GSWS Helper
92.1K subscribers
5.55K photos
262 videos
3.24K files
6.61K links
Download Telegram
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ను నేడు CM చంద్రబాబు ఆవిష్కరిస్తారు. కాగా 2047 నాటికి నవ్యాంధ్రప్రదేశ్ను నిర్మించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్వన్గా నిలిపి, దేశానికి ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని సర్కార్ సంకల్పించింది.
*రేపటితో ముగుస్తున్న ఆధార్ ఉచిత డాక్యుమెంట్ అప్డేట్. ఆ తర్వాత భారీగా ఫీజు పెరిగే అవకాశం ఉంది. ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అవ్వని వారు ఆన్లైన్లో ఫ్రీగా చేసుకోండి. ఏ డాక్యుమెంట్లు కావాలి ? ఎలా చేసుకోవాలి? అనే పూర్తి విషయాలు కింద లింక్ ఓపెన్ చేసి చూడండి.*

https://youtu.be/5WU6XpeC_OE
https://youtu.be/5WU6XpeC_OE

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper
అటెండెన్స్ రిపోర్ట్ లింక్ లో కేటగిరీ బాక్స్ లో వాలంటీర్లు అటెండెన్స్ ఆప్షన్ రిమూవ్ చేశారు.
Forwarded from Job Maama
Senior Consultant JOB Notification in GSWS.pdf
91.5 KB
Senior Level Consultant in the O/o of the Director, GSWS, Vijayawada Job Notification
ఏ ఫారం, ఏం సూచిస్తుంది, ఎవరు ఫీల్ చేస్తారు ?

#WUA@GSWSHelper
Unanimous Elections Forms
ఏకాభిప్రాయం వచ్చేటప్పుడు ఉపయోగపడే ఫారాలు.

#WUA@GSWSHelper
ఓటర్లలో ఏకాభిప్రాయం వచ్చినప్పుడు:

1. అభ్యర్థి ప్రభుత్వానికి నీటి పన్ను ఎగవేత దారుడుగా ఉండరాదు, ఉంటే అతని యొక్క నామినేషన్ తిరస్కరించబడును.

2. పోలింగ్ అధికారి ఆ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు యొక్క నామినేషన్ ను *"ఫారం -4"* లో
*4.1 లో అభ్యర్థి యొక్క వ్యక్తిగత వివరాలును*
*4.2 లో ప్రతిపాదకుని వివరాలను*
*4.3లో అభ్యర్థి యొక్క సాక్ష్యుల వివరాలను తీసుకోవాలి*
*4.4 లో అభ్యర్ధి యొక్క నామినేషన్ ను పరిశీలించి అంగీకరించబడినది / తిరస్కరించబడినది*
అని ఎన్నికల అధికారికి తెలియపరచాలి (తిరస్కరిస్తే తగిన కారణం రాయాలి).

4. పోలింగ్ ఆధికారి *"ఫారం 5"* లో అభ్యర్థి యొక్క నామినేషన్ సమర్పించినట్లు రశీదును అభ్యర్ధికి ఇవ్వాలి.

5. ఏకాభిప్రాయం ద్వారా ఎంపికైన అభ్యర్థిని ఆ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడుగా ఎన్నికల అధికారి *ఫారం - 9A* లో ఫలితాల ప్రకటన చేయాలి.

6. ఎన్నికల అధికారి [ EO ] *ఫారం - 9 B* లో నీటి వినియోగదారుల సంఘములో ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులుగా ఎన్నికైన అభ్యర్ధుల జాబితాను ఎన్నికల కార్యాలయమలో ప్రదర్శించాలి.

7. చిన్న తరహా నీటి పారుదలకు - నీటి వినియోగదారుల సంఘములో ప్రాదేశిక నియోజకవర్గ [ TC ] సభ్యులు -6 & మధ్య తరహా నీటి పారుదలకు - నీటి వినియోగదారుల సంఘములో ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు -12.

8. ఎన్నికల అధికారి *ఫారం 10* లో చిన్న/ మధ్య తరహా నీటి పారుదలకు నీటి వినియోగదారుల సంఘములో ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు (6 / 12) గా ఎన్నికైన అభ్యర్ధులకు ఎన్నికల ధ్రువ పత్రం అందజేయాలి

#WUA@GSWSHelper

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/GSWShelper
నీటి తీరువా రసీదు మోడల్

#WUA@GSWSHelper
🔔 *నీటి వినియోగదారుల సంఘములో అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షుడు ఎన్నిక విధానము :*

1. ఎన్నికల అధికారి నీటి వినియోగదారుల సంఘములో ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులుగా ఎన్నికైన అభ్యర్ధులలో అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షుడును ఎన్నుకోవాలి.

2. సాగు నీటి వినియోగదారుల సంఘానికి అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షుడును ఎన్నుకోవాలి.

3. చిన్న తరహ నీటి పారుదలకు ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు (T.C. Members) -6 మొదటి 3 T.C . సభ్యులు అప్పర్ రిచ్ & చివరి 3 T.C సభ్యులు లోవర్ రిచ్

4. మధ్య తరహ నీటి పారుదలకు ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు (T.C. Members) - 12 మొదటి 6 T.C . సభ్యులు అప్పర్ రిచ్ & చివరి 6 T.C సభ్యులు లోవర్ రిచ్

5. సాగు నీటి వినియోగదారుల సంఘానికి (WUA) అధ్యక్షుడును అప్పర్ రీచ్ నుండి ఎన్నిక అయితే మరియు ఉపాధ్యక్షుడును లోవర్ రిచ్ నుండి ఎన్నుకోవాలి. లేదా అధ్యక్షుడును లోప్రా రీచ్ నుండి ఎన్నిక అయితే ఉపాధ్యక్షుడును అప్పర్ రిచ్ నుండి ఎన్నుకోవాలి.

6. (WUA) అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షుడును ఎన్నుకోవడానికి ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు (T.C. Members: 6/12) లొ 50% కోరం పాటించాలి.

7. ఎన్నికల అధికారి (WUA) అధ్యక్షుడు ఎన్నిక కొరకు ఎన్నికైన ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు (T.C. Members: 6/12) నుండి నామినేషన్లు అప్పర్ మరియు లోవర్ రీచ్ వారిగా తీసుకోవాలి.

8. WUA అధ్యక్షుడు ఎన్నిక కొరకు ఏకాభిప్రాయం లేకపోతే ఏ T.C. Memberకు ఎక్కువ మంది సపోర్ట్ చేస్తారో వారు అధ్యక్షుడుగా ఎంపిక చేయబడతాడు. ఆ తర్వాత ఎన్నికల అధికారి WUA ఉపాధ్యక్షుడు ఎన్నికను నిర్వహించాలి.

9. ఎన్నికల అధికారి ఎన్నికైన WUA అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షుడు ఫలితాలు ప్రకటించి ఫారం-10 ఎన్నికల దృవపత్రం అందజేయాలి.

10. నిర్ణీత సమయానికి కోరం లేకపోతె ఎన్నికల అధికారి 30 వేచిచూడాలి. అప్పటికి పరిస్తితులు మారకపోతే అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షుడు పోస్టులను casual Vacancies గ ప్రకటించి ఫారం - 9C లో నమోదు చేసి జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాలి.

11. వేదిక వద్ద జరిగే కార్యక్రమాలకు ఏదైనా తీవ్ర అంతరాయం కలిగిన లేదా ఏదైనా అల్లర్లు మొదలైన వాటివల్ల ఆటంకం ఏర్పడితే ఎన్నికల అధికారి ప్రక్రియను నిలిపివేసి, వేదిక వద్ద నున్న వ్యక్తుల గురించి మరియు పరిస్థితుల గురించి జిల్లా ఎన్నికల అధికారికి పూర్తీ నివేదికను అందించాలి.

12. నివేదికను ఆధారముగా జిల్లా ఎన్నికల ఆధికారి ఏదైనా ఉత్తర్వులు ఇచ్చిన పిమ్మట ఎన్నికల అధికారి అసలైన అసాధారణ సర్వసభ్య మండలి సమావేశమునకు ఇచ్చిన విధముగా విస్తృత ప్రచారం చేసి కొత్తగా అసాధారణ సర్వసభ్య మండలి సమావేశమును నిర్వహించడానికి తాజా షెడ్యులు ఇవ్వాలి.

#WUA@GSWSHelper

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/GSWShelper
🎯 *ఎన్నికల ఫలితాల ప్రకటన:*

☛ ఎన్నికల అధికారి అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థిని ఆ ప్రాదేశిక నియోజకవర్గములో సభ్యుడుగా (T.C. Member) గా ఎంపికైనట్లు ప్రకటించి, *"ఫారం -9 A"* లో నమోదు చేయాలి.

☛ ఎన్నికల ఆధికారి నీటి వినియోగదారుల సంఘములో {చిన్న తరహ నీటి పారుదలకు - 6, మధ్య తరహ నీటి పారుదలకు- 12} ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులుగా ఎన్నికైన అభ్యర్ధుల జాబితాను *"ఫారం - 9 B"* లో నమోదు చేసి, ఎన్నికల కార్యాలయమలో ప్రదర్శించాలి.

☛ ఎన్నికల ఫలితాల ద్రువపత్రమనీటి వినియోగదారుల సంఘములో {చిన్న తరహ నీటి పారుదలకు – 6, మధ్య తరహ నీటి పారుదలకు- 12} ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులుగా ఎన్నికైన అభ్యర్ధులకు ధ్రువ పత్రమును ఎన్నికల ఆధికారి *"ఫారం -10"* ద్వారా ప్రతి ఒక్కరికి అదే రోజున జారీ చేయాలి. ఎన్నికైన అభ్యర్ధుల నుండి రిజిస్టర్ లో అక్నలేడ్జుమెంట్ తీసుకోవాలి.

𝐓𝐚𝐠𝐬 : #WUA@GSWSHelper

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/GSWShelper
SSC GD 2024 Final Result OUT. Download Merit List, Cutoff PDF 👇

https://t.me/jobmaama/6559
🔔 *నీటి సంఘాల ఎలక్షన్ - రహస్య ఓటింగ్ విధానం:*

✓ ఈ ఓటింగ్ కేవలం ఏకాభిప్రాయం రానప్పుడు, చేతులు ఎత్తి ఓటు వెయ్యము అన్నప్పుడు నిర్వహిస్తారు. కావలిసినవి ఓటింగ్ బాక్స్, ఓటింగ్ స్లిప్పులు

❀ *ఓటింగ్ స్లిప్పులు తయారీ, పంపిణి & ఓటు వేయుట:*👇🏼

1. పోలింగ్ ఆధికారి ప్రాదేశిక నియోజకవర్గములో ఉన్న వాస్తవమైన ఓటర్లును లెక్కించి వారికీ మాత్రమే ఓటింగ్ స్లిప్పులు సిద్దం చేయాలి.

2. ఓటింగ్ స్లిప్పులు A4 పేపర్ సైజులో 4 వ భాగములో ఉండాలి. అంటే ఒక A4 పేపర్ తో 4 ఓటింగ్ స్లిప్పులు మాత్రమే తయారు చేయాలి.

3. ఓటింగ్ స్లిప్పులో ఒకవైపు: నీటి వినియోగదారుల సంఘం పేరు, ప్రాదేశిక నియోజక వర్గం సంఖ్య, ఓటింగ్ స్లిప్పు యొక్క క్రమ సంఖ్య మరియు పోలింగ్ ఆధికారి యొక్క సంతకం కోసం ఖాళి ఉండాలి.

4. ఓటింగ్ స్లిప్పులో మరొక వైపు: పూర్తీ ఖాళీగా ఉండాలి. ఓటర్లు తమ ఓటింగ్ స్లిప్పులో పూర్తీ ఖాళీగా ఉన్న వైపు *ఫారం-7* లో ఉన్న అభ్యర్ధి యొక్క క్రమసంఖ్యను ఎంపిక చేసుకోవడానికి కేటాయించబడినది.

5. ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థి ఎంపిక చేసుకోవడానికి, క్రమసంఖ్యను గుర్తుపెట్టుకోవడానికి వరుసల వారిగా కుర్చోబెట్టాలి. మహిళలకు ప్రత్యేకమైన వరుసలలో కూర్చోమని చెప్పాలి.

6. పోలింగ్ సహాయకులు ఓటర్లకు ఓటింగ్ స్లిప్పులు వరుసల వారీగా పంపిణి చేయాలి.

7. ఓటర్లు తమ ఎంపిక ప్రకారం ఓటింగ్ స్లిప్పు యొక్క ఖాళివైపు బాల్ పాయింట్ పెన్ తో అభ్యర్ధి యొక్క క్రమ సంఖ్యను గుర్తుపెట్టాలి. గోప్యత కోసం ఓటింగ్ స్లిప్పును ఒకసారి నిలువుగా ఆతర్వాత అడ్డముగా మడిచి పోలింగ్ ఆధికారి టేబులు మీద ఉన్న ఓటింగ్ బాక్స్ లో వేయాలి.

❀ *ఓటింగ్ స్లిప్పులు లెక్కపెట్టుట:* 👇🏼

1. ఓటర్లందరూ తమ ఓటును వేసిన తర్వాత, పోలింగ్ ఆధికారి [ PO ] మరియు పోలింగ్ అసిస్టెంట్ల [ APO ] సహాయంతో అభ్యర్ధుల వారీగా ఓటింగ్ స్లిప్పులు వేరుచేసి, అభ్యర్ధుల వారీగా ఓటింగ్ స్లిప్పులను లెక్కించి, వాటిని రిజిస్టర్ లో మరియు బోర్డు మీద ఏకకాలములో నమోదు చేయాలి.

2. ఓటింగ్ స్లిప్పులను లెక్కింపు పూర్తయిన తర్వాత, ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఫలితాలను పోలింగ్ ఆధికారి *"ఫారం-8"* లో ఎన్నికల అధికారికి సమర్పించాలి.

#WUA@GSWSHelper

⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
WUA Elections - model filled forms (1).pdf
2 MB
నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల ఫిల్ చేసిన ఫారాలు [ Model ]
♻️ *ఏ సమయానికి ? ఎం చేయాలి ?*

💧 *నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు*

WUA Election day - 14/12/2024

☛ *All Filled Forms* --> 👇🏼
*[ https://t.me/GSWSHelper/16042 ]*

☛ *ఉదయం 8:00* --->
T.C. Members (ప్రాదేశిక నియోజక వర్గ సభ్యులు) ఎంపికకు అసాధారణ సర్వసభ్య మండలి సమావేశం ప్రారంభ సమయం.

☛ *ఉదయం 9:00 గంటల వరకు* --->

ఓటర్లను అసాధారణ సర్వసభ్య మండలి సమావేశంకు అనుమతించాలి. ప్రాదేశిక నియోజక వర్గాలు (T.C.) వారీగా ఓటర్లను అనుమతిమ్చినప్పుడు వారి యొక్క గుర్తింపు కార్డుతో {పట్టాదారు పాసు పుస్తకం / గ్రామ రెవెన్యు ఆధికారి జారీచేసిన గుర్తింపు పత్రం / అధికారి ద్వారా జారీచేసిన ఇతర పత్రాలు (అధర్ కార్డు/పాన్ కార్డు/డ్రైవింగ్ లైసెన్స్) వంటివి} వాటితో ఓటర్ల లిస్టులో ఓటరు యొక్క వివరాలు సరియైనవో కాదో నిర్ధారించుకోవాలి. సరియైన ఓటర్లను ప్రాదేశిక నియోజక వర్గాలు (T.C.) వారీగా కూర్చోవాలి.

☛ *ఉదయం 9:00 గంటల నుండి 9:45 వరకు* -->

ఓటర్లలో ఏకాభిప్రాయం ద్వారా ప్రాదేశిక నియోజక వర్గాల సభ్యులను గుర్తించడానికి కృషి చేయాలి. ఏకాభిప్రాయం ద్వారా ప్రాదేశిక నియోజక వర్గాల సభ్యుడు ఎంపిక అయితే ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే ప్రోత్సాహక మంజూరుతో ప్రాదేశిక నియోజకవర్గం ప్రోత్సాహ పడుతుందని తెలియజేయాలి.

‼️ *ఓటర్లలో ఏకాభిప్రాయం వచ్చినప్పుడు చేయాల్సిన పనులు* 👇🏼

☛ *ఉదయం 9:45 గంటల నుండి 1:30 వరకు*

*[ https://t.me/GSWSHelper/16035 ]*

☛ *మధ్యాహ్నం 3:00 గంటల నుండి సాయంత్రం 5:00 వరకు:* --- >
నీటి వినియోగదారుల సంఘములో అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షుడు ఎన్నిక విధానం 👇🏼

*[ https://t.me/GSWSHelper/16037 ]*

☛ *ఏకాభిప్రాయం వచ్చినప్పుడు అవసరమయ్యే ఫారాలు :* 👇🏼

*[ https://t.me/GSWSHelper/16034 ]*


‼️ *ఓటర్లలో ఏకాభిప్రాయం రానప్పుడు చేయాల్సిన పనులు* 👇🏼

☛ *ఉదయం 9:45 గంటల నుండి 10:15 వరకు* -->

1. ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు (T.C. Member) పోస్ట్ కోసం నామినేషన్ తీసుకోవాలి. పోటికి అర్హులైనవారు
1.1. అభ్యర్థులు, వారిని ప్రతిపాదించినవారు, వారి సాక్ష్యులు అ ప్రాదేశిక నియోజకవర్గ ఓటరై ఉండాలి.
1.2. ప్రభుత్వానికి నీటి పన్ను ఎగవేత దారుడుగా ఉండరాదు
1.3. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు, ఏదైనా చట్ట బద్దమైన హోదా కలిగి ఉండకూడదు.
1.4. క్రిమినల్ చట్టాల ప్రకారం దోషియై ఉండకూడదు.

2. ఎన్నికల అధికారి తరపున పోలింగ్ అధికారి ఆ ప్రాదేశిక నియోజకవర్గ అభ్యర్ధులకు నామినేషన్ *ఫారం- 4ను* సరఫరా చేయాలి. అభ్యర్ధులు
4.1.లో వారి యొక్క వ్యక్తిగత వివరాలును,
4.2. లో వారి యొక్క ప్రతిపాదకుని వివరాలను,
4.3. లో వారి యొక్క సాక్ష్యుల వివరాలను, సంతకమును చేసిన డిక్లరేషన్ ను పోలింగ్ అధికారికి సమర్పించవలెను.

☛ *ఉదయం 10:15 గంటల నుండి 10:30 వరకు* -->

1. పోలింగ్ అధికారి ఫారం-4 లో 4.3 లో అభ్యర్ధులు యొక్క డిక్లరేషన్ లో తప్పుడు సమాచారం ఉంటే లేదా అర్హులు కాకపోతే వారి యొక్క నామినేషన్ తిరస్కరించబడును.

2. పోలింగ్ ఆధికారి ఫారం-4 లో 4.4 లో అభ్యర్ధులు యొక్క నామినేషన్ ను (స్కుటిని చేసి) పరిశీలించి అంగీకరించబడినది / తిరస్కరించబడినది అని నామినేషన్ ఎన్నికల అధికారికి తెలియపరచాలి (తిరస్కరిస్తే తగిన కారణం రాయాలి).

3. పోలింగ్ అధికారి *ఫారం-5* లో అభ్యర్థులు యొక్క నామినేషన్ సమర్పించినట్లు రశీదును అభ్యర్ధులుకి ఇవ్వాలి.

4. పోలింగ్ ఆధికారి స్వీకరించిన నామినేషన్ జాబితాను ఫారం 6 లో అభ్యర్ధులు యొక్క పేరులును తెలుగు అక్షరమాలలో రాసి వారి పేర్లను బిగ్గరగా చదవాలి. వారికీ ఒక క్రమ సంఖ్యను కేటాయించాలి. హాజరైన ఓటర్లకు స్పష్టంగా కనిపించడం కోసం పోటీ దారుల పేరులను వారి క్రమ సంఖ్యలతో బోర్డు మీద రాయవలెను.

5. పోలింగ్ అధికారి పోటీచేసి అభ్యర్ధుల తుది జాబితాను *ఫారం 7* లో నమోదు చేసి, అభ్యర్ధులు యొక్క పేర్లను, క్రమ సంఖ్యను బిగ్గరగా ప్రకటించాలి.

☛ *ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు* -->
ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల (T.C. Member) ఎంపిక ప్రక్రియ:

1. "చేతులేట్టుట ద్వారా" లేదా "రహస్య ఓటింగ్ విధానం" అనగా ఓటర్లకు ఓటింగ్ స్లిప్పులు పంపిణి చేయడం వలన ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను (T.C. Member) ఎన్నుకుంటారు.

2. చేతులేట్టుట ద్వారా అనే ప్రక్రియను ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు అభ్యర్ధుల ఎంపికను పాటించడం లేదు.

☛ *రహస్య ఓటింగ్ విధానం* --> 👇🏼

*[ https://t.me/GSWSHelper/16041 ]*

‼️ *ఎన్నికల ఫలితాల ప్రకటన మరియు ఎన్నికల ధ్రువపత్రం జారీ* 👇🏼

*[ https://t.me/GSWSHelper/16038 ]*

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates
GSWS Helper pinned «♻️ *ఏ సమయానికి ? ఎం చేయాలి ?* 💧 *నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు* WUA Election day - 14/12/2024 ☛ *All Filled Forms* --> 👇🏼 *[ https://t.me/GSWSHelper/16042 ]* ☛ *ఉదయం 8:00* ---> T.C. Members (ప్రాదేశిక నియోజక వర్గ సభ్యులు) ఎంపికకు అసాధారణ సర్వసభ్య…»
*ఇలా మీకు Govt నుంచి SMS వస్తే కింద చూపిన వీడియో ఫాలో అయ్యి సొంతంగా మాపింగ్ చేయూకోండి.*


👇🏼👇🏼👇🏼

https://youtu.be/SQy4lYiHWDk
https://youtu.be/SQy4lYiHWDk

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper
*ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఉచితంగా చేసుకునే గడువును జూన్ 14, 2025 వరకు పొడిగించడం జరిగినది. సొంతంగా Online లొ కింద తెలిపిన విధానం లొ దరఖాస్తు చేస్తేనే ఉచితంగా సర్వీస్ వస్తుంది. ఆధార్ సెంటర్లో ఎక్కడ చేసిన సర్వీసు ఫీజు 50/- గా ఉంటుంది.*

https://youtu.be/5WU6XpeC_OE
Forwarded from ABCD Deals 🛍️
🛍 Vega Atom ISI Certified Smooth Matt Finish Open Face Helmet


Deal Price ₹749

Regular price ₹998

🔗 https://amzn.to/4g9aZSC