VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
గ్రామా / వార్డు సచివాలయ పరిధిలో ఉన్న అన్ని పెన్షన్లు అందరూ పెన్షన్ పంపిణీ అధికారుల [PDOs] లాగిన్ లో పేమెంట్ కొరకు ఇవ్వటం జరిగినది. అందరూ ఉద్యోగులు విషయాన్ని గమనించి పేమెంట్లను పూర్తి చేయగలరు.
12న జాబ్ క్యాలెండర్ విడుదల
✅ *Salary bills info* : డిసెంబర్ నెల శాలరీ బిల్స్ *Waiting for fund clearance* దశలో ఉన్నవి. కావున ఈరోజు Salaries Credit కావు. రేపు ఈ కుబేర్ కి చేరుకుని, రేపే శాలరీస్ క్రెడిట్ అయ్యే అవకాశం కలదు. #GSWSStaff
🟢 *2025 జనవరి 2న* ≈ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన *ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్"*

▪️ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పోలవరం, ఉద్యోగుల డీఏ, ఐఆర్ పై, అమరావతి పనులపై చర్చించే అవకాశం కలదు. #APCabinet
🟡 *పింఛన్ల పంపిణీలో చేతివాటం*

• వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో మహిళా పోలీసు నిర్వాకం
• కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసిన కమిషనర్ #NTRBharosaPension
Dear All,,

• *Aadhaar cancelled (Aadhaar is not in authenticable status) (996)*
• *Aadhaar suspended(Aadhaar is not in authenticatable status) (997)*
• *Invalid Aadhaar Number(000)*
• *Invalid Aadhaar Number/Virtual ID (998)*
• *Missing biometric data in CIDR for the given Aadhaar Number / Virtual ID (811)*

🟡 While Payment any Pension getting above error it will be enabled directly in RBIS for enrollment .
VOLUNTEER 🤝 CONNECTION
✅ *Salary bills info* : డిసెంబర్ నెల శాలరీ బిల్స్ *Waiting for fund clearance* దశలో ఉన్నవి. కావున ఈరోజు Salaries Credit కావు. రేపు ఈ కుబేర్ కి చేరుకుని, రేపే శాలరీస్ క్రెడిట్ అయ్యే అవకాశం కలదు. #GSWSStaff
డిసెంబర్ నెల శాలరీ బిల్స్ ఈ కుబేర్ కి చేరుకున్నవి ,ఈరోజు అర్ధరాత్రికి లేదా రేపు ఉదయం శాలరీస్ క్రెడిట్ అయ్యే అవకాశం కలదు. #GSWSStaff
Screenshot_2025_0102_053415.png
702 KB
✅ రైతన్నలకు గుడ్ న్యూస్
2025_0102_053537.png
821.1 KB
నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
పలు అంశాలపై జరుగనున్న చర్చ #APCabinet
2025_0102_053905.png
671.7 KB
రాష్ట్రంలో మూడు రోజుల పాటు వాలంటీర్ల నిరసన #SaveAPVolunteers #APVolunteers
💥 *𝘋𝘈, 𝘢𝘳𝘳𝘦𝘢𝘳𝘴 𝘱𝘦𝘯𝘥𝘪𝘯𝘨 𝘱𝘢𝘳𝘵𝘪𝘤𝘶𝘭𝘢𝘳𝘴*
🔴 *ముగిసిన ఏపీ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం* #APCabinet
🔥 *నేటి(02 జనవరి) కేబినెట్ నిర్ణయాలు*

✓ పిఠాపురం ఏరియా డెవలప్‌ మెంట్‌ అథారిటీ లో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

✓ కేబినెట్ ఏపీ ఎంఆర్యూడీఏ చట్టం 2016లో భవనాల లేఅవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ సవరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

✓ పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

✓ తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రి పడకలను 100కి పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

✓ రామాయపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌ ఏర్పాటుపై కేబినెట్ మీటింగ్లో చ‌ర్చించారు.

✓ అలానే చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్‌ బెటాలియన్‌ ఏర్పాటుకు కేటాయించనున్న స్థలంపై క్యాబినెట్‌లో చ‌ర్చ జ‌ర‌గింది.

✓ నంద్యాల, వైఎస్‌ఆర్‌, కర్నూలు జిల్లాల్లో పవన, సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలిపింది.

✓ ఎస్‌ఐపిబి అమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ అమోదం తెల‌పింది. ఈ పెట్టుబడులు వ‌ల‌న 2,63,411 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశముంది.

✓ నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ. 96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు మంత్రి మండలి గ్రీన్ సిగ్న‌ల్. దీని వ‌ల‌న‌ 2,400 మందికి ఉపాధి కలగనుంది.

✓ మొత్తం 9 మిలియన్ మెట్రిక్ టన్నులు సామర్థ్యంతో ఐదు బ్లాకుల్లో రానున్న ఈ ప్రాజెక్టులో టౌన్‌షిప్, లెర్నింగ్ సెంటర్, రిఫైనరీ, పెట్రోకెమికల్స్ యూనిట్స్, క్రూడ్ ఆయిల్ టెర్మినల్, గ్రీన్ హెచ్2, అడ్మినిస్ట్రేషన్ బ్లాకులు నిర్మించ‌నున్నారు.

✓ విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీసీఎస్ రూ. 80 కోట్ల పెట్టుబడుల‌కు అమోదం తెలిపింది. దీంతో 2 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి.

✓ శ్రీ సత్యసాయి జిల్లా, గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ సంస్ధ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్‌ల కోసం ఈ సంస్థ రూ. 1,046 కోట్ల పెట్టుబడిల‌కు క్యాబినెట్ ఓకే చెప్పింది. దీని ద్వారా 2,381 మందికి ఉపాధి కలుగనుంది

✓ అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1,174 కోట్ల పెట్టుబ‌డుల‌కు , ది. రాష్ట్రంలో కొత్తగా ఐదు సంస్థలు క్లీన్ ఎన‌ర్జీలో రూ. 83 వేల కోట్ల పెట్టుబడుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది..

✓ వీటితోపాటు సీఎం చంద్రబాబు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్న రాష్ట్రంలోని నదుల అనుసంధానం గోదావరి టూ బనకచర్ల ప్రాజెక్టుపై క్యాబినెట్‌లో చ‌ర్చించారు #APCabinet
✅ *వచ్చే విద్యా సంవత్సరం నుంచి 'తల్లికి వందనం'?*

AP: ‘తల్లికి వందనం' పథకంపై మంత్రివర్గం చర్చించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ స్కీం అమలు చేయాలని చర్చించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు త్వరలోనే ఖరారు చేయనున్నారు. కాగా ఈ పథకం కింద చదువుకునే ప్రతి విద్యార్థికీ ప్రభుత్వం ఏడాదికి రూ. 15 వేలు అందించనుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ఈ పథకం వర్తిస్తుందని ఎన్డీయే కూటమి మేనిఫెస్టోలో తెలిపింది. #ThallikiVandanam
✅ *ఏపీ డీఎస్సీ*
✅ మత్స్యకారులకు ఏప్రిల్లో రూ.20వేలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. వేట నిలిచిన సమయంలో గత ప్రభుత్వం రూ.10వేలు ఇస్తే తాము రూ.20 వేలు ఇవ్వనున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు.

✅ ఇక రైతులకు పెట్టుబడి సాయం కోసం పీఎం కిసాన్ మొత్తంతో కలిపి 'అన్నదాత సుఖీభవ' సాయం అందిస్తామన్నారు.

✅ వచ్చే విద్యాసంవత్సరం నాటికి మెగా డీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేస్తామని వివరించారు.
🔥 *ఈ నెల 17న మరోసారి క్యాబినెట్ భేటీ*

AP: ఈ నెల 17న మరోసారి రాష్ట్ర క్యాబినెట్ భేటీ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ జరిగిన భేటీలో కొన్ని అంశాలపై అసంపూర్తిగా చర్చించారు. వీటిపైనే ఆ రోజు తుది నిర్ణయం తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. #APCabinet