నమస్కారం
నమస్కారం భారతీయ సంస్కారం. కరచాలనం పాశ్చాత్యుల మర్యాద. నమస్కారం, ప్రణామం, వందనం- ఒకే చర్యను సూచించే పదాలు. నమః అంటే నమస్కారం. నమనం అంటే వంగడమని అర్థం. వంగి చేసేది నమస్కారం. నమస్కారం చేస్తూ పలికేమాట ‘నమో నమః’.
దైనందిన జీవితంలో యథాలాపంగా నమస్కారం పదం ఉపయోగిస్తున్నాం. దీనికి చాలా ఆధ్యాత్మిక వైశిష్ట్యం ఉంది. నమః అంటే త్యాగమని వాచ్యార్థం. ‘నేను అల్పుడిని, నీవు గొప్పవాడివి’ అనే దాస్యభావానికి సూచనగా ఈ పదం వాడుతున్నారని పండితులు భావిస్తున్నారు. ఇది ప్రధానంగా దైవసంబంధమైన విషయాలకు వర్తిస్తుంది. నమస్కారం తారక మంత్రం లాంటిదంటారు పెద్దలు. ఎవరినైనా ప్రసన్నం చేసుకోవడానికి చేసే నమస్కారాన్ని నమస్కార బాణంగా పేర్కొంటారు. భీష్ముడు తన గురువు పరశురాముడితో యుద్ధం చేసిన సందర్భంలో ముందుగా నమస్కార బాణం ప్రయోగించాడు. ఆ బాణం గురువు పాదాల వద్ద వాలింది. అదే విధంగా అర్జునుడు భీష్ముడికీ నమస్కార బాణం వేశాడు.
నమస్కారం మూడు విధాలు- కాయకం, వాచకం, మానసికం. కాయమంటే శరీరం. రెండు చేతులు జోడించి నమస్కరించడం కాయకం. పెద్దలు ఎదురైనప్పుడు ఈ పద్ధతిలో నమస్కరిస్తాం. ఆధ్యాత్మికంగా అష్టాంగ నమస్కారం పరమోత్తమం. శిరస్సు, రెండు భుజాలు, వక్షస్థలం, రెండు మోకాళ్లు, రెండు పాదాల వేళ్లు నేలకు ఆనేలా సాగిలపడటం. దేవతావిగ్రహాలకు, పీఠాధిపతులకు, సన్యాసులకు, గురువులకు సాష్టాంగ నమస్కారం ఆచరించాలి. శిరస్సు, రెండు చేతులు, రెండు మోకాళ్లు నేలకు ఆనించడాన్ని పంచాంగ నమస్కారమంటారు. ఈ నమస్కారం స్త్రీలకు ఉత్తమమైనదని శాస్త్రవచనం. రెండు చేతులు శిరస్సుపై ఉంచి చేసే నమస్కారం త్య్రంగ(మూడు అంగాల) నమస్కారం. తల మాత్రమే వంచి చేసే నమస్కారం ఏకాంగ నమస్కారం. రెండు చేతులు వ్యత్యస్తం చేసి- అంటే మార్చిపట్టుకుని చేసే నమస్కార ప్రక్రియ కూడా ఉంది. ఆధ్యాత్మిక గురువులకు ఈ విధానంలో నమస్కరించాలి. కుడిచేతిని గురువు కుడి పాదందగ్గర, ఎడమ చేతిని ఆయన ఎడమ పాదంవద్ద ఉంచి నమస్కరించడం. చేతులను ఆ పాదాల వద్ద నిలపాలి గాని తాకకూడదు. మీ పాదపద్మాలే నాకు శరణ్యమనే భావన ఇందులో ఉంది.
లోకంలో ‘వందనం’ అనే మాట తరచుగా వింటుంటాం. ‘అభివందనం’ అనే మాట బాగా వాడుకలో ఉన్నదే. నవవిధభక్తి మార్గాల్లో ఇది ఒకటి. శిరస్సు వంచి చేసేది వందనం. రెండు చేతులూ జోడించాలి. అక్రూరుణ్ని వందన భక్తికి ఉదాహరణగా చెప్పడం పరిపాటి. ఉన్నది కంసుడి కొలువులోనైనా బలరామకృష్ణుల్ని మధురకు తీసుకువచ్చే అవకాశాన్ని అక్రూరుడు గొప్ప అదృష్టంగా భావించాడు. దారి పొడవునా చేతులు జోడించే ఉన్నాడు. కృష్ణపాద స్పర్శతో పునీతమైన బృందావనంలో పులకాంకితుడయ్యాడు. రామకృష్ణ సోదరుల్ని తన ఇంటికి వచ్చి పాదధూళితో పావనం చేయమన్నాడు. వస్త్రాపహరణ సందర్భంలో ఆపన్న శరణ్యుడైన కృష్ణుడికి ద్రౌపది వందనం చేసింది. వందనం అహంకార వినాశనానికి ప్రతీక. అహంకారం నశిస్తే జీవుడికి పరమాత్మతో సాన్నిహిత్యం కలిగి జన్మ సఫలమవుతుంది.
‘శేషశాయికి మ్రొక్కిన శిరము శిరము’ అన్నాడు పోతన. ‘వందనము రఘునందన సేతుబంధన భక్త చందన రామ’ అని త్యాగయ్య శ్రీరాముడికి వందనం అర్పించాడు. నమస్కార క్రియ మానసిక హోమం వంటిది.
నమస్కారం మొక్కుబడిగా కాక శ్రద్ధతో చేయాలి. కొందరికి నమస్కరించడానికి మనస్కరించకపోయినా, వారి ప్రాముఖ్యాన్ని బట్టి సందర్భాన్ని బట్టి గౌరవించక తప్పదు. నమ్రతతో చేసే నమస్కారమే సార్థకం.

పరిపూర్ణ జీవితం
పరిపూర్ణ జీవితం
చీమ నుంచి ఏనుగు దాకా సృష్టిలో ప్రాణులెన్నో నిత్యజీవితంలో పెను సమస్యలు ఎదుర్కొంటాయి. వాటికి సౌకర్యాలు, సౌలభ్యాలు తెలియవు. జీవితాంతం తిండి సంపాదించుకొంటూ బతకడం నరక సదృశమే.
వాన నీటికి కొట్టుకుపోయే బలహీన దేహం పిపీలికానిదైతే- ఎండ, వాన, చలి నుంచి తమ దేహాలను రక్షించుకోలేని అశక్తత భారీప్రాణులది. అవి తమకు నెలవైన అడవిలో ఉంటే వాటి స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు కొదవుండదు. అడవి వాటి సామ్రాజ్యం. మనిషి అడవులను తన అవసరాల కోసం ఆక్రమించి వ్యవసాయానికి, నివాసానికి అనువుగా మలచుకోవడం మొదలు పెట్టిన దగ్గర నుంచి, ప్రాణుల జీవితం దినదిన గండమైంది. కష్టాలు, బాధలు, భయాలు వాటికీ ఉన్నాయి. గట్టెక్కే విధానమే తెలియదు. తమ తలరాత ఇంతే అని సరిపెట్టుకునే ఇంగితజ్ఞానం ఉండదు. వాటి దయనీయ పరిస్థితిని ఒక్కసారి ఊహించుకుంటే- మానవ జన్మ ఎంత గొప్పదో అనుభవంలోకి వస్తుంది.
మన ఈతి బాధల్ని మరొకరితో చెప్పుకొని, వారి మాటలతో సాంత్వన పొందుతాం. మన అవసరాలను తెలియజేసి, తగిన వనరులను సమకూర్చుకుంటాం. ఇప్పటికే ఉన్న వ్యాధులకు మందులేసుకుంటాం. కొత్తరోగాలకు నివారణలు కనుక్కొంటాం. ప్రాజెక్టులు కట్టి, నీళ్లు నిలవ చేసుకుని భూమిపై పచ్చని పంటల తివాచీ పరుస్తాం. ఇతర గ్రహాలను నివాస యోగ్యాలుగా చేసుకునే అవకాశాలను పరిశీలిస్తాం, పరిశోధిస్తాం.
కష్టాన్ని ఎదుర్కొనే మనోబలం, నష్టాన్ని పూడ్చుకొనే చాకచక్యం మనకు ఉన్నాయి. ప్రకృతి విపత్తులను అంచనావేసే మేధ ఉంది. ఊహించని వైపరీత్యాలకు గురైనా, సంఘటితంగా ఎదుర్కొనే సామర్థ్యం ఉంది. సహాయం చేసే గుణం, ఆదుకునే హృదయ వైశాల్యం ఉన్నాయి. ఇన్ని ఉన్నా, ఇంత అద్భుతమైన మానవజీవితాన్ని అదృష్టవశాత్తు సొంతం చేసుకున్నా, ఇంకా ఏదో పొందాలన్న కాంక్ష. లేని సమస్యలు సృష్టించుకొని తల్లడిల్లిపోవడం, మానసిక శారీరక సమతౌల్యాన్ని కోల్పోవడం, కోరికలకు దాసోహమనడం, మరీచికల వెంట పరుగులు పెట్టడం, ముఖ్యంగా సంతృప్తికి దూరం కావడం... సర్వ సమర్థ జీవితాన్ని చేజార్చుకోవడమే. మన మార్గాన్ని సుగమం చేసే సనాతన ధర్మాలు, ఆచారాలు, కట్టుబాట్లు, సంస్కృతీ సంప్రదాయాలు, మహర్షుల జ్ఞానమార్గాలున్నాయి. పాత్రలతో, కథలతో సందర్భోచితంగా సందేశాన్నిచ్చే పురాణ వాంగ్మయముంది. ప్రతి దశలోనూ వెలుగుదారి చూపించే గురువులున్నారు. దారితప్పితే, సరిదిద్దే మహనీయుల ప్రవచనాలున్నాయి. ఇవే మన జీవితాన్ని నందనోద్యానవనంలో పారిజాత వృక్షాన్ని చేస్తాయి.
లోపలికి చూపు సారించకుండా, బయటి వైపున మాయామేయ ప్రపంచానికి తగ్గట్టుగా మనలో భావ సంచలనం కలుగుతున్నంతకాలం సంతోషమే తప్ప ఆనందాన్ని అనుభూతించలేం. మనలో సకారాత్మక ఆలోచనలతో మార్పు వచ్చినప్పటి నుంచి సమస్త జీవరాశి, ప్రకృతి కొత్తగా కనిపిస్తాయి. శైశవం నుంచి అవసానం వరకు మనం ఆనందంగా జీవించడమే కాదు, నలుగురికీ గంధపు చెట్టులా సువాసనలు పంచుతాం. గంగలా స్వచ్ఛమైన జలాలను అందిస్తాం. ఇంతకన్నా మానవ జన్మను సార్థకం చేసుకునే మోక్షమార్గం ఉండదు.
మన జీవితానికి గతం, భవిష్యత్తు ఉన్నాయో లేవో తెలియదు. వర్తమానం మాత్రం మన గుప్పిట్లో ఉన్న ఇసుక. ఉత్తమత్వాన్ని సిద్ధింపజేసుకొంటూ, జాగ్రత్తగా, సన్నని ధారగా, విడుస్తూ ఉండాలి. గుప్పెట్లోని ఇసుక పూర్తయ్యేసరికి పరిపూర్ణ జీవితాన్ని పొందిన కమనీయానుభూతితో అంతిమ ప్రయాణానికి సిద్ధ.ం కావాలి. పరిపూర్ణంగా పండిన పండును మాత్రమే చెట్టు నేలకు విడుస్తుంది. దానికి ముందున్న ఏ దశలోనూ నేల రాలనివ్వదు. ప్రకృతి నేర్పే పాఠంలో మనకు అన్వయించుకొని నేర్చుకోవలసిన ముఖ్యమైన అంశమిది!

నవరసభరితం నరుడి జీవితం
అద్దపునీడ అంటే అందరికీ తెలుసు. అద్దాన్ని ఎండలో పెట్టి గోడవైపు చూపిస్తే గోడమీద రకరకాల బొమ్మలు కనిపిస్తాయి, కదులుతాయి. అద్దంతీసి చూస్తే గోడమీద ఏమీఉండదు. అంతా భ్రాంతి. మానవజీవితమూ అంతే. అంతా మాయ. జగన్నాటక సూత్రధారి క్రీడలో జీవులన్నీ పావులే!
మనిషి కాలంతోపాటు ఎదుగుతాడు. ఆస్తులు సంపాదిస్తాడు. తనకంటూ నివాసం ఏర్పరచుకుని అది తన శాశ్వత నివాసమని పేర్కొంటాడు. నవ్వుతాడు. ఏడుస్తాడు. శృంగారంతో సృష్టికార్యం సాగిస్తాడు. వినోదిస్తాడు. రౌద్రం ప్రకటిస్తాడు. శాంతిమంత్రం పఠిస్తాడు. భయపడుతూంటాడు. వీరత్వం ప్రదర్శిస్తూ ఇతరులను భయపెడుతూంటాడు, భీభత్సం సృష్టిస్తూంటాడు. కరుణరసం కురిపిస్తాడు. ఎన్నో ప్రదర్శనలు... నవరసాలు అవలీలగా పోషిస్తాడు. తన పాత్ర పూర్తవగానే ప్రపంచమనే నాటకరంగం నుంచి నిష్క్రమిస్తాడు. ఏదీ శాశ్వతం కాదు. అంతా అశాశ్వతం అని గ్రహించేలోపు జరగాల్సిన తతంగం జరిగిపోతుంది.
మనిషి జీవితంలో నాలుగు అంకాలుంటాయి. ఇహలోకంలో మొదటి క్షణం నిజంగా అద్భుతమే. మొదటి శ్వాస పీల్చగానే బిడ్డ కేర్కేర్ మంటాడు. బిడ్డఏడుపు తల్లికి మధురస్వరమై మాతృహృదయం వాత్సల్యంతో ఉప్పొంగుతుంది. తండ్రిగర్వంగా ఛాతీ విరుచుకుంటాడు. నెలలు గడుస్తాయి. తల్లి చేయి పట్టుకు నడిపిస్తుంది. ఏళ్లు గడుస్తాయి. బాలుడు ఎదుగుతూ విద్యాబుద్ధులు నేర్చుకుంటాడు.
యౌవనం ఆనందమయం. భార్య, భర్త, పిల్లలతో కూడిన సంసార బంధం ఏర్పడుతుంది. కుటుంబపోషణకు ఉద్యోగమో, వ్యాపారమో చేసి డబ్బు సంపాదించక తప్పదు. దృష్టి సంపాదనవైపు మళ్లుతుంది. ఈ వయసులో నాది నాది అనే భావన బలపడుతుంది. ఈ ఘట్టంలో సుఖదుఃఖాలు, ఆనందోత్సాహాలు, కలహాలు-కలతలు, ఈర్ష్యాసూయలు మొదలైన నవరసాల ప్రదర్శన రసపట్టుకు చేరుతుంది.
మధ్యవయసు బాధ్యతల పర్వం. బంధుమిత్రులు చేరువవుతారు. మనుషుల మధ్య మమతానురాగాలు ప్రభవిల్లుతాయి. ఆవేశం అదుపులోకి వస్తుంది. నిదానమే ప్రధానమవుతుంది. ఏళ్లు గడుస్తుంటే భగవంతుడి వైపు దృష్టిమళ్లుతుంది. భగవదారాధన నిత్యకృత్యమవుతుంది. రెక్కలొచ్చి పిల్లలు ఎగిరిపోయాక దిగులు మొదలవుతుంది.
జీవిత చరమాంకంలో ఆరోగ్యం క్షీణస్తుంటే భయం మొదలవుతుంది. యౌవనతనంలో ప్రదర్శించిన ధైర్యం సన్నగిల్లుతుంది.
మరణ శయ్యపై చివరిక్షణం భయానకం. మమకారం పెంచుకున్న సన్నిహితులను, కష్టపడి సమకూర్చుకున్న ఆస్తిని వదిలి వెళ్లిపోవలసిన క్షణం దుఃఖ భరితం...
అందరి జీవితాలూ ఒకేలా నడవవు. ఒకేలా ముగియవు. మనిషి తత్వం వైవిధ్యభరితం. కష్టపడే తత్వమే విజయరహస్యం. పరమేశ్వరుడి సృష్టిలో రకరకాల పాత్రలు... ఎవరిపాత్ర వారిది... ఎవరి శక్తి సామర్థ్యాలు వారివి...
భగవంతుడు ప్రసాదించిన మేధను సక్రమంగా వినియోగించగలవారు మేధావులవుతారు. అద్భుతాలు సృష్టిస్తారు. సోమరితనంతో కాలంగడిపేవారు అనామకులుగా మిగిలిపోతారు.
తమ కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వహిస్తూ భగవంతుడి ఆరాధనలో తరించేవారు సుఖ దుఃఖాలను సమంగా స్వీకరిస్తారు. ధర్మ పథంలో పయనిస్తారు. తోటివారి మన్ననలు పొందుతారు. మరణించాక కూడా సన్నిహితుల హృదయాల్లో జీవిస్తారు.

స్థిరచిత్తం
జయాపజయాలతో సంబంధం లేకుండా మొదలుపెట్టిన పనిని పూర్తిచెయ్యాలంటారు పెద్దలు. ఆశావహ దృక్పథాన్ని పెంపొందించే సూత్రమది. జీవిత గమనంలో మనిషి ఎన్నో కార్యాలను తలపెడతాడు. పనులన్నీ సఫలం కావాలని ఆశించకపోయినా కొన్ని విజయాలనైనా రుచి చూడాలన్న కోరిక ఉండకపోదు. ఏకాగ్రత, స్థిరచిత్తం పనుల్ని సఫలం చేస్తాయి. ఆధ్యాత్మికత ఆ రెండింటినీ మనిషి వశం చేస్తుంది.
ఒక్కొక్కసారి కార్యం పూర్తయినట్లే అనిపిస్తుంది. విజయం మన ముంగిట నిలిచినట్లే తోస్తుంది. అంతలోనే అపజయం ఎదురవుతుంది. పరాజయానికి సమర్థతాలేమి కన్నా సరైన ప్రణాళిక లేకపోవడమే ఎక్కువ కారణమవుతుంది. అర్జునుడు పక్షి కనుగుడ్డుకు గురిపెట్టినప్పుడు, మత్స్యయంత్రం ఛేదనకు పూనుకొన్నప్పుడు అతడి విజయానికి కారణమయ్యింది ప్రతిభ మాత్రమే కాదు- రెప్పపాటు నిడివి సైతం తేడాలేకుండా బాణాన్ని వెయ్యాలన్న సమయానుకూలమైన నిర్ణయం.
మనసు పరిపరి విధాలైన ఆలోచనల్ని చేస్తుంది. ఏ ఒక్క ఆలోచనా కడవరకు సాగదు. ఉద్రేకపూరిత భావనలు మనసును అల్లకల్లోలం చేస్తాయి. అస్థిరమైన మనసు కార్యసాధనకు ఆటంకమవుతుంది. మనసును వశం చేసుకున్నవాడు విశ్వవిజేత అవుతాడని బుద్ధుడి మాట. విశ్వామిత్రుడు మనోస్థిరత్వాన్ని సాధించలేకపోయాడు. మేనకాధీనుడై చిరకాలం దీనుడిగా మిగిలిపోయాడు. ఊర్వశిని త్యజించిన అర్జునుడు మనసుపై విజయం సాధించాడు. విజయుడిగా స్థిరపడ్డాడు. కార్యసఫలతకు కృషి చేసే సాధకుడు మనో నిబ్బరాన్ని అలవరచుకోవాలి. సమయానుకూలంగా మనసును అధీనంలోకి తెచ్చుకోవడం కోసం ధ్యాన సాధన చేయాలి.
అహంకారం అవరోధాలకు కారణమవుతుంది. లక్ష్యసాధనకోసం పురోగమించే వ్యక్తి అహంకార రహితుడు కావాలి. అధికారం, అహంకారం, మమకారం మత్తు కన్నా ప్రమాదకరమైనవి. ‘నేను వదిలి రా, నేను కనబడతాను’ అంటాడు భగవంతుడు భక్తుడితో. తీవ్రమైన ఆటంకాల వరద ముంచేస్తున్నప్పుడు మహావృక్షంలా అహంకరించినవాడు కూకటి వేళ్లతో సహా కూలిపోతాడు. సమయానుకూలంగా గడ్డిపోచల మాదిరిగా తలదించుకు నిలిచిన వ్యక్తి ఆపదల నుంచి గట్టెక్కుతాడు. కఠినమైన టెంకాయను గుడిలో పగలగొట్టడం అహంకార నిర్మూలన చేయమన్న భక్తుడి వేడికోలుకు ప్రతీక.
మనిషి తన జీవిత కాలంలో గొప్ప కార్యాలెన్నో తలపెడతాడు. విజయం వరించినా లేకపోయినా పరాజయం మాత్రం కచ్చితంగా నిర్ధారితమై ఉంటుంది. ఓటములకు లోనై అలసట చెందిన మనిషి అంతర్గతంగా మనసు చెప్పే మాటల్ని ఆలకించాలి. పరాజయాలకు కారణాలను విశ్లేషించుకోవాలి. సమయానుకూలమైన నిర్ణయాలను స్వాగతించాలి. నరికిన మోడు నుంచి చిగురించిన పచ్చని మొక్కలా తనను తాను మలచుకోవాలి.
సాధకుడి విజయాలకు పరమార్థం వ్యక్తి ప్రగతి మాత్రమే అయి ఉండదు. సమాజ పురోగతి సైతం అందులో అంతర్లీనమై ఉంటుంది. సమాజ సహకారం, తోడ్పాటు లేనిదే ఏ వ్యక్తీ ఉన్నతుడిగా ఎదగలేడు. లక్ష్య సాధన చేసిన వ్యక్తి విజయ శిఖరాలను అందుకున్న తరుణంలో విశాల దృక్పథాన్ని ప్రదర్శించాలి. పంచభూతాలు విశ్వమంతా ఆవరించిన ప్రకృతి నేర్పే విలువైన పాఠం మనిషిని విశాలదృక్పథుడిగా మార్చడమే. భూమి అట్టడుగు పొరల్లో పడి ఉన్న నన్ను ఇంత ఎత్తుకు పెంచిన రైతుకు ఏమివ్వగలను... సమయానుకూలతను బట్టి ధాన్యరూపంలో నన్ను నేను అర్పించుకోవడం తప్ప- అనుకొని పంటసిరి మురిసిపోతుంది!

ఇంటింటి బ్రహ్మోత్సవాలు
తిరుమల క్షేత్రంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడు శ్రీకారం చుట్టిన బ్రహ్మాండ నాయకుడి అద్భుత బ్రహ్మోత్సవ వేడుకలు నేడే ఆరంభమవుతున్నాయి. ఇవి వర్షాకాలంలో వచ్చే వార్షిక ఆవిర్భావ దినోత్సవాలు. శ్రీవారికి ఏటా జరిగే సుమారు 450 సంబరాల్లో ఇవే తలమానికాలు.
శ్రీ మహావిష్ణువు కన్యా మాసంలో శ్రవణా నక్షత్రం రోజున శ్రీ వేంకటపతిగా, శ్రీ స్వయంభువు మూర్తిగా ఆవిర్భవించాడని తిరుమల స్థల పురాణం చెబుతోంది. ‘వేంకట’ శబ్దానికి ‘సమస్త పాపాలను దహించేది’ అంటూ భవిష్యోత్తర పురాణం వ్యాఖ్యానం చేసింది. శ్రీవారి జన్మదిన వేడుకలను తొలుత బ్రహ్మదేవుడు నిర్వహించాడు కాబట్టి వీటిని ‘బ్రహ్మోత్సవాలు’ అనడం పరిపాటి.
ధ్వజం అంటే జెండా! బ్రహ్మోత్సవాల ఆరంభ సూచికగా విజయకేతనం ఎగురవేయడాన్ని ‘ధ్వజారోహణం’ అంటారు. వెండివాకిలి ఎదుట ధ్వజస్తంభంపై గరుడ కేతనాన్ని ఆవిష్కరించి- విద్యాధర, సిద్ధ, సాధ్య, యక్ష, కిన్నర, కింపురుష, గంధర్వాదులను, దేవతాసమూహాలను ఉత్సవాలకు ఆహ్వానిస్తారు. గరుడోత్సవంలో ప్రత్యేక అలంకారాలు విశేష ఆకర్షణలుగా నిలుస్తాయి. ‘ఆనందనిలయం’లో మూలవిరాట్టుకు అలంకరించే లక్ష్మీహారం, మకర కంఠి, సహస్రనామ హారం సహా ఎన్నో అమూల్య వజ్రాభరణాలను మలయప్పస్వామికి గరుడోత్సవం నాడే అలంకరించి ఊరేగిస్తారు. ఇక దేవేరులతో శ్రీవారు ఠీవిగా రథంలో విహరించేది తొమ్మిదో రోజున! శ్రీ వరాహస్వామి ఆలయప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామికి అభిషేకం, సుదర్శన భగవానుడికి స్వామిపుష్కరిణిలో పవిత్రస్నానం, గరుడధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి.
గతంలో బ్రహ్మోత్సవాలకు హాజరైనప్పుడు సప్తగిరి శిఖరాలనుంచి జాలువారే సెలయేటి బిందువులన్నీ పవిత్ర తీర్థ జలాలై, మన భౌతిక మానసిక కక్ష్యలను ప్రక్షాళన చేసేవి. మాడవీధులను చుట్టుముట్టే ప్రతి గాలి తునకా అన్నమయ్య పాటమొలకై శ్రవణానందాన్ని కూర్చేది. దేహానికి బయటి, లోపలి ఆవరణలన్నింటా వినూత్న ఆధ్యాత్మిక చైతన్య విభూతి ఆవరించేది. జన్మజన్మాంతర దోషాలను సమూలంగా దహించేది. ‘అదివోఅల్లదివో శ్రీహరి వాసము, పదివేల శేషుల పడగల మయము...’ అంటూ వినసొంపుగా వినవచ్చే గానామృతం మరోవైపు ఆధ్యాత్మిక కక్ష్యను ఆప్యాయంగా అభిషేకించేది. అలా మూడు ఆవరణలు శుద్ధి అయిన మనకు తిరుమల క్షేత్ర విలక్షణ కాంతి పరివేషం- అన్నమయ్య చెప్పిన ‘సువ్రతస్థితి’ని అనుగ్రహించేది. ఆ స్థితిలో స్వామివారి దివ్య మంగళ దర్శనంతో భక్తుడి జన్మ ధన్యమైపోయేది.
తిరుమలలో బ్రహ్మోత్సవాలను తిలకించడమంటే జన్మ చరితార్థమేనని భక్తులు భావిస్తారు. కానీ ఈఏడాది మాత్రం కాలం కలిసి రాలేదు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలకు క్రమం తప్పకుండా హాజరయ్యే పరమ భక్తులకు సైతం ఈసారికి ప్రత్యక్ష ప్రసారాలను తిలకించి, పులకించి తరించవలసిన పరిస్థితి ఏర్పడింది.
స్వామి భక్తసులభుడన్న విషయం మరచిపోకూడదు. తన వద్దకు రాలేని భక్తుల కోసం శ్రీవారే దిగివచ్చి గుండెల్లో కొలువు తీరినట్లుగా భావించి దర్శించి సరిపెట్టుకోవలసిన సందర్భమిది. ఈ ఏడాది వీటిని ‘ఇంటింటి బ్రహ్మోత్సవాలు’ గాను, హృదయావిర్భావ దినోత్సవాలు గాను భావించాలి. ఈ పదిరోజులూ మన ఇల్లే తిరుమల కావాలి. మన హృదయాలు ఆనంద నిలయాలుగా మారాలి. ఆరాధనలు విలక్షణంగా సాగాలి. గుండె గుడిలో శ్రీవారిని దర్శించుకొని తృప్తిగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలి.

పురుష సూక్తం
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే పురుష సూక్తం రుగ్వేదంలోనిది. పద్దెనిమిది మంత్రాల పురుష సూక్తం శుక్ల యజుర్వేద సంహితలోను, అధర్వణ వేద సంహితలోను కనిపిస్తుంది. పురుషుడంటే ఒక్క భగవంతుడే అన్నది శిష్టాచార సంప్రదాయ భావన. ఆయన మహిమను కీర్తించే వైభవోపేత మంత్రరాజం పురుష సూక్తం. అన్ని వైదిక కర్మల్లో, పుణ్య కార్యాల్లో వేదమూర్తులైన విప్రులు ఈ మహిమాన్విత మంత్రాన్ని పఠిస్తారు.
భగవంతుడి గుణరూప వైభవాలను వర్ణించే ఈ సూక్తం ఆయన లోకాలను సృజించడంలో, ప్రపంచాన్ని ఆవిష్కృతం చేయడంలో ఎలా తనను తాను త్యాగం చేసుకున్నాడో తెలియజేస్తుంది. భగవంతుడు వేలాదిగా శిరస్సులు, కన్నులు, పాదాలు గలవాడిగా సూక్తం కీర్తిస్తుంది. వేలాదిగా అనడంలోని అంతరార్థం ఈ భూమిపైన, సమస్త లోకాలలో సమస్త జీవులకు చెందిన కన్నులు, శిరస్సులు, పాదాలని వివరిస్తారు పండితులు. సమస్త ప్రాణులూ భగవదంశేనని, వాటన్నింటిలో ఆయన దాగిఉండి సాక్షీభూతుడిగా అలరారుతున్నాడంటాయి శాస్త్రాలు. ప్రతి ప్రాణీ భగవంతుడి ప్రతిరూపమే అన్నది వేదోక్త భావన. దైవం ప్రాణుల హృదయాకాశంలో పది అంగుళాల పరిమాణంలో ప్రకాశిస్తుంటాడంటుంది సూక్తం. మన కన్నులకు అగుపించే దృశ్య జగత్తులో భగవంతుడు పావు భాగమని, మిగిలిన ముప్పాతిక భాగం ఏ మార్పునకూ లోనుకానిది ఆకాశమని తెలియజేస్తుంది పురుష సూక్తం.
భగవంతుడి నుంచి మనం త్యాగ గుణం నేర్చుకుంటాం. త్యాగం, దానం నుంచి ఆవిర్భవిస్తుంది. విశ్వంలో పరివ్యాప్తమై ఉన్న గాలిని ప్రాణవాయువుగా స్వీకరించి ప్రాణులు బొగ్గుపులుసు వాయువును విసర్జిస్తాయి. ఆహారంగా అన్నాన్ని తిని మలం విసర్జిస్తాయి. నీటితో దాహం తీర్చుకొని మూత్ర రూపంలో విడిచి పెడతాయి. అలా విడిచి పెట్టడంలో దేహావసరాలు తీరి ఆనందం లభ్యమవుతుంది. త్యాగం వల్ల అమృత సమానమైన మనసు మనిషికి సిద్ధిస్తుంది.
వ్యక్త ప్రపంచంలో గాలి, నీరు, ఇతర భూతాలతోపాటు సర్వమూ భగవంతుడే! తనను తాను ప్రాణులకు ఆహారంగా మలచుకొని పెంచి, పోషించేదీ అతడే అన్నది పురుషసూక్త భాష్యం. అన్న రూపం ధరించి దైవం జీవుల ఆకలి తీరుస్తాడు గనుక అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భాసిస్తుంది. ఈ సమస్త క్రతువు యజ్ఞరూపంగా ప్రకాశిస్తుంది. సూర్య చంద్రుల ఆగమనం, నిష్క్రమణ, రుతువుల మార్పు, ప్రాణుల చావు పుట్టుకలు... ఓ చక్ర భ్రమణంలా జరుగుతాయి.
సమస్త జీవ నిర్జీవ పదార్థాలలోనూ దైవం ప్రవేశించి పరివ్యాప్తమై ఉన్నాడంటుంది పురుషసూక్త మంత్రం.
జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, నాలుగు అంతఃకరణాలు వీటితోపాటు 21 తత్త్వాలు ప్రాణుల లోపలి ప్రకృతిని నిర్మిస్తాయి. బ్రహ్మాండాలకు అధినాయకుడైన పరబ్రహ్మమే జరుగుతుండే లోకయజ్ఞానికి సమిధలుగా, బలిపశువుగా, యజ్ఞాన్ని నిర్వహించే రుషులుగా, యజ్ఞ మంత్రాలుగా, సమస్తంగా అలరారుతున్నాడంటాయి పురుషసూక్త మంత్రాలు.
అన్ని విధాలుగా ప్రాణుల ఉనికికి కారకుడై, మనసున్న మనిషి మాత్రమే తెలుసుకోగల భగవంతుడికి మనిషి అర్పించగల కృతజ్ఞత- ఆయనను తెలుసుకొని ఆరాధించడమే. అలా తెలుసుకున్న నాడు మనిషి భవబంధాల చెరనుంచి విముక్తుడవుతాడు. దైవం త్యాగగుణాన్ని పట్టుకొని జీవజగత్తు అంతటికీ మానవుడు సేవాగుణంతో రక్షకుడుగా వ్యవహరించవలసి ఉంది. సమస్త ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత కోసం హృదయ పూర్వకంగా తన వంతు కృషి చేయడం మనిషి నిజమైన దైవారాధన అవుతుందంటారు పెద్దలు. అదే మానవుడు భగవంతుడికి అర్పించగల అసలైన నీరాజనం, కైమోడ్పు!

*దీపంలో ఉండే నవగ్రహాల అంశం:*
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
దీపపు ప్రమిద సూర్యుడు,
నూనె అంశం చంద్రుడు,
దీపం వత్తి బుద్ధుని అంశం,
వెలిగే దీపం నిప్పు కుజుని అంశం,
దీపం జ్వాలలో ఉండే పసుపు రంగు గురువు,
దీపం నీడ రాహువు,
దీపం నుంచి వెలువడే కిరణాలే శుక్రుడు( ఆశ )
దీపం వెలిగించడం వల్ల పొందే మోక్షమే కేతు
దీపం కొండెక్కిన తర్వాత మాడిన నలుపు రంగె శని
🪔🪔🪔🪔🪔🪔🪔🪔
దీపంలో పంచభూతాల కలయిక ఎలాగంటే ప్రమిదపు మట్టి భూమి గాను నూనె నీరు గా ను అగ్నిజ్వాల నిప్పు గాను దీపం వెలగడానికి కారణమైన ఆక్సిజన్ గాలి గాను దీపపు కాంతిని ప్రసరింపజేసేది ఆకాశంగాను ఇలా పంచభూతాలు దీపంలో ఉన్నాయి
🪔🪔🪔🪔🪔🪔🪔🪔
దానివల్లనే మన పెద్దవాళ్లు ఇంట్లో దీపం వెలిగించి పంచభూతాల నవగ్రహా కలయికతో అష్ట ఐశ్వర్యాలు పొందాలని ఈ విధంగా చెప్పారు

ఆయనతో మైత్రి!
మనిషికి... పుట్టిన క్షణం నుంచి చివరి క్షణాల వరకూ ఓ నేస్తం కావాలి. నేస్తం అంటే- ఓ తోడు, ఓ ఆనందం, ఒక భరోసా. వయసుకు, డబ్బుకు, హోదాకు సంబంధం లేని అందమైన అనుబంధం స్నేహం. అందుకే దానికి పరిమితుల్లేవు. పరిధులు అంతకంటే లేవు. అవసరాల పట్ల, అంతస్తుల పట్ల ఆసక్తులుండవు. అంతరాల అంచనాలుండవు. లింగభేదాలుండవు. వయోపరిమితులంతకంటే లేవు. భార్యాభర్తలు, తల్లీ బిడ్డలు, ఇరుగు పొరుగులు, దేశాలు, దేశాధినేతలు... స్నేహానికి ఎల్లలు లేవు. కష్టంలో, సుఖంలో, అవమానంలో, ఆనందంలో... సమతూకంగా పాలుపంచుకునే నిస్సంకోచ భరోసా అయిన భాగస్వామి- మిత్రుడు. చిన్ననాటి స్నేహమైతే మరీ మధురం.
రామ సుగ్రీవులు, శ్రీరామ గుహులు, కృష్ణ కుచేలురు, కృష్ణార్జునులు, రాధాకృష్ణులు... స్నేహశీలురు, స్నేహపాత్రులు. శ్రీకృష్ణుడికి గోపికలతో ఉన్న అనుబంధంలోని రహస్యం స్నేహమే. గోవులు, గోపాలురు, గోవర్ధనగిరి, నెమలి ఈకలు, పిల్లన గ్రోవి... ఆయన స్నేహ మాధుర్యంతో తడిసి పులకించిన జాబితా పెద్దదే. రాధతో ఆయన ప్రేమలోని కీలక అంశం స్నేహమే. మేనత్త కుంతితో, బావ అర్జునుడితో, చెల్లెలు ద్రౌపదితో ఆయనకున్న బంధుత్వం కంటే స్నేహభావమే ఎక్కువ. ఆయన స్నేహమాధుర్యం వల్లే కష్టాలు వాళ్లకు నీళ్లలో నావలా అనిపించాయి. జీవితంలోని బరువును తేలిక చేసే దివ్యౌషధం- స్నేహం.
రాముడైతే రాక్షసులతోనూ స్నేహం నెరిపాడు. వానరులైతే ఆయన ఆత్మీయ మిత్రులు. సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా మైత్రీ బంధాన్ని స్థాపన చేసుకున్నాడు రాముడు.
స్నేహం అంటే ఇరువురు వ్యక్తులు, అభివ్యక్తుల అందమైన అల్లిక. మనోభావాల సుమమాలిక. ఒక వృక్షం- దాన్ని అల్లుకున్న పూలతీగ. ఒక రాకా చంద్రుడు- ఆయన్ని పరివేష్ఠించిన వెన్నెల మడుగు. ఎవరు వారో, ఎవరు వీరో తెలీదు. ఎవరు ఎవరైనా కావచ్ఛు ఇటు అటైనా, అటు ఇటైనా తలకిందులైనా ఆ రెంటి కలయిక ఒక అద్భుత ఆవిష్కరణ.
బాల్యంలో అమ్మ- పుట్టిన క్షణమే దొరికే నేస్తం. నిజానికి పుట్టకముందే స్నేహహస్తం అందించేందుకు తయారుగా ఉండే ‘సిద్ధ స్నేహితురాలు’ అమ్మ. ఆపై కాస్త ఎదిగాక తన ఈడు పిల్లలు, పెళ్ళయ్యాక జీవిత భాగస్వామి, ఆ తరవాత... పిల్లలు, వృద్ధాప్యంలో వారి పిల్లలు. ఏ వయసులోనైనా, ఎవరితోనైనా స్నేహం ఒక ఆగిపోని ఆనందపు వెల్లువ. ఊపిరి సలపని ఉత్సాహపు ఉప్పెన.
దురదృష్టవశాత్తు స్నేహానికీ గండిపడే ప్రమాదం ఉంటుంది. ఆటంకాలు పొంచి ఉంటాయి. తల్లి మరణించవచ్ఛు స్నేహితులు వివిధ కారణాలతో దూరం కావచ్ఛు జీవిత భాగస్వామితో మనస్పర్థలు రావచ్ఛు విడిపోనూ వచ్ఛు పిల్లలు, మనవలు... కారణం ఏదైనా జీవితంలో ఏ అనుబంధమూ శాశ్వతం కాదు.
కానీ ఆ ‘ఒక్కరితో’ స్నేహం, ఆ అనుబంధం ఎప్పటికీ చెదరనిది. చెరిగిపోనిది. తరిగిపోనిది. తెగిపోనిది. మనం వద్దనుకున్నా, దూరం జరిగినా నీడలా వెన్నంటి ఉండే ప్రియమైన నేస్తమది. నీ జీవితం ఉన్నంతవరకు, నీ శరీరం నిలిచినంత వరకు. ఇంకా ఆత్మానుసంధానం చేసుకుంటే... ఎప్పటికీ. ఎన్ని జన్మలకైనా అదే అనంతుడితో అనుబంధం. సాకేత రాముడితో స్నేహం. ఎట్టి పరిస్థితుల్లోనూ మిగిలిన వారిలా మనకు దూరం కాని, ఆయన అమృతస్నేహం గుర్తించని వారు దురదృష్టవంతులే!

విజయానికి నిర్వచనం
ఎత్తైన పర్వత శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తి అదే విజయమనుకుంటాడు. తనకు వచ్చిన ఆటలో అత్యుత్తమ ప్రతిభ కనబరచి పతకాలను పొందిన ఆటగాడికి విజయమంటే అదే. నిద్రాహారాలకు దూరమై ప్రయోగాలు చేస్తూ ప్రజలకు అనేక ఆవిష్కరణలు అందించే శాస్త్రవేత్తకు తాను సాధించిందే విజయం. చిక్కక పాదరసంలా జారిపోయే భావాలను ఒడిసిపట్టి చక్కని భాషలో వ్యక్తీకరించిన వేళ రచయితకు ఎనలేని సంతోషం. అతడి భావనలో అదే విజయం.
విజయం అనే మాట సాపేక్షమైనది. జీవితంలో విజయం సాధించడమంటే కొందరు వారి భావనలో ఉండే గొప్ప కార్యాలను చేయడమని వాదిస్తారు. వాస్తవానికి వారు చేసిన పనులు విజయాలే కాని విజయమంటే అదేకాదు. మనిషి ఆర్థిక, సామాజిక, మానసిక, ఆలోచనా తీరులతోపాటు అతడి జీవిత నేపథ్యంమీద ఆధారపడి విజయభావన వ్యక్తమవుతూ ఉంటుంది. జీవితంలో ఉండే అనేక అంశాలు, వాటి ప్రాధాన్యాన్ని బట్టి, వ్యక్తుల అభిరుచిని బట్టి వారి ప్రతిభా వ్యుత్పత్తుల ఆధారంగా వారు సాధించే ఘనకార్యాలే విజయాలు.
నవమాసాలు మోసి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి ఆ బిడ్డ ఎదుగుదల ముఖ్యం. మెడ నిలబెట్టవలసిన సమయంలో నిలబెట్టడం, నడవాల్సినప్పుడు నడవడం, మనుషుల్ని గుర్తుపట్టడం... ఇలా ఏ తరుణంలో చేయవలసిన పనులు అప్పుడు చేస్తూ ఆరోగ్యంగా ఎదిగే బిడ్డను చూస్తే తల్లికి పట్టరాని ఆనందం. ఆ ఆనందమే ఆమెకు విజయమంటే.
రైతు పొలాన్ని దున్ని, విత్తనాలు చల్లి, నీటి వసతి ఏర్పరచి బిడ్డలా సంరక్షిస్తూ పోషణ చేస్తాడు. పంట చేతికి చిక్కినవేళ రైతుకది ఓ ఘనవిజయమే.
వైద్యుడు దేవుడితో సమానం. రోగులకు వైద్యం అందించి వారిని స్వస్థులను చేస్తాడు. ఒక్కొక్కసారి శస్త్రచికిత్స అవసరమవుతుంది. ఎంతో కిష్టతతో కూడినదై, రోగి ప్రాణానికి ముప్పు తేవచ్చన్న సందర్భంలో సాహసించి ఆ శస్త్రచికిత్సను వైద్యుడు చేస్తాడు. కృతకృత్యుడైన వేళ అది ఓ అద్భుత విజయమే!
రెక్కాడితేగాని డొక్కాడని శ్రమజీవులెందరో ఉన్నారు. రెక్కలు, ముక్కలు చేసుకుని వచ్చిన ఆ కూలి డబ్బుతో బిడ్డ నోటికి ముద్దనందించిన వేళ ఆ తల్లికది గొప్ప విజయమే.
దేనిలోనైనా ఒక నైపుణ్యం, పరిణతి పొందడానికి సాధన అవసరం. నిర్ణీత సమయంలో చదువు పూర్తిచేసుకోవాలి, ఉద్యోగాన్ని సంపాదించుకుని ఆర్థిక భద్రతకు దారిని ఏర్పరచుకోవాలి. గృహస్థాశ్రమ జీవితాన్ని ధర్మబద్ధంగా గడిపి, బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలి. ఇవీ విజయాలే.
నైతిక ప్రవర్తనతో, ధర్మబద్ధతతో, నిజాయతీ నిబద్ధతలతో జీవించాలి. అప్పుడే మన జీవితానికి ఒక విలువ, గౌరవం ఒనగూడుతాయి. ఈ రకమైన ప్రవర్తన మన జీవితాన్ని మెరుగుపరుస్తుంది. అనేకమంది మనమంటే అభిమానించేటట్లు చేస్తుంది. ఇదీ విజయమే!
మనిషి ఒక ఉపాధ్యాయుడో, వైద్యుడో, శాస్త్రవేత్తో, రచయితో, సంగీతకారుడో... ఎవరైనా కావచ్ఛు కాని తాను మానవుడినన్న విషయం మరువకూడదు. తనలోని ప్రేమ, జాలి, కరుణ, నిజాయతీ, ధైర్యస్థైర్యాలు మొదలైన మానవీయ లక్షణాలను వికసింపజేయాలి. అప్పుడే మహనీయుడవుతాడు. అది అన్నింటికంటే అద్భుత విజయం, అసలైన విజయం!

కరుణాపయోనిధి
ఈ ప్రపంచం అంతా అపార కారుణ్యంతోనే బతుకుతోంది. కారుణ్యంలోనే వర్ధిల్లుతోంది. కారుణ్యంతోనే పరమావధిని చేరుకొంటోంది. ఇది సత్యం. కారుణ్యమే లేకుంటే ఈ జగత్తు సృష్టికి, స్థితికి, లయానికి అర్థమే ఉండదు. కారుణ్యం దైవగుణం. కరుణామయులై కోరిన వరాలు అందిస్తూ, కాపాడతారనే దేవతలను మానవులు కొలుస్తున్నారు. ఆపదలు వచ్చినప్పుడు వారే ఆదుకుంటారనే నమ్మకం మనిషిని బతికిస్తోంది.
త్రేతాయుగంలో భూమిపై అవతరించి, ధర్మాన్ని కాపాడిన శ్రీరాముడు మానవాళికి ఆదర్శపురుషుడైనాడు. భద్రగిరిగా, భద్రాచలంగా ప్రసిద్ధిచెందిన దివ్యధామాన్ని నిర్మించినవాడు ప్రముఖ రామభక్తుడు కంచెర్ల గోపన్న. ఇతడికే రామదాసు అనే పేరుకూడా ఉంది. రాముడిపై అకుంఠిత భక్తితాత్పర్యంతో కంచెర్ల గోపన్న రాసిన స్తుతి ‘దాశరథి శతకం’. ఈ శతకానికి అతడు ‘దాశరథీ! కరుణాపయోనిధీ!’ అనే మకుటాన్ని నిర్దేశించాడు.
ఈ శతకంలోని పద్యాలన్నీ రత్నాలే. వాటి కాంతి వందల ఏళ్లయినా ఏమాత్రం తరిగి పోకుండా, వెలుగులు చిమ్ముతూ మానవాళికి నీతిని, రీతిని ప్రబోధి స్తున్నాయి. రామన్నను గోపన్న అనేక విశేషణాలతో కీర్తించాడు. అతడి భావనలో రాముడు రంగద రాతిభంగుడు (ప్రకృష్ట శత్రువులను సైతం ఓడించేవాడు), ఖగరాజ తురం గుడు (పక్షిరాజైన గరు త్మంతుని వాహనంగా చేసుకొన్న విష్ణువు), విపత్ప రంపరోత్తుంగ తమః పతంగుడు (ఎన్ని ఆపదల చీకట్లనైనా చీల్చివేయగల సూర్యుడు), పరితోషిత రంగుడు (రంగనాథుణ్ని సంతోషంలో ఓలలాడించినవాడు), దయాంతరంగుడు (దయగల మనసు గలవాడు), సత్సంగుడు (సజ్జనులతో కూడినవాడు), ధరాత్మజాహృదయ సారసభృంగుడు (భూసుత అయిన సీతాదేవి హృదయపద్మంలో తిరిగే తుమ్మెద), శుభాంగుడు (మంగళప్రదమైన శరీరం కలవాడు). ఇలాంటి దశరథాత్మజుని అనేక విధాలుగా కీర్తించాడు గోపన్న.
ప్రాణుల ఆర్తిని తన ఆర్తిగా భావించి గోపన్న రాముడికి ఇలా విన్నవించాడు- ‘రామా! శరీరంలోని అయిదు ఇంద్రియాలు ప్రలోభపెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వాటినుంచి రక్షించు. ఏనుగు శరీరచాపల్యంతో శరీరాన్ని కృశింపజేసుకుంటోంది. చేప ఎరను తినడానికి యత్నించి, జిహ్వేంద్రియం వల్ల ఇతరులకు దొరికిపోతున్నది. పాములు మధుర సంగీతానికి మోహపడి శ్రవణేంద్రియం కారణంగా చిక్కిపోతున్నాయి. జింకలు కన్నులతో ఆకర్షణకు లోనై, ప్రాణాలు అర్పిస్తున్నాయి. పూలవాసనలతో తుమ్మెదలు నశిస్తున్నాయి. ఇలా పంచేంద్రియాలూ ప్రాణులను వశంచేసుకొని బలిచేస్తున్నాయి. వీటినుంచి ప్రాణులను కాపాడు.’
రామా! తల్లిదండ్రులు, భార్య, సంతానం, చుట్టాలు అందరూ నిమిత్తమాత్రులే. ప్రాణి పుట్టే సమయంలో ఒంటరిగానే భూమిపైకి వస్తుంది. చివరికి మరణించే సమయంలో కూడా ఒంటరిగానే వెళ్లిపోతుంది. లోకంలో కనబడేదంతా మాయే. ఈ కపటపు మాయనుంచి ప్రాణులను కాపాడు!’
ఇలా ఎన్నో నీతులకు ఆలవాలం దాశరథి శతకం. మనిషి తానెందుకు పుట్టాడో వివేచించుకోవాలి. బతికినంతకాలం ఏయే పనులు చేయాలో నిర్ణయించుకోవాలి. జీవన సంధ్యాకాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ప్రణాళికను సమకూర్చుకోవాలి. భగవంతుడు ప్రసాదించిన ఆయుష్యాన్ని సంపూర్ణఫలంగా అనుభవించాలే కాని, వ్యర్థం చేసుకోకూడదు. ఇదే ఈ శతకంలో ప్రతిబింబించే పరమార్థం!

చిన్ని చిన్ని ఆనందాలు
కొందరు వాస్తవంలో బతుకుతారు. ఇంకొందరు భావ ప్రియంగా జీవిస్తారు. ప్రకృతిని ఉన్నదున్నట్లుగా చూసేవారు కొందరైతే ఉన్నదానికి మాధుర్యాన్ని జోడించి ఆనందించేవారు మరికొందరు.
దృశ్య జగత్తులో అనుదినం పరిఢవిల్లే నవ్య దర్శన శోభను చూసి ఆనందం అనుభవించేందుకు కొందరికి స్ఫూర్తి లభించగా విరుద్ధ కోణంలో దర్శించే వారికి చిన్న ఆనందాలు సైతం మృగ్యమై ఎండమావులవుతాయి.
ఆనందానుభవానికి తీర్థ యాత్రలు, విహార యాత్రలు తోడ్పడతాయి. ప్రయాణ సమయంలో తారసిల్లే ప్రతి క్షణమూ అణువణువూ ఆనందాన్ని ఇస్తుందని గ్రహించాలి. దారిలో కనిపించే కొండలు, గుట్టలు, చెట్లు, మహా వృక్షాలు, సెలయేళ్ళు, సస్యశ్యామలమైన పంటచేల దృశ్యాలు, లేళ్ళు, దుప్పులు, అలవోకగా ముంగురులను కదిలిస్తూ హాయిగొలిపే మలయ మారుతాలు ఇవన్నీ... అనుక్షణం చిన్న చిన్న ఆనందాలను పంచే అంశాలే.
కొందరు జాతరలు, తిరునాళ్ళ వంటి సమూహ వేడుకలను హాయిగా ఆనందిస్తారు. మరికొందరు అంతర్ముఖులు ఏకాంత సమయాలను ఆనందపు గనిగా మార్చుకుంటారు. వారి వారి వ్యక్తిత్వాలను, మనస్తత్వాలను బట్టి చిన్ని ఆనందాలు లభ్యమవుతాయి.
వాతావరణంలోని ఓ చిలుక పలుకు, ఓ పసిబిడ్డ ఏడుపు, ఓ రైలు కూత, శునకపు అరుపు, అలల సవ్వడి అదాలుగా ఆలకించే వాడికి అన్నీ బాల కృష్ణుడి చిరు గజ్జెల మోతలే! చిదానంద స్వరాలే! ఆనందం నిర్వచనానికి అతీతమైనది. అది అనుభవంలోకి వచ్చినపుడు ఆస్వాదించి సొంతం చేసుకోవాలి. మలినమైన, నేరపూరితమైన మనసులో స్వచ్ఛమైన ఆనందాలు ప్రతిఫలించవు. వారు వేటిని ఆనందాలని భావించి అనుభవించేందుకు ఉత్సుకత చూపుతారో అవి హేయమైన, అప్రియమైన అనుభూతులు. తమోగుణ ప్రధానులైనవారికి సర్వజన మోదకమైన చిన్న ఆనందాలు లభించే అవకాశం దాదాపు మృగ్యమే!
రచనాభినివేశం, సంగీత ప్రియత్వం, క్రీడాసక్తి, దానగుణం, సేవా పరత్వం... ఇవన్నీ చిన్న ఆనందాలను పోగుచేసే అంశాలే! లలిత కళల అభ్యసనం, వాటిపట్ల ఆసక్తి సాధకుల్లో ఆనందానుభూతులను ప్రోది చేస్తాయి.
మనసు మహోత్కృష్టమైనది. అంతఃకరణకు మనసే కేంద్ర స్థావరం. మనసు కలుషితం కాకుండా చూసుకోవడం ఓ మంచిమనిషి కర్తవ్యం. మనసును ఆనందభరితం చేసుకోవాలంటే సత్య వర్తన, సత్య భాషణ, దైవ ప్రియత్వం, సోదర భావం వంటి విశేష గుణాలు తోడ్పడతాయి. ఆ దైవీ గుణాలు ఆధ్యాత్మికంగానే లభ్యమవుతాయి.
సంగీతాన్ని ఆలంబన చేసుకొని త్యాగరాజు, అన్నమయ్య భగవంతుని కీర్తించే దివ్యానందాన్ని అనుభవించారు. వారు రచించిన గీతాలు శ్రోతలకు ఆనందాన్ని పంచాయి. తన గురించి లోకులు అనే ఓ మంచి మాట చెవిన పడినప్పుడు మనిషికి కలిగే ఆనందం అనల్పమైనది. ఓ పేదవాడు, లేదా యాచకుడికి చేసిన చిన్నపాటి సాయం మంచి అనుభూతిని ఇస్తుంది. చంటిబిడ్డను లాలించే తల్లిదండ్రులకు కలిగే మధుర భావన పరిమాణం అల్పమా, అనల్పమా కొలవలేనిది.
ఆనందం ఓ అంబుధి. దైవ ప్రసాదితమైన ఆనందం ఓ మహాసాగరం. చిన్న చిన్న నీటి బిందువులు అపార పారావారంగా ఏర్పడినట్లు చిన్న చిన్న ఆనందాలు ప్రవర్ధమానమై ఆనందాంబుధి ఏర్పడుతుంది. అందుకు సాధన తోడ్పడుతుంది. వాస్తవంలో కష్టాలను ఖాతరు చేయక ముందుకు సాగే సాధకుడికి అనుభవంలో ప్రతిక్షణమూ ఓ చిన్న ఆనందమే!!

సామాజిక సూత్రం
లోకంలో మనుషుల నడవడి విచిత్రంగా ఉంటుంది. తనదైతే ఒకలా, ఇతరుల విషయంలో మరోలా ప్రవర్తిస్తుంటారు. మనిషి ఎప్పుడు ఎలా నడుచుకోవాలో మహాభారతం చెప్పినట్టు మరే గ్రంథం చెప్పలేదేమో! భారతం ధర్మజ్యోతి.
భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు. కురుక్షేత్ర సంగ్రామంలోని మరణాల వల్ల ధర్మరాజు ఎంతో మనస్తాపం చెందాడు. అతడి మనసులోని కలతను తీర్చడానికి ఎందరో హితవచనాలు పలికినా శాంతి చేకూరలేదు. వాసుదేవుడు అతణ్ని భీష్ముడి దగ్గరకు తీసుకువెళ్లాడు. ధర్మరాజుకు ధర్మోపదేశం చేయమని కోరాడు. భీష్ముడు మహాజ్ఞాని. రాజనీతికి సంబంధించిన సమస్త విషయాలూ బోధించాడు. ధర్మం చాలా సూక్ష్మమైందని అది పలురీతుల్లో గోచరిస్తుందని చెబుతూ భీష్ముడు పరమ ధర్మమేమిటో వివరించాడు.
మహాభారతం శాంతిపర్వంలోని ‘ఒరులేమేమి యొనర్చిన నరవరయప్రియంబు తన మనంబున కగు...’అనే పద్యం ప్రపంచ వాంగ్మయంలోనే గొప్ప సూక్తి. కందుకూరి వీరేశలింగం ‘వివేకవర్ధిని’ పత్రికలో ఈ పద్యాన్ని ముఖతిలకంగా తీర్చిదిద్దారు. అనంతర కాలంలో కాశీనాథుని నాగేశ్వరరావు కూడా ‘ఆంధ్రపత్రిక’లో తమ ఆదర్శవాక్యంగా దీన్ని ప్రచురించేవారు. నాటికీ నేటికీ ఉత్తమ వ్యక్తిత్వానికి మార్గదర్శకమైన ప్రబోధం ఇందులో ఉంది.
ఇతరులు ఏది చేస్తే తన మనసుకు అప్రియం అవుతుందో తాను దాన్ని ఇతరులకు చేయకుండా ఉండటం సకల ధర్మాలకూ కుదురులాంటిది. ధర్మం రెండు విధాలుగా ఉంటుంది. అవి విధి నిషేధాలు- చేయవలసినవి, చేయకూడనివి. జన సామాన్యం కోసం ప్రతిపాదించిన ధర్మం- నిషేధాత్మకమైంది. అంటే- ఏం చేయకూడదో తెలియజేస్తుంది. తననెవరైనా కొట్టినా, గాయపరచినా దేహానికి నొప్పి కలుగుతుంది. అది మనసుకూ బాధ కలిగిస్తుంది. కొన్ని శారీరకమైనవి కావు... మానసికంగా బాధిస్తాయి. నింద, హేళన, చులకన చేసే మాటలు- ఇవన్నీ మనసును గాయపరుస్తాయి. కొన్ని మనసులో నాటుకుపోయి బతికినంతకాలం పీడిస్తూనే ఉంటాయి. అటువంటి పనులు తాను ఇతరులకు చేయ రాదని భారతం హెచ్చరిస్తుంది. అందరిపట్లా సమబుద్ధి కలిగిఉండాలి. లౌకికంగా ఇది చాలా ప్రయోజ నకరం. ఇతరులపై పగ ఉంటే ఎవరూ ప్రశాంతంగా నిద్రపోలేరు. మనసులో పగ ఉంటే పామున్న ఇంట్లో నివసిస్తున్నట్టే అని భారతం చెబుతోంది. ఇతరుల విషయంలో మనం ఏం మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా ఒక్క క్షణం వివేకంతో ఆలోచిస్తే మనం మంచి నిర్ణయం తీసుకోగలుగుతాం. ఎవరినీ బాధపెట్టం. తరవాత మనమూ బాధపడం.
దీన్ని మరోవిధంగానూ అన్వయించుకోవచ్చు. ఇతరులు తనపట్ల చేసిన ఏ పనులు తనకు ఆహ్లాదం కలిగించాయో అటువంటి పనులు తాను ఇతరులకు చేస్తూ ఉండటమే గొప్ప ధర్మం.
భారతంలోనే ఒక కథ ఉంది. సరమ దేవతల శునకం. సారమేయుడు దాని కొడుకు. జనమేజయుడు యజ్ఞం చేస్తుంటే ఆ పరిసరాలకు సారమేయుడు వచ్చి తిరుగాడుతున్నాడు. రాజుగారి తమ్ముళ్లు దాన్ని కొట్టి తరిమేశారు. అది ఏడుస్తూ తల్లితో మొరపెట్టుకుంది. సరమ ముందుగా తన కొడుకును అక్కడేమైనా పాడుపని చేశావా అని అడిగింది. ఏ తప్పూ చేయలేదని నిర్ధారించుకున్నాక రాజు దగ్గరకు వెళ్లింది. పసివాడు ఏ అపవిత్ర కార్యమూ చేయకుండా సంతోషంగా ఆడుకుంటూ తిరుగుతుంటే అతడి తమ్ముళ్లు అకారణంగా కొట్టి బాధించారని- ఇది చేయవచ్చు, ఇది చేయరాదని కొంచెమైనా ఆలోచించక సాధుజీవుల్ని హింసించే దుర్మార్గులకు ఆపదలు ముంచుకొస్తాయని నిందించి వెళ్లిపోయింది. నిష్కారణంగా, అనాలోచితంగా ఎవరికీ హాని కలిగించకూడదని ఇందులోని అంతరార్థం.

తొలి తిరుపతి
తిరుపతి (తిరుమల), చిన్న తిరుపతి (ద్వారకా తిరుమల) ... ఈ క్షేత్రాలు ఎక్కడున్నాయో, వాటి ప్రాశస్థ్యం ఏమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వాటి స్థాయిలో ప్రాచుర్యం పొందని మరో తిరుపతి కూడా ఉంది. అదే తొలి తిరుపతి... శ్రీ శృంగార వల్లభ స్వామిగా శ్రీ మహవిష్ణువు వెలసిన పురాతన పుణ్యక్షేత్రం.
శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల దేశంలోని ప్రాచీన ఆలయాల్లో ఒకటి. అయితే తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు సుమారు 10 కి.మీ. దూరంలో ఉన్న తొలి తిరుపతి అంతకన్నా పురాతనమైనదని చెబుతారు. ఈ ఆలయంలో విష్ణుమూర్తి శిలారూపంలో దర్శనమిస్తాడు. తొలుత విష్ణువు వెలసిన చోటు ఇదే కనుక దీనికి 'తొలి తిరుపతి'గా పేరు వచ్చిందనీ స్థానికుల కథనం.
స్థల పురాణం ప్రకారం... రాజైన ఉత్థానపాదుడికి ఇద్దరు భార్యలు. రెండో భార్య కుమారుడు ఉత్తముడు తండ్రి ఒడిలో కూర్చొని ఉండగా, మొదటి భార్య కుమారుడు ధ్రువుడు కూడా వచ్చి తండ్రి ఒడిలో చేరబోతాడు. అతణ్ణి సవతి తల్లి పక్కకు నెడుతుంది. ఆవేదన చెందిన ధ్రువుడు తల్లి సూచన మేరకు విష్ణుమూర్తి కోసం తపస్సు చేస్తాడు. విష్ణువు ప్రత్యక్షమవగా, బ్రహ్మాండమైన ఆయన దివ్య తేజస్సును చూసి ధ్రువుడికి భయం వేస్తుంది. అతణ్ణి బుజ్జగించే సమయంలో విష్ణుమూర్తి శంఖ చక్రాలు చేతులు మారుతాయి. ధ్రువుడి కోసం తన రూపాన్ని చిన్నదిగా చేసుకొని, చిరునవ్వుతో కటాక్షిస్తాడు. తారామండలంలో నక్షత్రంగా నిలిచిపోతావని దీవిస్తాడు. శ్రీ శృంగార వల్లభ స్వామిగా శిలా రూపంలో ఆ క్షేత్రంలో నిలిచిపోతాడు. తనను దర్శించిన వారికి వారి ఎత్తులోనే కనిపిస్తాననీ వాగ్దానం చేస్తాడు. ఆయనకు దేవతలే ఆలయాన్ని నిర్మించారనీ, మహాలక్ష్మిని నారదుడు ప్రతిష్ఠించాడనీ స్థల పురాణం వివరిస్తోంది.. శ్రీ శృంగార వల్లభ స్వామిని పూజిస్తే పిల్లలు లేనివారికి సంతానం కలుగుతుందనే విశ్వాసం ఉంది.

త్రికరణశుద్ధి
చెట్టు మీద పిట్ట వాలుతుంది. ఓ కొమ్మపై గూడు అల్లుతుంది. అందులో గుడ్లు పెడుతుంది. అవీ పక్షులై పెరుగుతాయి. ఆహారం కోసం దూర తీరాలకు ఎగిరిపోతాయి. వెళ్లిన చోటే రాత్రి పూట గడపవచ్చు. కానీ, పక్షులు అలా చెయ్యవు. అవి తిరిగి సాయంకాలం గూళ్లకు చేరుతాయి. మనిషి జీవన స్థితీ అంతే. చైతన్యం సృష్టించిన గూడే శరీరం. అందులో పుట్టే భావాలు పక్షులు. అవి తొడుక్కునే రెక్కలే ఆలోచనలు. అవీ ఎగురుతాయి. జీవితం విస్తరించిన మేర సంచరిస్తాయి. విన్నవి, కన్నవి అనుభవాలవుతాయి. వీటన్నింటి సమాహారమే- మనసు. అది అత్యంత శక్తిమంతమైనది, చంచలమైనది. ఎంత దూరాన్నైనా క్షణాల్లో చేరగలదు. తలచుకుంటే నిశ్చలంగా ఉండగలదు. అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యగలదు.
పంచభూతాలతో శరీరం తయారవుతుంది. ఆ తరవాతే మనసు నిర్మాణం జరుగుతుంది. శరీరం లేకుండా మనసు మనగలదా? లేదు. మనిషంటే ఎవరు? అతడి ఉనికి తెలిపేది ప్రధానంగా అతడి- ఆకృతి(రూపం). అంటే, శరీరమే కదా. ‘మనసు’- అనుసంధాన కర్తగా పనిచేసే మధ్యవర్తి. ఒక వైపు చైతన్యం మరోవైపు శరీరం ఉంటేనే కదా ఆ రెండింటి మధ్య వంతెనలా మనసు ఉండగలిగేది.
శరీరం నిండా చైతన్యం పరచుకొని ఉంటుంది. మనసూ చైతన్యాంశమే. కానీ, దేహం నుంచి వీడిపోయిన మనసు తెగిన గాలిపటం లాంటిది. దాని పయనం అగమ్యగోచరం. వీధుల్లో అక్కడక్కడా అర్థం పర్థం లేకుండా తిరిగే పిచ్చివాళ్లను గమనించండి. వాళ్లు వర్తమానంతో తెగిపోయిన మానసిక బాధితులు. ప్రస్తుత క్షణంతో వారికి ఏ సంబంధమూ ఉండదు. వాళ్లు అస్తమానం గతంతో సంభాషిస్తారు. అంటే, జరిగిపోయిన(దూరమైన) పాత సంఘటనలతో మాట్లాడటం.
ఇంటి కాపలాదారు గృహం వద్దే ఉండాలి. కానీ, బాధ్యతలు మరచి జులాయిలా షికార్లు చేయడంలో అర్థం ఉందా? లేదు. మనసులేని మనిషి మర యంత్రంతో సమానం. మనిషి- ఆలోచనలతో ఉన్నప్పుడు మనసు బయట ఉంటుంది. గమనింపుతో, ఎరుకతో ఉన్నప్పుడు మనిషి లోపల ఉంటుంది. మనసున్న మనిషే మనీషిగా మారతాడు. అందుచేత ‘మనసు’ మనిషి దగ్గరే ఉండాలి. అందువల్లే కఠోపనిషత్తు- ‘శరీరం ఒక రథం లాంటిది, మనసు ఆ రథాన్ని నడిపే సాధనం’ అని చెబుతోంది.
మనిషి(మనసు) ప్రమేయం లేకున్నా శరీరం తన విధులు చక్కగా నిర్వర్తిస్తుంది. లయ తప్పకుండా గుండె కొట్టుకుంటుంది. ఊపిరితిత్తులు శ్వాసక్రియలు జరుపుతూ ఉంటాయి. ఔషధ కర్మాగారమైన కాలేయం- శారీరకంగా అవసరమైన రసాయనాలు అందిస్తుంది. వడపోత కార్యక్రమం చేపడుతూ మూత్రపిండాలు రక్తశుద్ధి చేస్తాయి. తరాల నాటి పూర్వీకుల పోలికలు గుర్తుంచుకుని శతాబ్దాల తరబడీ పుట్టే సంతానానికి అచ్చుగుద్దినట్లు చేర్చుతుంది. ఈ క్రియలన్నింటికీ చైతన్యం పునాదిగా పనిచేస్తుంది. ఆ రెండింటికీ మనసు తోడైతే మూడూ ఒక్కటవుతాయి. అప్పుడు, ‘త్రికరణ శుద్ధి’ నెలకొంటుంది. ‘ధ్యానం’ పురివిప్పుకొంటుంది. ఆ స్థితిలో చేపట్టే ప్రతీపని ఒక ‘ప్రార్థన’ అవుతుంది.
నిలువ ఉన్న నీరు చెడిపోతుంది. పారే నది ప్రయోజనకారి అవుతుంది. మనసు మంచిగా ఉండాలన్నా, ప్రజల శ్రేయం కోరే ఆలోచనలు కలగాలన్నా ముందు శరీరం బాగుండాలి. అందుచేత దానితో రోజూ వ్యాయామం చేయించాలి. యోగాసనాల వల్ల శరీరానికి క్రమత ఏర్పడి ఆరోగ్యం చేకూరుతుంది. మనసులో మలినశుద్ధీ జరుగుతుంది. పరిశుద్ధమైన మనసే ధ్యానానికి సిద్ధపడుతుంది.

భయాన్ని భయపెట్టాలి
జీవితంలో భయం కన్నా భయంకరమైందేదీ లేదు. అదో తీవ్రమైన భావోద్వేగం. అది కోపానికన్నా ప్రమాదకరమైంది. ఊహ కలిగాక, ఓవైపు జ్ఞానం పెరుగుతుంటే, మరోవైపు భయమూ మనసులో చోటు సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంటుంది. ఆత్మవిశ్వాసం కలవాడు, దృఢ సంకల్పం కలిగినవాడు, సంయమనశీలి, దేశకాల పరిస్థితులపట్ల అవగాహన ఉన్నవాడు మనసులో భయానికి తావే ఇవ్వడు.
భయం దిగులును, బాధను, దుఃఖాన్ని, పిరికితనాన్ని కర్తవ్యవిమూఢతను పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. అన్నింటినీ మించిన భయం- మరణభయం. ఎంత వయసు మీరినా తానింకా బతకాలనే అనుకుంటాడు మనిషి. అయితే భయం క్షణం క్షణం మరణాన్ని చవిచూపిస్తుంది. సుఖాన్ని, శాంతిని, తృప్తిని, ఆనందాన్ని దూరం చేస్తుంది. ఉన్నది పోతుందేమో అని ఒకడికి భయమైతే, రావలసింది రాదేమోనన్న భయం మరొకడికి. ఇంటిగుట్టు రట్టయి పరువు పోతుందేమోనన్న భయం ఇంకొకడికి. తన సంపదను దోచుకుపోతారేమోనన్న భయం వేరొకడికి. భయాలు ఎన్నయినా వాటిని దూరం చేయగలిగేది వైరాగ్యం ఒక్కటేనని భర్తృహరి ఏనాడో చెప్పాడు.
వేగంగా పరవళ్లు తొక్కుతూ ప్రవహించే నదికి ఓ పర్వతమో, చెట్టో అడ్డం వస్తే ప్రవాహం అక్కడే ఆగుతుందా? పక్కదార్లు చూసుకొని పల్లంవైపు ప్రవహిస్తూ ముందుకెళ్లిపోతూనే ఉంటుంది. మనిషికీ అలాగే ఎన్నో సమస్యలు, కష్టాలు, ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. అంతమాత్రాన మనిషి బెంబేలెత్తి పోకూడదు. భయపడి కుంగిపోకూడదు. భయమనే వరదకు అడ్డుకట్ట వేయడానికి ధైర్యమనే ఆనకట్టను నిర్మించుకోవాలి అంటారు స్వామి వివేకానంద. భయంతో ఏ పనినీ సాధించలేం. స్థితప్రజ్ఞ, నిగ్రహం, ఓర్పుతోనే ఎంతటి సమస్యనైనా అధిగమించగలం. పరిస్థితులు ఎంతటి విపత్కరమైనా, అప్రమత్తులమై అవగాహనతో మనం మనలా మనోధైర్యంతో ముందుకు సాగడమే పరమ కర్తవ్యం.
ఆత్మవిశ్వాసానికి ఆధ్యాత్మిక చింతన తోడైతే మనిషికి సర్వత్రా విజయం తథ్యం. భయం అనే వ్యాధికి దివ్యౌషధం భక్తి మాత్రమే. భయం కలిగించేది, తొలగించేది శ్రీమన్నారాయణమూర్తే అని విష్ణు సహస్రనామం చెబుతోంది. భక్తికి వశమయ్యేది, భయాన్ని పారదోలేది పరమేశ్వరి అని లలితా సహస్రనామం చెబుతోంది. ప్రహ్లాదుడు, రామదాసు, మీరాబాయి ఎన్ని శిక్షలు అనుభవించారు! నిర్భీతితో పరమాత్మ నామస్మరణతో అవలీలగా ఆ అవరోధాలన్నీ అధిగమించి సద్గుతులు పొందారు.
భక్తిలో ఆర్తి ఉంటుంది. వేదన ఉంటుంది. వినమ్రత ఉంటుంది. శరణాగతి ఉంటుంది. ఆత్మసమర్పణ భావం ఉంటుంది. మనిషికి జీవితంలో భక్తి ఒక్కటే తరణోపాయం. అందుకు నామస్మరణే ప్రథమ సాధనం. నామస్మరణ భయాలన్నింటినీ ఇట్టే తెంచివేయగల అమోఘ సాధనం.
మనిషి అధర్మానికి, అత్యాచారానికి, హింసకు, దౌర్జన్యానికి- ఇలాంటి అకృత్యాలు చేయడానికి మాత్రం భయపడవలసిందే. విముఖత చూపవలసిందే! దోషికి, నేరస్తుడికి, దుష్టుడికి భయం ఉంటుంది. క్రమశిక్షణ, సదాచరణ, సత్సాంగత్యం ఉన్నవాడికి భయమే కలగదు. కష్టమైనా ధర్మవర్తననే నమ్ముకోవాలి. దాని వెనక ఎన్నో అద్భుతమైన అవకాశాలు దాగి ఉంటాయి. నీడను చూసి భయపడేవాడు తరవాత వెలుగు మనదరికి చేరుతుందని గ్రహించి, సంయమనం పాటించాలి. దైర్యవంతుడు అంటే భయం తెలియనివాడు కాదు, దాన్ని జయించినవాడు. భయం అనే శత్రువు మనలో లేనంతవరకు బయటి శత్రువేదీ మనల్ని భయపెట్టలేదు.
భయం తలుపుతట్టింది. భక్తి తలుపు తెరిచి చూస్తే బయట ఎవరూ లేరు!

నమస్కారం🙏🏽
సంధ్యావందనం చేయాలని, తపన ఉండి, కానీ చేసే పద్ధతి తెలియాని వారికి ఒక శుభవార్త. ఆన్లైన్ లో ఉచితం గా సంధ్యావందనం నేర్పించబడును. ఆసక్తి ఉన్నవారు కాంటాక్ట్ చేయవలసిన నెంబర్
అభ్రపూడి మాణిక్యశర్మ
7416818034

లోచూపు
జీవితం దృష్టి ప్రధానమైనది. ప్రతి ప్రాణికి చూపు చాలా అవసరమైనదేగాక విలువైనది కూడా! చూపునిచ్చే అవయవం కన్ను. దృష్టి ప్రాముఖ్యాన్ని గుర్తించిన మన పూర్వులు ‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అన్నారు. భౌతికమైన ఈ జగత్తును, అందులోని మార్పులను గమనిస్తూ జీవన గమనం సాగించడం ఒకెత్తు. ఆంతరంగికమైన చూపును కలిగి ఉండటం మరొకెత్తు. అదే ‘లోచూపు’.
ఎవరికి వారు తమంతట తామే ఉన్నత మార్గంలో ప్రయాణించేటట్లు చేసేది ఈ లోచూపు. బాహ్య నేత్రాలు సాధారణ దృష్టినిస్తే, జ్ఞాననేత్రాలు ఆంతరంగిక దృష్టిని అందిస్తాయి. మామూలు చూపు కొన్నిసార్లు ఇంద్రియ లౌల్యానికి దారితీస్తుంది. అధోగతికీ లాక్కెళుతుంది. ‘కన్నుల చూచినందెల్లా కడు ఆసల దగిలి’ అని ఓ సంకీర్తనలో అన్నమయ్య చెప్పినట్లుగా, చూసిన ప్రతి విషయంపై ఆసక్తిని పెంచుకుంటే అది దుఃఖాలపాలు చేస్తుంది. ఆముప్పు దాపురించకూడదంటే జ్ఞాననేత్రాలు విప్పారాలి. ఆ కాంతిలో వ్యక్తిత్వం వికసించాలి. మొక్క సూర్యకాంతిని అందుకొని ఎదిగి మహావృక్షమై ప్రాణవాయువును, పుష్పఫలాలను, కలపను అందించి సమాజానికి ఉపయోగపడుతున్న స్పూర్తిని అందుకొని మనమూ వికసించిన వ్యక్తిత్వంతో సమాజసంక్షేమానికి కృషి చేయాలి.
అన్నమయ్య తన సంకీర్తన భాగవతంలో ‘ఎన్ని మార్లు సేవించిననూ కన్నులూ తనియవు’ అంటూ- భగవత్ సౌందర్యాన్ని వీక్షించడం నేత్రాలు చేసుకున్న గొప్ప యోగంగా అభివర్ణిస్తారు! ‘తెర తీయగరాదా నాలోని మచ్చరమను తెరతీయగారాదా తిరుపతి వేంకట రమణా’ అంటూ- నిన్ను దర్శించాలంటే పదివేల కన్నులు కావలెనయ్యా అంటారు త్యాగరాజస్వామి!
బాహ్యంగా చూసినదాన్ని విమర్శించడం మానవ సహజ లక్షణం. దీన్ని అధిగమించి లోచూపుతో నిన్ను నీవు విమర్శించుకో! నిన్ను నీవు సరిదిద్దుకో’ అంటారు విజ్ఞులు. ‘చదివితి తొల్లి, చదివేనింకా కొంత... ఎదిరి నన్నెరగను’ అంటారు అన్నమాచార్యులవారు ఓ సంకీర్తనంలో. ఎంతో కొంత చదివాను, ఇక ముందూ చదువుతాను. కాని నన్ను నేను తెలుసుకోలేకపోతున్నాను. ‘ఒరుల దూషింతు కాని, ఒక మారైన నా దురితకర్మములను దూషించను’ అంటూ బాహ్యదృష్టితో చూసి అందర్నీ తప్పుపడుతున్నాను కాని, అంతరదృష్టి కలిగి నన్ను నేను తెలుసుకోలేకపోతున్నాను అంటూ లోతైన జ్ఞానాన్ని బోధించారు. ఆత్మజ్ఞానం అందుకోవడానికి అవసరమైన విజ్ఞానాన్ని అందించారు.
లోచూపు సాధనకు ధ్యానం ఎంతో ఉపయుక్తమైనది. ఏకాగ్రమైన భావనతో మనసును కేంద్రీకరించినపుడు జ్ఞాననేత్రాలు విప్పారుతాయి. ధ్యానప్రక్రియ ఉత్తమ ఉపాసనామార్గం. అభ్యాసపూర్వకమైన ధ్యానం తమను తాము తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. జ్ఞానాజ్ఞాన విచక్షణ ఏర్పడి వివేకదర్శనం కలుగుతుంది. తెలుసుకున్న జ్ఞానాన్ని నిత్యజీవనంలో ఆచరించేటట్లు చేస్తుంది. బుద్ధి ప్రచోదనం జరిగి మనసు నియంత్రితమై జీవితం సార్థకమయ్యేలా ఆశలు, ఆశయాలతో జీవనం సాగిపోతుంది. మంచి పనులు చేసే జ్ఞానాన్ని లోచూపు అందిస్తుంది. మనలోపల చుక్కానిలా ఉండి మనల్ని చక్కని మార్గంలో నడిపించే గురువే లోచూపు!

చల్లని మాట... చక్కని బాట!
‘కొందరు ఇంటికి వస్తే సంతోషంగా ఉంటుంది. కొందరు వెళ్లిపోతే చాలా సంతోషంగా ఉంటుంది’ అని కొంతమంది గృహస్థులు తమ ఇళ్లలో ఓ సందేశాన్ని ఫ్రేమ్ కట్టి ఉంచుతారు. చూడ్డానికి తమాషాగా అనిపించినా, అది లోతుగా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే కొందరు వ్యక్తులు ఎవరింటికైనా పలకరింపులకు వెళ్లినప్పుడు, అవతలివారి మానసిక స్థితిని గమనించరు. అడగకపోయినా తమ కష్టాలు, బాధలు ఏకరువు పెడుతుంటారు. సమాజం భ్రష్టుపట్టి పోయిందని అందరినీ తిడుతూ, తమలోని నిరాశా నిస్పృహలను వాళ్లముందు వెళ్లగక్కుతుంటారు. అలాంటప్పుడే వచ్చినవ్యక్తి ఎప్పుడు వెళ్లిపోతాడా అని ఇంట్లోవాళ్లు ఎదురుచూస్తుంటారు. ఈ ధోరణికి విరుద్ధంగా ఉండే వ్యక్తులూ ఉంటారు. వారు ఏ ఇంటికైనా సంతోషాన్ని వెంటబెట్టుకుని వెళ్తారు.
సమాజంలో అనేక సమస్యలు, వివాదాలు ఏర్పడటానికి ముఖ్యకారణం- మనుషుల మధ్య మాటతీరు సరిగ్గా లేకపోవడం, అవగాహనా లోపమని మనకు అర్థమవుతుంది. మాట తీరు ఎలా ఉంటే శ్రేయస్కరమనే అంశాన్ని, ‘మనుస్మృతి’ ఏనాడో సూచించింది. మనుషులు మాట్లాడే ధోరణులను ‘మనుస్మృతి’ నాలుగు విధాలుగా విభజించింది. మొదటిది- పారుష్యం; అంటే కఠినంగా మాట్లాడటం. మన మాటతీరు కటువుగా ఉంటే- మిత్రులు శత్రువులవుతారని హెచ్చరించింది. రెండోది- అనృతం. అంటే అసత్యాలు పలకడం. ఈ ధోరణి ఉన్నవారు డంబాలు పలుకుతారు. దాంతో అవతలి వ్యక్తులకు వీళ్లమీద విశ్వాసం ఏర్పడదు. ఎవరూ మనస్ఫూర్తిగా మాట్లాడరు. మూడోది- పైశూన్యం. అంటే, ఇతరుల మీద చాడీలు చెప్పడం. దీనివల్ల మనుషుల్లో ద్వేషాలు, కలహాలు పెచ్చరిల్లుతాయి. సన్నిహితులు విరోధులవుతారు. నాలుగోది- అసంబద్ధ ప్రలాపం. ఈ లక్షణం ఉన్నవారు అనవసర విషయాలు, విసుగు కలిగించే అంశాలు ఎక్కువగా మాట్లాడుతూ, వినేవారికి చికాకు కలిగిస్తుంటారు.
‘ప్రియంగా మాట్లాడేవాడికి శత్రువు ఉండడు’ అన్నాడు చాణక్యుడు. ‘మంచిగా మాట్లాడేవాడికి ఏం లభిస్తుంది’ అని యక్షుడు ధర్మరాజును అడిగినప్పుడు, ఆయన ‘మైత్రి’ అని సమాధానమిచ్చినట్లుగా మహాభారతం చెబుతోంది.
మంచిగా మాట్లాడేవారు అవతలి వ్యక్తులను ఎంతగా ఆకర్షిస్తారనడానికి రామాయణం కిష్కింధకాండలో హనుమంతుడి భాషణ గొప్ప ఉదాహరణ.
చాలామంది ఆలోచించకుండా మాట్లాడతారు. ఆ మాటల వల్ల అనర్థం జరిగాక అప్పుడు తీరిగ్గా ఆలోచిస్తారు. కానీ ఏం లాభం? ఇతరులు ఆవేశపడి, పరుషంగా మాట్లాడినా, మనం తొందరపడి ఆవేశంగా మాట్లాడకూడదు. ఓర్పుతో ఉండటం నేర్చుకోవాలి. పరుష భాషణం వల్ల వైరం ఇంకా పెరుగుతుంది. హితంగా, మితంగా, ప్రియంగా మాట్లాడటం అందరికీ ఆనందదాయకంగా ఉంటుందని మన శాస్త్రాలు ఉద్బోధిస్తున్నాయి.
‘మనసులో కుటిలత్వం లేకుండా, మధురభావంతో ఉండాలి. మన మాటలు మృదుమధురంగా ఉండాలి. చేసే ప్రతి పనిలో ఆలోచనలో మంచితనమే అంతర్లీనమై ఉండాలి’ అని అధర్వణ వేదం చెబుతోంది. అందువల్ల ఎప్పుడూ చల్లగా, ప్రియంగా మాట్లాడే ధోరణిని అలవరచుకుంటే, మనం ఎవరితో మాట్లాడినా, వాళ్ల హృదయంలో ఓ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకోగలుగుతాం.
సమాజం సజావుగా సాగాలంటే అందుకు ప్రియ భాషణమే చక్కని మార్గమని అందరూ గ్రహించాలి.