Devotional Telugu
3.46K subscribers
106 photos
23 videos
19 files
62 links
An attempt to bring our Hindu Devotional information
Download Telegram
ఇదేమి ఖర్మ...??....::ఐన్ స్టీన్ :::

భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త 1948-49 లో డా. బి.ఎన్ గుప్తా విదేశాలలో చదివారు . అతను విద్యార్థి గా ఉన్న రోజులలో . ఐన్ స్టీన్ ని కలవడానికి వెళ్ళారు. ఐన్ స్టీన్ కి భారతదేశం అన్నా, భారతీయ సంస్కృతి, సాహిత్యం అన్నా ఎంతో ఇష్టం, గౌరవం. మనదేశం నుండి వెళ్ళిన శాస్త్రవేత్తని చూడగానే ఐన్ స్టీన్ సంస్కృతంలో పలకరించారు.

ఐన్ స్టీన్ మాట్లాడిన భాష మన శాస్త్రవేత్తకు ఏమీ అర్ధం కాక బిక్కమొహం వేసారు. అప్పుడు ఐన్ స్టీన్ నేను సంస్కృత బాషలో చెప్తున్నాను "లోపలకు రండి" అని అన్నారు. "మీకు సంస్కృతం రాదా, పోనిలే లోపలి రండి!" అని మన శాస్త్రవేత్తను లోపలకు తీసుకువెళ్ళి కూర్చోబెట్టేరు.

"హిందూతత్త్వచింతనకు మూలమైన భారతదేశం నుండి మీరు వచ్చేరు. మీదేశంలోని అద్భుతమైన సాహిత్యమంతా సంస్కృతంలో వుంది. అటువంటిది మీకు ఆ భాష తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నా గ్రంధాలయంలో భగవద్గీత మొదలుకొని భారతదేశానికి చెందిన ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలు ఉన్నాయి" అన్నారు ఐన్ స్టీన్.

ఆ గదిలో ఐన్ స్టీన్ వ్యక్తిగత గ్రంధాలయం ఉంది. విశేషం ఏమిటంటే అక్కడ సైన్స్ కు సంబంధించిన పుస్తకాలు కొన్నే ఉన్నాయి. ఎక్కడ చూసినా భగవద్గీత పుస్తకాలే ఉన్నాయి. వివిధ వ్యాఖ్యానాలతో మన భారత శాస్త్రవేత్త తెల్లమొహం పెట్టుకొని వాటినే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఐన్ స్టీన్ మన శాస్త్రవేత్తకు భగవద్గీతను చూపించి, "ఇది తెలుసా మీకు?" అని అడిగారు. దానికి మన శాస్త్రవేత్త "విన్నానండీ" అని సమాదానమిచాడు.

"ఓహ్, విన్నారా .." అంటూ ఐన్ స్టీన్ ఇలా చెప్పారు: “ఈ రోజు ఐన్ స్టీన్ ని ఐన్ స్టీన్ గా నిలబెట్టింది ఈ భగవద్గీతయే గాని ఆ సైన్స్ కాదు. నాలో ఈ విజ్ఞానశాస్త్రం పట్ల నాలో పరిశోధన దృష్టిని, ఈ విశ్లేషణ శక్తిని, విషయ విచారణ చేయగలిగే అంతరిక దృష్టి కోణాన్ని కలిగించినది ఈ భగవద్గీత ఒక్కటే (I have made the Gita as the main source of my inspiration and guidance for the purpose of scientific investigations and formulation of my theories). అందుకే నేను సైన్సుకి చాల గొప్ప విలువనిస్తాను కానీ ఆ సైన్సుకే ఆధారం ఈ భగవద్గీత అని తెలియని ఆ వ్యక్తికి విలువ ఇవ్వను" ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్ స్టీన్ ఏమన్నారంటే!

మనం భారతీయులకు ఎంతో ఋణపడి ఉన్నాం. భారతీయులే ప్రపంచానికి గణితంలో సులభంగా లెక్కించే దశాంశపద్ధతిని కనుగొన్నారు.అదే లేకపోతే ఎన్నో వైజ్ఞానిక పరిశోధనలు సాధింపబడేవి కాదు.అన్నారట.

భగవద్గీతను మార్గదర్శకంగా తీసుకున్న విదేశీయులెందరో అదేం విచిత్రమోగానీ గీత ప్రభవించిన మనదేశంలో మాత్రం అది ఒక మతగ్రంథమే. దాని గొప్ప దనాన్ని గుర్తుపట్టడం లేదు.
🇮🇳🌹💞❣💞🌹🇮🇳
🙏దయచేసి ఈ విలువైన విషయం ప్రతి భారతీయుడికి అందేటట్లుగా ప్రచారం చేయడం మన కర్తవ్యం🙏
శుభాకాంక్షలు

ఆలోచనల రూపమే మనం అంటాడు బుద్ధుడు. మనసులో అమంగళకరమైన ఆలోచనా తరంగాలు ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే, ముఖంలో అవే వికృత భావాలు ప్రస్ఫుటంగా ప్రకటితం అవుతుంటాయి. ముఖం మనసుకు ప్రతీక అంటారు పెద్దలు. ప్రశాంతమైన మోము కలిగినవారి మనసు తేటనీటి కొలను. ఆలోచనలు వికసించిన పువ్వు చుట్టూరా తిరిగే భ్రమరంలా శుభాల చుట్టూ పరిభ్రమిస్తాయి. అశుభం వైపు పోకుండా మనసును సున్నితంగా పట్టి ఉంచుతాయి.
మన సంప్రదాయంలో దీవెనకు విశేష స్థానం ఉంది. అప్పుడే పుట్టిన శిశువు నుంచి వృద్ధాప్య దశ దాకా వివిధ సందర్భాల్లో పెద్దల ఆశీర్వాదాలు పొందుతూనే ఉంటారు. మంగళాశాసనం అంటే మనసా వాచా ఒకరి భావబలం మనల్ని వెన్నంటి ఉండటం. ఆశీర్వాదబలం వెన్నుదన్నుగా ఉంటే విద్యార్థి నుంచి కార్యార్థి    వరకు... అందరికీ అన్నింటా సఫలమే!
పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నప్పుడు ‘అన్నీ తామే, అంతా తామే’ అన్నట్లుగా, కాస్త బెడిసి కొడితే ‘తమ చేతిలో ఏదీ లేదన్నట్లుగా’ మాట్లాడుతుంటారు కొందరు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా శ్రేయోతత్త్వాన్ని విడిచిపెట్టనివారు, విజయకాంక్ష ఉన్నవారు, ఓటమికి వెరవనిది, కుంగిపోనిదీ వారే!
చదవడం అంటే అందరికీ పుస్తకమే గుర్తుకు వస్తుంది. ఒక లక్ష్యం ఏర్పరచుకుని, అనుక్షణం శ్రేయోభిలాషతో- ఎవరు తనతో కలిసివచ్చినా, రాకపోయినా దృఢంగా అడుగులేసుకుంటూ గమ్యం వైపు సాగిపోయేవారు మనకు ఎక్కడో అక్కడ అరుదుగా తారస పడతారు. వారిని శ్రద్ధగా చదివి ఆకళింపు చేసుకుంటే, మన మనసులో ‘పుట్టినందుకు ఏదైనా సాధించాలి’ అనే తపనకు బీజం పడుతుంది. మన నిత్య కృషితో అది, ఏదో నాటికి మహా వృక్షమవుతుంది. మన కీర్తిని అజరామరం చేస్తుంది.
మన ప్రమేయం లేకుండా చెయ్యి కదలదు, కాలు నడవదు. మరి ఆలోచనలు మాత్రం కట్టు తెగిన కోడెల్లా, కట్ట తెగిన వరద నీటిలా ఇచ్ఛారీతిన ప్రవహిస్తే ఎలా? వాటికి కళ్లెం వేయాలి. మన ఆలోచనలు మనకు ఉపయోగపడాలి. చెరుపు చేయకూడదు. శరీరం మీద కాకుండా మనసుపై పెట్టే శ్రద్ధ మేలు చేస్తుంది. మనుషులను రుషులుగా మాధవులుగా చేస్తుంది. హృదయం నవనీతం అయితే, నోటి నుంచి కర్ణపేయంగా వెలువడే మాటలు నలుగురికీ దగ్గరయ్యేలా చేస్తాయి. కీడెంచి మేలెంచమని మన పూర్వులు చెప్పింది, జీవితంలో ఏమరుపాటును వదిలి అప్రమత్తంగా ఉండమని హెచ్చరించడానికి. అంతేకాని- ఆ భావాన్నే అంటి పెట్టుకుని, నిత్యం శంకలతో కాలం గడుపుతూ, జీవితాన్ని వృథా చేసుకొమ్మని కాదు. శ్రేయోదాయక ఆలోచనలు మనసును స్వచ్ఛమైన వేదికగా మారుస్తాయి. దానిపై కొలువుదీరడానికి అంతర్యామి ఉవ్విళ్లూరతాడన్నది సత్యం. ఆధ్యాత్మికంగా ఉత్తమ ఆలోచనలకు ఉన్న గొప్ప శక్తి అది.
ముముక్షువులు భగవదవతారంగా గుర్తింపు పొందడానికి అదే కారణం.
Forwarded from Addanki Padmaja
★01 వ రోజు - భగవంతుని మొదటి స్థానం నారాయణ తత్వం★

ఆండాళ్ తిరువడిగలే శరణం

#పాశురము

మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్
ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్


నారాయణ మంత్ర ఉపదేశంతో వ్రత ప్రారంభం

"మార్గళి త్తింగళ్" మార్గశిర్షం మంచి మాసం, ఫలమును నిచ్చే మాసం. అలాంటి పన్నెండు మాసాలు మనకు ఒక సంవత్సరం అయితే, అది దేవతలకు ఒక రోజు అంటారు. దక్షినాయిణం వారికి రాత్రి అయితే ఉత్తరాయిణం పగలు. సంక్రాంతి రోజు సూర్యుడు దక్షినాయిణం నుండి ఉత్తరాయిణంకు మారుతాడు, అంటే సంక్రాంతికి ఒక నెల ముందుగా వచ్చే మార్గశీర్షం వారికి తెల తెల వారే సమయం. సత్వాన్ని పెంచేకాలం. కాబట్టి ఆచరణ ద్వారా మనం ఈమాసాన్ని వినియోగించుకోవాలి. "మది నిఱైంద నన్నాళాల్" చంద్ర కాంతి మంచిగా ఉండే కాలం, చంద్రుడు పెరిగే కాలం కబట్టి మనం మంచిరోజులుగా భావిస్తాం. "నీరాడ ప్పోదువీర్ పోదుమినో" స్నానం చేయటానికి వెల్దాం! ఎలాంటి స్నానం అది అంటే భగవంతుని కళ్యాణ గుణాలతో మన పాపాలను కడిగివేసుకొనే స్నానం. "నేరిళైయీర్" భగవంతుని గురించి తెలుసుకోవాలనే జ్ఞానం మాత్రం చాలు ఈ వ్రతం చేయటానికి యోగ్యులమే.

"శీర్ మల్గుం ఆయ్ ప్పాడి" పంటలు బాగా పండే ఆ నందగోకులంలోని "చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్" సంపన్నులైన గోప పిల్లల్లా, మనమూ అవ్వాలి శ్రీకృష్ణ ప్రేమ కోసం.


ఏ భయమూ అవసరం లేదు. "కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్" పరమ సాత్వికుడైన నందగోపుని కుమారుడిగా మన వద్దకు వచ్చాడు కదా పరమాత్మ, ఏ అసురుల భారినుండి శ్రీకృష్ణునికి ముప్పు రాకుండా తాను కత్తి ఎల్లప్పుడు పట్టుకొని కాపాడుతూ ఉన్నాడు ఒక ఆచార్యునివలె. మరి నందగోపుడు మనవాడే కదా!

"ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం" మరి ఆయనేమో తన చేష్టలతో యశోదమ్మ కళ్ళు అనందంచే పెద్దగా అయ్యేట్టు చేస్తూ ఆమె ఒడిలో చిన్న సింహంపిల్లలా పెరుగుతున్నాడు. "కార్మేని" నల్లని మేఘంలాంటి దివ్య కాంతులతో అంతం లేని గుణాలు కల్గి, "చ్చెంగణ్ " వాత్సల్యం కల్గినవాడు. "కదిర్మదియం పోల్ ముగత్తాన్" చంద్ర సూర్యుల వంటి ముఖం కల్గి నవాడు. మిత్రులతో ప్రేమగా శత్రువులతో కోపం కల్గినవాడు.

"నారాయణనే నమక్కే పఱైతరువాన్" నారాయణ అనే మత్రం ఉపదేశం చేస్తూ మనకు సర్వస్వం ప్రసన్నం చేస్తుంది గోదా "పారోర్ పుగళప్పడింద్" ఫలం సాక్షాత్తు పరమాత్మే, ఈ లోకంలోని వారందరికీ అందజేస్తుంది అమ్మ గోదా.

నారాయణ మంత్రం

ఈ వ్రతంలో మనం భగవంతున్ని ఎట్లాచూస్తామో వివరిస్తుంది. భగవంతుడు ప్రాదేశికుడై అల్ప ఫలాన్ని ఇచ్చేవాడైతే మనం స్వీకరించం. భగవంతునికి ఎన్నెన్నో రూపాలు ఉంటాయి ఆకాశానికి అంతం లేనట్టుగా, సాగరంలో జలానికి అంతంలేనట్టుగా, మన జన్మలకీ కర్మలకీ అంతం లేనట్టుగా భగవంతుని కళ్యాణ గుణాలకు కూడా అంతం లేదు. కేవలం ఆయనగుణాలకేకాదు ఆయన స్వరూపానికి కూదా అంతం లేదు కాబట్టే ఆయనను సర్వవ్యాపి అంటారు. ఇందుగలడని అందులేడని సందేహము వలదు అని ప్రహ్లాదుడు చెప్పినట్లుగా, అంతటా వ్యాపించి ఉండటం భగవంతుని గొప్పతనం.

ఆ వ్యాపనశీలాన్ని చెప్పే మంత్రాలే గొప్ప మంత్రాలుగా చెప్పబడి ఉన్నాయి. భగవంతుని వ్యాప్తిని చెప్పేవి కేవలం మూడే అవి "విష్ణు", "వాసుదేవ" మరియూ "నారాయణ". విష్ణు అంటే వ్యాపించిన వాడని అర్థం. వాసుదేవ అంటే అంతటా వసిస్తాడు-ప్రకాశిస్తాడు అని అర్థం. ఈ రెందు మంత్రాల్లో కేవలం వ్యాపించి ఉంటాడనే చెబుతాయి కాని ఎలావ్యాపించి ఉంటాడు, ఎందుకు వ్యాపించి ఉంటాడు అనే ప్రశ్నలకు సమాధానం లభించదు కనక ఆ మంత్రాలకు కొంచెం లోపం ఉంది అంటారు. కాని నారాయణ మంత్రం మాత్రం వ్యాప్తిని చెబుతుంది, వ్యాప్తి ఫలాన్ని చెబుతుంది, ఎందుకు వ్యాపించి ఉంటాదని వివరిస్తుంది. ఎందెందులో వ్యాపించి ఉంటాదని తెలియజేస్తుంది, ఆ వ్యాపించి ఉండే వాటితో సంబంధం గురించి తెలియజేస్తుంది.

నారాయణ అంటే ఒక అద్బుతమైన మంత్రం, నారములు అంటే సకల చరాచర వస్తువులు అని అర్థం. అయణం అంటే ఆధారం అని అర్థం. సూర్యుడు మనకు ఉత్తరం నుండి ఆధారమైన కాలాన్ని మనం ఉత్తరాయణం, విడ దీస్తే ఉత్తర-అయణం అంటాం. నారాయణ శబ్దం లోని అయణ అనే పదాని అర్థం ఆధారం. ఈ సకల చరాచర వస్తుజాతానికి ఆధారమైన వాన్ని నారాయణ అంటారు. మరి చరాచర వస్తువులలో ఎట్లావ్యాపించి ఉంటాడు, లోపల-బయట వ్యాపించి ఉంటాదని తెలియజేసేది నారాయణ మంత్రం. ఈ నారాయణ అనే శబ్దాన్ని రెండు సమాసాలు వివరిస్తాయి. ఒకటి తత్పురుష రెండవది బహువ్రిహి సమాసాలు. తత్పురుష అనేది నారములన్నిటికి తాను ఆధారమైన వాడు, ఆధారమై తనలోపల పెట్టుకున్నవాడు అని చెబుతుంది. మరి బహువ్రిహి సమాసం తానీ నారములన్నిటికి తాను లోపల ఉండి రక్షిస్తాడని చెబుతుంది. అర్థాత్ ఆయన లోపన మరియూ బయట వ్యాపించి ఉంటాడని. అయణ అనే శబ్దంచే ఆయన అన్ని గుణములు కల్గి, చేయిచాస్తే చాలు అందేట్టు ఉంటాడు కాబట్టి ఆయనకు సౌలబ్యాది గుణాలు ఉంటాయి. లోపల ఉంటాడు కాబట్టి దగ్గరగా ఉం
దాసో-హం

దాసోహం అన్న పదంలో అహం ఒక భాగం. విడదీయరాని అక్షర సమాహారం. అహం అంటే నేను. నేను నీ దాసుణ్ని అని మనసా, వాచా చెప్పగలగాలి.
‘దాసోహం’ అన్నమాటను ఒక మంత్రంగా స్మరించడం, గుణాత్మకంగా మరిమరి గుర్తు చేసుకోవడం, మనసును ఏకాగ్రం చేసి అక్కడే నిలపడం- చెప్పినంత తేలిక కాదు. శ్రవణం, మననం, ధ్యానం భక్తియోగ సాధనకు కలిసివచ్చే భౌతిక, మానసిక, ఆంతరంగిక ప్రక్రియలు. అవి దాసోహానికి దారిదీపాలు.
ఒకరికి తలవంచి నమస్కరించడం బానిసత్వానికి నిదర్శనం. ఒకరి గొప్పతనాన్ని బేషరతుగా ఒప్పుకొని శరణాగతి కోరడం భక్తి పరాకాష్ఠకు సంకేతం. ప్రతి నిమిషం, ప్రతి విషయంలోనూ బయటపడి అడ్డుకునేది ‘అహం’. ‘నన్ను అడిగావా?’ అని నిలదీయడం, ‘నాకు తెలియదే!’ అంటూ వ్యంగ్యాస్త్రం సంధించడం... అదే అహంకారం!
పూర్ణ దాసత్వం ఆషామాషీ కాదు. నవవిధ భక్తి మార్గాల్లో దాస్యానికి సముచితమైన స్థానం ఉంది. నమ్రతా భావంతో కూడిన వినయ విధేయతల త్రివేణీ సంగమంతో సమానమైనది దాస్య భక్తి. నిజమైన హరిదాసుడు దాసోహం అనడానికి, అలా కావడానికి ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటాడు. తన అస్తిత్వాన్ని పోగొట్టుకుని పరతత్త్వంలో లీనం కావడానికి- పాలలో పంచదారగా మారాలి. దాసుడికి అది ఒకరకమైన జీవన్ముక్త దశ. అహంకారం బండరాయిలా ఎప్పటికప్పుడు అడ్డుతూ, చాపకింద నీరులా తెలియకుండా తడిగట్టి పడగొట్టుతుంది.
హరిదాసు అనగానే... సంక్రాంతి పండుగ రోజుల్లో తలపైన పాత్ర, చేత చిడతలు, భుజాన తంబురా వేసుకుని ‘హరిలో రంగ హరి’ అంటూ చిందులు వేసే ఆసామీ కళ్లకు కడతాడు. హరిదాసు అన్న బిరుదు బ్రహ్మ మానసపుత్రుడైన నారద మహర్షికే చెల్లుతుంది. సదా నారాయణ నామస్మరణలో కాలంగడిపే నారదుడికన్నా మిన్న అయిన విష్ణుభక్తుడు ఎవరైనా ఉన్నారా? రామదాసు అన్న పేరు మన దేశంలో మిక్కిలి జనప్రియమైన నామం. రామదాసు అంటే రామబంటు- హనుమంతుడు. ఈ పేరులో రాముడు తప్ప మనకు హనుమంతుడు కనిపించడు. ఆ పదాన్ని విడదీసి శల్యపరీక్ష చేస్తేగాని అందులో దాగిన దాసుడు- ఆంజనేయుడు బయటికి రాడు. తులసీదాసు- తులసికి దాసుడు శ్రీమహావిష్ణువు. తులసిలో కలిసి ఉన్న ఆ పరమాత్మను స్మరించడానికి, మనోనేత్రంతో దర్శించడానికి ‘కృష్ణ తులసి’ అన్న ప్రయోగం మనకు ప్రయోజనకరంగా కలిసి వస్తుంది. రుక్మిణి ఒక్క తులసిదళంతో కృష్ణ తులాభారంలో నెగ్గింది.
మనల్ని మనం దాసుడిగా గుర్తించడానికి ముందుగా మోహనిద్ర నుంచి మేలుకుని బయటపడాలి. చెలికాడు, శిష్యుడు, బావమరిది అయిన అర్జునుడికి తాను కృష్ణదాసుడినని తెలుసుకోవడానికి, పద్దెనిమిది అధ్యాయాలు, ఏడువందల శ్లోకాలు అవసరమయ్యాయి. చిట్టచివరికిగాని, ‘ఓ అచ్యుతా! నువ్వు చెప్పినట్లే చేస్తాను’ అన్న సమాధానం కిరీటి నోటంట రాలేదు. దాస సంప్రదాయంలో సర్వోత్తమమైన భక్తి నివేదనా గరిమకు ఉదాహరణ దాసకూటం పేరు చెప్పగానే మన తలపులో మెరుపులా కనకదాసు కనిపిస్తాడు. ఆ భక్త శిఖామణి కోసం ఉడుపిలోని బాలకృష్ణుడు తన దిశను మార్చుకుని, కనకదాసు దశను మార్చాడు. క్షణంలో భక్తుడికి మోక్షం ప్రసాదించాడు. పురందరదాసు శ్రీకృష్ణ దేవరాయల రాజధాని హంపీ క్షేత్రంలో తన కీర్తనలు వినిపించి, స్వర సేవకులందరికీ ఆదర్శంగా స్ఫూర్తిమన్మూర్తిగా ఈనాటికీ సంప్రదాయ భక్తి సంగీతపు మెరుపులు కురిపిస్తున్నాడు. బద్ధ జీవులను భక్తి సేవలతో తన అక్కున చేర్చుకోవడానికి భగవంతుడు సర్వదా సిద్ధంగా ఉంటాడు. ఆయన దాసులకు దాసుడు!
జ్ఞానప్రదాత


ఆది శంకరాచార్యులు అద్వైత జ్ఞానాన్ని లోకానికి పంచిపెట్టారు. కేవలం పది శ్లోకాల్లోనే అపారమైన జ్ఞాన సంపదను ఇమిడ్చారు. ఆ పదిశ్లోకాలే దక్షిణామూర్తి స్తోత్రంగా జగత్‌ ప్రసిద్ధమైంది. దక్షిణామూర్తి అంటే సాక్షాత్తు పరమశివుడే. మేధాశక్తి ప్రదాతగా దక్షిణామూర్తిని ధ్యానించడం పరిపాటి.
మనిషి తన జీవితంలో తెలుసుకోవలసిన విషయాలు మూడు. తన సృష్టికి కారణమైన బ్రహ్మ ఎవరు, బ్రహ్మసృష్టిలోని తాను ఎవరు, బ్రహ్మసృష్టిలో కనిపించే ఈ ప్రపంచం ఏమిటి? ఈ మూడు విషయాలు తెలుసుకుంటే అసలైన జ్ఞానం ఏమిటో తెలుస్తుంది. ఈ విషయాలను దక్షిణామూర్తి స్తోత్రం వివరించి చెబుతోంది.
బ్రహ్మ అంటే ఆత్మ. అది ఒక్కటే నిత్యం. సత్యం. కనబడే జగత్తు అంతా మిథ్య. జీవుడు, ఆత్మ వేరుకాదు... ఒక్కటే. ఇదీ అద్వైత సిద్ధాంతం. దీన్ని వివరంగా ఆదిశంకరాచార్యులు ఈ స్తోత్రంలో చెప్పారు. పంచభూతాలతోను, స్థావరజంగమాలతోను కూడి ఉన్న ఈ ప్రపంచం అంతా ఆత్మలోనిదే. వేరుగా లేదు. అద్దంలో ప్రతిబింబం కనబడినట్లే ఈ ప్రపంచం కూడా వేరుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనికి కారణం మనిషిలోని అజ్ఞానం. మనిషి నిద్రలో ఉన్నప్పుడు కలలు కంటాడు. నిద్రనుంచి మేల్కొన్న తరవాత కలలోని ప్రపంచం మాయమైపోతుంది. కలలోని ప్రపంచం సత్యం కాదని తెలుసుకోవడమే జ్ఞానం.
నేలలో ఒక విత్తనాన్ని నాటినప్పుడు అందులో ఒక మహావృక్షం ఉందని తెలియదు. ఆ విత్తనం అంకురించి, పల్లవించి- ఆకులు, పువ్వులు, పిందెలు ఏర్పడి, క్రమంగా కాయలు కాచి, పండ్లు పండినప్పుడు ఆ విత్తనం ఈ విధంగా పరిణమించిందనే సత్యం తెలుస్తుంది. అలాగే ఈ ప్రపంచం, జీవులు విత్తనంలాంటి ఆత్మలోనుంచే పరిణమిస్తున్నాయి.
ఒక కుండను తయారు చేయాలంటే మట్టి, నీళ్లు, చక్రం కావాలి. ఈ మూడూ కలిసి కుండ రూపొందడానికి కారణం అవుతున్నాయి. కుండను చూసినప్పుడు విడిగా మట్టి, నీరు, చక్రం కనబడవు కదా? అలాగే ప్రాణులు, ప్రపంచం వాటివాటి రూపాలను పొందాక, వాటికి మూలమైన ఆత్మ పైకి కనబడదు. వాటిలో తాదాత్మ్యమై ఉంటుంది.
ఆత్మ పైకి కనబడనంత మాత్రాన లేదని అనడం సాధ్యం కాదు. గ్రహణ సమయాల్లో సూర్య, చంద్ర బింబాలను రాహుకేతువులు సంపూర్ణంగా ఆవరిస్తారు. కొంతసేపు సూర్య, చంద్రబింబాలు కంటికి కనిపించకుండాపోతాయి. అంతమాత్రాన సూర్యచంద్రులులేరని అనడం సాధ్యమా? గ్రహణం వీడిన తరవాత బింబాలు కనబడినట్లే అజ్ఞానం అనే గ్రహణం పట్టడం వల్ల జ్ఞానం అనే బింబం కొంతకాలం కనిపించకపోవచ్చు.
ఒకే వ్యక్తి తన జీవితకాలంలో బాల్య, కౌమార, యౌవన, వార్ధక్యావస్థలను పొందుతున్నాడు. అలాగే ఈ జగత్తు ఎన్ని విధాలుగా మార్పు చెందుతున్నా అదంతా అఖండమైన ఆత్మలోనిదే కానీ, వేరుకాదని తెలుసుకోవడమే యథార్థ జ్ఞానం.

ప్రతిప్రాణీ ఆత్మలోనివాడే అయినా కార్యకారణ సంబంధాలవల్ల వివిధ దశలను పొందుతాడు. ఒకడు యజమాని అయితే మరొకడు సేవకుడు అవుతాడు. ఎన్ని పాత్రలు మారినా జీవుడు ఆత్మలో అంతర్భాగమే కదా? ఇదే నిజమైన జ్ఞానం.

ఈ ప్రపంచం అంతా ఒకే ఆత్మ. ఈ సత్యాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలంటే ఆత్మజ్ఞాని అయిన గురువును ఆశ్రయించి, శ్రద్ధాసక్తితో అడిగి తెలుసుకోవాలి. గురువు చెప్పిన విషయాలను నిరంతరం మననం చేయాలి. ఆత్మస్వరూపాన్ని ధ్యానించి, స్థిరం చేసుకోవాలి. పదేపదే ఈ సత్యాన్ని చెబుతూ ఉండాలి. ఇదే నిజమైన జ్ఞానం అని శంకర భగవత్పాదులు ఈ స్తోత్రంలో రమణీయంగా చెప్పారు.
★2 వ రోజు - భగవంతుని రెండో స్థానం వ్యూహం(పాల్కడలి)★

ఆండాళ్ తిరువడిగలే శరణం

వ్రతనియమాలు

#పాశురము

వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్
పైయత్తుయిన్ఱ పరమనడి పాడి
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్

మనిషి బాగుపడటానికి ఎన్నో మార్గాలు, శాస్త్రాలలో ఆవి కర్మయోగమని, జ్ఞానయోగమని, భక్తి యోగమని ఇలా ఎన్నో చెప్పబడి ఉన్నాయి. భగవంతుడే ఒక మార్గమని తీసుకుంటే వారు మర్గశీర్షంలో పయనిస్తున్నారు అని అంటారు. అలాంటి మార్గంలో లక్ష్యం చేరటంలో ఇబ్బందులు ఉండవు. తల్లి అండలో ఉన్న శిశువు మాదిరిగా మనల్ని తరింపచేస్తాడు పరమాత్మ, కాని అలా జరగటానికి మన అంగీకారం కావాలి. మనలోని జ్ఞానం ద్వారా మనం నీవాడను నేను అని ఆయనకు చెప్పాలి. మరి అలాంటి మార్గంలో పయనించటానికి మనం ఎలా ఉండాలో మన ఆండాళ్ తల్లి తెలియజేసింది ఈ ధనుర్మాస వ్రతంలో. ఏమి చేయాలో ఏమి అవసరం లేదో చెబుతోంది ఈ పాటలో.

భగవంతుణ్ణి భగవన్మయుడని, పరమాత్మ అని, గోవింద అని ఇలా ఎన్నో పేర్లతో చెబుతారు. మనకు కనిపించే వివిద రూపాల్లో ఉంటాడు కాబట్టి భగవన్మయుడని అంటారు. "అణు:" అతి చిన్నరూపం నుండి "బృహత్:" అతి పెద్ద స్వరూపంగా ఉంటాడు కాబట్టి పరమాత్మనే అని అంటారు. "శబ్ద సహ" అతి సామన్యుడు పిలిస్తే అందుతాడు, "శబ్దాతిగ" చతుర్ముఖ బ్రహ్మకూడా కీర్తించ చేతకానివాడు, అందుకే ఆయనను గోవింద అని అంటారు. మరి జగత్తు మొత్తం పరమాత్మ శరీరం కదా! మరి ఇక్కడ తగినవి- తగనివి అంటూ ఉంటాయా!!

ప్రకృతి స్వభావాన్ని బట్టి, ఆయా గుణాలను బట్టి సత్వం,రజస్సు మరియూ తమస్సు అనే గుణాలు ఉంటాయని గమనించాలి. సత్వం జ్ఞానాన్ని, రజస్సు కోపాన్ని, తమస్సు అజ్ఞానాన్ని,బద్దకాన్ని ఇస్తాయి. మరి శరీరం ఈ పంచబూతాలతో తయారైనదే కదా, కాబట్టి ప్రకృతిలో ఉండే ఈ గుణాలు మనలో కూడా ఉంటాయి. కాని ఏదో ఒక గుణం పైన ఉండి నడిపిస్తుంది. సత్వం పెరిగితే మంచిది. ఇలా చెప్పటానికి మన చేతిలోని చూపుడు వేలును మనతో పోలుస్తారు, బ్రోటన వేలును పరమాత్మతో పోలుస్తారు. ఇక తమస్సు,రజస్సు, సత్వ గుణాలను మిగతామూడు వెల్లతోపోల్చుతారు. ఈ మూడు గుణాలతో కలిసి ఉన్న చూపుడు వేలుని బ్రోటనవేలి తో కలిపే దాన్ని జ్ఞాన ముద్ర అంటారు. చిటికెన వేలు సత్వం కొద్దిగానే ఉంటుంది, రజస్సు-తమస్సు ఎక్కువగా ఉంటాయి. మరి బాగు పడటానికి సత్వం కావాలి, కొన్ని నియమాల్ని పాటించాలి. నియమాలు మరి ప్రకృతిలోని గుణాలకోసమే కాక, మనల్ని ఆదర్షంగా తీసుకొనేవారు బాగు పడటానికి కూడా మనం పాటించాల్సి వస్తుంది. ఈ కృత్యా- అకృత్య వియోచనాలను మన ఆండాళ్ తల్లి ఈ పాటలో తెలియజేస్తుంది.

"వైయత్తు వాళ్ వీర్గాళ్!" ఈ భుమి మీద ఉండి సుఖించాలని కోరిక ఉంటే చాలు రండి అని చెబుతుంది. ఈ భూమి తామస గుణమిచ్చేది, ఇక్కడ ఉండగా సాత్వికగుణం కలగటం కుంపెటలో తామరపువ్వు పూసినట్లు అంటారు. చివరికి పరమాత్మకు కూడా తామస గుణ ప్రభావం తప్పలేదు అని సీతాదేవి హనుమంతునితో చెప్పుతుంది ఈ విషయం రామాయణంలో. రావణ వధ అనంతరం సీతను తీసుకుపోవటానికి వచ్చిన హనుమ సీతాదేవితో, నివ్వు ఆజ్ఞ యివ్వు నిన్ను పీడించే ఈ రాక్షసమూకను ఒక్కసారి పని పడతాని అంటాడు, దానికి సీత ఇది వారి తప్పు కాదయా, వారు రావణుని అండలో ఉన్నారు, ఈ భూమిమీద ఉండగా తప్పు చేయడం సహజమేకదా, చివరికి చూసిరమ్మని చెబితే కాల్చివెల్లలేదా నీవు. దానికి హనుమ మరి నేనంటే ఏమో, కాని శ్రీరామ చందృడు కూడా తప్పు చేసినాడా అమ్మ అని అడిగాడు. సూర్పణక వచ్చినప్పుడు ఆమెతో రాముడి ప్రవర్తన మరి తప్పేగా, నేను ఏక పత్నివ్రతుడను అనిమాత్రం చెప్పక, తన తమ్ముడికేసి ఎందుకు చూపించాడు. ఇవ్వన్నీ కదా ఇన్ని అపచారాలకు దారి తీసింది అని హనుమంతుడితో చెప్పుతుంది.

"నాముం నం పావైక్కు" ఒకరిని కష్టపెట్టే వ్రతం కాదు, లోకుల వ్రతాలు వారి వారి సుఖాలకోసం చేస్తే ఈ వ్రతం లోకం అందరికోసం చేసేది. "శెయ్యుం కిరిశైగళ్ కేళీరో" మరి ఏం చేద్దాం ఈ వ్రతంలో వినండి, " పాఱ్కడలుళ్ పైయత్తుయిన్ఱ పరమనడి పాడి" పాల కడలిలోని సుకుమారం గా పవళించి ఉన్న వైకుఠనాథుని పాదాలను పాడదాం. ఆయనను మించినవారు ఇంకెవరూలేరు కాబట్టి "పరమన్" అని అంటారు. ఎందుకంటే మనల్ని కాపాడటానికి తాను మొదటగా పాదం వేసినది పాల్కడలిలోనేకదా! ఆయన పాదాలలో శంఖ, రథాంగ, కల్పక, ద్వజా, అరవింద, వజ్రా, అంకుష ఇత్యాదులు గుర్తులుగా చేసుకొని ఉన్న ఆపాదాన్ని పాడుదాం. ఎలాగైతే శిశువు తల్లి స్తన్యాన్ని గుర్తిస్తాడో, భక్తుడు భగవంతుని పాదాలను గుర్తించగలిగి ఉండాలి. సుకుమారమైన నిద్ర అంటే లోక రక్షణకోసం తానుచేసే సాత్విక-యోగనిద్ర. మనకోసం ఇంకా ఎమి చేస్తె బాగుపడతాం అని ఏర్పాటు చేసుకొన్న స్థానం పాల్కడలి.

వ్యుహం-పాల్కడలి

నిన్నటి నాడు నారాయణ అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఇన్ని గుణాలు కల్గి ఉన్న నారాయణ తత్వాన్ని అర్థం చేసుకోవటం కష్టమే. మరి ఆ తత్వం మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసుకోవటం అవసరం. మనం ఇప్పుడు ఒక శరీరం ధరించి

ఉన్
నాం, ఒక భూమి మీద నివసిస్తునాం. ఈ భూమి సౌరమండలంలో ఉంది. ఇదంతా ఎవరు ఏర్పాటు చేసారో మనం ఆలోచించటం లేదు. ఒక చిన్నవిత్తనం నుండి ఒకపెద్ద వటవృక్షం వచ్చినట్లుగా ఇది ఒకనాడు ఎర్పడింది ఒకడిలోంచే అని మనకు వేదం చెబుతుంది.

ఇవన్ని ఏవి లేనప్పుడు పరమాత్మ ఈ జీవులందరూ ఉన్నారే అతి చిన్నరూపం కలవారు, అతి విలక్షణమైన జ్ఞానం కలవారు, కర్మభారాలు మోసేవారు, తామంతట తాము దేహాలు ధరించలేనివారు మరినేను వీళ్ళకు ఉపకారం చేయకుంటే ఎలా! కర్మతోలగాలంటే దేహం కావాలి, దేహం ఉండే నేల కావాలి, దాన్ని భోగ స్థానం అంటారు. అందుకు అనుభవించే వస్తువులు కావాలి, వాటిని భోగ్యములు అని అంటారు. వీటిని అనుభవించే ఇంద్రియాలు కావలి వాటినే భోగ్య ఉపకరణములు అంటారు. ఇన్నింటిని తయారు చేనినవాడిని మనం నారాయణ అంటాం. మరి ఇవన్నీ తయారు చేయటానికి ఆయన ఏర్పాటు చేసుకొన్న స్థానాన్నే వ్యూహం అంటారు.

అక్కడ ఆయన వాసుదేవ, అనిరుద్ద,ప్రత్ర్యుమ్న, సంకర్షన అనే నాలుగు పేర్లతో ఉంటాడు. సృష్టి, స్థితి, లయము ఈ మూడు కార్యాలు చేస్తాడు, ఆ స్థానాన్నే పాల్కడలి అని కూడా అంటారు.

ఆయన కళ్యాణ గుణాలకు అది మూలస్థానం. అక్కడ వాసుదేవ అనేరూపంతో సర్వం తన ఆదీనంలో పెట్టుకుంటాడు. అందులోంచి ఒక రూపం తీస్తాడు దానికి సంకర్షణ అని పేరు, ఇది ప్రళయం చేయటానికి శివునిలో తానుండి చేస్తాడు. మరొక రూపం తీస్తాడు, దానికి అనిరుద్ద అని పేరు సృష్టి కోసం తాను బ్రహ్మలో ఉండి చేస్తాడు, మరొక రూపం తీస్తాడు, దానికి ప్రత్యుమ్న అని పేరు సృష్టించిన వాటిని రక్షించేందుకు ఇది ఇందృనిలో ఉండి చేస్తాడు. అక్కడికి ఆయన మొట్టమొదటిగా అడుగు పెడతాడు, ఆదిశేశువు పైన ఆయన ఉంటాడు. ఆర్తితో పిలిచేవారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు అవసరం ఏర్పడుతుందో అక్కడినుండి లోకరక్షణకై అవతారాలను పంపిస్తుంటాడు. అన్ని అవతారాలకు మూల స్థానం పాల్కడలియే. ఆయా అవతారల్లో ఆయన గుణ సంపదలను లోకానికి చాటుతాడు. అందుకే అవతారాలను విభవములు అంటారు.

ఆయన పాదలను పాడుదాం. కడుపు నిండి పోతుంది- ఇక "నెయ్యుణ్ణోం పాలుణ్ణోమ్" నెయ్యి వద్దు పాలు వద్దు. "నాట్కాలే నీరాడి" తెల తెల వారు జామున లేచి స్నానం చేద్దాం. "మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్" కాటుక,పూలు ధరించం, ఏవి విలాసాలో అవి వదిలేస్తాం. "శెయ్యాదన శెయ్యోమ్" మాపూర్వులు చెయ్యనివి ఏమి చెయ్యం - ప్రాచీణ ఆచారాలు మానెయ్యం " తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్" పుళ్ళవిరుపు మాటలు మాట్లాడం. "ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి" చాతనైనంత వరకు ధాన ధర్మం చేస్తాం. "ఉయ్యుమాఱెణ్ణి ఉగంద్" ఇవన్ని ఆనందంతో చేస్తాం.
కొత్త జీవితం

మార్పు అనేది సృష్టి సహజ స్వభావం. పరిణామక్రమంలో ప్రపంచం ముందుకు వెళ్తుంటుంది. చలనశీలంలోనే పురోగతి ఉంది.  నిశ్చలంగా నిద్రించే చెరువుకు, నిరంతరం గలగలా ప్రవహించే గోదావరికి ఎంత తేడా!
ప్రవహించే మార్గాన్నంతా నది సస్యశ్యామలం చేస్తుంది. చెరువు గ్రీష్మంలో ఎండి, వర్షరుతువులో మళ్లీ ఊపిరి పోసుకుంటుంది. జీవనదులు ప్రవహిస్తూనే ఉంటాయి.
అజ్ఞానులు, అతిస్వార్థపరులు చెరువులాంటివారు.
అందరికీ తనతో పని ఉంటుంది, తన దగ్గరకే అందరూ వస్తారనుకుంటుంది చెరువు. అలా వచ్చినవారి పొగడ్తలు ఆశిస్తుంది. తన కారణంగానే వారికి ప్రాణరక్షణ జరుగుతోందనే అపోహతో అహంకరిస్తుంటుంది. నదులు అందుకు భిన్నం!
అనంత జలరాశి సముద్రంకూడా, మధుర జలాలతో తన వద్దకు వచ్చే నదుల నీటికోసం తహతహలాడుతుంది. కానీ, ఎన్ని నదులు కలిసినా సముద్రజలం రుచి మారదు. ఎందరో ధనపిపాసుల పరిస్థితీ అలాగే ఉంటుంది. కోట్లాది రూపాయల ధన సంపద ఉన్నా ఇంకా ఇంకా విలువైనవి రాబట్టాలనే తహతహతో ఉంటారు. మంచివారి స్నేహం, మంచిమాటల బోధలతో వారి స్వభావం కించిత్తయినా మారదు. మారడమన్నది రెండు విధాలు. చెడు నుంచి మంచి, మంచి నుంచి చెడు. మొదటి మార్పువల్ల జీవితం ఉన్నతస్థితికి చేరుకునేందుకు అవకాశం కలుగుతుంది. రెండోది శిఖరం నుంచి లోయలో పడటంలాంటిది. దీనినే ‘వివేక భ్రష్ట సంపాతముల్‌’ అన్నాడు నీతిశతకకారుడు.
మనలోని లోపాలు మనకు తెలిసినంతగా ఇతరులకు తెలియవు. వాటిని చాలావరకు బయటపడకుండా కప్పిపుచ్చుకొంటాం. లోపాలు వేరు, దుర్గుణాలు వేరు. దుర్గుణాలు నిప్పులో దాచినా దాగవు. ఏదో సమయంలో అవి బయటపడక తప్పదు.
సృష్టిలో మనిషికి మాత్రమే తనను తాను సరిదిద్దుకుని, సంస్కరించుకునే సదవకాశం ఉంది. అలా చేసుకోగలిగితే, కొత్తజీవితం మొదలవుతుంది. అక్షరజ్ఞాన శూన్యుడు కృషితో విద్యావంతుడైతే, నాస్తికుడు సత్యం తెలుసుకుని ఆస్తికుడైతే, బలహీనుడు వ్యాయామంచేసి దృఢకాయుడవుతాడు. పాతజీవితం గతంలో కలిసిపోయి, నవజీవనం ప్రారంభమవుతుంది.
బోయవాడిగా బతికినంతకాలం దారి దోపిడి దొంగగా, భార్యాబిడ్డల సుఖమే పరమావధిగా గడిపిన వ్యక్తి- నారదుడి బోధతో పాతజీవితాన్ని చిరిగిన, మలిన వస్త్రంలా విసర్జించాడు. రామనామ తారకమంత్రోపాసనతో సర్వపాపాల నుంచి విముక్తుడై, భగవత్సమానుడైన వాల్మీకి మహర్షిగా మారిపోయాడు. ఆనాటినుంచి కొత్త జీవితం మొదలైంది.
మనలో చాలామంది, తమలోని లోపాలను సరిదిద్దుకుని, కనీసం శేషజీవితాన్ని పవిత్రంగా ఆదర్శంగా గడపాలనుకుంటారు. దాన్ని ఆచరణలో పెట్టలేకపోతుంటారు. అందుకు అలసత్వం, సోమరితనం, పట్టుదల లేకపోవడం లాంటివి కారణాలు. ప్రయత్నరహితంగా ఏదీ సాధించలేం. ఏవీ తమకు తాముగా మనకు సిద్ధించవు.
పూర్వకాలంలో దశలవారీగా జీవితం గడుపుతూ, అందుకు అనుగుణంగా వ్యవహరించేవారు. వార్ధక్యంరాగానే వానప్రస్థానానికి వెళ్లి తపోదీక్షతో గతకాల కర్మలను, ఫలితాలను దహించివేసి, కైవల్యం కోసం కృషి చేసేవారు. ఇప్పుడు ఎందరినో చివరి శ్వాసవరకు ప్రాపంచిక ప్రలోభాలు వదలడంలేదు. ప్రలోభాలు కామపిశాచాల్లాంటివి. ఒక పట్టాన విడిచిపెట్టవు.
వైరాగ్య వివేకంతో వాటిని వదిలించుకోవచ్చు. అలా చేయగలిగిన వారందరికీ కొత్త జీవితం స్వాగతం పలుకుతుంది!
★3 వ రోజు - భగవంతుని మూడో స్థానం - విభవం(అవతారములు)★

ఆండాళ్ తిరువడిగలే శరణం

#పాశురము

ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి
నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్
తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు
ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ
పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప
తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి
వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్
నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్

విభవం(అవతారములు)
ఈ రోజు ఆండాళ్ తల్లి అవతారముగా వచ్చిన వామనమూర్తిని కొలిచింది. పాల్కడలిలోకి దిగివచ్చిన నారాయణ తత్వం మనకోసం ఒక సారి చేప లాగా, ఒకసారి తాబేలు లాగా, ఒక సారి వరాహమ్లాగ, మరోకసారి ఇటు మనిషి కాని అటు మృగము కాని వాడిలా, ఒక సారి మనిషిలా ఇలా ఎన్నో రకాలుగా ఆయా అవసరాలను బట్టి ఒక రూపం స్వీకరించి మనవద్దకు వస్తాడు.


"ఓంగి" పెరిగెను "ఉలగళంద" కొలిచెను "ఉత్తమన్ పేర్ పాడి" పరమాత్మ నామాన్నే పాడుదాం. నామమే చాలా గొప్పది, భగవంతుడు ముద్ద బంగారం అయితే ఆయన నామం ఆభరణం లాంటిది. అయన నామం కు ఒంగి ఉంటాడు. ఎవరి నామాన్ని పాడితే ప్రాచీన పాప రాశి అంతా కొట్టుకు పోతుందో, మంచి నడవడిక ఏర్పడుతుందో, నాలుక ఉన్నందుకు సార్తకత ఏర్పడుతుందో ఆయన నామాన్ని పాడుదాం. సౌదర్యం, సౌశీల్యం, సౌలభ్యం అన్ని గుణాలు కల్గిన వామన మూర్తిని అమ్మ ఊహించింది.

ఒక్కసారిగా పెరిగి ఆయన లోకాలను కొలిచాడు, ఆపెరగటం కూడా భలి చక్రవర్తి ఒకపాదాన్ని కడిగిన నీరు, బ్రహ్మలోకంలో బ్రహ్మ కడిగిన రెండో పాదం నీరు ఒకే సారి భూమిని చేరాయట. మరీ ఇంత త్వరగా ఎలా పెరగాడు! ఆయన పెరగలేదు ఆయన అంతటా వ్యాపించి ఉంటాడుకదా ఒక్కసారిగా ఆయన వ్యాప్తిని చూపించాడు. పెరగటం తరగటం మనం చేసేవి మన కర్మల వల్ల, మన సంస్కారాల వల్ల. మరి జన్మ కర్మలు లేనివాడు ఆయన, ఇది మన కోసం చేస్తాడు. ఇవన్నీ ఆయన ప్రేమ కోసం చేస్తాడు. మూడో కాలు భలి తలపై పెట్టాడు, బలి అహం కాస్తా దాసోహంగా మారింది. రసాతలం భలికి ఇచ్చినాడు.

మొదటి రోజు ఆండాళ్ తల్లి మనకు నారాయణ తత్వం గురించి చెప్పింది, రెండో రోజు ఆ తత్వం మనల్ని రక్షించేందుకు ఆయన పాల్కడలిలో ఎలా ఉంటాడో చెప్పింది, ఈరోజు ఆయన మనల్ని ఉద్దరించేందుకు ఎలా అవతారంగా వచ్చాడో తెలుపుతుంది.

వ్రత ఫలితములు

ఈరోజు చాలా ప్రధానమైన రోజు, ఆండాళ్ తల్లి ఈవ్రతం చేస్తే వచ్చే ఫలితం గురించి చెప్పినరోజు. పెద్దలు మనల్ని అశిర్వదించాలంటే ఈ పాటను పాడి మనల్ని ఆశీర్వదిస్తారు. మనషికి మంచి భవనాలు ఉంటే సుఖమా! లేక యంత్రాలు,వాహనాలు ఉంటే సుఖమా! లేక సమాజంలోని వ్యక్తులందరికి అవసరమయ్యే కనీస అవసరాలు ఉంటే సుఖమా! మనిషికి ఉండటానికి నీడ అవసరం -అది ప్రశాంతం గా ఉండాలి, తినడానికి ఆహారం అవసరం అది పుష్టిగా ఉండాలి, త్రాగటానికి జలం అవసరం- అది ఆరోగ్యకరంగా ఉండాలి. ఈ కనీస అవసరాలు అందించే వ్యవస్త కావాలి. ఈతి బాధలు ఉండకూడదు, దోంగలూ ఉండకూడదు, రోగాలు ఉండకూడదు.

మనం చేసే కార్యాలు ఎలా ఉండాలంటే దృష్ట-అదృష్ట రెండూ ప్రయోజనాలను కల్గించేలా ఉండాలి. మనం చేసే చిన్న చిన్న యజ్ఞాలకే స్వర్గాది ఫలాలు వస్తాయి అంటారే అది అదృష్ట ఫలం, దృష్ట ఫలం గా ఇక్కడ ఉన్నప్పుడు అనుభవించే డబ్బు, మంచి సంతానం, భవనాలు, దీర్ఘ ఆయిస్సు, మంచి ఆరోగ్యం ఇవన్నీ లభిస్తాయి అంటారు. మరి మనం చేసే ధనుర్మాస వ్రతం దేవాది దేవుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమత్మకోసం చేసేది కావటంచే మనకు లభించేది తిరిగి మనం ఈ కర్మకూపంలోకి చేరక్కరలేకుండా తరించే వీలయ్యే ఉత్తమ స్థానం మనకు తప్పక లభిస్తుంది. ఒక్కసారి ధనుర్మాస వ్రతం చేస్తే మనకు ఆయన దగ్గర స్థానం లభించక మానదు. అక్కడికి వెల్లేముందు మనకు లభించే ఫలితాలు ఈరోజు ఆండాళ్ తల్లి వివరిస్తుంది.

ఈ వ్రత గొప్పతనం అలాంటిది, ఈ వ్రత ఫలితం ఇచ్చే శ్రీకృష్ణుడి గొప్పతనం అలాంటిది,ఈ వ్రతంలో మనం వాడే మంత్రం ప్రభావం అలాంటిది, ఈ వ్రతం ఆచరించిన గోపికల గొప్పతనం అలాంటిది, ఆ వ్రతాన్ని మనకు పాడి ఇచ్చిన ఆండళ్ అమ్మ తల్లి వైభవం అట్లాంటిది. మనకు కావల్సింది కేవలం పరిపూర్ణమైన విశ్వాసం ఒకటి ఏర్పడాలి. సకల దేవతలు శ్రీకృష్ణపరమాత్మ రూపంలో ఒదిగి ఉంటారు కదా! ఆయన అనుగ్రహిస్తే అందరూ అనుగ్రహించినట్లే కదా! ఆయనను తెలిపే నారాయణ మంత్రం ఒక్కటి అనుష్టిస్తే మిగతా మంత్రాలన్నీ అనుష్టిస్తే వచ్చే ఫలం లభించదా!.

ఇక్కడ మనం మహాభారతంలో ఒక సన్నివేషం గుర్తుచేసుకుందాం, అజ్ఞాతవసంలో పాండవుల గుట్టు రట్టు చేయటానికి ధుర్యోధనుడు తన గూడాచారులను పంపాడు, వారికి ఎక్కడ కనబడలేదు. ఇంత పరాక్రమమైన వాల్లు దాగి ఉండటం చాల వింతయే కదా! దానికి భీష్మ పితామహుడు వారితో పాండవులను వెతకటం అట్లాకాదయా, వారు ఒక్కొక్కరూ నారాయణ మహామత్రం ఉపాసన చేసిన మహనీయులు కనక వారు ఉన్నదగ్గర వానలు బాగా కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి, రోగాలు ఉండవు, దొంగల భాద ఉండదు, ఇప్పుడు వెతకండి అని రహస్యాన్ని చెప్పాడు. అప్పుడు వారికి విరాట్ నగరం సిరిసంపదలతో కనబడింది, అందుకే ఉత్తరగోగ్రహణం చేసారు. తరువాత కథ మనకు తెలుసు, ఇక్కడ మనకు కథ కాదు ప్రధానం. మనం నారాయణ మహామంత్ర గొప్పతనం గమనించాలి.

"నాంగళ్" ఏం కోరిక లే
ని "నం పావైక్కు" లోకం మొత్తం సుఖించాలని ఆచరించేది "చ్చాత్తి నీర్ ఆడినాల్" వ్రతం అని వంక పెట్టుకొని స్నానం చేసినా చాలు, వ్రతం చేసినట్లే. మన కోరేది శ్రీకృష్ణ పాద సేవయే కదా! మరి లోకం మొత్తం ఎలా ఫలితం వస్తుంది, ఎలా అంటే శ్రీకృష్ణుడు మూలం కదా, వేరుకు నీరు పోస్తే చెట్టు ఎలా వికసిస్తుందో అలాగే.

"తీంగిన్ఱి నాడేల్లామ్" బాధలు వుండవు " తింగళ్ ముమ్మారి పెయ్దు" నెలకు మూడు సార్లు వర్షాలు కురుస్తాయి-పంటలు బాగాపండుతాయి. "ఓంగు పెఱుం జెన్నెల్" కలువ తామరలు ఏపుగా పెరిగుతాయి "ఊడు కయల్ ఉగళ" ఆ నీటిలో భలమైన చేపలు తిరుగుతింటాయి. "పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప" అందమైన పుష్పాలు పూస్తాయి, వాటిలో తుమ్మెదలు తేనెను ఆస్వాదించి మత్తుతో నిద్రపోతున్నాయి. "తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్" పశువులు ఇచ్చేపాలు పాత్రను దాటి పొంగేంత చక్కని పాడి ఉంటుంది. "నీంగాద శెల్వం నిఱైంద్" కావల్సిన ధనం, సంపదలు చేకూరుతాయు.
★4 వ రోజు - భగవంతుని నాలుగో స్థానం-అంతర్యామి★

ఆండాళ్ తిరువడిగలే శరణం


#పాశురము

ఆళి మళైక్కణ్ణా! ఒన్ఱు నీ కై కరవేల్
ఆళి ఉళ్ పుక్కు ముగందు కొడార్ త్తేఱి
ఊళి ముదల్వన్ ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు
పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్
ఆళిపొల్ మిన్ని వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు
తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్
వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళుందేలోర్ ఎమ్బావాయ్

మనిషిని మనిషిగా తీర్చిదిద్దే వ్రతం ఇది. మానవ జన్మకు సాఫల్యాన్ని ప్రసాదించేది ధనుర్మాస వ్రతం. మనలో కోరిక అంటూ కల్గితే చాలు ప్రకృతిలోని శక్తులంతా సహకరిస్తాయి. దేవతలంతా సహకరిస్తారు. మొదటగా మనకు భగవంతుని తత్వాన్ని వివరించింది ఆండాళ్ తల్లి. ఈ దివ్య తత్వాన్ని నారాయణ ఆని అంటారు. ఈ తత్వాన్ని మనం ఏ రూపంలో అయినా గుర్తించవచ్చు. వేదవ్యాస భగవానుడి కుమారుడు శ్రీసుఖుడు ఇట్లా అంతటా దైవన్ని దర్షించుకొనేవాడట. దేనిపై పెద్దగా వ్యామొహం లేనివాడవటంచే అలా వెల్లి పోతుంటే, పుత్రవ్యామోహంచే వేదవ్యాసుడు అతని వెంట పరుగెత్తేవాడట. పుత్రా అని తన పిలుపులకు ఆయన స్పందించకపోయే సరికి చెట్లు,పక్షులు ఓయ్ అని పలికేవట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే శ్రీసుఖునిలో ఉన్న తత్వమే అన్నిటిలోనూ ఉందికనకనే అలా స్పందించాయి. ప్రతి వస్తువులోను అది ఉండి నిలబెడుతుంది.దాన్ని మనం చూడగలగాలి, కాని కంటికి కనబడదు. కాబట్టి మనం ఈ తత్వాన్ని అంతర్యామిగా గుర్తించాలి.

ఆండాళ్ తల్లి మనిషిలోని మంచి తనాన్ని మేల్కొల్పటానికి ధనుర్మాస వ్రతం చేసింది, మనల్ని అట్లానే ఆచరించమంది. అందరితో కలిసి ఆచరించాలి అని చెప్పింది. అందరితో కలిసి చేస్తేనే అనుభవ యోగ్యం అవుతుంది. అందరికి సాముహికంగా క్షేమం కల్గాలని అని మనం చేస్తున్నాం, అలాంటి వాన్ని ముముక్షువు అంటారు. మనం ఒక ముముక్షువుగా బ్రతక గలగాలి. తత్వన్ని అంతటా చూడగలగాలి. తీపికి రుపం ఎమిటి, వివిద పదార్థాలలో నే చూడగలం. అలాగే పరమాత్మ తత్వాన్ని మనం కంటితో చూడలేము కనక, మనవంటి వారికి ఇష్టమయ్యే మనవంటి రూపాన్నే ధరించి మన ఆరాధనలు అందుకోవటానికి చేరుతుంది ఆ బ్రహ్మ తత్వం. కాని అది మాత్రమే ఆయన రూపం కాదు.

సామాన్యంగా భగవంతుడు తన పరివారం అందరితో కల్సి ఉంటాడు, లోకంలో ఒక్కొక్క ఒక్కొక్క ప్రయోజనం కోసం వివిద దేవతలను ఆశ్రయిస్తారు. కాని ఒక్కరిని ఆరాధించి సకల ఫలితాలు పొందాలంటే ఏదైన సాధన ఉందా అంటే- అది నారాయణుని ఆశ్రయం తప్ప ఏది లేదు ఎందుకంటే సకలఫలప్రదోహి విష్ణు: అనేది మనకు ఋషివాక్కు. మిగతావరంతా "ఏకైక లభాయ:" కాని "సర్వ లాభాయ కేశవ" అంటారు. ఒక్క పరమాత్మను మనం ప్రసన్నం చేసుకొంటే ఇతర దేవతలంతా సహకరిస్తారు.

అందరూ భయపడే యముడు చెప్పినమాటలు ఏమిటంటే, విష్ణువు భక్తుల జోలికి తన దూతలను వెల్లవద్దని. భగవత్ ప్రేమ కల్గి విష్ణువుకే అంకితమయ్యే వాల్లంటే యముడు కూడా భయపడుతుంటాడు. నారాయణ స్మరన చేయటంచే యమదూతలు అజామయున్ని వదిలివెళ్ళుతారు. విష్ణుదూతలు అతన్ని తీసుకుపోతారు. భారతంలో అజామయుడి సన్నివేషంలో ఇది చెప్పబడి ఉంది. అలాగే ఏదేవతను కొలిచినా,ఆయా దేవతల ద్వారా ఫలాన్ని ఇచ్చెది నేనే నయా అని భగవద్గీత ఏడవ అధ్యాయంలో చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. మనం ఒక్క శ్రీకృష్ణ పరమాత్మను ప్రసన్నం చేసుకొంటే మిగతాదేవతలు తామంతట తామే సహకరిస్తారు.

అలా వచ్చిన దేవతల్లో ముఖ్యుడైన వర్ష దేవునికి ఆండాళ్ చేసిన విన్నపం ఇలా ఉంది. ఆళి మళైక్కణ్ణా! - సముద్రమ్లో నుండి నీల్లను గ్రహించి నిర్వహించేవాడా - వానదేవా-పర్జన్యా. ఒన్ఱు నీ కై కరవేల్ - ఏ మాత్రం నీవు చేయి దాచుకోవద్దు-ఉదారంగా ఇవ్వు, ఆళి ఉళ్ పుక్కు - సముద్రం అట్టడుగు లోపలి దాకా వెల్లి , ముగందు కొడార్ త్తేఱి - పిల్చుకో, ముందు నీవు తృప్తిగా కడుపు నిమ్పుకోని - చాలా ఎత్తుకు వెల్లాలి.

ఊళి ముదల్వన్-సృష్టి కార్యం చేయడానికి ముందు స్వామి ఎలాంటి నీలి కాంతి తరంగాలు కల్గి ఉంటాడో, ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు - అట్లాగే నీ ఆకారాన్ని సరిదిద్దుకో, పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్ ఆళిపొల్ మిన్ని - బీటలువారి ఉన్న ఈ భూమికి ఒక్క సారిగా కురవకూడదు, మొదటగా మెరవవలె,తర్వాత ఉరమవలె, తరువాత కురవవలె.

ఆమెరవడం ఎట్లా అంటే సుదర్షణచక్రం మెరుస్తున్నట్లుగా ఉండాలి. వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు - ఎట్లా ఉరమాలి అంటే శ్రీపాంచజన్యంలా-శంఖం ద్వనిలా ఉరుమవలె. ఆద్వని ద్వారా భగవంతున్ని ద్వేషించేవాల్లు కూడా భక్తులుగా మారేట్లు గా ఉండాలి. తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్ వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ - ఇక కురవడం స్వామి వేసే భాణాలవలె కురవాలి, అందరు సుఖించెందుకు వర్షించు. ఆంగళుం మార్గళి నీరాడ మగిళుంద్ - మార్గశీర్ష స్నానం కోసం మాకు సరిపడేంత నీరు ఉండేలా వర్షించు.
గ్రహణం సమయంలో చదవాలిసిన నవగ్రహ సోత్రం🙏🙏🙏🙏

గ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారకః ।
విషమస్థాన సంభూతాం పీడాం హరతు మే రవిః ॥ ౧॥
రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సుధాశనః ।
విషమస్థాన సంభూతాం పీడాం హరతు మే విధుః ॥ ౨॥
భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్ సదా ।
వృష్టికృద్వృష్టిహర్తా చ పీడాం హరతు మే కుజః ॥ ౩॥
ఉత్పాతరూపో జగతాం చన్ద్రపుత్రో మహాద్యుతిః ।
సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతు మే బుధః ॥ ౪॥
దేవమన్త్రీ విశాలాక్షః సదా లోకహితే రతః ।
అనేకశిష్యసమ్పూర్ణః పీడాం హరతు మే గురుః ॥ ౫॥
దైత్యమన్త్రీ గురుస్తేషాం ప్రాణదశ్చ మహామతిః ।
ప్రభుస్తారాగ్రహాణాం చ పీడాం హరతు మే భృగుః ॥ ౬॥
సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః ।
మన్దచారః ప్రసన్నాత్మా పీడాం హరతు మే శనిః ॥ ౭॥
మహాశిరా మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబలః ।
అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతు మే శిఖీ ॥ ౮॥
అనేకరూపవర్ణైశ్చ శతశోఽథ సహస్రశః ।
ఉత్పాతరూపో జగతాం పీడాం హరతు మే తమః ॥ ౯॥
॥ ఇతి బ్రహ్మాణ్డపురాణోక్తం నవగ్రహపీడాహరస్తోత్రం సమ్పూర్ణమ్ ॥
డిసెంబర్ 26వ తేదీన కంకణ సూర్య గ్రహణం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
(వేదమయీ ) పోస్ట్ క్రెడిట్ :- డా.యం.ఎన్.చార్య

స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సర మార్గశిర అమావాస్య తేదీ డిసెంబర్ 26 గురువారం 2019 న సూర్య గ్రహణం భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది.

"ధనస్సు" రాశి మూల నక్షత్రం "మకర , కుంభ" లగ్నాలలో కేతుగ్రస్త కంకణ సూర్య గ్రహణం సంభవించును.ఈ గ్రహణం భారతదేశంతో పాటు ఆసియా , ఆస్ట్రేలియా ఖండాలలో కనబడును .

ఖగోళంలో ఈ గ్రహణం 3 గంటల 39 సెకండ్లు ఉంటుంది. కర్ణాటక , తమిళనాడు ,కేరళలోని కొన్ని ప్రాంతాలలో కంకణోక్త సంపూర్ణ సూర్య గ్రహణం వేర్వేరు సమయాలలో ఉండును . పై మూడు రాష్టాలు మినహాయించి మిగిలిన తెలంగాణ ,ఆంద్రప్రదేశ్ తో పాటు భారతదేశంలోని ఇతర రాష్టాలన్నింటిలో పాక్షిక సూర్యగ్రహణం గోచరిస్తుంది.

హైదరాబాదులో ఉదయం 8 :08 నిముషాలకు సూర్యగ్రహణ స్పర్శ ప్రారంభమై మధ్యకాలం 9:30 చేరుకుంటుంది. ఉదయం 11 :10 నిమిషాలకు " పుణ్యకాలం " ముగుస్తుంది. గ్రహణ సమయంలో సూర్యుడు అగ్నివలయంలాగా గ్రహణం చుట్టూ కనపడతాడు.కేరళలోని చెరువుత్తూర్ లో దేశంలో అన్ని ప్రాంతాల్లో కంటే సూర్య గ్రహహణ దృశ్యం సుందరంగా ఉండబోతోంది.

ప్రపంచంలో అతికొద్ది ప్రాంతాల్లో మాత్రమే ఇంత స్పష్టంగా సూర్యగ్రహణం కనిపిస్తుంది. సూర్యగ్రహణం వీక్షించే సమయంలో అద్దాలు లేకుండా కంటితో చూడవద్దని హెచ్చరిక . సూర్యుడికి , భూమికి మధ్య చంద్రుడు ప్రవేశించడంతో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ ఏడాది సూర్యగ్రహణం, చంద్రుడు సూర్యుడికి మధ్యలో నుండి అంచులో అగ్నివలయంలాగా కనిపిస్తాడు. భారతదేశంలోనే కాకుండా , సౌదీ అరేబియా, సుమత్రా, బార్నియో లాంటి ప్రాంతాల్లో కూడా సూర్య గ్రహణం దర్శనమిస్తుంది. ఎవరైన గ్రహణాన్ని గ్రహణ సమయంలో ప్రత్యక్షంగా చూడ కూడదు . గర్భవతులు ఎలాంటి భయందోళనలు చెందనవసరం లేదు . గ్రహణ సమయంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ధ్యానం ,జపం , ఆధ్యాత్మిక చింతనతో ఉంటే చాలా మంచిది . మార్గశిర అమావాస్య నాటి అబ్ధిక కార్యక్రామాన్ని యధావిధిగా అపరాన్నకాలంలో జరుపుకోవచ్చును . గ్రహణ పట్టు , విడుపు మధ్యస్నానాలాచరించే వారు , వారికున్న మంత్రనుష్టానములతో ఆచరించి యధావిధిగా స్నానాదులు ఆచరించి నిర్విహించవచ్చును .

గ్రహణం గురించి ఎవరూ ఎలాంటి భయం కాని అందోళన కాని చెందవద్దు . గ్రహణం ముగిసిన తర్వాత ఇల్లు శుభ్రంగా కడుక్కొని , స్నానం చేసే నీళ్ళలో చిటికెడు పసుపు,ఒక 'టి' స్పూన్ పచ్చి ఆవుపాలు, రెండు హారతి కర్పూరం బిల్లలను చూర్ణం చేసుకుని నీళ్ళలో వేసుకుని తల స్నానం చేసుకోవాలి.ఆ తర్వాత ఇంట్లో ఉన్న పూజాగదిని శుభ్రపరచుకుని గాయత్రి ( జంధ్యం ) ని మార్చుకుని , పూజ మందిరంలో ఉన్న దేవత విగ్రహాలకు ,యంత్రాలకు శుద్ధమైన నీళ్ళలో చిటికెడు పసుపు వేసి దేవుని విగ్రహాలు,యంత్రాలను ప్రోక్షణ చేసిన తరవాత దీపారాధన అలంకరణం చేసి నైవేద్య నివేదన కొరకు బెల్లంతో చేసిన మరమాన్నం వండి దేవునికి నివేదన చేసి హారతి ఇచ్చి మనస్సును ప్రశాంతగా ఉంచుకుని మూడు ప్రదక్షిణలు నిధానంగా చేసి తమకున్న సమస్త గ్రహాదోష నివారణ కలిగించమని సాష్టాంగా నమస్కారం చేస్తూ విన్నవించుకోవాలి , ఆడవారు సాష్టాంగ నమస్కారం ఎప్పుడు ,ఎక్కడ చేయకూడదు.

ఆడవారు కేవలం మోకాళ్ల పైనే చేయాలి.ముఖ్యంగా గర్భిణిలు నిలబడే నమస్కరించుకోవాలి . ఇంట్లో పూజ పూర్తీ అయిన తర్వాత గుడికి దైవ దర్శనాలకు వెళ్ళే వారు వెళ్ల వచ్చును.మొదట ఇంట్లో పూజ చేయనిది దేవాలయాలకు ఎప్పుడూ వెళ్ళకూడదు.

ఆ రోజు శక్తి కొలది ఆవునకు ఉలవలు ,బెల్లం , అరటి పండ్లు విస్తరి ఆకులో కాని అరటి ఆకులో కాని పెట్టి ఆవుకు తినిపించి మూడు ప్రదక్షిణలు చేస్తే మంచిది. గ్రహాణ దోష పరిహార ప్రక్రియ కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజులైన శాస్త్ర పండితులను సంప్రదించి మీ వ్యక్తిగత జాతక ఆధారంగా ఏమైనా దోషం ఉంటే వారిచ్చే సూచనల మేరకు పరిహార జప,దానాదులను చేసుకోవాలి. నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయ లేదా కొబ్బరి కాయలను గుమ్మంపై నుండి తీసివేసి మళ్లి కొత్త వాటిని అనుభవజ్ఞులైన పండితులచే పూజించి ఇంటికి , వ్యాపార సంస్థలకు కట్టుకోవాలి . గ్రహణం తర్వత మనం ఇంటి రక్షణ కోసం కట్టిన గుమ్మడి , కొబ్బరి కాయలు శక్తిని కోల్పోతాయి, కాబట్టి తిరిగి కుంటుబ సభ్యుల శ్రేయస్సు కోరుతూ ఇంటికి , వ్యాపార సంస్థల రక్షణ కొరకు గుమ్మడికాయను కొత్తగా శాస్త్రోక్తంగా "కుష్మాండ" పూజ చేయించుకుని గుమ్మానికి కట్టుకోవాలి సర్వేజనా: సుఖినోభవంతు జై శ్రీమన్నారాయణ.
★5 వ రోజు - భగవంతుని ఐదో స్థానం - అర్చా స్వరూపం★

ఆండాళ్ తిరువడిగలే శరణం

#పాశురము
మాయనై మన్ను వడమదురై మైందనై

తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై

ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై

తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై

తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవి త్తొళుదు

వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క

పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం

తీయనిల్ తూశాగుం శేప్పేలోర్ ఎమ్బావాయ్

చాలా అందమైనది- అందాలకు మూలకందం అనాలంటే సంస్కృతంలో దాన్ని కృష్-ణ అంటారు. కృష్ అంటే చాలా, ణ అంటే అనందం. ఆనందింపచేయుతత్వము ఐతే రామ-రమయతి అని అంటారు. కృష్ణ అనగానే ఒక మనిషి అనుకోకూడదు, అది ఒక తత్వం అని జ్ఞాపకం పెట్టుకోవాలి. అర్జునుడూ అలాగే అనుకున్నాడు, కృష్ణుడి విశ్వరూపం చూసాకే అర్థం అయ్యింది ఆయనంటే ఏమిటో. అంతటావ్యాపించిన ఈ తత్వం మనకోసం మనం ఏర్పర్చిన రూపాన్ని, మనం పెట్టిన పేరుని తనదిగా చేసుకోగలదు. ఆ ఏదురుగుండా కనిపించేదాన్ని మనం విశ్వసించగలిగితే చాలు. ఇదే కృష్ణుడు ఇదే తత్వం అని గుర్తించు, అప్పుడు మనకు ఓయ్ అని పలుకుతుంది. అది గుర్తించక పోతే మనం ఎక్కడికి వెళ్ళినా వృదాయే. ఈ గుర్తింపు కలిగితే చాలు, మనం ఉన్నచోటే చాలు. అందుకే "నివృత్తరాగస్య గృహం తపోవనం" నీ లోపల అహంకారం తగ్గితే బాహిరమైన వస్తువుల తత్వం తెలిస్తే అప్పుడు గృహమే ఒక తపోవనం అవుతుంది. నీ జీవితమే ఒక తపస్సు అవుతుంది. ఇలా ఇంటిలో చూడటానికి వీలయ్యేట్టుగా ఒక రూపం పెట్టుకో, ఆ రూపం నీ దృష్టిని ఆకర్షించేట్టుగా ఉండాలి, నీకు భయం కల్గించనట్లుగా ఉండాలి. ఇలా మనం తయారుచేసి దానికి ఒక రూపం పేరు ఇచ్చి ఒక విశ్వాసంతో ఆ పేరుని పలకడం నేర్చుకుంటేచాలు. ఆ విష్వాసం చాలు, పూజకు నిభందనలు ఏమి లేవు. అచంచలమైన విశ్వాసంతో నిశ్కల్మషమైన ప్రేమతో మనం ఏమి పలికినా అవి మంత్రాలే అవుతాయి. ఆయనా ప్రేమతోనే స్వీకరిస్తాడు. ఏమి చేసినా అది ఆరాధనే అవుతుంది. నీ ఇంట్లో విగ్రహంలోనే విశ్వాన్నంతటా నడిపే తత్వం ఉందని గమనించు చాలు. దీన్ని విశ్వసిస్తే చాలు. ఆధునిక అణువిజ్ఞానం కూడా ఇంత చిన్న అణువులో ఎంతో శక్తి ఉందని చెబుతుంది. అదేదో జ్ఞానం లేనిది కాదు అంతటా వ్యాపించి ఉంది- దాన్నే మనం నారాయణ అని పేరు పెట్టుకున్నాం. దాని గుణాలను మనం శాస్త్రంల ద్వార గుర్తించగల్గుతున్నాం. అంతటా ఉండే ఆ తత్వం ఈ విగ్రహంలోనూ ఉంది, సందేహం అవసరం లేదు అని మన ఆండాళ్ తల్లి తెలియజేస్తుంది ఈరోజు పాటలో. రెండో ఆధ్యాయంలో పరమాత్మ ఇదే చెప్పాడు- "సమ్షయాత్మా వినష్యతి". ఏ రంగమైనా ముందుకు పోవడానికి సరి అయిన నిర్ణయం తీసుకో, అడుగు ముందుకు వెయ్యి, సంషయం అవసరం లేదు. దాన్నే అండాళ్ తల్లి అందమైన పాటలో గోపికల కథగా అందించింది.



ఆండాళ్ తల్లి వ్రతం చేద్దామని బయలుదేరింది. చుట్టూ గోపీ జనం అంతా చేరారు.మొదటి రోజు మనమంతా ధనుర్మాస వ్రతం చేస్తున్నమని తెలియజేసింది. రెండో రోజు వ్రతానికి కావల్సిన నియమాలేమిటో తెలియ జేసింది. మూడో రోజు వ్రతం ఆచరిస్తే కలిగే లోక క్షేమం గురించి వివరించింది. నాలుగో రోజు ఇలాంటి మంచి మనస్సుతో చేస్తె మనకు దేవతలతో సహా లోకంలోని వారంతా తోర్పడుతారు అని తెలియజేసింది. ఇకవారంతా శ్రీకృష్ణుడికోసం బయలుదేరుతుండగా కొందరికి సందేహం వచ్చింది. ఇది లోకం మొత్తం క్షేమం కోసం చేసే వ్రతం కదా, ఏమైనా ఆటంకాలు వస్తాయేమో అని సంషయం వ్యక్తం చేసింది ఒక గోపిక. నీకా సంషయం ఎందుకు వచ్చిందని ఆండాళ్ తల్లి అడిగింది, ఆ గోపిక చాలా పురాణాలు చదివినట్లు ఉంది- అందుకు ఆమె, రామాయణంలో శ్రీరాముడి పట్టాభిషేకం అని దశరతుడు ఏర్పాటు చేయగా అదే సమయానికి వనవాసం ప్రాప్తించింది కదా! మరి మంచి పనులకు అడ్డులు కూడా అలాగే ఉంటాయికదా అని సంషయాన్ని తెలిపింది. అంతలో మరో గోపిక లేచి తన సంషయాన్ని తెలియజేసింది. ఈ గోపిక కావ్యాలు చదివినట్లు ఉంది, ఒక కావ్యంలోని వర్ణణ గురించి చెపుతూ- ఒక తుమ్మెద ఒక పద్మం పై వాలిందట, మధువును పానం చేసేసరికి మత్తుతో నిద్ర పోయిందట. సాయంకాలం కాగానే పద్మం ముకుళించుకుపోయిందట, లేచి చూడగానే బయటకు వెల్లడానికి మార్గంలేదని తెలిసి ఉదయం కాగానే పద్మం వికసిస్తుంది ఒక నేను వెళ్ళిపోవచ్చనే ఆశతో రాత్రంతా ఎదురుచూసిందట. అంతలోనే ఒక మదపు టేనుగు స్నానం కోసం ఈ పద్మాన్ని లాగి గట్టుపైకి విసిరికొట్టింది. తుమ్మెద అలాగే ప్రాణం కోల్పోయిందట. ఆశలెన్నో పెట్టుకుంటాం కాని నెరవేరుతాయా అని సంషయాన్ని తెలిపింది. మరొక గోపిక కాస్త వేదాంతం చదివినట్లు ఉంది- ఆమె లేచి మనం చేసిన కర్మలు మన శరీరం పైనే రాసి ఉంటాయి అంటారు కదా! వాటిని మనం అనుభవించక తప్పదు కదా! మరి మనం ఎట్లాంటి కర్మలు చేసామో ఏమిటో మనం విజయం సాదిస్తామో లెదో అని సంషయాన్ని తెలియ జేసింది.

ఇలాంటి సంషయాలన్నిటికి సమాదానం ఇస్తుంది ఆండాళ్ తల్లి ఈరోజు పాటలో. మనం చేసే కర్మలచే పుణ్య-పాపాలు భగవంతుడు నిర్ణయిస్తాడు. మనం చేసే చిన్ని విషయం కూడా ఆయనకు తెలియకుండా ఉండదు- అందుకే ఆయననను సర్వజ్ఞుడు-సర్వవేత్త అంటారు. ఆయా కర్మలకు తగిన ఫలాన్నిచ్చే శక్తి కూడా కలిగి ఉంటాడు. అందుకే మన పెద్దలు మన సంకల్పంలో కాని, మాటలలో కాని, చేతలలో కాని చెడు రానివ్వోద్దన
్నారు. ఇలాంటి ఒక సంస్కారం ఏర్పరిచారు మన ఋషులు. మనం అనుభవించేవన్నీ మనం ఒకప్పుడు చేసినవే. ఇప్పుడు వచ్చిన త్రేనుపుతో మనం నిన్న తిన్న తిండిని గుర్తించగలం కదా. ఇక మనం ఏమిచేయాలో ఎలా ఉండాలో ఒక శాస్త్రాన్ని ఇచ్చాడు. భగవంతుడికి మనపై కల్గిన ప్రేమనే పుణ్యం అంటారు, మనపై కల్గిన కోపమే పాపము అంటారు. వీటన్నిటినుండి బయటపడే ఒక సులభమైన మార్గాన్ని ఆండాళ్ తల్లి చెబుతుంది. మనం చేసుకునే కర్మలు మూడు రకాలుగా ఉంటాయి, అవి సంచితములు-ఆగామి-ప్రారబ్దం అని అంటారు. ఇదివరకు మనం చేసుకున్నవాటిని సంచితములని, ఇప్పుడీ శరీరంగా అనుభవిస్తున్నవాటిని ప్రారబ్దం అని, ఇప్పుడు చేస్తున్నవి భవిష్యత్తిలో అనుభవించేవి కనుక వాటిని ఆగామి అని అంటారు. మనం కావాలని అనుకుంటే సంచితాలను-ఆగామిని తీసివేయవచ్చు కాని ప్రారబ్దం మాత్రం ఉంటుంది. భగవంతునికి శరణాగతి చేస్తే ప్రాచీన కర్మలను తుడిచివేస్తాడు, ఇకపై మనం చేసే కర్మలు మంచిగా ఉండటం చే ఆగామి దూరం అవుతుంది. మరి ఈ కర్మలన్నీ ఎక్కడో ఒక దగ్గర అనుభవించాలి కదా, మరి అవి ఎక్కడికి పోతాయని ఒక గోపిక అడిగింది. ఇది మనం అందరం తెలుసుకోవాలి. భగవంతుడు మన పై ఉండే పాపాలను మనల్ని ద్వేషించే వారికి పుణ్యాలను మనల్ని ప్రేమించే వారికి పంచి మనల్ని స్వీకరిస్తాడు. ఇక ప్రారబ్దం కుడా నిర్వీర్యం కావాలంటే - మనం భగవంతునికి చెందిన వాడను- నేను చేసేది వాడి సేవ - వాడికోసం చేస్తునాను ఇలాంటి భావన చాలు. మనకు అందిన నామంతో ఆయన పేరు పలుకు చాలు ప్రారబ్దం కూడా అంటదు. దీన్నే ఉజ్జీవించి బ్రతకటం అంటారు. ఆయన నామాన్ని పాడుదాం రండి అని ఆండాళ్ తల్లి చెబుతుంది.

"మాయనై మన్ను వడమదురై మైందనై" - చిత్ర విచిత్ర మైన ఆశ్చర్యకరమైన కళ్యాణ గుణములు శక్తి విశేషములు కల్గి ఉన్నవాడు. అలాంటి వాడు మధురానగరానికి దిగివచ్చాడు. "తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై" మరి పెరగటమేమో యమునానది ఆవల ఉన్న గోకులంలో. పుట్టగానే మరి రాత్రికి రాత్రి యమునానది దాటడం, ఇది ఒక రహస్యం. దీన్ని ఆండాళ్ పదిహెనవ పాటలో చెబుతుంది. యమునానది సూర్యుని పుత్రిక, యముడి సోదరి. మరి శ్రీకృష్ణుడికి దారి ఎందుకు ఇచ్చింది. మరి కృష్ణుడు ఆ యమునా నది ఒడ్డుననే తిరిగేవాడు. నీటికోసమై వచ్చే గోపికల కోసం వేచి ఉండేవాడు. "ఆయర్ కులత్తినిల్ తోన్ఱుం అణి విళక్కై" గోకులమ్లో మరి వెలిగించనక్కరలేని మణిదీపం వెలుతురువలె పెరుగుతున్నాడు పరమాత్మ. "తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై" మరి ఎలా ఉంటాడు ఆయన అంటే, తల్లి రోటికి కట్టివేస్తే ఏమి చేతకాని వాడిలా పడి ఉంటాడు- అందుకే ఆయనను దామోదరుడు అంటారు. దామ- ఉదరుడు అయ్యాడు, మన దగ్గర కూడా అలాగే ఉంటాడు విగ్రహ రూపంలో.

అక్కడ తల్లి ప్రేమతో లోంగబడి ఉన్నాడు, మన జ్ఞానంతో మన దగ్గర ఆయన విగ్రహంలో లొంగి ఉన్నాడు. ఆధ్యాత్మిక పిపాస కల్గిన వ్యక్తికి భగవతత్వాన్ని ఎక్కడ సేవించాలంటే విగ్రహమే ఒక మంచి మార్గం. ఆండాళ్ తల్లి శ్రీవెల్లిపుత్తూరులో జన్మించి అక్కడి వటపత్రశాయిని కోలిచింది, శ్రీరంగనాథున్ని చేరింది, సుందరబాహు స్వామికి మొక్కుబడి చేసింది, వేంకటాచలపతిని ఆరాధించింది. అంతా విగ్రహరూపంలో ఉన్నవారినే కోలిచింది, భగవంతునికోసం ఎక్కడికని పరుగులు పెట్టలా! విగ్రహ రూపాన్నే పరిపూర్ణంగా నమ్మింది. మనకూ ఆ విశ్వాసపూర్ణత కలగాలి. తాను ఆర్జించినది మనమూ పొందాలని తిరుప్పావైని మనకు అందించింది. "తూయోమాయ్ వందు " దీనికి మనం పరిశుద్దం కావాలి. అది ఎలా అంటే భగవంతుని తత్వాన్ని గుర్తిస్తే మానసిక పరిశుద్ది ఏర్పడుతుంది. "నాం తూమలర్ తూవి త్తొళుదు" పరిశుద్దమైన హృదయం అనే పుష్పాన్ని ఆయనపై విసిరితే చాలు. చేతులు ఒక్కసారి జోడిస్తే చాలు. ఇలా చేతులు జోడించటాన్ని అంజలి అంటారు. అన్-జలయతి అంటే ఆయనను జలంలా కరిగేట్టు చేస్తుంది. "వాయినాల్ పాడి" నోరు ఉంది కనక ఆయన నామాన్ని పాడుదాం చాలు. "మనత్తినాల్ శిదిక్క" మనస్సు ఉంది కనక ఆయన గుణములని స్మరించుదాం. "పోయ పిళైయుం " మనం గతంలోచేసిన సంచితములైన పాపాలన్నీ పోతాయి "పుగుదురువాన్ రిన్ఱనవుమ్" ఇక రాబోయే ఆగామి "తీయనిల్ తూశగుం " మనకు అంటకుండా ఉంటుంది "శేప్ప్" ఆయన నామాల్ని చెప్పు. ఈపాటలో ఆండాళ్ మాయానై, మన్నువడ మదురై, దామోదర అని ఇలా కొన్ని నామాల్ని తెలిపింది.

ఆగమములు చెప్పినదేమిటి

పూర్ణమిదం పూర్ణ మద: పూర్ణాత్ పూర్ణముదచ్యతే|
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే ||

ఇది శుక్లయజుర్వేద శాంతి మంత్రం. అదేం తెలుపుతుందో తెలుసుకుందాం. పూర్ణం అనగానే ముందుగా మనకు దేనితో నిండి ఉన్నదని ప్రశ్న వస్తుంది. పూర్ణం అనగా అన్నీ నిండుగా కలదని అర్థం. అంటే స్వరూపం, గుణం, దయ ఇత్యాదులు అన్నీ నిండుగా కలది అనవచ్చు. మరి ఏమిటా పూర్ణం, ఎక్కడ లభిస్తుంది? ఈ మత్రం దానికి సమాధానం ఇస్తుంది. "పూర్ణమిదమ్"- ఇదం అంటే చాలాదగ్గరగా ఉంటుంది, నీ లోపలోనే. దీన్నే మనం అంతర్యామి స్వరూపం అంటాం. కాని మనకు తెలియట్లేదు కదా!. "పూర్ణ మద:"- అద: అంటే అంతటా వ్యాపించి ఉంది. అదీ పూర్ణమే. లాభం లేదు గుర్తించటం కష్టం. మరి ఏం చేస్తుంది ఈ పూర్ణం. "పూర్ణాత్ పూర్ణముదచ్యతే"- ఆ పూర్ణమే ఒక చోటకు చేరి ఉంటుంది- అదీ పూర్
ణమే. సృష్టి,స్తితి,లయ కార్యాలు చేయటానికి వ్యూహ స్తానంలో ఉంటుంది. అదీ పూర్ణ రూపమే, కానీ మనం చూడలేం కదా. "పూర్ణస్య పూర్ణమాదాయ" ఆయా అవసరాలను బట్టి ఆపూర్ణం లోనుంచి మరో పూర్ణం మన వద్దకు దిగి వస్తుంది- అదీ పూర్ణమే. వీటినే అవతరాలు అంటారు. ఇవి కాలానుగుణం బట్టి వచ్చేవికదా మనం ఇప్పుడు చూడలేం కదా, ఎలాగా? "పూర్ణమేవా వశిష్యతే"- ఆయా అవతారాలలో వచ్చినప్పుడు ఆయా గూణాలను బట్టి మనం ఏర్పాటుచేసుకొన్న విగ్రహం కూడా ఒక పూర్ణమే. అందుకే మనం ఆరాధించే విగ్రహం ఒక సంపూర్ణమైనదే అని ఒక విశ్వాసం ఏర్పడాలి.

ఈ స్వరూపాలన్నన్నింటినీ ఆండాళ్ తల్లి ఒక్కోక్క పాటగా మనకు అందించింది. అందుకే తిరుప్పావైని వేదాల సారం అంటారు.
★6 వ రోజు - స్థిత ప్రజ్ఞుల దశ★

ఆండాళ్ తిరువడిగలే శరణం

#పాశురము
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్
వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో
పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు
కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం
మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం
ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావాయ్

ఈ రోజు నుండి మన ఆండాళ్ తల్లి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క గోపబాలికలను లేపడం ప్రారంభిస్తుంది. మనకో సందేహం రావచ్చు. శ్రీకృష్ణ ప్రేమ అందరికీ సమానమైనప్పుడు కొందరికేమో నిద్ర పట్టడంలేదు, వెంటనే శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తుంటే మరి కొందరెలా నిద్ర పోతున్నారని మనకు అనిపించవచ్చు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. భగవంతుని గుణాలు, ప్రేమ అనేవి ఒక మత్తు మందులాంటివి. అలాగే భగవంతుని గుణాలు ఒక్కొక్కరిపై ఒక్కోలా పనిచేసి కొందరికి నిద్రమత్తులో ఉంచేట్టు చేసాయే తప్ప వారికి శ్రీకృష్ణ ప్రేమ తక్కువని కాదు అని గమనించాలి. పైగా వారు సాత్విక నిద్రలో ఉన్నారు, మన నిద్ర లాంటి తామసిక నిద్ర కాదు అని గుర్తించాలి.

శ్రీకృష్ణ పరమాత్మ రేండో అధ్యాయమంలో స్థితప్రజ్ఞుల గురించి చెప్పాడు. వారు ఎలా ఉంటారంటే అందరూ మేల్కొనే వద్ద వాల్లు పడుకొని ఉంటారు, అందరు పడుకొనే వద్ద వాల్లు మెలుకువగా ఉంటారు. సామన్యులు శారీరక సుఖాలలో మెలుకువై ఉంటారు. మరి ఏ జ్ఞానం లేకుండా ఉన్నది దేనిలో అంటే లోపల ఉండే మన విషయంలో, వెనకల ఉండి నడిపే వాడి విషయంలో జ్ఞానం శూన్యం. ప్రాపంచిక విషయాల్లో చాలా జ్ఞానం కల్గి ఉంటారు. మరి జ్ఞాణులేమో ప్రాపంచిక విషయాలు అంతగా పట్టించుకోకుండా, భగవంతుని విషయంలో జాగరూపులై ఉంటారు. ఆలోపల ఉండే గోపికలూ అట్లాంటివారే. అందుకే మనం వాళ్ళను మన తోడుపెట్టుకొని భగవంతుని దగ్గరకు వెలితే తప్ప భగవంతుడు మనకేసి చూడడు. అలా భగవంతుని విషయంలో నిమగ్ఞమై ఉన్న ఒక పది మంది గోపికలను లేపుతూ భగవత్ జ్ఞాన దషల్లోని ఒక్కొక్క స్థితిని మనకు చూపిస్తూ మన ఆండాళ్ తల్లి మనకున్న పొరల్ని తొలగిస్తుంది. అప్పుడు మనకు భగవంతుని అనుగ్రహాన్ని పొందే యోగ్యత సంప్రాప్తిస్తుంది.

ఈ రోజు లేపే గోపబాలిక ఒక చిన్ని పిల్ల. చిన్నపిల్లలు మనసులో చేతల్లో ఒకేరకమైన భావం కల్గి ఉంటారు. అలాంటి ఒక గోపబాలికను లేపుతూ "పుళ్ళుం శిలమ్బిన కాణ్ " పక్షులు అరుస్తున్నాయ్ లేవవోయ్. భౌతిక జీవితంలోనైనా అంతరమైన జ్ఞాన జీవితంలోనైన పక్షుల అరుపులే మనల్ని రక్షించేవి. అంటే రెండు రెక్కల పక్షులు మనకు తెల్లవారడాన్ని సూచించినట్లే, జ్ఞానము దానికి ఉచితమైన ఆచరణ అనే రెండు రెక్కలతో ఆకాశము అంటే అంతటా వ్యాపించి ఉన్న భగవతత్వములో విహరించే మహానుభావుల పలుకులు, మనల్ని అజ్ఞానములోంచి బయటకు తెచ్చే పక్షుల అరుపులు అవే. అందుకే మనవాల్లు ఒక గుర్తుగా చెప్పారు.

లోపల గోపబాలిక వీళ్ళు చేసే అల్లరికి పక్షులు లేచి ఉంటాయి అని భావించినట్లుంది, మనవాళ్ళు రెండో గుర్తు చెప్పడం ప్రారంభించారు "పుళ్ళరైయన్ కోయిల్ వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో పిళ్ళాయ్! " ఆ ఊరిలో ఉండే పక్షిరాజు అయిన గరుత్మంతుని స్వామి - విష్ణు ఆలయంలో తెల్లని పిలుపు శంఖం ద్వని కుడా వినిపించడం లేదా ఓ చిన్నపిల్లా అని అంటుంది. అక్కడి దీప కాంతి శంఖం ఊదే వాడి బుగ్గలపై పడి శంఖం మెరుస్తుందని అండాళ్ తల్లి ఆలయ సన్నివేశాన్ని భావిస్తూ - తెల్లని పిలుపు శంఖం అని వర్ణిస్తుంది. శంఖం ఓంకారానికి సంకేతంగా పోలుస్తారు. లోపలుండే గోపబాలిక అది జాము జాముకు వినిపించే ధ్వని ఇంకా తెల్లవారలేదన్నట్లుగా భావించి ఇంకా నిద్ర లేవలేదు. "ఎళుందిరాయ్"- మేలుకో. మరి అండాళ్ తల్లి తాను ఎలా మేలుకొందో కొన్ని గుర్తులు చెబుతుంది. "మునివర్గ ళుం యోగిగళుం మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం ఉళ్ళం పుగుందు కుళిరుంద్" ముణులూ,యోగులూ మెల్లగా లేస్తూ శ్రీకృష్ణ పరమాత్మను తలుస్తూ హరి-హరి-హరి అంటూ అనుకునే శబ్దం ఒక్కసారిగా పెద్దగావినిపించి మా చెవులను చేరి ఒక్కసారిగా లేచాం, నీకు వినబడలేడా! మరి వాల్లు మూడు సార్లు హరినామం ఎందుకు అన్నారో అండాళ్ తల్లి వివరిస్తుంది.

"పేయ్ములై నంజుండు" పూతన స్తనాలకు అంటి ఉన్న విషాన్ని ఆరగించాడు- దూదిపింజ నిప్పుపై పడి కాలిపోయినట్లు ఆమెను సంహరించాడు - వదలని వాడు కాబట్టే ఆయనను అచ్యుత అని అంటారు. ప్రకృతి మనకు ఇచ్చే "ఆహం-మన" అనే విషాలను హరించేవాడా - హరి అని జ్ఞానులు తలుస్తున్నారు.

"కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి" శ్రీ కృష్ణుని తల్లి యశోదమ్మ ఒక బండి క్రింద పడుకోబెట్టింది, ఒక అసురుడు బండిపై ఆవహించి శ్రీ కృష్ణుని సంహరించాటానికి చూసాడు. కపట శకటాసురున్ని కాలుజాచి సంహరించాడు. ఆయన పాదం అలాంటిది. ఈ శరీరం మనకు ఒక శకటం లాంటిది, పుణ్య-పాపాలు దాని చక్రాలవంటివి, మనల్ని నడిపించే పరమాత్మను దానిక్రింద పెట్టి ఆయన పాదాలను- చరణౌ శరణం ప్రపద్యే అంటే చాలు- మనకు అంటి ఉన్న పుణ్య-పాప సంపర్కాన్ని హరించువాడా - హరి.

"వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై ఉళ్ళత్తు క్కొండు" - ఆదిశేషువుపై సుకుమారంగా పవళించి ఉన్న జగత్తుకు బీజమైన స్వ
ామి. అయిదు తలల ఆదిశేషువు - అయిదు రకాల జ్ఞానములను తెలియ జేస్తుంది. నేను వాడికి చెందిన వాన్ని, వాడు నన్ను తరింపచేయువాడు, వాన్ని చేరే సాధనం వాడి శరణాగతే, వాన్ని చేరితే కలిగే ఫలితం వాని సేవ, వాన్ని చేరకుండా ఉంచే ఆటకం వానియందు రుచిలేకుండుట అనే అయిదు జ్ఞానాలు కల్గి ఉండే వారి హృదయాల్లో ఉంటాడు స్వామి. ఇతరమైన వాటిపై రుచి హరింపచేసినవాడా- హరి. అంటూ మూడు సార్లు హరి అని పిలుస్తుంటే లేచామని తెలుపుతూ అండాళ్ తల్లి గోప బాలికను లేపింది.
December 27, 2019

 గాడ్జెట్ వ్యసనాన్ని అధిగమించండి

మీరు ప్రతి 10 నిమిషాలకు మీ ఫోన్‌ను తనిఖీ చేస్తారా? మరియు మీ ఫోన్ బ్యాటరీ 20 శాతానికి పడిపోయినప్పుడు మీరు భయపడుతున్నారా? భోజన సమయంలో మొబైల్ లేదా టీవీ స్క్రీన్‌లను చూడటం మానేయలేదా? మరియు మీరు మీ కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు ఇమెయిల్‌లను తనిఖీ చేయడాన్ని ఆపలేరా? గాడ్జెట్‌లను ఉపయోగించడం నుండి వాటిని దుర్వినియోగం చేయడం వరకు, గాడ్జెట్ వ్యసనం మన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని మరియు సంబంధాలను దెబ్బతీస్తుంది. స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడం వల్ల మీ సమయం మరియు శక్తి ఆదా అవుతుంది.


ప్రతిరోజూ మిమ్మల్ని గుర్తు చేసుకోండి - నేను శక్తివంతమైన జీవిని. నేను నా గాడ్జెట్‌లను వాటి ప్రయోజనం కోసం ఉపయోగిస్తాను, నేను వాటిలో దేనికీ బానిసను కాను. నేను టెక్నాలజీతో నా సమయాన్ని పరిమితం చేస్తున్నాను. నా గాడ్జెట్లు నా సమయం, శక్తి లేదా అలవాట్లను నియంత్రించవు.


 మీ గాడ్జెట్లు మీ జీవితంలో భారీ భాగం అవుతున్నాయా? డిజిటల్ స్క్రీన్ చూడటం యొక్క అదనపు గంటలు వ్యసనంగా మారవచ్చు. ఇవన్నీ కోరుకునే సంకేతాలతో మొదలవుతాయి - ప్రతి వార్తలను చదవడం, మరొక క్రికెట్ మ్యాచ్ చూడటం, మనం తప్పిపోయిన ఒక టీవీ షో యొక్క ఎపిసోడ్లను తెలుసుకోవడం మరియు మొదలైనవి… ఆలోచనలు చర్యకు దారితీస్తాయి, అలవాటుకు చర్య, మరియు అలవాటు వ్యసనంగా మారుతుంది . మీ స్క్రీన్ సమయాన్ని నిర్ణయించండి మరియు అది అలవాటు అయ్యే వరకు ఆ షెడ్యూల్‌కు కట్టుబడి ఉండండి. మీ ఉద్దేశాలను సమర్ధించే మీ సంకల్ప శక్తి మరియు క్రమశిక్షణ గాడ్జెట్ వ్యసనాన్ని అంతం చేస్తుంది. గాడ్జెట్ల ద్వారా ఇతరుల జీవితాలను చూడటానికి బదులుగా, మీ స్వంత జీవితంతో మరింత ఉత్పాదకంగా ఉండండి. మీ గాడ్జెట్లు మరియు సాంకేతికతతో ఆరోగ్యకరమైన మార్గాల్లో సంబంధం ప్రారంభించండి. మీ కంప్యూటర్, ఫోన్ మరియు టీవీ మీ జీవితాన్ని సౌకర్యవంతంగా చేశాయి. వాటిలో మాస్టర్ అవ్వండి మరియు మీ గాడ్జెట్‌లను మీ సాధనంగా చేసుకోండి. మీ గాడ్జెట్‌లకు బానిస అవ్వకండి. మీ గాడ్జెట్లు మీ మనస్సును నియంత్రించలేదని నిర్ధారించుకోండి, అవి మిమ్మల్ని సంతోషపెట్టవు లేదా బాధపడవు. వారి ప్రయోజనాన్ని మెచ్చుకోండి, వాటిని ఉపయోగించడం ఆనందించండి, అవసరమైనప్పుడు వాటికి కనెక్ట్ అవ్వండి మరియు అసౌకర్యంగా అనిపించకుండా డిస్‌కనెక్ట్ చేయండి. మీరు వాటిని ఏ కారణం చేతనైనా ఉపయోగించలేకపోతే బాధపడకండి. రోజుకు x గంటలు మాత్రమే టీవీ చూడండి, అవసరమైనప్పుడు మాత్రమే మీ కంప్యూటర్‌ను వాడండి, అవసరమైనప్పుడు మాత్రమే ఫోన్ చేయండి, క్రొత్త సందేశాల కోసం తనిఖీ చేయవద్దు, మీడియా మరియు సోషల్ మీడియాలో ప్రతిదీ చదవవద్దు లేదా చూడవద్దు. మీ మనసు ఆరోగ్యం జాగ్రత్త. గాడ్జెట్ వ్యసనాన్ని అధిగమించండి
★7 వ రోజు - భగవంతుణ్ణి సేవించటం కంటే భగవత్ భక్తి నిండి ఉన్న మహనీయుడిని సేవించటమే ఉత్తమము★

ఆండాళ్ తిరువడిగలే శరణం

#పాశురము

కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు
పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే
కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు
వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్ మత్తినాల్
ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో
నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి
కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్


"కీశు కీశ్ ఎన్ఱ్" పక్షులు మాట్లాడుతున్నాయి. "కలందు పేశిన పేచ్చరవం కేట్టిలైయో" పక్షులు వాటి ఆహారంకోసం వెల్లడానికి ఒకదానితో ఒకటి కలిసి ఎడబాస్తున్నామే అని బాధతో మట్లాడుతున్నాయి. నీకు వినబడట్లేదా. కేవలం మేం నిలుచున్న చెట్టుమీది పక్షులేకాదు, "ఎంగుం" అన్ని చెట్లమీది పక్షులూ అరుస్తున్నాయి, అంటూ అండాళ్ తల్లి "ఆనైచ్చాత్తన్" భరద్వాజ పక్షి గురించి చెబుతుంది.

ఈ పక్షులు కేరళ తమిళనాటి తీర ప్రాంతాల్లో ఉంటాయి, చిలుకలవలె మాట్లాడగల పక్షులు. ఇక్కడ భరద్వాజ ఋషిని గుర్తు చేస్తుంది అండాళ్ తల్లి. రాముడు వనవాసానికి వెల్లి నప్పుడు ఒక రోజు భరద్వాజ ఆశ్రయంలో ఉండి వెళ్తాడు. తరువాత భరతుడు రాముణ్ణి వెతుకుతూ ఆ ఆశ్రమానికి వస్తాడు. అప్పుడు భరద్వాజుడు భరతునికి ఉన్న రామ భక్తి ని పరిక్షిస్తాడు. ఏపాపం చేయని రాముణ్ణి ఏంచేయాలని బయలుదేరావని ప్రశ్నించాడు. దానికి భరతుడు నీవు త్రికాలజ్ఞుడివి నీకు కూడా తెలియదా నా అంతర్యం అని విలవిలా ఏడిచాడు. భరద్వాజుడు తన తపో సంపద అంతా పెట్టి అన్ని విళాసాలు కల్గి ఉన్న ఒక నగరాన్ని సృష్టించాడు. అందులో ఒక సభ ఏర్పాటు చేసాడు. భరతుణ్ణి రాజు సింహాసనంపై కూర్చోమన్నాడు. రాముడు కూర్చోవాల్సిన రాజ సింహాసనం వైపు వింజామరం ఊపుతూ, భరతుడు వెళ్ళి మంత్రి కూర్చునే ఆసనం పై కూర్చున్నాడు. అప్పుడు భరద్వాజునికి భరతునిపై నమ్మకం కల్గింది. అప్పుడు భరద్వాజుడు భరతునితో నాకున్న తపస్సంపద అంతా వినియోగించానయ్యా సార్తకమైంది అని చెప్పాడు. భరద్వాజుడు ఒక్క పురుష ఆయిస్సు వేద అద్యయణం కాగానే తనకు ఇంకొక పురుష ఆయిస్సు కావాలంటూ తపస్సు చేయటం ప్రారంభించాడు. ప్రజాపతి ప్రత్యక్షమై మరొక పురుష ఆయస్సు భరద్వాజునికి పెంచాడు. మాళ్ళీ వేద అద్యయణం చేసి అదీ సరిపోనట్లనిపించింది, మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. అలా మూడు పురుష ఆయిస్సులు పూర్తయ్యాక మళ్ళీ ఆయనకు ఏం సరిపోనట్లు అనిపించి చింతించసాగాడు, ఈ సారి ప్రజాపతి తానంతట వచ్చి, ఎం కావాలి అని అడిగాడు. మరొక్క పురుష ఆయిస్సు అని అడిగాడు, అయితే ప్రజాపతి ఆయననకు ఒక్క సారి కళ్ళల్లో మూడు పర్వతాలు ఆ పై మూడు పిడికెడులు కనిపించజేసాడు. భరద్వాజుడితో నీవు చదివింది ఆ వేదంలోని కేవలం మూడు పిడికెడులు మాత్రమే, ఇక చదివింది చాలు దాన్ని ఆచరించు అని చెప్పాడు. కాబట్టి ఆయనకు తెలిసింది రామభక్తుని సేవ. భగవంతుణ్ణి సేవించటం కంటే భగవత్ భక్తి నిండి ఉన్న మహనీయుడిని సేవించటమే ఉత్తమము అని భరద్వాజ సంహితలో ఈ సూక్తిని ఆయన రాసి పెట్టాడు. అందుకే భరద్వాజుడు మూడు పురుషాయిష్యులలో సంపాదించిన తపస్సంపద అంతా భగవత్ భక్తి కల్గిన మహనీయునికై వినియోగించాడు. ఆండాళ్ తల్లి అలాంటి పేరు కల్గి ఉన్న పక్షిని చెబుతుంది అంటే అంతర్యం నీవు భగవతుణ్ణి మాత్రమే తలుస్తున్నావు, భగవత్ భక్తులతో కలవడంలేదు "పేయ్ ప్పెణ్ణే" పిచ్చిదానా అని లోపల ఉన్న గోప బాలికను అంటుంది.

గోకులంలో గోపికలకు నిత్యకర్మ పెరుగులు చిలకడం, అది వారు భగవత్ ఆరాధనగా భావించి చేసేవారు. దానికి వారు స్నానం ఆచరించి, పువ్వులు దరించి ఇవన్నీ భగవత్ సేవ అని భావిస్తూ చేసేవారు. అక్కడి గోవులు కృష్ణ కర స్పర్శచే పెరిగినవి కావటంచే అవిచ్చే పాలు అంత చిక్కనివి, ఇక పెరుగు ఇంకా చిక్కగా ఉండేది, వీళ్ళకు పెరుగు చిలకడం కష్టంగా ఉండేది, ఇక కృష్ణ నామ స్మరణ చేస్తూ చేసేవాళ్ళు. వాళ్ళు పాలు కాచినా, పెరుగు చిలికినా, వెన్న దాచినా అన్నీ కృష్ణుడి కోసమే. కృష్ణుడు వెన్న దోంగిలించడం కూడా వారికి ఇష్టమే, ఒక్క రోజు కన్నయ్య వెన్న దోంగిలించకుంటే వారికి భాదగా ఉండేది, వెన్న దాచటం, కృష్ణుడు వెన్న దొంగిలించటం ఇవన్నీ వారికి ఒక సరదా. ఇవి తప్ప వారికి వేరే స్వార్థం కూడా ఏమి ఉండేది కాదు, కృష్ణుడి క్షేమం తప్ప వాళ్ళకంటూ ఏమి కోరేవారు కాదు.

"కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు" గోపికలు వెన్న చిలుకుతుంటే దేహంపై ఉండే ఆభరణాలు గలగలా శబ్దం చేస్తున్నాయి, "వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్" గోపికల జడల్లోని పుష్పాలు రేపల్లె అంతటా పరిమళాన్ని విరజిమ్ముతున్నాయి. "మత్తినాల్ ఓ శై పడుత్త తయిర్ అరవం" కవ్వముతో పెరుగు చిలికే శబ్దం "కేట్టిలైయో" వినబడలేడా. "నాయగ ప్పెణ్ పిళ్ళాయ్!" ఓ పెద్ద నాయకురాలా! నీవు ముందర నడిచి మమ్మల్ని వెంట తీసుకెల్లాల్సినదానివి, హాయిగా నిద్ర పోతున్నావా అంటూ ఆక్షేపించసాగారు.

"నారాయణన్ మూర్ త్తి కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో" పెరుగులు చిలికే గోపికలు స్మరించే శ్రీకృష్ణ నామాలను మేం పాడుతుంటే నీవు హాయిగా నిద్రపోతున్నావేమి అని అడుగుతున్నారు. ఏమిటా నామాలు అంటే "నారాయణ
" సర్వ జగత్తును లోపల పెట్టుకున్న స్వామి, మరి అంతవాడు మనకేం అందుతాడు అనుకోకుండా, మూర్తీభవించిన అందమేనా అన్నట్టుగా ఉన్న చిన్ని రూపంలో వచ్చాడు మనకోసం, అందుకే ఆయన "మూర్తి" మన కోసం ఒకరూపు దాల్చి మన కోసం వచ్చినవాడు.

కేవలం అందమైనవాడేనా! కాదూ, మనం కృష్ణున్ని సేవించుకోవడానికి వచ్చే అడ్డుకూడా ఆయనే తొలగించుకొని తనను మనకు ఇచ్చుకొనేవాడు, "కేశవన్" కేశి అనే గుఱ్ఱం రూపం లో ఉన్న రాక్షసున్ని సంహరించినవాడు. కృష్ణుడు ఆడుకుంటుంటే ఒక అసురుడు గుఱ్ఱంలా వచ్చి నోరు తెరిచాడు, తెరిచిన ఆ నోరులో చేతుపెట్టాడు కృష్ణుడు, చిన్న పిల్లాడు కదా ఆనందంతో ఉబ్బిపోయాడు. ఆయన తగ్గి పోగలడు, ఉబ్బిపోగలడు. తగ్గితే వామనుడయ్యాడు, ఉబ్బిపోతే త్రివిక్రముడయ్యాడు. అలా ఉబ్బిన చేయివల్ల ఆ అసురుడు సంహరింపబడ్డాడు.

అలా మనకు ఉపకారం చేసే వాడి నామాన్ని పాడుతుంటే నీవు వచ్చి మాతో కల్సి పాడొచ్చుకదా. లోపల గోప బాలిక, తను లేచి వస్తే వీళ్ళెక్కడ నామాన్ని పాడటం ఆపేస్తారేమోనని కాబోలు లేవటం లేదు. కానీ ఆమె లోపలనుండి భగవత్ నామ స్మరణ చేయడంచే ఆమెలో ఒక తేజస్సు మన వాళ్ళకి కనిపించింది. "తేశం ఉడైయాయ్" భగవత్ నామ సంకీర్తనచే తేజస్సు కల్గిన దానా "తిఱవ్" రావమ్మా, నీ తేజస్సును మాకూ పంచి ఇవ్వు అని ఆండాళ్ తల్లి పిలుస్తుంది . మనలోని భగవత్ జ్ఞానమే మనకు తేజస్సును కలగ జేస్తుందని గమనించాలి.