APTEACHERS
16.1K subscribers
1.81K photos
36 videos
1.02K files
5.67K links
APTEACHERS Website Official Telegram Channel
లేటెస్ట్ విద్యా ఉద్యోగ సమాచార చానెల్
Latest Educational AP Employees, AP Teachers Information
Official Website
http://www.apteachers.in
Download Telegram
జూన్ 1 వరకు క్లాసులు ప్రారంభించవద్దు✍️📚

♦️ఇంటర్ బోర్డు ఆదేశాలు

🌻అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఇంటర్ విద్యను అందిస్తున్న ప్రభుత్వ, ప్రయివేట్, ఎయిడెడ్తోపాటు అన్ని ఇంటర్మీడియా కాలేజీలు జూన్ 1వ తేదీలోపు క్లాసులు ప్రారంభించవద్దని ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాలను మీరి ఎవరైనా కాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాగే అడ్మిషన్ల ప్రక్రియను కూడా తాము షెడ్యూల్ ఇచ్చేంత వరకు ప్రారంభించవద్దని పేర్కొంది. ఈమేరుకు సోమవారం విడుదల చేసిన ఆదేశాలను పత్రికలకు పంపించారు.
ప్రభుత్వ జాప్యం వల్లే ఉద్యమం ఉధృతం✍️📚

♦️ఎపి జెఎసి అమరావతి

🌻ప్రజాశక్తి అమరావతి: ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లనుపరిష్కరించడంలో ప్రభుత్వ జాప్యం వల్లే ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి వచ్చిందని ఎపి జెఎసి అమరావతి నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలోని సిఎస్ కెఎస్ జవహర్ రెడ్డిని కలిసి తమ డిమాండ్ల గురించి వివరించారు. ఈ సందర్భంగా 47 రోజులుగా జరుగుతున్న ఉద్యమ తీరును సిఎస్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎపి జెఎసి అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ వలిశెట్టి దామోదర్ పేర్కొన్నారు. ఈ నెల 28న ఉద్యోగ, కార్మిక సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
గురుకుల ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పొడిగింపు✍️📚

🌻గుంటూరు విద్య, న్యూస్టుడే: ఏపీ గురుకుల పాఠశాలల్లో 5, 6, 7, 8 తర గతులు, జూనియర్ కళాశాలల్లో మొదటి ఏడాది, డిగ్రీలో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఆర్ఎస్ సీఏటీ-2023, ఏపీ ఆర్జేసీ అండ్ డీసీ సెట్- 2023-24 పరీక్షల దర ఖాస్తుకు గడువును 24 నుంచి 28వ తేదీకి పొడిగించినట్లు సంస్థ కార్యదర్శి ఆర్. నరసింహారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సస్పెన్షన్లకు నిరసనగా ఉపాధ్యాయ సంఘాల ఆందోళన✍️📚

♦️నేడు, రేపు నల్లబ్యాడ్జీలతో విధులకు

🌻ఈనాడు, అమరావతి: పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉపాధ్యా యులు, క్షేత్రస్థాయి అధికారుల సస్పెన్షన్లను నిరసిస్తూ ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఆందోళనలకు పిలుపునిచ్చింది. పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉపాధ్యాయులను కించపరుస్తూ సస్పెం డ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గం సోమవారం అత్యవసరంగా సమావేశమైంది. మంగళ, బుధవారాల్లో అన్ని పాఠశాలలతో పాటు పదోతరగతి మూల్యాంకనం కేంద్రాలకు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకావాలని ఫ్యాప్టో చైర్మన్, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, మంజుల సూచించారు. బుధవారం మూల్యాంకన కేంద్రాల వద్ద భోజన విరామ సమయంలోనూ, పాత తాలూకా కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, విలేకర్ల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

♦️నేటి నుంచి ఫోర్ట్ నిరసనలు: పార్వతీపురం మన్యం జిల్లాలో ఉపాధ్యా యులు, అధికారులను సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ నేటి నుంచి మూడు రోజుల పాటు ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు ఫోర్టో అధ్యక్ష, ప్రధాన కార్యద రులు కరణం హరికృష్ణ, సామల సింహాచలం వెల్లడించారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవడం తప్పా..?: మంత్రి బొత్స✍️📚

🌻విజయనగరం విద్యావిభాగం, న్యూస్టుడే: పార్వతీపురం మన్యంజిల్లాలో విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ పలు అంశాలు పర్యవేక్షి స్తున్నప్పుడు లోపాలు గుర్తించారని.... అందుకు బాధ్యులైన డీఈవో, నలుగురు పర్యవేక్షణాధికారులపై చర్యలు తీసుకోవడం తప్పెలా అవుతుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఈ రోజు కమిషనరు వద్దంటే.. రేపు డైరెక్టర్.. ఆ తరవాత విద్యాశాఖ మంత్రిని కూడా రావొద్దం టారని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం విజయనగరం జిల్లా కలెక్టరే ట్లో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ చర్యలపై ఉపాధ్యాయులకు సంబంధం ఏమిటి?.. దేని కోసం ఆందోళన చేస్తున్నారు?.. పాఠ్యపుస్తకాలు ఇంతవరకూ ఇవ్వకపోతే పిల్లలు ఎలా చదువుతారు? పుస్తకాలు ఇవ్వడం అధికారుల బాధ్యత కాదా అని ప్రశ్నలు సంధించారు. 'రాష్ట్రంలో విద్యాశాఖను పర్యేవేక్షిం చేందుకు తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు. ప్రతి నెలా రెండు చోట్లకు వెళ్లి వారు పర్యవేక్షించేలా ఉత్తర్వులు ఇవ్వనున్నాం' అని చెప్పారు.
'నాడు-నేడు రెండో దశ' జూన్ 12లోగా పూర్తి చేయండి✍️📚

♦️' పై కప్పు, మరుగుదొడ్లు, కిచెన్ నిర్మాణాలు,ఫర్నీచర్ పనులు పూర్తవ్వాలి

♦️ఈ ఫొటోలను ప్రధానోపాధ్యాయులు అప్లోడ్ చేయాలి

♦️అధికారులకు పాఠశాలల మౌలిక వసతుల కమిషనర్ కాటమనేని భాస్కర్ ఆదేశాలు

🌻సాక్షి, అమరావతి: మన బడి నాడు-నేడు రెండో దశ పనులను జూన్ 12లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యా శాఖ అధికారులకు పాఠశాలల మౌలిక వసతుల కమిషనర్ కాటంనేని భాస్కర్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. మన బడి నాడు-నేడు కింద రూ.8,000 కోట్ల అంచనా వ్యయంతో 22,344 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ స్కూళ్లల్లో అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడల శ్రీ నిర్మాణం పనులు మినహా పై కప్పు, సీలింగ్, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్ల మరమ్మతులు, నిర్మాణాలు, ఫర్నీచర్ సరఫరా ఏర్పాటు, పెద్ద, చిన్న రిపేర్లను జూన్ 12లోగా పూర్తి చేసి స్కూళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ పనులన్నింటినీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేసే బాధ్యతలను సంబంధిత హెడ్మాస్టర్లకు అప్పగించాలని సూచించారు. నాడు-నేడు కోసం కొనుగోలు చేసిన మెటీరియల్ను హెడ్మాస్టర్లతో పాటు తల్లిదండ్రుల కమిటీలు తమ ఆధీనంలో ఉంచుకోవాలన్నారు. కొనుగోలు చేసిన మెటీరియల్ నాణ్యత లేకపోయినా, తక్కువ సరఫరా చేసినా హెడ్మాస్టర్ తిరస్కరించాలని ఆదేశించారు. స్కూళ్ల పై కప్పుల మరమ్మతుల ఫొటోలను దశల వారీగా హెడ్మాస్టర్లు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. తరగతి గదుల్లో మెటీరియల్ నిల్వ ఉంచినప్పుడు విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలని ఆదేశించారు. మెటీరియల్ను సురక్షితంగా నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సూచనలను పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిం చినా, అదనపు వ్యయం అయినా హెడ్మాస్టర్లు లేదా సంబంధిత అధీకృత ప్రతినిధి జీతాల నుంచి రికవరీ చేస్తామన్నారు. అంతేకాకుండా క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. ఈ అంశాలన్నింటినీ హెడ్మాస్టర్లకు తెలియజేసి అమలయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ అధికారులకు స్పష్టం చేశారు.
సర్కారు పై గురువుల కన్నెర్ర —
*Dear Colletors, DEOs,*
*It has been decided that on 29th April,Saturday, Report Cards for the Summative Assesement 2 will be handed over to the parents of students in class 1st to 9th. I request collectors to use village and ward secretariat network as well as Volunteers network to ensure that every parent attends the Parents Teachers Meeting on 29th April, Saturday to collect the report card of his child.*

*With Regards*
*Praveen*
Flash.. రేపు ఇంటర్ ఫలితాలు విడుదల
రేపు సాయంత్రం 5 గం లకు ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి బొత్స

ఏపీ ఇంటర్‌ ఫలితాలు రేపు(బుధవారం) విడుదల కానున్నాయి. రేపు సాయంత్రం 5 గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు

ఈ ప‌రీక్ష‌ల‌కు మొత్తం 10,03,990 మంది పరీక్షకు హాజ‌రయ్యారు. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు 4.84 లక్షల మంది విద్యార్థులు రాయగా, ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు 5.19 లక్షల మంది విద్యార్థులు రాశారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,489 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 15వ తేదీన‌ ప్రథమ సంవత్సరం, 16వ తేదీన‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమై.. ఏప్రిల్ 4వ తేదీన ముగిసిన విష‌యం తెలిసిందే
♻️Flash.. CBA-3 [SA-2] ప్రశ్నాపత్రం లో ప్రశ్నల మార్కులు ఆన్లైన్ లో ఎంటర్ చేసేటప్పుడు, అకడెమిక్ స్టాండర్డ్ వారీగా ఏ అకడెమిక్ స్టాండర్డ్ కు ఎన్ని మార్కులు ఎంటర్ చేయాలో సూచనలు విడుదల

👉తరగతుల వారీగా కింది వెబ్ పేజీలో ఒకే క్లిక్ లో చూడవచ్చు
👉SCERT వారి Official సూచనలు
https://www.apteachers.in/2023/04/sa-2-cba-3-competency-wise-marks-entry.html
Forwarded from The Localhub
♻️NTPC Ltd Mine Overman, Supervisor & Other Recruitment 2023 – Apply Online for 152 Posts

👉Posts: Various Posts
👉Vacancies: 152
👉Qualification: 12th/Diploma
👉Last Date: 15.05.23

👉 Complete Recruitment Details, Notification, Online Apply Link👇

https://www.thelocalhub.in/2023/04/ntpc-mining-recruitment-2023-apply.html
♻️మిత్రులకు ఇన్కమ్ టాక్స్ ఈ ఫైలింగ్ గమనిక:
గ్రూపులలో E-filing 2023-24 కు మొదలు అయ్యింది, మీ ఈ ఫైలింగ్ కూడా తొందరగా చేసుకోండి అని మెసేజ్ లు వస్తున్నాయి.

♻️దీనికి సంబంధించి వివరణ :
AY 2023-24 కు సంబంధించి ఉద్యోగులు ఐటీఆర్-1 లో సాధారణంగా తమ ఈ ఫైలింగ్ చేయాలి

అయితే దాని కన్నా ముందు మన వద్ద నుండి, డీడీవో గారు మన జీతం నుండి మినహాయించిన టాక్స్ కు సంబంధించి, ఆర్ధిక సంవత్సర 4 వ క్వార్టర్ టీడీస్ పూర్తి చేసి ఉండాలి.
డీడీవో గారు ఈ 4 వ క్వార్టర్ టీడీస్ పూర్తి చేయకుండా మనం ఈ ఫైలింగ్ చేయలేము. టీడీస్ లు ఇంకా ప్రాసెస్ అవుతున్నాయి

Join Your Friends to Our Whatsapp Group
Send them this Link
https://chat.whatsapp.com/HTiDDllxChB1THiRVz0oQ6

టాక్స్ పరిధిలోకి రాని (అడ్వాన్స్ టాక్స్ కూడా లేకపోతే) ఉద్యోగులు మాత్రం తమ ఈ ఫైలింగ్ మొదలు పెట్టవచ్చు.
కాబట్టి టాక్స్ పరిధిలో కి వచ్చే ఉద్యోగులు / అడ్వాన్స్ టాక్స్ కట్టిన ఉద్యోగులు, డీడీవో గారు 4 వ క్వార్టర్ టీడీస్ పూర్తి అయ్యి, ఆ అమౌంట్ మన ఫామ్ 26AS లో వచ్చిన తరువాత మాత్రమే ఈ ఫైలింగ్ చేసుకోగలరు.
♻️AP Schools Summer Holidays from 1st May to 11th June 2023.
👉Last Working Day 30th April 2023
👇
https://www.apteachers.in/2023/04/ap-schools-summer-holidays-2023-from.html



♻️గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్.. పూర్తి వార్త.
👇
https://www.gsws.info/2023/04/ap-gsws-transfers-2023-news-transfers.html
నల్లబ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన✍️📚

🌻ఈనాడు, అమరావతి: కొందరు ఉపాధ్యాయులు, అధికారులను అక్రమంగా సస్పెండ్ చేశారంటూ ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య, రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాల ఫోరం మంగళవారం ఆందోళన చేపట్టింది. పదో తరగతి మూల్యాంకన కేంద్రాలు, పాఠశాలల వద్ద ప్లకార్డులతో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. పాలకుల పాపాలకు ఉపాధ్యాయులు బలి పశువులా? తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలు మానుకోవాలంటూ నినాదాలు చేశారు. పాఠశాలల్లో అధ్వాన వాతావరణం సృష్టించి, మనోవేదనకు గురి చేయడం సరికాదన్నారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ పథకాల ప్రచారకులా అని ప్రశ్నించారు. బుధవారం మూల్యాంకన కేంద్రాల వద్ద నిరసనలు, జిల్లా, తాలూకా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఆందోళనలకు మద్దతు తెలిపారు.
డీఎస్సీ-98 రెండో విడత కౌన్సెలింగ్లో 221 పోస్టులు✍️📚

♦️ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ

🌻ఈనాడు, అమరావతి: డీఎస్సీ- 98 మొదటి విడత కౌన్సెలింగ్లో మిగిలిపోయిన 221 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మెరిట్ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా 4,072 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా మొదటి విడత కౌన్సెలింగ్లో 3,832 భర్తీ అయ్యాయి. విశాఖపట్నంలో అత్యధికంగా 30 ఖాళీలు ఉండగా.. విజయనగరంలో అభ్యర్థులందరూ ఉద్యోగాల్లో చేరిపోయారు
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్✍️📚

♦️మే 15 నాటికి ప్రక్రియ పూర్తి

♦️రెండేళ్ల సర్వీస్‌ తప్పనిసరి !

🌻ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. బదిలీల ప్రక్రియను ప్రారంభించి వెంటనే చేపట్టాలని సిఎంఒ నుంచి సంబంధిత అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ఉన్నతాధికారులు ప్రాథమిక కసరత్తును మంగళవారం ప్రారంభించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బదిలీల ప్రక్రియను మే 15 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు విధి విధానాలు రూపొందిస్తున్నారు. బదిలీలు పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా మూడు వెబ్‌పోర్టల్‌ ద్వారా మూడు ఆప్షన్లను అధికారులు తెరమీదకు తేనున్నట్లు సమాచారం. బదిలీలు కావాల్సిన ఉద్యోగులు తప్పనిసరిగా వెబ్‌పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బదిలీలకు మొదటి ప్రాధాన్యతగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ తరచూ ఆస్పత్రులు సందర్శిస్తున్నవారు కాగా, రెండో ప్రాధాన్యతగా పరస్పర బదిలీలు (మ్యూచువల్‌) కోరుతున్నవారు ఇందులో ముఖ్యంగా భార్యాభర్తలు చెరొక ప్రాంతంలో పనిచేస్తున్న వారై ఉండాలి. ఇద్దరు కూడా ఒకే జిల్లా పరిధిలో పనిచేస్తుండాలనే నిబంధన కింద బదిలీలు చేపట్టనున్నట్లు తెలిసింది. మూడో ఆప్షన్‌ కింద సాధారణ బదిలీలను ఖాళీలను బట్టి చేపట్టేందుకు వీలుగా ఆఫ్షన్లను వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు సమాచారం.
అంతర్‌ జిల్లాల బదిలీల ప్రక్రియ కూడా మే నెలలో చేపట్టే బదిలీల్లో ఉంటుందా? లేక ఆయా బదిలీలకు కూడా ప్రభుత్వం పచ్చజెండా ఊపుతుందా? లేదా అనే అంశంపై ప్రభుత్వ వర్గాల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ అంతర్‌ జిల్లాల బదిలీలు చేపట్టాల్సి వస్తే భార్యాభర్తలు ఒకేచోట ఉండేందుకు వీలుగా ప్రక్రియను చేపట్టవచ్చని తెలుస్తోంది. బదిలీల్లో మొదటి విడతలో ప్రొబేషన్‌ డిక్లేర్‌ అయిన ఉద్యోగులకు మాత్రమే స్థానం ఉంటుందా? లేక తాజాగా ఇటీవల ప్రొబేషన్‌ డిక్లేర్‌ అయిన ఉద్యోగులను కూడా బదిలీల జాబితాలో చేరుస్తారా? లేదా అనే అంశంపై మరికొంత స్పష్టత రావాల్సి ఉంది. రెండేళ్లు పూర్తి చేసుకున్న వారికి బదిలీలు ఉండొచ్చని తెలుస్తోంది. బదిలీల అంశంపై గ్రామ, వార్డు సచివాలయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజరుజైన్‌కు ఎపి ఎన్‌జిఒ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కెవి శివారెడ్డి, రాష్ట్ర సహ అధ్యక్షులు సిహెచ్‌ పురుషోత్తమనాయుడు, గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్‌డి జానిపాషా మంగళవారం వినతిపత్రం సమర్పించారు.
పర్మినెంట్‌ చేయాల్సిందే✍️📚

♦️రాష్ట్ర వ్యాప్తంగా కదం తొక్కిన కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు

♦️ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి

♦️28న విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం : ఎపి జెఎసి రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు

🌻ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : తమను పర్మినెంట్‌ చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా కదంతొక్కారు. కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించారు. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఎపి జెఎసి అమరావతి ఆధ్వర్యాన ఈ కార్యక్రమం చేపట్టారు. సిఐటియు, ఎఐటియుసి, సిపిఎం, సిపిఐ నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. కాకినాడలో ధర్నా చౌక్‌ వద్ద ధర్నాలో ఎపి జెఎసి అమరావతి రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. ఎన్నికల సమయంలో జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను గద్దెనెక్కాక విస్మరించారన్నారు. వీటి అమలుకు పోరాడుతుంటే ప్రభుత్వం అణచివేత ధోరణి ప్రదర్శిస్తోందని విమర్శించారు. రెగ్యులర్‌, సిపిఎస్‌, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌, కంటింజెంట్‌, టైమ్‌ స్కేల్‌, రోజువారీ వేతన జీవులు, ఉపాధ్యాయులు, కార్మికులు, స్కీమ్‌ వర్కర్లు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదన్నారు. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై ఈ నెల 28న విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్‌, సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దువ్వా శేషబాబ్జి, సిహెచ్‌ రాజకుమార్‌ మాట్లాడుతూ ఐక్య ఉద్యమాల ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఈ ధర్నాకు సిపిఎం, సిపిఐ మద్దతు తెలిపాయి. తిరుపతి కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి పాల్గొని మద్దతు తెలిపారు. ఉద్యోగులకు 12వ పిఆర్‌సిని తక్షణం నియమించాలని డిమాండ్‌ చేశారు. విజయనగరం, ఏలూరు, భీమవరం, గుంటూరు, పల్నాడు, కడప, నంద్యాల, ఒంగోలు, విశాఖ, అనకాపల్లి కలెక్టరేట్ల వద్ద, కర్నూలులో ధర్నా చౌక్‌ వద్ద, శ్రీకాకుళంలో రెవెన్యూ అతిథి గృహం వద్ద కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు.
బైజూస్ విద్యావిధానంపై విచారణ జరిపించాలి✍️📚

🌻అమరావతి,ఆంధ్రప్రభ: రాష్ట్ర విద్యాశాఖ పరిస్థితి దారుణంగా తయారైందని, ప్రవీణ్ ప్రకాశ్ వంటి అధికారులతో విద్యారంగ ప్రమాణాలు దిగజారుతున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మండి పడ్డారు. కేంద్రప్రభుత్వం తీసుకొ చ్చిన నూతనవిద్యా విధానం (ఎన్.ఈ.పీ) బీజేపీ పాలితరాష్ట్రాలే అమలుచేయ డంలేదని, అయితే ఏపీప్రభుత్వం పనిగట్టుకొని దాన్ని హడావుడిగా ప్రారంభించడం, 8వతరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం, సీ.బీ.ఎస్.ఈ సిలబస్ ప్రవేశపెట్టడం ఎంతమాత్రం సరైనవిధానం కాదన్నారు. మంగళగిరిలోని టీడీపి కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రవీణ్ ప్రకాశ్ ను విద్యాశాఖలో నియమించడం వల్ల ఆ శాఖకు కొత్త తలనొప్పులు వచ్చాయని విమర్శించారు. ప్రవీణ్ ప్రకాశ్ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయడం, విద్యార్థులకు అందుతున్న విద్యను పరిశీలించడం మంచిదే కానీ ఎం.ఈ.వోలు, డీ.ఈ.వోలు, టీచర్లను సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగావ్యతిరేకి స్తున్నామన్నారు. ఆఖరికి బదిలీపై వెళ్లినవారిని కూడా అకారణంగా సస్పెండ్ చేశారని, బాధ్యత లేకపోతే ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేయమా అంటూ ప్రవీణ్ ప్రకాశ్ ను సమర్థించేలా మాట్లాడుతున్న మంత్రి బొత్స సకాలంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించలేకపోవడంపై ఎవరిని సస్పెండ్ చేస్తారో సమాధానం చెప్పాలన్నారు. ప్రవీణ్ ప్రకాశ్ ను తక్షణమే విద్యాశాఖ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. అలాగే బైజూస్ విద్యావిధానంపై సిట్టింగ్ జడ్జితో విచారణజరిపించాలని డిమాండ్ చేశారు.