🌹. చైతన్య విజ్ఞానం spiritual wisdom 📚
224 subscribers
13.7K photos
380 videos
89 files
1.25K links
It's a Broadcasting channel for All kinds of Spiritual related Messages and Subjects. Telugu and English both languages used.
Download Telegram
*🌹 ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమం వద్ద 44 రోజుల పాటు ఘనంగా జరిగే "మాఘ మేళ" 🌹*
*🍀 సంగమ స్నానం..పుణ్యఫలాల సాధనగా విశ్వాసం - కల్పవాసం..కఠిన నియమాలతో ఆత్మశుద్ధి - సాధువుల సమాగమంతో ఆధ్యాత్మిక శోభ 🍀*
*ప్రసాద్ భరద్వాజ*

*ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలో గతేడాది మహా కుంభమేళా జరగ్గా.. ప్రస్తుతం మరో మాఘ మేళా మొదలైంది. మొత్తం 44 రోజుల పాటు సాగే ఈ మాఘ మేళా.. పౌష పూర్ణిమ నుంచి మహాశివరాత్రి వరకు కొనసాగనుంది. ఈ ఉత్సవంలో కోట్లాది మంది భక్తులు సంగమ స్నానాలు ఆచరించనున్నారు. ఈ మాఘ మేళాకు విచ్చేసే భక్తుల కోసం యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత, రవాణా ఏర్పాట్లు చేసింది. కుంభమేళా స్థాయి ఆధ్యాత్మిక అనుభూతిని ప్రశాంతమైన వాతావరణంలో పొందాలనుకునే వారికి ఈ మేళా సరైన వేదిక అని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.*

*పవిత్ర త్రివేణి సంగమం వద్ద మాఘ మేళా 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. జనవరి 3వ తేదీన పౌష పూర్ణిమ పుణ్యస్నానంతో మొదలైన ఈ ఆధ్యాత్మిక ఉత్సవం ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి వరకు మొత్తం 44 రోజుల పాటు కొనసాగనుంది. కుంభమేళాతో పోలిస్తే తక్కువ రద్దీ.. ప్రశాంతమైన వాతావరణంలో భక్తి పారవశ్యాన్ని పొందేవారికి ఇది ఒక చక్కని అవకాశంగా మారనుంది.*

*గంగ, యమున, అంతర్వాహిని అిన సరస్వతీ నదుల కలయిక అయిన త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం ఆచరించడం వల్ల పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. మాఘ మేళా ప్రారంభ తొలి రోజు అయిన పౌష పూర్ణిమ నాడే సుమారు 21.5 లక్షల మంది భక్తులు సంగమ తీరంలో పవిత్ర స్నానాలు ఆచరించారు.*

*ఈ మేళాలో ఆరు ప్రధాన స్నాన దినాలు ఉన్నాయి. మకర సంక్రాంతి (జనవరి 14), మౌని అమావాస్య (జనవరి 18), వసంత పంచమి (జనవరి 23), మాఘీ పూర్ణిమ (ఫిబ్రవరి 1), మహాశివరాత్రి (ఫిబ్రవరి 15).. ఈ రోజుల్లో త్రివేణి సంగమంలో ఎక్కువమంది పుణ్య స్నానాలు ఆచరిస్తారు.*

*🌻 కుంభమేళాకు, మాఘ మేళాకు తేడా ఏమిటి? 🌻*

*ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి అత్యంత భారీ స్థాయిలో జరిగేది కుంభమేళా. అయితే ఈ మాఘ మేళా మాత్రం ప్రతీ సంవత్సరం నిర్వహిస్తారు. కుంభమేళాలో ఉండే సాధువుల సమాగమం, దానధర్మాలు, హారతులు, ఆధ్యాత్మిక చర్చలు అన్నీ మాఘ మేళాలోనూ ఉంటాయి. కానీ కుంభమేళాతో పోల్చితే.. మాఘ మేళాలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉండి.. ప్రశాంతంగా దర్శనం చేసుకునే వీలుంటుంది.*

*త్రివేణి సంగమంలో మాఘ మేళ వైభవంగా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం మాఘ మాసంలో నిర్వహించే ఈ పవిత్ర మేళకు దేశ నలుమూలల నుంచి భక్తులు, సాధువులు, సన్యాసులు తరలివస్తారు. ఫిబ్రవరి మాసంలో వచ్చే మహాశివరాత్రితో ఈ మేళ ముగియనుంది. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే ఈ పవిత్ర ప్రాంతం మాఘ మేళ సందర్భంగా ఆధ్యాత్మిక కాంతితో వెలుగొందుతోంది. నదీతీరాలు భక్తుల జయజయధ్వానాలతో, వేదమంత్రాల నాదంతో మారుమోగుతున్నాయి.*

*మాఘ మేళలో ముఖ్య ఆకర్షణగా నిలిచేది త్రివేణి సంగమంలో చేసే పవిత్ర స్నానం. గంగా, యమునా, అదృశ్యంగా ప్రవహించే సరస్వతి నదుల సంగమంలో స్నానం చేయడం వల్ల పాపాలు నశించి మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా మాఘ మాసంలో చేసే సంగమ స్నానానికి విశేష పుణ్యఫలం ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి వంటి ప్రత్యేక తిథుల్లో లక్షలాది మంది భక్తులు ఒకేసారి నదిలోకి దిగుతూ పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ దృశ్యం భక్తిని, ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా కనిపిస్తోంది.*

*మాఘ మేళలో మరో ప్రత్యేక ఆచారం 'కల్పవాసం'. నెలరోజుల పాటు నదీతీరంలో నివసిస్తూ కఠిన నియమాలు పాటిస్తూ జీవనం సాగించడమే కల్పవాసం. బ్రహ్మచర్యం, నియమిత ఉపవాసాలు, జపతపాలు, దానధర్మాలు వంటి ఆచారాలతో భక్తులు తమ జీవితాన్ని ఆధ్యాత్మికంగా మలుచుకుంటారు. కల్పవాసం ద్వారా ఆత్మశుద్ధి కలిగి, ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించవచ్చని విశ్వసిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తాత్కాలిక ఆశ్రమాలు, గుడారాల్లో నివసిస్తూ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు.*

*మాఘ మేళ సందర్భంగా త్రివేణి సంగమ ప్రాంతం సాధువులు, మహానుభావుల సమాగమంతో ప్రత్యేక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటోంది. వివిధ అఖాడాల నుంచి వచ్చిన సన్యాసులు ధ్యానం, ప్రవచనాలు, యజ్ఞయాగాలతో భక్తులను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నారు. వారి సందేశాలు భక్తుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి. భజనలు, కీర్తనలు, హరికథలతో సంగమ ప్రాంతం నిత్యం పవిత్ర నాదంతో నిండిపోతోంది. మాఘ మేళ మొత్తం కాలంలో త్రివేణి సంగమం భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తోంది. మహాశివరాత్రి నాటికి ఈ మేళ పరాకాష్టకు చేరనుండగా, భక్తులు ఈ పవిత్ర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆధ్యాత్మిక శాంతిని అనుభవిస్తున్నారు.*
🌹🌹🌹🌹🌹
*🌹 24వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 24rd Pasuram - Tiruppavai Bhavartha Gita 🌹*
*🍀 అవతార లీల స్తుతి - మంగళహారతి గీతం. 🍀*
https://youtu.be/W_SVkLAY6Yc
*రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ*
*🍀 24వ పాశురంలో, దుష్ట శిక్షణకు అవతరించిన ఆ శ్రీమన్నారాయణుని లీలలు కొని యాడుతూ శ్రీహరి చరణారవిందాలకు మంగళహారతినిస్తూ పాడుతున్నారు. 🍀*
*తప్పకుండా వీక్షించండి*
*Like, Subscribe and Share*
🌹🌹🌹🌹🌹
#24pasuram, #godhadevi, #vishnu, #krishna, #pushyamasam, #pasuruam, #thiruppavai, #bhakthi, #telugu, #trending, #viral,
*🌹 శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు పంచాహ్నిక దీక్షతో 12వ తేదీ నుంచి ప్రారంభం. 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది, అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవది, దశ భాస్కర క్షేత్రములలో శ్రీశైలం ఆరవది అయిన శ్రీశైల మహా క్షేత్రంలో సంక్రాంతి ఉత్సవాలు జనవరి 12న ఉదయం స్వామివారి యాగశాల ప్రవేశంతో ప్రారంభం కానున్నాయి. 13వ తేదీ నుంచి మల్లన్న స్వామి, భ్రమరాంబ అమ్మవార్లకు వివిధ వాహన సేవలు నిర్వహిస్తారు. భక్తులకు కనువిందు చేసేలా ప్రతిరోజూ ప్రత్యేక అలంకరణలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. మకర సంక్రాంతి పర్వదినమైన 15వ తేదీన స్వామి, అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహిస్తారు. ఈ కళ్యాణ మహోత్సవానికి చెంచు గిరిజన భక్తులకు దేవస్థానం ప్రత్యేక ఆహ్వానం అందించింది. చెంచు సంప్రదాయాలను గౌరవిస్తూ, వారి సమక్షంలో కళ్యాణం జరగడం శ్రీశైల క్షేత్రంలో ప్రత్యేక ఘట్టంగా నిలవనుంది.*

*బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో నిర్వహించే రుద్ర హోమం, చండీ హోమం, మృత్యుంజయ హోమం, గణపతి హోమం, చండీ-రుద్ర పారాయణం వంటి యాగాలు జనవరి 12 నుంచి 18 వరకు నిరంతరంగా జరుగుతాయి. అయితే, ఉత్సవాల కారణంగా ఈ కాలంలో ఉదయాస్తమాన సేవ, ప్రాతఃకాల సేవ, ప్రదోషకాల సేవ, ఏకాంత సేవలు, స్వామి-అమ్మవారి కళ్యాణం, ఇతర ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, 12 నుంచి 18 వరకు రుద్ర, చండి, మృత్యుంజయ, గణపతి హోమాల కోసం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్ నిర్వహణ, అన్నదానం, తాగునీరు, భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.*

*పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ నెల 12న ఉదయం 9.15గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశం, లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు బ్రహ్మోత్సవ సంకల్పాన్ని పఠిస్తారు. చండీశ్వరునికి విశేష పూజలు జరిపిస్తారు.*

*13 నుంచి స్వామి అమ్మవార్లకు వాహన సేవలు నిర్వహిస్తారు. 15న మకర సంక్రాంతి రోజున బ్రహ్మోత్సవ కల్యాణం జరిపిస్తారు. 17న యాగ పూర్ణాహుతి, 18న పుషో్పత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. సంక్రాంతి రోజైన 15న జరిగే బ్రహ్మోత్సవాల్లో కల్యాణానికి చెంచు గిరిజనులను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. ఉత్సవాల సందర్భంగా ఈ నెల 12నుంచి 18వరకు ఆర్జిత, ప్రత్యక్ష పరోక్ష సేవలను నిలుపుదల చేశారు.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 24వ పాశురము - 24rd Pasuram 🌹*
*🌻 తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - Tiruppavai Bhavartha Gita Malika 🌻*
*🍀 అవతార లీల స్తుతి - మంగళహారతి గీతం. 🍀*
https://youtube.com/shorts/7qr9DBkxh7I
*రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ*
*🍀 24వ పాశురంలో, దుష్ట శిక్షణకు అవతరించిన ఆ శ్రీమన్నారాయణుని లీలలు కొని యాడుతూ శ్రీహరి చరణారవిందాలకు మంగళహారతినిస్తూ పాడుతున్నారు. 🍀*
*తప్పకుండా వీక్షించండి*
*Like, Subscribe and Share*
🌹🌹🌹🌹🌹
#24pasuram, #godhadevi, #vishnu, #krishna, #pushyamasam, #pasuruam, #thiruppavai, #bhakthi, #telugu, #trending, #viral,
*🌹 భూమి భ్రమణ దినోత్సవ శుభాకాంక్షలు అందరికి 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
*🌹 తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 13 - పాశురాలు 25 & 26 Tiruppavai Pasuras Bhavartha Gita Series 13 - Pasuras 25 & 26 🌹*
*🍀 25వ పాశురం - అవతార రహస్యం – సేవాస్వీకార గీతం. 26వ పాశురం - వటపత్రశాయి అనుగ్రహ యాచన గీతం. 🍀*
https://youtu.be/eZJ7U-0ZuMw
*రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ*
*🍀 25వ పాశురంలో, శంఖచక్ర గదాధరుడైన ఆ నారాయణునికే తల్లి కావాలనుకున్న దేవకి కోరిక తీర్చి. వ్రేపల్లె చేరి యశోదమ్మ బిడ్డవై నీ ఆటపాటలతో మురిపించావు. అలాగే మా సేవలు స్వీకరించి మా కోరికనూ తీర్చు స్వామీ అంటూ గోదాదేవి పాడుతున్నది. 26వ పాశురంలో, గోపికలు, ఇంద్రనీలమణి వలె మెరిసి పోతున్న ఆ వటపత్రశాయిని తమ వ్రతానికి కావలసిన వస్తువులు అడుగుతూ, మాధవుని నిత్య సన్నిధిని ప్రసాదించమని అర్ధిస్తున్నారు. 🍀*
*తప్పకుండా వీక్షించండి*
*Like, Subscribe and Share*
🌹🌹🌹🌹🌹
#25pasuram, #26pasuram, #godhadevi, #vishnu, #krishna, #pushyamasam, #pasuruam, #thiruppavai, #bhakthi, #telugu, #trending,
*🌹 వంటగది పక్కనే లేదా భాగంగా పూజా మందిరం ఉంటే కలిగే దుష్ప్రభావాలు – వాస్తు సూచనలు 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*వాస్తు శాస్త్రం మన గృహ జీవనానికి మార్గదర్శకంగా పనిచేస్తుంది. ఇంటి నిర్మాణం నుంచీ, ఇంట్లోని ప్రతి గది, ప్రతి వస్తువు ఏ స్థానంలో ఉండాలన్న విషయాల వరకు వాస్తు స్పష్టమైన నియమాలను సూచిస్తుంది. వాటిని పాటించినప్పుడు శుభఫలితాలు లభిస్తాయని, విస్మరించినప్పుడు సమస్యలు ఎదురవుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది.*

*వాస్తు సూత్రాల ప్రకారం ఇంట్లో రెండు రకాల శక్తులు పనిచేస్తుంటాయి — సానుకూల శక్తి, ప్రతికూల శక్తి. ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగితే అది కేవలం ఒక వ్యక్తిపై కాకుండా, మొత్తం కుటుంబ జీవనంపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా అనవసర కలహాలు, అకస్మాత్తు ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి పరిస్థితులు తలెత్తుతాయి. దీనికి భిన్నంగా, సానుకూల శక్తి ప్రబలిన ఇంట్లో ప్రశాంతత, ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత సహజంగా పెరుగుతాయి.*

*అయితే, వంటగదికి దగ్గరగా పూజా మందిరం ఉండకూడదని వాస్తు శాస్త్రం ఎందుకు చెబుతోంది?*

*వాస్తు ప్రకారం పూజా మందిరం మరియు వంటగది రెండూ ఇంట్లో అత్యంత కీలకమైన శక్తి కేంద్రాలు. కానీ వీటి స్వభావం పూర్తిగా భిన్నం. వంటగది నుంచి రజస్, తమస్ గుణాలకు సంబంధించిన శక్తి ప్రవహిస్తుంది. ఇక పూజా మందిరం మాత్రం సాత్వికమైన, శుద్ధమైన, సానుకూల శక్తికి మూలం. ఈ రెండు విభిన్న శక్తులు ఒకదానికొకటి దగ్గరగా ఉన్నప్పుడు పరస్పర సంఘర్షణ ఏర్పడుతుంది. దాంతో ఇంట్లో అనవసరమైన ప్రతికూల శక్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఇదే వాస్తు దోషానికి కారణమవుతుందని శాస్త్రం హెచ్చరిస్తోంది.*

*అందుకే, ఇంట్లో శాంతి, సౌఖ్యం, శుభప్రదమైన వాతావరణం నిలవాలంటే పూజా మందిరాన్ని వంటగదికి సమీపంలో ఏర్పాటు చేయకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.*

*🌿 పూజా మందిరం ఎలా, ఏ దిశలో ఉండాలి? 🌿

*వాస్తు నియమాల ప్రకారం పూజా గది తూర్పు లేదా పడమర దిశలో ఉండటం మంచిది. వీలైతే ఈశాన్య దిశలో ఏర్పాటు చేయడం అత్యంత శ్రేయస్కరం, ఎందుకంటే ఈశాన్య దిశను దైవిక శక్తికి సంబంధించిన దిశగా భావిస్తారు. పూజా మందిరానికి తప్పనిసరిగా గడప ఉండాలి. గంటలు అమర్చిన తలుపు ఉంటే మరింత శుభప్రదంగా పరిగణిస్తారు. నైరుతి లేదా ఆగ్నేయ మూలల్లో పూజా గదిని ఏర్పాటు చేయడం వాస్తు పరంగా అనుకూలం కాదు.*

*ఇలా వాస్తు నియమాలను పాటిస్తే, ఇంట్లో సానుకూల శక్తి పెరిగి, శాంతి, శ్రేయస్సు, శుభఫలితాలు నిలకడగా ఉంటాయని నమ్మకం.*
🌹🌹🌹🌹🌹
*🌹 25వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 25th Pasuram - Tiruppavai Bhavartha Gita 🌹*
*🍀 అవతార రహస్యం – సేవా స్వీకార గీతం. 🍀*
https://youtu.be/c1Wb-QNup6o
*రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ*
*🍀 25వ పాశురంలో, శంఖచక్ర గదాధరుడైన ఆ నారాయణునికే తల్లి కావాలనుకున్న దేవకి కోరిక తీర్చి. వ్రేపల్లె చేరి యశోదమ్మ బిడ్డవై నీ ఆటపాటలతో మురిపించావు. అలాగే మా సేవలు స్వీకరించి మా కోరికనూ తీర్చు స్వామీ అంటూ గోదాదేవి పాడుతున్నది. 🍀*
*తప్పకుండా వీక్షించండి*
*Like, Subscribe and Share*
🌹🌹🌹🌹🌹
#25pasuram, #godhadevi, #vishnu, #krishna, #pushyamasam, #pasuruam, #thiruppavai, #bhakthi, #telugu, #trending, #viralvideo, #viral,
*🌹 25వ పాశురము Short - 25th Pasuram తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక Tiruppavai Bhavartha Gita 🌹*
*🍀 అవతార రహస్యం సేవా స్వీకార గీతం. 🍀*
https://youtube.com/shorts/Iehmdmc9-O0
*రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ*
*తప్పకుండా వీక్షించండి*
*Like, Subscribe and Share*
🌹🌹🌹🌹🌹
#25pasuram, #shorts, #shortvideo, #godhadevi, #vishnu, #krishna, #pushyamasam, #pasuruam, #thiruppavai, #bhakthi, #telugu, #trending, #viralvideo, #viral,