Devotional Telugu
3.46K subscribers
106 photos
23 videos
19 files
62 links
An attempt to bring our Hindu Devotional information
Download Telegram
21 వ రోజు - ఆచార్యుడి ద్వారా శరణాగతి
ఆండాళ్ తిరువడిగలే శరణం

#పాశురము

ఏత్త కలంగళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప
మాత్తాదే పాల్ శొరియుం వళ్ళల్ పెరుం పశుక్కళ్
ఆత్త ప్పడైత్తాన్ మగనే! అఱివుఱాయ్
ఊత్త ముడైయాయ్! పెరియాయ్! ఉలగినిల్
తోత్తమాయ్ నిర్ఱ శుడరే! తుయిల్ ఎరాయ్
మాత్త్తార్ ఉనక్కు వలి తొలైందు ఉన్-వాశఱ్కణ్
ఆత్తాదు వందు ఉన్-అడిపణియుమా పోలే
పోత్తియాం వందోం పుగరందు-ఏలోర్ ఎంబావాయ్

భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఫలితాలు దక్కుతాయో దక్కవో చెప్పలేం కానీ, "న సంశయోస్తి తత్ భక్త పరిచర్య రతాత్మనామ్" ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అందిచేట్టి భక్తాగ్రేసరులైన ఆచార్య ఆశ్రయణం చేసిన వారికి సిద్ది తప్పక కలిగే తీరును, సంశయం అక్కర లేదు అని నిరూపిస్తారు. అయితే ఆచార్యులయందు విశ్వాసం కలగటం కొంచం కష్టం, ఎందుకంటే ఆచార్యులు కూడా మనలాగే ఉంటారు. భగవంతుణ్ణి చేర్చటానికి వీరు తోర్పడుతారని విశ్వాసం కలగదు. ఆండాళ్ తిరుప్పావైలో కనిపించిన దాన్ని విశ్వసిస్తూ కనిపించని దానివైపు సాగవలే అని నేర్పుతుంది. ఇక్కడ మనకు రెంటిపై విశ్వాసం కలగాలి, ఒకటి ఇక్కడ భగవంతుణ్ణి చూపించే ఆచార్యుడిమీద, రెండవది ఆ భగవంతునికి మరొక రూపమై ఉన్న మనకు కనిపించే అర్చామూర్తి యందు. మన కంటికి కనిపించే సరికి మనకు నమ్మకం కలగటం కొంచం కష్టం. అయితే ఈ యుగంలో మాత్రం కేవలం విగ్రహ రూపంలోనే కనిపిస్తాడు, ఇతర యుగాల్లో కృష్ణుడిగా, రామునిగా కనిపించేట్టు తానూ వచ్చాడు. కనిపిస్తున్నాడు కదా, ఇతనేంటి దేవుడు అని సామాన్యులేకాదు వేదాధ్యనం చేసిన చతుర్ముఖ బ్రహ్మ, ఇంద్రుడంతటి వారే పొరపాటు పడక తప్పలేదు.

ఇంద్రుడు దేవతల అధిపతి, పరమ గర్విష్టి. అలాంటి వానికి ఇంద్రయాగం అని చేస్తుండేవారు గోకులంలో పెద్దలు. వానలు ఇచ్చేవాడు ఇంద్రుడని వారి విశ్వాసం. ఒకరోజు గోకులంలో పెద్దలంతా ఇంద్రయాగం తలపెట్టారు. అందరూ ఇంద్రుడికి అర్పించటానికి పదార్థాలను తయారుచేస్తున్నారు. అయితే కృష్ణుడికి ఇదేంటో తెలుసుకోవాలని కూతుహలపడి, పెద్దలని ఆడిగాడు. అయితే వారు వర్షాలు ఇచ్చే వరణుడు, ఇంద్రుడి ఆదీనంలోనే ఉంటాడుకదా, ఆ వర్షాలు వస్తేనేకదా మనకు పంటలు పండుతాయి, గోవులకు ఆహారం లభిస్తుంది. ఆ గోవుల పాడిపై మన జీవనం ఆధారపడి ఉంది అందుకే చేస్తున్నాం అని చెప్పారు. అయితే ఇంద్రుడు దేవతల అధిపతి, ఒక ఉద్యోగి, ఇలాంటివారెందరో తన ఆధీనంలో పని చేస్తున్నవారు ఉన్నారు ఈ విశ్వం యొక్క స్థితి కోసం. అలాంటిది తాను ఇక్కడే ఉంటుంటే తనను మరచిపోయి, ఆ ఇంద్రుడి కి చేయటం ఏంటీ, ఆ ఇంద్రుడు ఇవ్వాలన్నా తాను వెనకనుండి ఇస్తేనేకదా, ఇవ్వగలడు అని, ఆ ఇచ్చేవాన్ని నేనిక్కడే ఉండగా నన్ను కాదని చేస్తున్నారే అని శ్రీకృష్ణుడు అనుకున్నాడు. వాళ్ళకందరికి ఈ విషయం ఎలాగో తెలుపాలి అని అనుకుని, అందరినీ ఒక దగ్గరికి చేర్చి, వానలు ఇచ్చేది ఇంద్రుడా కాదు, సూర్యుని శక్తికి సముద్రంలోని నీరు మేఘాలుగా మారితే, ఆపై గాలి వీస్తె మన దగ్గరకు వచ్చాయి, ఆ గోవర్థన పర్వతం అడ్డుకోవడంచే మనకు వర్షంగా వస్తుంది. మనం గోవర్థన పర్వతానికే ఈ పదార్థాలను అర్పించి కృతజ్ఞత తెలుపుకోవాలి అని విన్నపించుకున్నాడు. అందరికి సభబే అనిపించి అందరూ ఆ గోవర్థన పర్వతానికే పదార్థాలను సమర్పించారు. తనే పర్వతంలో ఆవేశించి, నైవేద్యం పుచ్చుకున్నాడు. ఇంద్రుడికి పదార్థాలు అందకపోవడంచే ఆగ్రహించి ఏడు రోజులు వరుసగా రాల్ల వాన కురిపించాడు. ఇదిగో మనం చేసిన తప్పుకి ఇంద్రుడు ఆగ్రహించాడు, కన్నయ్యా అని అందరూ కృష్ణుణ్ణి చేరగానే, మనం ఆరగింపు ఇచ్చిన ఆ కోండే మనల్ని కాపాడదా ఏం అంటూ ఒంటి వ్రేలితో కొండను ఎత్తి అందరిని రక్షించాడు. గోవర్థనోద్దారి అయ్యాడు ఆయన. ఇంద్రుడు తనకని అర్పించినవి తానే తినాలి అనుకున్నాడు, ఆ ఇంద్రుడిలోనూ ఉండేవాడు కృష్ణుడేకదా, అదే శ్రీకృష్ణార్పణ మస్తూ అని అనుకునేవాడైతే అన్ని పదార్థాలు ఉండేవి, నేనే తింటున్నాను, నాలోని పరమాత్మకు కాదు అని భావించాడు కాబట్టే ఇంద్రుడికి బుద్ది చేప్పే పరిస్థితి కల్పించాడు కృష్ణుడు. ఇంద్రుడంతటి వానికే తన ప్రభువు ఇతను అని ఇంగితం లేదు అంటే మన లాంటి సామాన్యులం మనం ఏం చెప్పగలం.

అయితే ఇంద్రుడు దేవతల లో ఒకడు, మరి ఆ దేవతల అందరికి అదిపతిగా ఉండే చతుర్ముఖ బ్రహ్మకు కూడా ఈ పరిస్థితి తప్పలేదు. గోకులంలో కృష్ణుడి లీలలు అందరూ చెప్పుకుంటుంటే, బ్రహ్మకు కూడా అసూయ కలిగి, ఇదేదో చూడాలి అని గోకులంకు వచ్చాడట. ఆ రోజు కృష్ణుడు ఆ గోపబాలుర మద్య కూర్చుని సద్దులు ఆరగిస్తుండగా చూసి, ఈ ఎంగిలి వేషాలు వేసే వాడా దేవుడంటే అని అనుకుని, ఈ వ్యక్తి ఏంటో ఇంద్రజాలం చేస్తున్నాడు, వీడికి బుద్ది చెప్పవలె అని అనుకున్నాడు. గోవులను అపహరించి ఒక గుహలో దాచాడు. అంతలో ఒక గోప బాలుడు వచ్చి కృష్ణా మన గోవులు కనిపించటంలేదు అని చెప్పాడు, కృష్ణుడు వాటిని వెతుకుతూ అటు వెళ్ళగానే, గోపబాలురనూ అపహరించి మరొక గుహలో దాచాడు బ్రహ్మ. అయితే గోప బాలురను వదిలి వెడితే గోకులంలోని వారంతా కృష్ణుణ్ణి దేహశుద్ది చేస్తారు అని అనుకున్నాడు బ్రహ్మ. ఇక బ్రహ్మ లోకం కి బయలుదేరాడు బ్రహ్మ, ఇది చూసి శ్రీకృష్ణుడు బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నాడు.ఎన్నెన్ని
దూడలు, ఎన్నెన్ని గోవులు, ఎందరెందరి గోపబాలురను బ్రహ్మ దాచాడో అందరి రూపాలను తనదిగా చేసుకున్నాడు కృష్ణుడు. అందరి రూపాలు ఆయనే దాల్చాడు, వారి వారి ప్రవృత్తులతో సహా ఏడాది కాలం అట్లానే ఉన్నాడు. గోకులంలో ఇప్పుడు అందరి రూపాల్లో ఉన్నది కృష్ణుడే అవటంతో నందగోకులం అంతా ఆనంద తరంగితం అయ్యింది. ఇక్కడిది చేస్తూ బ్రహ్మ లోకం వెళ్ళి బ్రహ్మ రూపు దాల్చి, అక్కడివారితో తన రూపు వేసుకొని ఒకడు వస్తాడు బాగా శుద్ది చేయండి అని చెప్పి వచ్చాడు కృష్ణుడు. బ్రహ్మకు తనలోకంలో కూడా ఆదరణ లేకుండాపోయి నంద గోకులం చేరి చూస్తే ఎక్కడి పిల్లలు అక్కడ, ఎక్కడి గోవులు అక్కడ కనిపించాయి. ఆశ్చర్య పడి తాను దాచిన గుహల్లో చుస్తే తను దాచినవి కనిపించాయి. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూస్తే ప్రతి రూపంలో కృష్ణుడే కనిపించాడు. అప్పుడు ఆ చిన్నారి కృష్ణుడిపై మూడు తలలు వాల్చి స్వామి స్వరూపాన్నీ కీర్తన చేసి, ఎందుకిచ్చావీ బ్రహ్మ పదాన్ని, ఎంత పదవి కట్టబెట్టావో అంత గర్వం కూడ నాకు పెరిగింది, ఈ గర్వం లేని గోప జనం ఎంత అదృష్టవంతులయ్యా, అలాంటి వారి పాద దూళినైనా బాగుండేది అని బ్రహ్మ అంతటివాడు పశ్చాత్తాపం చేందాడు.

అలాగే ఒక చిన్న స్వరూపం భగవంతుడు దరించే సరికి మనకు ఒక అవజ్ఞత, చులకన భావం ఏర్పడుతుంది. కనిపించక పోతే అమ్మో అంటాం, కనిపిస్తే ఓసీ ఇంతేనా అంటాం. ఆనాడు బ్రహ్మ, ఇంద్రులకి కనిపించే వాడిపై విశ్వాసం కలగలేదు కారణం ఆచార్య అనుగ్రహం లేక పోవటం. అదే భగవంతుడు ఈనాడు అర్చా స్వరూపం లో ఉన్నాడు. అయితే కొందరు కనిపించే శక్తిని బట్టి తత్వాన్ని గుర్తించాలని అది అగ్నిహోత్రంలో, ఆదిత్యున్నిలో, జ్ఞానుల హృదయాల్లో భగవంతుణ్ణి దర్శించాలని అని చెప్పారు. సామాన్యులకి మానసిక ఆధారం కోసం ఏదో ఒక రూపం ఉండాలి కనుక మొదటి మెట్టుగా ఈ విగ్రహాంలో చూడొచ్చు, ఆపై విగ్రహం లేకుండా శక్తిరూపాల్లో భగవంతుణ్ణి చూడాలి అని చెప్పారు. కాని అది తప్పు. ఒకటి తర్వాత ఒకటి పై పై కి చూపిస్తూ ఉన్నాయి కనుక, కాలుస్తోంది కనుక అగ్ని, ఆపై కాల్చకుండానే నిత్యం కాంతినిస్తుంది కనుక సూర్యుడు, ఆపై కదల్చ కుండానే చైతన్యంచే కదుపుతోంది కనుక హృదయాన్ని ఉపాసన చేస్తాం. "ప్రతిమాసు అప్రబుద్దానాం" అంటే విగ్రహం అనేది వీటికంటే ఎదో పైకే చెంది ఉండాలి. కేవలం శక్తిని బట్టేనా గుర్తించేది, తత్వం బట్టి కదా, అలా తత్వాన్ని గుర్తించగలిగేవాడు ప్రతిమ లేక విగ్రహంలో గుర్తిస్తాడు. అలాంటివాడు బాహిరమైన వాటియందు దృష్టి ఉండని వాడు మాత్రం గుర్తిస్తాడు. ఎలాగంటే, ఒక విద్యుత్ తీగను చూసి అదేం కాలటంలేదు, వెలగటం లేదు అని ముట్టు కుంటే ప్రాణం తీస్తుంది. కాని అదే తీగ అంచుకు చేరగానే ఒక విద్యుత్ దీపాన్ని వెలిగిస్తుంది అని తెలిసినవాడు ఈ బాహిరమైన వాటియందు దృష్టి లేకున్నా ఆ లోపల విద్యుత్ తత్వాన్ని తెలుసుకొని ఉంటాడే. అలాగే విగ్రహ స్వరూపం కదలక పోయినా, భగవత్ సాక్షాత్కారానికి మొదటి మెట్టే కాదు, చివరి మెట్టు కూడా. విగ్రహంలో కూడా తత్వం ఉందని కాదు, "విగ్రహమే తత్వం" అని గుర్తించాలి.

ఆండాళ్ తిరుప్పావై సారాంశం ఆ విగ్రహం పై విశ్వాసం కలిగించటమే. అందుకే ఆండాళ్ శ్రీవెల్లిపుత్తూర్ లో వటవత్రశాయిని కొలిచింది, వేంకటాచలపతినికి శరాణాగతి చేసింది, తిరుమాలైజోలు సుందరభాహునికి మొక్కుబడి చేసింది, శ్రీరంగనాథున్ని చేరింది, శ్రీకృష్ణుడిని మనస్సులో భావించింది, పాల్కడలిలో స్వామిని పాడింది. ఇన్నింటిలో తత్వం ఒకటే అని తన ఆచరణ ద్వారా మనకు చూపించింది ఆండాళ్. అలాగే ఆచార్యుని ద్వారా భగవంతుణ్ణి దర్శించవలెనని తెలిపింది. భగవంతుణ్ణి ఆరో స్వరూపంగా ఆచార్యులలో చూడవచ్చునని తెలియజేసింది. మొదట ఆ విశ్వాస పూర్ణత మనకు ఏర్పడితే, ఆ పూర్ణతత్వాన్ని మనం దర్శించగలం.

నిన్న అమ్మని లేపారు, ఆమ్మ లేచి నేను మీ తోటిదాన్నే కదా, పదండి అందరం కల్సి స్వామిని లేపుదాం అని వీళ్ళతో కలిసింది. ఇక మనవాళ్ళంతా స్వామి వద్దకు చేరి "శ్రీమన్నారయణ చరణౌ శరణం ప్రపద్యే" అంటూ శరణాగతి చేస్తున్నారు. ఉపాయం భగవంతుడే అని మనకు తెలుసు, అమ్మ మనల్ని ఆయనతో చేర్చే ప్రాపకురాలిగా ఉంది. అమ్మ ద్వారా పొందిన జ్ఞానంతో మన వాళ్ళు ఇలా ప్రార్థన చేసారు. ఈరోజు మనవాళ్ళు "మగనే!" కుమారుడా "అఱివుఱాయ్" తెలివి తెచ్చుకో అంటున్నారు. ఐతే మన వాళ్ళకు శ్రీకృష్ణుడిని నేరుగా ఆశ్రయించకూడదు, ఆచార్యుడైన నందగోపుని ద్వారా ఆశ్రయించాలి అని తెలుసు, అందుకే నందగోపుడి లక్షణాలు తెలుపుతూ "ఆత్త ప్పడైత్తాన్" లెక్కకు అందనన్ని "వళ్ళల్ పెరుం పశుక్కళ్" ఇచ్చే ఔదార్యం కల్గిన పశువులు, శ్రీకృష్ణుడికీ ఇదే ఉదార స్వభావం కదా ఇది నందగోపుని సంబంధంతోనే కదా వచ్చింది. ఇచ్చే స్థితి తనది పుచ్చు కోనివాడిదే లోటు అన్నట్లు ఆ పశువులు ఎప్పుడు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా పాలు ఇచ్చేవి, ఎలా ఇచ్చేవి ఆ పాలు అంటే "ఏత్త కలంగళ్" ఎన్ని కుండలు పెట్టినా, "ఎదిర్ పొంగి మీదళిప్ప మాత్తాదే పాల్ శొరియుమ్" పాల ధారలు పొంగుతుంటాయి, ఆ పొంగటం క్రింది నుండా పాలు పొంగుతున్నాయి అన్నట్లు ఇచ్చేవి. ఇక్కడ నందగోపుడు ఆచార్యుడు, గోవులు శాస్త్రములను అధ్యయనం చేసిన మహనీయులు, ఆ శాస్త్రములు కఠినమైనవి, గోవులు
వనం అంతాతిరిగి అక్కడి పచ్చికను తిని, అనుభవించి మనకు స్వచ్చమైన పాలను అందించినట్లే, జ్ఞానులైన మహనీయులు శాస్త్రారణ్యాలలో సంచరించి అక్కడి క్లేషాలను తాము అనుభవించి తత్-సారమైన భగవత్-గుణములైన పాల దారలను మనపై కురిపిస్తారు. కుండలు శిష్యులలాంటివి అనుకోవచ్చు, ఆ ఇవ్వడం నాలుగు కారణాలనే పొదుగుల ద్వారా ఇస్తుంటారు, తమకు పెద్దలు ఇచ్చారు కనుక ఇవ్వాలని కొందరు, ఆవలి వాడు అడుగుతున్నాడే అని కొందరు, ఆవలి వాడు కష్టపడుతున్నాడే అని తీర్చడానికి కొందరు, తమకు తెల్సింది చెప్పకుండా ఉండాలేక కొందరు ఇస్తుంటారు. అలాంటి జ్ఞానులనెందరినో శిష్యులుగా కల వారు మన రామానుజాచార్యులవారు. అలాంటి ఆచార్యులవద్ద కుమారుడిగా ఉండే స్వామి తెలివి తెచ్చుకో, నీవు వచ్చింది గోకులానికి, నీవై కోరి వచ్చావు మాలాంటి వారి వద్దకి. పరమపదం లో నిత్యశూరులవద్ద తన సంకల్పాన్ని గుర్తించి చేసేవారుండగా, తనను తాను తెలియనివాడైనందుకే కదా, మా మద్యకు వచ్చి మా అరాధన అందుకుంటున్నావు, ఇది మా పాలిట నీదయ. "ఊత్త ముడైయాయ్! పెరియాయ్!" నీకు దృడమైన ప్రమాణం నీకుంది వెనకాతల, వేదైక వేద్యుడివి, ఆ వేదానికే అందనివాడివి, అలా అందనివాడివి "ఉలగినిల్ తోత్తమాయ్ నిర్ఱ" మా మద్యకు అందే వాడిలా వచ్చి "శుడరే!" దివ్య కాంతులీడుతూ ఉన్నావు, మేం క్రమం తప్పకుండా మీ అమ్మ నాన్నలను లేపి వారి ఆజ్ఞతో వచ్చాం "తుయిల్ ఎరాయ్" తెలివి తెచ్చుకో.

వాళ్ళు ఎట్లా వచ్చారో విన్నపించుకున్నారు "మాత్త్తార్" శత్రువులైన వాళ్ళు "ఉనక్కు వలి తొలైందు" వాళ్ళ భలాన్ని ప్రక్కన పెట్టుకొని "ఉన్-వాశఱ్కణ్" నీ ద్వారం ముందు పడిగాపులు పడేవాళ్ళలా "ఆత్తాదు వందు" ఎక్కడైతే నీ భాణాల దెబ్బలకు బయపడి "ఉన్-అడిపణియుమా పోలే" నీపాదాలనే సేవించుకొనేట్లుగ వస్తారో, మేం అలానే వచ్చాం, దింతో స్వామికి భాద అయ్యి, మీకు శత్రువుల పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నట్లుగా భాద పడ్డాడు, లేదయ్యా "పోత్తియాం వందోమ్" మేం కుడా ఒకనాడు వాళ్ళకేం తిసిపొలేదయా, ఒకప్పుడు మేం అభిమానం కల్గి మేం నీ దగ్గరకి రావటం ఏంటి అనుకునే వాళ్ళం, కానీ నీవంతటివాడివి ఇక్కడికి దిగి వచ్చావు, మాదగ్గరికి కూడా రాగలవు, కానీ మేం ఆగలేక పోతున్నాం, అర్తి తక్కుటుకోలేక నీ పాద ఆశ్రయణం కోసం వచ్చాము. అయితే శత్రువులు వాళ్ళ శరీరాన్నీ కాపాడుకోవటానికి నీ దగ్గరికి శరణూ అంటూ వస్తారు, మేం మా ఆత్మ రక్షణ కోసం వచ్చాం, వాళ్ళు నీ భలానికి లొంగి వస్తే మేం నీ గుణాలకు లొంగి వచ్చాం, వాళ్ళు నీ భాణాల దెబ్బలకు తట్టుకోక వస్తే మేం నీ కళ్యాణ గుణాల దెబ్బలకు తట్టుకోక నీ కళ్యాణ గుణాల కీర్తన చేద్దాం అని వచ్చామయ్యా "పుగరందు" ఆనందంతో వచ్చాం, ఇక పై అంతా నీ భాద్యత అంటూ శరణాగతి చేసారు
*ఈరోజు పాశుర‌ము*

అంగణ్ మాఞాల త్తరశర్, అభిమాన బఙ్గమాయ్ వన్దు నిన్ పళ్ళికట్టిల్ కీழே, శంగ మిరుప్పార్‌పోల్ వన్దు తలై ప్పెయ్‌దోమ్, కింగిణి వాయ్‌చ్చేయ్‌ద తామరై ప్పూప్పోలే, శెంగణ్ శిఱిచ్చిఱిదే యెమ్మేల్ విழிయావో, తింగళు మాదిత్తియను మెழுన్దాఱ్పోల్, అం కణ్ ఇరండుం కొండు ఎంగళ్ మేల్ నోక్కుదియేల్, ఎంగళ్ మేల్ శాప మిழிన్దేలో రెమ్బావాయ్

*అర్ద‌ము*

ఓ స్వామి చాలా గొప్ప‌దైన‌ భూమి మీద‌నున్న‌ రాజులు త‌మ‌ అహ౦కార‌ మ‌మ‌కార‌ములు వీడి వ‌చ్చి దేవ‌ర‌వారి సి౦హాస‌న‌ము క్రి౦ద‌గుమిగూడి ఉన్నారు మేముకూడా నీ స‌న్నిధికి వ‌చ్చేము. కావున‌ లేత‌ ఎరుపుగ‌ల‌ మ౦దార‌ పువ్వుల్లా సిరిమువ్వ‌ల్లా ఉన్న‌ క‌ళ్ళు విప్పి ఒక‌సారి మావైపు చూడు
చ౦ద్ర‌సూర్యులిద్ద‌రూ ఉద‌యి౦చిన‌ట్లున్న‌ అ౦ద‌మైన‌ నీ క‌న్నుల‌తో ఒక్క‌సారి చూసావ౦టే మా పాపాల‌న్నీ న‌శి౦చిపోతాయి

*జ‌య‌ శ్రీమ‌న్నారాయ‌ణ‌*
*జ‌య‌ రామానుజ‌*
తిరుప్పావై (మారి మలై మురైంజిల్ మన్ని క్కిడందుఱంగుం)23వ పాశురము:
అననన్య గతికలమై వచ్చి నన్నాస్రయించినారము , కటాక్షిం చుము అని గోపికలు ప్రార్ధించగా శ్రీ కృష్ణునకు మనస్సులో చాలా భాద కలగినది. నీలాదేవిని ఆశ్రయించి ఆమె ద్వారా నన్నాశ్రయించిన వారిని నేనే ముందుగా వెళ్లి సాయపడి రక్షించవలసి ఉండగా వేరొక గతిలేని వారమైనాము అని దైన్యముగా పల్కు నట్లు ప్రేరేపించితినే ! ఎంత తప్పు చేసితిని అని శ్రీ కృష్ణుడు చాలా నోచ్చుకోనేను.
ఇలా పడుకున్న శ్రీ కృష్ణుని లేచి నడచి వచ్చి ఆ స్థానమున సింహాసనమున వేంచేసి తమ కోరికవిని క్రుపచేయవలేనని గోపికలు ప్రార్ధించుచున్నారు.

మారి మలై మురైంజిల్ మన్ని క్కిడందుఱంగుం పాశురము:
మారి మలై మురైంజిల్ మన్ని క్కిడందుఱంగుం
శీరియ శింగం అరివుత్తు త్తీవిరిత్తు
వేరి మయర్ పొంగ ఎప్పాడుం పేరుందుదఱి
మూరి నిమిరుందు మురంగి ప్పుఱప్పట్టు
పోదరుమా పోలే నీ పూవైప్పూ వణ్ణా ఉన్
కోయిల్ నిన్ఱు-ఇంగనే పోందరిళి క్కోప్పుడైయ
శీరియ శింగాశనత్తిరుందు యాం వంద
కారియం ఆరాయ్-అందరుళ్-ఏలోర్ ఎమ్బావాయ్

తాత్పర్యము:
పర్వత గుహలో వర్షాకాలములో కదలక మెదలక పడుకున్న సౌర్యముగల సింహము మేలుకొని , తీక్ష్ణమగు చూపులు నిటునటు చూచి , ఒకవిధమగు వాసనగల తన ఒంటి వెంట్రుకలు నిగుడు నట్లు చేసి, , అన్ని వైపులా దొర్లి , దులుపుకొని , వెనుకకు ముందుకు శరీరమును చాపి , గర్జించి , గుహనుండి వేల్వడునట్లు, ఓ అతసీపుష్ప సవర్ణ ! నీవు నీ భవనము నుండి ఇట్లే బయటకు వేంచేయి రమణీయ సన్నీవేశము గల లోక్కోత్తరమగు సింహాసనమును అధిష్టించి మేము వచ్చిన కార్యమును ఎరుగ ప్రార్ధించుచున్నాము.
అలా కోరటంతో శ్రీ కృష్ణ పరమాత్మ తన శయనాగారమును వీడి నడచి వచ్చి సింహాసనము నధిరోహించి గోపికలను యుక్తరీతిని పలుకరించవచ్చునని అనుకోవచ్చును.
హరి హర పురం నందు పీఠాధిపతి స్వామి వారు 25 అడుగుల ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠ చేయనున్నారు,
10 లక్షల హనుమాన్ చాలీసా పారాయణ చేయించాలి అనుకున్నారు.
ఎవరైనా
భక్తులు January 15 నుండి
April 2 లోగా హనుమాన్ చాలీసా 500 సార్లు చేయగలిగితే మీ పేరు చిరునామా తెలియచేయగలరు..

రోజుకు 6 లేదా 7 సార్లు చేసిన సరిపోతుంది.,
తినకుండా చేయాలి అని ఏమి లేదండి,
మనసు ప్రశాంతంగా శుద్దిగా ఉంచుకొని ఏ వేళలో అయిన చేయవచ్చు.,

మీకు ప్రసాదం ఆశీర్వచనం వస్తుంది.

మీ పేరు చిరునామా తెలియచేయగలరు🙏🏻

ఇంకా ఎవరైనా చేయగలిగితే వారి వివరాలు కూడా మాకు తెలపండి🙏🏻

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
స్వామి వారి భక్తురాలు
9985874068
పై నెంబర్ వాట్సాప్ మెసేజ్ ల ద్వారా మాత్రమే సంప్రదించగలరు
ఇరవైనాలుగో రోజు పాశురం🚩*_j

🕉🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️

*☘పాశురం☘*

*అన్ణి వ్వులగ మళన్దాయ్! ఆడిపొత్తి;*
*చ్చేన్ణజ్ఞ తైన్నిలజ్ఞేశేత్తాయ్! తిఱల్ పొత్తి;*
*పోన్ణ చ్చగడ ముద్దైత్తాయ్! పుగళ్ పొత్తి;*
*కన్ఱుకుడై యావేడుత్తాయ్! గుణమ్ పొత్తి;*
*వెన్ణుపగై కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పొత్తి;*
*ఎన్ణెన్ణున్ శేవగమే యెత్తిప్పఱై కోళ్వాన్*
*ఇన్ఱి యామ్ వన్దొన్ ఇరజ్గేలో రెమ్బావామ్*

*🌴భావం🌴*

అలనాడు బలివలన దుఃఖితులైన దేవతలను రక్షించుటకు రక్షించుటకు త్రివిక్రముడవై మూడు లోకాలను కొలిచిన వామనుడా! నీ రెండు పాదములకును మంగళము! సీతమ్మ నపహరించిన దుష్టడగు రావణుని లంకను గెల్చిన ఓ శ్రీరామా! నీ ధీరతకు మంగళము! బండి రూపంలో శకటాసురుడనేరాక్షసుడు నిన్ను చంపప్రయత్నింపగా వాని కీళ్ళూడునట్లు తన్నిన నీ కీర్తి ప్రభలకును మంగళము! దూడ రూపమున నిన్ను చంపవచ్చిన వత్సాసురుడనే రాక్షసుని. వెలగచెట్టుగా దారికి ప్రక్కన నిల్చిన కపిత్డాసురుడనే రాక్షసుని ఒక్కసారిగా సంహరించిన నీ వంచిన పాదమునకు మంగళము! దేవేంద్రుడు రాళ్ళ వర్షమును కురిపించగా గోవర్దనగిరిని గోడుగుగా నెత్తి గోకులమును రక్షించిన నీ ఆశ్రిత రక్షణ గుణమునకును మంగళమగుగాక! శత్రువులను చీల్చి చెండాడునట్టి నీ చేతి చక్రమునకు మంగళ మగుగాక! ఇట్లు నీ వీర గాధలన్నేన్నింటినో నోరార సుత్తించును నీ నుండి మా నోమునకు కావాల్సిన పరికరములను పొందుటకై మేము నేడు యిచ్చాటకు వచ్చి యున్నాము. కావున మా యందు దయచేసి వానిని కృపతో ప్రసాదింపుము. అని గోపికల్లెలరు స్వామిని వేడుకొన్నారు.

*🌳అవతారిక🌳*

ప్రవత్తి చేసిన వారికి పరమ సులభుడు పరమాత్మ! ఆశ్రితులకు కొంగు బంగారమే! గోపికలంతా తన్ను తన తిరుమాళిగనుంచి వీరసింహము వోలె నడిచివచ్చి సింహాసనాన్నదిష్టి౦పమని కోరినట్లే స్వామి చేశాడు. స్వామి యందు భక్తులకు ప్రేమ అధికమైనపుడు భక్తసులభుడైన స్వామి వారేది చెపితే అదే చేస్తాడుకద! అలా సింహగమనంతో వచ్చిన స్వామిని చూచిన గోపికలు 'అయ్యో! స్వామికెంత శ్రమ కలిగినదో!' అని అందోళనపడి అత్యంత భక్తీ ప్రవత్తులతోను, వాత్సల్యంతోను స్వామి పాదాలకు మంగళా శాసనం చేయడానికి సిద్ధపడి, తాము వచ్చిన పనిని మరచిపోయారు. స్వామి దివ్యమంగళ వోగ్రహాన్ని దర్శించిన ఆనందంతో మంగళాసనం పాడారు యీ (పాశురంలో)

*🌿(షణ్ముఖప్రియరాగము _ అదితాళము)🌿*

ప .. మంగళమగుగాక! జయమంగళం

అ...ప.. మంగళమగుగాక! శ్రీ పాదములకు

1. చ.. లోకములలనాడు గొలిచిన పదములకు
లంక గెల్చిన యట్టి రాముధీరతకు
శకటాసురుని గూల్చు నీ యశః ప్రభలకు
అకట వత్సాసురుని విసిరినా పడమూలకీల

2. చ... గోవర్దనాద్రినిన్ గొడుగుగా నెత్తిన
అవతారుడ! నీ కృపా రసమునకు
అవని శాత్రవుల నవలీలగా ద్రుంచు
దివ్యాయుధమును నిత్య మంగళము

3. చ.... ఈ విధిన్ మంగళాశాసము జేసి
నీ వీర గాథలే పాడి. కొనియాడి
నీ వోసగు వరములకు నిను జేరితమి నేడు.
ఆ వాద్య మొసగుమా! దాసుల బ్రోవుమా...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సంక్రాంతి రోజున స్త్రీలు పువ్వులు, పసుపు, కుంకుమ, పండ్లను దానం చేయడం ద్వారా సకలసంపదలతో పాటు దీర్ఘసుమంగళీ ప్రాప్తం లభిస్తాయి. మకర సంక్రమణ సమయంలో తిలా తర్పణలు విడిచి గుమ్మడి పండ్లను దానం ఇస్తే విష్ణువుకు బ్రహ్మాండాన్ని దానమిచ్చిన ఫలం లభిస్తుందని పండితులు చెప్తున్నారు.

ఈ ఫలం వల్ల పెద్దలు తరిస్తారని, సంక్రాంతి రోజున పితృదేవతారాధన చేయడం వల్ల వారి శుభాశీస్సులతో వర్ధిల్లుతారని విశ్వాసం. అంతేగాకుండా... మకర సంక్రాంతి పుణ్యదినాన దానధర్మాలు చేయడం ద్వారా జన్మజన్మల దారిద్య్ర బాధలు తొలగిపోతాయి.

 

ఈ మూడు రోజుల పండగలలో మొదటి రోజు భోగి పండగ. మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చేది భోగి. దక్షిణాయనానికి, ధనుర్మాసానికి చివరి రోజు ఈ రోజు. 14 జనవరి 2020 మంగళవారం భోగి పండగ ,15 జనవరి 2020 బుధవారం మకర సంక్రాంతి ,16 జనవరి 2020 గురువారం కనుమ పండగ. 

 

మకరరాశి ప్రవేశం ఎప్పుడంటే? మకర సంక్రమణం శ్రీ వికారినామ సంవత్సరం పుష్యమాసం బహుళ పక్షమి సోమవారం అనగా 14/15 జనవరి 2020  తెల్లవారి... అనగా 14/15  జనవరి 2020  తెల్లవారితే బుధవారం అనగా పుబ్బ నక్షత్రం, శోభన యోగం, తైతుల కరణం సమయంలో రాత్రి 2:08 నిమిషాలకు జగద్రక్షకుడైన శ్రీ సూర్యభగవానుడు ఉత్తరాషాఢ నక్షత్ర రెండవ పాదంలో మకరరాశి ప్రవేశంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమగును. 


మకర ప్రవేశం రాత్రి సమయం అయినందున మరుసటిరోజైన 15 జనవరి 2020 బుధవారం రోజు మకర సంక్రాంతి పర్వదినం సూర్యోదయం నుండే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కావున తేదీ 15 మంగళవారం రోజు అందరూ సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలి. జనవరి 14 తేదీ మంగళవారం రోజు పంచాంగ ప్రకారం భోగి పండగ అవుతుంది.
*🚩తిరుప్పావై ఇరవై ఏడవ ప్రవచనం🚩*

🕉🌻🕉🌻🕉🌻🕉🌻🕉🌻🕉

*☘పాశురం☘*

*కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్డా వుందన్నై*
*ప్పాడిప్పఱై కొణ్ణు యామ్ పెరు శమ్మానమ్*
*నాడుపుకళుమ్ పరిశినాల్ నన్డాక*
*శూడగమే తోళ్ వళై యేతోడేశేవిప్పూ*
*యామిణిహొమ్ పాడగమే యేన్ఱనైయ పల్ కలనుమ్*
*అడైయుడుప్పోమ్ అతన్ పిన్నే పాల్ శోఱు*
*మూడ, నెయ్ పెయ్ తు* *మళుంగైవళివారకూడి యిరుస్టు కుళిర్ న్దేలో రెమ్బావాయ్.*

*🌳భావం🌳*

నిన్ను ఆశ్రయింపని వారిని కూడా వారి మనసులను మార్చి నీకు దాసులౌనట్లు చేసి విజయాన్ని సాధించగల ధీమంతుడౌ ఓ గోవిందా! నిన్ను సుత్తించి నీనుండి 'పఱ' అనే వాద్యాన్ని పొంది లోకులచే సన్మానింపబడలేనని మా కోరిక నీ అనుగ్రహానికి పాత్రులమైన మమ్ము లోకమంత పొగడాలి. మేము పొందు ఆ సన్మానము లోకులందరూ పొగుడునట్లుండాలి. అనాటి మా రూపాలు ప్రకాశవంతంగా, తేజోమయంగా విరాజిల్లుతూ వుండాలి. దానికై మాకు కొన్ని భూషాణాలు కావాలి. ముంజేతులకు కంకణాలు కావాలి. భుజముల నాలంకరించుకొనుటకు భుజకీర్తులు కావాలి. దండలకు తోడవులును __ ఇంకా ఎన్నో అభూషణములను నీవనుగ్రహించగ మేము ధరించాలి. సన్మానమొందాలి. వీటన్నింటిని ధరించి ఆపై మేలిమి చీరలను కట్టుకోవాలి. అటుపై క్షీరాన్నము మునుగునట్లు పోసిన నేయి మోచేతిగుండా కారుచుండగ మేమంతా నీతో కలసి చక్కగా అరిగించాలి. ఇదీ మా కోరిక . ఇట్లైన మా వ్రతము మంగలప్రదమైనట్లే!

*🌿అవతారిక🌿*

స్వామిమొక్క ఆశ్రిత వ్యామోహాన్ని కీర్తించి వ్రతమును చేయటానికి కావలసిన పరికరాలన్నింటినీ అర్ధించారు గోపికలు . గోపికలు కోరిన పరికరాలన్నీ స్వామితో విడదీయరానివే! అంటే స్వామి తమతోనే వుండాలని ద్వానించేవిధంగా గోపికలు చాల చాతుర్యంతో వ్యవహరించారు. అనగా స్వామి గోపికలను సంపూర్ణంగా కటాక్షించాలని కోరారు. స్వామి యిదంతా విని 'మీరు చేసే వ్రతానికి ఫలాన్ని వివరించండి' అన్నారు గోపికలు యీ పాశురంలో ఆ ఫలాన్ని వివరిస్తున్నారు.

*🌴(హంసద్వనిరాగము _ అదితాళము)🌴*

ప ... అనాశ్రిత విజయ! శుభ, గుణదామా!
నిను సుత్తియించి ప్రాప్యము నొంది

అ..ప.. నిను సుత్తియించి ప్రాప్యము నొంది.
సన్మానమంది సన్నుతి జేతుము

చ.. కంకణమ్ములను భుజకీర్తులను
కర్ణ భూషలును కర్ణ పుష్పములు
మెరుగుటందియలు మేని తోడవులును
పరవశత నలంకరించుకొందుము

చ.. మేలిమి పలువల మేము ధరించి
పాలు నేయి గలసిన పరమాన్నము
కేలోడ మనము కలసి భుజియించి
ఇల నీ సంశ్లేషమున సుఖింతుము
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*_🚩తిరుప్పావై ప్రవచనం‎ - 27 వ రోజు_🚩*

🕉🌻🕉🌻🕉🌻🕉🌻🕉🌻🕉

*పంచసంస్కారం ఆపై మోక్ష అనుభవం*
*ఆండాళ్ తిరువడిగలే శరణం*

☘☘☘☘☘☘☘☘☘

*🌹పాశురము🌹*

*కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ఱనై*
*ప్పాడి పఱైకొండు యామ్ పెరుసమ్మానమ్*
*నాడు పుకరం పరిశినాళ్ నన్ఱాక*
*శూడగమే తోళ్ వళైయే తోడే శెవి పువ్వే*
*పాడగమే యెన్ఱనైయ పల్కలనుమ్ యామణివోమ్*
*ఆడైయడుప్పోం అతన్ పిన్నే పాల్ శోఱు*
*మూడనెయ్ పెయ్దు మురంగైవరివార*
*కూడి ఇరుందు కుళిరుంద్-ఏలోర్ ఎంబావాయ్*

లోకంలో విగ్రహాన్ని కొందరు ధనం క్రింద మార్చుకోవటానికి వాడుకుంటారు, దాన్ని కొందరు వస్తువుగా పెట్టి వ్యాపారం చేయాలని అనుకుంటారు, మరి కోందరు దాని నుండి రాజకీయాలు చేస్తారు. ఏఒక్కరో నూటికి *“కశ్చత్ మామ్వేహి తత్వతః”* రెండో అధ్యాయంలో తానే చెప్పి వాపోయినట్లుగా, ఆతత్వాన్ని వినియోగించుకొని ఆతత్వాన్ని సాక్షాత్కరించుకొని మన ఉజ్జీవనకోసం వచ్చిన రూపం ఇదీ అని విశ్వసించడం సామాన్యమైన విషయం కాదు. మనస్సు ఎంతో పరిపక్వం అయితే తప్ప లభించే స్థితి కాదు కూడా. ఆ స్థితి మనకు లభించాలి అంటే మనకు కూడా కొంత తెలుసును అనే అహంభావం తొలగాలి. నేనేదో నా ప్రయోజనం పొందాలి అనే స్థితి తొలగాలి గొల్ల పిల్లల మాదిరిగా. కృష్ణుడు చెప్పిందే తమకు జ్ఞానం తప్ప తమకంటూ ఒక జ్ఞానం లేనే లేదు. వారికి చేరాల్సిన స్థానం శ్రీకృష్ణుడే తప్ప వేరే గమ్యం కూడా తెలియదు. కనుక సాధనము, సాద్యము, జ్ఞానము, జ్ఞేయము, నడిపేది సర్వం శ్రీకృష్ణుడే అనే పరిపూర్ణ విశ్వాసం కలవారు గొల్ల పిల్లలు. అందుకే వారికి పరమాత్మ సర్వాత్మనా లొంగే ప్రవర్తించాడు, వారికి ఏ ఆటంకాలు వచ్చినా తొలగించాడు. ఇది లోకంలో ఉండే జీవుల్లలో ఎవరు తననే సర్వమూ అని భావించి, తన ఆజ్ఞని శిరోధార్యంగ స్వీకరించి ఎవరు తన మార్గంలో పయనిస్తారో అలాంటి వారి కోసం విగ్రహ రూపంలో ఉండే తానే ఏమైనా చేయగలను అని నిరూపించటమే ఆండాళ్ తల్లి భగవంతుని యొక్క వాక్కుగా మనకు చూపించే సారం. తాను ఒక అర్చామూర్తిని విశ్వసించింది, ఫలితాన్ని తను పొందింది. భగవంతుణ్ణి మనం విశ్వసించాలి అంటే అది విగ్రహ రూపంలోనే, మరొక చోటికి ఎగరటానికి ప్రయత్నం చేసి కూడా వ్యర్థం. విభవానికి మనం పోలేం, లోపల ఉండే అంతర్యామిని మనం చూడలేం, పరమపదం మనకు ఊహకికూడా అందనటువంటిది, కనిపించేరూపం భగవంతుడిది అర్చారూపం మాత్రమే. విగ్రహంలో భగవంతుడు కాదు మన సాంప్రదాయం, విగ్రహమే భగవంతుడు
అని మన ఆగమాలు నిరూపించే సిద్దాంతం. దాన్ని నమ్మిన ఆండాళ్ దాన్నే మనకు ఆదేశించింది, దాన్నే ఉపదేశించింది. శ్రీకృష్ణ అవతారంలో తాను మన దగ్గర ఉన్నప్పుడు సౌలభ్యాన్ని మనకు చూపించాడు, నేను నీకు కూడా ఎందుకు అందను నన్ను విశ్వసించండి అని అదే విషయాన్ని గోదాదేవి వద్ద నిరూపించినట్లే మన దగ్గర నిరూపించటానికి ఈనాడు మన వద్ద అర్చామూర్తియై ఉన్నాడు. కావల్సింది మనలో ఉండే విశ్వాసం.

శ్రీకృష్ణుడు ఆనాడు దివ్య అనుభవం అనేది ఎట్లా ఉండాలో చూపించాలని అనుకున్నాడు అందుకే సద్దులు ఆరగించుట అనే అద్భుతమైన లీలను తన చుట్టు ఉండే గొల్ల పిల్లలకి చూపి వాళ్ళని ఆనందంతోటి ఉన్మస్తక స్థితిలోకి తీసుకు పోయాడు. అయితే దాన్ని విశ్వసించటం చతుర్వేద అధ్యేతను నేను అనుకున్న చతుర్ముఖ బ్రహ్మ లాంటి వారికి కూడా అర్థం కాలేదు. చివరికి వారికి పాటం నేర్పి జ్ఞానోదయం కలిగించాల్సి వచ్చేంత వరకు. శ్రీకృష్ణుడు ఒకనాడు తన చుట్టూ ఉండే గొల్ల పిల్లలనందరికి చెప్పాడు, రేపటి నాడు మనం అంతా వనభోజనాలతో విందు చేసుకుందాం, ఎవరెవరి ఇళ్ళలోంచి వారికి వారికి తోచినవి ఏవేవో తెచ్చుకోండి అని చెప్పాడు. అందరూ తెచ్చుకున్నారు, తాను తెచ్చుకున్నాడు. ఆందరిని చుట్టూ కూర్చోబెట్టాడు, ఒక్కొక్కరివస్తువులని రుచిచూడటం ప్రారంభించాడు, అందంగా వారు తయారుచేసిన వైనాన్ని పొగడుతూ తాను ఆరగిస్తూ వాళ్ళకి ఆరగింపు చేస్తూ అద్భుతమైన ఆనందాన్ని వాళ్ళకి అందిస్తూ, తాను ఆనందం పోందుతున్నాడు శ్రీకృష్ణుడు. అయితే ఒక పిల్లవాడు తన ఇంటి దగ్గరి నుండి తెచ్చుకున్నవి గంజి నీళ్ళు అవడంతో, కృష్ణుడికి ఎలా ఇవ్వడం, కృష్ణుడు తన దగ్గరికి వచ్చేలోపు తాగేయ్యాలని గబ గబా త్రాగటం మొదలు పెట్టాడట. అయితే కృష్ణుడు తన పై ప్రేమ తో తెచ్చిన ఆ గొల్లపిల్లవాడి సంబంధం కల్గిన పదార్థం తనకు దొరక కుండా పోతుందేమో నని దిగులు చెంది, గబ గబా వెళ్ళి వాడి సెలవుల నుండి కారుతున్న గంజిని తాగటం ప్రారంభించాడు. దీన్ని చూసి చతుర్ముఖ బ్రహ్మకి ఏం అర్థం కాలేదు. వేదాధ్యయణం చేసినవాడాయే నిప్పునుని కూడా కడిగి తీసుకొనే ఆచారవంతుడు, తనకు ఈ విషయం నచ్చలేదు. జగత్ కారణ తత్వం ఇలా ఎంగిలి మంగళమా చేసేది అని అనుకున్నాడట బ్రహ్మ. అయితే, ఈ పిల్లవాడు ఏదో ఇంధ్రజాలం చేస్తున్నాడు, వీడికి బుద్ది చెప్పవలెనని బ్రహ్మగారు అనుకున్నారు, గోవులను గోపబాలురను దాచాడం, తరువాత బ్రహ్మ లోకంలో బ్రహ్మకు ఆదరణ లేకుండా కృష్ణుడు చెయ్యటం, ఆపై బ్రహ్మకు బుధ్ధి రావడం జరిగాయి. ఆనాడు ఆ పిల్లలకందరికి సద్దులు ఆరగించే అనుభవాన్ని కృష్ణుడు అందించాడు, మోక్షానందం ఏమిటో చూపించాడు.

*అయితే మోక్షం అనగా ఏమి ?*

మోక్షం అనగా ఆనందించుట, దీనిపై రక రకాల ప్రశ్నలు ఉన్నాయి. ఉపనిషత్తులు మోక్షంలో జీవుడు ఎలా ఉంటాడో అని ప్రశ్న వేస్తూ, *“బ్రహ్మవిత్ ఆప్నోతి పరం”* అని చెప్పాయి. ఆంటే ఆనందం అనేది తెలుసుకున్నవాడు ఒక గొప్ప స్థితిని లేక పరంను పోందును.

అయితే ఆ పరం ఎలా ఉండును ? అని త్తైత్రీయ ఉపనిషత్తు వర్ణించింది ఇలా *“ఆప్నోతి ”* అంటే పోందటం, లేక తినటం లేక అస్నుత అని చెప్పింది. *“సోహాస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణాభి పశ్చితేభిః"* . సహ- ఈ ముక్త జీవుడు అస్నుతే- ఆరగించును. దేనిని ? సర్వాన్ కామాన్ - దేన్నైతే జీవుడు కోరుకుంటాడో దాన్ని. మరి జీవుడు ఏమి కోరుకుంటాడు ? భగవంతునిలోని కళ్యాణ గుణాలను కోరును. దీన్నే వేదం ఇలా చెప్పింది. *"తస్మిన్ యదంతః తదుపాసితవ్యం"* అంటే తస్మిన్- ఆ పరమాత్మ యందు, అంతః-యత్ - లోపల ఏదైతే కళ్యాణ గుణ సంపద ఉన్నదో, తదుపాసితవ్యం- ఆ ధనాన్ని కోరదగును అని చెప్పింది. సర్వాన్ కామాన్- అన్ని కళ్యాణ గుణములను మరి ఎట్లా అనుభవించును ? బ్రహ్మణాభి- పరమాత్మతో, సహ-కలిసి పశ్చితేభిః- అనుభవించును. అయితే సంస్కృత వ్యాకరణంలో *"తో కలసి"* అని చెప్పేప్పుడు భోగ్య సహచర్యం మరియూ భోతృ సహచర్యం అని రెండు ఉంటాయి. రాజుగారితో మంత్రి కలిసి వచ్చెను అన్నప్పుడు రాజుగారికే ప్రాధాన్యత ఉంటుంది. భోతృ సహచర్యం అంటారు. అయితే భగవంతుడు తన కళ్యాణ గుణాలతో కలిసి ఎప్పటికీ ఉంటాడు, గుణాలను విడదీసి అనుభవించటం అనేది జరగదు. ఇక జీవుడు భగవంతుడిలో ఏకం అవడం అనేది జరగదు. ఉపనిషత్తులు చెబుతూ *"తమః పరేదేవే ఏకీ భవతి"* ఏకీ భావమే పర్యవసానం తప్ప, *"ఏకం భవతి"* అని చెప్పట్లేదు, ఇది గుర్తుంచుకోవాలి. *"ఏకీ భవతి"* అంటే ఒకటివలె అగును అని వ్యాకరణం చెబుతుంది. మరి జీవుడు పరమాత్మలో ఐక్యం కాడు, జీవుడు పరమాత్మను. చేరును. చేరి ఏమగును ? ఎక్కడో మూలన పడి ఉండునా, అలా పడి ఉంటే దాన్ని కైవల్యం అంటారు. మరి ఏమగును ? అంటే జీవుడు పరమాత్మను ఆయన గుణములతో అనుభవించును. మరి గుణములతో అనుభవించటం అంటే ఏంటి? ఇది అర్థం అవడం కష్టం. గుణములను చూడలేం, లెక్క పెట్టలేం. బ్రహ్మం అంటే తెలియదు, గుణం అంటే తెలియదు, ఇక అనుభవించటం అంతకన్నా తెలియదు. దీన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. అందుకే వేదవ్యాస భగవానుడు *"శ్రీకృష్ణభగవానుడు సద్దులు ఆరగించే కార్యక్రమాన్నే మోక్ష అనుభవం అని చెప్పాడు"* ఒకడు అనేకమందితో కలసి తన సంతోషాన్ని వారికి పంచుతూ వారి ఆనందాన్ని తాను పొందుతూ అన్
నం తినెను. ఇదే కదా కృష్ణుడు చేసిన సద్దులు ఆరగించే లీలలో ఉన్నది.

వేదం మోక్షాన్ని అన్నం తినడం అనే దానితో పోల్చి చెబుతుంది. మోక్షంకి వెళ్ళాక "అహం అన్నం అహం అన్నం అహమన్నాదో అహమన్నాదో" అంటూ సాగుతుంది. అయితే ఉపనిషత్తులు అన్నం అంటే *"అద్యతే అత్తిచ భూతాని తస్మాద్ అన్నం తదుచ్యతే ఇతి"* అద్యతే- క్రమంలో తింటే తృప్తినిస్తుంది, అత్తిచ భూతాని- క్రమం తప్పి తింటే అది మనల్ని తినేస్తుంది, అంటే శరీరం పాడై పోతుంది అని అర్థం. అందుకే క్రమంలో తినే దాన్నే అన్నం అంటాం. అయితే జీవుడు మోక్షానికి వెళ్ళాక భగవాన్ అహం అన్నం- నేను నీవు అనుభవించటానికి అని అంటాడట. అయితే భగవంతుడు లేదు అహం అన్నం- నేను నీవు అనుభవించటానికి అని అంటాడట. అయితే జీవుడు అహమన్నాదో- నేను ఆ అన్నాన్ని అనుభవించే వాడిని అని అంటాడట, ఆపై భగవంతుడుకూడా అహమన్నాదో- నేను ఆ అన్నాన్ని అనుభవించే వాడిని అని అంటాడట. అయితే అనుభవం పోందేదెవడు, అనుభవించేదెవడు ఇటా అటా, ఆ ఆనంద దశ మాత్రమే పైన ఉంటుంది తప్ప ఏది ఏవరు అనేది గుర్తించ వీలు కానట్లు సామానత్వం ఏర్పడుతుంది.

అయితే జీవుడు పరమాత్మను చేరాక సర్వాత్మనా సముడగును ఆయన వంటి రూపం,గుణం,ఆనందం, అనుభవం పొందును. బ్రహ్మసూత్రాలు రచించిన వేదవ్యాసభగవానుడు రెండు విషయాలు తప్ప సముడగును అని చెప్పాడు. అది శ్రీయ పతిత్వం, జగత్ కారణత్వం. ఇది వీడు కోరడు, వాడు ఇవ్వడు. శ్రీ మనకు అమ్మ ఇక జగత్ సృష్టీ స్థితీ లయాలు పెద్ద భాద్యత వాడే ఉంచుకుంటాడు. బ్రహ్మ సూత్రాల్లో *"భోగ్య మాత్ర సామ్య లింగాః"* అయితే అనుభవం మాత్రం సమానం, జీవుడికీ భగవంతుడికీ తేడా ఉండదు. ఇక ఈ అనందం ఒక్కో జీవికి ఒకలా ఉండదు, అందరికీ సమానం. ఆ అనందం పరమాత్మ ఆనందంతో సమానం అని భగవద్గీతలో భగవంతుడే చెప్పాడు. వేదం అదే చెప్పింది. శ్రీకృష్ణుడు ఆనాడు గొల్ల పిల్లలతో అదే ఆనందం అనుభవించాడు, వాళ్ళకీ చూపించాడు. గోదా దేవి సద్దులు ఆరగించడం ఏం ప్రారభ్దం కనుక ఎంచక్కా మనం పరమాన్నాన్నే ఆరగిద్దాం అని చెప్పింది.

అందుకే గోదాదేవి *"పాల్ శోఱు మూడనెయ్ పెయ్దు మురంగైవరివార కూడి ఇరుందు కుళిరుంద్"* కలిసి అందరం పరమాన్నాన్ని తినవలెనని చెబుతుంది. మరి ఎలాంటి పరమాన్నం అంటే జీవుడుంటాడు దేవుడుంటాడు, ఇరువురిలో సమానత్వం ఉంటుంది. ఇరువురిలోనూ ప్రీతి ఉంటుంది, ఎవరు ఎవరిని ఎంత ప్రేమిస్తున్నారు తెలియనంతగా, మరి ఈ ప్రీతి ఎట్లా ఏర్పడింది? అంటే వాడి కళ్యాణ గుణాలవల్ల ఏర్పడింది. ప్రీతి పైన నిండి ఉంది, వారిరువురి మద్య కలిసి వీడనంత స్నేహం, అది ప్రీతిలో అంతటా కల్సి ఉంది. జీవుడూ పరమాత్మ కల్సి ఉన్నారు సుమా అని గుర్తించాలే తప్ప విడదీసి చూడలేం. ఉపనిషత్తులు చెప్పిన ఈ సారాన్నే మనం పరమాన్నం లేక పాయసంలో చూడొచ్చు.ఆండాళ్ ఇదే పాయసాన్ని కోరుతుంది. *"పాల్ శోఱు"* పాలు కల్సిన అన్నం *"మూడనెయ్ పెయ్దు"* అందులో నెయ్యి పూర్తిగా తేలుతూ ఉండాలి, దాంట్లో తీపి పాలల్లో, నెయ్యిలో, భియ్యపు కణాల్లో కల్సి ఉండాలి. వేదాంత స్థితిలో చేరే మోక్షానుభవం ఇదే.


ఏమిటీ పరమాన్నం ? ఈ బియ్యపు కణాలే జీవుడు, దానికి ఉండే పొట్టే శరీరం. ఇది భగవంతుడు జీవుల్ని పండించాలి అని ప్రకృతి అనే క్షేత్రంలో నాటితే మనకీ శరీరం లభించింది. దాన్యానికి పైన ఎరుపు రంగులో ఉండే పొర మన అనురాగానికి గుర్తు. దాన్యాన్ని దంపి పైన ఉండే పొట్టుని తీసివేసినట్లే ఈ జీవుడు శరీరంతో సాగించే యాత్రలో సుఖాలు దుఃఖాలు, కామాలు, క్రోదాలు, లాభాలు, అలాభాలు, జయాలు, అపజయాలు, ఐశ్వర్యాలు, అనైశ్వర్యాలు, జ్ఞానం, అజ్ఞానం ఇవన్నీ దంపి మనల్ని పొట్టు వీడేట్టు చేస్తాయి. ఇక అక్కడి నుండి వీడి యాత్ర సాగుతుంది. ఇక ధాన్యాన్ని కడిగి వేయించి ఉడికించినట్లే, జీవుడు ఆచరించిన శరణాగతి ఫలితంగా ముక్తి ఇలా లభిస్తుందని ఉపనిషత్తులు తెలుపుతాయి.

*"శ్రీషం ప్రపద్య ఆత్మవాన్ ప్రారభ్దం పరి బుజ్య*
*కర్మ శకలం ప్రక్షీణ కర్మాంతరః జ్ఞాసా దేవ*
*నిరంకుశేష్వర దయా నిర్లూణవ మాయాన్వయః హార్థా*
*అనుగ్రహ లబ్దం మధ్య దమని ద్వా రాత్ బహిర్ నిర్గతః ముక్తః"*

ఉపనిషత్తులు జీవుడు ఎలా సాగునోనని చెబుతూ, మనకు లభించిన కర్మ అనుభవంచేత తనయందు ఫల కర్తుత్వాన్ని త్యాగం చేస్తూ వాటి యందు పట్టు లేకుండా సాగించే జీవన యాత్రలో కర్మలు అన్నీ తొలగినట్లయితే ఈ హృదయంలో పరమాత్మ చూపిన మార్గంలోంచి బ్రహ్మరద్రం గుండా బయటికి ముక్తుడగును.

ఇలా పన్నెండు మార్గాలు అర్చి దిన పూర్వపక్ష శడు దర్మాస అబ్దవాత్ అంశుమత్ తో విద్యుత్ ఇంద్ర ధాత్రు ఇలా పన్నెండు లోకాలను దాటుతూ విరజాస్నాతుడవుతాడు. విరజలో జీవుడిని కడుగుతాడు. జీవుడిపై ఉండే సూక్ష్మ శరీరం తొలగి, దాన్యం పై ఉండే పొరను తీసినట్లుగానే. రజస్ సంపర్కం పూర్తిగా తొలగేట్టు చేస్తాడు పరమాత్మ. అప్పుడు జీవుడు పరమపదం చేరగల్గుతాడు. పరమాత్మ రూపు పొందగల్గుతాడు. సారూప్యం ఏర్పడుతుంది. అక్కడున్న ముక్త జీవులు వీణ్ణి పరమాత్మ వద్దకు తీసుకు పోతారు. సాన్నిప్యం ఏర్పడుతుంది. అక్కడ పరమాత్మ-అమ్మ ఒడిలో వివిద రకాల సేవలు అందిస్తూ, అనందం పొందుతాడు. సాలోక్యం ఏర్పడుతుంది. ఇలా చివరి స్థితి సాయిజ్యం ఏర్పడుతుంది. యుక్ అంటే కల్సి ఉండేది. జీ
వుడికి జ్ఞానం, పరమాత్మకు కళ్యాణ గుణలు, వీటిలో ఇరువురూ కల్సి ఉండడమే సాయుజ్యం, దీన్నే మోక్షం అంటారు.

మొదట బియ్యాన్ని నేతిలో వేయించినట్లే అక్కడ స్నేహంతో వేయిస్తారు. భగవంతుడి కళ్యాణగుణాలు పాలవంటివి, స్వచ్చమైనవి. పాలు పశువుల నుండి వస్తాయి, మనం ఉపనిషత్తులని పశువులని అనుకోవచ్చు. ఈ కళ్యాణ గుణాలనే పాలలో జీవుడు ఉడకాలి. భగవంతుని సేవచేయాలనే రుచి వీడికుండాలి, తన కళ్యాణగుణాలను ఇవ్వాలని రుచి ఆయనకుండాలి. ఈ రుచి అనేది అంతటా కల్సి ఉండాలి, తియ్యదనం వలె. ఇందులో జీవుడూ భగవంతుడూ కల్సి ఉన్నారా లేదా అన్నట్లుగా కల్సి ఉంటారు. పరమపదాన్ని పోలిన ఈ పాయసమే పరమాన్నం. పరమాన్నం దీనికి ప్రతీక. ఆండాళ్ దీన్నే కోరుతుంది.

పరమాత్మ కున్న పేరు నారాయణ, అది ఒక పెద్ద సాగరం లాంటిది, అందులోంచి తేలిన ఒక నామమే గోవింద నామం. భగవంతుడు అవతరించి సంపాదించుకున్న నామం *“గోవింద”* నామం. అందుకే మన వాళ్ళు ఏదైన పని చేసే ముందు శ్రీ గోవింద గోవింద గోవింద అంటూ సంకల్పం చేసుకొని కార్యంలోకి ఉజ్యమిస్తారు. ఈ నామం కృష్ణావతారానికి ప్రత్యేకం. ఏడు రోజులు గోవర్దన పర్వతాన్ని ఎత్తి పట్టి గో గోప గోపీ జన సంరక్షణ చేసి, ఇంద్రుడిచే గోవింద పట్టాభిషేకం చేయించుకున్నాడు. కష్టపడి సంపాదించిన నామం అవడంచే ఆ నామంతో పిలవడం ఆయనకు చాలా ఇష్టం. అందుకె ఈరోజు నుండి వరుసగా మూడు రోజులు గోవిందనామం ఉచ్చరించి అనుగ్రహం పోందుతారు.

*"గోవిందా"* గోగోపగోపీజన సంరక్షకా *"శీర్"* నీకున్న కళ్యాణ గుణాలు ఎట్లా ఉన్నాయంటే, *"కూడారై"*
కూడని వారిని, నీ దరికి రాని వారిని *"వెల్లుమ్"* జయించి నీ దరికి రప్పించుకుంటావు. కూడని వారంటే ఈ లోకంలో మూడు రకాలుగా ఉంటారు. ద్వేషంతో కొందరు, ఏం పట్టక ఉదాసీనులు కొందరు, ప్రేమ అధికమై తాము దరికి చేరితే స్వామికి ఎక్కడ మచ్చ అంటుతుందోఅని కొందరు. కూడని వారిని తన భాణాలతో దరికి లాక్కుంటాడు.ఇక ప్రేమించి దూరం అయ్యేవాళ్ళను తన అనునయంతో దరికి చేర్చుకుంటాడు. నమ్మాళ్వార్ అలానే, స్వామీ నే దరికి రానే రాను, నాలాంటి అల్పుడు నీ వద్దకు వస్తే ఆ కాంతి అనే స్వేత వస్త్రంకు మచ్చ అంటూ దూరం పోతుంటే, స్వామి నమ్మాళ్వార్ ని నిలిపి *"వళవేళ్ ఒలగిన్"* అనే తిరువాయిముళి అనే దివ్యప్రబంధంలో ఇలా అంటాడు స్వామి. నమ్మాళ్వార్ అనగనగా ఒక గోకులం, నేనే శ్రమించి గోవులని కాచా, పాలు పెరుగు వెన్న భాగావచ్చాయి, కానీ నాకందకుండా వాళ్ళంతా దాచుకుంటున్నారయ్యా. తప్పెవరిదయ్యా అంటే నమ్మాళ్వార్ వారిదేనయ్యా అని చెప్పాడు. మరి నేను కష్టపడి సంపాదించింది దాచటం తప్పా కాదా అంటే, తప్పేనయ్యా అని నమ్మాళ్వార్ చెప్పారు. నీవు ఒక కుండ, దానిలో జీవుడి జ్ఞానమే పాలు, పెరిగిన ప్రేమే పెరుగు, మరి ఇదంతా నేను పండించిది కదా మరి నాకు ఇవ్వకుండా తీసుకెళ్తున్నావే తప్పెవరిది అంటే పాపం నమ్మాళ్వార్ స్వామికి లోంగిపోవాల్సొచ్చింది. గొప్పవాడై ఏ యోగ్యతలేని వారి వద్ద అరమరికలు చూపక ఉండే ఆ సౌశీల్యం అనే గుణంతో తను ప్రేమించిన వాళ్ళని దరికి తీసుకుంటాడు. ఇక ఉదాసీనులని తన అందం, ప్రసాదం చూపి దరికి చేర్చుకుంటాడు. ఆలయాల్లో జరిగే తిరువీది ఉత్సవాలు ఉదాసీనులని కటాక్షించటానికే.

ఇంత వరకు నిన్ను ఎడబాసి ఎంత దుఃఖం కలిగించామో కదా, ఇన్నాళ్ళకు నీ సన్నిధి చేరామయ్యా! నీమాట పలకటానికి ఇష్టపడని ఈ లోకం, *"ఉన్ఱనై ప్పాడి"* నీ నామాన్నే పాడేట్టుగా మమ్మల్ని మార్చు కున్నావు. *"పఱైకొండు"* నీ పాట పాడి నీవిస్తానన్న వ్రత పరికరాలు స్వీకరించి *"యామ్ పెరుసమ్మానమ్"* మేం గొప్ప సత్కారం పోందాలని అనుకుంటున్నాం. మేం చేసే వ్రతం మాకు ఏదో లాభం, సత్కారం లభించటానికి కాదు, ఇవన్నీ నీవు ఇప్పించినవి కదా, అది నీకే వైభవం. చేతుకు వేసే కంకణం వ్యక్తికే ఆనందం కానీ చేతుకు కాదు కదా! *"నాడు పుకరం పరిశినాళ్ నన్ఱాక"* లోకం అంతా కీర్థించేలా సత్కారం కావాలి. విభీషనుడికి , సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయటం వల్ల లోకం రాముణ్ణే కదా కీర్థించింది. ఇక ఒక్కో పరికరాలను అడగటం ప్రారంభించారు. గురువుని ఆశ్రయం చేసినప్పుడు మనకు గురువు కొన్ని సంస్కారాలు చేస్తాడు. వాటిని సూచిస్తోందా అన్నట్టుగా గోదా పంచ సంస్కార పక్రియను చెబుతుంది. *"శూడగమే"* చేతికి ఒక కంకణం కావాలి, *"తోళ్ వళైయే"* భుజానికి ధరించే ఆభరణం, *"తోడే"*, చెవికి ధరించే ఒక ఆభరణం, *"శెవి పువ్వే"* చెవి పైకి పరిమలం కోసం ధరించే మరొక ఆభరణం, *"పాడగమే"* పాదాలకు ధరించే ఒక ఆభరణం. ఇవన్నీ కోరుతుంది గోదా. ఆచార్య ఆశ్రయణం చేసినప్పుడు చేతికో కంకణం, భుజానికి శంఖ చక్రాలు, చెవికి అష్టాక్షరీ మహా మంత్రం, పరిమలాన్నిచ్చే ద్వయ మంత్రం, పాదాలా అన్నట్టుగ చరమ శ్లోకం అందిస్తారు మన ఆచార్యులు. *"యెన్ఱనైయ పల్కలనుమ్ యామణివోమ్"* మాకు తెలియని ఆభరణాలు ఎన్నెన్నో, అవన్నీ ఇవ్వు. *"ఆడైయడుప్పోం"* నూతన వస్త్రాలు కావాలి. జీవుడు భగవంతుణ్ణి చేరాటానికి లభించిన వస్త్రం శరీరం, ఇది పాంచబౌతిక శరీరం, పరమపదానికి వెళ్ళే ముందు, విరజానదిలో సూక్ష్మ శరీరం తొలగి పంచ ఉపషణ్మయ దివ్య విగ్రహం లభిస్తుంది. *"అతన్ పిన్నే"* అలా వేరే శరీరం లభించాక ఇక మాకు కావల్సింది *"పాల్ శోఱు మూడనెయ్ పె
సంక్రాంతి అంటే మనకు సంబరాల పండగ. చిన్నా పెద్దా.. ఏకమై చేసుకునే ఈ పండగలో మెుదటి రోజు భోగి. ఇంతకీ భోగి అంటే ఏంటీ? అసలు భోగి మంటలు ఎందుకేస్తారు? దాని వెనక ఉన్న అర్థం, పరమార్థమేంటి?

మన ప్రతి సంప్రదాయం వెనక అర్థాలు.. అంతరర్థాలు ఉంటాయనేది నిజం. వాటి విలువలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే.. మంచిది. అవే ఇప్పటి తరాలకు మార్గదర్శకాలు. భోగి అనగానే ఉదయాన్నే లేచి ఆనందంగా భోగి మంటలు వేసుకునే సంప్రదాయం మన కళ్లకు కడుతుంది.
ధనుర్మాసములో వచ్చే భోగికి భోగిపర్వం అని పేరు. భోగి అంటే భోగము కలిగింది అని అర్థం. ఈ పండగకే రైతులకు పంట చేతికి వస్తుంది. వ్యవసాయ పనులు తగ్గి.. చేతికి వచ్చిన పంటను అనుభవానికి తెచ్చుకొని భోగభాగ్యాలు అనుభవించే పండుగే ఇది. అయితే భోగము అనే మాటకు అర్థం అనుభవం. ఆనందంగా దేనిని అనుభవిస్తామో.. దేనిని అనుభవించడం వల్ల ఆనందం పొందుతామో అదే భోగము.

ఓహో భోగి మంటలు ఇందుకోసమేనా..!

జనవరి నెల.. అసలే చలి. వెచ్చదనం కోసమే భోగి మంటలని ఇప్పటి తరంలోని కొంతమంది అభిప్రాయం. అందులోనూ మన ఆరోగ్యం దాగుంది. ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు ఆవు పేడతో గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటల్లో వాడతారు. దేశీయ ఆవు పేడ పిడకలను కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మెుదలైన ఔషధ చెట్ల బెరళ్లు వేస్తారు. అవి కాలేందుకు ఆవు నెయ్యిని జోడిస్తారు. ఈ ఔషధ మూలికలు కాల్చడం వలన విడుదలయ్యే గాలి చాలా మంచిది. మన శరీరంలోని నాడుల్లోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుందట. అలా భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయం వల్ల వచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇంట్లో ఉండే పాత వస్తువులు మంటల్లో వేస్తాం. వాటిల్లో ఉండే చెదలు లాంటి పురుగులతో మనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ సంప్రదాయం.
మరీ ఇప్పుడు మనమేం చేస్తున్నాం
సాంకేతిక పెరిగింది. మన ఆలోచన విధానం మారింది. ఇప్పడంతా రబ్బర్ టైర్లు, ప్లాస్టిక్ కుర్చీలు... పెట్రోల్ పోసి తగలబెట్టి.. ఆ విషాన్నే మనం పీలుస్తున్నాం. కొత్త రోగాలను ఆహ్వానిస్తున్నాం. భోగి మంటల్లో పనికి రాని వస్తువులు కాల్చడమంటే.. ఇంట్లో ఉండే కవర్లు, వైర్లే కాదు. భోగి మంటల్లో వేయాల్సింది మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలు... అప్పుడే అన్ని రకాల సౌభాగ్యాలు.
తిరుప్పావై 28 వ రోజు

శ్రీకృష్ణుడే సిద్దోపాయం

ఆండాళ్ తిరువడిగలే శరణం

పాశురము

కఱవైగళ్ పిన్ శెన్ఱు కానమ్ శేర్-నుంద్-ణ్బోమ్
అఱివొన్ఱు మిల్లాద వాయ్-క్కులత్తు, ఉన్ఱన్నై
ప్పిఱవి పిఱన్దనై పుణ్ణియమ్ యాముడయోమ్
కుఱైవొన్ఱుమిల్లాద గోవిందా, ఉందన్నో
డుఱవేల్ నమక్కు ఇంగొరిక్క వొరియాదు
అఱియాద పిళ్ళైగళోమ్ అంబినాల్, ఉన్ఱన్నై
చ్చిఱు పేర్-అళైత్తనవుం శీఱి యరుళాదే
ఇఱైవా! నీ తారాయ్ పఱై ఏలోర్-ఎంబావాయ్

ఇన్నిరోజులు స్వామిని రకరకాల పేర్లతో పిలిచినా, నిన్న స్వామి కష్టపడి సంపాదించిన నామం "గోవిందా" అని పిలవడంచే స్వామికి సంతోషం వేసింది. వీళ్ళకు నిజంగా ప్రేమ ఉందా లేదా అని పరిశీలించి గాని అనుగ్రహించడు. భగవంతుని చేరే ఉపాయాలు కర్మ, భక్తి, జ్ఞానం ఇవన్నీ మనం సంపాదించాలి. చివరికి భగవంతుడు అనుగ్రహిస్తే తప్ప అవి మనకు లభించవు. పరమాత్మను ఏం తయారు చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఆయనను సిద్దోపాయం అని అంటారు. ఇలా ఉపాయాలు రెండు రకాలు, ఒకటి మనం సాదించాల్సిన కర్మ, జ్ఞానాదులు ఇక రెండోది సిద్దమైన ఉన్న పరమాత్మ. అందుకే మనవాల్లుళ్ళు కర్మ జ్ఞానాదులపై ఆధారపడిన వాళ్ళం కాదు, నిన్నే ఉపాయంగా కోరుతున్నాం "హే గోవిందా" నిన్నే నమ్మి వచ్చాం అని చెప్పారు. అయితే సిద్దోపాయం కోరిన వారు కూడా ఆరు విషయాలు ఆవిష్కరించాల్సి ఉంటుంది.

అవి ఏమిటంటే

1. తమంతట తాము ఈ ఫలితాన్ని పొందడానికి ఆర్జించినది ఏమి లేదు అని స్పష్టం చెయ్యాలి.

2. తమలో ఆ ఫలితాన్ని పొందే యోగ్యతలేమి లేవు కనుక తమ వద్ద లోపం ఉన్నదని స్పష్టం చేయాలి.

3. ఇక మనల్ని అనుగ్రహించటానికి భగవంతునిలో సమస్త కళ్యాణ గుణ పూర్తి ఉందని అంగీకరించాలి.

4. ఆయనకీ మనకు విడదీయరాని సంబంధం ఉందని వేదం చెబుతుంది, ఈ విషయం మనకు తెలుసును అని చెప్పాలి.

5. మన దోషాలని క్షమించమని ప్రార్థించాలి.

6. వెంటనే వాడి సేవ అనే అనుగ్రహం పొందడానికి మనలోని ఆర్తిని చూపించగలగాలి.

ఈ ఆరూ లేకుంటే వాడిని చేరే యోగ్యత లేనట్లే!!

ఏదైనా మనం ఒక వైద్యుడి వద్దకు వెళ్ళినప్పుడు మనం ఏం చేసి ఈ రోగం తెచ్చుకున్నాం, దాన్ని తగ్గించుకొనే శక్తి మనలో లేదు, దాన్ని తగ్గించగల యోగ్యుడవు నివ్వు అని చెప్పాలి, నిన్ను నమ్ముకుని వచ్చాను అని అయనతో సంబంధం గురించి చెప్పాలి, జబ్బురకుండా మళ్ళీ ఆ తప్పులు చెయ్యనని చెప్పాలి, త్వరగా తగ్గించండి అంటూ త్వరను తెలుపాలి. అప్పుడు గాని ఆ వైద్యుడు మందు ఇవ్వడు. అదే మన స్వంత ప్రవృత్తి చూపితే అదేదో నివ్వే చూసుకో అని వదిలేస్తాడు. లోకంలో వ్యాదిని నయం చేయటానికి ఎన్నో మందులు ఉండవచ్చు, వైద్యుడు వేరే మందు వేరే. అయితే ఈ సంసారం అనే వ్యాది నివారించాలి అంటే వైద్యుడూ, మందూ అన్నీ శ్రీకృష్ణుడే. అందుకే మనవాళ్ళు శ్రీకృష్ణుడిని "వైద్యో వైద్యః" చక్కటి వైద్యుడు సుమా!! అని చెబుతారు.

అయితే మనవాళ్ళంతా నీవే మాకు మందువు అని వచ్చారు, అయితే ఇంకా వీళ్ళల్లో కర్తుత్వ భావనలు ఏమైనా ఉన్నాయా అని పరిక్షిస్తాడు. అవి ఏం లేవని తెలిస్తే వెంటనే అనుగ్రహిస్తాడు. ఈ రోజు మనవాళ్ళు మాకు కర్మ, జ్ఞానం, భక్తి ఇవన్నీ ఏమి లేవు అని చెబుతున్నారు, దీన్నే ఉపాయ నిష్కర్ష అని అంటారు. సాధనా స్వరూపాన్ని స్పష్టం చేస్తున్నారు.

మొదట మేం అంటూ ఆర్జించుకున్నవి కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి ఇవన్ని ఏమి లేవు. ఇవి లభించాలి అంటే వేదాధ్యయణం చేయాలి, ఒక గురువుని ఆశ్రయించాలి, ఆ గురువు జ్ఞానంచే శీలంచే వృద్దుడై ఉండాలి. అలాంటి గురువు వెంట కదా వెళ్ళితే అవి ప్రాప్తిస్తాయి. మరి మేమో "కఱవైగళ్ పిన్ శెన్ఱు " పాలిచ్చే పశువుల వెంట నడిచే వాళ్ళం. మా గురువులు పశువులయ్యా. అవి కూడా పాలు ఇస్తేనే మేం పోశిస్తాం. లేకుంటే లేదు.

ఇది కర్మ అని కూడా భావించం, కర్మయోగానికి ఏవో కొన్ని నియమాలు ఉంటాయి. "కానమ్ శేర్-నుంద్-ణ్భోమ్" అడవుల వెంట పడి తింటూ తిరిగే వాళ్ళం. ఎలాంటి నియమాలు లేని వాళ్ళం. ఇక మెల్లగా కర్మపై పట్టు తొలగితే కదా జ్ఞానం ఏర్పడేది, ఇక జ్ఞానం లేనప్పుడు భక్తి కలిగే ప్రసక్తే లేదు. మేం "అఱివొన్ఱు మిల్లాద వాయ్-క్కులత్తు" ఎలాంటి జ్ఞానం, భక్తి లేని గొల్ల కులానికి చెందిన వారమయ్యా. మరి స్వామి ఏం లేకుంటే ఎందుకు వచ్చారు అన్నట్టుగా వీళ్ళకేసి చూసాడు.

మరి ఇవన్నీ లేని మేం ఎందుకోసం వచ్చామంటే "ఉన్ఱన్నై ప్పిఱవి పిఱన్దనై పుణ్ణియమ్ యాముడయోమ్" మాకోసం మమ్మల్ని వెతుక్కుంటూ మా మద్య ఉంటూ మేం పండిచనక్కర లేని ఒక పుణ్యం మావద్ద ఉందయా, అది నివ్వు.

"కుఱైవొన్ఱుమిల్లాద గోవిందా" కళ్యాణ గుణ పూర్తి కల వాడివి, ఏలోటు లేని వాడివి. మాలోటు తీర్చగలిగే వాడివి గోవిందా. "ఉందన్నో డుఱవేల్ నమక్కు ఇంగొరిక్క వొరియాదు" నీకూ మాకూ ఒక సంబంధం ఉంది, తెంచుకున్నా తొలగేది కాదు. సూర్యుడికి కాంతికి ఉన్న సంబంధం. ఎవరు వద్దు అనుకున్నా తొలగేది కాదు. "అఱియాద పిళ్ళైగళోమ్ అంబినాల్" ఇన్నాళ్ళు తెలియక రక రకాల పేర్లతో పిలిచాం తెలియక, చిన్న పిల్లలం, పట్టించుకుంటారా. "ఉన్ఱన్నై చ్చిఱు పేర్-అళైత్తనవుం" చిన్న పేర్లు అనుకొని పిలిచాం, పొరపాటు చేసాం, నీవు సంపాదించుకున్న గొప్ప పేరు గోవిందా అది మేం ఇప్పుడు తెలుసుకున్నాం. "శీఱి య
రుళాదే" కోపించక అనుగ్రహించు. "ఇఱైవా! నీ తారాయ్ పఱై" మాకందరికి స్వామివి, మాకు ఏం తెలియదని అనుగ్రహించకుండా ఉండేవు, నీవు నీవాళ్ళను అనుగ్రహిస్తే ఎవరు దూశిస్తారు. అనుగ్రహించు.

ఓం నమో నారాయణాయా
ఓం నమో నారాయణాయా
ఓం నమో నారాయణాయా
*🚩తిరుప్పావై ఇరవై తొమ్మిదవ పాశురం🚩*

🕉🌻🕉🌻🕉🌻🕉🌻🕉🌻🕉

🌹పాశురం🌹

*శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చేవిత్తు ఉన్*
*పొత్తామరై యడియే పోత్తుమ్ పోరుళ్ కేళాయ్;*
*పెత్తమ్మేయ్ త్తుణ్ణు జ్కులత్తిన్ పిఱన్ద నీ,*
*కుత్తేవల్గెళై క్కోళ్వామల్ పోకాదు;*
*ఇతైప్పఱై కోళ్వానన్దుకాణ్ గొవిన్దా:*
*ఎత్తైక్కు మేళేళు పిఱవిక్కుమ్, ఉన్దన్నో*
*డుత్తోమే యావో మునక్కే నామాళ్ శేయ్ వోమ్,*
*మత్తైనజ్కా మఞ్గళ్ మాత్తేలో రెమ్బావాయ్*

*☘భావం☘*

ఓ స్వామీ! శ్రీకృష్ణా! నీ పాదారవింద దాసులమగు మేము మిక్కిలి వేకువనే లేచి, నీ సన్నిధికి వచ్చి, నిన్ను దర్శించి నీ సుందర తిరివడులకు మంగళాశాసనము చేయుటే మాకు పరమావధి, ఎందుకనగా పశువులను మేపి మా జీవిక నడుపుకొను అజ్ఞానులమైన మేము చేసే అంతరంగ సేవలను నీవు స్వీకరించకుండ వుండరాదు. ఏలన నీవు మా గోల్లకులములో జన్మించి మా కులమును , మమ్ములను ధన్యులను చేసినవాడవు , ఓ గోవిందా! పుండరీకాక్షా! మేము నీ వద్దకు 'పఱ' అను వాద్యమును పొందుటకు రాలేదు. అది ఒక నిమిత్తమే! వ్రతమూ నిమిత్తమే! మేము ఏడేడు జన్మముల వరకును మరియు యీ కాలతత్వముండు వరకును నీకు అనవార్యశేషభూతులమై నీతోడ చేరి, నీ దాస్యమును చేయుచచుండువారము కామా? మా యందు , యితరములై ఆపేక్షలేవైన యున్నచో వానిని తొలగించి మమ్ము కృపజూడుము స్వామీ! సదా నీ సేవలను మాకోసగమును అని వ్రత ఫలమును అండాళ్ తల్లి వివరించింది.

*🌴అవతారిక🌴*

భగవత్ప్రాప్తిని పొందగోరేవారందరూ ఆ చరించదగిన యీ ధనుర్మాస వ్రతంలో గోపికలు భక్తీ, ప్రపత్తులే ముఖ్యమని నిరూపించారు. అజ్ఞానులైనను నిశ్చల భక్తి ప్రపత్తులతో భగవంతుని చేరవచ్చనేది నిర్వివాదంగా నిరూపించారు. ఇప్పుడీ పాశురంలో వ్రత ఫలాన్ని చెబుతున్నారు. వ్రతాన్ని ఒక నిమిత్తంగా చేసుకుని 'పఱ' అనే వాద్యాన్ని పొందాలని తాహతహలాడారు గోపికలు ఇప్పటివరకు . కాని యీ పాశురంలో 'పఱ' నిమిత్తమని నిజానికి శ్రీకృష్ణుని సాన్నిధ్యమూ, అతని నిరంతర సేవకే యీ ప్రయత్నమంతా అని స్పష్టం చేశారు. అండాళ్ తల్లితో కూడిన గోపికలు.

_*🌳(ధర్మవతిరాగము _ అదితాళము)🌳*_

ప... నీ సన్నిధియే కావలె స్వామీ!
నీ సంపెసేనమె మాకు పరమావధి స్వామీ!

అ..ప.. నీ సేవకై వేకువజామున నిలిచి
నీ సుందర తిరువడులకు మంగళమనగ

చ.. పనుల మేపి జీవిక నడిపెడి మా
పశుప కులమునన్ బుట్టిన స్వామీ!
ఈశ ! మా అంతరంగ సేవలను
ఆశల జేయ నిరాకరింపకుమ!
నీ సన్నిధియే కావలె స్వామీ!

చ.. కాదుసుమా! వాద్యముకై వ్రతము
అదియొక నేపమగు నోచ నీ వ్రతము
బంధము వీడక యేడేడు జన్మల
అందరము కై౦కర్యము చేతుము
విందువో గోవిందా! మనవిని
మా
యందన్య కామనలను పోగొట్టుము.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*🚩తిరుప్పావై ప్రవచనం‎ - 29 వ రోజు*🚩_

🕉🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️

*భగవత్ సేవయే ఫలం - గోదా కళ్యాణం*

*ఆండాళ్ తిరువడిగలే శరణం*

☘☘☘☘☘☘☘☘☘

*🌹పాశురము🌹*

*శిత్తమ్ శిఱుకాలే వంద్ ఉన్నై చ్చేవిత్తు ఉన్*
*పొత్తామరై యడియే పోట్రుం పొరుళ్ కేళాయ్*
*పెత్తం మేయ్ త్తుణ్ణుం కులత్తిల్ పిఱందు, నీ*
*కుత్తేవల్ ఎంగలై క్కోళ్ళామల్ పోగాదు*
*ఇత్తై పఱై కోళ్వాన్ అన్ఱు కాణ్ గోవిందా!*
*ఎత్తెక్కుం ఏరేర్ పిఱవిక్కుం ఉన్ తన్నో*
*డుత్తోమేయావోం ఉనక్కే నాం అట్చెయ్ వోం*
*మత్తై నం కామంగళ్ మాత్త్-ఏలోర్ ఎంబావాయ్*

ఈ రోజు ఆండాళ్ తన వెంట ఉన్న గోపీ జనాలతో తను ఏం కోరి వచ్చిందో నీరూపించిన రోజు. మన వాళ్ళు మేం పరిశుద్దులమై వచ్చాం అని గతంలో రెండు సార్లు చెప్పారు, మేం ఏ ఇతర ఫలితాలు కోరి రాలేదు, ఏ ఉపాయాలు కూడా వాళ్ళ వద్ద లేవని నిన్న చెప్పారు. ఈరోజు స్వామి ముందర తమ ఆర్తిని ఆవిష్కరిస్తున్నారు. మేం రావడం సాధన కాదు, మా ఆర్తిని చూసైనా అనుగ్రహించాలని అనిపించటం లేదా అని అంటున్నారు. *"శిత్తమ్ శిఱుకాలే"* ఇంకా చీకటి తొలగని తెల తెల వారే సమయంలో *"వంద్"* మేం నీ దగ్గరికి వచ్చాం. మాలో ఆర్తి పెంచినది నీవే కదా, ఎంత కాలం నీవు చేసిన ఫలితమో ఇన్నాళ్ళకు మాకు ఈ జ్ఞానం కల్గింది. ఇది నీవు చేసిన కృషేకదా. *"ఉన్నై చ్చేవిత్తు"* అన్ని నీవు చేసినవాడివి, శభరి లాంటి వారికి నీవే వెళ్ళి అనుగ్రహించావు. కానీ మేం చేయాల్సి వస్తుంది. మేం నిన్ను సేవిస్తున్నాం. మనకున్న జ్ఞానంతో ఒక్క సారి మేం నీవాడమని చెప్పగల్గుతే, ఇది రాగ ప్రయుక్తం. *"ఉన్ పొత్తామరై యడియే పోట్రుం"* నీ పద్మాలవంటి ఆ దివ్యమైన పాదాలకు మంగళం పాడుతున్నాం.

*"ఎం కించిత్ పురుషాదమం కటిపయ గ్రాణేశం అల్పార్దకం సేవాయ"* ఈ లోకంలో అల్పమైన పురుషార్దం కోసం వాడి కున్న కొంత ఆస్తి చూసి వాడే నాయకుడని చుట్టూ వీల్ల వాల్ల చుట్టూ తిరుగుతారే జనం ఎంత ఆశ్చర్యం కదా. *"నాదేన పురుషోత్తమే త్రిజగతామే ఏకాధిపే చేతసా సేవ్యె సస్య పదస్య దాసరీ సురే నారాయణే తిష్టతి"* సమస్త జీవులకు ఆయన నాథుడై ఉన్న ఆ పురుషోత్తముడు ఆయన కదా, ఆయన ముల్లోకాలను నడిపేవాడ
ు, చేతులు కట్టుకున్నా సరే ఒక్క సారి మనస్సులో నీవాడనని తెలిపినా ఆయన పరమ పదాన్ని ఇస్తాడు అని కులశేఖర ఆళ్వార్ చెప్పినట్లుగా, మేం నీ పాదాలను పాడటనికి వచ్చాం అని చెప్పారు.

ఆయన ఎం విననట్టుగా సుదీర్గమైన ఆలోచనలో పడి ప్రేమతో వీళ్ళకేసి చూస్తున్నాడు. *"పొరుళ్ కేళాయ్"* మేం ఎందుకు స్తుతిస్తున్నామో వినవయ్యా అంటూ ఆయనను తట్టి పాటం చెబుతోంది గోదా. ఆండాళ్ తల్లికి పాటం చెప్పడం అలవాటు కదా. ఆయనకీ పాటం చెప్పగలదు. *"పెత్తం మేయ్ త్తుణ్ణుం కులత్తిల్ పిఱందు"* మొదట పశువులని మేపి అవి తిన్నాకగాని మేం తినేవాళ్ళం కాదు. నీకు మా స్వరూపం తెలియదా. మరి నీవేమి చేస్తున్నావు! మాకు ఆహారం నీసేవయే, అది మాకు లభించాకే, ఆ తర్వాతే కదా నీవు ఆహారం తినాలి, *"నీ కుత్తేవల్ ఎంగలై క్కోళ్ళామల్ పోగాదు"* నీ ఆంతరంగిక సేవకై మమ్మల్ని స్వీకరించవలసిందే. ఎదో వ్రత పరికరాలు అని అన్నారు ఇదిగో అని అక్కడ పెట్టాడు. *"ఇత్తై పఱై కోళ్వాన్ అన్ఱు కాణ్ గోవిందా!"* మేం ఎదో అడగాలని వాటిని అడిగాం, మేం కోరేవి ఇవికాదు. కేవలం మాట పట్టుకొని చూస్తావా, మా మనస్సులో ఎం ఉందో తెలియదా అని అడిగారు. నాకేం తెలియదు, నేను మీ గొల్లల్లో ఒకడినే కదా అని అన్నాడు శ్రీకృష్ణుడు.

*"ఎత్తెక్కుం"* ఎల్లప్పటికీ, ఈ కాలం ఆ కాలం అని కాదు, సర్వ దేశముల యందు, సర్వ అవస్తల యందు, *"ఏరేర్ పిఱవిక్కుం "* ఏడేడు జన్మలలో కూడా *"ఉన్ తన్నో డుత్తోమేయావోం"* నీతో సంబంధమే కావాలి. కాలాధీనం కాని పరమపదం లో ఉన్నామాకు నీ సంబంధమే ఉండాలి *"ఉనక్కే నాం అట్చెయ్ వోం మత్తై నం కామంగళ్ మాత్త్"* కేవలం నీ ఆనందం కోసమే మా సేవ అంకితమై ఉండాలి. తెలియక ఏదైన లోపం ఉంటే నీవే సరి దిద్దాలి, మాపై భారం వెయ్యవద్దు.

ఇలా వ్రతం ఆచరించిన అందరికి ఫలితం లభించింది. శ్రీకృష్ణ సమాగమం లభించింది, దీనికి సహకరించిన వారికి కోరినవి లభించాయి. ఈ రోజు పురుషార్థం పొందిన రోజు. ఈ రోజు స్వామి గోదాదేవిని రప్పించుకొని మానవ కన్యగా ఉన్న ఆమెను తాను విగ్రహరూపంలోనే వివాహమాడాడు. గోదాదేవి కోరిన వైభోగాన్ని పొందిన రోజు కనక *"భోగి"* అంటారు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
📷

మారగళి మాలై-30

*************

ముప్పదవ పాశురం

**********

వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై

తింగళ్ తిరుముగత్తు చ్చేయిళైయార్ శెన్రు ఇరెంజి

అంగు అప్పరై కొండ అత్తై అణిపుదువై

ప్పైంగమలత్తణ్ తెరియల్ పట్టర్ పిరాందై

శంగత్తమిళ్మాలై ముప్పదుం తప్పామే

ఇంగుం ఇప్పరిశు ఉరైపార్ ఈరిరండుమాల్

శెంగణ్ తిరుముగుత్తు చ్చెల్వత్తిరుమాలాల్

ఎంగుం తిరువరుళ్ పెత్తు ఇంబరువర్ ఎంబావై.

తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో

*****************.

శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము

శ్రీ గోదారంగనాథుల అనుగ్రహము అనవరతము

జీవులను ఓడలు తిరుగాడుచున్న క్షీరసాగర స్వామి

మాధవా! కేశవా! పర (ము) ను మాకందించినావు

సూడికొడుత్తాల్ నిను పూమాలలతో సేవించినది

పాడికొడుత్తాల్ గా పావన పాశురములు పాడినది

అఖిలాండకోటి దేవతలు అర్చకస్వాములైనారు

ముక్తపురుషులు తల్లి పల్లకి మోస్తున్నారు

తామరపూసలదండలు దాల్చిన పెరియాళ్వార్

తామరదళ నేత్రునికి మామ కాబోతున్నాడు

లోకకళ్యాణమునకు జరుగు ఆ తిరుపాణిగ్రహణమున

అందుకొనుచున్నాము మనము ఆలోకనమను అనుగ్రహము.

స్వామి పాలసముద్రమును మహలక్ష్మి మాత కొరకు-వీర సముద్రమును రుక్మిణిమాత కొరకు,గొల్లల పెరుగు సముద్రమును గొల్లభామల కొరకు చిలికినాడని చమత్కరిస్తారు పెద్దలు.ఓడలు జీవులైతే అవి నిరంతరము తన జన్మఫలములను అనుభవించుటకు కదులుతుంటే.వాటిని నొప్పించకుండ(సంసార) సాగరమథనముచేస్తూ,రేవునకు దరిచేచు దయామయా నీకు కళ్యాణమగుగాక.

ముప్పది పాశురముల "తిరుప్పావై "ద్రవిడ ప్రబంధము "శంగత్ తమిళ మాల" గా శ్లాఘింపబడుచున్నది.అంతే ఏమిటి? పూర్వము గ్రంధరచనానంతరము.వాని సామర్థ్యముంప్రాభవమును నిర్ణయించి-ధృవీకరించే శిలాఫలకములుండెడివట.గ్రంధమును ఫలకము మీదనుంచగనే అర్హతలేనిదైన దాని లిపి మాయమైపోయెడిదట.సమ్రథవంతమైనదైచో స్వప్రకాశముతో తేజరిల్లుచుండెడిదట.అటువంటి స్వప్రకాశ సంస్కారము గలది అని కీర్తించుతయే రమణీవిరచితమైన రామణీయ రసగుళిక (పాత్రధారిగా) అని అమ్మతరఫున ఆడపెళ్ళివారు అనగానే,

అమ్మను పెండ్లాడు "అయ్య ఎంతటి ఘనుడో" మగ పెళ్ళివారు ఈ విధముగా చెబుతున్నారు.మా స్వామి కదిలే ఓదలున్న సముద్రమును చిలికి అమృతమును సాధించి,అందరికి అందించినవాడు అని స్వామి వైభవమును "వంగక్కడల్ కడైంద మాదవనై-కేశవనై" అంటున్నారు.మా అనగా తల్లి గోదమ్మకు-ధవుడు పతియైన మా రంగనాథుడు కదులుచున్న ఓడలు గల సముద్రమును,మంథరము తానై,వాసుకితానై,దేవదానవ స్వరూపములు తానై చెరొక పక్క న పట్టుకొని,అమృతమును సాధించి,అందరికి,చివరికి ఓడలలో నున్న వారికి కూడ పంచిన పరంధాముడు అని వర్ణిస్తున్నారు.

వేడుకగా మీ అమ్మాయి గోపికగా తన కర్తవ్యమును స్వయముగా ఆచరించి,తారకమును అందిస్తే,మా అబ్బాయి స్వయముగా గొల్లవానిగా సంచరించినాడని, సూత్రధారి అని ఇరువర్గములు రంగమంటపమున కళ్యాణోత్సవమును కన్నులపండుగ గా మనకందించుటకు కదులు చున్నారు.రండి.మనము కూడ దర్శించి తరించుదాము.

ఓం నమో నారాయణాయ

******************-

అనుగ్రహముగ నామది శ్రీరంగముగా మారినది

నిత్యకళ్యాణమైన గోదా కళ్యాణము చూడాలని కోరుతోంది.

శ్రీవిల్లిపుత్తూరుకు విచ్చేసి శ్రీవిష్ణుచిత్తీయుని అర్థించిన వారైన

అఖిలాండకోటి దేవతలు ఆ అర్చకస్వాములలో

ముముక్షువులు గోపికలకు ముక్తిని ప్రసాదించినదైన

ముద్దుగుమ్మ కూర్చున్న ఆ ముక్తపురుషులు ముత్యాలైన పల్లకిలో

పూలమాలలతో స్వామికి పూలంగిసేవలందిచినదైన

పూబోడికై స్వామి ఎదురుచూచు ఆ శ్రీరంగ పట్టణములో

అఖిలాండ బ్రహ్మాండనాయకుని అంగరంగ వైభవమైన

అమ్మతో జరుగుచున్న ఆ తిరు పాణి గ్రహణములో

వారి చెంతనున్న వారమమ్మ తరియించగ మనము

వైభవోపేతమమ్మ వారిరువురి అనుగ్రహము.

పరమ భాగవతోత్తముడైన శ్రీవిష్ణుచిత్తుని వలన భగవతత్త్వమును అవగతమొనరించుకొను చున్న మన ఆండాళ్ తల్లి,గోపికలు కాత్యాయినీ వ్రతమును ఆచరించి,స్వామి సాయుద్యమును పొందినారని తెలుసుకొని,తానును గోపికగా మారి(మనో వాక్కాయ కర్మలలో) చెలులతో ముప్పదిరోజులు,పామాలతో (పాశురములతో) పూమాలలతో మార్గళి వ్రతమును ఆచరించి మనకు మార్గదర్శకురాలైనది.ఏమీ తెలియని నాచే ముప్పది పారిజాత మాలలను స్వామికి సమర్పింప చేసినది.నా పూర్వ భాగ్యమేమో తెలియదు కాని నన్ను తన కళ్యాణోత్సవమునకు తీసుకుని వెళుచున్నది.ఒక్క నిమిషము.ఎవరో మహాత్ములు వచ్చారు.ఎందుకో? ఏమిటో నన్ను తెలుసుకోనివ్వండి.మీకు చెబుతాను ఆ విశేషాలన్నీ.

గోదా రంగనాథుల కళ్యాణార్థము తమ అదృష్టముగా భావిస్తూ,అఖిలాండకోటి దేవతలు అర్చక స్వాములై అయ్యవారి తరఫున ఆండాల్ తల్లిని వధువుగా అర్థించుటకు కానుకలను-పల్లకిని తీసుకుని వచ్చారు.అబ్బ!మౌక్తికాలంకృతమైన పల్లకి ఎంత బాగుందో.అసలెక్కడివి ఈ ముత్యములు సత్వగుణశోభితములై సత్చిత్ ప్రకాశముతో నున్నవి.తల్లిచెప్పిన ముక్త పురుషులు వీరే కాబోలు.ఎర్రటికెంపులు అమ్మ బుగ్గల ఎర్రదనపు కాంతి సోకిన ముత్యాలేమో.తెలుపు కాదు.ఎరుపు కాదు.నీలముగా తోచుచున్నవి.ఆ నీలమేఘ శ్యాముని కడకంటి చూపులను తోడ్కొని వచ్చినవేమో అందుకే ముత్యములు నీలాలై నాతో మేలమాడుతున్నవి.కాసేపు పచ్చలుగా,మరి కాసేపు గోమేధికములుగా,వజ్ర వైఢూర్యములుగా.ఎంతైన స్వామిదగ్గరకు అమ్మను
తీసుకువెళుతున్నామనే భావోద్వేగము బహురూపులు సంతరించుకుంటున్నదేమో.

విష్ణుచిత్తులవారు అతిథులను సత్కరించారు.పాండ్యరాజు ఆడపెళ్లివారి బాధ్యతను అన్నయై ఆనందంగా స్వీకరించారు.ఇదేమి చిత్రమో నా మనసు శ్రీరంగములో అమ్మకై ఎదురుచూచు చున్న రంగనాథుని పక్కకు చేరింది.ఆడపెళ్ళివారు-మగ పెళ్ళివారు రెండూ తానై ఆనంద డోలికలూగుతోంది.

ఆ ఆనందోత్స వాన్ని ,తిరు (పవిత్రమైన) కళ్యాణాన్ని కనులారా దర్శించి,తిరుగులేని వారిరువురి దయను పొందుదాం.నాతో బాటు మీరు రండి.

శ్రీ రంగే గరుడాచలే ఖగ గిరౌ సిం హాచలే మందిరే

వైకుంఠే కనకాచలేచ నిషధే నారాయణాఖ్యాచలే

లోకాలోక మహాచలేచ నిషదే పుణ్యాచలేష్టా శ్రియ:

పాయాత్ ఓ భగవాన్ పురాణ పురుష: కుర్యాత్ సదా మంగళం".

భగవత్ బంధువులారా! మీరు

*******************

కుప్పల తప్పులు అనినా ! కుప్పిగంతులే అనినా

చొప్పదంటు పలుకులనినా నప్పిన్నాయ్ కరుణతో

ఫలశృతి

ముద్దుమోము చూడమంటు అద్దము చూపిస్తాడు

విసనకర్రను ఇస్తాడు ఆ ముసిముసి నవ్వులవాడు

మనతో జలకములాడుతాడు జలజనాభుడు చూడు

పఱ ను అందిస్తాడు ఏ అరమరికలు లేనివాడు

ఆడతాడు-పాడుతాడు వీడలేను అంటాడు

సరసను కూర్చుంటాడు పరమాన్నము తింటాడు

యమునకు రమ్మంటాడు మనసును ఇమ్మంటాడు

పట్టు విడుపు లేనివాడు మనలను పట్టుకునే ఉంటాడు

మాయను తెలిసిన వాడు సాయము చేస్తుంటాడు

చెంతనే ఉంటాడు చింతలు తీర్చేస్తాడు

కొండను ఎత్తిన వాడు మన గుండెలోన ఉంటాడు

నెమలి ఈక నిస్తాడు నెనరులు చూపిస్తాడు

దాసోహమనగానే తను దాసుడిలా మారతాడు.

అమ్మ చేయి విడువకుంటే అన్నీ తానే అవుతాడు.

కాయేన వాచా మనసే ఇంద్రియైర్వా

బుద్ధి ఆత్మమానా వా ప్రకృతే స్వభావాత్

కరోమి యద్ యత్ సకలం పరస్మై

నారాయణా! ఇతి సమర్పయామి.

మనో వాక్కాయ కర్మలతో చేసిన సకలము నారాయణుని పాద పద్మములను చేరుగాక.

( ఓం తత్ సత్)

జై శ్రీమన్నారాయణ తవ చరణమేశరణము.
⚜⚜⚜⚜⚜⚜⚜⚜
సామజవరగమన అంటే ఒక త్యాగరాజకీర్తన అని, అలవైకుంఠపురంలో అనేది తెలంగాణ కవి పోతన రచించిన భాగవత పద్య పదం అని పిల్లలకి దయచేసి తెలియచేయండి.

ఒకప్పుడు ఒకలా,ఇంకొకప్పుడు ఇంకోలా, ఇప్పుడు ఇంకా దరిద్రంగా ఆ కీర్తనని వాడేసుకుని దాని పవిత్రతను పాడుచేస్తున్నారు.

మిమ్మల్ని ఎవడైనా ఏదైనా అంటే సర్రుమని ముంచుకొచ్చే కోపావేశాలు, సంస్కృతి - వారసత్వాలని పాడుచేస్తే కనీసం చీమ కుట్టినట్టు కూడా ఉండకపోవడం మన దౌర్భాగ్యం.

అలవైకుంఠ పురములో అంటే అదేదో సినిమా పేరనే ఇప్పటి పిల్లలు అనుకునే అవకాశం కూడా ఉంది. పోతానామాత్యుని శ్రీమద్భాగవతాంతర్గత గజేంద్ర మోక్షము నుంచి అనే విషయాన్ని చెప్పండి.

*గజేంద్ర మోక్షము నుంచి కోన్ని పద్యాలు నేర్పండి.*

⚜ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వడి అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని నాత్మభవు ఈశ్వరునినే శరణంబు వేడెదన్.

⚜అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందార వనాంత రామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము “పాహి పాహి” యనఁ గుయ్యాలించి సంరంభి యై ||

⚜సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై||

⚜అడిగెదనని కడువడి జను
అడిగిన తన మగడు నుడువడని నడయడగన్
వెడవెడ జిడి ముడి తడబడ
నడిగిడు నడుగిడదు జడిమ నడుగిడునెడలన్ ||
⚜⚜⚜⚜⚜⚜⚜⚜