APTEACHERS
16.2K subscribers
1.86K photos
39 videos
1.02K files
5.72K links
APTEACHERS Website Official Telegram Channel
లేటెస్ట్ విద్యా ఉద్యోగ సమాచార చానెల్
Latest Educational AP Employees, AP Teachers Information
Official Website
http://www.apteachers.in
Download Telegram
📚ఎయిడెడ్
విద్యాసంస్థలను రక్షించండి📚

విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనలు

*🌻ప్రజాశక్తి - యంత్రాంగం*

ఎయిడెడ్ విద్యాసంస్థలను కొనసాగించాలని, పేద విద్యార్థులను విద్యను దూరం చేయొద్దని కోరుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో నిరసనలు చేపట్టారు. ఎయిడెడ్ విద్యాసంస్థల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వీరికి ఎస్ఎఫ్ఎస్ఐ, డివైఎఫ్ఎస్ఐ, వామపక్షాల నాయకులు మద్దతు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో మహారాణి కళాశాల విద్యార్థులు ఎస్ఎఫ్ఎస్ఐ ఆధ్వర్యంలో ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. ఎంఎస్ఎన్ విద్యా సంస్థలను ప్రభుత్వమే నిర్వహించాలంటూ కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జెసికి వినతిపత్రం అందించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని వివేకానంద స్కూలు విద్యార్థులు, తల్లిదండ్రులు ఎస్ఎఫ్ఎస్ఐ, డివైఎఫ్ఎస్ఐ, ఐద్వా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఎస్వికెపి కళాశాల విద్యార్థులు ప్రదర్శన, ఆర్డిఒ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఎయిడెడ్ విద్యాసంస్థల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
📚మోడల్ స్కూళ్లలో టీచర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్📚

కాంట్రాక్టు పద్దతిలో 282 పోస్టుల భర్తీ

*🌻సాక్షి, అమరావతి:* రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టుల్లో కాంట్రాక్టు టీచర్లను నియమించి విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ మెమో జారీ చేశారు. ఈ స్కూళ్లలో మంజూరై ఉన్న పోస్టు గ్రాడ్యుయేట్(పీజీటీ), ట్రయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులు గత కొంతకాలంగా ఖాళీగా ఉ న్నాయి. దీనివల్ల ఆయా స్కూళ్లలో విద్యార్థుల బోధ నకు కొంత ఆటంకం ఏర్పడుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పోస్టుల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన తక్ష ఈ ణమే టీచర్లను నియమించి విద్యార్థులకు బోధనలో ఆటంకాల్లేకుండా చూసేందుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఈ ఏడాది జూన్ 21న ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వాటికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ స్కూళ్లలోని 282 టీచర్ పోస్టుల్లో కాంట్రాక్టు టీచర్లను నియమిం చాలని ముఖ్యకార్యదర్శి మెమోలో వివరించారు. వీటిలో 211 పోస్టు గ్రాడ్యుయేట్ పోస్టులు కాగా, 71 గ్రాడ్యుయేట్ పోస్టులున్నాయి.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
📚‘ఎయిడెడ్‌’కు వ్యతిరేకం కాదు📚


*ఆ విద్యా సంస్థలపై రాజకీయాలు చేయడం బాధాకరం* 

*యాజమాన్యాలకు, టీచర్లకు, విద్యార్థులకు మంచి చేయాలన్నదే ఉద్దేశం* 

*వాటి స్థాపన వెనకున్న లక్ష్యాలను చేరేందుకు అందిస్తున్న తోడ్పాటులో భాగమే ఇది* 

*ప్రభుత్వం కల్పించిన అవకాశాలను ఐచ్ఛికంగా, స్వచ్ఛందంగా వినియోగించుకోవచ్చు*  

*లేదా ఇప్పుడున్నట్లుగానే నడుపుకోవచ్చు.. ఇందులో బలవంతంలేదు: సీఎం జగన్‌* 

*అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టీకరణ* 

*🌻సాక్షి, అమరావతి*: రాష్ట్రంలో ఎయిడెడ్‌ విద్యాసంస్థల చుట్టూ జరుగుతున్న రాజకీయాలు, రెచ్చగొట్టే ధోరణులు బాధాకరమని.. ఇందులోకి  రాజకీయాలను తీసుకురావడం దురదృష్టకరమని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని ఆయన స్పష్టంచేశారు. తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం అధికారులతో జరిగిన సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకమనే కోణంలో జరుగుతున్న ప్రచారాలు, కథనాలను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎయిడెడ్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు, అందులో పనిచేస్తున్న టీచర్లు, విద్యార్థులకు మంచి చేయాలనే ఉద్దేశంతో కొన్ని అవకాశాలు కల్పించామన్నారు. ఈ అవకాశాల వెనకనున్న కారణాలను సీఎం జగన్‌ వివరించారు. అవి ఆయన మాటల్లోనే..

► గతంలో డబ్బున్న వారు, ఆస్తిపాస్తులు ఉన్నవారు ఛారిటీ కింద భవనాలు నిర్మించారు. అందులో ఎయిడెడ్‌ పాఠశాలలు, కాలేజీలు పెట్టారు. తర్వాత కాలంలో ఈ స్కూళ్లు, కాలేజీలు నడపడం ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారింది. 

► మరోవైపు.. ప్రభుత్వాలు కూడా గడచిన 20–25 ఏళ్లుగా ఎయిడెడ్‌ పోస్టులను భర్తీచేయకపోవడంతో ఆ పోస్టులు కరిగిపోతూ వచ్చాయి. ఒక విధాన నిర్ణయంలో భాగంగా ఇది చేశాయి. 

► యాజమాన్యాలే టీచర్లను నియమించుకుని ఎయిడెడ్‌ స్కూళ్లను నడపాల్సిన పరిస్థితి వచ్చింది. 

► ఈ దశలో ఎయిడెడ్‌ స్కూళ్లను, కాలేజీలను నడపడానికి మళ్లీ మళ్లీ డబ్బులు పెట్టాల్సిన పరిస్థితులొచ్చాయి. ఈ విద్యా సంస్థలను నడిపేందుకు యాజమాన్యంలోని వ్యక్తులు అవసరమైన సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. సంస్థల వ్యవహారాలను దగ్గరుండి చూసుకునే పరిస్థితులు కూడా లేకుండాపోయాయి. 

► ఈ కారణాలన్నీ కూడా ఎయిడెడ్‌ స్కూళ్లు, కాలేజీల నిర్వీర్యానికి దారితీశాయి. భవనాలన్నీ కూడా శిథిలావస్థకు చేరాయి. రిటైరైన  టీచర్ల స్థానే కొత్త వారిని నియమించుకోవడం కూడా యాజమాన్యాలకు ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారింది. ఒకవేళ టీచర్లను పెట్టినా నాణ్యత లోపించింది. 

► ఈ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు కూడా చాలాకాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. తమను ప్రభుత్వంలో భాగంగా గుర్తించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఎయిడెడ్‌ స్కూళ్లన్నీ శిథిలావస్థకు చేరుతున్నాయని.. ప్రభుత్వంలో భాగం కానీయకుండా తమ కడుపులు కొడుతున్నారని కూడా వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

► ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్‌ విద్యాసంస్థల వెనకున్న ఉద్దేశాల రక్షణకు, వాటి యాజమాన్యాలకు సహాయకారిగా ప్రభుత్వం ఐచ్ఛికంతో కూడిన విధంగా, స్వచ్ఛందంగా కొన్ని అవకాశాలను కల్పించింది.

► నడపలేని పరిస్థితుల్లో ఉన్న విద్యా సంస్థలను ఉన్నది ఉన్నట్లుగా ప్రభుత్వానికి అప్పగిస్తే.. నాడు–నేడులో భాగంగా పునరుద్ధరిస్తాం. విద్యార్థులకు సరిపడా టీచర్లను భర్తీచేస్తాం. చారిటీ కింద విద్యాసంస్థలను పెట్టిన దాతల పేర్లను కొనసాగించడం ద్వారా యాజమాన్యాల ఉద్దేశాలను నెరవేరుస్తాం. ఎయిడెడ్‌ విద్యాసంస్థల స్థాపన వెనకున్న లక్ష్యాలను చేరుకునేందుకు అందిస్తున్న తోడ్పాటులో భాగమే ఇది. ఆ సంస్థలను నడుపుతున్న వారికి సహాయంగా నిలిచే కార్యక్రమం ఇది. 

► తాము ప్రభుత్వంలో భాగమయ్యేలా చూడాలంటూ ఎయిడెడ్‌ టీచర్లు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో, వారి డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని, వారిని సరెండర్‌ చేసి, ప్రైవేటుగా నడుపుకోవచ్చు.

► లేదా ఇప్పుడు ఉన్నది ఉన్నట్లుగా యథా ప్రకారం నడుపుకోవచ్చు. 

► ఇప్పటికే ప్రభుత్వంలో విలీనానికి అంగీకారం తెలిపిన ఎయిడెడ్‌ విద్యాసంస్థలు, తిరిగి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటే.. అలా కూడా చెయ్యొచ్చు. దీనికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. 

► ఎయిడెడ్‌ విద్యాసంస్థల యజమానులకు, అందులో పనిచేస్తున్న టీచర్లకు, విద్యార్థులకు మంచిచేయాలని, మెరుగైన స్కూళ్లుగా వాటిని తీర్చిదిద్ది నడపాలనే ఉద్దేశంతోనే ఐచ్ఛికంగానే ఈ అవకాశాలను వారు వినియోగించుకోవచ్చు. ఇందులో ఎలాంటి బలవంతంలేదు.. అని ముఖ్యమంత్రి జగన్‌ వివరించారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
Resource persons required for State Teacher Resource Repository (STRR) from Both Govt and Private Managements - Visakhapatnam District

Teachers who are interested to act as Resource persons for STRR are informed to fill the below google form and submit on or before 07.11.2021.

https://forms.gle/2N67N9jhUfTPph1J8
📚ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల డేటా అప్లోడ్ చేయాలి📚

*🌻సాక్షి, అమరావతి*: రాష్ట్రంలోని వివిధ యాజ మాన్యాల పరిధిలోని ఇంటర్మీడియెట్ కాలేజీ ల్లో ఫస్టియర్ విద్యార్థుల డేటాను ఈనెల 12వ తేదీలోగా జ్ఞానభూమి పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఇంటర్మీడియెట్బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. పలు కాలేజీలనుంచి డేటా అప్లోడ్ కాకపోవడంతో 12వ తేదీ వరకు గడువు పొడిగించామని, ఇక గడువు పొడిగింపు ఉండబోదని బోర్డు కార్యదర్శి శేషగిరిబాబు ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
📚గిరిజన ఆశ్రమ
స్కూళ్లలో సీఆర్టీల కొనసాగింపు📚

*1,798 మంది సీఆర్టీల సర్వీసు మరో ఏడాది పొడిగింపు*

*🌻సాక్షి, అమరావతి:* రాష్ట్రంలోని గిరిజన ఆశ్రమ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉపాధ్యాయుల (సీఆర్టీల) సర్వీసును 2021-2022 విద్యా సంవత్సరానికి పొడి గిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 1,798 మంది కాంట్రాక్ట్ రిక్రూటెడ్ టీచర్లు పనిచేస్తున్నారు. వీరిలో 794 మంది స్కూల్ అసిస్టెంట్లు కాగా 1,004 మంది ఎస్జీటీలు, పీఈటీలు, లాంగ్వేజ్ పండిట్లు. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో వారి కాంట్రాక్ట్ సర్వీసును పొడిగిస్తున్నారు. అయితే ఈ ఏడాది కొన్ని సాంకేతిక కారణాలతో సీఆర్టీల సర్వీసు పొడిగింపును అధికారులు నిలిపివేశారు. దీంతో పలు పాఠశాలల్లో ఇబ్బందులు తలెత్తడంతో సీఆర్టీలు తమ సమస్యను ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆమె ఈ విషయాన్ని గత మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం వైఎస్ జగన్ సీఆర్టీల సర్వీసును పొడిగించడానికి అవస రమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో అధికా రులు ఉత్తర్వులు జారీ చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించిన సీఎం వైఎస్ జగన్కు పుష్పశ్రీవాణి కృతజ్ఞతలు తెలిపారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
📚పాఠాలు
చెప్పనివ్వరా..?📚

*పనికిమాలిన యాప్‌లతోనే సరి..*

*డీఈవో కార్యాలయాన్ని ముట్టడించిన ఎమ్మెల్సీ, టీచర్లు*

*🌻ఏలూరు ఎడ్యుకేషన్‌, నవంబరు 2 :* ఉపాధ్యా యుల వృత్తి గౌరవాన్ని దిగజార్చే విధంగా టీచర్లతో మరుగు దొడ్ల ఫొటోలు తీయించడం వంటి పనికిమాలిన పనులతో ఉన్న యాప్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో టీచర్లు పెద్ద సంఖ్యలో మంగళవారం ఏలూరు డీఈవో కార్యాల యాన్ని ముట్టడించారు. కార్యాలయ విధులకు ఆటంకం కలిగిస్తున్నారన్న కారణంతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీతో సహా సంఘ జిల్లా నాయకులు, పలువురు టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనాల్లో పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపటి తరువాత వారందరినీ వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలంటే ఉపాధ్యా యులను బోధనకే పరిమితం చేయాలని కోరారు. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పే పనులకు బదులుగా ప్రభుత్వ పథకాల పనుల్లో నిమగ్నమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం సరిగా లేక పోవడం, ప్రభుత్వ సర్వర్‌ సామర్ధ్యం తక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల యాప్‌లలో ఫొటోలు నమోదు అస్పష్టతగా ఉంటే ఉపాధ్యాయులకు చార్జిమె మోలు ఇవ్వడం సరికాద న్నారు. సంఘ జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జయకర్‌, గోపిమూర్తిలు మాట్లాడుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న టీచర్లను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. యూటీఎఫ్‌ నాయ కులు రామభద్రం, కనకదుర్గ, రాంబాబు, రవికుమార్‌, వెంకటేశ్వరరావు, రాజశేఖర్‌, జయకుమార్‌, రాజు, విక్టర్‌, పి.వి.నరసింహారావు, శ్రీదేవి, కృష్ణమోహన్‌, అప్పారావు, శ్రీనివాస్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚విలీనం.. గరదరగోళం!📚*

*పిల్లలను పంపారు సరే.. ఉపాధ్యాయుల మాటేమిటీ*

🔺ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విలీన ప్రక్రియ గందరగోళంగా తయారైంది. జిల్లా విద్యాశాఖకు ఒక నిర్ధిష్టమైన ప్రణాళిక లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పిల్లల విలీనం సరే, అసలు ప్రాథమిక పాఠశాలల నుంచి ఉన్నత పాఠశాలలకు వెళ్లాల్సిన ఉపాధ్యాయులు ఎవరనేది ఇప్పటి దాకా గుర్తించలేదు. దీంతో విలీన ప్రక్రియ అసంపూర్తిగా మారింది. తొలుత ఉపాధ్యాయుల్లో సీనియర్లను గుర్తించి విలీన ప్రక్రియ చేపడితే ఎవరికీ సమస్యలు ఉండేవి కాదు. టీచర్లను పంపకుండా పిల్లలను విలీనం చేస్తే ఏం ప్రయోజనం? అక్కడ వారికి ఎవరు బోధన చేస్తారనేది ప్రశ్నార్థకమవుతోంది.

*🌻ఈనాడు, అమరావతి:* కొందరు టీటీసీ, మరికొందరు డీఎడ్‌ చేసి సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులుగా నియామకమయ్యారు. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లోకి విలీనం చేసి వారికి విద్యార్హతలు కలిగిన సీనియర్‌ టీచర్లతోనే బోధన చేయిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అమలుకు వచ్చేసరికి ఆ నిబంధన మరుగునపడిపోయింది. ప్రస్తుతం చాలామంది సీనియర్లు తమకన్నా జూనియర్లుగా ఉన్న ఉపాధ్యాయుల్లో బీఈడీ వంటి అదనపు అర్హతలు ఉంటే ఉన్నత పాఠశాలలకు పంపాలని, తాము ప్రాథమిక పాఠశాలల్లోనే ఉంటామని చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం విలీన పాఠశాలకు ఎవరిని పంపాలో తెలియక ఎంఈవోలు సతమతమవుతున్నారు. ఇప్పటికే వెళ్లిన పిల్లలకు కొత్త పాఠశాలల్లో బోధన చేయటానికి సరిపడా ఉపాధ్యాయులు లేరు. ఉన్నవారిపైనే అదనపు భారం పడుతోందని ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నత పాఠశాలకు 250 మీటర్లలోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతుల పిల్లలను విలీనం చేయాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి జిల్లాలో 249 పాఠశాలలు ఉన్నాయి.

* ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చే పిల్లలను చేర్చుకోవడంపై పురపాలకశాఖ నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకపోవడంతో మున్సిపల్‌ పాఠశాలల హెచ్‌ఎంలు పిల్లలను చేర్చుకోవడం లేదు. ఇలా గందరగోళం నడుమ తరగతుల విలీనం జిల్లాలో జరుగుతోంది. ఇప్పటికే పిల్లలను మాత్రం విలీనం చేసినట్లు కాగితాలపై చూపారు. కొన్నిచోట్ల నూతన పాఠశాలల్లోకి వెళ్లి కూర్చుంటున్నారు.
‘టీచర్లను సర్దుబాటు చేయకుండా పిల్లలను పంపారు? వారికి ఎవరు బోధన చేయాలి? ఎవరు హాజరు వేయాలి? మధ్యాహ్న భోజనం ఎలా సమకూర్చాలి వంటివి సమస్యలుగా ఉన్నాయని సీనియర్‌ ప్రధానోపాధ్యాయుడొకరు తెలిపారు. మరోవైపు పిల్లల తల్లిదండ్రుల్లోనూ ఇదే విషయమై ఆందోళన నెలకొంది.

*30 మంది దాటితే ఇద్దరు టీచర్లు*
ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులతో పోలిస్తే 1, 2 తరగతుల్లోనే పిల్లలు ఎక్కువ ఉంటారు. 1, 2 తరగతుల్లో కలిపి 30 మందికి పైగా విద్యార్థులు ఉంటే అక్కడ విధిగా ఇద్దరు టీచర్లు ఉండాలి. ఇదే పాఠశాల నుంచి 3, 4, 5 తరగతులకు ఆ ఇద్దరిలో ఒకరిని పంపితే మిగిలిన 30 మందికి ఒక్క టీచర్‌ ఎలా బోధిస్తారు? అనారోగ్యమో ఇంకేదైనా కారణంతో ఆ ఒక్కరు సెలవు పెడితే ఆ రోజు పాఠశాలను ఎవరు తెరుస్తారనేది తెలియకుండా ఉంది. ఇప్పటికైనా ఈ గరదరగోళానికి తెరదించేందుకు డీఈఓ, ఆర్జేడీ వంటి ఉన్నతాధికారులు ఈ కసరత్తుపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

*క్షేత్రస్థాయిలో పరిస్థితి*
V పిడుగురాళ్ల మండలం గుత్తికొండ అప్‌గ్రేడ్‌ పాఠశాలకు 176 మంది పిల్లలు వచ్చారు. కానీ టీచర్లు ముగ్గురే వచ్చారు. వాస్తవానికి ఆరుగురు ఉపాధ్యాయులు రావాలి. V దుర్గి మండలం ముతుకూరు పాఠశాలలో సీనియర్‌ ఉపాధ్యాయుడి కన్నా జూనియర్‌కు విద్యార్హతలు ఎక్కువగా ఉన్నాయి. వీరిలో ఎవర్ని విలీన పాఠశాలకు పంపాలనేది ఇప్పటికీ ఖరారు చేయలేదు.
మేడికొండూరు మండలం తురకపాలెం ప్రాథమిక పాఠశాలలో ఎవరు సీనియర్‌, జూనియరో తేలక కుస్తీలు పడుతున్నారు. ఇక్కడ ఒక టీచర్‌ అంతర జిల్లా బదిలీపై ఇక్కడకు వచ్చారని, ఆయన సీనియారిటీని ఎలా లెక్కించాలనేది వారికి అంతుచిక్కడం లేదు. బెల్లంకొండలో పిల్లలను విలీనం చేసి ఉపాధ్యాయులను పంపలేదు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚జేఎల్ పోస్టుల భర్తీకి ప్రొవిజినల్ జాబితా విడుదల📚*

*🌻అమరావతి, ఆంధ్రప్రభ:* ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జేఎల్ పోస్టుల కోసం గతంలో నిర్వహించిన పరీక్షలో ప్రొవిజినల్గా ఎంపికైన అభ్యర్థుల జాబి తాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. మంగళవారం ఒక ప్రకటనలో జోన్- 2 పరిధిలో హిందీ సబ్జెక్ట్ జూనియర్ లెక్చరర్ల భర్తీకి సంబం ధించిన జాబితాను కమిషన్ వెబ్సైట్ www.psc.ap.gov.in లో, అలాగే కార్యా లయ నోటీస్ బోర్డులో ఉంచినట్లు కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*💥 ప్రైవేట్ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థుల TC ల విషయంలో CSE తాజా ఉత్తర్వులు*
The ADs & the MEOs are requested to inform all the HMs to *conform the meals availed data* and *CCH accounts* for the month of Oct'21.. *service will be closed by 5th..of every month ..

Meals Availed డాటా confirm చేసే విధానం కోసం కింద వీడియో లో కలదు
👇
https://youtu.be/mtvu7X2UorU
*Govt declared Optional Holiday can be availed on 5th Nov after the Day of Diwali*
💥 Alert.. ఇకపై జీ మెయిల్‌ ఓపెన్‌ చేయాలంటే ఇవి తప్పనిసరి.. అమల్లోకి రాబోతున్న కొత్త రూల్స్‌.. పూర్తి సమాచారం
👇
https://www.thelocalhub.in/2021/11/blog-post.html
*💥పెట్రోలు డీజిల్ ఎక్సైజ్ డ్యూటీ ని తగ్గించిన కేంద్రం.. పెట్రోలు పై రూ 5 తగ్గింపు*
*💥Flash.. IBPS Specialist Officers XI New Notification Released*
🔹Vacancies: 1828
🔹Post: Specialist Officer (CRP SPL-XI)
🔹Age : 20-30 Yrs
🔹Qualf: Degree (Engg), LLB, Degree, PG
🔹Last Date: 23-11-2021
🔹Complete Details
👇
https://www.thelocalhub.in/2021/11/ibps-specialist-officer-xi-recruitment.html

*💥IBPS Banks PO - 4135 Probationary Officers, Management Trainee MEGA Recruitment*
*Qualf: Degree*
*Last Dt: 10-11-2021*
*Details:*
👇
https://www.thelocalhub.in/2021/10/ibps-po-mt-recruitment-2021-22-apply.html
*📚గురువులపై యాప్‌ల*
*బరువు!📚*

*మధ్యాహ్న భోజనం నుంచి మరుగుదొడ్ల వరకూ పర్యవేక్షణ*

*గురువులపై ఫొటో తీయడం.. అప్‌లోడ్‌ చేయడం*

*గంటల తరబడి సమయం వృథా*

*ఇప్పుడు బయోమెట్రిక్‌ హాజరు కూడా..*

*ఇక చదువు చెప్పేందుకు సమయమేదీ?*

*పిల్లలకు నాణ్యమైన బోధనపై ప్రభావం*

🔺విద్యార్థి పాఠశాలకు రాగానే హాజరు తీసుకొని యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. మధ్యాహ్న భోజనానికి ముందు పాత్రలన్నీ శుభ్రం చేసిన ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. వండిన ఆహార పదార్థాలు, గుడ్లు, చిక్కీల ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాలి. మరుగుదొడ్లు శుభ్రంగా ఉన్నాయో, లేవో స్వయంగా చూసి ఫొటోలు తీసి, వాటినీ అప్‌లోడ్‌ చేయాలి... ఇలా ఫొటోలు తీయడం, వాటిని అప్‌లోడ్‌ చేయడమే ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యతగా మారింది. బడిలో బోధనకు కేటాయించాల్సిన విలువైన సమయంలో తమపై ఈ యాప్‌ల భారమేంటని గురువులు గగ్గోలు పెడుతున్నారు.

*🌻(అమరావతి-ఆంధ్రజ్యోతి*)

పాఠశాలల్లో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు ‘అదనపు’ పనుల బరువుతో సతమతమవుతున్నారు. విద్యార్థి పాఠశాలలో అడుగుపెట్టినప్పటి నుంచీ బోధనపై దృష్టి సారించాల్సిన వీరంతా ఇప్పుడు యాప్‌లతో బిజీబిజీగా గడుపుతున్నారు. చదువుకు మించి వారితో చేయిస్తోన్న అనేక ఇతర పనులతో నిత్యం నలిగిపోతున్నారు. ‘నాడు-నేడు’ పనుల పర్యవేక్షణతో పాటు మధ్యాహ్న భోజనం నుంచి మరుగుదొడ్ల పరిశుభ్రత వరకూ అన్నీ టీచర్లే చూసుకోవాలి. వాటన్నింటినీ ఎప్పటికప్పుడు ఫొటోలు తీసి యాప్‌లలో అప్‌లోడ్‌ చేయాలి. గురువులకు ఈ పనులే భారంగా మారగా, ఇప్పుడు విద్యార్థుల బయోమెట్రిక్‌ హాజరు తీసుకోవడం లాంటి పనులూ అదనంగా చేరాయి. మొత్తంగా ఈ పనులన్నీ చేసేందుకు పాఠశాలకో ఉపాధ్యాయుడిని పూర్తిగా కేటాయించాల్సి వస్తోంది. ఇద్దరు టీచర్లు చేస్తే రెండేసి గంటలు పడుతుందని అంచనా. ఆ మేరకు వీరు తరగతులు తీసుకునేందుకు అవకాశం ఉండటం లేదు.

బడిలో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను ఇతర పనులకు కేటాయించడంతో విద్యలో నాణ్యత తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. చాలాచోట్ల ప్రధానోపాధ్యాయులే ఈ పనులు చేస్తున్నారు. పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్నచోట్ల ఈ పనులు మరింత భారంగా మారాయి. ఈ క్రమంలోనే ఇటీవల గుడ్లు, చిక్కీల ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయలేదంటూ టీచర్లకు ఉన్నతాధికారులు నోటీసులు కూడా ఇచ్చారు. వాస్తవానికి కాంట్రాక్టర్లు వాటిని సరఫరా చేయకపోవడంతో ఫొటోలు తీయలేకపోయారు.

*విద్యార్థులకే నష్టం*

ఈ పరిణామాలు ఉపాధ్యాయులకు ఇబ్బంది కలిగించడం మాట అటుంచి, దీనివల్ల విద్యార్థులకే ఎక్కువ నష్టమని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు నాణ్యమైన బోధన చేయడం, ప్రతి ఒక్కరి సామర్థ్యాన్ని అంచనా వేయడం, తల్లిదండ్రులతో పిల్లల గురించి చర్చించడం, వారు మరింత రాణించేందుకు ఏం చేయాలన్న ప్రణాళికలపై ఆలోచించే సమయం లేకపోవడంతో విద్యార్థులు నష్టపోతారని వివరిస్తున్నారు. ఈ యాప్‌లతో ఉపాధ్యాయులకు సమయం వృథా కావడం, విద్యార్థులపై దృష్టి పెట్టకపోవడం వంటి కారణాలు తల్లిదండ్రులకు విద్య నాణ్యతపై నమ్మకం పోయే పరిస్థితిని కల్పిస్తాయని పేర్కొంటున్నారు. ఉపాధ్యాయులు తరగతి గదిలో ప్రతి ఒక్కరిపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి, వ్యక్తిగత సామర్థ్యాలను అంచనా వేసి సరైన దిశగా నడిపిస్తేనే వారు జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించడం సాధ్యపడుతుంది. కానీ అలాంటి వాటికి సమయం ఇవ్వకుండా, కనీసం బోధనకు కూడా అవకాశం లేకుండా టీచర్లపై యాప్‌ల భారం వేయడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

*ఫొటోలు తీసేందుకు షరతులు*

మరోవైపు ఈ ఫొటోలు తీయడానికి కూడా అనేక నిబంధనలు విధించారు. వెలుతురు సరిగా ఉండాలి. ఫొటో స్పష్టంగా ఉండాలి. టాయ్‌లెట్‌లో ఫొటో తీస్తున్నప్పుడు నీడలు ఉండకూదు. మరుగుదొడ్లో కమోడ్‌ సాధ్యమైనంత లోపలి ప్రాంతంతో సహా పూర్తిగా కనిపించాలి. గోడలు కనిపించకూడదు, కెమెరా ఫోకస్‌ టాయ్‌లెట్‌ కమోడ్‌, ఫ్లోర్‌పైనే ఉండాలి. అస్పష్టంగా ఉంటే కుదరదు. ట్యాబ్‌, కంప్యూటర్‌ మొదలైన స్ర్కీన్ల నుంచి చిత్రాలు తీయకూడదు... అంటూ అనేక షరతులు విధించారు. చాక్‌పీసులు పట్టుకుని తరగతి గదిలో బోధన చేయాల్సిన సమయంలో... సెల్‌ఫోన్లు పట్టుకుని మరుగుదొడ్లలో రోజూ ఫొటోలు తీసే దుస్థితి వచ్చిందని ఉపాధ్యాయులు వాపోతున్నారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚ఎయిడెడ్‌ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి మంగళం📚*

*వంట కార్మికులను ప్రభుత్వ బడుల్లో సర్దుబాటు చేసేందుకు ఆదేశాలు*

*🌻ఈనాడు, అమరావతి*: ఎయిడెడ్‌ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోనుంది. పేద విద్యార్థులకు ఇంతకాలం ఉచితంగా అందుతున్న పోషకాహారం ఇక లభించదు. ప్రభుత్వం ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు గ్రాంటు నిలిపివేయడంతో చాలావరకు ఎయిడెడ్‌ బడులు ప్రైవేటు పాఠశాలలుగా మారిపోయాయి. వీటిలో మధ్యాహ్నభోజన పథకాన్ని నిలిపివేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎయిడెడ్‌లోని వంట కార్మికులను సమీపంలోని ప్రభుత్వ బడుల్లో సర్దుబాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు విజయనగరం జిల్లా విద్యాధికారి ఇప్పటికే ఆదేశాలు విడుదల చేశారు. వంట కార్మికులను ఎవ్వరినీ తొలగించకుండా నిబంధనల ప్రకారం సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నియమించాలని పేర్కొన్నారు. 25 మంది విద్యార్థులకు ఒకరు, వంద మందికి ఇద్దరు, ఆపైన ప్రతి వంద మందికి ఒకరి చొప్పున ఎయిడెడ్‌లోని వంట కార్మికులను సర్దుబాటు చేయాలని సూచించారు.

*📗ఆ పాఠశాలల్లో కొనసాగిస్తారా?*
రాష్ట్రంలో 1,988 ఎయిడెడ్‌ పాఠశాలలు ఉండగా.. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ సిబ్బందిని వెనక్కిచ్చేందుకు 1,214 విద్యాసంస్థలు సమ్మతి తెలిపాయి. సమ్మతి తెలిపిన విద్యాలయాలను ప్రైవేటుగా నిర్వహించుకోవాలంటూ జిల్లా విద్యాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎయిడెడ్‌ పాఠశాలల్లో మొత్తం 1.97 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. తల్లిదండ్రుల అభీష్టం మేరకు వీరిలో కొంతమందిని ప్రభుత్వ బడుల్లో సర్దుబాటు చేసినా మిగతావారు అక్కడే కొనసాగే అవకాశం ఉంది. ప్రైవేటుగా మారిన ఎయిడెడ్‌ బడిలో చదివేవారికి ఇక మధ్యాహ్న భోజనం ఉండదు. ఇప్పటికే సమ్మతి తెలిపిన కొన్ని యాజమాన్యాలు అంగీకారాన్ని వెనక్కి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖకు లేఖలు రాశాయి. రాష్ట్రంలో 400 ఎయిడెడ్‌ పాఠశాలలను నిర్వహిస్తున్న ఆర్‌సీఎం యాజమాన్యాలు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి ఈ లేఖలు పంపాయి. వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సందిగ్ధత నెలకొంది. వీటిలో మధ్యాహ్న భోజనం కొనసాగుతుందా? లేదా అనేదానిపైనా స్పష్టత లేదు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚ఇంటర్ ప్రైవేట్*
*అభ్యర్థుల ఫీజు గడువు 23📚*

*ఉత్తర్వులిచ్చిన ఇంటర్ బోర్డు*

*🌻అమరావతి, ఆంధ్రప్రభ:* రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రైవేట్గా అభ్యసించే అభ్యర్థులు(వితవుట్ కాలేజ్ స్టడీ) హాజరు మినహాయింపు కోసం ఫీజు చెల్లించాలని బోర్డు సూచించింది. ఈ మేరకు బుధవారం బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరి బాబు ఉత్తర్వులు విడుదల చేశారు. మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షలు రాసేందుకు విద్యా ర్థులంతా రూ. 1300 హాజరు మినహాయింపు కోసం చెల్లించాలని సూచించారు. బోర్డు వెబ్సైట్ నుంచి ఈ చలాన్ ద్వారా ఈ మొత్తం చెల్లించాలన్నారు. రూ. పది చెల్లించడం ద్వారా దరఖాస్తు పొందవచ్చన్నారు. ఫీజు చెల్లించడానికి ఈ నెల 23 వరకు గడువు ఉందని, రూ.200 ఆలస్య రుసుముతో ఈ నెల 30వ తేదీ వరకు చెల్లించవచ్చని తెలిపారు. అన్ని సర్టిఫికెట్లు జత చేయని, అసంపూర్ణ దరఖాస్తులను తిరస్కరిస్తామని స్పష్టం చేశారు. పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు అర్హత సూచనలతోపాటు, లాంగ్వేజ్ చేంజ్, అదనపు సబ్జెక్టు జత చేసుకోవడం వంటి వివ రాలను బోర్డు వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరి బాబు పేర్కొన్నారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*💥NAVAL DOCKYARD - 275 Posts Recruitment Notification*
*Vacancies: 275*
*Trades: Electrician, Fitter, Mechanical, Welder, Carpenter etc*
*Qualf: ITI in Relevant Trade*
*Job Nature: Apprentice*
*Last Date: 5th Dec 2021*
*Details
👇
https://www.thelocalhub.in/2021/11/naval-dockyard-recruitment-2022-apply.html