Devotional Telugu
3.46K subscribers
106 photos
23 videos
19 files
62 links
An attempt to bring our Hindu Devotional information
Download Telegram
విగ్రహారాధన

వేదాంతులు ఏ దేవుణ్నీ ప్రత్యేకించి ప్రస్తావించరు. మనిషికైతే మాత్రం దేవుడు తనకు మానవాకారంలో కాని, సృష్టిలో కనిపించే రూపాల్లోకాని, అతణ్ని ఊహించుకుంటూ చూస్తున్నప్పుడే సంతృప్తి. అందుకే అతడు ఆ రూపాలను విగ్రహాలుగా మలిచి, దేవాలయాలు నిర్మించి, అందులో ప్రతిష్ఠించుకుంటాడు.
వేదాంతులన్నట్ల్లుగా- దేవుణ్ని నిరాకార నిర్గుణ చైతన్యం అన్నా, నామ గుణ రూప రహితుడన్నా... పామరుడు సామాన్య జ్ఞానంతో తెలుసుకోలేడు. దేహమే దేవాలయం, హృదయమే దైవపీఠం అని చెబితే- పండితులకు కానీ తెలియని పెద్ద మాటలని అనుకుంటాడు. దేవుణ్ని దేవాలయాల్లో విగ్రహంగా చూసుకుంటూ ఆరాధించడమే అతడికి ఇష్టం. తనకు నచ్చిన పేర్లు పెట్టి ఆ దేవుణ్ని పిలుచుకోవడానికే అతడు మొగ్గుచూపుతాడు. సృష్టిలో కనిపించే శ్రేష్ఠమైన వస్తువులను, ధన కనక వస్తువాహనాలను కానుకలుగా దేవుడికివ్వాలని అనుకుంటాడు. ఇష్టదైవాల పేర్లు పెట్టి పిల్లలను పిలుచుకుంటాడు.

భగవంతుడి శక్తి విద్యుచ్ఛక్తిలాంటిది. అది నేరుగా చూడలేనిది. పరికరాలుంటేనే కానీ అది ప్రవహించదు. ఆస్తికతను అర్థం చేసుకున్న జ్ఞానులు, ఆ దైవశక్తిని అందుబాటులోకి తెచ్చుకుని అనుభవించడానికి ఉన్న పరికరమే దైవ విగ్రహమని తెలుసుకొమ్మంటారు. త్రిమతాచార్యులుగా ప్రసిద్ధికెక్కిన వేదాంత మహాగురువులు శంకరుడు, రామానుజుడు, మధ్వాచార్యుడు ముగ్గురూ విగ్రహారాధనను సమర్థనీయమన్నారు.
ఆస్తికతకు అర్థం తెలియనివారికి దేవతామూర్తుల విగ్రహాలు ప్రయోజనం లేని మానవ కల్పితాలుగా కనిపిస్తాయి. దేవుడికి అన్ని పేర్లా అంటూ అవహేళనగా ప్రశ్నిస్తారు. దైవంతో సరళమైన, శక్తిమంతమైన, తిరుగులేని సంబంధం ఏర్పడటానికి విగ్రహారాధన ప్రక్రియగా ఏర్పరచుకుని, మహాత్ములెందరో ఫలితం సాధించారని తెలియనప్పుడు అటువంటి విమర్శలు వస్తాయి. సత్యశోధనకు విగ్రహారాధనతో వచ్చే ఉపశమనం వేరుగా ఉంటుంది. ఏకాగ్రచిత్తంతో జరిపిన విగ్రహ పూజతో భావరహిత స్థితికి చేరుకుని, ఆరాధన ఆరాధకుడూ వేరు కాదన్న విషయాన్ని నిరూపించిన భాగవతోత్తముల చరిత్రలు తెలియనివి కావు. రామభక్తుడైన వాగ్గేయకారుడు త్యాగరాజు, నిత్యపూజ కోసం తన పూజాగృహంలో ప్రతిష్ఠించుకుని నిరంతరం ఆరాధించుకుంటున్న రామలక్ష్మణ సీతాదేవి విగ్రహాలను కిట్టనివారు ఎవరో నదిలోకి విసిరి పారవేస్తారు. అప్పుడాయన ఆవేదనతో, రచించి ఆలపించిన కీర్తనలకు స్పందించి భగవంతుడే ఆ విగ్రహాలను అవి ఉన్నచోటుకు చేర్చినట్లు వివరించే కథనం తెలిసిందే. కలియుగంలోనే, నిష్కామ భక్తితో కాళీమాత రూపాన్ని ఆరాధించిన రామకృష్ణ పరమహంస భగవత్‌సాక్షాత్కారం పొందిన అనుభూతి కలిగించుకున్నారు.
మనోవాక్కాయ కర్మలతో ముడివడిన విగ్రహారాధననే సనాతన ధర్మం ఆచరించమంటున్నది. దేవాలయ నిర్మాణాలు, విగ్రహ పూజల విధి విధానాలను ఆగమ శాస్త్రం సహేతుకంగా వివరిస్తుంది. దేవాలయంలో దేవుడి ఎదుట చదివే మంత్రాలను, స్తోత్రాలను దేహానికి, మనసుకు ఉపశమనమిచ్చే విధంగా మహర్షులు రచించి ఇచ్చారు. దేవాలయాలు సందర్శిస్తున్నప్పుడు భక్తితో దైవరూపాలను కొలుస్తున్నప్పుడు మనిషికి- భగవంతుడు పత్రం, ఫలం, తోయాలు తప్ప మరేదీ అడగలేదని గీతలో ఆయనే చెప్పిన విషయం గుర్తుకు రావాలి.
భగవంతుడి సాక్షాత్కారం ఇప్పించలేని మహిమలు తనకు వద్దంటాడు వివేకానందుడు. అంతర్యామిని చేరుకోవడమే లక్ష్యంగా సాగే ఆధ్యాత్మికులందరికీ గుర్తుండవలసిన విషయమది.
సుబ్రహ్మణ్య అష్టకమ్ కరావలంబ స్తోత్రమ్

హే స్వామినాథ కరుణాకర దీనబంధో,
శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో |
శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ‖ 1 ‖

దేవాదిదేవనుత దేవగణాధినాథ,
దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద |
దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ‖ 2 ‖

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్,
తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ |
శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ‖ 3 ‖

క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల,
పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే |
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ‖ 4 ‖

దేవాదిదేవ రథమండల మధ్య వేద్య,
దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్ |
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ‖ 5 ‖

హారాదిరత్నమణియుక్తకిరీటహార,
కేయూరకుండలలసత్కవచాభిరామ |
హే వీర తారక జయాzమరబృందవంద్య,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ‖ 6 ‖

పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయైః,
పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః |
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ‖ 7 ‖

శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా,
కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్ |
భక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ‖ 8 ‖

సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః |
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః |
సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మకృతం పాపం తత్^క్షణాదేవ నశ్యతి ‖
భరతుని ప్రేమ....త్యాగం

శ్రీరాముని ముఖ్య భక్తులలో ఒకడు.. భరతుడు. శ్రీరామునికి కూడా భరతునిపై ఎంతో ప్రేమ. అందుకే  దశరథునిలాగా భరతుని ప్రేమతో లాలించేవాడు. అందుకే రాముడు వనవాసానికి వెళ్లినప్పుడు భరతుడు శోకసంద్రంలో మునిగిపోయాడు. 

అత్యంత సుఖసంవృద్ధః సుకుమార స్సుఖోచితః!
కథం స్వపరరాత్రేషు సరయూమవగాహతే!!

అత్యంత సుకుమారమైన స్వభావం కలవాడు.. మెత్తని పాన్పులపై నిద్రిస్తూ, పన్నీటి స్నానాలతో రాజ్యభోగాలను అనుభవించేవాడు.. ఆ భోగాలకు దూరమై రామనామ స్మరణలో మునిగిపోయాడు. అన్న దూరమైనందుకు కుంగిపోయి.. నియమిత ఆహారాన్నే స్వీకరిస్తూ, కటికనేలపై నిద్రిస్తూ, చన్నీటి స్నానాలను ఆచరిస్తూ, అన్నలాగానే జటలను ధరించి రామ పాదుకా సేవకుడై భక్తితో అంతఃపురంలోనే తపస్సులా జీవితాన్ని గడిపాడు. రాముడు వనవాసానికి వెళ్లడానికి కారణం తానే అని ప్రజలు ఎక్కడ అనుకుంటారో అనే సందేహంతో కుమిలిపోయేవాడు. సింహాసనాన్ని అధిష్ఠించే అవకాశం వచ్చినా.. ధర్మానికి కట్టుబడి వద్దనుకున్నాడు. ఇదే విషయాన్ని వనవాసంలో ఉన్నప్పుడు రాముడికి లక్ష్మణుడు చెప్పాడు. ‘‘అన్నా! భరతుడు మనస్సులో ఎప్పడూ నిన్నే తలుస్తూ, చేష్టలలో నిన్నే అనుసరిస్తూ, నీకు దక్కని భోగానుభవం తనకూ అవసరం లేదని భావించే త్యాగధనుడు.

ఇంతటి సాధుశీలియైున భరతుడు క్రూరస్వభావం కలిగిన కైకేయికి కుమారుడిగా ఎలా పుట్టాడో కదా?’’ అని వాపోయాడు. భరతుని చరితాన్ని, తన మనసును ఆకర్షించే స్వభావాన్ని లక్ష్మణుడు సవిస్తరంగా పలికింనందుకు శ్రీరాముడు సంతోషించాడు. అయితే, కైకేయిని నిందించడాన్ని మాత్రం అంగీకరించలేదు. ‘‘లక్ష్మణా! నీవు ఎప్పడైనా ప్రియమైన భరతుని వృత్తాంతాన్ని మాత్రమే వివరిస్తూ నాకు ఆనందాన్ని కలిగిస్తూ ఉండు. అంతేకాని తల్లి కైకేయిని మాత్రం నిందించే ప్రయత్నం చేయవద్దు’’ అని స్పష్టం చేశాడు. అంతేకాదు..

నతే అంబా మధ్యమా తాత! గర్హితవ్యా కథంచన!
తామేవేక్ష్వాకు నాథస్య భరతస్య కథాంకురు!!

‘‘తండ్రిగారు మరణించాక మన వంశమర్యాదను భరతుడే నిలబెడుతున్నాడు. భరతుడు వచ్చి రాజ్యాన్ని పాలించమని, వనవాస దీక్షను విరమించమని కోరినప్పడు నేను అంగీకరించకుండా వెనక్కు పంపించాను. అతనికి నామీద ఉన్న ప్రేమను గుర్తుచేసుకుంటుంటే.. ఈ వనవాస కాలం పూర్తికాకముందే భరతుణ్ని చూసి రావాలని మనసు ఆశపడుతున్నది. మహాత్ముడైన భరతుణ్ణి కలిసి ఆనందిస్తానో కదా’’ అని శ్రీరాముడు అన్నాడు. శ్రీరామునిచే మహాత్ముడిగా సంబోధించబడిన భరతుని కీర్తి చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచేయుంటుంది. భరతుని స్వభావం, అన్నగారి పట్ల ప్రేమ, రాముడు దూరమైనప్పుడు గడిపిన త్యాగజీవనం.. అన్ని కాలాల వారికి ఆదర్శప్రాయంగా నిలిచేవే.
మహాకాళి ఆషాఢ బోనాలు

శక్తి సమన్వితమైన ప్రకృతిని దైవంగా సంభావించడం మన ధర్మంలో ముఖ్య భూమిక పోషిస్తోంది.
ఆషాఢంలో శక్తి ఆరాధన వేద సంప్రదాయం నుంచే విస్తరిల్లింది. ఆషాఢంలో మహిషాసుర మర్దినిని పూజించడం వల్ల ప్రతికూల పరిస్థితులు తొలగుతాయని స్మృతి కౌస్తుభం వివరించింది. ఆషాఢంలో ప్రకృతిపరంగా అనేక వ్యాధికారక స్థితులుంటాయి. వాటినుంచి బయల్పడటానికి పార్వతీదేవి రూపమైన ఐంద్రాదేవిని నియమపూర్వకంగా ఆరాధించాలని దేవీ అర్చన చంద్రిక చెబుతోంది. ఆషాఢమాసం ఆద్యంతం శాకమహాలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలని వ్రతరత్నాకరం తెలియజేసింది. ఆషాఢ అమావాస్యను అంబికా అమావాస్యగా వ్యవహరిస్తారని కాళికాపురాణం వెల్లడించింది. ఆషాఢమాసంలో కృష్ణపక్షంలో కోకిలా వ్రతం పేరిట శక్తిమాతకు వేప, రావి, మర్రి, మామిడి, జామ వృక్షాలనుంచి లేత చిగుళ్లను సేకరించి, వాటికి తేనె కలిపి శక్తి రూపాలకు నివేదన చేసి, ఆ మధు మిశ్రమాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. దీనివల్ల కఫ సంబంధిత అనారోగ్య సమస్యలు తొలగుతాయని విశ్వాసం. ఆషాఢంలో నిర్వహించే శాకంబరి ఉత్సవం ప్రధానమైనది. దుర్గమాసురుడు వరబల గర్వితుడై వేదాల్ని స్వాధీనం చేసుకున్నాడు. అందువల్ల వైదిక కర్మలకు, యజ్ఞయాగాదులకు ఆటంకం ఏర్పడింది. దేవతలు, రుషులు వేదోద్ధరణ కోసం మహాచండీ యాగాన్ని నిర్వహించగా, శతాక్షి పేరిట జగదీశ్వరి ప్రత్యక్ష మైందంటారు. అనంత దార్శనిక తత్త్వమే శతాక్షి రూపం. ఆమె ప్రచండ వీక్షణాలతో దుర్గమాసురుడు అంతమయ్యాడు. వేదాలు అసురశక్తుల చెరనుంచి దేవతల వశమయ్యాయి. శతాక్షి అనుగ్రహంతో జీవుల ఆకలి బాధను తీర్చడానికి శాకాలు, ఫలాలు, సస్యాలు వంటివి ఆవిష్కారమయ్యాయి. ఆ కల్పవల్లినే శాకంబరిగా, అన్నపూర్ణగా, అన్నదాయినిగా భక్తులు ఆరాధిస్తున్నారు. ఆషాఢంలో శక్తి మాతల ఆలయాల్లో ప్రధాన దేవతామూర్తిని వివిధ ఆకుకూరలతో, కూరగాయలతో, పండ్లతో అలంకరించి పూజించడంవల్ల అక్షయత్వం సిద్ధిస్తుందని నమ్మకం.
భోజనానికి రూపాంతరం బోనం. ఆషాఢంలో బోనాల్ని సమర్పించడమంటే, అమ్మ కృపవల్ల దక్కిన ఆహారాన్ని ఆ శక్తికే నివేదన చేసి కృతజ్ఞతలు చెల్లించుకోవడం.
సాధారణంగా ఆషాఢంలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లో బోనాల సందడి ఉత్సాహభరితంగా వెల్లివిరుస్తుంది. సికింద్రాబాద్‌లో నెలకొన్న ఉజ్జయినీ మహాకాళి జాతరతో ఈ సంబరం పతాకస్థాయికి చేరుకుంటుంది. మహాకాళితోపాటు మాణిక్యాల దేవిమూర్తులు ఆలయంలో కొలువై శక్తి, ముక్తి మాతలుగా భక్తుల ప్రణతుల్ని అందుకుంటాయి. శాకమిచ్చుట, పాకమిచ్చుట అనే రెండు ప్రధాన క్రియలు బోనాల సంబరంలో ముఖ్యమైనవి. వేపకొమ్మల్ని పసుపునీటిలో ఉంచి, ఆ నీటిని అమ్మవారికి సమర్పించడం శాకమిచ్చుటగా పేర్కొంటారు. బెల్లంతో తయారుచేసిన మధురమైన అన్నపదార్థాల్ని శక్తిమాతకు నివేదన చేయడాన్ని పాకమిచ్చుటగా వ్యవహరిస్తారు. సాగనంపు ఘట్టం ద్వారా అమ్మతల్లి ఆషాఢ ఉత్సవం సుసంపన్నమవుతుంది.
కాకతీయుల కాలంలో ప్రారంభమైన బోనాల వేడుకలు నేటికీ అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నాయి. కాకతి మాతకు రుద్రమదేవి ఆషాఢంలో బోనాలు సమర్పించి, అమ్మ అనుగ్రహాన్ని అందుకుందని ‘నృత్యరత్నావళి’ పేర్కొంది. గోల్కొండ జగదాంబికా ఆలయంలో ప్రతిఏటా ప్రారంభమయ్యే బోనాల సంరంభం, లష్కర్‌ బోనాలతో సందడిగా మారి, లాల్‌ దర్వాజా సింహవాహిని బోనాల ఉత్సవంతో పరిసమాప్తమవుతుంది. జానపదుల సామూహిక భక్తి చైతన్యానికి, సమష్టి తత్త్వానికి దర్పణం- ఆషాఢ బోనాల సంబరం!
మాహేశ్వర సూత్రాలు


వ్యాకరణానికి శబ్దశాస్త్రం అని ప్రసిద్ధి. శబ్ద శాస్త్రానికి మూలం మహేశ్వరుడు. కైలాసపర్వతంపై ప్రమథ గణాలు కొలుస్తుండగా పరమేశ్వరుడు ప్రతినిత్యం సాయంకాల సంధ్యావేళల్లో పరమేశ్వరితో కలిసి తాండవనృత్యం చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి. లయకారకుడైన పరమేశ్వరుడు అనంతమైన వాఙ్మయానికి మూలమైన అక్షరాలకు సృష్టికర్త. ఆయన ఢక్కానాదం నుంచి వెలువడిన అక్షరాలే మహేశ్వర సూత్రాలుగా జగత్ప్రసిద్ధిని పొందాయి. పద్నాలుగు సూత్రాల రూపంలో ఉన్న ఆ అక్షర సముదాయమే సమస్త వ్యాకరణ శాస్త్రాలకు ఆయువుపట్టు. వాటిని ఆధారంగా చేసుకొని ఎన్నో వ్యాకరణాలు లోకంలో పుట్టాయి. ‘అష్టాధ్యాయి’ అనే వ్యాకరణ శాస్త్రాన్ని రచించడానికి ముందు పాణిని మహర్షి హిమాలయాల్లో పరమేశ్వరుడి అనుగ్రహం కోసం తపస్సు చేశాడని, అతడి తపస్సుకు మెచ్చిన పరమశివుడు ఆనంద తాండవనృత్యం చేశాడని, ఆ సమయంలో శివుడి చేతిలో మోగిన ఢక్కానాదాల నుంచి వెలువడిన ‘అఇఉణ్‌’ మొదలైన పద్నాలుగు సూత్రాలు పాణిని మహర్షి చెవిన పడ్డాయని, వాటిని ఆధారంగా చేసుకొని ఆయన వ్యాకరణ శాస్త్రాన్ని రచించి లోకానికి అందించాడని ఐతిహ్యం.  

ఈ ప్రపంచం గాఢాంధకారంలో మునిగిపోకుండా కాపాడుతున్నది శబ్దమే. శబ్దం అనేది జ్యోతి వంటిది. అది వెలగకపోతే ప్రపంచం అంతా నిశ్శబ్దంగా మారిపోతుందన్నది దండిమహాకవి మాట. మనుషులు తమ నిత్యజీవితంలో ఒకరికొకరు అభిప్రాయ వినిమయం చేసుకోవడానికి మాటలే కదా ఆలంబనలు? మాటలు లేకుండా మనుగడ సాధ్యమా? మాటలు స్పష్టంగా, నిర్దుష్టంగా ఉంటేనే ఇతరులకు మనోభావాలు తెలుస్తాయి. అర్థాన్ని అనుసరించి ఉండే పదాలను ఉచ్చరిస్తేనే ఎదుటివారికి భావం బోధపడుతుందనేది సత్యం. అకారాది వర్ణమాలలో ఉండే అక్షరాలను భావస్ఫోరకంగా పదాలుగా కూర్చుకొంటేనే భావం అర్థమవుతుంది.
ఒక్కసారి నామవాచకాలను పరిశీలిస్తే శబ్దానికి ఉండే విశిష్టత తెలుస్తుంది. సూర్యుడికి తపనుడు అనే పేరుంది. తన వేడికిరణాలతో లోకాన్ని తపింపజేస్తాడు కనుక ఆ పేరు సూర్యుడికి సార్థకం. జాబిల్లికి చంద్రుడనే పేరుంది. తన చల్లని కిరణాలతో ఆహ్లాదపరచేవాడు కనుక ఆ పేరు అన్వర్థమైంది. ఇలా గుణాన్ని బట్టి, స్వభావాలను బట్టి పేర్లు ఉంటాయి. ఇదంతా శబ్దానికి గల ప్రత్యేకత.
శబ్దాలకు శక్తి ఉంటుందని మంత్రశాస్త్రాలు చెబుతున్నాయి. వేదమంత్రాలను చక్కగా స్వరానుగుణంగా పఠించకపోతే వాటి వాటి అర్థాలు మారిపోతాయని వేదాంగం అయిన శిక్షాశాస్త్రం చెబుతోంది.

అ, ఉ, మ అనే బీజాక్షరాలతో సమ్మిళతమైన ప్రణవనాదం ఓంకారంలో అమిత తేజస్సు ఉంటుందని సాధకులు చెబుతారు. ప్రణవాన్ని ఉచ్చరిస్తున్నంతసేపు మానవశరీరంలోని అన్ని అవయవాలూ చక్కగా పనిచేస్తాయని, ఆహ్లాదానికి గురవుతాయని మహర్షుల ఉపదేశం. సకల వేదాలు, సకల తపస్సులు, సకల వ్రతాలు... చివరికి చేరేది ప్రణవనాదంలోనికే అని కఠోపనిషత్తు చెబుతోంది.
పసితనంలో పాఠశాలలో పిల్లలు నేర్చుకొనే వర్ణమాల మాహేశ్వర సూత్రాలనుంచే లభించింది. అందుకే అక్షరాభ్యాస సమయంలో ‘ఓం నమః శివాయ’ అని పలకలపై రాయడం, ఆ అక్షరాలను పిల్లలతో పలికించడం, రాయించడం సంప్రదాయంగా వస్తోంది.

కాళిదాసమహాకవి రఘువంశమహా కావ్యారంభంలో పార్వతీదేవి వాక్కుకు ప్రతీక అని, పరమేశ్వరుడు అర్థానికి ప్రతిరూపుడని వర్ణించాడు. వాగర్థాల కలయిక అయిన భాష ఆదిదంపతుల జ్ఞానభిక్ష! అందుకే అక్షరాలన్నీ మాహేశ్వర సూత్రాలే!
రేపు ఆడికృత్తిక
శ్రీ సుబ్రహ్మణ్యుని ఆరాధనకు విశేషమైన రోజు
వీలైన వారందరూ సద్వినియోగం చేసుకోండి


ఆషాడ మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చే రోజుని ఆడి కృత్తిక అంటారు ... ఇది సుబ్రహ్మణ్యునికి అత్యంత ప్రీతికరమైన రోజు ... ఈ రోజున సుర్యోదయానికంటే ముందే నిద్ర లేచి శుచియైన తరువాత చలిమిడితో ( చలిమిడి అంటే బియ్యప్పు పిండిని బెల్లంతో కలిపి ముద్దగా చేయాలి ) ఆవు నేతితో మూడు వత్తుల దీపం శివ కుటుంబం ( శివుడు, పార్వతీ దేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు ) చిత్రపటం ముందు వెలిగించి ... చిమ్మిలి ( తెల్ల నువ్వులు బెల్లం కలిపి చేస్తారు ), పచ్చి పాలు, వడపప్పు ( నానబెట్టిన పెసరప్పు ), అరటి పండ్లు, తాంబూలం ఇవన్నీ నివేదించి, సుబ్రహ్మణ్యుని స్తోత్రాలు, సుబ్రహ్మణ్య జన్మ వృతాంతం చదువుకుని, సాయంత్రం వరకూ ఉపవసించి, సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని ప్రసాదముగా పిండి దీపము, చిమ్మిలి, వడపప్పు, అరటి పండ్లు స్వీకరించాలి. ముందు రోజు రాత్రి మరియూ ఆ రోజు రాత్రి కూడా బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా చేయడం వలన సుబ్రహ్మణ్య స్వామి వారి విశేష అనుగ్రహం కలుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మందమతులు, జడులు, మతి స్థిమితం సరిగ్గా లేని పిల్లలకు ఈ పూజ అమృత తుల్యంగా పనిచేస్తుంది. అందరికీ జ్ఞానం కలుగుతుంది. సుబ్రహ్మణ్యుడు ఉత్తమమైన జ్ఞానం కలిగిస్తాడు. ఇది తమిళ నాట ఎంతో విశేషంగా జరుపుకునే పండుగ. మన తెలుగు రాష్ట్రాల్లో అంతగా ప్రాచుర్యం లేదు. తమిళనాడుకు సమీపంలో ఉన్న ఊర్లలో మాత్రమే జరుపుతుంటారు. మా పూర్వీకులు చిత్తూరులో ఉండేవారు కనుక మేము కూడా ఇది తరతరాలుగా ఆచరిస్తున్నాం ...

అసలు ఎందుకు ఈ కృత్తికకు అంత ప్రత్యేకతో తెలుసుకుందాం ... తమిళులకు ఏ మాసమైన పౌర్ణమి రోజుతో మొదలవుతుంది, కనుక ఆషాడ పౌర్ణమి నుండీ వారికి ఆషాడ మాసం ప్రారంభమయ్యిందన్నమాట. మనకు ఆషాడ మాసంలో బహుళ ఏకాదశి నుండీ దక్షిణాయనం ప్రారంభమవుతుంది, అదే తమిళులకు తొలి శుద్ధ ఏకాదశి అన్నమాట. అంతేకాదు దక్షిణాయనం ముఖ్యంగా పితృ దేవతల ఆరాధనకు ప్రీతికరమైనది. పార్వతీ దేవి సుబ్రహ్మణ్యుని మాతృకలైన కృత్తికలకు ఏ మాసంలోనైనా కృత్తికా నక్షత్రం రోజున ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధిస్తారో వారికి సుబ్రహ్మణ్యుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని వరం ప్రసాదించిందట. అందులోనూ దక్షిణాయనానికి ముందు వచ్చే కృత్తిక గనుక దీనిని ఆది కృత్తిక అనీ, ఆషాడ మాసంలో వచ్చేది కనుక ఆడి కృత్తిక అనీ కూడా అంటుంటారు. అందుకే ఆషాడ ఆడి కృత్తిక సుబ్రహ్మణ్యుని ఆరాధనకు అత్యంత శ్రేయస్కరమైనది.

వీలైతే రేపు ఎవరైనా వేదవిధునికి కుదిరితే ( బాల బ్రహ్మచారి అయినా వేదవిధునికి ) షడ్రసోపేతమైన భోజనం పెట్టి, ఎర్రటి పంచ, పైపంచ, శక్తిమేరకు దక్షిణ, తాంబూలం, అరటి పండ్లు, గొడుగు, పాదరక్షలు, రాగి చెంబు( లేదా పంచపాత్ర ఉద్దరిణ, అర్ఘ్య పాత్ర ) సమర్పించి, తానే సుబ్రహ్మణ్యుని భావించి ఆశీర్వచనం తీసుకుంటే కలిగే ఫలితం మాటల్లో వర్ణించలేము ... ఒకవేళ బాల బ్రహ్మచారియైన వెధవిధుడు లేక గృహస్తు అయిన వెధవిధుడు లభించకపోతే మధ్యాహ్న సమయంలో ఎవరికైన ఆకలితో ఉన్నవారికి కడుపు నిండుగా ఆహరం పెట్టినా మంచిదే ... ఒకవేళ అటువంటి వ్యక్తి కూడా లభించకపోతే పశు పక్షాదులకు ఆహరం సమర్పించి సుబ్రహ్మణ్యుని ప్రార్ధించినా ఉత్తమ ఫలితం ఉంటుంది .

కనుక వీలైన వారందరూ తమ శక్తివంచన లేకుండా సుబ్రహ్మణ్య స్వామి వారిని రేపు ఆరాధించండి.

ఓం శరవణభవ
ఆశ - నిరాశ

ఆశ మనిషిని గెలిపిస్తుంది. నిరాశ మనిషిని ఓటమిపాలు చేసి కుంగదీస్తుంది. తన శారీరక, మానసిక బలంపై నమ్మకమే ఆత్మవిశ్వాసం. గెలవగలననే ధీమా మనిషికి ఆశను కలిగిస్తుంది. నిరాశావాదంలో పలాయనమార్గం గోచరిస్తుంది. ఆశ బతికిస్తే, నిరాశ మనిషిని చంపుతుంది.

రేపు లేదనుకుంటే జీవితం శూన్యం. భవిష్యత్తుపై ఆశే దారి చూపుతుంది. ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఈ లోకంలో ఎవరినీ ఎవరూ ఉద్ధరించలేరు. ఎవరికి వారే శ్రద్ధతో జ్ఞానాన్ని పొంది ఉన్నత విజయాన్ని అందుకోవాలి. అదే గీతాసారం.

ఓటమి చెందినప్పుడు మనిషిని నిస్పృహ, నిరాశ ఆవరిస్తాయి. ఎందులోనైనా ఓడిపోతాననే భయం పట్టుకుంటుంది. భవిష్యత్తు శూన్యమని భావిస్తాడు. తనకుతాను కుంగిపోయి చావుకు దగ్గరవుతాడు. ఆధ్యాత్మిక జ్ఞానం మనిషిని నిరాశావాదం నుంచి అమృతమయ విజయ సోపానానికి చేరుస్తుంది.

మానవుడికి కోరికలు సహజమైనవి. కోరిక తీరకపోతే నిరాశ కలుగుతుంది. తన సహజ ప్రతిభకు, పరిస్థితులకు తగ్గ కోరికలు కోరుకోవాలి. ఆకాశానికి నిచ్చెనలేసే కోరికలు అంతిమంగా పాతాళానికి దిగజారుస్తాయి. ఓటమిని రుచిచూపిస్తాయి.
శతయోజనాల సముద్రాన్ని దాటి లంకకు చేరుకున్నాడు హనుమంతుడు. లంఖిణిని సంహరించి అర్ధరాత్రి వరకు అనేక ప్రదేశాల్లో సీతామాతను వెతికాడు. అంతఃపురాన్ని గాలించినా, ఎన్ని గృహాలు వెతికినా జాడ తెలియలేదు. నిరాశతో కూర్చు న్నాడు. తాను సీత జాడ తెలియకుండా తిరిగివెళ్తే రాముడి వంశమంతా మృత్యువు పాలవు తుంది. సుగ్రీవుడి పరివారమంతా నశిస్తుంది. ఎన్నిచోట్ల గాలించినా సీత కనిపించలేదు. ‘ఎన్నో ఆశలతో లంకలో అడుగుపెట్టాను. తిరిగి వెళ్ళను. ఈ సముద్ర తీరంలో నిరసన వ్రతాన్ని ఆరంభించి, ఉపవాసాలతో మరణిస్తాను. ఆశతోనైనా రాముడు, సుగ్రీవుడు జీవించి ఉంటారు...’ అనుకున్నాడు.

నిరాశ మనిషిని శారీరకంగా, మానసికంగా నాశనం చేస్తుంది. విజయం సాధించాలంటే పట్టుదల, కఠోర పరిశ్రమ అవసరం. దిగులు చెంది పరాజయాన్ని పొందడం అవివేకం. ఆ స్థితిలో హనుమ ఉత్సాహాన్ని తెచ్చుకున్నాడు. అదే తన ఊపిరిగా భావించాడు. అశోకవనాన్ని చేరి సీతను చూశాడు. కడకు విజయాన్ని పొందాడు.

కొంతమంది ప్రతి చిన్న విషయానికీి భయపడి దిగులు చెంది నిరాశలో కూరుకుపోతారు. ఏదీ తనకు సాధ్యంకాదని అందరికీ దూరంగా పారిపోతారు. కనిపించని చిమ్మచీకటిని చూసి బాధపడేకన్నా చిరుదివ్వెను వెలిగిస్తే చీకటి తప్పుకొంటుంది. జ్ఞానం అవతరిస్తుంది.
హిమాలయ పర్వత ప్రాంతంలో చలికి వణికిపోతూ, జారిపోతున్న కొండలను దాటుకుంటూ శత్రుశిబిరాలనుంచి వచ్చే తుపాకి గుళ్లను భరిస్తూ కాపలా కాసే సైనికులు- నిరాశకు చోటివ్వరు.

లాభాలబాట నుంచి నష్టాల మార్గం పట్టినా నిరాశ చెందక పట్టుదలతో వ్యాపారరంగంలో విజయాన్ని సాధించిన వ్యాపారవేత్తలు ఎంతోమంది కనిపిస్తారు. పాఠశాల నుంచి ఉన్నత విద్యవరకు పరీక్షల్లో కృతార్థులు కాలేని సాధారణ విద్యార్థులు- నిరంతర కృషితో, దీక్షతో, తపస్సుగా విద్యను అభ్యసించి ఉన్నత పదవులను పొంది విద్యావేత్తలైన ఉదంతాలున్నాయి.

సంగీత, నటన, ఇతర కళారంగాల్లో ఏ మాత్రం పనికిరారంటూ తిరస్కరణకు గురైతేనేం- వారిలోని ప్రతిభను నమ్ముకుని, కృషితో చరిత్ర సృష్టించిన వారెందరో మనకు దర్శనమిస్తారు. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అన్న కవి వాక్కు- మనిషిని ఆశతో నడిపించి గెలిపించే సూత్రం!
🙏ఋణ విమోచన అంగారక స్తోత్రం🙏

స్కంద ఉవాచ |
ఋణగ్రస్త నరాణాంతు ఋణముక్తిః కథం భవేత్ |
బ్రహ్మోవాచ |
వక్ష్యేహం సర్వలోకానాం హితార్థం హితకామదం |
అస్య శ్రీ అంగారక స్తోత్ర మహామంత్రస్య గౌతమ ఋషిః అనుష్టుప్ ఛందః అంగారకో దేవతా మమ ఋణ విమోచనార్థే జపే వినియోగః |
ధ్యానమ్ |
రక్తమాల్యాంబరధరః శూలశక్తిగదాధరః |
చతుర్భుజో మేషగతో వరదశ్చ ధరాసుతః || ౧ ||
మంగళో భూమిపుత్రశ్చ ఋణహర్తా ధనప్రదః |
స్థిరాసనో మహాకాయో సర్వకామఫలప్రదః || ౨ ||
లోహితో లోహితాక్షశ్చ సామగానాం కృపాకరః |
ధరాత్మజః కుజో భౌమో భూమిజో భూమినందనః || ౩ ||
అంగారకో యమశ్చైవ సర్వరోగాపహారకః |
సృష్టేః కర్తా చ హర్తా చ సర్వదేవైశ్చపూజితః || ౪ ||
ఏతాని కుజ నామాని నిత్యం యః ప్రయతః పఠేత్ |
ఋణం న జాయతే తస్య ధనం ప్రాప్నోత్యసంశయం || ౫ ||
అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సలః |
నమోఽస్తు తే మమాఽశేష ఋణమాశు వినాశయ || ౬ ||
రక్తగంధైశ్చ పుష్పైశ్చ ధూపదీపైర్గుడోదకైః |
మంగళం పూజయిత్వా తు మంగళాహని సర్వదా || ౭ ||
ఏకవింశతి నామాని పఠిత్వా తు తదండకే |
ఋణరేఖాః ప్రకర్తవ్యాః అంగారేణ తదగ్రతః || ౮ ||

తాశ్చ ప్రమార్జయేత్పశ్చాత్ వామపాదేన సంస్పృశత్ |
మూలమంత్రం;
అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల |
నమోఽస్తుతే మమాశేషఋణమాశు విమోచయ ||
ఏవం కృతే న సందేహో ఋణం హిత్వా ధనీ భవేత్ ||
మహతీం శ్రియమాప్నోతి హ్యపరో ధనదో యథా |

అర్ఘ్యం |
అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల |
నమోఽస్తుతే మమాశేషఋణమాశు విమోచయ ||
భూమిపుత్ర మహాతేజః స్వేదోద్భవ పినాకినః |
ఋణార్తస్త్వాం ప్రపన్నోఽస్మి గృహాణార్ఘ్యం నమోఽస్తు తే || ౧౨ ||
స్వయంకృతాపరాధం



ఇనుమును ఎవరూ నాశనం చేయలేరు. దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. అలాగే మనిషినీ ఎవరూ నాశనం చేయరు. అతడి చెడు ఆలోచనలే నాశనం చేస్తాయి. ఇది రమణ మహర్షి మహితోక్తి.
సృష్టిలో మనిషి ఉత్కృష్టజీవి, తెలివిగల ప్రాణి. అటువంటి మనిషి పతనానికి ఎవరు కారకులని ప్రత్యేకించి వెదకనక్కర్లేదు. తన వినాశనానికి తానే కారకుడు. జీవిత గమనంలో మనం చేసే పనులకు ఆలోచనలే ప్రాతిపదిక. వాటికి క్షేత్రం మనసు. నేలలో వేప విత్తనం నాటితే వేపమొక్క మొలుస్తుంది. మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టు తయారవుతుంది. మనిషి జీవన సాఫల్యవైఫల్యాలకు మనసులోని ఆలోచనలే కారణమవుతాయి. ఏ మనిషినైనా శిఖరాగ్రం మీద నిలబెెట్టాలన్నా, అధఃపాతాళానికి తొక్కేయాలన్నా- ఆ పని ఎవరో పని కట్టుకుని చేయనక్కర్లేదు. అతడి ఆలోచనా విధానమే ఆ కార్యం నిర్వహిస్తుంది. గౌతమబుద్ధుడు ప్రవచించిన అష్టాంగమార్గంలో ఒకటి ‘సమ్యక్‌ ఆలోచన’. మన ఆలోచనలు సవ్యంగా సక్రమంగా ఉండాలని దీని భావం. మన మనసు ఒక ఇల్లనుకుంటే ఇంటి దొంగలు ఆరుగురు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని అందరికీ తెలిసినవారే. తెలిసినా అప్రమత్తంగా ఉండం. చొరబాటుకు అవకాశం ఇస్తాం. నష్టపోయాక విచారిస్తే ఏం లాభం?
అందరికంటే అధికంగా సంపాదించాలి... ఎలాగైనా, ఏం చేసైనా సంపాదించాలి... అందులోనే ఆనందం ఉంది... అదే జీవిత పరమార్థం- ఇలా సాగుతుంది ఒకడి ఆలోచన. అందరికీ నేనే పెద్దగా ఉండాలి. అందరిపైనా పెత్తనం చలాయించాలి. పెద్దరికంకోసం, అధికారం కోసం వంచన, కుట్ర, కుతంత్రం... ఏం చేసినా తప్పుకాదు- ఇలా ఆలోచించేవాళ్లు నేడు చాలామంది కనిపిస్తున్నారు. తనకంటే మంచి స్థితిలో ఉన్నవాణ్ని చూసి, సమర్థుణ్ని, ప్రతిభావంతుణ్ని చూసి అసూయపడటం, వారిని ఎలా నాశనం చేయాలని ఆలోచించడం చాలా మందికి అలవాటు. చూసినదల్లా నాకు దక్కాలి- అది దేశసంపదైనా, పరాయివాడి భార్య అయినా- నేనాశించింది అందాల్సిందేనని తపనపడేవారి సంఖ్య తక్కువేమీ కాదు. వీరంతా శారీరకంగానూ సంపదల్లోనూ బలవంతులే. కానీ నైతికంగా అతి దుర్బలురు. వారి ఆలోచనలన్నీ బలహీనమైనవే.
రావణుడు వేదవేదాంగ పారంగతుడు, శివపూజాతత్పరుడు, వరదాన బలాన్వితుడు. మహాబలసంపన్నుడు, శత్రుజన భయంకరుడు. యుద్ధతంత్రకోవిదుడు... ఇన్ని మేలిమిగుణాలు గల వ్యక్తిలో రెండే రెండు బలహీనతలు. స్వాతిశయం, కాముకత. రజస్తమోగుణాలు వాటి మూలకందాలు. స్వాతిశయం రావణుడిలో మొదటి నుంచీ రగుల్కొన్నది. మధ్యలో మొలకెత్తింది, ముదిరింది- కాముకత. మొత్తానికి రెండూ విషపు కోరలతో అతణ్ని కాటువేశాయి. దుష్టుల పట్టికలో అగ్రస్థానంలో నిలిపాయి. భారతీయులు పరమ పవిత్రంగా భావించే దాంపత్య జీవితాన్ని, పాతివ్రత్య ధర్మాన్ని భగ్నం చేయడానికి పూనుకోవడమే రావణుడు చేసిన మహాపాపం.
అసూయ, క్రోధం, దురభిమానం మనసునిండా నింపుకొన్న దుర్యోధనుడి పతనానికి ఇతరులెవరూ కారణం కాదు. అతడు సుయోధనుడు అభిమాన ధనుడు. ‘ధర్మమేమిటో నాకు తెలుసు కాని నా మనసు ధర్మమార్గంలో వెళ్లలేదు. అధర్మమార్గమంటే ఏమిటో కూడా తెలుసు. అది నన్ను విడిచిపెట్టడం లేదు, అని ఒక దశలో అతడే చెబుతాడు.
ఎన్ని ప్రజ్ఞలున్నా ఎంత అర్థఅంగ బలమున్నా మనసులో మంచి ఆలోచనలు పుట్టకపోతే, అధర్మమార్గంలో ప్రవర్తిస్తే- ఎంతటివారికైనా... పతనం తప్పదు.
విమర్శ ఎలా ఉండాలి?


‘ప్రపంచంలో సలహాలివ్వడం కంటే విమర్శించడం చాలా తేలిక’ అన్నాడో ఫ్రెంచ్‌కవి. సలహా ఇవ్వాలంటే ఎదుట ఓ మనిషి ఉండాలి. విమర్శించడానికి ఎదుట ఎవరూ ఉండనక్కర్లేదు. నేటి సమాజంలో సమయం, సందర్భం లేకుండా, విమర్శలు విపరీతమైపోయాయి.
ఒక కావ్యాన్నో కవితనో లేదా ఏదైనా ప్రణాళికనో అంశాన్నో విశ్లేషించేవారికి- ఆ కవి లేదా ఆవిష్కర్తకన్నా ఎక్కువ విషయ పరిజ్ఞానం ఉండాలి.

తార్కికంగా, నిష్పాక్షికంగా, అర్థవంతంగా చేసే విమర్శలు మనోవికాసానికి, ప్రావీణ్యాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడతాయి. విమర్శ మంచి గంధంలా పరిమళించాలి. మలయ మారుతంలా మనసును తాకాలి. విన్నవారి హృదయాలు నొచ్చుకోకుండా, వారి ఆలోచనా సరళిని ప్రభావితం చేయాలి.
వ్యక్తిని చూడకుండా, మిత్రుడా, శత్రువా అన్న ఆలోచనతో నిమిత్తంలేకుండా కేవలం అతడి సృజనాత్మకతను మంచిని మంచిగా, చెడును చెడుగా విడమరచి చేసే విమర్శ- సద్విమర్శ. ఈ సద్విమర్శ ఉభయులకు (రచయితకు, విమర్శకుడికి) ఎంతో శ్రేయస్కరం.

రామాయణ, భారత, భాగవతాది గ్రంథాల్లో మనకు విమర్శలు కోకొల్లలుగా కనబడతాయి. తన బోధలను, హితవును లక్ష్యపెట్టక పుత్రవ్యామోహమనే హాలాహల సాగరంలో మునిగిపోయిన ధృత రాష్ట్రుణ్ని అనేక సందర్భాల్లో విమర్శించాడు విదురుడు. మరిగే నీటిలో మన ప్రతిబింబం కనపడనట్లే- అతివ్యామోహంలోనూ అత్యంత ఆగ్రహంతోనూ రగిలి పోయేవాడికి విమర్శలు, హితబోధలు చెవికెక్కవు. మిడిమిడి జ్ఞానం కలవాళ్లు, సహనం లేనివాళ్లు, విచక్షణ తెలియనివాళ్లు- తమ దోషాలను ఇతరులు ఎత్తి చూపినప్పుడు అసలు సహించరు. తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న మొండివాదనకు సిద్ధపడతారు. రాజసూయయాగం చేయాలని ధర్మజుడు తలపెట్టి, కృష్ణుణ్ని అగ్రపూజకు ఆహ్వానించిన తరుణంలో, శిశుపాలుడు అజ్ఞానంతో, అహంకారంతో వాసుదేవుణ్ని అనేక విధాలుగా దూషిస్తూ కువిమర్శ చేసి, చివరకు ప్రాణాలు కోల్పోతాడు. రావణుడు తన అకృత్యాలను విమర్శించిన మండోదరిని, విభీషణుణ్ని లెక్కచేయడు. సత్యభామ పలుమార్లు సవతులను నిందించి, విమర్శించి, తగిన దుష్ఫలితం పొందింది.

విమర్శ గురించి విశ్లేషిస్తూ స్వామి వివేకానంద ‘మనల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్నీ స్వీకరించాలి. బలహీనపరచే ప్రతి ఆలోచననూ తిరస్కరించాలి’ అంటారు.
విమర్శలను సహృదయతతో, వినమ్రతతో స్వీకరించడమే సంస్కారం. ప్రతి రచయితలోనూ ఓ విమర్శకుడూ ఉండి తీరాలన్నది అనుభవజ్ఞుల మాట.
రచయితలు ఏది రాసినా ఆత్మ పరిశోధన చేసుకోవాలి. స్వయం విమర్శ చేసుకోవాలి. విమర్శకులపైన వ్యక్తిగతమైన విరోధం పెట్టుకుని ఎదురు దాడికి దిగడం శ్రేయస్కరం కాదు.
‘వినడానికి కటువుగా ఉన్నా, మీ గురించి వాస్తవాలు చెప్పేవారి సలహాలు తీసుకోండి’ అనేవారు ‘భారతరత్న’ మోక్షగుండం విశ్వేశ్వరయ్య.

విమర్శలకు గురైనప్పుడు కుంగిపోకూడదు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి.
అదేపనిగా ఇతరులలోని ప్రతి అంశాన్నీ, ప్రతి లోపాన్నీ ఎత్తి చూపడమే వృత్తిగా పెట్టుకునేవాడు తననుతాను ఉద్ధరించుకోలేడు. పొరపాట్లను ఎత్తి చూపేవారు సరిదిద్దే సూచనలు కూడా ఇవ్వడం సమంజసం. నిరాధారమైన విమర్శకు, నిర్మాణాత్మకమైన విమర్శకు మధ్యగల భేదాన్ని గుర్తించడం అవసరం. ఆ పరిజ్ఞానమే వ్యక్తి అభ్యున్నతికి శ్రీరామరక్ష.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
రాఖీ పూర్ణిమా, శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి జయంతి, శ్రావణ సోమవార ఈశ్వర ప్రీతి ఇత్యది పర్వదినయక్త శుభోదయము
మనిషి శరీరంలో ఆజ్ఞాచక్రం భృకుటి స్థానంలో ఉంటుంది. ఆలోచనా శక్తికది కేంద్రం. వేలితో కుంకుమను ధరిస్తూ భృకుటి దగ్గర నొక్కడం వల్ల.. ఆజ్ఞాచక్రం ప్రచోదనం చెంది జ్ఞాన నేత్రం తెరుచుకుంటుందని చెబుతారు. శరీరం కూడా ఉత్తేజితమవుతుంది. కుంకుమ ధరించే సమయంలో..
‘ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యాన కేళికలకంఠీం

ఆగమ విపిన మయూరీ మార్యామంతర్విభావయే గౌరీం’ అనే శ్లోకాన్ని పఠించాలని చెబుతారు..
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ఈ రోజు వ్యాస పౌర్ణమి


వ్యాసోచ్చిష్టం జగత్సర్వం... ఈ లోకంలో ఉన్న వాజ్ఞ్మయమంతా ఆ వ్యాస భగవానుడి ప్రసాదమే. నాలుగు ముఖాలు లేకున్నా ఆయన చతుర్ముఖుడైన బ్రహ్మతో సమానం. నాలుగు చేతులు లేకున్నా వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువుతో సమానం. నుదుటి భాగంలో మూడో కన్ను లేకున్నా కైలాసవాసి అయిన పరమశివుడితో సరితూగుతాడని వర్ణిస్తారు. వ్యాసాయ విష్ణు రూపాయ... వేదమయుడు, వేద రక్షకుడైన శ్రీ మహావిష్ణువే వ్యాసుడిగా అవతరిస్తుంటాడనీ చెబుతారు. ఆయన గురువులకే గురువు... గురు పరంపరలో తొలిగురువు.

ఎవరీయన?
వ్యాసుడు అంటే విభజించినవాడు అని అర్థం. వేదాలను విభజించినవాడు వేదవ్యాసుడయ్యాడు. వేద వ్యాసులైన వారందరికీ వేరే పేర్లున్నాయి. ఈ అవతార విశేషాలు విష్ణుపురాణం మూడో అధ్యాయం, దేవీ భాగవతం ఒకటో అధ్యాయంలో కనిపిస్తాయి.

కృత, త్రేత, ద్వాపర, కలి అనే నాలుగు యుగాలను కలిపి ఒక మహా యుగమంటారు. ఇలా అనేక మహాయుగాలు కాలగమనంలో వస్తూపోతూ ఉంటాయి. ప్రతి మహాయుగంలోని ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు స్వయంగా వ్యాసుడి రూపంలో అవతరిస్తాడు. వేదరాశిని విభజిస్తాడు. ఇప్పుడు నడుస్తున్నది వైవస్వత మన్వంతరం. ఇందులో ఇప్పటికి 27 మహా యుగాలు గడిచిపోయాయి. ఇరవై ఎనిమిదో మహాయుగంలో కలియుగం జరుగుతోంది. అంటే ఈ మన్వంతరంలో ఇప్పటికి 28 మంది వేదవ్యాసులు అవతరించారు.


వేద వ్యాసులు వీరు...
1.స్వాయంభువుడు 2.ప్రజాపతి 3.ఉశనుడు 4.బృహస్పతి 5.సవిత 6.మృత్యువు 7.ఇంద్రుడు 8.వసిష్ఠుడు 9.సారస్వతుడు 10.త్రిధాముడు 11.త్రివృషుడు 12.భరద్వాజుడు 13.అంతరిక్షుడు 14.ధర్ముడు 15.త్రయ్యారుణి 16.ధనుంజయుడు 17.కృతంజయుడు 18.సంజయుడు 19.భరద్వాజుడు 20.గౌతముడు 21.ఉత్తముడు (ఇతన్ని హర్యాత్ముడు అని కూడా పిలుస్తారు) 22.వేనుడు (ఇతన్ని వాజశ్రవుడు అని కూడా పిలుస్తారు) 23.సోమశుష్మాయణుడు 24.రుక్షుడు 25.శక్తి 26.పరాశరుడు 27.జాతూకర్ణుడు 28.కృష్ణద్వైపాయనుడు. ఈ వరస క్రమంలో పన్నెండు, పందొమ్మిది మహా యుగాల్లో వేదవ్యాసుల పేర్లు ఒకటే కావడం విశేషం. ఇరవై తొమ్మిదో మహాయుగంలో అశ్వత్థామ వ్యాసుడిగా అవతరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
పాలకుడు ఎలా ఉండాలంటే..!

రాజు ఎంత నిజాయతీపరుడైనా ఎప్పుడో ఒకప్పుడు ఒక తప్పయినా చేస్తాడు. అలా తప్పు చేసినవాడికి నరకం తప్పదు. అందుకే ‘రాజ్యాంతే నరకం ధ్రువం’ అన్నారు. మరి ఎలా పరిపాలించాలి. తప్పు జరగకుండా పాలకుడు ఎలా ఉండాలి. దీనికి సమాధానం శ్రీరామచంద్రుడి పరిపాలన. ‘రామో రాజ్య ముపాసిత్వా’ అన్నాడు వాల్మీకి. మనం ఒక భగవంతుడి మంత్రాన్ని ఎంత పవిత్రంగా ఉపాసిస్తామో, జపిస్తామో శ్రీరాముడు తన రాజ్యాన్ని అంత పవిత్రంగా, చిత్తశుద్ధితో పరిపాలించాడు. అందుకే ఆయన పదకొండు వేల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి సరాసరి పుణ్యలోకానికి వెళ్లిపోయాడని రామాయణం చెబుతోంది. ఈ సూత్రం ఎప్పటికీ ఆదర్శప్రాయం.