Sajeeva Vahini
1.47K subscribers
2.53K photos
4 videos
9 files
3.2K links
3000+ telugu christian devotions, sermons and many more. Subscribe today!

The Official Channel of Sajeeva Vahini
Download Telegram
దేవుని దీవెనెలన్నిటిని జ్ఞాపకము చేసికొనుము:


~ దేవుడు ఈ సంవత్సరమంతా మన జీవితాల్లో నెరవేర్చిన వాగ్దానములను బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసే ఆశీర్వాద సమయమే క్రిస్మస్ మాసము. దేవుడు మనకు ఎటువంటి మేలులు చేకూర్చాడో తలచుకొని ఆయనను స్తుతించడం ఎంతో గొప్ప ధన్యత. లెక్కింపశక్యమైన దీవెనలను పొందుతూ ఇతరులకు కూడా దీవెనకరముగా ఉండుటకు ప్రయత్నిద్దాం.


ధ్యానించు:
ఆదికాండము 12:2- “నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.”

ప్రార్థన:
పరలోకమందున్న తండ్రి!!! నీవు నాకు ఇచ్చిన దీవెనలను బట్టి నీకు వందనములు. నన్ను తోటివారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదంగా ఉండుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.

Read ఆదికాండము 12:
bit.ly/2DVPswa
నీవు సంపాద్యమై ఉన్నావు:

~ ఈ క్రిస్మస్ మాసములో మనము దేవుని దృష్టికి ఎంత ముఖ్యమైనవారమో, మన గురించి ఆయన తన అద్వితీయ కుమారుని ఎందుకు పంపెనో మనము జ్ఞాపకము చేసుకోవాలి. నీవెవరివైనా, ఎలా ఉన్నా, ఏ ప్రదేశానికి చెందినా నీవు దేవుని సంపాద్యమైయున్నావు. ఈ సత్యము నిన్ను బలపరచునుగాక.

ధ్యానించు:
నిర్గమకాండము 19:5- “మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు.

ప్రార్థన:
ప్రియ పరలోకతండ్రి!!! నేను నీ సంపాద్యమైయున్నానను సంగతి నాకు జ్ఞాపకము చేసినందుకు మా వందనములు సమర్పించుకొనుచున్నాము, ఆమేన్.

Read నిర్గమకాండము 19 Telugu and English Amplified Bible Online: http://bit.ly/2YwB3A8
మొదటి ప్రార్ధనా పరిచర్య – “యుద్దము చేసిన వారికెంత ప్రతిఫలమో సామానుకాచిన వారికి అంతే ఫలమన్నాడు” దావీదు రాజు. అన్నా అనే ప్రవక్తి 84 ఏండ్లు వృద్ధురాలైయుండి కూడా దివారాత్రులు దేవాలయంలో ఉపవాస ప్రార్ధనలు చేసింది. ఇది చాలా గొప్ప పరిచర్య. మార్కు తల్లియైన మరియ ఇంటిలో జరిగిన ప్రార్ధనలనుబట్టి, పేతురు చెరసాలనుండి విడిపించబడ్డాడు. ఆనాడు ప్రార్ధించిన స్త్రీలను, ముఖ్యంగా పేతురు స్వరాన్నే గుర్తుపట్టగలిగిన రోదె అను చిన్నదాన్ని ఎలా మరువగలము? ఇది స్త్రీలతో చేయబడిన ప్రార్ధనా పరిచర్య. ప్రార్ధనాశక్తి అనంతమైనది, అపారమైనది.

ప్రార్ధన: దేవా, నేను కూడా ఇటువంటి ప్రార్ధనాశక్తి కలిగి నీ స్సన్నిధిలో గొప్ప విజమును పొంది, నీ పరిచర్య చేయుటకు కృపను దయజేయుము. ఆమేన్.
తలాంతుల పరిచర్య – తనకున్న టాలెంట్స్ పది మందికి పంచిన స్త్రీ దోర్కా, ఈ పేరునకు అర్ధం “లేడి”. స్త్రిలందరిలో ఈమె ఒక్కతే “శిశ్యురాలు” అనబడింది. ఆమెకున్నఒనరులు సూది దారం కాబట్టి వీటితోనే దొర్కా అంగీలు వస్త్రాలు కుట్టి, అనేకులకు సాయపడి ఘనతనొందింది . సత్క్రియలయందు ఆశక్తిగల ప్రజలను తనకోసం పవిత్రపరచుకొని ప్రభువు తనసోత్తుగా చేసుకుంటాడు. తన తలాంతులను దీన జనులకు పంచిన దొర్కాను మరువకూడదు. కృపావరములు నానా విధములు, అలాగే పరిచర్యలు కూడా నానావిధములని బైబిల్ సెలవిస్తోంది. వీటిని పాతిపెట్టక, వినియోగిస్తూ ఉండాలి. వివేచనా అనే వరాన్నివాడినట్లయితే, మన స్వంత కుటుంబాన్నేకాక సంఘాన్ని, సమాజాన్ని కూడా అభివృధిపదంలో నడిపించవచ్చు. తలాంతులను దాచిపెట్టి తీసుకునే విశ్రాంతి చావుతో సమానమని అంటారు పెద్దలు. తాలాంతులను వాడిన దొర్కా ఎంత ధన్యురాలు. మనకున్న తలాంతులను దేవునికొరకు వాడితే ఎంతో ఆశీర్వాదం.
నీ ఆత్మీయ విలువ చాలా ప్రాముఖ్యమైనది:

✓ క్రిస్మస్ నీ యొక్క ఆత్మీయస్థితికి గురుతు.

✓ దేవుడు నిన్ను గురించి లోకము ఏమనుకుంటుందో పట్టించుకోకుండా నీ యొక్క ఆత్మీయ స్థితిని మాత్రమే చూస్తాడు.

✓ నీవు క్రీస్తు కొఱకు తెగించి జీవించాలనుకుంటే అది సులువు ఏమాత్రమూ కాదు. కానీ అది చాలా విలువైనది. ఎవ్వరినీ లక్ష్యపెట్టకుండా ఆయనకు మనము లోబడాలి.

✓ నీ ప్రస్తుత పరిస్థితులను చూడక నీ యొక్క విధేయతను బట్టి ఆయన చేయు అద్భుతకార్యములయందు విశ్వాసముంచుము. ఎందుకనగా దేవునితో సమస్తమూ సాధ్యమే.

✓ నీ యొక్క విధేయతను బట్టి నీవు దీవెనలను పొందడానికి ముందే ఆయనను స్తుతించుము. అది నీ ఆత్మీయ స్థితిని తెలియజేస్తుంది.

✓ధ్యానించు:
లూకా 1:37- “దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థ కము కానేరదని ఆమెతో చెప్పెను.”

ప్రార్థన:
ప్రియ పరలోకతండ్రి!!! విచారపడక నీయందు దృష్టించుటకు నీకు లోబడి జీవించుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.

Read లూకా 1 online:
http://bit.ly/2EdHrTA
దేవుడు సమస్తము చూచును:

మన జీవితాలపై దేవుని పిలుపును నెరవేర్చడం, వ్యక్తిగతంగా మనము సాధించాము అని కాదు గాని. ఆ పిలుపు పట్ల విధేయత కనుపరచడమే.

మనము చేసే కార్యములు ఎవరూ చూడకపోయినా దేవుడు దానిని గమనిస్తూనే ఉంటాడు. నిజంగా, గుర్తింపు లేకుండా ఏదైనా చేయాలంటే బాధగానే ఉన్నా, దేవునినుండి ప్రతిఫలము పొందగలము అనే నిరీక్షణకలికి విధేయతతో పరిచర్య చేయడమే దేవుని ఉద్దేశము.

ధ్యానించు:
సామెతలు 15:3- “యెహోవా కన్నులు ప్రతి స్థలముమీదనుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును.”

ప్రార్థన:
ప్రియ పరలోకతండ్రి!!! ఈ లోకాశలను జయించి నీయందు నా గురిని నిలుపుటకు సహాయము చేయుమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి ఆమేన్.

Read సామెతలు 15:
http://bit.ly/2snKExa