VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
✅ *హౌస్ మ్యాపింగ్ లో లేని ప్రజల సమాచారం :*

➪ చాలా మంది Missing Citizens ను Single Member Household గా create చేస్తున్నారు. Missing Citizen కు కుటుంబ సభ్యులు వున్నచో, Missing citizen ను మరియు కుటుంబ సభ్యులను కలిపి , ఈ క్రింద తెలిపిన విధంగా ఒకే Household గా mapping చెయ్యాలి.

1. "Citizen Belongs to Same Secretariat" అని remark select చేసుకున్న తరువాత,, are you sure you want to redirect missing citizens details page?  "Ok"  పైన click చేసి, OTP authencation తరువాత మిగిలిన వివరాలతో పాటు *"Do You Want to Add Members? Yes/No"* అనే ప్రశ్న display అవుతుంది.

2. ఆ సిటిజన్ కు సంబందించిన ఇతర కుటుంబ సభ్యులు Already Household mapping కలిగి వున్నా / లేకున్నా "Yes" అని select చేసుకొని, కుటుంబ సభ్యుల ఆధార్ నెంబర్ నమోదు చేసి "search" మీద click చెయ్యాలి.

3. కుటుంబ సభ్యుని ఆధార్ నెంబరు నమోదు చేసి, search మీద click చేసిన తరువాత, కుటుంబ సభ్యులు already household కలిగి వుంటే, household member details display అవుతాయి. అక్కడే missing citizen ను citizen యొక్క Family HH నకు add చెయ్యవచ్చు.

4. కుటుంబ సభ్యుని ఆధార్ నెంబరు నమోదు చేసి, Search మీద click చేసిన తరువాత, కుటుంబ సభ్యులు కూడా household mapping నందు లేనిచో, కుటుంబ సభ్యులందరి ఆధార్ నంబర్లు నమోదు చేసి, relationship, mobile number ఇతర వివరాలు నమోదు చేసి family members ను కూడా add చెయ్యగలరు.

(లేదా)

1. Employee Mobile app నందు "Add Family member" ద్వారా mapping చెయ్యవచ్చు.

2. *🟡 Important Note ::* ఆ సిటిజెన్ కు ఇతర కుటుంబ సభ్యులు లేని సందర్బంలో / ఒంటరిగా జీవనం కొనసాగిస్తున్న సందర్బంలో మాత్రమే *"Do You Want to Add Members?"* అనే ప్రశ్నకు   "NO" అని select చేసుకోవాలి.

3. ఆ సిటిజెన్ కు ఇతర కుటుంబ సభ్యులు వున్నప్పటికీ కూడా కొంతమంది "NO" అని select చేసుకొని submit చేస్తున్నారు. ఈ విధంగా చెయ్యటం వలన,, ఆ missing citizen కు మాత్రమే separate Household create అవుతుంది. గమనించగలరు.

4. ముఖ్యంగా School/Anganwadi records update చేస్తున్న సమయంలో, విద్యార్థి యొక్క తల్లిదండ్రులు already Household mapping కలిగి వుంటారు. కావున School/Anganwadi records mapping చేసే సమయంలో "Do You Want to Add Members?" అనే ప్రశ్నకు "yes" అని select చేసుకొని, తల్లిదండ్రుల ఆధార్ నమోదు చేసి, Parents Household నకే student ని add చెయ్యగలరు.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
‼️ *స్టాఫ్ నోట్ - హౌస్ మాపింగ్ అప్డేట్ :*

➼ సచివాలయ ఉద్యోగుల మొబైల్ యాప్ [ GSWS Mobile app ] నందు 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగిన సిటిజెన్స్ ను Household mapping నకు add చేస్తున్న సమయంలో *"Member not allowed, as Age is more than 15 years" అని గతంలో చూపించేది.* కొత్తగా యాప్లొ ఈ సమస్య క్లియర్ చేయడం జరిగింది.

➼ వయస్సుతో సంబంధం లేకుండా, ఎవరిని అయినా నేరుగా Emloyee mobile app నందు కూడా household mapping నకు add చెయ్యవచ్చు. గమనించగలరు.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🌧️ *రానున్న 24 గంటల్లో కోస్తా జిల్లాల వెంబడి ఆంధ్రప్రదేశ్ & తమిళనాడులోని వర్షాలు పుంజుకోనున్నాయి. అందరూ సిద్ధంగా ఉండండి*
🟡 రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో మంగళవారం నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తారు. ఈనెల 26 నుంచి 28 వరకు మరోసారి అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ ను నమోదు చేస్తారు.

✅ *పూర్తి సమాచారం*👇
https://t.me/VolunteerConnection/15892
✅ *HH SERVICES కి సంబంధించి ప్రస్తుతం DA/WEDPS లాగిన్ లో ఉన్న ఆప్షన్స్.*

*1️⃣HOUSE HOLD CLUSTER MIGRATION::* ఈ ఆప్షన్ ద్వారా వేరే సచివాలయం నుండి వచ్చిన HHs ను ప్రస్తుతం వారు నివసిస్తున్న సచివాలయం వారు మ్యాపింగ్ చేసుకోవచ్చు.

*🟢PROCESS::AP SEVA PORTAL-- DA/WEDPS LOGIN--->OTHER SERVICES -->SERVICES-->HOUSE HOLD CLUSTER MIGRATION.*

*2️⃣MEMBER MIGRATION ON MARRIAGE GROUNDS::*
ఈ ఆప్షన్ ద్వారా వివాహం అయినా BRIDE ను GROOM యొక్క HH లో మైగ్రేట్ చేయవచ్చు.

*🟡PROCESS:- AP SEVA PORTAL-- DA/WEDPS LOGIN-->OTHER SERVICES --->GSWS INTERNAL-->HH MIGRATION ON MARRIAGE GROUNDS -->PS/WS LOGIN-->MPDO/MC LOGIN.*

*3️⃣HOUSE HOLD MERGING*::
ఈ ఆప్షన్ ద్వారా ఒకే కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులు వేరే వేరే HHs గా ఉన్నచో వారిని ఒకే HH గా చేయవచ్చు.

*🟠AP SEVA PORTAL-- DA/WEDPS LOGIN--->OTHER SERVICES --->GSWS INTERNAL-->MERGING OF TWO HOUSE HOLDS-->PS/WS LOGIN.*

*4️⃣CAPTURE DEATH DETAILS::*
ఈ ఆప్షన్ ద్వారా HH లో ఉన్న వారిలో DEATH PERSONs ఉంటే వారిని DEATH CAPTURE చేయచ్చు. (కానీ వారు HH లో నుండి డిలీట్ అవ్వరు)

*🔴OLD GSWS PORTAL-->PS/WS LOGIN--->SERVICES --->CAPTURE DEATH DETAILS.*

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
✅ *పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పెన్షన్ తనిఖీలలో భాగంగా అనర్హులుగా గుర్తించిన పెన్షన్ దారులకు (563) నోటీసులు జారీ చేయుట మరియు నోటీసులు తీసుకోకపోతే / సరైన సమాధానం చెప్పకపోయినా పెన్షన్ దారులను HOLD లో ఉంచుటకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల.* #NTRBharosaPension

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
✅ *APలో ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతోంది ! ZeeNews -17.12.24*
*//NTR Bharosa Pension Scheme//*

*Important Note* :: Pilot secretariat and all other secretariats ineligible proposed for cancellation. List will be enabled by 5 pm today(17.12.24)- All secretariats
*RTC ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు*

APSRTC ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. దూరప్రాంతాలకు వెళ్లే డ్రైవర్లు, కండక్టర్లకు రోజుకు రూ.150 చొప్పున నైటౌట్ అలవెన్సులు ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో ఆర్టీసీ కార్పొరేషన్గా ఉన్నప్పుడు ఈ అలవెన్సులు ఉండగా, వైసీపీ హయాంలో ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఎత్తివేశారు. దాన్ని ఇప్పుడు తిరిగి అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. దీని వల్ల ఉద్యోగులకు నెలకు రూ.5వేల నుంచి రూ.6వేలు అదనంగా అందనున్నాయి.
✅ *ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం :*

9717 పెన్షన్ దారులకు ప్రభుత్వం తరుపున IVRS మోడ్ లొ ఫోన్ చేసి 30.11.2024 & 02.12.2024 నాడు పెన్షన్ పంపిణి లొ అవినీతి జరిగిందా ? అని అడిగితే అందులో 582 పెన్షన్ దారులు జరిగింది అని తెలిపారు. ప్రభుత్వం ఆయా పెన్షన్ పంపిణి అధికారులు నిజంగా అవినీతికి పాలుపడితే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనుంది. #NTRBharosaPension

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
✅ As per the instructions of the collector sir, all are requested to *mark attendance every day* in and out without fail, *December salary was linked with attendance* #StaffInfo #Attendance
🌧️ *వచ్చే 3 రోజుల్లో వైజాగ్, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళంలో భారీ వర్ష సూచన. పాఠశాలలు మరియు కళాశాలలకు తప్పనిసరిగా సెలవులు ఇవ్వాలి*‼️🌧️
పింఛన్ దారులపై పిడుగు.png
765.8 KB
✅ *పింఛన్ దారులపై పిడుగు*
🚨 *పదవ తరగతి పరీక్షల దరఖాస్తులలో మార్పులు, చేర్పులకు 23 వరకు అవకాశం*

పదవ తరగతి పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తులలో ఉన్న తప్పులు, మార్పులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కె.వి. శ్రీనివాసుల రెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆన్లైన్లో వెబ్ అప్లికేషన్లోని ఎడిట్ ఆప్షన్ ద్వారా సరిచేసుకోవచ్చని సూచించారు. విద్యార్ధిపేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, మీడియం తదితర వివరాలను ఎడిట్ ఆప్షన్ ద్వారా సరి చేసుకునే అవకాశం కల్పించినట్లుశ్రీనివాసుల రెడ్డి తెలిపారు.
రైతులకు గమనిక

అందరూ రైతు సోదరులకు తెలియజేయునది ఏమనగా రాబోయే మూడు రోజుల్లో ఏర్పడిన అల్పపీడనము బలపడి భారీ వర్షాలు పడ తాయి అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వారు తెలియజేశారు కావున రైతు సోదరులు వరి పంట కోతలు ఈ నెల 21వ తేదీ తర్వాత చేయవలసినదిగా కోరడమైనది ఒకవేళ ఎవరైనా రైతులు మరి పంట పంటకోసిన యెడల వరి పనులను కుప్పలుగా వేసి వాటిపైన తార్పల్లినులు కప్పి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము

- ఇట్లు ఏపీ వ్యవసాయ శాఖ
*జనవరి 1 నుంచి ఇంటర్ విద్యార్థులకు ఉచిత భోజనం*

ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మధ్యాహ్న భోజనం అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జనవరి 1 నుంచి దీన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. దీని ద్వారా దాదాపు 1.20 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఉచితంగా అందనుంది. రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం లభించే ఛాన్సుంది. కాగా ప్రస్తుతం 45 వేల ప్రభుత్వ స్కూళ్లల్లో మాత్రమే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉంది.
🛑 *పెన్షన్ల తనిఖీకి బ్రేక్*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల తనిఖీకి పనులు నిలుపుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తేదీ 17-12-2024 ఉదయం పెన్షన్ల తనిఖీకి సంబంధించి ఉత్తర్వులు విడుదల చేసిన తర్వాత, అదేరోజు రాత్రి 8.00 కు తనిఖీకు సంబంధించి అన్ని పనులు నిలుపుదల చేయాలని మౌఖిక ఆదేశాల విడుదల అయ్యాయి.

ఈ విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అందరూ పెన్షన్ దారులకు షేర్ చేయండి. #NTRBharosaPension

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🛑 *రెవెన్యూ సదస్సుల్లో ఏం చేస్తారంటే ?*

1. గ్రామ రెవెన్యూ మ్యాప్ను, ప్రభుత్వ, ప్రైవేటు భూముల మ్యాప్లను ప్రకటిస్తారు.

2. సదస్సులకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, అటవీ, దేవదాయ, వక్త్ర శాఖల మండల, గ్రామస్థాయి అధికారులు హాజరవుతారు.

3. భూ కొలతల్లో తేడాలు, సర్వే నెంబర్లలో మార్పులు, వారసుల పేర్ల నమోదు, సరిహద్దు సమస్య, భూవిస్తీర్ణంలో తేడాలు, రీసర్వే జరిగిన గ్రామాల్లో రైతులకు ఇచ్చిన రికార్డుల్లో నమోదైన తప్పులు, భూకబ్జాలు, భూఆక్రమణలు, అసైన్డ్ భూముల పరాధీనం, ల్యాండ్ గ్రాబింగ్, నిషిద్ధభూముల 22(ఏ) జాబితా నుండి భూములు తొలగింపు వంటి తదితరాలపై బాధితుల నుంచి పిటిషన్లు తీసుకుంటారు.

4. ఎస్.ఎల్.ఆర్, అడంగల్, ఆర్ఆర్, 1-బి రిజిస్టర్, 22(ఏ) జాబితాలను అందుబాటులో ఉంచుతారు.

5. వాటిపై ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను స్వీకరిస్తారు. తహసీల్దార్ల నేతృత్వంలో అవసరమైతే భూములను పరిశీలనచేస్తారు.

6. పై పిర్యాదులను ఆన్లైన్లో పొందుపరుస్తారు. వీటిని ఆర్టీజీఎస్ విభాగం పర్యవేక్షిస్తుంటుంది. ఫిర్యాదు ఇచ్చిన ప్రజలకు వెంటనే రశీదు ఇస్తారు.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
✅ *పశుసంవర్ధకశాఖలో త్వరలో పోస్టుల భర్తీ*

ఏపీ రాష్ట్రంలో త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. పశు సంవర్ధక శాఖలో 297 పోస్టులు భర్తీ చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. దీంతో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను APPSC భర్తీ చేయనుంది. అలాగే పశుకిసాన్ క్రెడిట్ కార్డులపై 3% వడ్డీ రాయితీతో రూ.2లక్షల వరకు రుణాలను ఇవ్వాలన్నారు.
🌧️ నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారిన అల్పపీడనం.. రానున్న 24 గంటల్లో తమిళనాడు, ఏపీ తీరం వైపు వెళ్లే అవకాశం.. ఆ తర్వాత 24 గంటల్లో ఏపీ తీరం వెంబడి ఉత్తరదిశగా పయనించే ఛాన్స్.. రానున్న మూడు రోజుల్లో ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన