VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.45K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
మున్సిపల్ శాఖలో ఔట్సోర్సింగ్ NON-PH (నాన్-ప్రొఫెషనల్) వర్కర్ల వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. *కేటగిరీ-1 వర్కర్ల వేతనం 21,500 నుంచి 24,500, కేటగిరీ -2 వర్కర్ల వేతనం రూ.18,500 నుంచి రూ.21,500కు, కేటగిరీ-3 వర్కర్లకు రూ.15,000 నుంచి రూ.18,500కు పెంచింది.* కాగా తమకు వేతనాలు పెంచాలని వీరు గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు.
Dear All
GSWS staff Rationalization and transfers have completed and lot of changes happened in staff.
Pensioners and GSWS staff mapping screens are enabled in pension portal.
Please inform all Village/Ward Secretariats to complete the mapping.
*SALARY BILL UPDATE INFO*

*జూలై నెల శాలరీ బిల్ సబ్మిట్ చేయుటకు ముందుగా సబ్మిట్ చేయవలసిన ఈ ఆఫీస్ టైల్ తొలగించడం జరిగింది. కావున ప్రస్తుతం బిల్లు సబ్మిట్ చేయడానికి అవుతుంది. జూలై నెల శాలరీ బిల్ సబ్మిట్ చేసుకోవచ్చు*
✅ *జీవో నం. 23 ప్రకారం ఉచిత ఇంటి స్థలాల ముఖ్యమైన పాయింట్లు:*

1. ఉచితంగా ఇంటి స్థలాలు రాష్ట్రంలో అర్హులైన పేదలకు కేటాయిస్తారు.
2. గ్రామీణ ప్రాంతాల్లో గరిష్టంగా *3 సెంట్ల* భూమి ఇవ్వబడుతుంది.
3. పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా *2 సెంట్ల* భూమి కేటాయిస్తారు.
4. లబ్ధిదారుడు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.
5. లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారై ఉండాలి.
6. కుటుంబంలో ఎవరికి అయినా ఇంటి స్థలం లేకపోవాలి.
7. ప్రభుత్వ ఉద్యోగులు/పెన్షనర్లు అర్హులు కారు.
8. ఇప్పటికే భూమి ఉన్నవారికి కేటాయింపు ఉండదు (గ్రామీణ - 5 సెంట్లు, పట్టణం - 2.5 సెంట్లు).
9. చెల్లుబాటు అయ్యే ఆధార్, రేషన్ కార్డు తప్పనిసరి.
10. ఇంటి స్థలం ఇప్పటికే ప్రభుత్వ పథకాల ద్వారా పొందినవారు మళ్లీ అర్హులు కారు.
11. మైనర్ వయస్సులో ఉన్న వారికి స్థలం ఇవ్వబడదు.
12. మున్సిపాలిటీల్లో ప్రభుత్వ భూముల లభ్యత ఉన్నచో మాత్రమే ఇవ్వబడుతుంది.
13. స్థలం లేని చోట APTIDCO లేదా ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిర్మాణాలు చేస్తారు.
14. స్థలానికి లీగల్ ఇబ్బందులు ఉండకూడదు.
15. కుటుంబానికి ఒకరికి మాత్రమే లబ్ధి వర్తిస్తుంది.
16. గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
17. స్థలం కేటాయించిన తర్వాత 2 సంవత్సరాల్లో ఇల్లు నిర్మించాలి.
18. ఇంటి స్థలాన్ని వేరేవారికి అమ్మడం, ఇవ్వడం నిషేధం.
19. స్థలాల లేఅవుట్ సర్వే, అప్రమత్తంగా చేయాలి.
20. ప్రతి లబ్ధిదారునికి స్థలం కేటాయింపు పత్రం (పట్టా) ఇవ్వబడుతుంది.
21. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక జరగాలి.
22. గ్రామ సచివాలయం ద్వారా పరిశీలన నిర్వహించాలి.
23. ఎంపికైన లబ్ధిదారుల జాబితా గ్రామంలో ప్రదర్శించాలి.
24. అభ్యంతరాలుంటే గ్రామ సభలో పరిష్కరించాలి.
25. ఖాళీ భూములు సేకరించడానికి ప్రైవేట్ భూములు కొనుగోలు చేయవచ్చు.
26. కుటుంబ ఆదాయం ₹10,000 (గ్రామీణ), ₹12,000 (పట్టణ) లోపల ఉండాలి.
27. అర్హత కలిగిన మహిళల పేర మీద స్థలం కేటాయింపు ఉంటుంది.
28. స్థలంలో స్వయంగా నివసించాల్సిన నిబంధన ఉంటుంది.
29. ఓపెన్ ప్లాట్లు, అందుబాటులో ఉన్న స్థలాలు మాత్రమే ఇచ్చే వీలు.
30. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత పాటించాలి.
ఈనెల జూలై 2025 శాలరీ బిల్ CFMS పోర్టల్‌లో DDO లాగిన్ ద్వారా సమర్పించేటప్పుడు, క్రింది పత్రాలను తప్పనిసరిగా బిల్లులతో పాటు అప్‌లోడ్ చేయాలి:

📝 *అప్లోడ్ చేయవలసిన పత్రాలు* :

1. ఉద్యోగి యొక్క Transfer Order

2. MPDO ద్వారా ఇచ్చిన Joining Report (New Station)

3. LPC (Last Pay Certificate)

4. Non-Drawal Certificate
→ జూలైలో రిలీవ్ అయిన తేదీకి ముందు వర్క్ చేసిన కాలానికి సంబంధించి

5. ఇంక్రిమెంట్ పొందినవారు మాత్రమే ⬇️
✅ Increment Proceedings కాపీ
✅ Form 49 (Form of Increment Certificate)

📌 *ముఖ్య సూచన:*
ఈ పత్రాలు అప్లోడ్ చేయకపోతే బిల్ ప్రాసెసింగ్‌ నిలిపివేయబడే అవకాశం ఉంది.
*AP EAMCET Counselling 2025 LIVE అప్డేట్స్ – ఫేజ్ 1 సీటు కేటాయింపు ఫలితాలు విడుదల*

1️⃣ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి
👉 eapcet-sche.aptonline.in
2️⃣ "Seat Allotment Result – Phase 1" లింక్‌పై క్లిక్ చేయండి
3️⃣ మీ హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేది ఎంటర్ చేయండి
4️⃣ “Submit” పై క్లిక్ చేయండి
5️⃣ మీ కేటాయించిన కాలేజ్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి
6️⃣ Allotment Letter డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి
విశాఖ: మరో 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం.. చైనా-హాంకాంగ్‌లో బీభత్సం సృష్టించిన విఫా తుఫాన్.. బంగాళాఖాతంలోకి ప్రవేశించిన విఫా తుఫాన్.. రాబోయే 3 రోజుల పాటు ఏపీలో భారీగా వర్షాలు..
💬 *ప్రశ్న : కొత్త సచివాలయాలకు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిన ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డ్ EHS డేటా (DDO) ఎలా అప్డేట్ చేయాలి?*

కొత్త కొత్త సచివాలయాలకు బదిలీ అయిన సచివాలయ ఉద్యోగులకు కూడా హెల్త్ కార్డ్‌లో DDO వివరాలు మార్చే ప్రక్రియ పూర్తిగా అవసరం అవుతుంది.

🔖 *ఎవరికీ ఉపయోగపడుతుంది?*

1. పాత పాఠశాల నుండి కొత్త పాఠశాలకి బదిలీ అయిన టీచర్లు DDO గా పాత MEO ఉండగా, ఇప్పుడు కొత్త MEO గా అప్డేట్ చేయాలి.

2. గ్రామ/వార్డు సచివాలయం ఉద్యోగులు - ఒక మండలం నుండి మరో మండలానికి లేదా గ్రామానికి బదిలీ అయిన తర్వాత, కొత్త శాఖాధికారి వివరాలు (DDO) హెల్త్ కార్డ్‌లో ప్రతిబింబించాలి.

🔖 *ప్రయోజనం ఏమిటి?:*

1. కొత్త శాఖాధికారి (HM / MEO / MPDO / పంచాయతీ కార్యదర్శి మొదలైన వారు) మీ హెల్త్ కార్డ్ అప్లికేషన్‌ను అప్రూవ్ చేయగలగాలి.

2. బెనిఫిషియరీలని (తల్లిదండ్రులు, పిల్లలు, భార్య/భర్త) జోడించాలంటే, కొత్త DDO details తప్పనిసరిగా అవసరం.

3. పాత DDO ఉండటం వలన approval నిలిచిపోతుంది → అందువల్ల కార్డ్ జారీ కాకపోవచ్చు.

🔖 *తుది సూచన:*

1. మీరు పాఠశాల విద్యాశాఖలో అయితే – కొత్త MEO లేదా HM పేరు

2. మీరు పంచాయతీ శాఖలో అయితే – కొత్త MPDO లేదా పంచాయతీ కార్యదర్శి పేరు DDO గా మారేలా అప్డేట్ చేయాలి.

🔖 *DDO వివరాలు మార్చే స్టెప్స్:*

1. హెల్త్ కార్డ్ వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వండి
వెబ్‌సైట్: http://www.ehs.ap.gov.in

2. ఉద్యోగి User ID మరియు Password ఉపయోగించి లాగిన్ అవ్వాలి.

3. "Initiate New / Rejected Beneficiaries" అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

4. “NOTE: Please cross check the DDO details before submission of the form, and the same DDO has to approve the application for adding/removing beneficiaries. If any changes required for DDO, Please click here.”

5. ఇందులోని “click here” అనే లింక్‌పై క్లిక్ చేయండి. కొత్త విండో ఓపెన్ అవుతుంది ఈ విండోలో మీరు క్రింది వివరాలు సవరించుకోవచ్చు:

✓ప్రస్తుత DDO వివరాలు
✓అడ్రస్
✓వివాహ స్థితి
✓జీతానికి సంబంధించిన ఇతర వివరాలు

6. ఆ తర్వాత, మీ కొత్త DDO (ఉదా: కొత్త MEO / MPDO / EO (PR&RD)) మీ అప్లికేషన్‌ను అనుమతించాలి (Approve) ఆ అప్రూవల్ వచ్చిన వెంటనే మీ హెల్త్ కార్డ్ డాష్‌బోర్డులో కొత్త DDO పేరు కనిపిస్తుంది మీ శాఖ / కార్యాలయం వివరాలు అప్డేట్ అవుతాయి. బెనిఫిషియరీల జోడింపు వంటి ఇతర ఫీచర్లు యాక్టివ్ అవుతాయి

🔖 *మీరు అప్లై చేసినా, DDO అప్రూవ్ చేయకపోతే*

1. మీ డేటా మారదు
2. మీరు కొత్తగా బెనిఫిషియరీలు జోడించలేరు
3. Approval లేకపోతే కార్డు ప్రాసెస్ పూర్తవదు
🚌 ఉచిత బస్ పథకానికి సంబంధించి జీరో ఫేర్ టికెట్ జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు..

🔍ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరికీ ZERO FARE TICKETS...త్వరలో విధి విధానాలు.
♨️ *వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రతినెలా 5న ర్యాలీలు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు*

• ప్రభుత్వం ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు *ప్రతినెలా 5వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఆధ్వర్యంలో* రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీల నిర్వహణకు గ్రామ, వార్డు సచివా లయాల శాఖ ఆదేశాలు జారీ చేసింది.

• అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ కార్యక్రమ నిర్వహణకు తగిన చర్యలు చేపట్టాలంటూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు.

• సచివాల యాల ఉద్యోగులు క్రియాశీలకంగా ర్యాలీల్లో పాల్గొనడంతో పాటు వాట్సాప్ గవర్నెన్స్క సంబంధించి ఎక్కువ మంది *'మనమిత్ర'* యాప్ ను వినియోగించేలా ప్రజలను చైత న్యపరచాలని సూచించారు.
*గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఇంటి పన్నుల [ House Tax ] వివరాలలో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని అప్డేట్ చేయుటకు పంచాయతీ కార్యదర్శి వారి స్వర్ణ పంచాయతీ వెబ్సైట్ లాగిన్ నందు డేటా అప్డేట్ చేయుటకు ఆప్షన్ ఇప్పుడు ఓపెన్ అవటం జరిగినది.*

🔗 𝐒𝐢𝐭𝐞 𝐋𝐢𝐧𝐤 : 👇🏼
https://swarnapanchayat.apcfss.in/Login
*ఈ నెల 25 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో సదరం సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వైద్యులు తాజాగా నిర్ధారించిన వైకల్య శాతంతో కూడిన పత్రాలు ఉచితంగా ఇవ్వనున్నారు. అర్హత లేకున్నా దివ్యాంగుల కోటాలో చాలామంది పెన్షన్లు పొందుతుండటంపై ప్రభుత్వం ఇటీవల ఫోకస్ పెట్టి, వైద్య బృందాలతో తనిఖీలు చేసింది. వైకల్యశాతం ప్రస్తుతం ఉన్నదాని కంటే మారిన వారికి కొత్త సర్టిఫికెట్లు జారీ చేయనుంది.*
e ఆఫీస్ ఐడీ అప్డేషన్ తో నిమిత్తం లేకుండా జీతాల బిల్లులు ప్రజెంట్ చేయడానికి వీలుగా నిధి పోర్టల్ సమస్యను తొలగించారు. DDO లు గమనించగలరు.
తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు పంచాయతీ కార్యదర్శులు వారి స్వర్ణ పంచాయతీ వెబ్సైట్ నందు హౌస్ టాక్స్ డేటా ప్యూరిఫికేషన్ ప్రక్రియను ఆపివేయగలరు.
👿 *APK filesతో జాగ్రత్త..!*

తిరుపతి: సైబర్ వలకు చిక్కిన అడ్వకేట్- అడ్వకేట్ అకౌంట్ నుండి 3,50,999/–రూ ఖాళీ చేసిన సైబర్ నేరగాళ్లు- అడ్వకేట్ ఫోన్ నెంబర్ కు APK అప్లికేషన్ పంపిన నేరగాళ్ళు - అప్లికేషన్ ఓపెన్ చేయడంతో 3 అకౌంట్లలోని నగదు 8 అకౌంట్లోకి బదిలీ- మోసపోయానని తెలుసుకున్న అడ్వకేట్- సైబర్ హెల్ప్ డెస్క్ 1930కు కాల్- పేరూరు పంచాయతీ, విద్యానగర్ కాలనీకి చెందిన బాధితుడు- తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
💫 *హౌస్ టాక్స్ అసెస్మెంట్ వివరాలు ప్యూరిఫికేషన్ అప్డేట్ చేయుటకు ఆప్షన్ మరలా తేదీ 23-07-25 సాయంత్రం 7 తరువాత మారలా ఓపెన్ అయినవి.*

🔖 *కింద తెలిపిన వివరాలలో ఏవైనా తప్పుగా ఉంటే వాటిని సరైన వాటితో అప్డేట్ చేయవచ్చు. అన్నీ సరిగా ఉంటే నేరుగా సబ్మిట్ చేయాలి.*

1. ఓనర్ ఇంటిపేరు
2. ఓనర్ పేరు
3. ఓనర్ కేర్ ఆఫ్ ఇంటిపేరు
4. ఓనర్ కేర్ ఆఫ్ పూర్తి పేరు
5. ఓనర్ ఆధార్ నెంబరు
6. ఓనర్ మొబైల్ నెంబర్
7. 2022-23 ఆ.సం. ఇంటి పన్ను ఎరియర్ వివరాలు
8. 2024-25 ఆ.సం. ఇంటి పన్ను కరెంటు వివరాలు

[ ఈనెల చివరిలోపు ప్రతి అసెస్మెంట్ ను సంబంధిత కార్యదర్శులు పునః పరిశీల నుంచి తప్పనిసరిగా సరైన డేటాతో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 1 నుండి కొత్త డిమాండ్ జనరేట్ అవుతాయి కావున గడువులోపే అందరూ హౌస్ టాక్స్ ప్యూరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయగలరు ]
జాయింట్ LPMల కోసం ఆన్‌లైన్ సబ్‌డివిజన్ సేవల అన్ని దరఖాస్తులకు ఇప్పటికే ఉన్న వన్-టైమ్ ఫీజు మినహాయింపును మరో ఆరు నెలల పాటు, 31-12-2025 వరకు పొడిగించాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి
*ఉచిత సిలిండర్ బుకింగ్ సమాచారం :*

1. ఉచిత గ్యాస్ సిలిండర్ [ దీపం -2 పథకంలో ] రెండో విడత సిలిండర్ బుకింగ్ ఈ నెలాఖరుతో ముగిస్తుంది. ముందు బుకింగ్ చేసుకోని అర్హులు త్వరపడి వెంటనే సిలిండర్ బుకింగ్ చేసుకోండి.

2. గ్యాస్ బుకింగ్ చేసిన 48 గంటల్లో రాయితీ నగదు ఖాతాల్లో జమ అవుతుంది .

3. వచ్చేనెల 1వ తేదీ నుంచి మూడో సిలిండర్ రాయితీ వర్తిస్తుంది.
𝐒𝐚𝐥𝐚𝐫𝐲 𝐁𝐢𝐥𝐥 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : ఈ నెల జూలై 2025 శాలరీ బిల్ CFMS పోర్టల్‌లో DDO లాగిన్ ద్వారా సమర్పించేటప్పుడు, క్రింది పత్రాలను తప్పనిసరిగా బిల్లులతో పాటు అప్‌లోడ్ చేయాలి

📝 అప్లోడ్ చేయవలసిన పత్రాలు:

1. ఉద్యోగి యొక్క Transfer Order

2. MPDO ద్వారా ఇచ్చిన Joining Report (New Station)

3. LPC (Last Pay Certificate)

4. Non-Drawal Certificate

5.ఇంక్రిమెంట్ పొందినవారు వారికి
✰ Increment Proceedings కాపీ
✰ Form 49 (Form of Increment Certificate)

𝐍𝐨𝐭𝐞 : ఈ పత్రాలు అప్లోడ్ చేయకపోతే బిల్ ప్రాసెసింగ్‌ నిలిపివేయబడే అవకాశం ఉంది. పైన చెప్పిన వాటితో పాటు రెగ్యులర్గా అప్లోడ్ చేశావు కూడా తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి.
వార్డు వెల్ఫేర్, డెవలప్మెంట్ కార్యదర్శి పోస్టులను అప్ గ్రేడ్ చేయనున్న కేబినెట్. 815 పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకోనున్న మంత్రివర్గం.
🏡 🏠 *మీ ఇంటి పన్ను మీరే మీ మొబైల్ లొ కట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో గ్రామ ప్రజలందరికీ ఇంటి పన్ను పేమెంట్ కు సంబంధించి సొంతంగా కట్టుకునేందుకు ఆప్షన్ ఇదివరకే ఇవ్వటం జరిగింది.*

🔗 *House Tax Online Payment Link :* 👇🏼

https://swarnapanchayat.apcfss.in/LoginHouseTaxPayment