APTEACHERS
16.1K subscribers
1.81K photos
36 videos
1.02K files
5.67K links
APTEACHERS Website Official Telegram Channel
లేటెస్ట్ విద్యా ఉద్యోగ సమాచార చానెల్
Latest Educational AP Employees, AP Teachers Information
Official Website
http://www.apteachers.in
Download Telegram
💥IMMS App Updated Version 1.5.7

★IMMS App ఈరోజు 1.5.7 లేటెస్ట్ వెర్షన్ కి అప్డేట్ అయ్యింది, గూగుల్ ప్లే స్టోర్ నుండి అప్డేట్ చేసుకోవచ్చు

IMMS APP UPDATE
https://www.apteachers.in/2021/06/imms-app-download-imms-play-store-app.html

👉IMMS APP New version 1.5.7 has been released with below features.
1) Stainless steel tumblers receipt details entry in MEO and HM login.
2) Availability of Kitchen Utensils details entry in HM login.
3) Resolved image capture issue in inspection module
ఆన్లైన్లోనే వైద్య బిల్లులు పంపాలి: విద్యాశాఖ✍️📚

🌻ఈనాడు, అమరావతి: పదవీవిరమణ చేసినఉపాధ్యాయుల వైద్య బిల్లులను ఆన్లైన్లోనే సమ ర్పించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆఫ్లైన్లో పంపిస్తే స్వీకరించబోమని, పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లోనే బిల్లులను అప్లోడ్ చేయాలని సూచించింది.
ఇఎపిసెట్ కు 3.3 లక్షల మంది దరఖాస్తు✍️📚

🌻ప్రజాశక్తి-అమరావతి బ్యూరో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఇఎపిసెట్)కు ఈ ఏడాది దరఖాస్తుల సంఖ్య పెరిగింది. మార్చి 10 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 15తో ముగిసింది. ఈ ఏడాది 3,30,229 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజినీరింగ్ విభాగానికి 2,33,027 మంది, బైపిసి విభాగానికి 97,202 మంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి అదనంగా 30,145 దరఖాస్తులు వచ్చాయి. రూ.500 అపరాధ రుసుంతో ఈ నెల 30 వరకు, రూ.1000తో మే వరకు, రూ.5 వేలతో మే 12 వరకు, రూ.10 వేలతో 14 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అభ్యర్థులకు ఉంది. మే 15 నుంచి 18 వరకు ఎంపిసి విభాగం అభ్యర్థులకు, మే 22, 23 తేదీలలో బైపిసి విభాగం అభ్యర్థులకు పరీక్షలు రెండుపూటలా ఆన్లైన్లో జరగనున్నాయి. మే 5న జరగనున్న ఇసెట్కు 39,170 మంది దరఖాస్తు చేసుకున్నారు.
కాంట్రాక్టు ఉద్యోగులకు మరో ఏడాది అవకాశం✍️📚

♦️ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

🌻ఈనాడు, అమరావతి: వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు వారి పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడి గిస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది లేదా ఆ పోస్టుల్లో శాశ్వత ఉద్యోగులను నియమించే వరకు ఏది ముందు అయితే అంత వరకు వీరి ఒప్పందం పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏయే ప్రభుత్వశాఖల్లో ఎంత మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారో స్పష్టంగా పేర్కొంటూ వారి మాత్రమే పొడిగిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో వెల్ల డించారు. న్యాయవిభాగం, పాఠశాల, ఉన్నత విద్య, టెక్నికల్ విద్య, యువజన సర్వీసులు, టూరిజం, వైద్యం, కుటుంబ ఆరోగ్య సంక్షేమశా ఖలతో పాటు మరో 11 ప్రభుత్వశాఖల్లో పని చేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు 2024 మార్చి 31 వరకు పదవీకాలాన్ని పొడిగించారు.
ప్రభుత్వం తీరు మార్చుకోవాలి✍️📚

♦️ఉద్యోగులపై నిర్లక్ష్యవైఖరి వీడాలి

♦️లేదంటే మరో ఛలో విజయవాడ తప్పదు

♦️ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు

🌻నెల్లూరు (కలెక్టరేట్,),ప్రభన్యూస్:ఉద్యోగ, ఉపాధ్యా య, పెన్షనర్లపై రాష్ట్ర ప్రభుత్వం తనతీరును మార్చుకోవా లని, వారిపై చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని వీడాలని, లేదంటే మరో ఛలో విజయవాడ వంటి కార్యక్రమం చేపట్టక తప్పదని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల న్యాయమైన డిమాండ్ల సాధనకై ఏపీ జేఏసీ అమరావతి నిర్వహిస్తున్న రెండవదశ ఉద్యమంలో పాల్గొనేందుకై సోమవారం. నెల్లూరుకు వచ్చిన ఆయన రెండవదశ ఉద్యమంపై ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లతో మాట్లాడడంతో పాటు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు -పెన్షనర్లు అభద్రతా భావంతో ఉన్నారని.. జీతాలు, ఎన్షన్లు ఎప్పుడి స్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. జీతాలు, పెన్షన్ల సంగతి అలా ఉంటే ఇక డీఏ అరి యర్స్, ఎర్న్డ్ లీవ్ మెడికల్ బిల్లులు అసలు ఇస్తారా... ఇవ్వరా.. అన్న సందేహం నెలకొందన్నారు. అదేమని ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రభుత్వం కించ పరచడం..కేసులు పెట్టడం చేస్తోందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని..50 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని స్వయంగా ముఖ్య మంత్రికి అందజేశామన్న బొప్పరాజు .. అయినా ఎటువంటి ఫలితం కనపడలేదన్నారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోగా ప్రభుత్వం ఉద్యోగులను కించపరుస్తుం డడం.. ప్రశ్నిస్తే కేసులు పెడుతుండడం బాధాకరమన్న ఆయన సీపీఎస్ ఉద్యోగులపై పెట్టిన 1650 కేసులను తక్షణమే ఉపసంహరించు కోవాలన్నారు. ఇక ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు చెల్లింపులు సీఎఫ్ఎంఎస్ విధానంతో ఓ ప్రైవేట్ కంపెనీ ద్వారా జరుగుతున్నాయన్న అయన అప్పటినుండే తమకు కష్టాలు మొదలయ్యాయన్నారు. ఈ నేపధ్యంలో చెల్లింపులు తిరిగి ట్రెజరీ ద్వారానే జరపాలని తాము డిమాండ్ చేస్తున్నామని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదేవిధంగా 11వ పీఆర్సీ తక్షణమే ప్రకటించాలన్న ఆయన ఇటువంటి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏపిజేఏసీ అమరావతి తిరిగి ఉద్యమబాట పటిందన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం రెండవదశ కార్యాచరణ అమలుచేస్తున్నామన్న ఏపిజేఏసీ అమరావతి చైర్మన్ ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. కాగా ఏఐటియుసీ తమ ఉద్యమానికి మద్దతు ప్రకటించి తాము చేస్తున్న ఆందోళనలలో కూడా పాల్గొంటుందోన్న ఆయన సిఐటియు కూడా త్వరలోనే తమకు మద్దతు ప్రకటించనుందన్నారు. న్యాయమైన హక్కుల సాధన కోసం ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టడం సబబుకాదన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు వందశాతం ఉద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ప్రభుత్వతీరులో మార్పు రాకపోవడం విడ్డూరంగా వుందన్నారు. తమకు తెలివిగా కూడా ఉద్యమం చేయడం వచ్చన్న ఆయన ఆ విధంగానే చేసి చూపిస్తామన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగులపై తన నిర్లక్ష్యధోరణిని మార్చుకోవాలన్న ఆయన లేకపోతే మరో ఛలో విజయవాడ వంటి ఉద్యమం తప్పదన్నారు. కాగా ఈ సమావేశంలో ఏపిజేఏసీ జిల్లా చైర్మన్ అల్లంపాటి పెంచలరెడ్డి తదితరులు పాల్గొన్నారు
26 సమస్యలను పరిష్కరించాలి✍️📚

♦️సిఎస్ తో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సమావేశం

🌻ప్రజాశక్తి - అమరావతి బ్యూరో ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో 26 అంశాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు సూర్యనారాయణ, ఆస్కార్రావు తదితరులు సిఎస్ ను కోరారు. సోమవారం సాయంత్రం సిఎస్ జవహర్ రెడ్డితో సమావేశమయ్యారు. డిఎ, రాష్ట్ర ప్రభుత్వ అలవెన్సుల సమస్య పరిష్కరించాలని కోరారు. 2018 నుండి 2019 వరకూ పెన్షనర్లకు ఫించన్లు బకాయిలు చెల్లించాలని కోరారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికీ మార్చి నెలలో జీతాలు ఇవ్వలేదని ఇవ్వాలని కోరారు. క్రమం తప్పకుండా జీతాలివ్వాలన్నారు. 2022 ఆర్పిఎస్ సాధించిన సంపాదిత సెలవు వ్యత్యాసాల బకాయిలు చెల్లించాలని సిఎస్ ను కోరారు. అలాగే జిల్లా హెడ్ క్వార్టర్లలో పనిచేస్తున్న ఉద్యోగుల 16 శాతం హెచ్ఐర్ఎ చెల్లించాలని కోరారు. వేర్వేరు డిపార్టుమెంట్లలోని ఉద్యోగులకు గెజిటెడ్ హోదా ఇవ్వాలని కోరారు. గ్రేడ్-2 విఆర్ ఒల సమస్యలు పరిష్కరించాలని వారు సిఎస్ ను కోరారు. దీనికి స్పందించిన సిఎస్ వీలైనంతత్వరగా సమస్యలుపరిష్కరిస్తాననిహామీనిచ్చారు.
సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్.. నాలుగు నెలల ఆలస్యంగా ఖరారు✍️📚

♦️ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

🌻ఈనాడు, అమరావతి: సచివాలయాల్లో రెండో విడత నియమించిన ఉద్యోగుల ప్రొబేషన్ను నాలుగు నెలలు ఆలస్యంగా ప్రభుత్వం ఖరారు చేసింది. 2022 డిసెంబరు నాటికే ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసి 2023 జనవరి నుంచి కొత్త వేతనాలు అమలు చేయాలి. ఉద్యోగ సంఘాలు అనేకసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశాక ఎట్టకేలకు దాదాపు 4,773 మంది ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు చేస్తూ సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. 2023 మే 1 నుంచి వీరికి కొత్త వేతనాలు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. వీరిలో గ్రేడ్-5 కార్యదర్శులు, వార్డు పరిపాలన కార్య దర్శులకు రూ.23,120 రూ. 74,770 చొప్పున కొత్త వేతనం అమలు చేయను న్నారు. డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీసు, పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్, ఫిషరీస్ అసిస్టెంట్, ఏఎన్ఎం, ఇంజినీరింగ్ అసిస్టెంట్, గ్రేడ్-2 అగ్రికల్చర్ అసిస్టెంట్, సెరీకల్చర్ అసిస్టెంట్, గ్రామ సర్వేయర్, వీఆర్వో, సంక్షేమ సహా యకులు, వార్డు ఎడ్యుకేషన్, డేటా ప్రొసెసింగ్ కార్యదర్శి, ప్రణాళిక-క్రమబద్ధీ కరణ కార్యదర్శి పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శి, సంక్షేమ, అభివృద్ధికి సంబంధించిన కార్యదర్శుల వేతనాలు రూ.22,460 7. ఉండను - న్నాయి. నాలుగు నెలల ఆలస్యంగా ప్రొబేషన్ ఖరారు చేయడంతో ఆర్థికంగా నష్టపోయమని ఉద్యోగుల ఆవేదన చెందుతున్నారు. 2019లో మొదటి నోటి ఫికేషన్ ఎంపికైన ఉద్యోగులకు కూడా 9 నెలల ఆలస్యంగా ప్రొబేషన్ ఖరారు చేయడంతో దాదాపు 1.20 లక్షల మంది ఆర్థిక ప్రయోజనాలు కోల్పో యారు. రెండో విడత ఎంపికైన ఉద్యోగుల ప్రొబేషన్ ప్రభుత్వం ఖరారు చేయడంపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ కె. వెంకట్రామిరెడ్డి, సచివాలయాల ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జాని పాషా, ఏపీ సచివాలయాల ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో సెగలు.. పొగలు✍️📚

♦️46 డిగ్రీలకు చేరిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు

♦️ఉదయం 9గంటలకే 38 డిగ్రీలకు పైగా నమోదు

♦️130 మండలాల్లో వడగాలుల ప్రభావం

♦️నేడు 117 మండలాలకు వడగాలుల హెచ్చరిక

🌻ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. సోమ వారం వివిధ ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు చేరాయి. ఉదయం 7 గంటల నుంచే మొదలవుతున్న సెగలు.. రాత్రికి కూడా తగ్గడం లేదు. ఉష్ణతాపంతో వృద్ధులు, పిల్లలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 గంటలకే 38 డిగ్రీలకు చేరుతున్న ఉష్ణోగ్రతలు.. మధ్యాహ్నం 12 గంట లకు 42 డిగ్రీలు దాటుతున్నాయి. 1 గంట నుంచి 3 గంటల మధ్య నిప్పుల కొలిమిని తలపించే పరిస్థితి నెలకొంది. ప్రకాశం జిల్లాలో సాయంత్రం 4 గంటల సమయంలోనూ 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత ఉంటోంది. మంగళ, బుధవారాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. వడగాలుల తీవ్రత కూడా మరింత పెరగనుంది.

* రాష్ట్రంలో సోమవారం అత్యధికంగా.. పల్నాడు జిల్లా రాజుపాలెంలో 45. 9, ప్రకాశం జిల్లా తర్లుపాడులో 45.8, శ్రీపొట్టిశ్రీరాములు జిల్లా ఉదయగిరిలో 45.7, ఏలూరు జిల్లా దెందులూరులో 45 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి.

* అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, నంద్యాల, ప్రకాశం, ఏలూరు, కృష్ణా జిల్లా ల్లోని 14 మండలాల్లో తీవ్ర వడగాల్పుల ప్రభావం నెలకొంది. ఎన్టీఆర్, విజ యనగరం, వైయస్ఆర్ తదితర జిల్లాల్లోని 116 మండలాల్లో వడగాలులు వీచాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

* మంగళవారం 117 మండలాల్లో వడగాలులు వీస్తాయని, ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని సూచించింది. మన్యం జిల్లా కొమరాడలో వడగాలుల తీవ్రత అధికంగా ఉండొచ్చని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. విజ యనగరం 19, అనకాపల్లి 16, వైఎస్ఆర్ 13, ఎన్టీఆర్ 13, పార్వతీపురం మన్యం 12, కాకినాడ 10, అల్లూరి 7, గుంటూరు 6, శ్రీకాకుళం 5, తూర్పు గోదావరి 4 మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. కృష్ణా, నంద్యాల, పల్నాడు, విశాఖపట్నం, ఏలూరు తదితర జిల్లాల్లోనూ కొన్నిచోట్ల వీటి ప్రభావం ఉంటుందని పేర్కొంది.
సమ్మెటివ్ -2 పరీక్షల సమయాల్లో మార్పు✍️📚

🌻ఈనాడు, అమరావతి: ఎండల తీవ్రత దృష్ట్యా సమ్మెటివ్-2 పరీక్షల సమయాలను మార్పు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 1-8 తరగతులకు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, తొమ్మిదో తరగతికి ఉదయం 8 గంటల నుంచి 11.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
♻️LEARN A WORD A DAY (18/04/2023)

👉LEVEL-1 (Classes 1&2)
DANCE (నృత్యం/నృత్యం చేయుట)
Part of speech: Noun/Verb
/da:ns/
Usage:
1) Many people are dancing.(V)
2) The dance ends at sunset.(N)

👉LEVEL-2(Classes 3,4&5)
WEDDING (వివాహం/పెళ్ళి)
Part of speech:Noun /wedin/
Synonym: Marriage
Usage: Next Sunday I am going to attend a wedding celebration.

👉LEVEL-3 (Classes 6,7&8) WELCOME (స్వాగతం/స్వాగతించుట)
Part of speech:Noun/Verb
/wel.kǝm/
Usage:
1) She welcomed her friends to a party (V)
2) We received a warm welcome from our host.


👉LEVEL-4 (Classes 9&10)
CLASSICAL (శాస్త్రీయమైన)
Part of speech: Adjective
/ 'klæsik|/
Synonym: Traditional
Usage: They like to listen classical music in spare time
♻️Today's News Headlines (18.04.2023)

Today's Special:
World Heritage Day (also known as International Day of Historic Monuments

International News:
● The scientists discovered the method of metastasis in which cancer cells infiltrate other tissues from the bloodstream.
● The launch of "Starship" rocket designed to take humans to the Moon and Mars was canceled
● Google CEO Sundar Pichai has warned that if artificial intelligence is not used properly, there will be harmful consequences.

National News:
● The Government filed a petition in the Supreme Court on legalization of same-gender marriages.
● Indian Railways received a revenue of around Rs 2.40 lakh crore in the financial year 2022-23,
● The number of people who died due to heatstroke reached 13 i

State News:
● The tenure of contract employees working in various government departments extended by one more year.
● Optional holiday on the occasion of Shab-E-Qadr chaged to 19th of this month
● Summative-2 exams timings changed as from 8 am to 11 am due to heat waves
● The probation of 4,773 employees appointed in the second batch in the secretariats from May 1, 2023 have been declared
● The medical bills of retired teachers in the state through online only.
● DCCB (District Central Cooperative Bank) branch will be constituted in every mandal as per the guidelines of the Reserve Bank of India.

Sports News:
● The Asia Champions Trophy hockey tournament will be held for the first time in India from August 3rd to 23rd in Chennai.
● Vedant Madhavan won five gold medals in the freestyle category at the Malaysian Invitational Swimming Championship tournament held in Kuala Lumpur.
● Indian shuttlers Nithishree and Nitish have won gold medals in the Para Badminton tournament being held in Sao Paulo, Brazil.
Forwarded from The Localhub
💥Teleperformance Global Digital Business Services Company Recruitment 2023 for Customer Care Associate Posts - Apply Now
👉 Job Role :Customer Care Associate
👉 Work Location : Hyderabad, India
👉 Job Type : Full Time
👉 Experience : Freshers/ Experienced
👉 Package :2.4 LPA
https://www.thelocalhub.in/2023/04/teleperformance-global-digital-business.html

💥ULEARN EdTech start-up Recruitment 2023 for Business Development Executive Posts
👉 Job Role :Business Development Executive
👉 Job Type : Full Time
👉 Experience : Freshers/ Experienced
👉 Qualification : Degree /PG
👉 Package :Up to 4.5 LPA+ incentives
👉Last Date: 18-04-2023
https://www.thelocalhub.in/2023/04/ulearn-ed-tech-start-up-recruitment.html
Forwarded from The Localhub
♻️SSC CGL 2023 Recruitment Notification PDF Out 7500 Vacancies , Apply Online

🔷️డిగ్రీ అర్హతతో SSC CGL లో 7500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

👉Posts: Group B & C
👉Vacancies: 7500
👉Qualification: Degree
👉Last Date: 3rd May

👉 Complete Recruitment Details, Notification, Online Apply Link👇

https://www.thelocalhub.in/2023/04/ssc-cgl-2023-recruitment-notification.html
♻️Night Watchman in 5338 High Schools from 1.5.2023 Guidelines - Job Chart Released

👉5338 ఉన్నత పాఠశాలలో Night Watchman నియమించుటకు ఆదేశాలు విడుదల
👉 జీతం నెలకు 6000.
👉 విధులలో చేరవలసిన తేదీ : 01-05-2023
👉 IMMS యాప్‌లో హాజరు నమోదు చేయాలి.
👉 సాయంత్రం పాఠశాల విడిచిన సమయం నుండి తిరిగి పాఠశాల ఉదయం ప్రారంభాయ్యే వరకు

పూర్తి వివరాలు, కాపీ కింద వెబ్ పేజీ లో కలవు
https://www.apteachers.in/2023/04/ap-high-schools-night-watchman-from-1st.html
కామ్రేడ్స్!
మునిసిపల్ టీచర్స్ పొజిషన్ ఐడిల మ్యాపింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇప్పటికే 3000 మంది వివరాలు డిస్ప్లే అయినట్లు, మిగిలిన 1500 మంది పని ఈ రోజు పూర్తి చేస్తామని చెప్పారు. CFMS చేయవలసిన పని కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నానికి స్కూల్ ఎడ్యుకేషన్ నుండి మొత్తం CFMS కు పంపిస్తారు. ఈ రోజు సాయంత్రానికి అందరి వివరాలు డిస్ప్లే అవుతాయి. కాబట్టి డీడీఓలు అందరూ సంబంధిత STO లను కలిసి డీడీఓ లాగిన్ సెట్ చేయించుకుని కేడర్ స్త్రెంత్ కన్ఫర్మ్ చేయాలి. ఆ తర్వాత టీచర్స్ పొజిషన్ ఐడి లను అడ్మిట్ చేసుకోవాలి.
- *UTF AP*
(1) సర్ప్లస్ గా ఉండి, వర్క్ అడ్జస్ట్ మెంట్ కు గురైన టీచర్స్ ను పాఠశాల చివరి దినం రోజున డెప్యూటేషన్ నుండి రిలీవ్ చేస్తారు. ఆ మేరకు 1,2 రోజుల్లో పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది.


(2) ప్రమోషన్స్ కేసు హియరింగ్ ఈ నెల 25 న ఉన్నది కాబట్టి ఆ రోజు పాఠశాల విద్యాశాఖ వివాదం ఉన్న సబ్జెక్ట్స్ తెలుగు, హిందీ మినహా మిగిలిన ప్రమోషన్స్ కోర్టు అనుమతితో కన్ఫర్మ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కాబట్టి, ప్రమోషన్ పేరిట వర్క్ అడ్జస్ట్ మెంట్ అయినవారు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కోరుకున్న ప్లేస్ లోనే పని చేయవలసి ఉంటుంది. ఏప్రిల్ 30న వీరిని రిలీవ్ చేయరు.

*** ప్రమోషన్ వద్దు అనుకునే వారు రిలింక్విష్ మెంట్ కొరకు ఉమ్మడి జిల్లా డియిఓ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇట్టి వారికి నిబంధనల ప్రకారం 1సం. తర్వాత మాత్రమే ప్రమోషన్ అనుమతిస్తారు.
Forwarded from The Localhub
💥మిషన్ వాత్సల్య స్కీమ్ కింద విద్యార్ధులకు 4 వేల రూపాయల స్పాన్సర్ షిప్

👉అర్హులు, అప్లికేషన్, పూర్తి వివరాలు 👇🏻
https://www.thelocalhub.in/2023/04/mission-vatsalya-scheme-rs4000-complete.html
Forwarded from The Localhub
♻️SBI Foundation 5 Lakh Worth ASHA Scholarships 2023

👉 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా [SBI] నుండి ఏడాదికి 5 లక్షల వరకు విలువ గల ఆశా స్కాలర్షిప్ 2023 నోటిఫికేషన్ విడుదల

👉చివరి తేదీ: 30 ఏప్రిల్
👉 విద్యా సంవత్సరం : 2022-23

👉పూర్తి వివరాలు, ఆన్లైన్ అప్లికేషన్ కింద లింకు లో కలవు

https://www.thelocalhub.in/2023/04/sbif-asha-scholarship-program-2023-for.html
Forwarded from The Localhub
♻️IKDRC Recruitment 2023 – Apply Online for 1156 Staff Nurse, Junior Clerk, Head Clerk & other Posts

👉Posts: Various Posts
👉Vacancies: 1156
👉Qualification: 12th/Diploma/ Degree / PG/ DMLT/GNM
👉Last Date: 16.05.23

👉 Complete Recruitment Details, Notification, Online Apply Link👇
https://www.thelocalhub.in/2023/04/ikdrc-recruitment-2023-apply-online-for.html