Sajeeva Vahini
1.48K subscribers
2.48K photos
4 videos
9 files
3.18K links
3000+ telugu christian devotions, sermons and many more. Subscribe today!

The Official Channel of Sajeeva Vahini
Download Telegram
నీవు ప్రార్థన చేయునపుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్య మందున్న నీతండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్య మందు 'చూచు' నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును.
మత్తయి 6:6

రహస్య ప్రార్థన లో దేవుడు నీ ప్రార్థన వింటాడు అని వ్రాయబడలేదు. 'చూస్తాడట'.
ఏమి చూస్తాడు? నీ హృదయాన్ని చూస్తాడు. మన ప్రతీ పాపము ప్రభు పాద సన్నిధిలో ఒప్పుకున్నామో లేక కప్పుకున్నామో?అని. కప్పుకుంటే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ఒప్పుకుంటే తప్పేముంది? మన జీవితం అంతా ఆయనకు తెలుసు.

దావీదు అంటున్నాడు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపుపుట్టకముందే నీవు నామనస్సు గ్రహించుచున్నావు నీ ఆత్మ యొద్దనుండి నేనెక్కడకు పొవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును.? కీర్తన 139:2,7.

వ్యక్తిగత జీవితంలో ప్రతీరోజు బిజీగా గజిబిజీగా ఉన్నప్పుడు మనలోని పాపములను అపవాది జ్ఞాపకము చేసి కృంగదీస్తూ ప్రార్ధనకు దూరం చేస్తాడు. రహస్య ప్రార్ధన వలన దేవుని సహవాసంలో అనుభవం రెట్టింపై, విశ్వాసములో మరింత బలము పొందగలము.

అనుదినం దేవునితో వ్యక్తిగతంగా గడపగలిగే రహస్య ప్రార్థన మన జీవితం లో వుండాలి. ఎందుకంటే, మానవుని మహత్తర సాహసయాత్ర ప్రార్ధన. దేవుడు పరిశుద్ధుల హస్తాల్లో ఉంచిన మహత్తర శక్తి ప్రార్ధన. పార్ధించక నష్టపోయేవారు అనేకులున్నారు గాని ప్రార్థించి నష్టపోయినవారులేరు.

ప్రార్ధించు! ప్రతిఫలాన్ని అనుభవించు!

Bible Verses on Prayer (ప్రార్ధన గూర్చి మరిన్ని వివరాలు):
http://bit.ly/30DQ7wR
నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు. యోహాను 15:4

° ఒక్కసారి ఆయన కొఱకు మనల్ని మనము ప్రత్యేకపరచుకొని పరిశుద్ధముగా జీవించుచున్నప్పుడు మనము ఆయనలో నిలిచియుండడం నేర్చుకుంటాము.

° మనము ఆయనయందు నిలిచినప్పుడు మన జీవితాలు ఫలించడం మొదలవుతాయి.

° అనుదిన ప్రార్థన ద్వారా దేవునితో సమయమును గడుపుతున్నప్పుడు అయనలో ఫలించడమే కాకుండా, మనుష్యులు మనలను మార్పు లేదా రూపాంతరం చెందినవారిగా గుర్తిస్తారు.

° మన జీవితాల్లో అధికమైన ప్రేమ, సంతోషము, సమాధానమును పొందగలుగుతాము. తోటివారిపట్ల ఓర్మిని కలిగియుండగలము, మరియు బలమైన విశ్వాసమును కలిగియుండి వారికి మేలు చేయగలము.

° గనుక అనుదినం మన జీవితాలు ఆయనయందు నిలిచి ఫలించే అనుభవం పొంది పరిశుద్ధముగా జీవించుటకు ప్రయత్నించాలి.

SajeevaVahini.com
అప్పుడప్పుడూ అనిపిస్తూవుంటుంది మనిషి ఆనందమార్గాలు అన్వేషిస్తూ ఆనందానికి నిర్వచనాన్ని మరచిపోయాడేమోనని. అసలు ఆనందాన్ని వెదకాల్సిన అవసరం ఎప్పుడు మొదలయ్యింది? ఏదైనా పోగొట్టుకుంటే కదా వెదకాల్సిన అవసరం. ఏదో పోగొట్టుకొన్న మనిషి వెదకుతూ వెదకుతూ విబిన్న వైరుద్యాల నడుమ యిరుక్కుపోయాడు. తనను వెతుక్కుంటున్న అనేకానేక అంశాలలో ఆనందం ఒకటి. తనకు తాను నిర్మించుకుంటున్న పరిథుల్ని తానే వుల్లంగిస్తూ, సరికొత్త ద్వారాల్ని తెరచుకుంటూ తాను మొదలయ్యిన మార్గాన్ని మరచిపోతున్నాడు.

ఆనందం శారీరకమా? ఆత్మీయమా? అనే సందేహాలతో సంఘర్షిస్తూనే వున్నాడు.

ఆనందాన్ని గురించిన తలంపు నాలో కల్గినప్పుడు బైబిలులోని ఎజ్రా, నెహెమ్యాలు గుర్తుకొచ్చారు. భారత స్వాతంత్ర పోరాటాలమధ్య రాజ్యాంగాన్ని క్రోడీకరించుకున్న సందర్భాలు మనసులో మెదిలాయి. రెండూ వేర్వేరు కాలాలలో అయినా రెండు సందర్భాలలో జరిగిన ఒకే అంశం పదే పదే నన్ను అలోచింపచేస్తుంది. ఆది జాతి జీవన ప్రమాణాల ప్రణాళికా పునఃనిర్మాణం. అవును! ఇప్పుడు మనం పునఃనిర్మించుకోవల్సిన వాటిలో ఆనందం ఒకటి.

అంతేకాదు, స్వతంత్ర భారతావనిని నిర్మించడానికి ఆధారమైన విలువలే అఖండ ఘణతంత్ర భారతానికి ఆయువుపట్టై దేశ ప్రజల సార్వభౌమాధికారాన్ని కాపాడుతున్నాయి.

దేశమా! కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందుతూ.. మన విలువలను మనం కాపాడుకుంటూ.. ఆశతో మన రాజు యేసుకై ఎదురు చూడుము...

యోవేలు 2:21 దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్పకార్యములు చేసెను.

Happy 71st Indian Republic Day.
SajeevaVahini.com, India.
నా సన్నిధి నీకు తోడుగా వచ్చును.
నిర్గమకాండము 33:14

- మనము క్రీస్తును వెంబండించినట్లయితే అనుదినమూ ఆయన సన్నిధి మనకు తోడైయుంటుంది.

- మనము ఆయన ఆత్మతో నింపబడి అపరిమితమైన పరిశుద్ధాత్మ శక్తిని పొందగలుగుతాము.

- నీ చుట్టూ అంతయూ చీకటి కమ్మినా దేవుని వైపు దృష్టి సారించుము. ఆయన యొక్క శక్తిపై ఆనుకొనుము.

- అనుదినం తలపెట్టే ప్రతీ పనిని ప్రార్ధనతో ప్రారంభించి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉందని విశ్వసిస్తూ అడుగులు ముందుకు వేద్దాం.

ప్రార్థన:
పరలోక తండ్రి!!! నా జీవితంలో ప్రతీ విషయములో ఎప్పుడూ నాకు తోడైయుంటానని వాగ్దానము చేసిన దేవా నన్ను నీయందు బలపరచి నీ సన్నిధి నాతో ఉంచి నడిపించుము. ఆమేన్.

SajeevaVahini.com
దేవునిలో నీ ఆనందమును వెదకుము.

యెహోవాయందు ఆనందించుటవలన మీరు బల మొందుదురు. నెహెమ్యా 8:10

శమల ఒత్తిడిలో ఉన్నప్పుడు మన ఆనందాన్ని సజీవముగా ఉంచుకోవడం ఎంతో అవసరం. ఒత్తిడి భారం పెరిగినప్పుడు మనం మాట్లాడే ప్రతీ మాట విషయమై జాగరూకులమై ఉండాలి. సరికాని విషయాల మీద ఎక్కువగా గురిపెడితే నిరుత్సాహము చెంది బలహీనులము కాగలము.

ఏం జరుగుతుందో గ్రహించిన వెంటనే దేవుని వైపు మన శ్రమలను ఎదుర్కొనే బలమును దయచేయుమని ప్రార్థించాలి.

నిత్యుడైన దేవుడు మనతో ఉన్నాడని విశ్వసించినప్పుడు శ్రమలకింకా తావేలేదు కదా!

కాబట్టి, క్రీస్తులో సంతోషాన్ని పొందుతూ, మన ఆనందాన్ని ఆయన ప్రేమలో వెదుకుతూ, బలము పొందుటకు ప్రయత్నిద్దాం.

ప్రార్థన:
పరలోక తండ్రి!!! నా శ్రమలలో కలతపడకుండా నీవైపు చూచి ఆనందించేందుకు సహాయము చేయము ఆమేన్.

సజీవ వహిని లో ఇప్పుడు విషయసూచిక:
http://bit.ly/2O5ZRep
యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవావానికి ఆశ్రయముగా ఉండును. యిర్మియా 17:7

ఈ లోకయాత్రాలో నే సాగుచుండ ఒకసారి నువ్వు ఒకసారి ఏడ్పు అయిననూ యేసుక్రీస్తు నా తోడై ఉండును అని భక్తులు చెప్పిన రీతిగా ఒక్కోసారి కష్టాలు, నష్టాలు మన జీవితాన్ని కుదిపేస్తుంటాయి.

మన జీవితంలో భంగపాటు, కృంగుదలల ద్వారా అపవాది మనలను నిర్వీర్యం చేయడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటాడు.

నిజానికి, దేవుని నమ్ముకుని ఆయనతో కలిసి పనిచేయడానికి మనం ఇష్టపడినట్లయితే దేవుడు మన ద్వారా అద్భుతాలు చేస్తాడు. మనము సంతోషకరమైన సాఫల్యం కలిగిన ప్రభావవంతమైన జీవితాన్ని జీవించగలం.

అయితే మనం ప్రాముఖ్యమైన రెండు ప్రశ్నలను వేసుకోవాలి.
1. మనం ఏమి నమ్ముతున్నాం.
2. మనం నమ్మిన దానిని ఏవిధంగా ఆచరిస్తున్నాం.

కొన్నిసార్లు మనం ఒకటి నమ్ముతాం, వేరొకటి చేస్తాం.

రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, రక్షకుడైన యేసుక్రీస్తును నమ్ముతున్నాం; లోకాన్ని వెంబడిస్తాం, వాడి ఉచ్చులో పడతాం.

ఆయన మనలను "నమ్మికమాత్రముంచుము" లూకా 8:49 అని చెబుతున్నారు.

నమ్మువానికి సమస్తను సాధ్యమే. మార్కు 9: 23

ప్రార్థన: దేవా నిన్ను నమ్ముకొని ఉన్నాను, నన్ను ధన్యుణ్ని చేయి. దేవా నాకు ఆశ్రయముగా ఉండును. శ్రమలను జయించే శక్తినివ్వు.

SajeevaVahini.com
విజేతలుగా ఎవరు నిలుస్తారు?

ప్రత్యర్థి లేక ప్రత్యర్థులతో తలపడినప్పుడు ఉత్తమమైన ప్రదర్శన, నైపుణ్యము, ఆవిష్కరణ, బలము చూపగలిగినవారిని విజేతలని అంటుంటాము.

మన ప్రత్యర్థి తను విజేతగా నిలవడానికి మనలను ఓడించడానికి ఏదేను వనంలో ప్రవేశించి, మోసపూరితమైన మాటలతో హహవ్వను నమ్మించి అప్పటివరకు వున్న మహిమను కోల్పోయేటట్టు చేసాడు. తద్వారా దేవుని సాన్నిహిత్యాన్ని పోగొట్టి శాపానికి గురిచేసి మరణాన్ని కలుగచేయుటద్వారా విజేతనయ్యానని విర్రవీగుతున్నాడు.

ఏదేనువనంలో ప్రారంభమైన పోరాటము కల్వరి కొండవరకు సాగింది. అయితే మరణమును గెలిచి పునఃరుత్థానము ద్వారా యేసు విజేతగా నిలిచాడు.

అంతేకాక తన్ను ఎందరు అంగీకరిస్తారో వారందరికి దేవుని పిల్లలగుటకు అధికారము నిస్తానని వాగ్దానమిచ్చాడు. ఆ అధికారానన్ని యేసు ఓడించిన శత్రువును మన కాళ్ళక్రిందుంచడానికి వినియోగించాలంటాడు. (రోమా 16:20).

మన కాళ్ళక్రిందనున్న ప్రత్యర్థి ఎదోలా మోసగించి, ఏమార్చి తిరిగి మన జీవితాలపై విజయం సాధించాలని ప్రయతత్నిస్తునే ఉంటాడు. అందుకోసం తన శక్తియుక్తులన్నిటిని ఉపయోగిస్తాడు.

అనుక్షణం మనలను ఓడించడానికి ప్రయత్నిస్తూ ఉండే అపవాదిని మన కాళ్ళక్రింద ఉంచడానికి దేవుని శక్తియుక్తులన్నిటిని ఉపయోగిద్దాం!

Instagram.com/sajeevavahini
యేసుని వెంబడించుట!

యేసు..
మన జీవనయాత్రలో, నడిచేదారిలో స్నేహితుడు.
మనము ఎక్కడికి వెళ్ళాలో తెలియజేస్తాడు.
మనమెళ్ళవలసిన చోటుకు ఎలా చేరుకోగలము చూపిస్తాడు.
తనతో రమ్మని ఆయన పిలుస్తున్నాడు.

మనము ఆయన మాట వింటున్నామా?
ఆయనను వెంబడిస్తున్నామా?

మత్తయి 4:17 యేసు - పరలోకరాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.

మన తలంపులు మరియు ప్రార్ధన ఈ విధంగా ఉండాలి:
- మార్గమైయున్న యేసయ్యా, రాబోయే నీ రాజ్యాన్ని గుర్తించడానికి నాకు దృష్టినివ్వండి.
- మీరు ఇచ్చిన సమృద్ధియైన జీవాన్ని స్వీకరించడానికి నా హృదయం సిద్ధం చేయండి.
- మీ పిలుపు అనుసరించడానికి నా అడుగు సిద్ధపర్చండి.
- సిద్ధ మనస్సు దయచేయండి.

ఆమేన్.

SajeevaVahini.com