Devotional Telugu
3.46K subscribers
106 photos
23 videos
19 files
62 links
An attempt to bring our Hindu Devotional information
Download Telegram
ు, చేతులు కట్టుకున్నా సరే ఒక్క సారి మనస్సులో నీవాడనని తెలిపినా ఆయన పరమ పదాన్ని ఇస్తాడు అని కులశేఖర ఆళ్వార్ చెప్పినట్లుగా, మేం నీ పాదాలను పాడటనికి వచ్చాం అని చెప్పారు.

ఆయన ఎం విననట్టుగా సుదీర్గమైన ఆలోచనలో పడి ప్రేమతో వీళ్ళకేసి చూస్తున్నాడు. *"పొరుళ్ కేళాయ్"* మేం ఎందుకు స్తుతిస్తున్నామో వినవయ్యా అంటూ ఆయనను తట్టి పాటం చెబుతోంది గోదా. ఆండాళ్ తల్లికి పాటం చెప్పడం అలవాటు కదా. ఆయనకీ పాటం చెప్పగలదు. *"పెత్తం మేయ్ త్తుణ్ణుం కులత్తిల్ పిఱందు"* మొదట పశువులని మేపి అవి తిన్నాకగాని మేం తినేవాళ్ళం కాదు. నీకు మా స్వరూపం తెలియదా. మరి నీవేమి చేస్తున్నావు! మాకు ఆహారం నీసేవయే, అది మాకు లభించాకే, ఆ తర్వాతే కదా నీవు ఆహారం తినాలి, *"నీ కుత్తేవల్ ఎంగలై క్కోళ్ళామల్ పోగాదు"* నీ ఆంతరంగిక సేవకై మమ్మల్ని స్వీకరించవలసిందే. ఎదో వ్రత పరికరాలు అని అన్నారు ఇదిగో అని అక్కడ పెట్టాడు. *"ఇత్తై పఱై కోళ్వాన్ అన్ఱు కాణ్ గోవిందా!"* మేం ఎదో అడగాలని వాటిని అడిగాం, మేం కోరేవి ఇవికాదు. కేవలం మాట పట్టుకొని చూస్తావా, మా మనస్సులో ఎం ఉందో తెలియదా అని అడిగారు. నాకేం తెలియదు, నేను మీ గొల్లల్లో ఒకడినే కదా అని అన్నాడు శ్రీకృష్ణుడు.

*"ఎత్తెక్కుం"* ఎల్లప్పటికీ, ఈ కాలం ఆ కాలం అని కాదు, సర్వ దేశముల యందు, సర్వ అవస్తల యందు, *"ఏరేర్ పిఱవిక్కుం "* ఏడేడు జన్మలలో కూడా *"ఉన్ తన్నో డుత్తోమేయావోం"* నీతో సంబంధమే కావాలి. కాలాధీనం కాని పరమపదం లో ఉన్నామాకు నీ సంబంధమే ఉండాలి *"ఉనక్కే నాం అట్చెయ్ వోం మత్తై నం కామంగళ్ మాత్త్"* కేవలం నీ ఆనందం కోసమే మా సేవ అంకితమై ఉండాలి. తెలియక ఏదైన లోపం ఉంటే నీవే సరి దిద్దాలి, మాపై భారం వెయ్యవద్దు.

ఇలా వ్రతం ఆచరించిన అందరికి ఫలితం లభించింది. శ్రీకృష్ణ సమాగమం లభించింది, దీనికి సహకరించిన వారికి కోరినవి లభించాయి. ఈ రోజు పురుషార్థం పొందిన రోజు. ఈ రోజు స్వామి గోదాదేవిని రప్పించుకొని మానవ కన్యగా ఉన్న ఆమెను తాను విగ్రహరూపంలోనే వివాహమాడాడు. గోదాదేవి కోరిన వైభోగాన్ని పొందిన రోజు కనక *"భోగి"* అంటారు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
📷

మారగళి మాలై-30

*************

ముప్పదవ పాశురం

**********

వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై

తింగళ్ తిరుముగత్తు చ్చేయిళైయార్ శెన్రు ఇరెంజి

అంగు అప్పరై కొండ అత్తై అణిపుదువై

ప్పైంగమలత్తణ్ తెరియల్ పట్టర్ పిరాందై

శంగత్తమిళ్మాలై ముప్పదుం తప్పామే

ఇంగుం ఇప్పరిశు ఉరైపార్ ఈరిరండుమాల్

శెంగణ్ తిరుముగుత్తు చ్చెల్వత్తిరుమాలాల్

ఎంగుం తిరువరుళ్ పెత్తు ఇంబరువర్ ఎంబావై.

తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో

*****************.

శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము

శ్రీ గోదారంగనాథుల అనుగ్రహము అనవరతము

జీవులను ఓడలు తిరుగాడుచున్న క్షీరసాగర స్వామి

మాధవా! కేశవా! పర (ము) ను మాకందించినావు

సూడికొడుత్తాల్ నిను పూమాలలతో సేవించినది

పాడికొడుత్తాల్ గా పావన పాశురములు పాడినది

అఖిలాండకోటి దేవతలు అర్చకస్వాములైనారు

ముక్తపురుషులు తల్లి పల్లకి మోస్తున్నారు

తామరపూసలదండలు దాల్చిన పెరియాళ్వార్

తామరదళ నేత్రునికి మామ కాబోతున్నాడు

లోకకళ్యాణమునకు జరుగు ఆ తిరుపాణిగ్రహణమున

అందుకొనుచున్నాము మనము ఆలోకనమను అనుగ్రహము.

స్వామి పాలసముద్రమును మహలక్ష్మి మాత కొరకు-వీర సముద్రమును రుక్మిణిమాత కొరకు,గొల్లల పెరుగు సముద్రమును గొల్లభామల కొరకు చిలికినాడని చమత్కరిస్తారు పెద్దలు.ఓడలు జీవులైతే అవి నిరంతరము తన జన్మఫలములను అనుభవించుటకు కదులుతుంటే.వాటిని నొప్పించకుండ(సంసార) సాగరమథనముచేస్తూ,రేవునకు దరిచేచు దయామయా నీకు కళ్యాణమగుగాక.

ముప్పది పాశురముల "తిరుప్పావై "ద్రవిడ ప్రబంధము "శంగత్ తమిళ మాల" గా శ్లాఘింపబడుచున్నది.అంతే ఏమిటి? పూర్వము గ్రంధరచనానంతరము.వాని సామర్థ్యముంప్రాభవమును నిర్ణయించి-ధృవీకరించే శిలాఫలకములుండెడివట.గ్రంధమును ఫలకము మీదనుంచగనే అర్హతలేనిదైన దాని లిపి మాయమైపోయెడిదట.సమ్రథవంతమైనదైచో స్వప్రకాశముతో తేజరిల్లుచుండెడిదట.అటువంటి స్వప్రకాశ సంస్కారము గలది అని కీర్తించుతయే రమణీవిరచితమైన రామణీయ రసగుళిక (పాత్రధారిగా) అని అమ్మతరఫున ఆడపెళ్ళివారు అనగానే,

అమ్మను పెండ్లాడు "అయ్య ఎంతటి ఘనుడో" మగ పెళ్ళివారు ఈ విధముగా చెబుతున్నారు.మా స్వామి కదిలే ఓదలున్న సముద్రమును చిలికి అమృతమును సాధించి,అందరికి అందించినవాడు అని స్వామి వైభవమును "వంగక్కడల్ కడైంద మాదవనై-కేశవనై" అంటున్నారు.మా అనగా తల్లి గోదమ్మకు-ధవుడు పతియైన మా రంగనాథుడు కదులుచున్న ఓడలు గల సముద్రమును,మంథరము తానై,వాసుకితానై,దేవదానవ స్వరూపములు తానై చెరొక పక్క న పట్టుకొని,అమృతమును సాధించి,అందరికి,చివరికి ఓడలలో నున్న వారికి కూడ పంచిన పరంధాముడు అని వర్ణిస్తున్నారు.

వేడుకగా మీ అమ్మాయి గోపికగా తన కర్తవ్యమును స్వయముగా ఆచరించి,తారకమును అందిస్తే,మా అబ్బాయి స్వయముగా గొల్లవానిగా సంచరించినాడని, సూత్రధారి అని ఇరువర్గములు రంగమంటపమున కళ్యాణోత్సవమును కన్నులపండుగ గా మనకందించుటకు కదులు చున్నారు.రండి.మనము కూడ దర్శించి తరించుదాము.

ఓం నమో నారాయణాయ

******************-

అనుగ్రహముగ నామది శ్రీరంగముగా మారినది

నిత్యకళ్యాణమైన గోదా కళ్యాణము చూడాలని కోరుతోంది.

శ్రీవిల్లిపుత్తూరుకు విచ్చేసి శ్రీవిష్ణుచిత్తీయుని అర్థించిన వారైన

అఖిలాండకోటి దేవతలు ఆ అర్చకస్వాములలో

ముముక్షువులు గోపికలకు ముక్తిని ప్రసాదించినదైన

ముద్దుగుమ్మ కూర్చున్న ఆ ముక్తపురుషులు ముత్యాలైన పల్లకిలో

పూలమాలలతో స్వామికి పూలంగిసేవలందిచినదైన

పూబోడికై స్వామి ఎదురుచూచు ఆ శ్రీరంగ పట్టణములో

అఖిలాండ బ్రహ్మాండనాయకుని అంగరంగ వైభవమైన

అమ్మతో జరుగుచున్న ఆ తిరు పాణి గ్రహణములో

వారి చెంతనున్న వారమమ్మ తరియించగ మనము

వైభవోపేతమమ్మ వారిరువురి అనుగ్రహము.

పరమ భాగవతోత్తముడైన శ్రీవిష్ణుచిత్తుని వలన భగవతత్త్వమును అవగతమొనరించుకొను చున్న మన ఆండాళ్ తల్లి,గోపికలు కాత్యాయినీ వ్రతమును ఆచరించి,స్వామి సాయుద్యమును పొందినారని తెలుసుకొని,తానును గోపికగా మారి(మనో వాక్కాయ కర్మలలో) చెలులతో ముప్పదిరోజులు,పామాలతో (పాశురములతో) పూమాలలతో మార్గళి వ్రతమును ఆచరించి మనకు మార్గదర్శకురాలైనది.ఏమీ తెలియని నాచే ముప్పది పారిజాత మాలలను స్వామికి సమర్పింప చేసినది.నా పూర్వ భాగ్యమేమో తెలియదు కాని నన్ను తన కళ్యాణోత్సవమునకు తీసుకుని వెళుచున్నది.ఒక్క నిమిషము.ఎవరో మహాత్ములు వచ్చారు.ఎందుకో? ఏమిటో నన్ను తెలుసుకోనివ్వండి.మీకు చెబుతాను ఆ విశేషాలన్నీ.

గోదా రంగనాథుల కళ్యాణార్థము తమ అదృష్టముగా భావిస్తూ,అఖిలాండకోటి దేవతలు అర్చక స్వాములై అయ్యవారి తరఫున ఆండాల్ తల్లిని వధువుగా అర్థించుటకు కానుకలను-పల్లకిని తీసుకుని వచ్చారు.అబ్బ!మౌక్తికాలంకృతమైన పల్లకి ఎంత బాగుందో.అసలెక్కడివి ఈ ముత్యములు సత్వగుణశోభితములై సత్చిత్ ప్రకాశముతో నున్నవి.తల్లిచెప్పిన ముక్త పురుషులు వీరే కాబోలు.ఎర్రటికెంపులు అమ్మ బుగ్గల ఎర్రదనపు కాంతి సోకిన ముత్యాలేమో.తెలుపు కాదు.ఎరుపు కాదు.నీలముగా తోచుచున్నవి.ఆ నీలమేఘ శ్యాముని కడకంటి చూపులను తోడ్కొని వచ్చినవేమో అందుకే ముత్యములు నీలాలై నాతో మేలమాడుతున్నవి.కాసేపు పచ్చలుగా,మరి కాసేపు గోమేధికములుగా,వజ్ర వైఢూర్యములుగా.ఎంతైన స్వామిదగ్గరకు అమ్మను
తీసుకువెళుతున్నామనే భావోద్వేగము బహురూపులు సంతరించుకుంటున్నదేమో.

విష్ణుచిత్తులవారు అతిథులను సత్కరించారు.పాండ్యరాజు ఆడపెళ్లివారి బాధ్యతను అన్నయై ఆనందంగా స్వీకరించారు.ఇదేమి చిత్రమో నా మనసు శ్రీరంగములో అమ్మకై ఎదురుచూచు చున్న రంగనాథుని పక్కకు చేరింది.ఆడపెళ్ళివారు-మగ పెళ్ళివారు రెండూ తానై ఆనంద డోలికలూగుతోంది.

ఆ ఆనందోత్స వాన్ని ,తిరు (పవిత్రమైన) కళ్యాణాన్ని కనులారా దర్శించి,తిరుగులేని వారిరువురి దయను పొందుదాం.నాతో బాటు మీరు రండి.

శ్రీ రంగే గరుడాచలే ఖగ గిరౌ సిం హాచలే మందిరే

వైకుంఠే కనకాచలేచ నిషధే నారాయణాఖ్యాచలే

లోకాలోక మహాచలేచ నిషదే పుణ్యాచలేష్టా శ్రియ:

పాయాత్ ఓ భగవాన్ పురాణ పురుష: కుర్యాత్ సదా మంగళం".

భగవత్ బంధువులారా! మీరు

*******************

కుప్పల తప్పులు అనినా ! కుప్పిగంతులే అనినా

చొప్పదంటు పలుకులనినా నప్పిన్నాయ్ కరుణతో

ఫలశృతి

ముద్దుమోము చూడమంటు అద్దము చూపిస్తాడు

విసనకర్రను ఇస్తాడు ఆ ముసిముసి నవ్వులవాడు

మనతో జలకములాడుతాడు జలజనాభుడు చూడు

పఱ ను అందిస్తాడు ఏ అరమరికలు లేనివాడు

ఆడతాడు-పాడుతాడు వీడలేను అంటాడు

సరసను కూర్చుంటాడు పరమాన్నము తింటాడు

యమునకు రమ్మంటాడు మనసును ఇమ్మంటాడు

పట్టు విడుపు లేనివాడు మనలను పట్టుకునే ఉంటాడు

మాయను తెలిసిన వాడు సాయము చేస్తుంటాడు

చెంతనే ఉంటాడు చింతలు తీర్చేస్తాడు

కొండను ఎత్తిన వాడు మన గుండెలోన ఉంటాడు

నెమలి ఈక నిస్తాడు నెనరులు చూపిస్తాడు

దాసోహమనగానే తను దాసుడిలా మారతాడు.

అమ్మ చేయి విడువకుంటే అన్నీ తానే అవుతాడు.

కాయేన వాచా మనసే ఇంద్రియైర్వా

బుద్ధి ఆత్మమానా వా ప్రకృతే స్వభావాత్

కరోమి యద్ యత్ సకలం పరస్మై

నారాయణా! ఇతి సమర్పయామి.

మనో వాక్కాయ కర్మలతో చేసిన సకలము నారాయణుని పాద పద్మములను చేరుగాక.

( ఓం తత్ సత్)

జై శ్రీమన్నారాయణ తవ చరణమేశరణము.
⚜⚜⚜⚜⚜⚜⚜⚜
సామజవరగమన అంటే ఒక త్యాగరాజకీర్తన అని, అలవైకుంఠపురంలో అనేది తెలంగాణ కవి పోతన రచించిన భాగవత పద్య పదం అని పిల్లలకి దయచేసి తెలియచేయండి.

ఒకప్పుడు ఒకలా,ఇంకొకప్పుడు ఇంకోలా, ఇప్పుడు ఇంకా దరిద్రంగా ఆ కీర్తనని వాడేసుకుని దాని పవిత్రతను పాడుచేస్తున్నారు.

మిమ్మల్ని ఎవడైనా ఏదైనా అంటే సర్రుమని ముంచుకొచ్చే కోపావేశాలు, సంస్కృతి - వారసత్వాలని పాడుచేస్తే కనీసం చీమ కుట్టినట్టు కూడా ఉండకపోవడం మన దౌర్భాగ్యం.

అలవైకుంఠ పురములో అంటే అదేదో సినిమా పేరనే ఇప్పటి పిల్లలు అనుకునే అవకాశం కూడా ఉంది. పోతానామాత్యుని శ్రీమద్భాగవతాంతర్గత గజేంద్ర మోక్షము నుంచి అనే విషయాన్ని చెప్పండి.

*గజేంద్ర మోక్షము నుంచి కోన్ని పద్యాలు నేర్పండి.*

⚜ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వడి అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని నాత్మభవు ఈశ్వరునినే శరణంబు వేడెదన్.

⚜అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందార వనాంత రామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము “పాహి పాహి” యనఁ గుయ్యాలించి సంరంభి యై ||

⚜సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై||

⚜అడిగెదనని కడువడి జను
అడిగిన తన మగడు నుడువడని నడయడగన్
వెడవెడ జిడి ముడి తడబడ
నడిగిడు నడుగిడదు జడిమ నడుగిడునెడలన్ ||
⚜⚜⚜⚜⚜⚜⚜⚜
నమస్సోమాయచ

శివునికి అభిషేకం చేయటానికి సర్వసాధారణంగా వినియోగించే
మంత్రాలు నమక, చమకాలు. యజుర్వేదంలో అంతర్భాగంగా ఉండే నమక
చమకాలను కలిపి సాధారణ పరిభాషలో 'రుద్రాధ్యాయం' అనీ, 'రుద్రం' అనీ
వ్యవహరిస్తుంటారు. వేదంలో భాగమైనప్పటికీ నమక, చమకాలు అత్యంత
ప్రభావం కలిగి, స్వతంత్రంగా వేదంతో సమానమైన శక్తి కలిగిఉన్నాయి
నమకం, చమకం - ఒక్కోదాంట్లో 11 భాగాలు (సాధారణ భాషలో పేరాలు) ఉంటాయి. వీటిని శాస్త్రపరంగా అనువాకాలు అంటారు. అంటే
నమకంలో 11 అనువాకాలు, చమకంలో 11 అనువాకాలు ఉంటాయి.
పరమేశ్వరుడిని భక్తులు ప్రార్ధిస్తూ అనేక నమస్కారాలు అర్పించే మంత్రభాగం నమకం కాగా భక్తుడు తానే రుద్రస్వరూపంగా మారి
ఆత్మరుద్ర భావనతో చేసే అర్చన చమకం అవుతుంది. ఈ రెండు మంత్రభాగాల్లో అనంతమైన విజ్ఞానం దాగిఉంది
నమక వైభవం అనంతమైన సృష్టిలోని ప్రతి అణువులో పరమేశ్వరుడిని దర్శించే అద్భుతమైన భావనకు నమకం పునాదిగా
నిలుస్తుంది. చరాచర జగత్తులోని ప్రతి అణువూ
పరమేశ్వరుడి భావనతోనే ప్రాణం పోసుకుంటుంది అయినప్పటికీ లౌకిక వాసనల కారణంగా ఎంతో అజ్ఞానం మనలో గూడుకట్టుకుని ఉంటుంది.
దొంగగా మారి ఈ అజ్ఞానాన్ని చౌర్యం చెయ్యమని పరమేశ్వరుడిని భక్తుడు వేడుకోవటం నమకంలో కనిపిస్తుంది. రుద్రుడిని సంబోధించే ప్రతి పదంలోనూ ఓ గంభీరమైన భావన స్పష్టంగా ఉంటుంది. సర్వాంతర్యామిగా పరమేశ్వరుడిని ప్రతిపాదించే భావనలెన్నో నమకంలో ఉన్నాయి కనీసం ప్రతి అనువాకాన్ని పారాయణ చేస్తే ఎన్నో ఫలితాలు కలుగుతాయి
వృషభం.. ధర్మస్వరూపం

గోవుకు భారతీయ సంస్కృతిలో ఉన్నంత ప్రాధాన్యం బహుశా మరెక్కడా లేదేమో. వేదాల్లోనూ, పురాణాల్లోనూ పలుచోట్ల పలు విధాలుగా గోవు అనే పదాన్ని అనేక అర్థాల్లో వర్ణించారు. గోవు అన్న పదం కేవలం ఆవును మాత్రమే కాక ఎద్దును కూడా సూచిస్తుంది. ప్రత్యేకించి చెప్పాలంటే గోవృషభం అంటే ఎద్దు, గోధేనువు అంటే ఆవు అని చెప్పాలి. ఆవుకు పూజ చేయడం అతి సాధారణంగా చూస్తున్నా ఎద్దును గురించి కూడా పుస్తకాల్లో వర్ణన కనిపిస్తుంది. కోడె దూడను శివుడికి సమర్పించే ఆచారం పురాణాల్లోనూ, శైవ సంప్రదాయంలోని ఆగమాల్లోనూ చెప్పబడింది. అందువల్ల ఈ ఆచారం బహుశా అనాదిగా ఉండి ఉండవచ్చు. ఇటీవల కబేళాలకు మళ్లుతున్న మల్లన్న కోడెల గురించి వార్తలు వచ్చాయి. ఇదివరలో కూడా ఇలాంటి వార్తలను గమనించాం. ఈ నేపథ్యంలో ఒకసారి ఈ ఆచారానికి ఉన్న నేపథ్యాన్ని గమనిద్దాం.

స్కాందపురాణంలో గోవుల్ని శివుడికి అర్పించే విషయంపై ప్రస్తావన ఉంది. ఇక్కడ శివుడికి గోదానం చేయాలని చెప్పబడింది. గోదానం అంటే కేవలం ఆవు అనే కాక ఎద్దును కూడా ఇవ్వాలని చెప్పారు. ‘గాంపయస్వినీం’ అంటే పాలిస్తున్న ఆవును, ‘వృష సంయుతాం’ అంటే ఎద్దుతో పాటు శివుడికి అర్పిస్తే సమస్త జగత్తునూ దానం చేసినంతటి పుణ్యంతో సమానమట. ఇలా చేసినవాడు కోట్లాది సంవత్సరాలు శివుడితోపాటు భోగాలను అనుభవిస్తాడని చెప్పారు. వృషభాలతో పాటు గోవులను దానం చేసినవాడు కోటి సూర్యుల ప్రకాశంతో వెలుగుతున్న విమానాల్లో రుద్రుడితో సమానంగా తిరుగుతూ భోగాలను అనుభవిస్తాడని, గోవు శరీరంపై ఎన్ని రోమాలు ఉండే అన్ని వేల యుగాలు రుద్రలోకంలో సుఖాలనుభవిస్తాడని ఇదే పురాణంలో మిగిలినచోట్ల కూడా చెప్పారు. దేవాలయాలకు భూములున్న రోజుల్లో వాటి సేద్యానికి, అన్నదానాలు మొదలైనవాటికి గోవుల అవసరం ఉండి ఉండవచ్చు. యజ్ఞంలో అడుగడుగునా గో సంబంధమైన ఉత్పత్తులు చాలా అవసరం. అసలు వృషభం అంటే ఏమిటి? సంస్కృతంలో వృష అంటే వర్షించడం లేదా తడపడం అని అర్థం. వృషభం అంటే వర్షించేది. ఎద్దు తన రేతస్సును వర్షించి గో సంపదను పెంచుతుంది. గోసంపద ఆ రోజుల్లో ఒక ముఖ్యమైన సంపద. కౌరవులు విరాట నగరాన్ని రెండువైపులా ముట్టడించి గోవులను తోలుకెళ్లడం ఈ విషయాన్ని సూచిస్తుంది. వేదమంత్రాల్లో ‘చత్వారి శృంగాః’ అంటూ ప్రారంభమయ్యే అతి ప్రసిద్ధి చెందిన మంత్రం ఉంది. నాలుగు కొమ్ములు, మూడు కాళ్లు, రెండు తలలు, ఏడు చేతులు ఉన్న వృషభం మూడు తాళ్లతో కట్టివేయబడి, బిగ్గరగా రంకె వేస్తోంది అది దీని అర్థం. ఈ మంత్రానికి వ్యాకరణ శాస్త్రపరంగా, వేదాంతపరంగా, యజ్ఞపరంగా, జ్యోతిష్యపరంగానూ ఇలా అనేక అర్థాలు చెప్పారు. యజ్ఞపరమైన అర్థాన్ని చూస్తే నాలుగు వేదాలు నాలుగు కొమ్ములు. కర్మ, ఉపాసన, జ్ఞానం అనే మార్గాలు మూడు పాదాలు. మూడు తాళ్లతో కట్టబడటం అంటే సత్త్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలతో కట్టబడి ఉన్న మనందరి ప్రవృత్తి. వృషభం అంటే ధర్మం. ధర్మానికి అధిపతి శివుడు. రంకె వేయడం అంటే భగవంతుని తత్వాన్ని గొప్పగా బోధిస్తున్నాడు అని ప్రాచీనుల వ్యాఖ్య. ధర్మాన్ని ఆచరిస్తే అది మనం కోరిన కోరికల్ని వర్షిస్తుంది. చతుర్విధ పురుషార్థాల్లో (ధర్మము, అర్థము, కామము, మోక్షము) అర్థము, కామము రెండూ కూడా ధర్మానికి, మోక్షానికి మధ్యలో ఉండటం గమనించాలి. ధర్మం అనే తాటిపైనే నడుస్తూ అర్థాన్ని (సంపదను), కామాన్ని (కోరికలు) పొందాలని అర్థం. అలా చేసినప్పుడే ఆ సంపద, సుఖము మనస్సును పరిశుభ్రంగా ఉంచి నాలుగో పురుషార్థమైన సత్యాన్వేషణ గురించి ఆలోచించే శక్తినిస్తుందని అర్థం.
స్కాంద పురాణంలో శివపార్వతుల కల్యాణాన్ని వర్ణించారు. శివుడిని భర్తగా పొందడం కోసం పార్వతి తపస్సు చేస్తుంది. ఆ సమయంలో శివుడు మాయా బ్రహ్మచారి రూపంలో అక్కడకు వస్తాడు. ఆయన పార్వతితో మాట్లాడుతూ.. శివుడి గురించి తపస్సు చేడయం వృథా అని, అతను ఎద్దు వాహనంపై తిరుగుతుంటాడనీ.. ఇలా చాలా రకాలుగా నిందలు చేశాడు. పార్వతి అందుకు సమాధానంగా శివుడు పరబ్రహ్మ స్వరూపమని చెబుతుంది. శివుడి తత్వాన్ని వర్ణిస్తుంది. అందులో కూడా ‘వృషో ధర్మ ఇతి ప్రోక్తః’ అంటుంది. వృషభం అంటే ధర్మస్వరూపమని, ధర్మాన్ని శాసించేవాడు శివుడని అర్థం చెబుతుంది.
Contd.,...
వేద మంత్రాలను దర్శించిన రుషులు తాత్విక చింతనతో కూడిన విషయయాలను ప్రతీకాత్మకంగా కవితా ధోరణిలో చెప్పారు. ఇలా ప్రతీకాత్మకంగా ఉన్న విషయాలను రుషులు మరింత విస్తారంగా కథల రూపంలో పురాణాల్లో రాశారు. తాత్వికమైన భావం పురాణంగాను, పురాణం ఆచారంగాను మారడం మనం పలుచోట్ల చూడగలం. పురాణాల్లో గోదానాన్ని గురించి వర్ణించే సమయంలో కోట్ల యుగాలపాటు శివలోకంలో ఉంటారని, రుద్రుడిలా ఉంటారని చెప్పడం కేవలం అతిశయోక్తులు మాత్రమే. వేదాలకు అర్థాన్ని చెప్పే మీమాంస శాస్త్రంలో పై విధమైన వాక్యాల్ని అర్థవాదాలు అన్నారు. ఒక పనిని ఆచరింపజేయడానికి అది ఇవ్వబోయే ఫలాన్ని అతిశయోక్తులతో చెప్పడం, చేయకూడని విషయాన్ని అతిశయోక్తులతో చెప్పి భయపెట్టడం పురాణాల విధానం. భక్తులను సన్మార్గంలో ప్రవర్తింపజేయడానికే ఇలా చెప్పారని గుర్తుంచుకోవాలి. కానీ అవన్నీ అక్షరాలా నిజం అని భావించకూడదు. ఇవన్నీ ఒకానొక అమాయక యుగంలో, అందులోనూ పామరులకు చెప్పబడినవి. ఆధునికులకు ఇలాంటివాటిని అక్షర సత్యాలుగా చెబితే మూఢనమ్మకాలనే విమర్శలు వస్తాయి. పండితులు వీటిని వివరించి చెప్పడం చాలా అవసరం. శివుడికి కోడెలను సమర్పించే ఆచారాన్ని కూడా ధర్మాచార్యులు పరిశీలించి ప్రస్తుత కాలంలో ఆచరించదగిన దాన్ని నిర్దేశిస్తే బాగుంటుంది.
నమస్కారం మనిషికి సంస్కారమేనా?
🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం ఎందుకు చేయాలి?
🙏🙏🙏🙏🙏🙏
*****************
భారతీయ సంప్రదాయంలో పెద్దవాళ్లను, కొత్తవారిని పరిచయం చేసినప్పుడు నమస్కారం చేస్తుంటారు. రెండు చేతులు జోడించి హృదయానికి దగ్గరగా చేర్చి చేసేదే నమస్కారం. పెద్దా, చిన్నా ఎవరికయినా మనం నమస్కారంతో గౌరవిస్తుంటాం. నమస్కారం ద్వారా మనలోని అహాన్ని నిర్మూలించడంతో పాటు ప్రేమ, మానవత్వం, స్నేహం... తదితర గుణాలను వ్యక్తం చేస్తుంటాం. దేవాలయాల్లో దైవారాధనలో కళ్లు మూసుకొని నమస్కారం చేస్తాం. దీని ద్వారా అంతర్లీనంగా భగవంతుని సన్నిధిలో వున్నట్టు అనుభూతికి లోనవుతాం. మేధావులు, మహాపురుషులు, పెద్దవారు, విజ్ఞానుల దగ్గరకు వెళ్లినప్పుడు వారి వద్ద పూర్తిగా వంగి నమస్కారం చేస్తాం. వారిలోని గొప్పదనానికి వందనం చేసినట్టు అని అర్థం. మానవుల్లో రకరకాల తేడాలున్నప్పటికీ అందరిలోనూ ఆ పరమాత్మ ఒక్కడే. ఎదుటివారు కూడా తన లాంటి వారేనన్న భావనతో చేసేదే నమస్కారమని పెద్దలు చెబుతారు.
**************
🙏🙏🙏🙏🙏🙏
***************
శుభోదయం
మాఘ పురాణం – ౧వ అధ్యాయం
శౌనకాది మునులు యజ్ఞము చేయ తలపెట్టుట
సకల పురాణములకు ఆలవాలమైన నైమిశారణ్యమందు ఒకప్పుడు శౌనకాది మహాఋషులు లోక కళ్యాణార్థమై, ఒక మహాయజ్ఞమును తలపెట్టిరి. ఆ మహాయజ్ణము పరిసమాప్తమగుటకు ఒక పుష్కరకాలము అనగా పన్నెండు సంవత్సరములు పట్టును. ఎన్ని అడ్డంకులు వచ్చిననూ, ఆ యజ్ఞమును పూర్తీ చేయవలయుననెడి దీక్షతో శౌనకాది మునులు తలపెట్టి, యజ్న స్థలముగా నైమిశారణ్యములో ప్రవహించు గోమతీ నదీతీరమును ఎన్నుకొని ఒక శుభ ముహూర్తమున యజ్ఞమును ప్రారంభించిరి. అంత పెద్ద యజ్ఞము చూచి తరింపవలయుననెడి కోరికలతో, భరతఖండము నలుమూలలనుండీ తపోధనులెందరో వచ్చి యజ్ఞస్థల సమీపమునందు నివాసము లేర్పరచుకొనిరి.
అచటికేతెంచిన మునీశ్వరులలో బ్రహ్మ తేజస్సు గల శతవృద్ధులు, వేదములామూలాగ్రముగా నవగాహన చేసుకున్న వేదమూర్తులు, సకల శాస్త్రములు అధ్యయన మొనర్చిన మునికుమారులు వచ్చి పాల్గొనిరి.
ఆవిధముగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతోను, పరివారముల తోను, తండోపతండములుగా యజ్ఞస్థలానికి జేరుకొనిరి. వేలకొలది ఋషిపుంగవులతో ఆ యజ్ఞస్థలము క్రిక్కిరిసి యుండెను. ఆ యాగము సకల లోకములకు శుభకరమైనదియు, పుణ్యప్రదమైనదియు, 12 సంవత్సరములు ఏకధాటిగా జరుగు మహాయాగమగుటవలన పురాణ పురుషుడగు సూత మహాముని కూడా తన శిష్య బృందముతో వేంచేసి యాగాది కార్యక్రమములో పాల్గొనిరి.
దూర ప్రాంతాలనుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యం కలిగినందున అమితానందం నొందిరి. సూతుల వారి ఆశీర్వాదములతో నిర్విఘ్నంగా యాగం జరుగునని అందరూ సంతోషపడిరి.
సూత మహాముని సకల శాస్త్రములు ఆమూలాగ్రముగ తెలిసియున్న మహానుభావుడు. వేదం, పురాణ ఇతిహాసాది సమస్త విషయములందూ వారికి తెలియనిది లేదు. అవి అన్నియు వారికి కొట్టిన పిండి వంటివి. వారి ముఖవర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు, ఎల్లవేళలా నవ్వులొలికించు ముఖారవిందము, మేలిమి బంగారం వలె ప్రకాశించుచున్న శరీరం, వర్ణింప నలవికానిది. అటువంటి పుణ్య పురుషుడగు సూత మహాముని ఆగమనమునకు స్వాగతం పలికి, సాష్టాంగ దండ ప్రణామములాచరించి యజ్ఞం జరుగు ఆ పండ్రెండు సంవత్సరములలో యెన్నియో పురాణ గాధలు విని తరించవలెననెడి కోరికతో ముని పుంగవులందరూ వేచియుండిరి.
సూతుల వారు శౌనకాది మునుల కోరికలను గ్రహించినారు. ఇటువంటి పుణ్య కార్యములందు పురాణ పఠనం గావించి అశేష మునిసత్తములను తృప్తి పరచుట తన విద్యుక్తధర్మమని యెంచి వారి కోరికను మన్నించినారు.
ఒక శుభ ముహూర్తమున ఆశ్రమ వాసులందరూ సూతుల వారికి అర్ఘ్య పాద్యములొసంగి ఉచితాసనములపై ఆసీనులను జేసి “మునిశ్రేష్ఠా! మునికులతిలకా! ఇంతకుమున్ను ఎన్నియో పురాణ గాధలు తమరు తెలియజేయగా విని ఆనందించియున్నాము. అనేక ఇతిహాసములను ఆలకించి, అందలి సారమును గ్రహించి యుంటిమి. సమయము వచ్చినప్పుడు సకల శాస్త్రములలోని నీతికథలు మాకు వినిపించుచునే యున్నారు. అయినను మీబోటి సిద్ధపురుషులు పదునాలుగు లోకములు సంచారము చేసి యున్నందున ఎన్నో విషయములు మీరు అవగాహన చేసుకొనియున్నారు. గాన వినదగు విషయాలేమైనా యున్నయెడల విరామ కాలములో మాకు వినిపించవలయు”నని శౌనకాది మునులు ప్రార్థించిరి. ఆ ప్రకారముగా కోరిన శౌనకాది మునులు తన వలన క్రొత్త సంగతులు తెలుసుకొనవలెననెడి కుతూహలం కనపరచినందున వారలను జూచి సూత మహాముని ఇటుల పలికిరి –
“ముని పుంగవులారా! మీ మనోవాంఛను గ్రహించితిని. మీరు వినదగిన కథను నాకు తెలిసియున్నంత వరకూ విచారించి మీకు తృప్తి కలిగించెదను. ఇటువంటి మహా సమయమున పుణ్య కథలు చెప్పుట వలన నాకున్నూ, వినుట వలన మీకున్నూ పరమార్థము కల్గు’నని పలికెను.
శౌనకాది మునుల కోరిక
సూతమహామునిని అడిగినదే తడవుగా వారందులకు అంగీకరించగా “ధన్యులమైతి”మని మునులందరూ అమితానందం నొంది సూతులవారి పాదములను కండ్లకద్దుకొని సూతమహామునితో –
“ఆర్యా! పద్మపురాణమందు లీనమైయున్న మాఘమాసం యొక్క మహాత్మ్యంను మరల మరల వినవలయుననెడి కుతూహలం కలుగుచున్నది. అదియునుగాక రాబోవు మాసం మాఘమాసమే అయినందున ఆ మాస మహాత్మ్యం, ఆచరించవలసిన విధానం, మాకు వివరించవలసిందిగా” కోరిరి.
ఆ విధంగా శౌనకాది మునులు ఇతర తపశ్శాలురు కోరుటవలన సూతమహర్షి మిక్కిలి సంతసించి యిట్లు పలికిరి.
“ముని పుంగవులారా! మీరందరూ అతిముఖ్యమైన విషయాన్నే అడుగుచున్నారు. మాఘమాసం కూడా ప్రారంభం కాబోవుచున్నది. ఇటువంటి సమయంలో మాఘ పురాణం వినుటవలన కలిగే ఫలము అంతింత కాదు. అదియునుగాక ఈ మహాయజ్ఞం జరుగుచున్న సమయములో మాఘమాసం యొక్క మహాత్మ్యం మీకు వివరించవలసిన భాగ్యము కలిగినందులకు నేను అదృష్టవంతుడనే. కాన సావధాన మనస్కులై ఆలకింపు”డని సూతమహర్షి ఇట్లు వివరించిరి –
“నేను ణా తండ్రి శిష్యుడగు రోమహర్షుని శిష్యుడను. అతడు మహా తపస్వి, జ్ఞాని. నాతండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించెను. విష్ణ్వంశ సంభూతుడగు వేదం వ్యాస మహర్షికి ప్రియ పాత్రుడను. వారి దయవలన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్ధ్యములు కలిగిన వాడనయితిని. నేను తెలియజేయుచున్న నీతిబోధలు సకల లోకములకు శుభములు కలుగును. మీరడిగినటులే పూర్వం దిలీప మహారాజుకు తన కులగురువైన వశిష్ఠమహాముని మాఘమాస మహాత్మ్యమును వివరించినా
రు. ఆ విషయమునే నేను మీకు వివరించబోవుచున్నాను.
దుఃఖ దారిద్య్ర నాశయ శ్రీ విష్ణోస్తోషణాయచ
ప్రాతఃస్నానం కరో మధ్యమాఘే పాప వినాశనం
మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ
స్నానేనా నేన మేదేవ యధోక్త ఫలదోభవ

మాఘ స్నాన శ్లోకం
MAAGHA PURANAM -- 2

మాఘ పురాణం – 2వ అధ్యాయం

దిలీప మహారాజు వేటకు బయలుదేరుట:

దిలీపుడను మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతువులొనర్చిన గొప్ప పుణ్యాత్ముడు. అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రివలె అన్ని విధములా కాపాడుచుండెను. ఒకనాడా భూపాలునకు వేట నిమిత్తం అడవికి పోవలెననెడి కోరిక కలిగెను. మనసున కలిగిన కోరికను ఎట్టి వారలకైననూ నెరవేర్చుకొనుట సహజమే కదా! ఆ విధంగానే దిలీప మహారాజు వేటకు పోవ నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్యసమేతుడై వెడలెను.
దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి కౄరమృగములతో నిండియున్నది. ఆ క్రూర జంతువులు సమీపమందున్న గ్రామములపై పడి పశువులను, మనుష్యులను చంపి నానా భీభత్సములు చేయుచున్నవి.
దిలీపుడు అడవిలో మాటువేసి మృగములను చంపుచుండెను. తన పరివారము కూడా మృగములను మట్టు పెట్టుచుండిరి. ఇలా కొన్ని రోజుల వరకూ అడవియందు వుండి అనేక క్రూర జంతువులను జంపిరి. ఒకనాడొక మృగం పై బాణం వేసెను. ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోయెను. దిలీపుడు పట్టు విడువక దాని వెంట పరుగెత్తెను. ముందు మృగం, వెనుక దిలీపుడు, ఆతని వెనుక పరివారము పరుగిడుచుండగా ఆ మృగం ఒక కీకారణ్యమున ప్రవేశించెను. అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహంచే నాలుక ఎందిపోతున్నది. నీటికొరకు పరివారమంతా వెదుకుచుండిరి. అదృష్టం కొలదీ ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించినది. దానిని చూచి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించెను. ఆ సరస్సు అంతులేని తామరపువ్వులతో నిండి అతి మనోహరముగా నుండెను. దిలీపుడూ అతని పరివారమూ, తృప్తిదీర నీరు త్రాగిరి. గట్టుపైన ఉన్న వట వృక్షం క్రింద అలసట తీర్చుకొనుచుండగా దిలీపుడు వేటలో చెల్లాచెదురుగా తరిమివేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి. దిలీపుడు, అతని పరివారము వాటిని చూచి గురిపెట్టి, బాణములను వేసి చంపిరి. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవుచుండెను.
అటుల ఇంటిముఖం పెట్టి వెళ్ళుచున్న సమయమున మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యెను. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు గలిగి ప్రకాశించుచుండెను. ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడియుండెను. ఆ బ్రాహ్మణుడును క్షణమాగి, ఆ రాజును గాంచి “ఈతని ముఖవర్చస్సు చూడగా గుణవంతునివలె నున్నాడు. ఈతని కేదయినా ఉపకారము చేయుట మంచిది” అని మనసులో తలచి – మహారాజా! శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్ననూ అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవుచున్నావేమి? మాఘమాస మహాత్మ్యం నీకు తెలియదా!” అని ప్రశ్నించెను.
ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని జూచి – “విప్రోత్తమా! అటుల ప్రశ్నించారేమిటి?” అని ఆశ్చర్యంతో పలికెను.
“పరమ పావనమైన మాఘమాసం కదా!” అని జ్ఞాపకం చేయుచుంటినని బ్రాహ్మణుడు పలికెను.
“చిత్తము స్వామీ! నాకు గుర్తులేదు. రాజప్రసాదమున నున్న పురోహితులు చెప్పియుందురు. నేను మృగయావినోదినై వచ్చి అడవిలో కొద్ది దినములుండుట వలన నాకా విషయం జ్ఞప్తి లేదు. కావున మాఘమాస మహాత్మ్యము నెరింగింప వలసినదిగా ప్రార్థించుచున్నా”నని దిలీపుడు వేడుకొనెను.
ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి “రాజా! సూర్యవంశపు గురువైన వశిష్ఠులవారు అప్పుడప్పుడు మీకడకు వచ్చుచుండును గదా! ఆతని వలన మాఘమాస మహాత్మ్యమును గురించి తెలుసుకొనుము. ఆ మహామునికి తెలియనిది ఏదియు లేదు. గాన అటుల చేయుము” అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిని తాను పోయెను.
దిలీపుడు వశిష్ఠుని కడకుబోవుట:
దిలీపుడు తన పరివారంతో నగరము జేరెను. పదేపదే బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని ఎటులనో ఆ రాత్రి గడిపెను. మరునాడు ప్రాతఃకాలమున లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడుపులు, సకలాభరణములు ధరించి, మంత్రి, సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనమునకై వారి ఆశ్రమమునకు వెళ్ళెను.
ఆ సమయములో వశిష్ఠుల వారు తపమాచరించుకొనుచున్నారు. శిష్యులు వేదపఠనం గావించుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యమును జూచి వారికి తపోభంగము కలుగనీయరాదనీ కొంతతడవు వేచియుండెను. దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు. అందుచే గురుభక్తి మిక్కుటముగా నుండెను. మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సునుండి లేచి రాజును కుశల ప్రశ్నలడిగి ఉచితాసనముపై కూర్చుండబెట్టి వచ్చిన రాజును కారణమేమని యడిగెను.
దిలీపుడు వశిష్ఠునితో “ఋషిసత్తమా! తమవలన నేను అనేక రాజధర్మములు పురాణేతిహాసములు విని సంతుష్టుడనైతిని. కానీ మాఘమాస మహాత్మ్యముగాని,దాని ధర్మములు గాని తెలియనందున ఆ విషయములు తమనుండి తెలుసుకొన గోరి తమ వద్దకు వచ్చితిని. గాన పరమ పావనమూ మంగళప్రదమూ అయిన మాఘమాస మహాత్మ్యమును వివరించవలసినదిగా కోరుచున్నాను” అనెను.
అవును మహారాజా. నీవు కోరిన కోరిక సమంజసమైనదే. మాఘమాసము యొక్క మహాత్మ్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరించవలసిన యావశ్యకత ఎంతయినా గలదు.
మాఘమాసముయొక్క మహాత్మ్యమును వర్ణింప నాకుకూడా శక్యముగాదు. ఇతర దినములలో చేయు క్రతువులు గాని, యాగములు గాని, ఇవ్వనంత ఫలము కేవలము మాఘమాసములో చేయునదీస్నానమువలన గొప్ప ఫలము కలుగును. అటువం
టి ఫలము నిచ్చు మాఘమాసము అన్నివిధముల శుభప్రదమైనది. గాన యీ మాఘమాసమునందు చేయు నదీ స్నానమువలన మనుజుడు పుణ్యాత్ముడు అగుచున్నాడు. అంతియేగాదు. మాఘము అన్నివిధాలా పుణ్యప్రదమైనది.
అంతేకాక పుణ్యకార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును గాని మాఘ మాసములో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును. ఇంతకన్న మహత్తుగలది మరొకటి లేదు.
MAAGHA PURANAM -- 3

మాఘపురాణం - 3వ అధ్యాయము

వింధ్య పర్వతము:

దిలీపుని మాటలకు వశిష్ఠుడు మరల ఇట్లు చెప్పదొడంగెను. భూపాలా! నేను తెలుపబోవు విషయము చాలా పురాతనమైనది. ఒకానొక సమయమున వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగెను. ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది. ప్రజలకు తిండి లేదు. త్రాగుటకు నీరు లేదు. అంటువ్యాధులు ప్రబలి జనులు, పశువులు, చాలా నష్టపడినవి. అందువలన యజ్ఞయాగాది కార్యములు గాని, దేవతార్చనలు గాని, చేయలేకపోయిరి. వనములందు తపస్సు చేసుకోను మునీశ్వరులు సహితం ఆ కరువుకు హాహాకారములు చేసి ఆశ్రమములు వదలి వలస పోవుచుంటిరి. అప్పుడు భృగుమహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను. రేవానదీ తీరమందున్న ఫలవృక్షములు పంట భూములు నీరులేక బీడు పడిపోయినవి. త్రాగడానికి నీరు కూడా లభించుట లేదు.
మహా తపస్వియగు భృగుమహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేక పోయాడు. ఎన్నో సంవత్సరాలనుండి ఆ ప్రాంతమందుండుటవలన అచటినుండి కదలుటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధిలేక హిమాలయ ప్రాంతములకు వలసపోయాడు.
హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండచరియ వున్నది. ఆ కొండచరియ అచటనున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా వున్నది. అది తెల్లగా కూడా వున్నది. ఆ కొండచరియయందు ఇంద్రనీలములు ఉండుట వలన ధగధగా మెరుస్తున్నది. మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు ఆ కొండవద్దకు వచ్చి శ్రీమన్నారాయణు భక్తిభావముతో ప్రార్థించిరి. అంతియేగాక ఆ పర్వతమువద్దకు యక్షులు, గంధర్వులు వచ్చి విహరించుచుందురు” అని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించిరి. అంతట దిలీపుడు వశిష్ఠునితో ఇట్లు పలికెను.
“ఓ మహానుభావా! ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలుగజేసినవి. ఇంకను విశేషములున్న తెలుపగోరెదను” అని ప్రార్థించెను.
మరల వశిష్ఠులవారు ఇట్లు చెప్పిరి. “రాజా! నీయభీష్టం ప్రకారమే వివరింతును. సావధానుడవై ఆలకింపుము.
“ ఆ పర్వతరాజము కడు వింతయైనది. దానిపైనున్న వింత చెట్లు, పురాతన వన్య మృగములు, అనేక రకముల పక్షులతో నున్న ఆ అప్ర్వటం ముప్పది యోజనముల పొడవు కలిగి పది యోజనములు ఎత్తుగలదియై అలవారుచుండెను. అటువంటి పర్వతం వద్దకు భృగుమహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యములను చూచి సంతోషించాడు. తాను తపస్సు చేసుకొనుటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకొనుచుండెను” అట్లు కొంతకాలం గడచిపోయెను. ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకి వచ్చి తపమాచరించుకొనుచున్న భృగుమహర్షిని గాంచి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను.
గంధర్వ యువకుని వృత్తాంతము:
“భృగుమహర్షీ! నా కష్టమును ఏమని విన్నవింతును? నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించిననూ పులిమొగం నాకు కలిగినది. ఏ కారణంచే నాకు అటుల కలిగెనో బోధపడకున్నది. ఆమె ణా భార్య అతిరూపవతి, గుణవంతురాలు మాహాసాధ్వి. ఈ నా వికృత రూపం వలన ఎందుకు పనికిరాని వాడనైతిని. గాన ణా యీ రూపమునకు కారణమేమియో వివరించి నా మనోబాదను తొలగింపజేయుడు” అని పరిపరి విధముల ప్రార్థించెను. భృగుమహర్షి గంధర్వుని దీనాలాపము నాలకించెను. ఆతని వృత్తాంతము వినగానే ముని హృదయము కలచివేసినట్లయింది. ఆ గంధర్వుని కెటులైనను తన శక్తికొలది సాయము చేయవలయునని నిశ్చయించుకొని ఇట్లనెను.
“ఓయీ గాంధర్వ కుమారా! నీవు అదృష్టహీనుడవు. అదృష్ట హీనత వలననే నీకీ కష్టదశ కలిగింది. పాపం, పేదరికం, దురదృష్టం అను మూడునూ మనుజుని కృంగదీయును. ఈ మూడింటినీ నివృత్తి చేసుకొనవలెనన్న మాఘమాస స్నానమే పరమౌషధం. అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమపావనమైన మార్గం. గావున నీవు నీ భార్యతో గూడ పర్వతం నుండీ ప్రవహించుచున్న నదిలో స్నానం చేయుము. అదియునుగాక యిది మాఘమాసము గదా! వెళ్ళబోయిన తీర్థమెదురైనట్లు అన్నియు సమకూడుతున్నవి. ఈరోజుతో నీ కష్టములు తొలగిపోవును. నీ మనోవాంఛ యీడేరును. భయపడకుమని మాఘస్నాన ఫలము గురించి వివరించెను.
ఆ గంధర్వుడు భృగుమహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినెను. తన భార్య కూడా మునీశ్వరుని వచనములాలకించి సంతోషించెను. ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యా సమేతుడై ఆదాపుననే ప్రవహించుచున్న నదిలో స్నానం చేసెను. వెంటనే తనకున్న పెద్దపులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించెను. ఆ గాంధర్వ దంపతులు అమితానందం నొందిరి.
అంత వారిద్దరూ భృగుమహర్షి కడకువచ్చి సాష్టాంగ నమస్కారము చేసిరి. భృగువు వారలను దీవించి పంపివైచెను.
ఈవిధంగా గంధర్వ యువకుని చరిత్రమును వశిష్ఠులవారు దిలీపునకెరిగించి, “వింటివా రాజా! గంధర్వ కుమారుని వృత్తాంతం? మాఘమాసములో పుణ్యనదులయందు స్నానమాచరించిన యెడల ఎట్టి ఫలం కలుగునో ఊహించుకొనుము.
MAAGHA PURANAM -- 4

మాఘ పురాణం - 4వ అధ్యాయము

కుత్సురుని వృత్తాంతము:

పులి ముఖం గల గంధర్వుని వృత్తాంతమును దిలీపునకు వివరించిన తరువాత మాఘమాస మహాత్మ్యం గురించి వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పుచుండెను.
పూర్వకాలమున కుత్సురుడను పేరుగల విప్రుడొకడుండెను. అతడు కర్దమమునియొక్క కుమార్తెను వివాహమాడెను. కొంతకాలమునకా దంపతులకు ఒక కుమారుడు జన్మించెను.

కుమారునికి అయిదవ యేడు రాగానే ఉపనయనం చేసెను. ఆ బాలుడు దినదినాభివృద్ధి నొందుచు పెద్దలను గౌరవించడం విద్యాభ్యాసముయెట శ్రద్దజూపుట, నీతి నియమాలను పాటించుట, దైవకార్యములయందు భక్తి కలిగియుండుట మొదలగు కార్యములను నెరవేర్చుచు సకల శాస్త్రములనభ్యసించెను.

ఈవిధంగా కొంతకాలం గడచెను. ఆ బ్రాహ్మణ బాలునకు యుక్తవయస్సు వచ్చెను. అతనికి దేశాటనకు బోవలయునని కోర్కె కలిగి తీర్థయాత్రలకు బయలుదేరెను. అనేక పుణ్యక్షేత్రములను దర్శించుచు సిద్ధులను సేవించుచు, మాఘమాసం వచ్చునప్పటికి కావేరీ నదీ తీరమునకు చేరుకున్నాడు.

“నా పుణ్యఫలం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరీ స్నానయోగం లభించినది. ఇది నా భాగ్యం” అని ఆ విప్ర యువకుడనుకొని సంతృప్తి చెందెను.

మాఘమాసమంతయు ఇచటనేయుండి అధికఫలమును సంపాదించెదను” అని మనమున నిశ్చయించుకొని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యమూ ఆ నదిలో స్నానము చేయుచు భక్తితో భగవంతుని సేవిస్తూనే అచటనే కాలం గడుపుచుండెను. ఆవిధముగా నదీ తీరమున మూడు సంవత్సరములుండి అత్యధిక పుణ్యఫలము సంపాదించెను. ఆ తరువాత అన్ని కోర్కెలను సంపాదించుటకు ఘోరతపమాచరించవలయుననీ తలంచి ఆ సమీపమందొక పర్వతముపై తపస్సు చేసికొన సంకల్పించి తపస్సుజేయ మొదలిడెను. అట్లు కొంతకాలము నిష్ఠతోనూ, నిశ్చల మనస్సుతోనూ, తపస్సు చేయుచుండెను. అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యెను.
ఆ విప్రయువకుడు కన్నులు తెరచి చూచుసరికి శంఖ, చక్ర గదాధరుడై కోటి సూర్యుల ప్రకాశముతో వున్న శ్రీహరి నిండు విగ్రహాన్ని చూశాడు. అమితానందముతో సాష్టాంగ నమస్కారము చేసి చేతులు జోడించి అనేక రీతుల స్తోత్రము చేశాడు.

ఈవిధముగా స్తుతించిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తి భావమునకు శ్రీహరి సంతసమంది అతనిని ఆశీర్వదించి ఇట్లు పలికెను.
ఓ విప్రకుమారా! నీవు భక్తి ప్రభావముచే నన్ను ప్రసన్నుని చేసుకొంటివి. అది ఎటులనగా నీవు నిడవకుండ అనేక పర్యాయములు మాఘమాసములో నదీ స్నానము చేసి తపశ్శాలురు కూడా పొందని మాఘమాస పుణ్య ఫలమును సంపాదించితివి. అందుచేతనే నీపై నాకు గాఢానురాగము కలిగినది. గాన నీకేమి కావలయునో కోరుకొనుము. నీ అభీష్టము నెరవేర్చెదను” అని శ్రీమన్నారాయణుడు పలికెను.

శ్రీహరి పలికిన పలుకులకు ఆ బ్రాహ్మణుడు తన్మయుడై – ప్రభూ జగద్రక్షకా! సర్వాంతర్యామీ! ఆపద్బాంధవా! నారాయణా! ఆ దివ్య దర్శనము వలన నా జన్మ తరించినది. నిన్ను చూచినది మొదలు నేను ఏవిధమైన సుఖాలు కోరుటకు నా మనస్సంగీకరించలేదు. మనుజుడు ఏ మహాభాగ్యము కొరకు జీవితాంతము వరకు దీక్ష వహించునో అట్టి మహద్భాగ్యము నాకిపుడు కలుగగా మరొక కోరిక కోరగలనా? నాకింకేమియు అవసరము లేదు. కానీ మీ దివ్యదర్శనము నాకు ఎటుల కనిపించినదో అటులనే అన్ని వేళలయందు ఈ స్థలమందు భక్తులకు దర్శ మిచ్చుచుండవలెను. అదియే నాకోరిక” అని ప్రార్థించెను.

శ్రీహరి ఆ విప్రకుమారుని కోరికను మన్నించి నీ అభీష్టము నెరవేర్చెద గాక! అని పలికి నాటినుండీ అచటనే ఉండిపోయెను.

కొంతకాలమునకు తల్లిదండ్రులను చూచుటకై తన గ్రామమునకు వెళ్ళెను. చాలా దినములకు కుమారుడు వచ్చెనని వృద్ధులై వున్నా తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించి కుశల ప్రశ్నలడిగిరి.
MAAGHA PURANAM -- 5

మాఘపురాణం - అయిదవ అధ్యాయం

మృగ శృంగుని చరిత్ర

ఆ బ్రాహ్మణ యువకుడు కుత్సురుని కుమారుడు గనుక ‘కౌత్సు’డని పిలవబడుచున్ననూ ఆతనిని “మృగశృంగు”డను పేరుతొ పిల్చుచుండిరి. అదెటులనగా అతడు కావేరీ నదీతీరమున ఘోర తపస్సు చేసియున్నాడు గదా! అప్పుడాతను శిలవలె నిలబడి దీక్షతో తపస్సు చేసుకొను సమయంలో ఆ ప్రాంతమందు తిరుగాడు మృగములు, జంతువులు, తమయొక్క శృంగములచే నతనిని గీకెడివి. అందుచేత అతనికి ‘మృగశృంగు’డను పేరు సార్ధకమయ్యెను.
వివాహమాడు కన్య గుణములు
మృగశృంగునాకు యుక్తవయస్సు వచ్చియుండుటచే అతనికి వివాహము చేయవలెనని అతని తల్లిదండ్రులు నిశ్చయించిరి. ఈ విషయము మృగశృంగునితో చెప్పిరి. మృగ శృంగుడు వారిమాట లాలకించి ఇట్లు పలికెను. “పూజ్యులగు తల్లిదండ్రులారా! నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యము వివరించితిరి. ఐననూ నా అభిప్రాయము గూడ ఆలకింపుడు. అన్ని ఆశ్రమాలకంటే గృహస్థాశ్రమము మంచిదని దైవజ్ఞులు నుడివిరి. అయినను అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు. దానికి కారణ మేమనగా ప్రతి పురుషునకు తనకనుకూలవతియగు భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం సిద్ధించును. దానికీ ఉదాహరణగా స్త్రీయెటులుండవలయుననగా –
శ్లో: కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా
శయనేషు రంభా రూపేచ లక్ష్మీ క్షమయా ధరిత్రీ!
ఇవి ఆరు ధర్మములు ఉండవలెనని స్త్రీని గురించి వర్ణించియున్నారు. అనగా యింటి పనులలో దాసీవలెను, రాచకార్యములలో భర్తకు సహకారిగా మంత్రివలెను, శయన మందిరంలో రంభవలెను, భోజన విషయమున తల్లి వలెను, రూపమున లక్ష్మి వలెను, శాంతి స్వభావములో భూదేవి వలెను స్త్రీ ఆరువిధముల వ్యవహరింప వలెను.
అంతియేగాక చతుర్విధ పురుషార్థములైన ధర్మం, అర్థము, కామము, మోక్షము అని నాలుగు పురుషార్థములలో మోక్షం ప్రధానమైనది. అటువంటి మోక్షం సాధింపనెంచిన మిగతా మూడున్నూ అనవసరం. ధర్మాన్ని అర్థాన్ని మనుజుడు ఏవిధంగా సాధించునో కామమును గూడా అట్లే సాధించవలయును.
ప్రతి మానవుడు వివాహం చేసుకొనే ముందు కన్యయోక్క గుణగణములు తెలుసుకొనవలయును. జీవిత సుఖములలో భార్య ప్రధానమయినది. కనుక గుణవంతురాలగు భార్యను పొందుట కన్నా మరొక స్వర్గము లేదు.
గుణవతియగు పత్నితో కాపురం చేసిన ఆ సంసారం స్వర్గతుల్యముగా నుండుటయే కాక, అట్టి మనుజుడు ధర్మ-అర్థ-కామ-మోక్షములను అవలీలగా సాధించగలడు.
భార్య గయ్యాళి వినయ విధేయతలు లేనిదై యున్నచో ఆ భర్త నరకమును బోలిన కష్టములనుభవించుచు మరల నరక కూపమునకే పోగలడు. గనుక పెండ్లి చేసుకొనుటకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహమాడవలెను. అదెటులన కన్య ఆరోగ్యవతియై యే విధమైన రోగాగ్రస్తురాలై ఉండకూడదు. యెంత అందమయినదైననూ మంచి కుటుంబములోని కన్యయై యుండవలెను. బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలయి, దేవా బ్రాహ్మణులను పూజించునదియై, అత్తమామల మాటలకు జవదాటనిదై యుండవలెను.
ఈ నీతులన్నీ మునుపు అగస్త్య మహాముని చెప్పియున్నారు. గాన అటువంటి గుణవంతురాలగు కన్యనే ఎంచుకొనవలయును. అయినా అదెటుళ సాధ్యపడును? అని మృగ శృంగుడు తల్లిదండ్రులతో తన మనస్సులో నున్న సంశయములను తెలియజేసెను. కుమారుని మాటలకు తండ్రి సంతోషించి మరల ఇట్లు పలికెను.
“కుమారా! నీమాటలు నాకెంతయో సంతోషమును కలిగించినవి. వయస్సులో చిన్నవాడవైననూ మంచి నీతులు నేర్చుకొన్నావు. నీయభీష్టం నెరవేరవలయునన్న ణా దీన దయాళుడగు శ్రీమన్నారాయణుడే తీర్చగలడు. భగవంతునిపై భారం వేయుము” అని పలికెను.
MAAGHA PURANAM -- 6

మాఘపురాణం - 6వ అధ్యాయం

సుశీల చరిత్ర
భోగాపురమను నగరంలో సదాచారుడు, దైవభక్తుడగు ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుచుండెను. అతనికి అందాలభరిణె వంటి ఒక కుమార్తె గలదు. ఆ కన్యపేరు సుశీల. మంచి శీలం గలది. మంచి బుద్ధిమంతురాలు. చిన్నతనం నుండియూ దైవభక్తి కలదై ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతమును స్వీకరించుచు, పురాణ పఠనమునందే సదా మనస్సు నిలిపి కాలం గడుపుచూ, యుక్త వయస్కురాలై పున్నమి చంద్రుని బోలు మోము కలదై యుండెను.
ఆమె గుణములు తెలుసుకొని ఆమెవద్ద అన్ని లక్షణములు ఉండుట వల్ల మృగ శృంగుడు సుశీలనే పెండ్లియాడదలచాడు.
ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాండ్రతో కలసి కావేరీ నదికి స్నానమునకు బయలుదేరి వెళ్ళినది. ఆ సమయమున నొక ఏనుగు అడవినుండి ఘీంకారం పెట్టుచు వచ్చి స్నానార్థమై వచ్చిన అ అముగ్గురు కన్యలను తరుమజొచ్చెను. వారు భయపడి ఏదిక్కూ గానక ముందు వెనుకలు జూడక పిక్కబలం కొలది పరుగిడబోవుచుండగా దారిలో గట్టులేని నూతిలోపడి ప్రాణములు విడిచిరి. ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసివచ్చి చూచుసరికి ముగ్గురూ చనిపోయి వున్నారు.
ఆ వార్త మృగ శృంగునకు తెలియుటచే అతడునూ వచ్చి ఆ ముగ్గురి మృతదేహములనూ చూశాడు. ఎక్కడలేని దుఃఖమూ కలిగింది. వారినెటులనైనను బ్రతికించవలయునని సంకల్పించి వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృతదేహములను కాపాడుచుండుడని చెప్పి తాను సమీపముననున్న కావేరీ నదిలో రొమ్మువరకు దిగి ధ్యానం చేయసాగెను.
అంతలో అడవి అంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగ శృంగుని వద్దకు వచ్చినది. ఐననూ మృగ శృంగుడు చలించలేదు. నిర్భయముగా ధ్యానిస్తూనే వున్నాడు.
ఏనుగు కూడా మృగ శృంగుని కెదురుగా నిలబడి దీక్షగా చూడసాగింది. అటుల కొంచెంసేపు నిలబడి తటాలున తన తొండంతో మృగశృంగుని పట్టుకొని తన వీపుపై కెక్కించుకొన్నది. ఐననూ ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక ఇది అంతయు శుభసూచకమని తలచినాడు. నీరు మంత్రించి ఏనుగుపై చల్లెను. తన రెండు చేతులతో దాని శరీరాన్ని నిమిరాడు. క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదలి ఒక దేవతారూపంలో నిలబడి తనకు శాపవిమోచనం కలిగించిన ఆ మృగ శృంగునకు నమస్కరించి దేవలోకమునకు పోయెను.
వింటివా దిలీప మహారాజా! మాఘస్నాన ఫలం వలన ఏనుగునకు శాపవిమోచనమై ఎట్లు నిజరూపం వచ్చినదో! మిగిలిన వృత్తాంతం కూడా శ్రద్ధగా ఆలకింపుడు.
MAAGHA PURANAM -- 7

మాఘపురాణం - ఏడవ అధ్యాయం

మృగ శృంగుడు యముని గూర్చి వ్రతమాచరించుట
ఆవిధంగా ఏనుగునకు శాపవిమోచనమైన తరువాత మరల మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యువు వాతబడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించు నిమిత్తం యమధర్మ రాజును గురించి తపస్సు చేయ నారంభించినాడు.
నిశ్చల మనస్సుతో తదేక దీక్షతో యముని గూర్చి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోరదీక్షకు యముడు సంతసించి ప్రత్యక్షమయి – “మృగశృంగా నీ కఠోరదీక్షకు, పరోపకార పరాయణతకు నేనెంతయు సంతసించితిని. నా గురించి ఇంత దీక్షతో ఎవ్వరూ తపమాచరించి ఉండలేదు. నీకేమి కావలయునో కోరుకొనుము. నీ యభీష్టం నెరవేర్చెదను” అని యముడు పలికెను.
ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరచి చూడగా యముడు తన ఎదుట నిలబడియున్నాడు. వెంటనే చేతులు జోడించి “మహానుభావా! ఎంతటి తపశ్శాలురకైనను దర్శనమివ్వని మీరు నాబోటి సామాన్యునికి మీ దర్శనమిచ్చుట నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరుకాదు. అకాల మరణమునకు పాల్పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తుని జేయుడు” అని ప్రార్థించెను.
మృగశృంగుని పరోపకార బుద్ధికీ, దయార్ద్ర హృదయమునకు యముడు సంతోషించి అతని కోరిక ప్రకారము ఆ ముగ్గురు కన్యలకు ప్రాణదానము చేయనేంచి “మృగశృంగా! నీ భక్తికి మెచ్చితిని. నీ పరోపకార బుద్ధి నన్నాకర్షించింది. నీకు జయమగుగాక” అని యముడు దీవించగా –
మహాపురుషా! మిమ్ము సంతోషపెట్టుట సామాన్యమైనది కాదు. మిమ్ము సోత్రము చేసిన వారికి, స్తోత్రము విన్నవారికి జరామరణములు కలుగవు. అట్టివారికి అన్ని విధముల శుభములు కలుగునటుల అనుగ్రహింపుము అని ప్రార్థించగా –
“అటులనే నీ కోరిక సఫలమగుగాక” యని యమధర్మరాజు దీవించి యద్రుశ్యుడయ్యెను.