MAAGHA PURANAM -- 26
మాఘపురాణం - 26వ అధ్యాయము
సుధర్ముడు తండ్రిని చేరుట
పాపమా బాలుని జాతకము ఎటువంటిదో గాని తన తల్లి అడవిలో పులిచే చంపబడింది. ఇప్పుడు పెంపుడు తల్లి అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయినది. ఇక ఆ పిల్లవానిని దీన రక్షకుడగు శ్రీహరియే రక్షించాలి. ఆ రాత్రి బాలుడు ఏడ్చీ ఏడ్చీ అలసి నిద్రపోయాడు. అక్కడొక తులసిమొక్క వున్నది. నిద్రలో బాలుని చెయ్యి తులసిచెట్టు పై బడినందున ఆ రాత్రి అతనికే అపాయమూ కలుగలేదు. పైగా దైవభక్తి కలిగెను. ఉదయమే లేచునప్పటికి అడవిలో ఏకాంతముగా నున్నందున భయపడి బిగ్గరగా ఏడ్చినాడు. ఆ రోదనకు పక్షులు, జంతువులు, మృగములు కూడా రోదనచేసి ఆ బాలునికి రక్షణగా ఉండి ఆహారము తెచ్చి ఇచ్చుచుండెడివి. ఆ బాలుడు అడవి జంతువులచే పెంచబడుతూ దినదినాభి వృద్ధి చెందుతూ ఏ తులసి చెట్టు వద్ద పడి వుండెనో ఆ మొక్కకు ప్రతినిత్యము పూజలు చేయుచు కాలము గడుపుచుండెను.
అలా పెరుగుతూ పన్నెండేండ్లు ప్రాయం గల వాడయ్యెను. ప్రతి దినము తులసి పూజ భగవన్నామ స్మరణ చేస్తూ “నన్ను కాపాడుము తండ్రీ అనాధరక్షకా” అని ప్రార్థించుచు, ఒక్కొక్కప్పుడు విరక్తుడై “ఛీ ఎంత ప్రార్థించినా నా గతి ఇంతేనా? నేను బ్రతికెందుకు?” అని దుఃఖించుచుండగా, ఆకాశవాణి “ ఓ బాలచంద్రా! నీవట్లు విచారింపకుము. ఈ సమీపముననే ఒక కోనేరు వున్నది. మాఘమాసం ప్రవేశించినది. అందుచే నీవా సరస్సులో స్నానం చేసినయెడల శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్షమగును” అని పలికిన మాటలు ఆకాశమునుండి వినిపించినవి. వెంటనే ఆరాజకుమారుడు సరోవరమునకు వెళ్ళి మాఘమాస స్నానం చేసి శ్రీహరిని స్తుతించెను.
ఈ బాలుని నిష్కళంక భక్తికి, నిర్మల హృదయానికి లక్ష్మీ నారాయణులు ప్రత్యక్షమై అతనిని దీవించి “బాలకా నీకేమి కావలయునో కోరుకొనుము” అని యనగా “ప్రభూ! నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. నాకు ఆలనా పాలనా చేయువారెవరైననూ లేరు. పుట్టినది మొదలు కష్టములే తప్ప సుఖమన్నది ఎరుగను. ఈ వనచరములే నన్ను రక్షించి పోషించుచున్నది. గాన మీ సన్నిధానమునకు నన్ను తీసుకొని పొండు. మరేమియు అక్కరలేదు” అని ప్రార్థించెను.
“ఓయీ రాజనందనా! నీవు ఇంకను భూలోకమునందు ధర్మంగా పరిపాలన చేయవలసిన యవసరమున్నది. నీ తండ్రియగు సులక్షణుడు వృద్ధుడై నీగురించి నీ కన్నతల్లిని గురించి బెంగతో ఉన్నాడు. గాన నీవు నీ తండ్రి వద్దకు పోయిరమ్ము” అని చెప్పి ఆ కొలను సమీపమున తపస్సు చేసుకొనుచున్న ఒక మునీశ్వరునితోడు యిచ్చి సులక్షణుని వద్దకు పంపెను.
అప్పటికే సులక్షణుడు తన కడసారి భార్య గర్భావిటిగా వుండి ఎటుపోయెనో, పుట్టిన బిడ్డ ఏమాయెనో అని తన రాజ్యమంతయు వెదకించి తానును వెదకి వారి జాడ తెలియనందున విచారమనస్కుడై రాచకార్యములు చూడకుండెను. అటువంటి సమయములో మునివెంట కుమారుడు వెళ్ళెను. రాజుతో ముని యా బాలుని జన్మవృత్తాంతం తెలియజేయుసరికి సులక్షణ మహారాజు అమితానందభరితుడై బాలుని కౌగలించుకొని మునీశ్వరునికి మర్యాదలు చేసి కుమారునికి సుధర్ముడని పేరు పెట్టి పట్టాభిషేకము చేసెను.

MAAGHA PURANAM -- 27
మాఘపురాణం - 27వ అధ్యాయము
ఋక్షక యను బ్రాహ్మణ కన్య వృత్తాంతము
పూర్వము భృగుమహాముని వంశమందు ఋక్షకయను కన్య జన్మించి దిన దినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయెను.
ఋక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తి భావముతో ఇల్లు విడిచి గంగానదీ తీరమునకు బోయి ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించెను.
ఆవిధంగా చాలా సంవత్సరములు ఆచరించుట వలన ననేక మాఘ మాస స్నాన ఫలములు దక్కెను. ఆమె మనోవాంఛ ఈడేరు సమయం దగ్గర పడింది. ఒకనాడామె తపస్సు చేసుకొనుచూ ప్రాణములు విడిచెను. ఆరోజు వైకుంఠ ఏకాదశి అగుట వలన వైకుంఠమునకు వెడలెను. ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు పోయెను. ఆమె మాఘ మాస వ్రత ఫలము కలిగి పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడామెను సత్య లోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి “తిలోత్తమా”యను పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలంలో సుందోపసుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసిరి. వారి తపస్సుయొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై “మీకేమి కావలయును? కోరుకొనుడు” అని అనగా “స్వామీ! మాకు ఇతరుల వలన మరణము కలుగకుండా ఉండునట్లు వరమిమ్ము” అని వేడుకొనగా బ్రహ్మ అటులనే ఇచ్చితినని చెప్పి అంతర్ధానమయ్యెను.
బ్రహ్మ దేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహా గర్వము గలవారై దేవతలను హింసించి మహర్షుల తపస్సులకు భంగము కలిగించు చుండిరి. యజ్ఞయాగాది క్రతువులలో మాంసం, రక్తం, పడవేసి ప్రజలను నానాభీభత్సములు చేయుచుండిరి. దేవలోకముపై దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి.
ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని “మహానుభావా! సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము గలవారై తపశ్శాలురను బాధించుచూ దేవలోకమునకు వచ్చి మమ్మందరనూ తరిమి చెరసాలలో పెట్టి నానా భీభత్సం చేయుచున్నారు. గాన వారి మరణమునకు ఏదైనా ఉపాయము ఆలోచించు”మణి దేవేంద్రుడు ప్రార్థించెను. బ్రహ్మ దీర్ఘముగా నాలోచించి తిలోత్తమను పిలిచి “అమ్మాయీ! సుందోపసుందులను రాక్షసులను ఎవరి వలననూ మరణం కలుగదని వరం ఇచ్చియున్నాను. వర గర్వంతో చాలా అల్లకల్లోలం చేయుచున్నారు గాన నీవు పోయి నీ చాకచక్యంతో వారికి మరణం కలుగునటుల ప్రయత్నించుము” అని చెప్పెను.
తిలోత్తమ బ్రహ్మదేవునకు నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యమును ప్రవేశించెను. ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచూ ఆ రాక్షస సోదరులున్న నివాసమునకు సమీపములో తిరుగుచుండెను. వీణానాదమును ఆమె మధుర గానమును విని సుందోపసుందులు తిలోత్తమును సమీపించిరి. ఆమె ఎటు పోయిననటు, ఎటు తిరిగిననటులామెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుంటిరి. ఆమెను “నన్ను వరింపుము” యని తిలోత్తమను ఎవరికి వారు బ్రతిమలాడ సాగిరి.
ఓ రాక్షసాగ్రేసరులారా! మిమ్ములను పెండ్లియాడుట నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి యెడల ప్రేమతో నున్నాను. ఇద్దరినీ వివాహమాడుట సాధ్యం కానిది. గాన నాకోరిక ఒకటున్నది. అది ఏమనగా “మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారినే నేను ప్రేమించగలను” అని తిలోత్తమ చెప్పెను. తిలోత్తమ పలుకులు వారిని ఆలోచింప జేశాయి. నీకంటే నేను బలవంతుణ్ణి అని సుందుడు అంటే, లేదు నేనే బలవంతుణ్ణి అని ఉపసుందుడు అన్నాడు. ఇద్దరికీ వాగ్వివాదం పెరిగి పౌరుషం వచ్చింది. మనిద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకుందాం అంటూ ఘోర యుద్ధానికి తలపడ్డారు. గదాయుద్ధము, మల్లయుద్ధము చేశారు. పలురకాల ఆయుధాలతో పోరాడుకున్నారు. చివరిగా కత్తి యుద్ధం చేస్తూ ఒకరి కత్తి మరొకరి కంఠానికి ఖండించడంతో ఇద్దరూ చనిపోయారు. వారిద్దరూ మరణించడంతో దేవతలందరూ సంతోషించారు. తిలోత్తమను పలువిధాలుగా శ్లాఘించారు. బ్రహ్మదేవుడు కూడా సంతోషించి “తిలోత్తమా! నీ చాకచక్యంతో సుందోపసుందుల పీడను తొలగించావు. దేవతలందరికీ ఆరాధ్యురాలవైనావు. ఇదంతా నీవు చేసిన మాఘమాస వ్రత ఫలితమే కానీ మరొకటి కాదు. ఇకనుండి నీవు దేవలోకములో అందరిచే అధికురాలిగా ఆదరింపబడతావు. నీ జన్మ ధన్యమైనది. వెళ్ళు. దేవలోకంలో సుఖించుము” అంటూ ఆమెను దేవలోకానికి పంపాడు.

MAAGHA PURANAM -- 28
మాఘపురాణము 28వ అధ్యాయం
విష్ణువు బ్రహ్మ రుద్రాదులకు చేసిన హితబోధ
పూర్వము బ్రహ్మ, ఈశ్వరులకు వాదోపవాదం జరిగింది నేను గొప్ప అంటే నేను గొప్ప అని. నేను సర్వేశ్వరుడను, పధ్నాలుగు లోకములకు అధిపతిని నేనే అన్నాడు శివుడు. కాదు, ఈ పధ్నాలుగు లోకాలను, సమస్త చరాచర జీవరాశినీ, సృష్టించిన సృష్టికర్తను నేను. కావున నేనే గొప్ప అన్నాడు బ్రహ్మదేవుడు. వాదప్రతివాదములు, తర్కమీమాంసలతో వెయ్యేళ్ళు గడిచిపోయినవి. ఇద్దరూ వాగ్వివాదంలో మునిపోయారేమో సృష్టి కార్యం అంతా స్తంభించి పోయింది. అంతట శ్రీమహావిష్ణువు విరాట్ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ, ఈశ్వరులు ఇద్దరూ సమస్త లోకములూ ఇమిడివున్న ఆ రూపమును తిలకించి నిశ్చేష్టులైనారు. సప్త సముద్రాలు, సమస్త విశ్వమూ, ప్రకృతి భూత భవిష్యత్ వర్తమానములన్నీ కనిపించుచున్నాయి. అ విరాట్ రూపుని ఎడమచెవిలో శంకరుడు, కుడిచెవిలో బ్రహ్మదేవుడు ఉన్నారు. ఆ రూపమునకు ఆద్యంతములు లేవు. సర్వత్రా తానై ఉన్నాడు. అనేక వేల బాహువులతో ఉన్నాడు. సమస్త దేవాధిదేవులు, దేవతలు, రాక్షసులు, మునులు సమస్తమూ భగవంతుని కీర్తిస్తూ కనపడుచున్నారు. నదీనదములు, పర్వతములు, కొండలు, గుట్టలు, జలపాతములూ సమస్తమూ కనపడుచున్నవి. భీషణమైన వేడి నిట్టూర్పులు వెదజల్లబడుతున్నాయి. కోటి సూర్య కాంతుల వెలుగులలో ప్రకాశింపబడుతున్నాడు. సామాన్యులకు సాక్షాత్కరించని, వీక్షించలేని ప్రకాశవంతుడుగా ఉన్నాడు. ఆ విరాట్ రూపానికి మొదలెక్కడో చివర ఎక్కడో తెలియడం లేదు. ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములు తెలుసుకోవాలని అట్లు తెలుసుకున్న వారే అధికులనీ, బ్రహ్మ, ఈశ్వరుడు నిర్ణయించుకున్నారు. ఇరువురూ వెంటనే బయలుదేరి వెయ్యేళ్ళు తిరిగి ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేక యథాస్థానానికి వచ్చి ఇట్లు తలపోశారు. ఆహా! ఏమి ఇది? బ్రహ్మ, ఈశ్వరులైన మేము ఈ విరాట్ స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేక పోయితిమి. అంటే మనం అధికులం కాదన్నమాట. సమస్తమునకూ మూలాధారమైన శ్రీమహావిష్ణువే మనకంటే అధికుడన్నమాట. సృష్టి స్థితి లయ కారకుడతడే. అతడే సర్వాంతర్యామి. జగములనేలే జగదాధారుడతడే. పంచభూతాలు, సూర్యచంద్రులు, సర్వమూ ఆ శ్రీమన్నారాయణుడే. కావున ఆ శ్రీ మహావిష్ణువే సర్వమూ అయి వున్నాడు. మనమంతా ఆయన కుక్షిలోని కణములమే అని నిర్ణయించుకున్నవారై శ్రీమహావిష్ణువును స్తోత్రం చేయగా విష్ణువు విరాట్ రూపమును వదిలి యథారూపమును ధరించి మీరెంతో కాలమునుండి వాదించు కొనుచున్న విషయము తెలుసుకొని మీకు జ్ఞానోపదేశం కలుగుటకై ఈ విరాట్ రూపమును ప్రదర్శించాను. నా విరాట్ రూపముయొక్క ఆది మధ్యాంతములను తెలుసుకొనలేక నిశ్చేష్టులై మీ కలహాన్ని ఆపుచేశారు. మీరెందుకు అహంతో వాదించుకుంటున్నారో తెలిపెదను వినండి. “సమస్తమునకూ మూడు గుణములు నిర్దేశించబడ్డాయి. వీటీనే త్రిగుణములు అంటారు. అవి సత్త్వరజస్తమోగుణములు. మీరు రజస్తమో గుణములు కలిగిన వారు. ఎవరైతే సత్త్వరజస్తమో గుణములు కలిగిఉందురో వారే గొప్పవారు. తేజోవంతులుగా ఏకాత్మ స్వరూపునికి ఆదిలో మూడు రూపములే ఉన్నాయి. అవి సృష్టిస్థితి లయలు. సృష్టికి బ్రహ్మ, స్థితికి నేను, లయమునకు ఈశ్వరుని అధిపతులుగా చేసితిని. కావున వీరిని త్రిమూర్తులు అందురు. త్రిమూర్తులు అనువారు ముగ్గురు కాదు. ఏక స్వరూపమే. సృష్టి సౌలభ్యం కొరకు త్రిగుణాత్మక స్వరూపులమైనాము. కావున మీరు వేరు, నేను వేరు అనునది లేదు. అంతా ఏకత్వ స్వరూపమే. కావున మన ముగ్గురిలో ఎవరికీ పూజలు చేసినా ఏకాత్మ స్వరూపునికే చెందుతాయి. త్రిమూర్తులమైన మనలో భేదముండదు. రజస్తమో గుణముల ప్రభావముచే మీరిట్లు ప్రవర్తిన్చిరి. శాతమునొంది చరింపుడు. బ్రహ్మదేవా! నీవు ఎక్కడినుండి ఉద్భావిన్చావు? నా నాభికమలము నుండియే కదా! కావున నీకును, నాకును బెధమున్నడా? లేదు. అట్లే ఓ మహేశ్వరా! ఓంకార స్వరూపుడవగు నీ గొప్పతనమును తెలియగోరి నారదుడొకనాడు నీ మహాత్మ్యమును తెలుపమనగా నేను నీయొక్క మహిమను సర్వస్వమును వినిపించితిని. నాటినుండి సర్వేశ్వరుని ఘనతను నారదుడు సమస్త లోకాలకూ విస్తరింపజేశాడు. ఓ సాంబశివా! నువ్వు నిర్వికార నిరాకల్పుడవు. శక్తి స్వరూపుడవు, త్రినేత్రుడవు, సర్వేశ్వరుడవు, ఆదిదేవుడవు నీవే. ఆత్మ స్వరూపుడవు నీవే. భోళా శంకరుడవైన నీవే ఇంత పంతము పట్టదగునా? నేనే నీవు, నీవే నేను అందుకే శివకేశవులని భక్తులు భజియుంతురే! పూజింతురే! నిత్య సత్య స్వరూపుడవు. నిత్యానంద రూపుడవు. నిత్య ధ్యాన స్వరూపుడవు. అర్థ నారీశ్వరుడవు. నీవుకూడా నాతొ సమనుడవే” అంటూ బ్రహ్మకు, శివునకు జ్ఞానోపదేశం చేసి వారిద్దరికీ సఖ్యత కుదిర్చి వారిని ఆశీర్వదించి పంపివేసెను. కావున మాఘమాసమందు త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన జగద్రక్షకుడగు ఆ శ్రీహరిని పూజించినచో సమస్త పాపముల నుండి విముక్తులగుటయే కాక స్వర్గార్హత పొంది సుఖించగలరు.

MAAGHAPURANAM - 29
మాఘమాసమందు ఏకాదశీ మహాత్మ్యము – క్షీర సాగర మథనము.
మాఘమాసమునందు నదీస్నానము చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేథ యాగము చేసిన ఫలము కలుగును. అట్లే ఈ మాఘమాస ఏకాదశీ వ్రతం చేసి ఉపాసం వున్న వారలు వైకుంఠప్రాప్తినొందగలరు. మాఘమాసమందు ఏకాదశీ వ్రతమొనరించి సత్ఫలితము పొందిన దేవతలకథలు వినండి.
పూర్వకాలమందు దేవతలు, రాక్షసులు క్షీర సాగరమును మధించి అమృతమును గ్రోలవలెనని అభిప్రాయమునకు వచ్చిరి. మంధర పర్వతమును కవ్వముగాను, వాసుకి అను సర్పమును త్రాడుగాను, చేసుకొని క్షీరసాగరాన్ని మధించసాగారు. తలవైపు రాక్షసులు, తోక వైపు దేవతలు ఉండి మధించుచుండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. పిమ్మట ఉచ్చైశ్రవము అనే గుఱ్ఱము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరల పాల సముద్రమును మధించగా లోకభీకరమైన ఘన తేజస్సుతో నొప్పారు అగ్ని తుల్యమైన హాలాహలము పుట్టినది. ఆ హాలాహల విష జ్వాలలకు సమస్త లోకములూ నాశనమవసాగాయి. దేవతలు, రాక్షసులు భయపడి పారిపోసాగారు. సర్వులూ సర్వేశ్వరుని శరణుజొచ్చారు. భోళాశంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు. కాలకూట విషమును పానము చేసినందువల్లనే శివుని కంఠము నీలంగా మారింది. అందుకే శివునికి నాటినుండి నీలకంఠుడు అని పేరు వచ్చినది. మరల దేవ దానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మధించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు వారిరువురు తగవులాడుకొన సాగిరి. అంతట శ్రీమహావిష్ణువు మాయామోహిని అవతారమునెత్తి వారి తగవును పరిష్కరింపదలచాడు.
మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవరూ లేరు. జగన్మోహిని యైన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయా మోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్యరాశి. ఆమె వారిరువురి మధ్యకూ వచ్చి అమృతాన్ని ఇరువురికీ సమానముగా పంచెదను. ఎందుకీ తెగని తగవులాట? మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను. మీకిష్టమేనా? అన్నది. దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోనూ, రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడిరి. జగన్మోహిని రెండు భాండములను తీసుకొని ఒక భాండమునందు సురను, మరొక దానియందు అమృతమును నింపి నర్తిస్తూ మురిపిస్తూ మైమరపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు, అమృతమును దేవతలకు పోయసాగింది. మంద భాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింప సాగారు. ఈవిధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది. ఈ కనికట్టును గమనించిన రాహుకేతువులు మాయాదేవతగా మారి దేవతల పంక్తిలో కూర్చొని అమృతాన్ని పానం చేశారు. రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపించి తన చక్రాయుధంతో తలను నరికివేసింది. ఈమోసమునకు రాక్షసులు, దేవతలు గొడవపడ్డారు. శ్రీమహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రుడికి ఇచ్చాడు. త్రిమూర్తులు అదృశ్యమయ్యారు. దేవేంద్రుడు అమృత భాండాన్ని భద్రపరచుచుండగా రెండు చుక్కలు విధివశాత్తూ నేలరాలాయి. అవి పడిన చోట రెండు దివ్యమైన మొక్కలు పెరిగాయి. అవే పారిజాత, తులసి మొక్కలు. సత్రాజిత్తు అనే మహారాజు వాటికి నీరుపోసి పెంచసాగాడు. కొంత కాలమునకు పారిజాత వృక్షము పుష్పించి అద్భుతమైన సువాసనలను వెదజల్లసాగింది. ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా వెళ్తూ పారిజాత పుష్ప వాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకొని తన భార్యయైన శచీదేవికి ఇచ్చాడు. మిగిలిన వారు కోరగా మరల వచ్చి రహస్యంగా పువ్వులను కోయదలచి తోటలో ప్రవేశించాడు. అంతకు ముందే తన తోటలోని పువ్వులను ఎవరో అపహరిస్తున్నారని అనుమానం వచ్చిన సత్రాజిత్తు శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి మంత్రించిన అక్షతలను పువ్వులపై, వనమంతా జల్లాడు. దేవేంద్రుడు పారజాత పువ్వును త్రెంచుచుండగా అక్షతల ప్రభావం వల్లనో, విష్ణు మహిమ వల్లనో మూర్ఛపోయాడు. ఈవార్త తెలిసిన దేవతలందరూ నారదుణ్ణి బ్రతిమలాడగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి విషయాన్ని వివరించాడు. అంత కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు బయలుదేరాడు. సత్రాజిత్తు మిక్కిలి భగవద్భక్తి పరాయణుడగుటచే అమోఘమైన శక్తిచే అలరార సాగాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపమున కనిపించి అతనికి వరప్రసాద మొనరించి అమృత తుల్యమగు పారిజాత వృక్షాన్ని దానికర్హుడగు దేవేంద్రునికి ఇప్పించెను. అట్లే తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పగా నాటినుండి తులసి శ్రీమహావిష్ణువు సాన్నిధ్యంలో ఆయనతో సమానంగా పూజలు అందుకొన సాగింది. అందుచే తులసిని పూజించినచో సకల సౌభాగ్యములు సిద్ధించును.
ఫలశ్రుతి:
సూతమహర్షి శౌనకాది మునులతో మహర్షులారా! వశిష్ఠుల వారు దిలీపునకు తెలియజేసిన మాఘమాస మహాత్మ్యమును, మాఘ స్నాన మహిమను మీకు వివరించితిని. మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞం కూడా పూర్తి కావచ్చింది. కావున సర్వులూ మాఘమాస వ్రతమును

, నదీ స్నానమును నియమ నిష్ఠలతో చేసి ఆ శ్రీహరి కృపకు పాత్రులు కండి. మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందుండగా సూర్యోదయం అయిన తర్వాత నదిలో స్నానం చేయాలి. ఆదిత్యుని పూజించి విష్ణ్వాలయమును దర్శించి శ్రీమన్నారాయణునకు పూజలు చేయాలి. మాఘమాసం ముప్పది రోజులూ క్రమం తప్పక మిక్కిలి భక్తి శ్రద్ధలతోనూ, ఏకాగ్రతతోనూ, చిత్తశుద్ధితోనూ శ్రీమహావిష్ణువు ను మనసారా పూజించినచో సకలైశ్వర్య ప్రాప్తియూ, పుత్రపౌత్రాభివృద్ధియు, వైకుంఠప్రాప్తి నొందగలరు.
సర్వే జనాః సుఖినో భవన్తు!!
మాఘపురాణం సంపూర్ణం!!
సర్వే జనాః సుఖినో భవన్తు!!
మాఘపురాణం సంపూర్ణం!!
కుటుంబం
ఓ రాజు వేటకోసం అడవిలోకి వెళ్ళాడు. దట్టమైన ఆ అడవిలో ఓ సాధువు చెట్టు కింద ధ్యానంలో నిమగ్నమై ఉండటం చూసి దగ్గరగా వెళ్ళాడు. వినయంగా అడిగాడు- ‘ఇంత దట్టమైన అడవిలో మీరిలా ఒంటరిగా ఉన్నారు. రకరకాల క్రూరమృగాలు సంచరిస్తుంటాయి. భయం అనిపించదా?’
ధ్యానంలోంచి తేరుకుంటూ సగం తెరిచిన కళ్లతో- ‘నేను ఒంటరిని కాను. నా కుమారుడు, నా కుటుంబం నాతోనే ఉన్నారు కదా’ అన్నాడు.
రాజుకు అనుమానం వచ్చింది. చుట్టూ కలియజూశాడు. ఎవరూ కనిపించకపోవడంతో ‘స్వామీ, ఎవరూ లేరే... కుటుంబం అంటున్నారు... ఎక్కడ?’ అని అడిగాడు.
ఆ సాధువు శాంతంగా ‘మహారాజా, ప్రపంచంలో అన్నీ వ్యక్తం కావాలన్న నియమం లేదు. కొన్నింటిని చూడగలం. మరికొన్నింటిని చూడలేం.’
అర్థంకాని రాజు ‘నాకు బోధపడలేదు మీరేమంటున్నారో. మీ కుటుంబాన్ని పరిచయం చేయరూ’ అనడిగాడు తెలివిగా.
‘సహనం నా తండ్రి. క్షమ నా తల్లి. శాంతి నా తోడు. కరుణ, అహింస నా సోదరీమణులు. జ్ఞానం నా ఆహారం... వీటితో బంధుత్వం కలిగిఉన్నప్పుడు ఎవరికైనా భయం ఎలా కలుగుతుంది?’
రాజుకు ఆ మాటలు చిత్రంగా అనిపించాయి.
ఎవరైతే కోరికల్లాంటివి లేకుండా తటస్థంగా ఉంటారో, ఆత్మతో లీనమై ఉంటారో... వారికి తత్వం బోధపడుతుంది.
ప్రతి వ్యక్తికీ రెండు కుటుంబాలు ఉంటాయి. ఒకటి వ్యక్తం, మరోటి అవ్యక్తం. సాధారణంగా తండ్రిగాని తల్లిగాని కుటుంబ పెద్ధ ఆధ్యాత్మికం విషయానికొస్తే ఓర్పు కుటుంబపెద్ధ ఎవరినైనా రక్షిస్తుంది. తొందరపాటు ఉండకూడదు. కష్టాలొచ్చినప్పుడూ ఓర్పుతో ఉండటం మంచిది. క్షమాగుణాన్ని తల్లితో పోలుస్తారు. ఓర్పునకు మారుపేరుగా భూమాతను చెబుతారు. ప్రతి ఒక్కరినీ భూమి మాతృమూర్తిలా లాలిస్తుంది. ఎవరైతే ఆధ్యాత్మిక కుటుంబం కలిగిఉంటారో, వారు దేనికీ భయపడనవసరం లేదు. ఓర్పు, క్షమాగుణం కలిగినవారు, ముఖ్యంగా ఏ తప్పూ చేయనివారు దేనికీ భయపడకపోగా ఒత్తిళ్లకు దూరంగా ఉంటారు.
శాంతి ఒక తోడూనీడలా ఉంటుంది. అందుకే ఆనందం ప్రశాంతత... సత్యం కొడుకు... ఈ ప్రపంచంలో రక్షించేవి, సమస్యల్లో చిక్కుకోకుండా చూసేవి... కరుణ, అహింస సోదరీమణులు. ఇవి కలిగిఉన్నవారు మానసికంగా, శారీరకంగా, కనీసం వాక్కు ద్వారానైనా ఎవరికీ హాని తలపెట్టరు. మానసిక నియంత్రణశక్తి సోదరుడు. సోదరుడు ఎన్నో విషయాల్లో అండగా నిలుస్తాడు. నియంత్రణ లేని మనసు అనేక సమస్యలకు కారణమవుతుంది. అలాగే ఇంద్రియాల విషయంలోనూ వీటిని అదుపులో ఉంచుకుంటూ ఉపయోగించుకునే కళను అలవరచుకోగలిగితే అధైర్యం దరిచేరదు. ఇలా ఆధ్యాత్మిక కుటుంబం కలిగినవారు గొప్ప సంపన్నులు, అదృష్టవంతులు.
భౌతిక కుటుంబం ఒక్కటే కలిగిఉండి, ఆధ్యాత్మిక కుటుంబం లేకపోతే జీవితంలో బాధలు, ఒత్తిళ్లు ఎదుర్కొనక తప్పదు. ఎందుకంటే- సొంతమనుకునే భార్యా పిల్లలు, సోదరసోదరీమణులు... ఎవరినీ పూర్తిగా విశ్వసించలేని పరిస్థితులు వస్తాయి. కాలానుగుణంగా ఏర్పడిన బంధుత్వాలు, సంబంధాలు... పరిస్థితులు అనుకూలించకపోతే ఎవరికి వారు వదిలేసి వెళ్ళిపోవచ్ఛు కేవలం భౌతిక కుటుంబంపైనే ఆధారపడకుండా ఆధ్యాత్మిక కుటుంబాన్నీ ఏర్పరచుకోవాలి. ఈ రెండు కుటుంబాలను ఎవరు బలంగా కలిగిఉంటారో- వారంత శక్తిమంతులు, అదృష్టవంతులు మరొకరు ఉండరు!

వేడుకోలు
‘వేడుకుంటే మాధవుడు ఆదుకుంటాడు’ అంటారు భాగవతులు. అలా ఆదుకునే భగవంతుణ్ని చూసే, చేరే, తెలుసుకునే, అవగాహన చేసుకునే మార్గాలను చూపుతుంది భాగవతం. అందులో భాగంగానే వేడుకోలు ప్రాధాన్యాన్ని, శక్తిని పాఠకులకు ఎరుక పరుస్తుంది ఆ పురాణం. అనువాద ప్రారంభంలో పోతన చేసిన ప్రార్థనా పూర్వక వేడుకోలుతో ఈ ప్రస్థానం మొదలవుతుంది.
‘కాటుక కంటి నీరు...’ అనే పద్యంలో సరస్వతీ దేవిని వేడుకుంటూ ‘అమ్మా! నేను అనువదించే ఈ కావ్యాన్ని సామాన్యులకు అంకితం ఇవ్వను’ అని నమ్మబలికే విధంగా దేవికి మాట ఇచ్చాడు. తన భాగవత అనువాదానికి ఆ అమ్మను అండగా ఉండమని అడిగాడు. ‘శ్రీకైవల్య పదంబు...’ అనే పద్యంలో అదే హామీని మళ్ళీ విష్ణువుకు ఇచ్చాడు. ‘భాగవతాన్ని ఆంధ్రీకరించి రాజులు జమీందారులు లాంటివారికి ఇచ్చి వారిచ్చే బహుమానాలతో జీవించాలనే తాపత్రయం నాకు లేదు’ అని చెప్పి తన రచన సాఫీగా సాగేలా చేయమని శ్రీహరిని వేడుకున్నాడు. వేడుకోవడం ఎలాగో, దాని ప్రభావం ఎలాంటిదో అనుభవపూర్వకంగా తెలిసినవాడు కాబట్టి ఆయన వేడుకోలులో ఎన్నో రకాలు ఉన్నాయని, ఎవరి స్థాయి/స్థితిని బట్టి వారు ఆయా విధాలుగా వేడుకుంటే ముక్తి కలుగుతుందని భాగవతం ద్వారా ఎరుకపరచాడు. దానికోసం అనేక కథలు చెప్పాడు. ప్రార్థన, ఆప్యాయత, శరణాగతి, వైర, మూఢ... లాంటి అనేక భక్తి మార్గాల ద్వారా వేడుకోవడం ఎలాగో భాగవతంలో తెలిపాడు.
ప్రథమ స్కంధంలోని అశ్వత్థామ గర్వపరిహార ఘట్టంలో ఉత్తర గర్భరక్షణ కోసం చేసిన వేడుకోలు, శుకుణ్ని పరీక్షిత్తు మోక్షమార్గం కోరే ఘట్టం; తృతీయ స్కంధంలో దితి, కశ్యప సంవాద ఘట్టంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపుల వేడుకోలు లాంటివి ప్రార్థనా పూర్వకమైనవి. యశోద వేడుకోలు ఆప్యాయతా భక్తికి అద్దంపడుతుంది. ‘మన ఇంట్లో పాలు, పెరుగులకు ఏమి కొరత? ఇతరుల ఇళ్ళలో వాటిని దొంగిలించి నలుగురి నోట్లో పడవద్దు’ అని మందలిస్తుంది. మందలింపైనా వేడుకోలు అనిపించేలా ఉంటుంది.
రుక్మిణి వేడుకోలు ఆత్మీయతా భక్తికి నిదర్శనం. నీయందు నా మనసు ఎల్లప్పుడూ స్థిరంగా నిలిచి ఉండేటట్లు చూడు’ అని కృష్ణుణ్ని కోరుకుంది రుక్మిణి.
అలాగే, సుదాముడి భక్తికి మెచ్చి ఏదైనా వరం కోరుకో అన్నాడు కృష్ణుడు. అప్పుడు సుదాముడు నిరంతరం నీ పాదపద్మాల సేవ చేసుకునే భాగ్యం, అలాంటి సేవకులతోటి స్నేహం, ఎప్పటికీ తరిగిపోని భూతదయ నాకు ప్రసాదించు’ అని వేడుకున్నాడు. ఇది అనురాగపు వేడుకోలు.
గోపికల వేడుకోలులో ప్రేమ, ఆప్యాయత అనురాగం, ఆత్మీయతలు కనిపిస్తాయి. గజేంద్రుడి వేడుకోలు నిరహంకారానికి ప్రతీక. నా శక్తియుక్తులన్నీ ఉడిగి పోయాయి. నీవు తప్ప ఇతరులెవరూ నన్ను రక్షించలేరు... కాబట్టి వచ్చి రక్షించు’ అని వేడుకున్నాడు.
ధ్రువుడి వేడుకోలు నిర్వికల్ప స్థితికి ఉదాహరణగా నిలుస్తుంది. ధ్రువుడు చేస్తున్న తపస్సువల్ల ఏర్పడిన అల్లకల్లోల పరిస్థితిని గమనించి విషయం తెలుసుకోవడానికి విష్ణువు స్వయంగా ఆ బాలుడి దగ్గరకి వెళ్ళాడు. పొంగిపోయి స్తోత్రం మొదలుపెట్టాడు ధ్రువుడు. ‘స్వామీ, ఈ శరీరం పడిపోతున్నదని మృత్యుభయం పొందకుండా, ఆఖరి శ్వాసలోనూ నిన్నే తలచుకుంటూ పొంగిపోయే లక్షణం ఉన్న మహా భాగవతులు నిన్నే పొందుతున్నారు. వారు నీలో ఐక్యం అయిపోతున్నారు. అటువంటివారితో నాకు సాంగత్యం ఇప్పించు తండ్రీ’ అని అడిగాడు. ఈ విధంగా ‘వేడుకోవడం’ అనే భక్తిభావంతో ఆ అంతర్యామి కృపకు పాత్రులైనవారు ఆయనలోనే ఐక్యమయ్యారు.

భక్తవత్సలుడు
విష్ణుమూర్తికి భక్తుల పట్ల అంతులేని ఆదరణ. త్రిమూర్తుల్లో స్థితికారకుడు, దేవతల కష్టాలను సైతం హరించేవాడు కావడంవల్ల ఆయనకు ‘హరి’ అనే మరో పేరు వచ్చిందంటారు. అంతటి శక్తిమంతుడికి ఇతర ప్రాణికోటి బాధలు తొలగించడం కష్టమైన పని కాదు. కష్టాలు తొలగాలనుకునేవారంతా హరిభక్తి గలవారై ఉండాలి. అలాంటి భక్తులకే ఆయన అత్యంత ప్రాధాన్యం ఇస్తాడు. అంతేతప్ప తాపసులు, ఇతరత్రా ఉన్నతులు అనిపించుకున్న మరెవరికీ ప్రాధాన్యం ఇవ్వడు. అందుకే భక్త పక్షపాతి, భక్తవత్సలుడు అనిపించుకున్నాడు. ఈ విషయాన్ని భాగవతం అనేకచోట్ల కథలు, కథనాలు, వ్యాఖ్యానాల రూపంలో నిరూపించింది. వాటిలో అంబరీషోపాఖ్యానం ఒకటి. మనస్ఫూర్తిగా భగవంతుని నమ్మినవారికి ఆయన ఎలాంటి ఫలితాలు ఇస్తాడు, తనంతటివాడు లేడనే అహంకారం చూపేవారిని ఎలా చూస్తాడనే విషయాలను తెలుసుకోవడానికి ఈ ఉపాఖ్యానం బాగా ఉపకరిస్తుంది.
అంబరీషుడు పరమ హరిభక్తుడు. అంతటి భక్తుడిపట్ల దుర్వాసుడు అతి చిన్న కారణానికే తన సహజమైన అమిత కోపం ప్రదర్శించాడు. తన జడ పాయతో శక్తిని పుట్టించి ఆయనపైకి వదిలాడు. అంబరీషుడు మాత్రం ‘హరిని నమ్ముకున్నవాడికి ఏ హానీ కలగ’దని హరి నామస్మరణ చేస్తూ ధీమాగా ఉన్నాడు. దుర్వాసుడి అహంకారం, అంబరీషుడి నమ్మకం రెండింటినీ చూసిన శ్రీహరి- తన భక్తుడి నమ్మకాన్ని గెలిపించాలని తలచి, సుదర్శన చక్రాన్ని ఆజ్ఞాపించాడు. అది ముందుగా దుర్వాసుడు పుట్టించిన శక్తిని దహించింది. తరవాత అతడివైపు మరలింది. దాని బారినుంచి తప్పించుకోవాలని ఎక్కడెక్కడికో వెళ్లాడు దుర్వాసుడు. అయినా విడవకుండా వెంటాడుతూనే ఉంది. బ్రహ్మను, శివుణ్ని శరణు కోరాడు. వారు అతణ్ని రక్షించడం తమవల్ల కాదన్నారు. చివరికి చక్రాన్ని వదిలిన విష్ణువునే శరణు వేడాడు. అప్పుడాయన- ‘ఓ మహామునీ! నా భక్తులకు ఆపద వస్తే కాపాడటం నా ధర్మం. వారికి ఎవరైనా కీడు తలపెడితే నేను సహించను. వారికంటే ఇంకెవరూ నాకు ఎక్కువ కాదు. ఇప్పుడు నువ్వు నా శరణు కోరి వచ్చావు కాబట్టి చెబుతున్నాను. నువ్వు ఏ భక్తుడికి హాని తలపెట్టావో అతణ్నే శరణు వేడుకో. నీకు రక్షణ దొరుకుతుంది’ అన్నాడు. దుర్వాసుడు అలా చేశాక సుదర్శన చక్రం అతణ్ని విడిచిపెట్టింది.
భాగవతం ద్వితీయ స్కంధం రెండో అధ్యాయంలో శుకమహర్షి పరీక్షిత్తుకు భక్తి మార్గమే ముఖ్యమని చెబుతూ- ప్రతి క్షణం భగవధ్యానం చేస్తూ, ఆయన పట్ల పరిపూర్ణ భక్తి కలిగి, మనసును నియంత్రించుకుని శుద్ధ చైతన్య రూపుడైన పరబ్రహ్మయందు లీనమైన మనసు కలవాడైతే ఆత్మానందాన్న పొందుతారు’ అని చెప్పాడు.
‘భాగవతాన్ని వినేవారు, చదివేవారు జీవితంలో ఎప్పుడూ ఈశ్వరుణ్ని జ్ఞాపకానికి తెచ్చుకోవడం, కష్టం వచ్చినా సుఖం కలిగినా దాన్ని ఈశ్వరుడితో అనుసంధానం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఫలితంగా వారికి అహం ఏర్పడదు’ అని భాగవత (సంస్కృత, అనువాద)కారులు చెబుతారు. వారే ఏకాదశ స్కంధం అయిదో అధ్యాయంలో ‘భక్తిహీనులు’ ఏ రకమైన గతులు, స్థితులు పొందుతారో సవివరంగా తెలిపారు. ఆయా విషయాలు చదివినవారికి లోతుపాతులు స్పష్టంగా బోధపడతాయి. భగవద్భక్తికి మించింది సృష్టిలో మరేదీ లేదు. అందువల్ల మనం ఏ పనిమీద ఉన్నా భగవంతుడి స్మరణ మాత్రం విడిచిపెట్టకూడదు. ఇహం/దేహంతో తాదాత్మ్యత చెందిపోకూడదనే విషయాన్నీ ప్రతి ఒక్కరూ అనుక్షణం గుర్తుంచుకోవాలి. ఇలా ప్రవర్తించిననాడు జీవుడు వేరు, దేవుడు వేరు కాదు. జీవుడే దేవుడు... దేవుడే జీవుడు!

నేను
రెండే రెండక్షరాల పదం ‘నేను’. ఈ పదం ప్రతి మనిషికీ ఎంతో ఇష్టమైనది. అయినా నేను అనే భావనను పోగొట్టడానికే ప్రతి మనిషీ ప్రయత్నించాలి. ఎందుకంటే నేను అంటే అహం. నేను అనుకున్నప్పుడే ‘నాది’ అనే భావం పుడుతుంది. అన్నింటిమీదా మమకారం కలుగుతుంది. నేను లేకపోతే ఇకనాది అనేది ఉండదు. అందుకే అహంకారాన్ని మనిషి తొలగించుకోవాలి.
అహంకారం మనసులోకి ప్రవేశించాక మనిషి మనుగడే కష్టమవుతుందని మన ఇతిహాసాలు, పురాణాలు బోధిస్తున్నాయి. రామాయణంలో శ్రీరాముడు తన సందేహాలు తీర్చుకోవడానికి వసిష్ఠుడి వద్దకు వెళ్తాడు. లోపలనుంచి వసిష్ఠుడు ‘ఎవరూ’ అని ప్రశ్నిస్తాడు. ‘నేను’ అంటాడు రాముడు. ‘నేనంటే’ అని వసిష్ఠుడు మళ్ళా ప్రశ్నిస్తాడు. ‘అది తెలుసుకోవడానికే మీ దగ్గరికి వచ్చాను గురుదేవా’ అంటాడు రాముడు. అప్పుడు వసిష్ఠుడు ‘నేను కూడా నేను అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను. నాకు తెలిసిన తరవాత నీకు బోధిస్తాను’ అంటాడు.
ఈ పాంచ భౌతిక శరీరానికి ప్రాధాన్యం ఇచ్చినంతవరకు ‘నేను’ అనే భావం నుంచి బయటపడటం సాధ్యం కాదు. నేను, నాది, నావాళ్లు అనే ఆలోచనలు స్వార్థానికి దారితీస్తాయి. వీటి మీద మమకారం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. నేను అనే ఈ అహంకారం ఓ అజ్ఞానమని మహాభారతం బోధిస్తోంది. దానివల్ల మనిషి విచక్షణ కోల్పోతాడని, అతడి అభివృద్ధి కుంటువడుతుందని చెబుతోంది.
భారత యుద్ధంలో అర్జునుడు తన ఎదుట శత్రుస్థానంలో నిలిచి ఉన్నవారిని చూసి చలించిపోయాడు. సోదరులు, తాతలు, గురువులు... ఇలా అనేకమంది యుద్ధరంగంలో కనిపించారు. ‘వీరందరూ నా వాళ్లు... వీరినా నేను చంపాల్సింది’ అనే మమకారానికి లోనయ్యాడు. అప్పుడు శ్రీకృష్ణుడి గీతోపదేశంతో ఎరుక కలిగి కర్తవ్యాన్ని పాటించాడు. విజయుడయ్యాడు.
నిండుకుండ తొణకదు అన్నట్లుగా జ్ఞానాధికులు అహంకారం, మిడిసిపాటు లేకుండా వినయ విధేయతలతో కనిపిస్తారు. ఒకసారి సోక్రటీసు ఆలోచనలతో నిమగ్నుడై రహదారిపై నడుస్తున్నాడు. పరధ్యానంగా ఉన్న సోక్రటీసును ఓ అధికారి ఢీకొన్నాడు. ‘ఎవరు నీవు’ అని ఆ అధికారి సోక్రటీసును అడిగాడు. సోక్రటీసు నెమ్మదిగా ‘నేను ఎవరో తెలుసుకోవడానికే ప్రయత్నిస్తున్నాను’ అంటాడు.
‘ఈ శరీరం నాది కాదు’ అని మహానుభావులు గ్రహిస్తారు. వారికి శరీరభావం ఉండదు. వారు పరోపకారం చేస్తూ ఉత్తమ వ్యక్తిత్వంతో మానవత్వ సౌరభాలు వెదజల్లేలా చేస్తారు.
ఒక భక్తుడు రమణమహర్షిని ‘దుఃఖంలో ఉన్నాను... మనశ్శాంతి ఎలా లభిస్తుంది’ అని ప్రశ్నించాడు. రమణమహర్షి ఇలా అన్నారు- ‘నిద్రలో లేని దుఃఖం మెలకువలో ఉంటోంది. కారణం నిద్రలో ‘నేను’ అనే తలంపు లేదు. అంతా సుఖమే. మెలకువ రాగానే ‘నేను’ అనే భావన కలుగుతోంది. అందుకే ‘నేను’ తాలూకు పుట్టుక స్థానాన్ని వెదకమంటున్నాను. ఈ ‘నేను’ పోతే అంతా సుఖమే. అంతా శాంతే!’
ఈ విశ్వానికి సృష్టికర్త ఆ భగవంతుడు. సృష్టి మొత్తం ఆ భగవంతుడిదే. అన్నీ ఆయనవే. ఆయనవి కానివి ఈ లోకంలో ఏమీలేవు. చివరికి మనం కూడా ఈ సృష్టిలోని భాగమే. అందుకే యమునాచార్యులు తమ స్తోత్ర రత్నంలో ఇలా పేర్కొన్నారు. ‘స్వామీ! ఇన్నాళ్లూ ఇదినాది అని అనుకున్నదేదీ నాదికాదని తెలిసిపోయింది. చివరకు నేను అనుకునే నేను కూడా నీకు చెందిన మనిషినే. అన్నీ నీవేనని తెలిసింది. నాదంటూ ఏదీ లేనప్పుడు... అసలు నేనే నాకు కానప్పుడు నీకు నేను ఏమివ్వగలను?’ ఇలా శరణాగతి లక్షణంతో భక్తితత్వాన్ని ప్రకటించిన మనిషి నిరహంకారుడై ఉంటాడు. అప్పుడే నేను గొప్ప, నేను తక్కువ అనే భేదభావం ఆ మనిషిలో ఉండదు. అతడు మానవసేవ చేస్తూ సకల ప్రాణుల్లోనూ సర్వేశ్వరుణ్ని చూస్తాడు.

పక్కలో బల్లేలు
‘మంచి మనసులేని అందం, వాసన లేని పువ్వు, క్రమశిక్షణ లేని చదువు, సమయపాలన లేని విధి నిర్వహణ, ఆచరణ లేని మాటలు... ఎదుటివారికే కాదు, ఎవరికైనా కీడు చేస్తాయి’ అంటారు స్వామి వివేకానంద. సంస్కారవంతమైన హృదయంలో చెడు తలపులు రావు. చెడ్డతనమే అరిషడ్వర్గాలను ప్రేరేపిస్తుంది. ఇవి బయట ఎక్కడో కనిపించేవి కావు. మన(లోపలి) అంతశ్శత్రువులు. అవే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. వీటిలో ఏ ఒక్కటైనా చాలు మనిషిని సర్వనాశనం చేయడానికి! సప్త వ్యసనాలకు బానిస అయ్యాడంటే మనిషిని ఏదో ఒక దుర్లక్షణం ప్రభావితం చేస్తోందనే అర్థం.
పరస్త్రీ వ్యామోహం, జూదం, వేటాడి వన్య మృగాలను సంహరించడం, మద్యపానం, వాక్పారుష్యం, ఉగ్రదండనం (చేసిన తప్పిదానికి మించి శిక్ష విధించడం), అర్థదుర్వినియోగం అనే ఈ సప్త వ్యసనాలకు మనిషిని ప్రేరేపించేది కామక్రోధాది అంతశ్శత్రువులే. మనిషి తన వ్యసనాలను, బలహీనతలను కప్పిపుచ్చుకోవడానికి అనేక విధాలుగా సమర్థించుకుంటూ ఉంటాడు. అనేక సాకులు చెబుతుంటాడు. అసత్యం కంటే మించిన పాపం లేదని, సత్యాన్ని మించిన ధర్మం లేదని వైఖానస ధర్మసూత్రం వివరించింది. సత్యవాక్కు మాత్రమే మనిషికి తేజస్సును, కీర్తిని ఇస్తుందని ఛాందోగ్యోపనిషత్తు చెబుతోంది. అపసవ్య మార్గాన భోగవాసనలను అనుభవించాలన్న కోరికకు మూలం కామం. దాన్ని వదిలివేయడంలో గల చిదానందానుభూతిని మహోపనిషత్తు పేర్కొంది. మనో వికారాలన్నీ హృదయంలో నింపుకొని పుణ్యతీర్థ యాత్రలెన్ని చేస్తే మాత్రం ఏం లాభం అని ‘దుర్జన పద్ధతి’లో భర్తృహరి ప్రశ్నిస్తాడు. అజ్ఞానం, అవిద్య వల్లనే అహంకారం అంకురిస్తుందని విదురుడు అంటాడు.
మద మాత్సర్యాల వల్ల మనిషిలో ప్రతికూల ఆలోచనలు పెల్లుబుకుతాయి. ఆ ప్రతికూల ఆలోచనలే విజయానికి అవరోధాలవుతాయి. నిరహంకారి పలికే మంచి మాట దానం లాంటిది. ప్రతిఫలంగా సత్ఫలితాన్నే ఇస్తుంది. చెడ్డమాట అప్పు లాంటిది. ప్రతిగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. తనకు తెలియనిది ఎంతో ఉందన్న సత్యాన్ని తెలుసుకోవడానికి మనిషి దీర్ఘాయుష్మంతుడై ఉండాలి. మన ప్రవర్తనే మనకు శత్రువుల్ని, మిత్రుల్ని తెచ్చిపెడుతుంది. మనసులోని మంచీ చెడు భావాలకు ప్రవర్తనే ప్రత్యక్ష దర్పణం.
దుర్మార్గం వీడనివాడు, సంయమనం లేనివాడు, ధ్యాన తత్పరత లేనివాడు, చిత్తశుద్ధి లేనివాడు ఆత్మజ్ఞానం పొందలేడని కఠోపనిషత్తు కథనం. ఆత్మజ్ఞాన ప్రాప్తి కోసం నిరంతరం సాధన చేసే సాధకుణ్ని అరిషడ్వర్గాలేమీ చేయలేవు. బ్రహ్మహత్య చేసినవాడికి, సురాపానం చేసేవాడికి, చోరుడికి, వ్రతభంగం చేసేవాడికి ప్రాయశ్చిత్తమనేది ఉంటుందని; కృతఘ్నుడికి మాత్రం నిష్కృతే లేదని మనుస్మృతి చెబుతోంది.
పరిమళభరితమైన కస్తూరిని తన నాభిలోనే ఉంచుకొని, అది ఎక్కడ ఉందోనని అంతటా అన్వేషించే లేడి వంటివాడు మనిషి. తనలోనే ఉన్న దైవాన్ని అంతర్దృష్టితో చూడలేక అరిషడ్వర్గాలను పక్కలో బల్లేలుగా ఉంచుకుంటాడు. ఐహిక వాంఛలకు దాసుడైన మానవుడు సత్యాన్ని, స్వీయ దౌర్బల్యాన్ని అవగాహన చేసుకుని, జితేంద్రియత్వం సాధించే దిశగా ప్రయాణిస్తే ఏనాటికైనా మోక్షార్హత పొందగలడు. ఆధ్యాత్మిక దృష్టితో మనిషి తనను తాను మలచుకొని రాగë�్వేషాలకు అతీతంగా జీవనయాత్ర కొనసాగించడమే మనిషి పరమావధి!

ఉగాది ప్రాముఖ్యత
ఉగాది ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది మన తెలుగు పండుగ అని. ఉగాది నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఈ రోజు కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు.
ఉగాది ప్రాముఖ్యంచైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాధ.”ఉగాది”, మరియు “యుగాది” అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. “ఉగ” అనగా నక్షత్ర గమనం.కి ‘ఆది’ ‘ఉగాది’.అంటే సృష్టి ఆరంభమైనదినమే “ఉగాది”. ‘యుగము’ అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది.
ఒక్క తెలుగు
సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగా నూ, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు.
ఉగాది పచ్చడి ప్రాముఖ్యత :
ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక.
బెల్లం – తీపి – ఆనందానికి సంకేతం
ఉప్పు – జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం
వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు
చింతపండు – పులుపు – నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు
పచ్చి మామిడి ముక్కలు – వగరు – కొత్త సవాళ్లు
కారం – సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు
మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది పండగ శుభాకాంక్షలు

సహనం ప్రధానం
జీవితంలో ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవాలన్నా, భౌతికపరమైనవి దక్కించుకోవాలన్నా మనిషికి సహనం తప్పనిసరి. చాలామంది ఎన్నో ముఖ్యమైన విలువల విషయంలో ‘అది నాకు సంబంధించింది కాదు’ అని కొట్టిపారేస్తుంటారు. మనిషి తన జీవన విధానాన్ని పరిశీలిస్తే, ప్రతిరోజూ ఎరుకలేకుండా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంతో కొంత తెలిసో, తెలియకో అనుసరిస్తూనే ఉంటాడు. చిత్రమేమిటంటే ఆ అనుసరిస్తున్నది ఆధ్యాత్మిక సంబంధమైనదని భావించకపోవడం.
సహనం అంటే ఏమిటి? నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకుంటూ, నిరంతరం అంకితభావంతో చేసే కృషి. అవాంతరాలెదురైన సందర్భాల్లో సైతం, పక్కకు తప్పుకోకుండా ఆత్మస్థైర్యంతో పట్టుదలతో ఎదుర్కోవడం... పొగడ్తలకు, విమర్శలకు ప్రాధాన్యమివ్వకుండా చేసే యజ్ఞం. కార్యక్షేత్రం ఏదైనా కోరుకున్న ఫలితాలను సాధించాలంటే, శిఖరాలను అధిరోహించాలంటే- సహనం తప్పనిసరి. ప్రపంచం మనుగడే సహనంతో ముడివడిఉంది.
మనిషి సంకుచితత్వం, స్వార్థం, పాపాలు, అతిక్రమణలు, ప్రేమరాహిత్యం... అన్నింటినీ ఈ పుడమి భరిస్తూనే ఉంది. అందుకేనేమో తమిళకవి, తత్వవేత్త తిరువళ్ళువర్ సహనాన్ని భూమాతతో పోల్చి చెప్పారు.
ఎంత ప్రతిభఉన్నా, గొప్ప కళాకారుడిగా ఎదగాలన్నా, అవకాశాలను చేజిక్కించుకోవాలన్నా- సహనం అవసరం.
సహనం లోపించడంవల్ల కలిగిన అనర్థాలకు చరిత్ర, పురాణాలు సాక్ష్యమిస్తాయి. గొప్పగొప్ప సామ్రాజ్యాలు బుగ్గిపాలు కావడం, గొప్ప నియంతలు మట్టికరవడం... ఎన్నో జరిగాయి. అసహనంతో నిండిన మనసు- అసూయాద్వేషాలకు నివాసస్థలం.
శ్రీకృష్ణుడు పాండవులకు సహనం పాటించడంలోని గొప్పతనాన్ని చెబుతూ, నిజమైన యోగి లక్ష్యం స్థితప్రజ్ఞతని అంటాడు.
కొన్ని పరిస్థితుల్లో సహనం వేదనను రగిలిస్తుంది. మానసిక సమతుల్యతతో దాన్ని స్వీకరిస్తూ, ఇష్టాయిష్టాలను పక్కనపెడితే ఎరుకలో ఒక కొత్తస్థాయిని చేరుకోవచ్చు. ఈ వేదనవల్ల భగవంతుడి తేజస్సు హృదయంలోకి ప్రవేశిస్తుంది. సహనం మానసిక స్వచ్ఛతకు దారిచూపి భగవదనుగ్రహానికి చేరువ చేస్తుంది. విలువైనదేదీ త్వరితగతిన దక్కదు. లక్ష్యసాధనలో ఆటుపోట్లు తప్పవు.
కష్టనష్టాలను భరించగలిగే సహనాన్నిబట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. ద్వంద్వాలతో నిండిన ప్రపంచంలో జీవిస్తున్న మనిషికి చిత్తశుద్ధి అవసరం. ఎరుకతో జీవించడమెలాగో నేర్చుకోవాలి. నాణేనికి బొమ్మ బొరుసూ ఉంటాయి. మనిషి అన్నీ తనకు అనుకూలంగా ఉండాలని ఆశపడటం సహజం. ఒక అదృశ్యశక్తి పరిస్థితుల్ని నియంత్రిస్తూంటుంది. మనిషి సదాలోచనలు, సహనమే ఆ విధిని అనుకూలంగా మార్చుకోవడంలో తోడ్పడతాయి.
ఎంతో నష్టానికి కారణమైన కురుక్షేత్ర సంగ్రామానికి సహనంలేని దుర్యోధనుడే కారకుడు.
అసహనంవల్లే అశోకుడు లక్షల మంది ప్రాణాలు కోల్పోయేలా చేసిన కళింగ యుద్ధానికి కారకుడయ్యాడు.
మత సహనం లేనందువల్లే ఎన్నో వికృతమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. చిత్రమేమిటంటే- మతాలన్నీ సహనాన్నే బోధిస్తాయి.
మనిషికి సరైన వైఖరి, విశ్వాసం ఉంటే నిస్సహాయ పరిస్థితుల్లో సైతం అత్యద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. సహనం నిండుగా ఉంటే దైవబలంతోడై కొండలను సైతం కదిలించవచ్చునని గ్రహించాలి.

సృజనాత్మక జీవితం
నయనాలు తెరచి చుట్టూ చూస్తే కనిపించే ప్రతీది సృష్టికారుడి ‘సృజన’ అని తెలుస్తుంది. సృష్టికారుడు, సృజన వేరు వేరు కాదు. ఆ రెండూ ఒకటే. ఉపనిషత్తుల్లో దాన్ని ‘అద్వైతం’ అన్నారు. అంటే, ‘రెండుగా లేనిది’ అని అర్థం.
అంకురంలోంచి ఓ చిన్న మొక్క బయటకు రావడం, మొగ్గనుంచి పుష్పం విచ్చుకోవడం, కాయ పండుగా మారడం, బాగా మాగిన ఫలం మళ్ళీ విత్తనాలు ఇవ్వడం... ఇదంతా నిరంతరం సాగే సృజనాత్మక సృష్టి కార్యకలాపం.
సూర్యశక్తితో బలం పొంది సముద్రాలు ఆవిరిరెక్కలు కట్టుకుని ఆకాశంలో ఎగిరేట్లు చేసింది ఎవరు? ఆకాశం కాన్వాసు మీద మేఘాల సుద్దముక్కలతో చిత్ర, విచిత్రమైన బొమ్మలు గీస్తున్న చిత్రకారుడు ఎవరు? నిశ్చలంగా ఉన్న కొలనువాకిట్లో వానచుక్కలు వేసి అలల ముగ్గులు వేస్తున్న ఆడపడుచు ఎవరు? లోకం చీదరించే గొంగళిపురుగు రూపాంతర ధ్యానానికి మెచ్చి సీతాకోక చిలుక రెక్కలకు రంగులు అద్దిన వర్ణ చిత్రకారుడు ఎవరు? ఆకాశం మెడలో వేసే సప్తవర్ణమాలకు రంగులు, పూలిచ్చిన తోటమాలి ఎవరు? ఇంతటి ఘనమైన అద్భుత సృజనశీల కార్యాలు చేసేవి- ఆనందం, ప్రేమ స్వరూపాలు.
భగవంతుడు పిల్లల్లా ఆడుకుంటాడు. అతడు గొప్ప ఆటగాడు. అందుకే విశ్వంలో అనేకం సృష్టించాడు. అతడి దృష్టిలో ‘జీవితమే ఒక పెద్ద ఆట’, దుఃఖంతో ఉండి బోరున ఏడుస్తూ ఎవరైనా ఆడుకుంటారా? లేదు. ఆట ఆనందంతో ముడివడి ఉంటుంది. మనసు సంతోషంతో నిండినప్పుడు ఆట సంభవిస్తుంది. అందుకే మనిషికి బాల్యమంతా ఆటపాటలతోనే గడిచిపోతుంది. ఆటలు పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందిస్తాయి. చదరంగం లాంటి ఆటలు మస్తిష్కాన్ని చురుగ్గా ఉంచుతాయి. పరుగులతో కూడిన ఆటలు క్షణకాలాల్లోనే సరైన నిర్ణయాలు తీసుకునే బుద్ధికుశలతకు పదునుపెడతాయి. ఈ రీతిన సృజనశక్తి వయసుతోపాటు క్రమంగా బలపడి భవిష్యత్తులో కొత్తవాటిని కనిపెట్టే సృష్టికర్తలను తయారు చేస్తుంది.
చిన్నప్పుడూ స్నేహితులు చాలామంది ఉంటారు. కాలక్రమేణా ఆ సంబంధాలు విడిపోతాయి. బాల్యంనాటి ఆటలు, ఆనందాలు మెల్లగా దూరం అవుతాయి. మనిషి ఒంటరిగా మిగిలిపోతాడు. ఆలోచనలు జోరీగల్లాగా ముసురుకుంటాయి. శతవిధాలా వేధిస్తాయి. చేసేదేమీలేక గతంలోకి తిరిగి చూసుకుంటాడు. బాల్యం నాటి తీపిజ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. వయసుతోపాటు వచ్చే జ్ఞానం వల్ల వయోజనులు కొంతమంది మళ్ళీ ఆనందం పొందడం కోసం పిల్లలకు దగ్గరవుతారు. అందుకే తాతలు మనవళ్లతో జతకడతారు. వాళ్లకు గుర్రపు స్వారీలవుతారు. మాట్లాడే బొమ్మలవుతారు. నృత్యం, చిత్రలేఖనం, సంగీతం, సాహిత్యం... ఇవన్నీ సృజనాత్మక అంశాలు. ఈ కళల్ని సృజిస్తున్నప్పుడు మనసు వర్తమానంలో నిలుచుండిపోతుంది. ఫలితంగా పట్టరానంత ఆనందం కలుగుతుంది. కళలు- కళాప్రియుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. నెమ్మదిగా ధ్యానంవైపు తీసుకువెళతాయి. జీవితం పట్ల ప్రేమ పెంచుతాయి.
‘ఏ పని అన్నది ముఖ్యం కాదు... దాన్ని ఎలా చేస్తున్నామన్నదే ప్రధానం’ అని పెద్దలంటారు. పేరు ప్రతిష్ఠల కోసం పాకులాడకుండా, కీర్తి శిఖరాలకై వెంపర్లాడకుండా, నిదానమే ప్రధానంగా, శ్రద్ధాభక్తితో, ఎరుకతో, ఆనందంగా, పవిత్ర మనసుతో ఏ కార్యం చేపట్టినా అది సృజనాత్మకంగా ఉంటుంది.
వర్తమానంలో జీవించడమంటే, తామరాకుపై నీటి బిందువులా ఉండటం. ఆ క్షణాల్లో మనసు భూత భవిష్యత్తులకు సంబంధించిన డోలాయమాన స్థితిలో ఉండదు. అనవసర ఆలోచనలు వేధించవు, పరధ్యానంలోకి మళ్లించవు. అప్పుడు చేతు(చేత)ల్లో ఉన్న ప్రతీ పని ఒక ప్రార్థన అవుతుంది.

భయం
భయం పలురకాలు. అందంగా ఉన్నవారికి అది తరిగిపోతుందని భయం. యౌవనం శాశ్వతం కాదన్న ఆందోళన, వార్థక్యం చుట్టుముడుతుందని, రోగాలు పీడిస్తాయనే బాధ. సంపద కరిగిపోతుందనే మానసిక వ్యధ. ఇలా ఎన్నింటికో మనిషి భయపడుతూ భీరువవుతాడు. సహజ పరిణామాలకు చింతిస్తూ భీతిల్లుతాడు. భయపడవలసినవాటికి భయపడడు. అదే మానవ జీవితంలోని వింత!
సూర్యోదయం, చంద్రోదయం, వర్షాలు, ఉరుములు, మెరుపులు... ఇటువంటి అనేక ప్రకృతి పరిణామాలు మనిషిని భయపెట్టాయి. క్రమక్రమంగా భాషాపరంగా, విజ్ఞానపరంగా ఎదిగాడు. తనను భయపెట్టిన మార్పులు సహజమని అర్థం చేసుకున్నాడు. వాటివల్ల ఉపయోగాలు తెలుసుకున్నాడు. మనల్ని భయపెట్టే విషయాలపట్ల అవగాహన పెరిగిననాడు భయం తొలగిపోతుంది.
భయం మూఢనమ్మకాన్ని పెంచుతుంది. అది మన హేతుబద్ధతను, తార్కికతను, ఆలోచనాశక్తిని నశింపజేస్తుంది. విజ్ఞాన, శాస్త్ర రంగాల పురోగతిని నిలువరిస్తుంది. భయం గురించి మనం ఎంతగా భయపడితే అంతగా భయభ్రాంతుణ్ని చేస్తుంది. భయాన్ని అధిగమించాలంటే దాన్ని ఎదుర్కోవాలి. దానినుంచి పారిపోకూడదు.
పుట్టుకెంత సహజమో చావూ అంతే. ఈ రెండు పరిణామాల మధ్య సాగవలసిన జీవితాన్ని అర్థరహిత, ఆధారరహిత భయాలతో గడిపేయకూడదు. భయపడుతూ జీవించే జీవితం జీవితమే కాదు. అది మృతప్రాయమే. భయం వల్ల సంకల్పం వీగిపోతుంది. ఆలోచనాశక్తి సన్నగిల్లుతుంది. ఉత్సాహం నీరైపోతుంది. ఉద్యోగంలో, జీవితంలో చేరుకోవలసిన స్థితికి చేరలేం. జీవన క్రమంలో కొన్ని అవసరవేళల్లో తీసుకోవలసిన నిర్ణయాలు తీసుకోలేం.
భయం రెండు రకాలు. ఆరోగ్యకరమైనది, అనారోగ్యకరమైనది. మొదటిది- మనల్ని రుజుమార్గంలో నడిపే పాపభీతిని నేర్పుతుంది. స్వీయక్రమశిక్షణ ఇస్తుంది. మనస్సాక్షికి బద్ధుల్ని చేస్తుంది. ఎదుటివారికి హాని కలిగించాలనే ఆలోచననే దరిచేరనివ్వదు. ధర్మచింతనతో ప్రవర్తించే విధంగా ఉపకరిస్తుంది. ఇక రెండోది- జీవితంలో ముందుకు వెళ్లనీయదు. ఆలోచించనీయదు, ఎదగనీయదు.
మానవులు విపరీతంగా భయపడే విషయం మృత్యువు. నిజానికి ఈ భయం వల్ల మేలే జరుగుతుంది. చావు తప్పదన్న స్పృహ మనల్ని అప్రమత్తుల్ని చేస్తుంది. బాధ్యతలను నిర్వర్తించేలా, లక్ష్యాలను చేరేలా, చేయదలచుకున్న సత్కార్యాలను పూర్తి చేసేలా చేస్తుంది. అనివార్యమైన ఆ ప్రకృతి ధర్మం- మన జీవితానికొక అర్థాన్ని, సార్థకతను ఆర్జించుకొమ్మని హెచ్చరిస్తుంటుంది. ఈ మృత్యుభయాన్ని వీడిన క్షణం- మనిషికి ఆనంద సామ్రాజ్యమే. స్వేచ్ఛా, స్వాతంత్య్రాలే. మన బుద్ధికే కాక మనసుకూ తెలియవలసిన విషయమిది. ఆ స్థితికి చేరుకున్ననాడు చావునైనా నవ్వుతూ ఆహ్వానిస్తాం.
మన మనసులోకి చూసినప్పుడు తప్పు అన్నది లేకుండా ఉండాలి. అప్పుడు ఏ అపరాధ భావమూ దరిచేరదు. అప్పుడిక దేనికీ విచారించవలసిన అవసరమే ఉండదు. మనిషి ఈ ప్రపంచాన్ని మోసం చేయవచ్చు. కానీ, అంతరాత్మను వంచించలేడు- అంతరాత్మ ఎప్పడూ వాస్తవాన్నే చూపుతుంది.
భయపడుతూ జీవించడమంటే అనేకసార్లు మరణించడమే. భయాన్ని వదిలిననాడే జీవితాన్ని నిర్భయంగా, ఆహ్లాదంగా, ఆనందంగా గడపగలం. అదే అసలైన జీవితం. భయపడటం మానేసినప్పుడే మన జీవితం మొదలవుతుందంటాడు ఓ తాత్త్వికుడు.

శక్తి మంత్రం -. విపత్తులు నివారణ కోసం
ఓం తేజోసి తేజో మయి దేహి!
వీర్యమసి వీర్యమ్ మయి దేహి!
బలమసి బలం మయి దేహి!
ఓజోసి ఓజో మయి దేహి!
మన్యురసి మన్యుం మయి దేహి!
సహోసి సహో మయి దేహి! (శక్తి మంత్రం)
భగవంతుడిని ఆత్మ శక్తిగా, సంయమ శక్తిగా, శారీరక మానసిక శక్తులుగా, దివ్య శక్తిగా, ధైర్య శక్తిగా, సహన శక్తిగా భావిస్తూ ఆయా శక్తులను ప్రసాదించమని ప్రార్థించే మంత్రమిది. ఈ మంత్ర జపం వల్ల సాధకుడు తేజస్సంపన్నుడై ఒత్తిడులను సంభాళించుకునే శక్తిని సంపాదిస్తాడు. అలాగే ఋగ్వేదంలోని సూర్యసూక్తం కూడా సూర్యుడిని జీవితానికి ఆధారభూతునిగా, దేహానికి శక్తిగా, వర్షాన్ని, ఆహారాన్ని ఇచ్చేవాడిగా, ప్రపంచాన్ని రూపొందించి, పోషించేవాడిగా, పర్యావరణాన్ని కాపాడేవాడిగా, సకల కార్యాలనూ సాధించేందుకు ప్రేరణ శక్తిగా, ఉన్నత జీవనాన్ని ప్రసాదించే వాడిగా చెపుతుంది. అంతేకాదు.. చేసే పనిలో శ్రద్ధను, ఆసక్తిని కలిగి ఉండాల్సిన అవసరాన్ని ఈ వేదసూక్తాలు చెబుతాయి. వ్యక్తి తన మనసును, శరీరాన్ని, సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యతను వాటిని సాధించేందుకు అవసరమైన మార్గాలను సూచిస్తాయి. అక్షరాలుగా ఒకచోట కూర్చబడిన మంత్రాలకు ఈ శక్తి ‘నమ్మకం’ ద్వారా కలుగుతుంది. జీవన యాన కేంద్రం నమ్మకమైనప్పుడు అది అన్నింటినీ తనవైపు ఆకర్షించుకుంటుంది. పలికే ప్రతి అక్షరాన్నీ నిర్ణీత అంతరాలలో పలికినపుడు అవి మన కండరాలపై, నరాలపై, రక్తప్రసరణపై, గుండెపై తద్వారా శరీర ఆరోగ్యంపై మంత్రం తన ప్రభావాన్ని చూపుతుంది. అలాగే పలికిన పదాలు సూచనలుగా మన మనసుపై ముద్రింపబడతాయి. ఆ ముద్రలు బలీయమైతే దానికి సంబంధించిన కార్యావిష్కరణకు దారి చూపుతాయి. మన మనసు చాలా శక్తివంతమైనది. అది మనమిచ్చుకున్న సూచనల కనుగుణంగా పనిచేస్తుంది. మనస్సు బలీయమైతే, శారీరక ధర్మాన్ని అధిగమించి ముందుకు సాగుతుంది. కాబట్టి వేద మంత్రాల రూపంలో ఉచ్చరించిన అక్షరాలు శారీరకంగా మానసికంగా ప్రభావాన్ని చూపుతాయి. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా భయపెడుతున్న కరోనా లాంటి క్రిమి చేసే నష్టాన్ని తగ్గించుకునేందుకు అవసరమైన మానసిక, శారీరక సన్నద్ధతను ఈ వేద మంత్రాలు లేదా సూక్తాలు ఇస్తాయి. అయితే ఒక్క విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఇవి వైద్యానికి అనుబంధంగా పనిచేస్తాయే కానీ ప్రత్యామ్నాయంగా జబ్బును తగ్గించేందుకు ఉపకరించవు. మనం ఈ మంత్రాలను ఉచ్చరించే సమయంలో వాటి అర్థాలను తెలుసుకొని వాటిని ఊహించ గలగాలి. ఎంత బాగా, దగ్గరగా ఊహించుకోగలిగితే అంత మంచి ఫలితాన్ని రాబట్టుకోగలం. కల్పన లేదా ఊహ మరియు నమ్మకం ఈ రెండూ ఒక పక్షికి రెండు రెక్కల లాంటివి. రెండూ బలంగా ఉన్న పక్షి ఆకాశంలో చక్కగా విహరించ గలదు. కాబట్టి నమ్మకాన్ని, కల్పనను ఆదరించి ఈ మంత్రాల ద్వారా ఉపశమనం పొందుదాం.

దానగుణం
లోకంలో ధనానికి మూడు గతులున్నాయి. అవి దానం, భోగం, నాశనం. దానం చెయ్యకుండా, తాను అనుభవించకుండా కూడబెట్టిన ధనం చోరులపాలో, రాజుపాలో అవుతుందని సుభాషితం. ‘దానమీనివాడు ధన్యుండుగాడయా’ అన్నాడు వేమన. దానంవల్ల పుణ్యం సిద్ధిస్తుంది. కీర్తి నిలుస్తుంది. ఎన్నో రాజ్యాలుండేవి. ఎందరో రాజులు పాలించారు. వారెవరూ సిరిమూటగట్టుకొని పోలేదు. గొప్పదాతలైనవారే యశఃకాయులయ్యారు. శిబి చక్రవర్తిని, బలి చక్రవర్తిని లోకం మరచిపోలేదు. కర్ణుడు అధర్మపక్షంలో ఉన్నా దానకర్ణుడుగా ప్రసిద్ధుడు. భూమికి పర్వతాలు, సముద్రాలు భారం కాదు.
దానగుణం లేనివారే భారమవుతున్నారు అంటాడు శ్రీనాథుడు.
శాస్త్రాల్లో అనేకరకాల దానాలు చెప్పారు. అయితే ఆధునికయుగంలో సమయ దానమూ గొప్పదే. కాలం చాలా విలువైనది. దాన్ని ఆపలేం. గతించిన కాలం వెనక్కిరాదు. సమాజసేవ కోసం, సత్కార్యాల కోసం మన దైనందిన సమయంలో కొంత కేటాయించడం ఉత్తమ సంస్కారం.
కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో యజ్ఞం, ద్వాపరయుగంలో దానం, కలియుగంలో ధ్యానం యుగధర్మాలుగా పేర్కొన్నారు. అయితే దానం అన్ని కాలాల్లోనూ ఉత్తమమే. పూర్వులు వదిలివెళ్లిన ధనంతో కొంతభాగాన్ని వారి ఆత్మకల్యాణం కోసం దానం చెయ్యాలి. అదే నిజమైన శ్రాద్ధం. జలతర్పణం, పిండదానం కేవలం ప్రీతిదాత్మకం. నిజమైన శ్రద్ధ పూర్వుల సంపదను వారి సద్గతుల కోసం సత్కర్మల కోసం దానం రూపంలో సమాజానికి ఇచ్చివేయడంలోనే ఉంది. ఎవరైనా లోభమోహాలకు వశులై తమ సంపదను సదుపయోగం చేసి ఉండకపోతే ఆ లోపాన్ని వారి వారసులు పూరించాలి.
దురాశతో, స్వార్థంతో కోట్ల ఆస్తుల్ని కూడబెట్టి వారసులకిస్తే- వారు బాధ్యతారహితులు, సోమరులు, అహంకారులు అవుతారు. పాపపుణ్యాలన్నీ ఇచ్చిపుచ్చుకోవడంలోనే ఉంటాయి.
అయితే దానానికీ కొన్ని నియమాలు ఏర్పరచారు మన పూర్వులు. పాత్రత ఎరిగి దానం చెయ్యమన్నారు. మంచినేలలో నాటిన గింజలు ఫలించి సస్యాలవుతాయి. చవిటి నేలలో వేసిన బీజాలు నశిస్తాయి. అపాత్రదానం గాని, స్థోమతకు మించిన దానాలుకాని చేయకూడదు. పాత్రత అంటే యోగ్యత. ఇది మూడు విధాలు. ధర్మపాత్రం, కార్యపాత్రం, కామపాత్రం. ధర్మజ్ఞుడైనవాడికి చేసే దానం ఉత్తమం. దానగ్రహీత స్వీకరించినదాన్ని ధర్మకార్యాలకే వెచ్చిస్తాడు. కార్యపాత్రమంటే తగినపని. మంచిపనులకు అంటే ఒక దేవాలయం, విద్యాలయం, శరణాలయం వంటివాటి ఏర్పాటుకు దానంచెయ్యడం. మూడోది కామపాత్రం. కామమంటే కోరిక. యాచకుడు పేదరికంతో తన మనుగడకోసం బతుకుతెరువుకోసం అన్నమో, ధనమో, వస్త్రమో, భూములో కోరతాడు. వాడి స్థితినిబట్టి, అవసరాన్నిబట్టి యోగ్యత నిర్ణయించాలి.
అన్యాయార్జితమైన విత్తాన్ని దానం చెయ్యడంవల్ల ఫలంలేదు. ధర్మంగా కష్టించి సంపాదించినదాంట్లో కొంచెమైనా సమాజక్షేమానికి వ్యయంచేయడం మేలైన పని. ‘తక్కువ తీసుకో. ఎక్కువ ఇచ్చుకో’ అని సామెత. ఆకలిదప్పులతో ఉండి కూడా తనకు లభించిన అన్నాన్ని, జలాన్ని అర్థికి ఇచ్చివేసిన రంతిదేవుడి గాథ-
భాగవతంలో ప్రసిద్ధఘట్టం. మూడడుగుల నేల దానం ఇవ్వడంవల్ల నాశనమవుతావని గురువు శుక్రాచార్యుడు చెప్పినా వినని సత్యసంధుడు బలిచక్రవర్తి దానగుణం- సర్వకాలాలకూ ఆదర్శం.
నిండిపోయిన చెరువులో నీటిని రక్షించాలంటే దాన్ని కొంత బయటకు వదిలివేయడమే తప్ప మరో మార్గం లేదు. ‘ఇది నా భూమి’ అనేవాణ్ని చూసి భూదేవి నవ్వుతుంది. తాను అనుభవించక, చేయదగిన దానాలు చెయ్యనివాణ్నిచూసి ధనం నవ్వుతుంది. దానశీలిని లోభమోహాలు దరిచేరవు. దానం గుప్తంగా ఉండాలి. ప్రచారం కోసం, కీర్తికోసం అయోగ్యులకు, అనుచిత కార్యాలకు దానం చెయ్యడాన్ని అర్థదూషణమంటారు. అర్థదూషకుడు కుబేరతుల్యుడైనా చివరికి భిక్షమెత్తుకోవలసి వస్తుందని శాస్త్రవచనం. ‘సొంతలాభం కొంతమానుకో పొరుగువాడికి తోడుపడటం’ నేటి సూక్తి.

కుజన సుజనుల మైత్రి
మొదల జూచిన కడుగొప్ప పిదప కురుచ
ఆది కొంచెము తరువాత నధికమగుచు
తనరు దిన పూర్వ పరభాగ జనితమైన
ఛాయ పోలిక కుజన సజ్జనుల మైత్రి
ఉదయకాలపు నీడ మొదట పెద్దదిగా ఉండి పొద్దెక్కే కొద్దీ చిన్నదైపోతుంది. అట్లే కుజనుని (చెడ్డవాని) స్నేహం కూడా మొదట్లో ఆసక్తికరంగా ఉన్నా.. క్రమేణ ఆ మైత్రి అంతరించిపోతుంది. మధ్యాహ్నం నీడ ఆదిలో కొంచెంగా ఉండి సాయంకాలమయ్యే సరికి పెద్దదవుతుంటుంది. అదే విధంగా సుజనుల (మంచివారి) చెలిమి తొలుత అంత ఆసక్తికరంగా లేకపోయినా కాలక్రమేణా అలాంటివారితో మైత్రీబంధం బలపడుతుందని దీని అర్థం. శ్రీకృష్ణుని చెలిమితో పార్థుడు తన జీవితాన్ని పరమపవిత్రం చేసుకున్నట్లు.. మంచివారితో స్నేహం చేసిన వ్యక్తి అవతలివారిలోని మంచితనాన్ని పుణికిపుచ్చుకొని రాణిస్తాడు. దుర్యోధనునితో స్నేహం చేసిన కర్ణుడు అతని దురాశలకు వంతపలికి తన మాన్యతకు మచ్చతెచ్చుకొన్నట్లు.. చెడుగుణాలు కలవానితో స్నేహం చేసినవాడు అన్నివిధాలా చెడిపోతాడు.
సలక్షణాలు కలిగినవారితో స్నేహం చేయడం వల్ల పాపకార్యాలనే పాముల కాటుకు బలికాకుండా ఉంటాం. సజ్జన సాంగత్యం వల్ల మనసు మంచి పనుల వైపు మళ్లుతుంది. అలాంటివారితో సమాజానికి కూడా మంచే జరుగుతుంది. మంచి పనులు చేయడం వల్ల త్రికరణశుద్ధి కలుగుతుంది. సుగుణ మిత్రుడు తనను ఆశ్రయించిన వారి మనసును బాధించే రహస్యాలను బహిర్గతం చేయడు. అలాంటివారు తమ స్నేహితులను ఆనందమనే నందనవనంలో విహరింపజేస్తారు. వారిని అన్నివిధాలా ఆదుకుంటారు. అవతలివారి ఆపదను తన ఆపదగా భావించి అండగా నిలుస్తారు. అదే.. చెడ్డగుణాలు కలవారితో స్నేహం మహాభయంకరమైన నరకాన్ని తలపిస్తుంది. అది అన్ని విధాల అనర్థాలకూ మూలం. అలాంటివారితో మిత్రత్వమే కాదు.. శత్రుత్వం కూడా పెట్టుకోకూడదు. ఎందుకంటే..
దుర్జనేన సమం సఖ్యం ద్వేషంచాపి నకారయేత్
ఉష్ణోదహతి చాంగారః శీతః కృష్ణాయతే కరమ్శ్రీ
మండే బొగ్గును (నిప్పును) చేత్తో పట్టుకుంటే చేయి కాలుతుంది. చల్లారిన తర్వాత ముట్టుకుంటే చేతికి మసి అంటి చెయ్యి నల్లగా మారుతుంది. చెడ్డవానితో స్నేహం, ద్వేషం కూడా అలాగే ఉంటాయని దీని అర్థం. అందుకే పొరపాటున కూడా చెడ్డవాని దరిచేరరాదు. అలాంటివారు పరిశుద్ధ మనస్కులనైనా కల్మష చిత్తులుగా మార్చివేసి వేధిస్తారు. సమాజమనే వృక్షానికి వారు చీడపురుగులు. అందువల్ల స్నేహం చేయవలసి వచ్చినప్పుడు చక్కగా ఆలోచించి, బుద్ధిచాతుర్యంతో పరిశీలించి, సన్మార్గులతో చర్చించి, స్వయంగా తెలుసుకొని బుద్ధిమంతులతోనే స్నేహం చేయాలి. అది మానవుణ్ని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేస్తుంది.

జై ఆంజనేయ, జై శ్రీరామ్
ఓం ఆంజనేయాయ నమ:
ఓం మహావీరాయ నమ:
ఓం హనుమతే నమ:
ఓం మారుతత్మజాయ నమ:
ఓం తత్త్వజ్ఞానప్రదాయ నమ:
ఓం సీతాదేవిముద్రాప్రదాయకాయ నమ:
ఓం అశోకవనికాచ్ఛేత్రే నమ:
ఓం సర్వమాయవిభంజనాయ నమ:
ఓం సర్వబంధవిముక్త్రే నమ:
ఓం ర క్షోవిధ్వంసకారాయ నమ:10
ఓం పరవి ద్యాపరిహారాయ నమ:
ఓం పరశౌర్యవినాశనాయ నమ:
ఓం పరమంత్రనిరాకర్త్రే నమ:
ఓం పరయంత్రప్రభేదకాయ నమ:
ఓం సర్వగ్రహవినాశినే నమ:
ఓం భీమసేనసహాయకృతే నమ:
ఓం సర్వదు:హరాయ నమ:
ఓం సర్వలోకచారిణ నమ:
ఓం మనోజవాయ నమ:
ఓం పారిజాతద్రుమూలస్థాయ నమ: 20
ఓం సర్వతంత్రస్వరూపవతే నమ:
ఓం సర్వతంత్రస్వరూపిణ నమ:
ఓం సర్వతంత్రతాత్మికాయ నమ:
ఓం కపీశ్వరాయ నమ:
ఓం మహాకాయాయ నమ:
ఓం సర్వరోగహరాయ నమ:
ఓం ప్రభవే నమ:
ఓం బలసిద్ధిరాయ నమ:
ఓం సర్వవిద్యాసంపత్రప్రదాయకాయ నమ:
ఓం కపీసేనానాయకాయ నమ: 30
ఓం భవిష్యచ్చతురాసనాయ నమ:
ఓం కుమారబ్రహ్మచారిణ నమ:
ఓం రత్నకుండలదీప్తిమతె నమ:
ఓం సంచాలద్వాలసన్నలంబ మానశిఖోజ్జ్వలాయ నమ:
ఓం గంధర్వవిద్యాతత్వజ్ఞాయ నమ:
ఓం మహాబలపరాక్రమాయ నమ:
ఓం కారాగృహవిమోక్త్రే నమ:
ఓం శృంఖలాబంధమోచకాయ నమ:
ఓం సాగరోత్తారకాయ నమ:
ఓం ప్రాజ్ఞాయ నమ: 40
ఓం రామదూతాయ నమ:
ఓం ప్రతాపవతే నమ:
ఓం వానరాయ నమ:
ఓం కేసరీసుతాయ నమ:
ఓం సీతాశోకనివరణాయ నమ:
ఓం అంజనాగర్భసంభూతాయ నమ:
ఓం బాలార్కసదృశాసనాయ నమ:
ఓం విభీషణప్రియకరాయ నమ:
ఓం దశగ్రీవకులాంతకాయ నమ:
ఓం లక్ష్మణప్రాణదాత్రే నమ: 50
ఓం వజ్రకాయాయ నమ:
ఓం మహాద్యుతయే నమ:
ఓం చిరంజీవినే నమ:
ఓం రామభక్తాయ నమ:
ఓం దైత్యకార్యవిఘాతకాయ నమ:
ఓం అక్షహంత్రే నమ:
ఓం కాంచనాభాయ నమ:
ఓం పంచవక్త్రాయ నమ:
ఓం మహాతపసే నమ:
ఓం లంకిణీభంజనాయ నమ: 60
ఓం శ్రీమతే నమ:
ఓం సింహకాప్రాణభంజనాయ నమ:
ఓం గంధమాదనశైలస్థాయ నమ:
ఓం లంకాపుర విదాహకాయ నమ:
ఓం సుగ్రీవసచివాయ నమ:
ఓం ధీరాయ నమ:
ఓం శూరాయ నమ:
ఓం దైత్యకులాంతకాయ నమ:
ఓం సురార్చితాయ నమ:
ఓం మహాతేజసే నమ: 70
ఓం రామచడామణిప్రదాయ నమ:
ఓం కామరూపిణ నమ:
ఓం పింగళాక్షాయ నమ:
ఓం వార్ధిమైనాకపూజితాయ నమ:
ఓం కబళీకృతమార్తాండమండలాయ నమ:
ఓం విజితేంద్రియాయ నమ:
ఓం రామసుగ్రీవసంధాత్రే నమ:
ఓం మహారావణమర్ధనాయ నమ:
ఓం స్ఫటికాభాయ నమ:
ఓం వాగధీశాయ నమ: 80
ఓం నవవ్యాకృతిపండితాయ నమ:
ఓం నవవ్యాకృతిపండితాయ నమ:
ఓం చతుర్బాహవే నమ:
ఓం దీనబంధవే నమ:
ఓం మహాత్మనే నమ:
ఓం భక్తవత్సలాయ నమ:
ఓం సంజీవననగాహర్త్రే నమ:
ఓం శుచయే నమ:
ఓం వాంగ్మినే నమ:
ఓం దృఢవ్రతాయ నమ:
ఓం బకాలనేమిప్రమథనాయ నమ: 90
ఓం హరిమర్కటమర్కటాయ నమ:
ఓం దాంతాయ నమ:
ఓం శాంతాయ నమ:
ఓం ప్రసన్నాత్మనే నమ:
ఓం శతకంఠమదాపహృతే నమ:
ఓం యోగినే నమ:
ఓం రామకథాలోలాయ నమ:
ఓం సీతాన్వేషణ పండితాయ నమ:
ఓం వజ్రదంష్ట్రాయ నమ:
ఓం వజ్రనఖాయ నమ: 100
ఓం రుద్రవీర్యసముద్భవాయ నమ:
ఓం ఇంద్రజిత్ప్రహితామోఘ నమ:
ఓం బ్రహ్మాస్త్రవినివారకాయ నమ:
ఓం పార్థద్వజాగ్రసంవాసినే నమ:
ఓం శరపం జరభేదకాయ నమ:
ఓం దశబాహవే నమ:
ఓం లోకపూజ్యాయ నమ:
ఓం జాంబవత్ప్రీతివర్ధనాయ నమ:
ఓం సీతాసమేత శ్రీరామ పాదసేవా దురంధరాయ నమ: 108

పుట్టినరోజు
ఎవరికయినా సరే, పుట్టినరోజు అత్యంత ప్రధానమైన పండగ. శాస్త్రంమీద గౌరవం ఉన్న వాళ్ళు ‘నేను పుట్టినరోజు పండగ చేసుకోను’ అని అనకూడదు. జీవితంలో ఒక లక్ష్యం ఉండాలంటే దానికో శరీరం ఉండాలి. ఆ శరీరాన్ని పరమేశ్వరుడు మనకిచ్చిన గొప్పరోజు అది. అందుకే ఆరోజు దానిని పండగలా చేసుకోమని చెప్పారు. ఎవరికయినా ఒక పుట్టిన రోజు మాత్రమే ఉంటుంది. కానీ అమ్మకు ఎంతమంది బిడ్డలున్నారో అన్ని పుట్టిన రోజులతోపాటూ తను పుట్టిన రోజు కూడా ఉంటుంది. ‘‘అమ్మా! ఈ బిడ్డడిని ప్రసవిస్తే మీరు చనిపోతారు’’ అని చెప్పారు డాక్టర్లు మా అమ్మకు. దానికి మా అమ్మగారన్నారట...‘‘వాడు బతికితే చాలు, నేను ఉండకపోయినా ఫరవాలేదు’’ అని. కానీ ఈశ్వరానుగ్రహం, నా అదృష్టం– ఆవిడ బతికింది, నేనూ బతికాను. మృత్యువు రెండు కోరల మధ్యలోకి చేరి, జారి కిందపడి బతికిన రోజు మా అమ్మకది. అంటే మా అమ్మకు అది మరో పుట్టిన రోజేగా... అందుకే ప్రతి బిడ్డ పుట్టిన రోజు అమ్మకు మరో పుట్టిన రోజవుతుంది.
అందుకే పుట్టిన రోజును ఎలా చేసుకోవాలి? అమ్మకు కొత్త చీర పెట్టి, నమస్కారం చేసి తరువాత మాత్రమే తాను కొత్తబట్టలు కట్టుకోవాలి. అది మర్యాద. సంస్కారవంతుల లక్షణం. అమ్మ సృష్టికర్త, ఈ శరీరాన్ని ఇచ్చింది కాబట్టి ఆమె బ్రహ్మ. తన నెత్తురును పాలగా మార్చి బిడ్డ వృద్ధికి కారణమవుతుంది.. అందువల్ల ఆమె స్థితికర్త. ఓ గైనకాలజిస్టు ‘మాతృదేవోభవ’ పేరుతో ఒక పుస్తకం రాసారు. దానిలో ఆయన కొన్ని విషయాలు చెప్పారు. బిడ్డ పుట్టగానే తల్లి స్తన్యంలో ‘కొలోస్ట్రమ్’ అనే ఒక పసుపు పచ్చటి పదార్థం ఊరుతుంది. గర్భసంచీలో కటిక చీకట్లో అప్పటిదాకా ఉన్న బిడ్డ బయటికి వచ్చాక అంత వెలుతురు, అన్ని పెద్ద పెద్ద ఆకారాలు చూసేటప్పటికి లోపల ఉన్న మలం నల్లగా రాయిలా మారిపోతుంది. అది బయటకు వెళ్ళక అడ్డుపడి ఊపిరితిత్తుల, గుండె పనితనాన్ని మందగింపచేస్తుంది. ప్రాణోత్క్రమణం అవుతున్న స్థితిలో పరమ ప్రేమతో అమ్మ బిడ్డను దగ్గరగా తీసుకుని స్తన్యమిచ్చినప్పుడు ఆ కొలోస్ట్రమ్ బిడ్డ కడుపులోకి వెళ్లి లోపల అడ్డుపడిన నల్లటి మలం బయటకు వచ్చేసి వాడు ఆయుర్దాయం పొందుతాడు.
అందుకే అమ్మ స్థితికర్త. అమ్మ ప్రళయ కర్త కూడా. ప్రళయం అంటే చంపేయడం కాదు. నిద్రపుచ్చడం స్వల్పకాలిక ప్రళయం. పరమేశ్వరుడు చేసే మహోత్కృష్టమైన క్రియల్లో అదొకటి. అన్ని ప్రాణులకు నిద్రనిస్తాడాయన. అవి నిద్రలో సుఖాన్ని పొందుతాయి. బ్రహ్మ, విష్ణువు, శివుడు... ముమ్మూర్తుల సమాహార స్వరూపం అమ్మ. అందుకే ‘మాతృదేవోభవ’ అని మొదటి నమస్కారాన్ని అందుకుంటుంది. అమ్మతనం కేవలం స్త్రీయందే ప్రకాశిస్తుంది. అమ్మతనాన్ని చూడలేక ఆడతనాన్ని చూసినవాడు హింసింపబడి, నశించిపోతాడు. దేవీ భాగవతంలో అమ్మవారి మహిషాసుర మర్దని స్వరూపం అది. ఎక్కడ ఎవడు ఆడతనంలో అమ్మతనాన్ని చూసి గౌరవించి నమస్కరిస్తాడో వాడు దీర్ఘాయుర్దాయాన్ని పొంది భవిష్యత్ బ్రహ్మ అవుతాడు.