు రూ.4 వేల చొప్పున పంపిణీ చేయనున్నామని తెలిపారు.
దేశ వ్యాప్తంగా 654 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు జులై 29తో ముగియనుంది. 5వ క్లాస్ పూర్తైన, ప్రస్తుతం చదువుతున్న వారు దరఖాస్తు చేసేందుకు అర్హులు. APలో 15, TGలో 9 నవోదయ విద్యాలయాల్లో సీట్లు భర్తీ చేయనుండగా, డిసెంబర్ 13న ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. 2026 మార్చిలో ఫలితాలను వెల్లడిస్తారు. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. 👇🏼

https://cbseitms.rcil.gov.in/nvs/
HRM Profile -Updating Details of Functionary (Tranferred in).pdf
807.6 KB
గ్రామ వార్డు సచివాలయాలలో కొత్తగా బదిలీ అయిన వారు బదిలీ అయిన సచివాలయంలో HRMS పోర్టల్ నందు వారి వివరాలు అప్డేట్ చేయుటకు ఉపయోగపడే యూజర్ మాన్యువల్.

HRMS Profile – Updating of Details of Functionary (Transferred in)
‼️ *పంచాయతీ కార్యదర్శులకు గమనిక :*

1. హౌస్ టాక్స్ డేటా ప్యూరిఫికేషన్ లో భాగంగా 2025-26 FY కు సంబందించి కొత్త అసెస్మెంట్ జోడించుట మరియు గత లిస్టులో మిస్సయిన అసెస్మెంట్లను జోడించుటకు కొత్తగా ఆప్షన్ ఇవ్వడం జరిగింది.

2. డేటా ప్యూరిఫికేషన్ లో ఏవైనా అసెస్మెంట్లు తప్పుగా సబ్మిట్ చేసి ఉంటే Unfreeze ఆప్షన్ ఉపయోగించుకొని సరి చేసుకోవచ్చు.

3. ఈ అవకాశం కేవలం జూలై 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందరు కార్యదర్శులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ పంచాయతీ పరిధిలో తప్పుగా అప్డేట్ అయినవి అసెస్మెంట్లు మరియు కొత్తగా జోడించాలనుకునే అసెస్మెంట్లో మిస్సయిన అసెస్మెంట్లో వివరాలను అప్డేట్ చేయగలరు.
తక్షణ చర్య అవసరం – సీనియారిటీ లిస్టులు & సర్వీస్ రిజిస్టర్లు,

మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గారి తాజా సర్క్యులర్ ప్రకారం:

✅ వార్డు కార్యదర్శుల సీనియారిటీ లిస్టులు తయారుచేసి
✅ సర్వీస్ రిజిస్టర్లు అప్డేట్ చేసి
✅ తుది లిస్టు 31 జూలై 2025 లోగా పంపాలి.

⚠️ ఆలస్యం జరిగితే బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.
*ఆంధ్ర ప్రదేశ్ లో MPTC & ZPTC ఎన్నికల నోటిఫికేషన్.*
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఉప ఎన్నికలు – కొన్ని ఖాళీ స్థానాలకే మాత్రమే

అమరావతి:
ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ మరియు సర్పంచ్ స్థానాలు ఖాళీగా ఉండటంతో, ఆయా స్థానాలకు మాత్రమే ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ఇప్పటికే జూలై 28న నోటిఫికేషన్ విడుదలైంది. అయితే, ఇది రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాలకు సంబంధించినది కాదు. కొద్ది మండలాల్లో మాత్రమే ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

ఎన్నికలు జరగనున్న ఖాళీ స్థానాలు ఇవే:

🔹 ఎంపీటీసీ – రామకుప్పం, కారంపూడి, విడవలూరు
🔹 జడ్పీటీసీ – పులివెందుల, ఒంటిమిట్ట
🔹 సర్పంచ్ – కొండపూడి, కడియపులంక

📅 నామినేషన్ల తేదీలు: జూలై 30 – ఆగస్టు 1
🗳️ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు: ఆగస్టు 12
📊 ఫలితాల విడుదల: ఆగస్టు 14
🏡 సర్పంచ్ ఎన్నికలు: ఆగస్టు 10 (ఫలితాలు అదే రోజున)

👉 గమనిక: ఈ ఎన్నికలు ప్రత్యేకంగా కొన్ని ఖాళీగా ఉన్న స్థానాలకు మాత్రమే వర్తిస్తాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ ఉండదు.
*‼️THALLIKI VANDANAM UPDATE*

Raise the Thalliki Vandanam Grievance (Four wheeler,Income tax) who is holding the tag with their aadhar

Note: *Raise the fresh Grievances for the old Thalliki Vandanam Grievance also in the name of tag holding*