కలిగింది. పక్కన ఉన్న రుద్రపార్షదులు కోతిముఖం వాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అన్నారు. నారదుడు వారిద్దరినీ మీరు రాక్షస యోనులయందు జన్మించెదరు గాక అని శపించాడు. మాయా ప్రభావం కామక్రోధముల యందు ఎలా తిప్పుతుందో చూడండి. రుద్రపార్షదులు నారదుని తిరిగి శపించకుండా శివేచ్ఛగా భావించారు. వాళ్ళు మహాజ్ఞానులు. నారదుడు గబగబా వైకుంఠమునకు వెళ్లి “శ్రీమన్నారాయణా! ఎంత పని చేశావు. హరిరూపము యివ్వమని అడిగితే కోతి శిరస్సు పెట్టావు. ఆమెను నాకు కాకుండా చేశావు. నీవు ఒకానొకనాడు నరుడవై పుట్టి అందచందాలు కలిగిన భార్య దూరం అయితే అరణ్యంలో పది ఏడిస్తే, ఈ కోతిముఖం వున్న వాళ్ళే వచ్చి సహాయం చేసి నీ భార్యతో నిన్ను కలుపుతారు. అలా నిన్ను శపిస్తున్నాను’ అన్నాడు. శ్రీమన్నారాయణుడు మహానుభావుడు కనుక ఆ శాపమును కూడా లోకమునకు ధర్మమార్గము నేర్పడానికి రామావతారమునందు సీతావియోగంగా తీసుకున్నారు. ఇప్పుడు నారదుని స్వస్థత కలిగింది. తాను ఏమిటి పొందాను అని ఆలోచించాడు. ఆత్మపరిశీలన చేసుకున్నాడు. మాయ తొలగింది. శ్రీమన్నారాయణుని చూసి
యుక్తాయుక్త విచక్షణ మరచి నేను మాట్లాడిన మాటలకి నా నాలుకను ముక్కలు ముక్కలుగా కత్తిరించెయ్యాలి. గరుత్మంతుడిని నీ ధ్వజమునకు చిహ్నంగా కలవాడా! ఇంకా ఎంత మాత్రము జాగు చెయ్యకుండా నీ చక్రధారల చేత నా నాలుకను కత్తిరించెయ్యి. అప్పుడు కాని నేను చేసిన పాపం పోదు అని కన్నీటి ధారలతో ఆయన పాదములను అభిషేకించి కాళ్ళమీద పడ్డాడు. నారదుడు కాబట్టి మరల అంత తొందరగా స్వస్తితిని పొందగలిగాడు. మనం అయితే మాయలో పడి కొన్ని కోట్ల జన్మలు తిరుగుతూ ఉంటాము. పరిశీలించినట్లయితే రామాయణంలో ఒక రజకుడి మాట సీతా వియోగమునకు కారణం అయింది. అదే రజకుడు మరల ద్వాపర యుగంలో రజకుడిగా వచ్చినపుడు, కృష్ణ భగవానుడు నాలుగు పంచెలు యివ్వమని అడిగాడు. అపుడు ఆ రజకుడు నీకు రాజుగారి బట్టలు కావలసి వచ్చాయా అని గేలిచేసి మాట్లాడాడు. యుగం మారినా వాని బుద్ధి మారలేదు. అపుడు కృష్ణుడు వాని శిరస్సు మీద ఒక గుద్దు గుద్ది వేయిముక్కలు చేశాడు. మీరు ఏ మంచి పని చేసినా ఈశ్వర ప్రజ్ఞకు ముడిపెట్టాలి. ‘నేను’ అనేమాట అంటే మాత్రం యిబ్బందిలోకి వెళ్ళిపోతారు. మొదట మనం మన వాక్కును దిద్దుకోవాలి. నారదుడు కాబట్టి అతి స్వల్పకాలంలో దిద్దుకున్నాడు. మనం ఎంతటి వాళ్ళము. ఇది మహేశ్వర శక్తి. ఆ మాయే అమ్మవారి స్వరూపము. మీరు గట్టిగా అమ్మవారి పాదములను ఆశ్రయిస్తే ఆవిడే మిమ్ములను దగ్గరికి తీసి, మీకు ఈశ్వర భక్తిని ఇచ్చి మీచేత ఈశ్వర సేవ చేయించి, ఈశ్వరుడిలో కలుపుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని తిప్పిన కామపాషములు అమ్మవారి పాదములను ఆశ్రయిస్తే భక్తిపాశములుగా మారిపోతాయి. ఆవిడ మాయాశక్తి, స్వరూపిణి. మాయా పాశమును భక్తి పాశము చేస్తుంది. లోకమునందు పంచతన్మాత్రలను ఈశ్వరుని వైపు తిప్పేసి ఈశ్వరునిలో కలిపేస్తుంది. అది మహేశ్వరుని చేరుకోవడానికి మార్గం. ఆ మార్గమునకు మొట్టమొదటి పొరపాటు వాక్కునందు కలుగుతూ ఉంటుంది. అందుకని మనం ఎప్పుడూ ఈశ్వర ప్రజ్ఞను ఈశ్వరానుగ్రహమును గుర్తెరిగి ప్రవర్తిస్తూ ఉండాలి.
శివ పురాణం – 4
౪. శంభునామ ప్రాశస్త్యము
ఇదే పరమశివుని పక్కనే ‘శంభుః’ అని ఒక చిత్రమయిన నామంతో పిలుస్తారు. ‘శం’ అనగా నిరతిశయమయిన సుఖము. ‘భావయతి’ అనగా కల్పించేవాడు. ఒక వస్తువు మీచేత అనుభవించబడినప్పుడు ఆ వస్తువు సుఖానుభూతిని మీరు పొందగలరు. వస్తువు ఉండడానికి, అది మీ అనుభూతిగా మారడానికి మధ్యలో చాలా తేడా ఉంటుంది. ఈశక్తి మీయందు నిలబెట్టేవాడు ఈశ్వరుడు. ‘ద్రాపే అంధసస్పతే దరిద్రన్నీలలోహిత’ అంటుంది రుద్రాధ్యాయం. సుఖమునకు కావలసిన వస్తువు ఉండడం వేరు, సుఖంగా బ్రతకడం వేరు. ఒకడు కోటీశ్వరుడై ఉండి కూడా మిగిలిపోయిన చద్ది అన్నమును పులిసిపోయిన పెరుగుతో తింటాడు. కేవలం సుఖానుభావం కాదు.
లోకములు మూడు రకాలుగా ఉంటాయి. ఒక లోకము కేవలము సుఖములను అనుభవించడానికి ఉంటుంది. స్వర్గాది లోకములలో దుఃఖస్పర్శ ఉండదు. మరొక లోకం ఉన్నది అక్కడ సుఖమన్నది ఉండదు. అది నరక లోకం. ఈ రెండూ లోకములు కాక సుఖము, దుఃఖము రెండూ ఉన్న లోకం భూలోకం. ఇక్కడి నుండి మానవుడు పూర్ణ దుఃఖము కలిగిన లోకములోకయినా వెళ్ళవచ్చు, లేదా పూర్తీ సుఖము కలిగిన లోకములోకయినా వెళ్ళవచ్చు. లౌకికంగా కోరుకుంటే స్వర్గమును కోరుకోవచ్చు. అక్కడకు వెళ్ళాలంటే పాపము చేయకుండా ఉండాలి. ఇది శంభవ ఇతి – మంచిభావములను ఇచ్చుట. ఇది కలగడం అంత తేలికకాదు. శివ మహాపురాణం మీ జీవితమును సరిదిద్దుతుంది. మనం సాధారణంగా బ్రహ్మ మన లలాటం మీద రాసిన రాత ప్రకారం పనులు చేసేస్తూ ఉంటాము అని ఒక మాట అంటూంటాము. అది తప్పు శాస్త్రం అలా ఉండమని చెప్పలేదు. తిలకధారణం అనేమాట ఎందుకిచ్చారో తెలుసా? మీ ఆలోచనా సరళిని మార్చుకొని గత జన్మలుగా తరుముకు వస్తున్న వాసనలను జయించడానికి మీకు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలగడానికే మీరు విభూతి లలాటమునందు పెట్టుకొని, బొట్టు తీసుకొని ఆజ్ఞాచక్రం మీద పెట్టుకుంటారు. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు మీ లలాటమునందు వసించి ఉన్నారు.
లలాట లిఖితారేఖా పరిమార్తుం నాశక్యతే’ ఇది కదా సామాన్య సిద్ధాంతం

పాపం ఉంది అని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పాపము కంటే నీ పాపం గట్టిది కదా. అటువంటి అప్పుడు నువ్వు నా భర్తను ఎలా లాగుతావు అని అడిగింది. అపుడు ఆవిడ శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే – అమ్మా నేను ఇప్పడు శిఖర దర్శనం చేశాను. మోక్షం రావాలంటే పాపం లేదు, పుణ్యం లేదు. రెండూ సున్నా అయిపోతేనే కదా మోక్షం. ఇపుడు నా ఖాతాలో పాపం లేదు. పుణ్యం లేదు అందుకని లాగుతున్నాను. నేను అర్హురాలను’ అంది. ఈవిడకు విశ్వాసం నిజంగా ఉన్నది ఈవిడకు మోక్షం ఇస్తున్నాను’ అని శివుడు పార్వతికి చెప్పాడు. నంది శృంగములలోంచి చూడడం కాదు. అక్కడ ఉన్నది తన తల్లిదండ్రులని నమ్మిన వాడు ఎవరో వానికి మాత్రమె మోక్షం ఇవ్వబడుతుంది. కాబట్టి శ్రీశైల క్షేత్రంలో అడుగు పెట్టిన వాడికి తాను తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నాననే భావన ఉండాలి. ఈ భావన పరిపుష్టమై మీరు శ్రీశైలం వెడితే మీకు అక్కడ ఎనలేని సౌభాగ్యం కలుగుతుంది.
. బ్రహ్మ రాసిన రాత మారదు. కానీ తిలకధారణ చేసి విభూతి పెట్టుకోగానే ఆలోచనా సరళియందు మార్పు వస్తుంది. సాత్త్విక ప్రవృత్తి ముఖలో కనపడిపోతుంది. ఆజ్ఞాచక్రం మీది బొట్టు అమ్మవారి అనుగ్రహం. అమ్మవారి అనుగ్రహం ఆజ్ఞాచక్రం మీద ప్రసరించడం మొదలవగానే మీ బుద్ధియందు ఆలోచన మారుతుంది. తప్పుడు పనులను మానివేయాలనే భావన కలుగుతుంది. అందుకని మనస్సును జయించలేకపోతే ముందు శరీరమును అలంకృతం చేసి లోపల మనస్సును సంస్కరించడం దగ్గరకు వెళతారు. పెద్దలు ఇటువంటి ఆచారాలు ఏదో హాస్యాస్పదంగా పెట్టలేదు. కనుక తిలకధారణ చేసి భస్మం పెట్టుకుంటే మీరు దుఃఖమును స్వీకరించి దుఃఖమునుండి బయటపడతారు. మనస్సుకు రజోగుణ తమోగుణ ప్రవృత్తి ఉండడం వలన మీ మనస్సు పాపపు ఆలోచనల వైపు తిరుగుతోంది. ఈ త్రిగుణములు మనస్సును సుఖములను అనుభవించమని ప్రోత్సహిస్తూ ఉంటాయి. భగవత్సంబంధమయిన ప్రవచనములను వినడానికి వెళ్ళడానికి బదులు లౌకికమయిన కార్యక్రమములు మున్నగువాటిని చూడమని ప్రోత్సహిస్తూ ఉంటాయి. మీరు ఉన్నతిని పొందకుండా బాధిస్తూ ఉంటాయి. సంసారంలో ఉండి తరించడం చాలా కష్టం. త్రిగుణములనుండి బయటపడడానికే సంసారంలోనికి ప్రవేశించి సుఖములను అనుభవించి, ఈ సుఖములు సుఖములు కావు. నిజమయిన సుఖము ఈశ్వరుడే అనే లక్షనమును ఏర్పరచుకుని, వైరాగ్య సంపత్తిని పెంపొందించుకోవడం దానివలన ఇంద్రియములు మనస్సు చలించని స్థితికి వెళతాడు. ఇంద్రియములను గెలవడం కాదు, మనస్సుకడాలని స్థితికి పూర్ణ వైరాగ్యం అని పేరు. పూర్ణ వైరాగ్యం పొందినవాడు జరిగేది అంతా ఈశ్వరలీల అంటాడు. అంత వైరాగ్యం రావడం కూడా ఈశ్వరానుగ్రహమే. ఈ వైరాగ్య సంపత్తి చేత శాశ్వత సుఖ స్థానమయిన ఈశ్వరుని యందు కలిసిపోతాడు. అప్పుడు వానికిక ఊర్ధ్వ అధో లోకములనేవి ఉండవు. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్ష స్థితిని పొందుతాడు. ఇలా పొందడానికి ‘శంభు’ అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. శివుడి పాదములను మీరు గట్టిగా పట్టుకున్నట్లయితే ఏమీ చేతకాకపోయినా శివనామములు చెప్పడం మొదలు పెట్టినట్లయితే మీకు తెలియకుండా ఒక రకమయిన మార్పు ప్రారంభం అయిపోతుంది. ఆ మార్పు మిమ్మల్ని మంచి ఆలోచనల వైపు తీసుకొని వెళ్ళగలదు.
ఇంతకుపూర్వం ద్వాపరయుగం వరకు ఒక లక్షణం ఉండేది. రాక్షసులు వారి గుణములను బట్టి తెలిసేవారు. కాబట్టి వారిని దూరంగా పెట్టడమో, పరమాత్మ వాడిని సంహారం చేయడమో జరిగేది. కానీ కలియుగంలో అలా కాదు. కలియుగంలో రాక్షసులు చిత్తవృత్తుల రూపంలో ఉంటాడు. పైకి దొరకరు. మోసం చేసేవాడే చాలా నమ్మించేటట్లుగా సాధుపురుషుడిలా ఉంటాడు. అవతల వాడిని నమ్మించి మోసం చెయ్యాలనుకునే వాడు మాట కలిపి చక్కగా మాట్లాడతాడు. ఇపుడు రాక్షసుడు వాని చిత్తవృత్తియందు ఉన్నాడు. త్రేతాయుగంలో రాక్షసులు ఈ చిత్తవృత్తుల రూపంలో ఉండి ఉంటే విశ్వామిత్రుడు యాగం చేయలేడు. రాముడు పలు రాక్షసులను చంపడానికి తానే అనుసంధానం చేసుకోవలసి వచ్చేది. కానీ వారు బయట రాక్షసులుగా ఉన్నారు. కాబట్టి అపుడు రాముడు వచ్చి బాణం వేసి రాక్షసులను కొట్టి చంపాడు. ఈ యుగంలో అలా కుదరదు. రాక్షసులు మన మనస్సులలోనే ఉన్నారు. వారు ఎప్పుడయినా తలెత్తి మిమ్మల్ని పడగొట్టేస్తారు. అలా పడగొట్టే రాక్షసులు ఇక్కడే చిత్తవృత్తుల రూపంలో ఉన్నారు. వీళ్ళని తొక్కి పట్టగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు. ఈతడే శంభుః’. అందుకే ‘ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం’ అంటాము. ప్రదోషవేళలో ప్రతిరోజూ శంభు నామములు చెప్పినట్లయితే ఆయన మీలోని రాక్షస ప్రవృత్తులను తొక్కిపెట్టి మీ భావములయందు మంచి ప్రవాహమును ఏర్పాటు చేస్తాడు. ఈ మంచి ప్రవాహము కలిగిన భావన చేత మీరు ఉన్నతిని పొందేస్తారు. శంభునామమును పట్టుకుని శంభుని అనుగ్రహమును పొందినవాని స్థితి ఎలా ఉంటుందో మనం రుద్రపశుపతి నాయనారు చరిత్ర చదివితే తెలుస్తుంది.
5. రుద్రపశుపతి నాయనారు
అరువది మంది నాయనార్లలో రుద్రపశుపతి నాయనారు ఒకరు. సన్యాసి కూడా రుద్రం చదవాలి. అభిషేకం చేయకపోయినా రుద్రం పారాయణ చేస్తే వెంటనే పాపములు పటాపంచలు అవుతాయి. రుద్రపశుపతి నాయనారుకి ఒక లక్షణం ఉండేది. ప్రతిరోజూ కూర్చుని రుద్రాధ్యాయం చదువుతూ ఉండేవారు. అలా చదువుతున్నప్పుడు ఒక అనుమానం వచ్చింది. అందులో ‘మేఘ్యాయచ విద్యుత్యాయచ వృక్షాయచ హరిత్యాయచ లోప్యాయచ లప్యాయచ ఈద్రియాయచ ప్రేత్యాయచ శిఖత్యాయచ – ఈ మాటలు ఉన్నాయి. ఇవన్నీ ఈశ్వరుడే అన్నాడు. అనగా నీరు, నీటిమీద నురుగు, చెట్టు, చెట్టు మీద పిట్ట చెట్టులో ఆకుపచ్చతనం ఈశ్వరుడు. నాయనారు తిరుమలయార్ ప్రాంతంలో ఉండేవారు. ఆయన ఈ రుద్రమును చదివి ఆకాశం ఈశ్వరుడు, మేఘం ఈశ్వరుడు, నీరు ఈశ్వరుడు, నురుగు ఈశ్వరుడు, చెట్టు ఈశ్వరుడు, పిట్ట ఈశ్వరుడు. కాబట్టి నేను ఇంట్లో కూర్చుని వీటన్నింటినీ చెప్తుంటే ఉపయోగం ఏమిటి? కాబట్టి నేను ఈశ్వరుడిలో చేరిపోయి ఈశ్వరానుభూతిని పొందుతాను’ అన్నాడు.
ఒకరోజున తెల్లవారు జామున ఎవ్వరికీ చెప్పకుండా ఊరిబయటకు వెళ్ళిపోయారు. అక్కడ గల కొండమీద నుంచి ఒక సెలయేరు జాలువారుతోంది. ఆ సెలయేట్లో నడుంలోతు నీళ్ళలో నిలబడ్డాడు. చల్లని నీటి స్పర్శకు ఈశ్వరుడు తనను కౌగలించుకున్న అనుభూతిని పొందారు. ఇవన్నీ ఈశ్వరుడు కదా. నేను ఈశ్వరుడిలో

ఉన్నాను అని నమః ఫేన్యాయచ నమస్సికత్యాయచ ప్రవాహ్యాయచ’ అని పారాయణ చేసి బయటకి రాలేక రాలేక వచ్చేవాడు. ఒళ్ళు తుడిచేసుకుని పొడి బట్ట కట్టుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు. మరల మధ్యాహ్నం సంధ్యావందనం కోసం ఆ చెరువు దగ్గరకు వెళ్ళిపోయేవాడు. నీళ్ళలో నిలబడి శివుని ధ్యానం చేసేవాడు. చుట్టూ కనిపిస్తున్న ప్రతివస్తువులో శివరూపమును చూసేవాడు. సాయంత్రం కూడా అదేనీటిలో అదే పరిస్థితి. ఇలా కొన్నాళ్ళు జరిగింది. చివరకు రానురాను ఆయనకు ఎవరు కనపడినా ఈశ్వరుడే కనపదేవాడు. ఆఖరికి దొంగ కనపడితే “నమః చోరాయచ’ అనేవాడు. అలా అంతటా ఈశ్వర దర్శనం చేస్తూ ఉండేవాడు. అపుడు శంకరుడు ఇకనేను తప్ప ఇంకొకడు కనపడని నిన్ను నాలోకే తీసుకోవాలి అని నాయనారుని తనలోకి తీసుకున్నాడు. అపుడు నాయనారు శివునిలో ఏకమయి పోయి తాను శివుడు అయిపోయాడు. దీనిని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే నాయనారు భావనచేత మోక్షమును పొందినట్లుగా మనం గమనిస్తాము.
శం – భావయతి – మీయందు మంచి భావములు ప్రవేశించి ఈశ్వరాభిముఖులై నిరతిశయ సుఖ స్వరూపమయిన శివునియందు కలిసి మీరే శివుడు అవుతారు. అటువంటి స్థితి మనకు కలగడం కోసమే మహానుభావుడయిన పరమాత్మ మనకీ ఉపకారం చేశాడు. ఇటువంటి జ్ఞానమును శంభు స్వరూపం మనకు కటాక్షిస్తుంది. అందుకే ‘శంభుః’ అన్న నామం అంత గొప్ప నామం అయింది. పరమశివుని రూపములలో ఆ శాంభవ స్వరూపం అంత గొప్పది అయింది. ఆ నామములు చెప్పుకుంటే చాలు మనం ఉద్ధరించబడతాము.
ఈశ్వరాత్ జ్ఞానమన్విచ్ఛేత్ జ్ఞానదాతా మహేశ్వరః’ ఈశ్వరుని అనుగ్రహం వలన మాత్రమే జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానమును ఇచ్చేవాడికి మహేశ్వరుడు అని పేరు. శంభునామమును మీరు గట్టిగా పట్టుకుని ఆ నామముతో పిలిస్తే, ఆయన మీ భావములను మార్చి మిమ్మల్ని ఈశ్వరుని వైపు తిప్పుతాడు. మీకు సత్ప్రవర్తన కల్పిస్తాడు. మిమ్మల్ని చక్కటి వాడిగా రూపు దిద్దుతాడు. కనుక మనం ప్రతిరోజూ శంభు నామమును చెప్పుకుంటూ శంభు అనుగ్రహమును పొందాలి. ఇదియే ‘శం’ – ఈ లోకంలో సుఖము దగ్గర నుంచి నిరతిశయ సుఖం వరకు, ఊర్ధ్వలోక సుఖం వరకు ఎంత సుఖం ఉన్నదని మీరు అనుకుంటున్నారో అన్ని సుఖములను మీకు ఇవ్వడం. దీనినే కామకోటి అని పిలుస్తారు. కామకోటి అనగా ఇక్కడ కోర్కెలను ఇవ్వడంతో మొదలుపెట్టి కోర్కెలు లేకుండా చెయ్యడం వరకు తీసుకువెళ్ళి ఆ తరువాత పుణ్యమును ఇచ్చి పుణ్యము వలన ఊర్ధ్వలోక ప్రాప్తివరకు ఇచ్చి తరువాత మరల తిరిగి రానవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్య స్థితి అనబడే మోక్ష స్థితి వరకు ఇవ్వగలిగిన అంచులన్నీ ఆవిడ చేత పరిపాలించబడుతున్నాయి. ఆవిడ యవనిక ఎత్తి ఈ కామకోటిలో నిలబెడుతుంది. ఈ కోటిలో ఏ మెట్టుమీద మీరు నిలబడతారో దానికి తగినట్లుగా మిమ్మల్ని నిలబెట్టదానికి ఈ నామములు ఈశ్వరానుగ్రహము మిమ్మల్ని రక్షిస్తాయి. రుద్రపశుపతి నాయనారు వృత్తాంతమే అందుకు ఉదాహరణ.
PURANAM -- 5
శివనామములు: పినాకి – రుద్రుడు
స్వామిని పినాకి అని పిలుస్తారు. పినాకి అనే నామం చాలా చిత్రమయినది. పరమశివమూర్తి పట్టుకునే ధనుస్సు సామాన్యమయిన ధనుస్సు కాదు. మేరుపర్వతమును ధనుస్సుగా పట్టుకుంటారు. శంకరుడు రాక్షస సంహారం చేస్తే తాను ఎలా ఉన్నాడో అలాగే ఉండి చేస్తాడు. వేరొక రూపమును తీసుకొని సంహారం చేయడు. కానీ శివుడు ధనుస్సు పట్టుకున్నట్లు మనకు శాబ్దికముగా తెలుస్తుంది. వేదముల వలన తెలుస్తుంది. యజుర్వేదంలో శ్రీరుద్రం “నమస్తే రుద్రా మన్యవ ఉతోత ఇషవే నమః” అని ప్రారంభమవుతుంది. స్వామీ మీ కోపమునకు ఒక నమస్కారం – ఆ మాట చెప్తున్నారు. కోపంగా ఉన్నవాడు తన చేతిలో ఉన్న ఆయుధము నుండి బాణములను విడిచిపెడతాడు. ఇవి మిమ్మల్ని రోడింపజేస్తాయి. మరి ఆయన ఎందుకు అలా ధనుస్సు పట్టుకోవాలి? రుద్రుడు మనం చేసిన తప్పులకు మానను శిక్షించడానికి ధనుస్సును పట్టుకుని ఉన్నాడు. అదే మేరుపర్వతము. బంగారు ధనుస్సు! ధనుస్సు సంధించడానికి రెండు పక్కలా తూణీరములున్నాయి. దీనిని ఈశ్వరుని ఘోర రూపము అంటారు. మీరు చేసిన పాప ఫలితం ఉన్నది. మీరు బాధ పడితే తప్ప ఆ పాపం పోదు. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఏడిపించాలి. అందుకు గాను బాణములను తీస్తున్నాడు. ఈ శరీరంతో ఉన్నప్పుడు సుఖమును, దుఃఖమును రెండింటినీ అనుభవిస్తాము. ఈ శరీరంతో పాప పుణ్యములను రెండింటినీ చేస్తాము. తప్పు చేశాము కాబట్టి దుఃఖము అనుభవించాలి. ‘నేను పాపము చేశాను కానీ నన్ను అంత ఏడిపించకు. తట్టుకోలేను. నేను ఏడిస్తే చివరకు నీ పాదముల యందు విస్మృతి కలుగుతుంది నేను ఆ ఏడుపులో ఉండిపోతాను. నేను ఆ బాధలో ఉండడంలో నా జీవితంలో కొంతకాలం నీ పాదములకు దూరం అయిపోతాను. నిష్ఠతో నీ పాదములను పట్టుకోలేని స్థితి నాకు వచ్చేస్తుంది. కాబట్టి ఈశ్వరా, నీ కోపమునకు ఒక నమస్కారం, ఈశ్వరా, నీ ధనుస్సుకు ఒక నమస్కారం, నీ బాణములకు ఒక నమస్కారం.
యా త ఇషుపశ్శివతమాశివం బభూవ తే ధనుః”
కాబట్టి నీవు మేము సంతోషించే బాణములు వెయ్యాలి. నాయందు దయవుంచి నన్ను నీ త్రోవలో పెట్టుకో. అని ప్రార్థిస్తే ఇప్పుడు ఆయన ప్రసన్నుడు అవుతాడు. ఇప్పుడు ఆయన పట్టుకున్న ధనుస్సుకు, మొదట్లో పట్టుకున్న ధనుస్సుకు తేడా కనిపిస్తుంది. పినాకిని అనే శబ్ద

ల పురాణములను పరిశీలించాలి. ఆయా కథలను తెలుసుకుని స్మరించడం చేత స్వయంభువు అయిన ఈశ్వరుడు ప్రసన్నుడై ఎన్నో శుభఫలితములను ఇస్తాడు. ఆయా కథలను వింటున్నప్పుడు మీకు తెలియకుండానే మీ మనస్సు ఆయా క్షేత్రముల వద్దకు వెళ్ళిపోతుంది.
‘శశిశేఖరః’ అన్న నామము వ్యాఖ్యానం చేస్తూ అంటారు – దక్ష ప్రజాపతికి 27మంది కుమార్తెలు. ఈ 27మంది కుమార్తెలే అశ్వని భరణి మున్నగు పేర్లు కలవాళ్ళు. వారిని చంద్రునికిచ్చి వివాహం చేశాడు. పూర్వం దక్షిణనాయకత్వం అని ఒకటి ఉండేది. విజయనగర సామ్రాజ్యమును పరిపాలించిన రామరాయల వారికి అనేక భార్యలు ఉండేవారు. దశరథ మహారాజు గారికి 365 మంది భార్యలు ఉండేవారు. పూర్వం అలా దక్షిణ నాయకత్వం ఉండేదో. తన భార్యలతో చంద్రుడు సంతోషంగా ఉండాలి. కానీ చంద్రుని చరిత్రయందు ఒకదోషం ఉంది. ఆయన కొంచెం తొందరపడిపోవడం యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఏ స్త్రీపట్ల అలా ప్రవర్తించడం మహాపాతకమని శాస్త్రం చెప్పిందో అలాంటి వాళ్ళతో రమించడం కూడా చంద్రుని చరిత్రలో ఒకచోట ఉన్నది. ఈ అలవాటు ఫలితం ఎక్కడో రావాలి. అందుకుగాను శివుడు తన ధనుస్సులోంచి చంద్రునకి పాపఫలితం ఒకదానిని ఇస్తున్నాడు. చంద్రుడు తన భార్యలలో రోహిణి మీద అధిక ప్రేమను కనపరచాడు. ఇది సహజంగా మిగిలిన 26మందికి బాధ కలిగించింది. వాళ్ళు తండ్రిగారి వద్దకు వెళ్లి ఈ విషయమును చాలా బాధపతుతూ చెప్పారు. విన్న తండ్రి మనస్సు ఎంతగానో క్రున్గింది. ఆయనకు చంద్రుడి మీద చాలా కోపం వచ్చింది. వెంటనే దక్ష ప్రజాపతి చంద్రలోకం వెళ్ళాడు. అల్లుడయిన చంద్రుడు ఆయనకు ఎదురు వచ్చి తీసుకు వచ్చి కూర్చోపెట్టాడు. అపుడు దక్షుడు చంద్రునితో ‘నీకు నేను నా 27మంది కుమార్తెలను యిచ్చి వివాహం చేసినప్పుడు అందరినీ జాగ్రత్తగా సమానంగా చూసుకుంటాను అని మాట ఇచ్చావు. కానీ నీవు ఒక్క రోహిణితో మాత్రమే ఉంటున్నావని తెలిసింది. అందరినీ సమానంగా చూసుకో” అని చెప్పాడు. తప్పకుండా ఆయన మాట ప్రకారం నడుచుకుంటాను అని బదులిచ్చాడు. కొంతకాలం గడిచింది. కానీ అల్లుడి ప్రవర్తనలో ఏమీ మార్పులేదని, రోహిణి తప్ప మిగిలిన కుమార్తెలందరూ పూర్వంలాగే బాధపడుతున్నారని దక్షప్రజాపతికి తెలిసింది. దక్షునికి కోపం వచ్చి నీ విశ్రుంఖలత్వమునకు అడ్డుకట్ట వేస్తాను. నీవు క్షయవ్యాధి పీడితుడవు అవుదువు గాక’ అని శపించాడు. దీనివలన పూర్వం సంతోషపడిన రోహిణి కూడా చంద్రుడిని దగ్గరకు రానీయదని ఆయన ఉద్దేశ్యం. ఫలితంగా చంద్రునికి క్షయవ్యాధి వచ్చింది. దాని ఫలితంగా దేవతలందరూ నీరసపడి పోయారు.
చంద్రుడు బాగా ప్రకాశిస్తే ఆయన అనుగ్రహం చేత ఓషధులు ప్రకాశిస్తాయి. ఓషధులు బాగా ప్రకాశిస్తే ఓషధులతో కూడిన ద్రవ్యంతో యజ్ఞం చేయాలి. ఆ హవిస్సులను దేవతలు తీసుకుంటారు. అపుడు దేవతల ఆకలి తీరినట్లయితే వారు మనకు మంగళములను ఇస్తారు. చంద్రునికి క్షయ వ్యాధి సోకడం చేత దేవతలకు హవిస్సులు లేవు. ప్రజలకు మంగళములు లేవు. అటు దేవతలు, ప్రజలు మాడిపోయారు. ఇప్పుడు ఇది అన్ని లోకముల సమస్య అయి కూర్చుంది. ఇపుడు వీళ్ళందరూ తమలో తాము చర్చించుకుని అత్రి మహర్షిని పిలిచి అందరూ కలిసి బ్రహ్మ దగ్గరకు వెళ్ళారు. అప్పుడు బ్రహ్మగారు –
“నేను లోక్ష సంక్షేమం గురించి చెప్తున్నాను. ఇపుడు చంద్రుడు ప్రభాస క్షేత్రమునకు వెళ్ళాలి. ప్రభాస క్షేత్రం సముద్రపు ఒడ్డున ఉంది. ఆ క్షేత్రంలో ఒక గుంత త్రవ్వి అందులో ఒక పార్థివలింగమును పెట్టుకుని పంచాక్షరి మహా మంత్రం జపమును, మృత్యుంజయమంత్రంతో కలిపి అనుష్ఠానం చేయాలి. ఎంత శాపం ఉన్నా ఇటు బ్రాహ్మణ వాక్కునూ, అటు చంద్రుడినీ చచ్చిపోకుండా కాపాడాలంటే పరబ్రహ్మమునకు తప్ప వేరోకనికి సాధ్యం కాదు. కాబట్టి శంకరుడు మాత్రమే ఈ పనిని చేయాలి. అందుకని అక్కడికి వెళ్లి పార్థివలింగమునకు అర్చన చేయమనండి” అని చెప్పాడు.
వెంటనే చంద్రుడు ప్రభాస క్షేత్రమునకు వెళ్లి పంచాక్షరీ మంత్రమును, మృత్యుంజయ మహా మంత్రముతో అనుసంధానం చేశాడు. ఇపుడు ఎవడు వ్యాధిని ఇచ్చాడో వాడే – ‘శివా శరవ్యాయా తవ త యా నో రుద్రా మృడయ’ – రక్షించాలి. కొన్ని కోట్ల జపం అయిపోయిన తర్వాత భగవానుడు శంకరుడు, పార్వతీ సహితుడై ప్రత్యక్షమై ‘ఏమిటి నాయనా నీ అభీష్టము’ అని అడిగాడు. అపుడు చంద్రుడు తనకి క్షయవ్యాధి తగ్గిపోయేలా చేయమని పరమేశ్వరుని ప్రార్థించాడు. ఇపుడు నీ క్షయవ్యాధి పోతుంది అని పరమాత్మ అనగలరు. కానీ అలా అనినట్లయితే దక్ష ప్రజాపతి మాటకు విలువ లేనట్లవుతుంది. ఆయన మాట నిలబడాలి, తప్పు చేసిన వాడయినా తన పాదములు పట్టుకున్నాడు కాబట్టి అతని బుద్ధిని కూడా సంస్కరించాలి. అందుకే తరువాత చంద్రుడు తన 27మంది భార్యలతో సమానంగా లేదు అని చెప్పడానికి ఉదాహరణమే చాద్రమానంలో దీనిని చెప్తున్న తిథులు. పరమేశ్వరుడు బుద్ధిని ధర్మం వైపు మారుస్తాడు కాబట్టే ఆయనకు మనం రుద్రశబ్దమును ఉపయోగించాము. చంద్రునితో ‘నీకు క్షయ ఉంటుంది. కానీ నీవు పదిహేను రోజులు క్షీణిస్తావు, పదిహేను రోజులు వృద్ధి పొందుతుంటావు. క్షయ పూర్తిగా లేదు కాబట్టి నశించిపోవు. ఎప్పుడూ హాయిగా ఉంటావు. ఇపుడు నీ చరిత్ర మారిపోయింది. నీవు పూర్తిగా గొప్పవాడివయ్యావు. నీవు నా చేత అనుగ్రహింప బడినవాడివని తెలుసుకోవడానికి నాతొ కలిపి నీ

మరించి తిరిగారు. అటువంటి వాళ్ళను మట్టు పెట్టగలిగిన వాడు రుద్రుడు – వాళ్ళని ఏడిపించగలిగిన వాడు.
రోదనం ద్రావయతి ఇతివా రుద్రః – నీకు ఏదో ఒక కారణం చేత అపారమయిన దుఃఖము ఉన్నది. ఈశ్వరానుగ్రహం బాగా ఉన్నట్లయితే ఆ వస్తువును శాశ్వతంగా దూరం చేయకుండా మీ కళ్ళముందే ఉంచి, ఒక్కొక్కసారి మీకు లేనిది చేయవచ్చు. శంకరుడు ధనుస్సు పట్టుకుంటే వేదములో దీనికి సంబంధించిన మంత్రములు ఎన్నో వచ్చాయి. ఇలా ఎందుకు రావాలి అని అడిగారు. – “పినాకః త్రిపుర దాహకాలే జ్వాలా జాలైర్నాకం పిహితవాన్ పినాకః తదా మేరు ధనుస్త్వాత్” అన్నారు. లోకమునందు ఎక్కడా లేని రీతిలో బంగారుదయిన మేరు పర్వతమును తన చేతిలో ధనుస్సుగా పట్టుకుని నిలబడినవాడు. అటువంటి ధనుస్సు కాంతులచేత సమస్తలోకములు కప్పబడిపోయి రాత్రి అనక, పగలనక బంగారు కాంతి యందు అన్ని లోకములు ఎప్పుడు ప్రకాశించాయో అలా ధనుస్సు చేతిలో ఎవడు పట్టుకున్నాడో, వాడిచేతి ధనుస్సే చిత్రం. అలా ధనుస్సును పట్టుకున్నాడు కాబట్టి అతనిని ‘పినికి’ అని స్తోత్రం చేస్తున్నారు.
కాబట్టి అన్ని విషయములను సమన్వయము చేస్తూ మనకి పెద్దలు ఆయన చేతిలో ఉన్న ధనుస్సు మనలను ఇన్ని రకములుగా ఉద్ధరించగలదు అని చెప్పారు. అందువలన ధనుస్సును చూడడం, ఆ ధనుస్సు గురించి చెప్పిన రుద్రమును పారాయణ చేయడం ఆ రుద్రంతో అభిషేకం జరుగుతుంటే ప్రశాంతంగా కూర్చుని వినడం, మీకు చేతనయితే మీరే కూర్చుని చదువుకుని మురిసిపోవడం నేర్చుకోవాలి.
SIVA PURANAM – 6
శశిశేఖరుడు – జ్యోతిర్లింగములు
‘శివో మహేశ్వరశ్శంభుః పినాకీ శశిశేఖరః’ – ఆయనను శశిశేఖరః’ అని పిలుస్తారు. శశము అనగా కుందేలు. దూకే స్వభావం ఉన్నది. దూకేస్వభావం ఉన్నది కాలము. సుఖము చేత కాలము దూకేస్తుంది. దుఃఖములో వుంటే కాలము గడుస్తున్నట్లు అనిపించదు. దాంట్లో అర్థం చేసుకోవలసిన రహస్యం ఒకటి ఉన్నది. మీరు దానిని పట్టుకుంటే ‘శశిశేఖరః’ అన్నమాటకున్న తాత్త్వికమయిన అర్థం అర్థం అవుతుంది. కాలంలో సుఖదుఃఖములు రెండూ ఉంటాయి. దూకేసినట్లు కనపడిన కాలమును, దూకనట్లు కనపడిన కాలమును వైదిక సమన్వయము చేస్తే మీరు రోజూ చెప్పేటప్పుడు కాలమును ఎలా చెప్పుతారు? శ్రీవిరోధి నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ మాఘమాసే శుక్లపక్షే పంచంయాం భూమవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథే శ్రీమాన్ శ్రీమతః’ అని చెప్తాము. ఎవడు ఆయన పాదములు పట్టుకున్నాడో అటువంటి వాడికి జ్ఞానమును ఇచ్చి కాలాతీతుడిని చేసి, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని కలిగించగలడు. కాలము ఆభరణముగా కలిగిన వాడని చెప్పడానికే చంద్రరేఖను పొంది ఉంటాడు. మోక్షం ఇవ్వగలవాడని చెప్పడం కోసమే చంద్రరేఖను ధరించి ఉండడం. ఇదే శశిశేఖర అన్నమాటకు అసలు తాత్త్వికమయిన రహస్యం.
కానీ మనం సోమనాథ లింగము అన్నమాటను ప్రస్తావన చేస్తాము. శాస్త్ర సంబంధం అయిన మాటలలో కొన్ని ఆశ్చర్యకరమయిన మాటలు ఉంటాయి. మీరు కంచిలో ఉన్న శివలింగం దగ్గరకు వెళ్లి దానిని జ్యోతిర్లింగం అంటే శాస్త్రం అంగీకరించదు. దానిని అష్టమూర్తులయందు ఒక లింగము – పృథివీలింగము అని పిలుస్తారు. పంచ భూతలింగములలో ఒకటి.
కాళహస్తిలోని లింగము వాయులింగము. అది జ్యోతిర్లింగం కాదు. జంబుకేశ్వరంలోని శివలింగం జలలింగం. అది జ్యోతిర్లింగం కాదు. కానీ కొన్ని శివలింగములను జ్యోతిర్లింగములు అని పిలుస్తారు.
“సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం” అని మనం ద్వాదశ జ్యోతిర్లింగస్తోత్రం చదువుతుంటాం. ఈ పన్నెండింటినీ మనం జ్యోతిర్లింగములని పిలుస్తున్నాము.
సోమనాథుడు – సోమనాథ్ – గుజరాత్; మల్లికార్జున స్వామి – శ్రీశైలం - ఆంధ్రప్రదేశ్; మహాకాలేశ్వరుడు - ఉజ్జయిని – మధ్యప్రదేశ్; అమలేశ్వరుడు – ఓంకారేశ్వరం – మధ్యప్రదేశ్; వైద్యనాథుడు – పర్లి – మహారాష్ట్ర; భీమశంకరుడు – పూణే – మహారాష్ట్ర; రామలింగేశ్వరుడు – రామేశ్వరం – తమిళనాడు; నాగేశ్వరుడు – ఔండా – గుజరాత్; విశ్వనాథుడు – వారణాసి – ఉత్తరప్రదేశ్; త్ర్యంబకేశ్వరుడు – నాసిక్ – మహారాష్ట్ర; కేదారేశ్వరుడు – కేదారనాథ్ – హిమాచల్ ప్రదేశ్; ఘ్రుష్ణేశ్వరుడు – వెరుల్ – మహారాష్ట్ర.
జ్యోతిర్లింగములని మనం వాటిని పిలిచినప్పుడు ఈ పన్నెండు చోట్ల జ్యోతి ఉండాలి. కానీ మనం ఆయా క్షేత్రములకు వెళ్ళి చూసినట్లయితే అక్కడ మనకు శివలింగమే కనపడుతుంది. కానీ జ్యోతి కనపడదు. అయితే ఈ పన్నెండింటిలోనే జ్యోతిర్లింగములని ఎందుకు అంటారు? దీనికి సమాధానం “ఆపాతాళనభఃస్థలా” అని రుద్రమునకు ఉన్న ప్రార్థనా గద్యయందు చెప్పారు. మీరు ఆ లింగం దగ్గరకు వెళ్ళి అడిగినప్పుడు ఇహమునందు కావలసిన సౌఖ్యమునుండి మోక్షము వరకు ఏదయినా ఇవ్వగలిగిన పరబ్రహ్మ స్వరూపంగా ఆ శివలింగం ఉన్నది.ఈ లోకమునందు జ్ఞానము పొందాలన్నా కోరికలు తీరవలెనన్నా శివుడిని అర్చించాలి. కోర్కె తీర్చడం దగ్గర నుంచి మోక్షం ఇవ్వడం వరకు చేయగలిగిన శివలింగములు ఏవి ఉన్నాయో అవి జ్యోతిర్లింగములు. అటువంటి జ్యోతిర్లింగములు స్వయంభు – ఒకరు ప్రతిష్ఠించినవి కావు. ఈశ్వరుడు చిత్రవిచిత్రమయిన పరిస్థితులలో అలా వచ్చాడు. అలా ఎందుకు వచ్చాడు అని తెలుసుకోవడానికి మనం స్థ

మును మీ జీవితమునకు అన్వయం చేసుకోవడానికి రుద్రం ప్రారంభం ఇలానే మాట్లాడింది. ఇదీ అసలు ధనుస్సు. మీరు తప్పు చేస్తే ఘోరరూపంతో ఈశ్వరుడిని చూడవలసి వస్తుంది. తప్పు చేశానని చెప్పుకోవలసిన రోజు మీ జీవితంలో ఎందుకు రావాలి? మీరు జీవితంలో శాంతమయిన శివ దర్శనమును కోరుకున్నవారాయి ఉండాలి. అనగా తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి.
ఆయన బంగారు ధనుస్సును పట్టుకుని మీరు చేసిన పాపములకు తగిన శిక్షను విధిస్తూ మీ పాపములను పరిహారం చేస్తునాడు. ఎంత పాపం చేసిన వాడయినా ఆయన పాదములు పట్టుకున్న వాడయితే ఆయన పాదములయందు విస్మృతి కలగవలసిన అవసరం లేని రీతిలో తప్పించి వాడు భరించగలిగినంత దుఃఖమును మాత్రమే యిచ్చి తప్పిస్తాడు. కాబట్టి మీకు ఇప్పుడు శిక్ష వేయడంలో కూడా ఆయన ఒక తండ్రి బిడ్డలను చూసుకున్నట్లు చూసి కొడతాడు. కాబట్టి ఈశ్వరా మీరు ప్రసన్నమూర్తియై కనపడండి అని కోరుకుంటాము. అసలు సనాతన ధర్మంలో మిమ్మల్ని భయపెట్టటానికి, మీరు చేసే పాపమునకు ఫలితం ఇచ్చేవాడు ఒకడు, మీ భయం తీయడానికి ఒకడు వేరుగా ఉండరు. ‘భయకృత్ భయనాశానః’ – భయమును సృష్టించే వాడు పరమాత్మే. భయమును తీసేసే వాడూ పరమాత్మే. ఇది సనాతన ధర్మమునందు ఉన్న జీవధార. కష్టమును కలిగించడానికి, కష్టమును తొలగించడానికి ఈశ్వరుడే కారకుడు. ఆ కష్టమును కాలములో మీరు మరిచేపోయేటట్లు చేసే కాలస్వరోఉదు కూడా ఈశ్వరుడే. గురుస్వరూపియై మరల వచ్చి మీ మనస్సుకు తగిలిన గాయమును మాన్పించి మిమ్మల్ని మరల యథామార్గమునందు మళ్ళీ తిప్పేవాడు కూడా ఈశ్వరుడే. ఈశ్వరుని కారుణ్యమునకు అంతులేదు. కాబట్టి ఆయన పట్టుకున్న ధనుస్సు మనకు ఎల్లప్పుడూ రక్షణే కల్పిస్తుంది. కాబట్టి శాస్త్రము ‘పాతీతి పినాకః’ అని చెప్పింది. ఈ ధనుస్సు మీకు ఘోర రూపముతో పాఫలితమును ఇచ్చినా అఘోర రూపముతో సుఖమును ఇచ్చినా అది చేస్తున్నది మీ రక్షణే! కనుక ఆ ధనుస్సు లోకములను రక్షించగలిగినది. అందుకే రుద్రము ఆ ధనుస్సును అంత స్తోత్రం చేసింది.
ఆఖరున ఈ సమస్త లోకములను లయం చేస్తున్నప్పుడు అందరిని ఏడిపించే వాడు ఎవడో వాడు రుద్రుడు. మనకి మూడు ప్రళయములున్నాయి. నిత్య ప్రళయము – నిద్రపట్టేటట్లుగా ఈశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించి మీకు సుఖమును కల్పించడం నిత్యప్రళయము. రెండవది అత్యంతిక ప్రళయము – బాగా సాధన చేసి భక్తితో భగవంతుని చేరుకోవడానికి అడ్డంగా వున్న ప్రతిబంధకమును గుర్తించి వాటిని తొలగ తోసుకుని, భక్తితో కూడిన కర్మానుష్టానము చేత ఈశ్వరానుగ్రహముగా జ్ఞానమును పొంది అద్వైత సిద్ధిచేత మోక్షానందమును పొందేటట్లుగా యోగ్యతను సంతరించుకున్నవాడు, ఈశ్వర కటాక్షము చేత మోక్షమును పొందడమే అత్యంతిక ప్రళయము. ఇది కూడా ఈశ్వరానుగ్రహమువలననే సిద్ధిస్తుంది. రమణమహర్షి వంటి మహాభాగులు ఈవిధంగా మోక్షమును పొందుతారు. మూడవది మహా ప్రళయము. అత్యంతిక ప్రళయంలో ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి వెళ్ళిపోతారు. ఈశ్వరుడిని తమంత తాము పొందలేని వాళ్ళని ఈశ్వరుడే పొందుతాడు. వాళ్ళు ఏడుస్తున్నా వాళ్లకి సిద్ధిని ఇచ్చేస్తాడు. అల చేసిన రుద్రుడు చేతి ధనుస్సు సాత్త్వికమైనది, లోక రక్షణ హేతువైనది. అది కూడా ఆయన అనుగ్రహము. ఈ శరీరముతో ప్రయోజనమును సిద్ధింపచేసినందుకు ఈశ్వరుని ప్రార్థిస్తూ, ఈశ్వరునిలోకి చేరుతూ ఈ శరీరమును వదలాలి. ఇందు నిమిత్తం ధర్మమును పట్టుకోవాలి. ధర్మము తప్ప వేరొక మార్గం లేదు. ఇదే శాబ్దిక ప్రమాణమయిన వేదము. ఈ వేదమును ఎవడు ఇచ్చాడో వాడు రుద్రుడు. ఆ రుద్రుడు వేదముచేత ప్రతిపాదింపబడిన ధర్మమూ మనకు బాగా అర్థం అయేటట్లుగా గురురూపంలో వచ్చి చెప్పి, పరమాత్మవైపు అడుగులు వేసేటట్లు బుద్ధిని చక్కదిద్దుతాడు. కనుక ఈ ధర్మం వైపు మన మనస్సు నడిచేలా చెయ్యగలిగిన వాడు ఎవడో వాడు రుద్రుడు. అది వాడి చేత పట్టుకున్న పినాకము. దాని నారి శబ్దములే వేదములు. కాబట్టి ఇపుడు ఆ శాబ్దిక ప్రమాణములే వేదములు అటువంటి వేదము మానను ధర్మ మార్గంలో నడిపించడానికి వచ్చింది. ఆశాపాశములు ఎన్నింటితోనో తిరుగుతూ ఉంటాము. ధర్మం వైపు అడుగు పడాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. అటువంటి అనుగ్రహమును ఇచ్చి నడిపించేవాడు ఎవరో వాడు రుద్రుడు.
రుద్రా శబ్దములో ‘రుత్’ అన్నమాట ఉన్నది. ఈ రుత్ – భర్తేభ్యోద్రావయతి – రుత్ అంటే ప్రతిబంధకము – అడ్డము. ఒక అడ్డం ఉండడం వలన వ్యక్తి ఈశ్వరుడిని చేరలేక పోతున్నాడు. మనస్సు ఈశ్వరాభిముఖం కావడం లేదు. ఎవరు భగవంతుని నిజంగా కోరుకుని నేను ఈ కోరికల వలన నిన్ను పొందలేక పోతున్నాను. వీటినుండి నా మనస్సు మరల్చు అని ఈశ్వరుడికి చెప్పుకున్నాడో, ఆ నిజాయితీకి పొంగిపోయి ఈశ్వరుడు ప్రతిబంధకమును తీసేస్తాడు. మీరు ఈశ్వరుడిని చేరడానికి ఏది ప్రతిబంధకమో ‘నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఉషావే నమః’ అని అభిషేకం చేస్తే రుద్రమును పారాయణ చేస్తే, శివాష్టోత్తరం చదివితే ఆయన ఆ ప్రతిబంధకమును తీసేస్తాడు. ఇది ‘రుద్రః’ – అందుకని ‘నమస్తే రుద్రమన్యవ’ అంటూ వెళ్ళి ఆ చేతిలో ధనుస్సును రుద్రశబ్దంతో కలపడంతో కలపడానికి కారణం అది.
రోదయతి శత్రూన్ ఇతి రుద్రః – ఇప్పటివరకు మిమ్మల్ని ఏడిపించిన వారు, లేదా లోకమునకు శత్రువులు అయిన వారు రాక్షసులు ఒంట్లో బలం ఉన్నది కదా అని ఈశ్వర మార్గమును విస్

దర్శనం చేయించడానికి నాపేరే నీతో కలుపుకుంటాను. చంద్రశేఖర అని పిలిపించుకుంటాను’ అని ఆ చంద్రుణ్ణి తీసి నెత్తిన పెట్టుకున్నాడు. ఇదీ ఆయన కారుణ్యం అంటే.
అందుకని తప్పులు జరిగిన వాటికి వేళ్ళు విరవకండి. ఇంత కారుణ్య మూర్తి అయిన శంకరుని పాదములు పట్టుకున్న వాడికి ఒక్కసారి పట్టుకుంటానని పూనికతో నిలబడితే మిమ్మల్ని కూడా నెత్తిమీద పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. అందుకనే శంకరుని ‘శశిశేఖరః’ అని పిలువవలసి వచ్చింది. చంద్రుని క్షయ వ్యాధి పోయింది. చాంద్రమానం వచ్చింది. ఇప్పుడు ఈ చంద్రుడు పార్వతీ దేవికి గొప్ప భక్తుడు అయ్యాడు. అందుకే మనుః చంద్రః కుబేరశ్చ లోపాముద్రా చ మన్మథః
అగస్తి రగ్ని సూర్యశ్చ ఇంద్రః స్కందశ్శివస్తదా
క్రోధభట్టారకో దేవ్యాః ద్వాదశామీ ఉపాసకా!! (సౌభాగ్య భాస్కర భాష్యం)
సూర్యుడు, స్కందుడు – అని పన్నెండుమంది అమ్మవారి మహాభక్తులలో ఈయన కూడా ఒకడయ్యాడు.
SIVA PURANAM – 7
సోమనాథుడు
ఇక్కడ ఒక చిత్రం జరిగింది. శంకరుడు చంద్రుడిని నెత్తిమీద పెట్టుకోవడం మంచిదే. అదే సోమనాథ లింగం. స+ఉమ+నాథుడు=సోమనాథుడు. అనగా పార్వతీదేవి పక్కన ఉన్న కారుణ్యమూర్తి. సశక్తిపరుడు. ఇది ఒక అర్థం. మరొక అర్థం ఉన్నది. సోముడు అనగా చంద్రుడు. సోముడు ప్రార్థన చేశాడు. ‘నన్ను ఇంత అనుగ్రహించిన నీవు ఉత్తరోత్తరా ఎవరు వచ్చినా రక్షించడానికి ఇక్కడే వెలయవలసినది’ అన్నాడు. అపుడు శివుడు అక్కడ జ్యోతిర్లింగమై వెలశాడు. అందుకే అది స్వయంభూ జ్యోతిర్లింగములలో మొట్టమొదటి లింగము. మీకు తెలిసి వెళ్ళినా తెలియక వెళ్ళినా అక్కడికి వెళ్ళి సోమనాథ జ్యోతిర్లింగమును దర్శించుకుంటే దీర్ఘకాలంగా పీడిస్తున్న వ్యాధులు నయం అవుతాయని, భవిష్య జన్మలో చేసిన పాపముల వలన భయంకరమయిన కుష్ఠు మొదలయిన వ్యాధులు రావలసిన పాపములు ఖాతాలో ఉండిపోయినా అవి భగ్నం అయిపోతాయని సోమనాథలింగ దర్శనం చెయ్యాలని మనకి శాస్త్రం చెప్తోంది.
సోమనాథ దేవాలయం శ్రీ సర్దార్ వల్లభాయ్ సారధ్యంలో పునర్నిర్మాణం అయింది. ఈ లింగం మీద కన్నుపడే ఈ సోమనాథ దేవాలయమును పూర్వం ఎందఱో ఎన్నో మార్లు ధ్వంసం చేస్తే మహానుభావుడు ఉక్కుమనిషి అనిపించుకున్న భారతదేశపు తోలి ఉప ప్రధానిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడి, సోమనాథ దేవాలయమును పునర్నిర్మాణం చేసి, అత్యద్భుతంగా రూపుదిద్దారు.
శ్రీశైల క్షేత్రం:
శ్రీశైలం సాక్షాత్తుగా మన ఆంద్రదేశంలోనే కర్నూలు జిల్లాలో వెలసిన స్వయం భూలింగ మూర్తి ఉన్న క్షేత్రము. విశేషించి అష్టాదశశక్తి పీఠములలో శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబికా అమ్మవారు ఒక శక్తిపీఠం. శ్రీశైలం అంత గొప్ప క్షేత్రం. ఆ పరమేశ్వరుడు వెలసిన కొండపేరు శ్రీగిరి. మనం ఎవరినయినా గౌరవవాచకంతో పిలవాలని అనుకున్నప్పుడు పక్కన శ్రీకారం చుడతాము. శైలమునకు ముందు శ్రీకారం వ్రాయబడి శ్రీశైలం అయింది. దానిపేరు శ్రీగిరి. శ్రీశైలంలో స్వామి లింగమూర్తియై అరూపరూపిగా ఉన్నాడు. ఉన్నది ఒక్క పరమాత్మే రెండుగా భాసిస్తున్నాడు. శ్రీగిరి అన్న పేరు రావడానికి సంబంధించి స్థల పురాణం ఒకమాట చెప్పింది. ఒక భక్తురాలు తాను ఒక కొండగా మారాలని కోరుకున్నది కాబట్టి ఆమె శైలముగా మారినది అని చెబుతారు. కానీ దాని తాత్త్వికమయిన రహస్యం వేరు. శ్రీ’లో ‘శ’కార, ‘ర’కార, ‘ఈ’కారములు ఉన్నాయి. ఈ మూడక్షరములు బ్రహ్మశక్తి, రుద్రశక్తి, విష్ణుశక్తి – ఈ మూడు శక్తులను తెలియజేస్తాయి. ఈ మూడు శక్తులు ఉన్న కొండ శ్రీశైలం. ఈ మూడు శక్తులు మమైకమయిన శక్తి రూపిణి భ్రమరాంబిక. అందుకని శ్రీశైలం ఒక శక్తి పీఠం. ఆ కొండమీద అడుగుపెట్టిన వాడు సరస్వతీ కటాక్షమును కానీ, లక్ష్మీ కటాక్షమును గానీ, జ్ఞానమును గానీ నోరువిప్పి అడగక్కరలేదు. అతనికి కావలసినది ఆ కొండలోంచి ప్రసరిస్తుంది. అంత శక్తిమంతమయిన కొండ. శ్రీశైల పర్వతం ఎన్నో ఓషధులకు ఆలవాలము. శ్రీశైలము ఎన్నో ఉపాసనలకు ఆలవాలము. అటువంటి శ్రీశైలంలో పర్వతం మీద పరమశివుడు స్వయంభువుగా వెలిశాడు. ఆయన అక్కడ వెలవడానికి గల కారణం గురించి పెద్దలు ఒక విషయమును చెప్తారు.
గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అని నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు శంకరుడు తన ఇద్దరు కుమారులను పిలిచి, ఎవరు భూమండలమునంతటిని తొందరగా ప్రదక్షిణం చేసి వస్తారో వారికి గణాధిపత్యం ఇస్తాను అని చెప్పగానే సుహ్రహ్మణ్యేశ్వర స్వామి గబగబా బయలుదేరి భూమండలంలో ఉన్న దేవాలయములన్నింటినీ దర్శనం చేసుకుంటూ వస్తున్నారు. గణపతి మాత్రం అలా అన్ని దేవాలయములకు వెళ్ళలేదు. సూక్ష్మలో మోక్షం అన్నట్లుగా ఆయన ‘నాన్నగారూ, తల్లిదండ్రులకు చేసిన ప్రదక్షిణం భూమండలమునకు చేసిన ప్రదక్షిణతో సమానం. కాబట్టి నేను మీకే ప్రదక్షిణం చేసి మీకే నమస్కరిస్తున్నాను’ అని తన తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు. ఈవిధంగా గణపతి తన బుద్ధి కుశలతను ప్రదర్శించాడు. అపుడు శంకరుడు గణపతికి గణాధిపత్య పదవిని ఇచ్చారు.
సుబ్రహ్మణ్యుడికి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పార్వతీ పరమేశ్వరులిద్దరూ సుబ్రహ్మణ్యుడిని ఇంటికి రమ్మనమని కోరడానికి వెళ్ళారు. వీరిని చూసి సుబ్రహ్మణ్యుడు 24 క్రోసుల ముందుకు వెళ్ళిపోయాడు. అపు

డు శంకరుడు మల్లెతీగల చేత చుట్టుకోబడిన ఒక అర్జున వృక్షం క్రింద కూర్చున్నాడు. అపుడు పార్వతీదేవి కూడా వెళ్ళింది. పిల్లవాడు ఎలా ఉన్నాడో అని శంకరుడు సుబ్రహ్మణ్యుడు ఉన్న చోటుకు వెళ్లి కొడుకును బుజ్జగించాడు. ఆయన అలక తీరిపోయింది. ఆయన మహా జ్ఞానిగా నిలబడ్డాడు. శ్రీశైలమునకు పరమేశ్వరుడు ప్రతి అమావాస్య నాడు వెళ్లి దర్శనం చేసి వస్తూ ఉంటాడు. ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారు వెళ్లి దర్శనం చేసి వస్తూ ఉంటుంది. పిల్లవానికి దగ్గరలో ఉన్నామని అనిపించుకోవడానికి అక్కడే ఉంది సుబ్రహ్మణ్యుడిని చూసుకుంటూ ఈ మల్లెచెట్టు క్రిందకి వచ్చాము కదా అని అక్కడ వెలశారు. మనం అలకచేతనో, అజ్ఞానం చేతనో మన శరీరములను చూసుకుని భగవంతునికి దూరం అవుతున్నాము. ఇలాంటి వాళ్ళు ఎవరయినా ఉంటే వాళ్ళ దగ్గరకు తానే వెళ్ళిపోతాను అని చెప్పి వచ్చి పరమశివుడు శ్రీశైలంలో కూర్చున్నాడు. శ్రీశైల మల్లికార్జునుడిది ధూళి దర్శనం. మీరు మీ ప్రదేశం నుంచి శ్రీశైలం వెళ్ళే లోపల ఎంతో అశౌచమునకు లోనవుతుంది మీ శరీరం. ఆ బట్టలతో కొండమీదకి వెళతారు. మీరు శుభ్రపడి దర్శనానికి వెడితే ఆయన కొద్దిగా చిన్నబుచ్చుకుంటాడట. మీరు ఆ క్షేత్రమునకు వెళ్ళగానే ఆశౌచంతో కూడిన శరీరంతో గుడి దగ్గరకు వెళ్లి ధూళి దర్శనమునకు వచ్చాము అని చెప్పి లోపలి వెళ్లి ఈ మట్టి కాళ్ళతో మోకాళ్ళ మీద కూర్చుని మట్టి చేతులతో శివలింగమును ముట్టుకుని, శివలింగం మీద తల తాటిస్తే పరమేశ్వరుడు పొంగి పోయి సర్వకామ్య సిద్ధిని ఇస్తాడుట. దీనిని ధూళి దర్శనం అంటారు శ్రీశైలంలో. కాబట్టి శ్రీశైలంలో ధూళి దర్శనం చెయ్యాలి.
అసురసంధ్య వేళలో నందివాహనం భూమండలం మీదనుండి వెడుతుంది. అటువంటి సమయంలో పరమాత్మ శ్రీశైలపర్వతం మీద ఒకసారి దిగుతాడు. అంత పరమ పవిత్రమయిన సమయంలో శ్రీశైలంలో దేవాలయంలో కూర్చుని శివాష్టోత్తర శతనామములు చదువుకున్నట్లయితే అక్కడ దిగిన పరమాత్మ అది చూసి ఆయనను అన్ని పేర్లు పెట్టి పిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తాడు. జన్మ చరితార్థం అయిపోతుంది. చెంచులు చెవిటి మల్లన్నా అని అరుస్తూ ఉండేవారు. చెవిటి మల్లన్న అంటే ఆయన పొంగిపోతాడట. శ్రీశైలంలో పరమేశ్వరుడు తన భక్తుల కోర్కెలను తీర్చడానికి ఒక తండ్రిగా వచ్చి కూర్చున్నాడు. శ్రీశైలం స్వామీ వారిని దర్శించడానికి వచ్చిన వారి గోత్రనామమునలు ప్రత్యేకంగా ఒక చిట్టాలో వ్రాయమని అమ్మవారు గణపతికి చెప్పింది. అందుకే శ్రీశైలం వెడితే తప్పకుండా సాక్షి గణపతి దగ్గర ఆగాలి. లోపలి వెళ్లి మన గోత్రం, పేరు, చెప్పుకోవాలి. గణపతి మన గోత్ర నామమును చిట్టాలో రాసేసుకుంటారు.
శ్రీశైలంలో శిఖరేశ్వరం ఉంది. అక్కడికి నువ్వులు పట్టుకెళ్ళి నంది విగ్రహం దగ్గర పోస్తారు. పూర్వకాలంలో శివాలయంలో చరనంది ఉండేది. పూర్వం రోజులలో ఇప్పుడు ఉన్నంత వైద్య సదుపాయం ఉండేది కాదు. శివాలయం, విష్ణ్వాలయం తప్పకుండా ఉండి తీరేవి. ఎవరయినా గర్భిణీకి అనుకోకుండా నొప్పులు వస్తే పట్నానికి తీసుకు వెళ్ళడానికి అవకాశం లేకపోతే అంతరాలయం మూసేసి ఉన్నా కూడా పరుగెత్తుకుంటూ అర్చకుడి దగ్గరకు వెడితే ఆలయ ప్రధాన ద్వారం తీసేవారు. ఈ బాధ పడుతున్న గర్భిణి ఇల్లు ఎటువైపు ఉన్నదో అటువైపు చరనందిని తిప్పేవారు. ఈ చరనంది అటు తిరగగానే అటువైపు బాధపడుతూ ప్రసవం జరగకుండా ప్రాణాలు పోతాయేమో నని అనుకున్న వాళ్లకి కూడా ఎందరికో సుఖప్రసవములు జరిగేవి. అందుకే అనేక శివాలయములలో చరనంది ఉండేది. శిఖరేశ్వరంలో కూడా మనం ఈశ్వరుణ్ణి పొందలేక పడుతున్న బాధ నుంచి విముక్తం కావడానికి నువ్వులు వేసి తిప్పి శిఖరం చూడాలి. కానీ యథార్థమునాకు శిఖరము నంది శృంగములలోంచి కనపడదు. మీరు భావన చేస్తూ కళ్ళు తెరచి అక్కడ చూడాలి. ఈ కన్నులు తెరచి నంది శృంగములలోంచి చూస్తుంటే జేగురు రంగులో ఉన్న శ్రీశైల మల్లికార్జునుని ఆలయ గోపురం మీద వున్నా త్రిశూలంతో కూడి మెట్లు మెట్లుగా ఉన్న శిఖరం మీకు కనపడాలి. అలా కనపడిన వాడికి ఒక పునర్జన్మ ఉండదు. అందుకే శిఖరేశ్వర దగ్గర పరమాత్మ ఒక పరీక్ష పెట్టాడు. ఒకసారి అమ్మవారు ‘ఏమండీ శిఖరేశ్వరం దగ్గరకు వచ్చి నందిని తిప్పి శిఖరం చూస్తే ఇక పునర్జన్మ లేకుండా మోక్షమును ఇచ్చేస్తారా? అని. అపుడు శంకరుడు “శ్రీశైలం వచ్చిన వారందరికీ మోక్షం ఇవ్వను. ఎవరికి ఇస్తానో నీకు చూపిస్తాను అని ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమును స్వీకరించారు. ఒక వృద్ధ బ్రాహ్మణిగా పార్వతీదేవి వచ్చింది. ఇద్దరూ ఆ శిఖరేశ్వరం దగ్గరికి వచ్చారు. మెట్లు ఎక్కుతున్నారు. నంది శృంగముల లోంచి చూస్తున్నారు. క్రిందికి దిగిపోతున్నారు. ఈశ్వరుడు అక్కడ చిన్న ఊబిని సృష్టించాడు. అందులో వృద్ధ బ్రాహ్మణుడు దిగిపోతున్నాడు. ఆ ఒడ్డున ఉన్న వృద్ధ బ్రాహ్మణి ‘మా అయన దిగబడిపోతున్నాడు. అందుకని ఎవరయినా ఒక్కసారి చేయినిచ్చి పైకి లాగండి’ అన్నది. అందరూ గబగబా వచ్చి చెయ్యి ఇవ్వబోయారు. అపుడు ఆమె మీలో పాపం లేనివారు పైకి లాగండి అంది. అపుడు ప్రతివాడూ తాను ఏదో పాపం చేసి ఉండక పోతానా అనుకుని వెనక్కి వెళ్ళిపోయారు. ఆ సమయంలో అటుగా ఒక వేశ్య కిందికి దిగుతోంది. ఈవిడ వేశ్య అని అందరూ అంటున్నారు. ఆవిడ దిగుతూ వచ్చి నేను లాగుతాను అన్నది. అపుడు పార్వతీ దేవి ఏమమ్మా, అందరూ మాకు

కార్తిక పురాణం 8 వ అధ్యాయము
శ్రీ హరి నామస్మర ణా ధన్యోపాయం
వశిష్టుడు చెప్పిన దంతా విని' మహానుభావా! తమరు చెప్పిన ధర్మములన్ని౦టిని శ్రద్దగా వింటిని. అందు ధర్మము బహు సుక్ష్మ మనియు, పుణ్యం సులభ౦గా కలుగు ననియూ, అది- నదీస్నానము, దీపదానము, ఫలదానము అన్నదానము, వస్త్ర దానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప దర్మములచేతనే మోక్షము లబించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీవంటి మునిశ్రేష్టులె చెప్పు చుందురు గదా! మరి తమరు యిది సూక్ష్మములో మోక్షముగా కనబరచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పటింపక, వర్ణ సంకరులై రౌరవాది నరక హేతువులగు మహా పాపములు చేయువారు యింత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్ధించు చున్నాను'యని కోరెను.
అంతట వశిష్టుల వారు చిరునవ్వు నవ్వి .' జనక మహారాజా! నీవు వేసిన ప్రశ్న సహేతుక మైనదే, నేను వేద వేదంగ ములను కూడా పటి౦చితిని. వానిలో కూడా సుక్ష్మ మార్గాలున్నవి. అవి యేమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మము మూడు రకములు సాత్విక, మనగా దేశ కాల పాత్రలు మూడును సమకూడిన సమయమును సత్త్వమను గుణము జని౦చి ఫలమంతయును పరమేశ్వరర్పితము కావించి, మనో వాక్కాయ కర్మలచె నొనర్చిన ధర్మము అ ధర్మమందు యె౦తటా ఆధిక్యత కలదు. సాత్త్విక ధర్మము సమస్త పాపములను నాశన మొనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్ర మున కలియు తావునందు స్వాతికర్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి ధగ ధగ మెరిసి, ముత్యమగు విధానముగా సాత్త్వికత వహించి, సాత్త్విక ధర్మ మాచరించుచూ గంగ, యమునా, గోదావరి, కృష్ణ నదుల పుష్కరాలు మొదలుగు పుణ్య కాలముల యందు దేవాలయముల యందు- వేదములు పటించి, సదచారుడై, కుటి౦బీకుడైన బ్రాహ్మణునకు యెంత స్వల్ప దానము చేసిననూ, లేక ఆ నదీ తీరమందు న్న దేవాలయం లో జపత పాదు లొనరించినను విశేష ఫలమును పొందగలరు.
రాజస ధర్మమ మనగా- ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన దర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలు కలిగించున దగను.
తామస ధర్మమనగా - శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికా చరణార్ధం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలము నీయదు.
దేశకాల పాత్రము సమ కూడిన పుడు తెలిసి గాని తెలియకగాని యే స్వల్ప ధర్మం చేసిననూ గొప్ప ఫలము నిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భ స్మమగునట్లు శ్రీ మన్నా నారాయుణుని నామము, తెలిసి గాని, తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక యితిహాసము కలదు.
ఆజా మీళుని కథ
పూర్వ కాలమందు కన్యా కుబ్జ మను నగరమున నాల్గు వేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్య వ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమ వతియను భార్య కలదు. ఆ దంపతులన్యోన్య ప్రేమ కలిగి అ పూర్వ దంపతులని పేరు బడసిరి. వారికి చాలాకాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించెను. వారాబాలుని అతి గారాబముగా పెంచుచు, అజా మీళుడని నామకరణము చేసిరి. ఆ బాలుడు దిన దిన ప్రవర్ధ మానుడగుచు అతి గారాబము వలన పెద్దలను కూడ నిర్లక్షముగా చూచుచు, దుష్ట సావసములు చేయుచు, విద్య నభ్య సింపక, బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించు చుండెను. ఈ విధముగా కొంత కాలమునకు యవ్వనము రాగా కమంధుడై, మంచి చెడ్డలు మరిచి, యజ్ఞో పవితము త్రెంచి, మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీ ని వలచి, నిరంతరము నామెతోనే కామా క్రీడలలో తేలియాడుచూ, యింటికి రాకుండా, తల్లిదండ్రులను మరిచి, ఆమె యి౦ టనే భుజించు చుండెను. అతి గారాబము యెట్లు పరిణమించినదో వింటివా రాజా! తామ బిడ్డలపై యెంత అనురాగామున్ననూ పైకి తెలియ పర్చక చిన్ననాటి నుంచీ అదుపు ఆజ్ఞలతో నుంక పోయిన యెడల యీ విధంగానే జురుగును. కావున ఆజామీళుడు కుల భ్రష్టుడు కాగా, వాని బంధువుల తనని విడిచి పెట్టిరి. అందుకు ఆజామీళుడు రెచ్చిపోయి వేటవలన పక్షులను, జంతువులను చంపుతూ కిరాత వృత్తి లో జీవించు చుండెను. ఒక రోజున ఆ యిద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫ రములు కోయుచుండగా ఆ స్త్రీ తెనేపట్టుకై చెట్టే క్కి తేనెపట్టు తియబోగా కొమ్మ విరిగి క్రింద పది చనిపోయెను. ఆజామీళుడు ఆ స్త్రీ పైబడి కొంత సేపు యేడ్చి, తరువాత ఆ అడవి యందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ యెరుకుల దానికి అంతకు ముందే ఒక కుమార్తె వుండెను. కొంత కాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామంధ కారాముచె కన్ను మిన్ను గానక ఆజా మీళుడు ఆ బాలికను కూడ చేపట్టి ఆమెతో కూడ కామ క్రీడలలో తేలియాడు చుండెను. వారికి యిద్దరు కొడుకులు కూడ కలిగిరి. ఇద్దరూ పురిటి లోనె చచ్చిరి. మరుల ఆమె గర్భము దరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి 'నారాయణ'అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైన నూ ఆ బాలుని విడువక, యెక్కడకు వెళ్ళినా వెంట బెట్టుకుని వెళ్ళు చూ, ' నారాయణా-నారాయణా' అని ప్రేమతో సాకు చుండిరి. కాని ' నారాయణ'యని స్మరించిన యెడల తన పాపములు నశించి, మోక్షము పొంద వచ్చునని మాత్ర మతానికి తెలి

యకుండెను. ఇట్లు కొంత కాలము జరిగిన తర్వాత అజా మీళునకు శరీర పటుత్వము తగ్గి రోగ గ్రస్తుడై
మంచము పట్టి చావునకు సిద్ద పడి యుండెను. ఒకనాడు భయంకరాకారములతో, పాశాది ఆయుధములతో యమ భటులు ప్రత్యక్ష మైరి. వారిని చూచి అజా మీళునకు భయము చెంది కుమారుని పైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక ' నారాయణా" నారాయణా' యనుచునే ప్రాణములు విడిచెను. అజా మీ ళుని నోట ' నారాయణా' యను శబ్దము వినబడగానే యమ భటులు గడ గడ వణక సాగిరి. అదే వేళకు దివ్య మంగళ కారులు శంఖ చక్ర గదా ధరులూయగూ శ్రీ మన్నారాయణుని దూతలు విమానములో నచ్చటికి వచ్చి ' ఓ యమ భటులారా! వీడు మావాడు మేము వీనిని వైకు౦ టమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి'యని చెప్పి, అజా మీళుని విమాన మెక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు ' అయ్యా! మీ రెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు. వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమి చ్చటికి వచ్చితిమి గాన, వానిని మాకు వదలుడని కొరగా విష్ణు దూతలు యిట్లు చెప్పదొ డ౦గిరి.
ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి
ఎనిమిదో అధ్యయము- ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

_*🚩శ్రీ శివ మహా పురాణం - 8🚩*_
🕉🍀🕉🍀🕉🍀🕉🍀🕉🍀🕉
*హాటకేశ్వరం*
☘☘☘☘☘☘☘☘☘
శ్రీశైలంలో హాటకేశ్వరము అని ఒక దేవాలయం ఉంది. అది చిత్రమయిన దేవాలయం. ఒక బంగారు లింగం తనంత తాను కుండపెంకునందు ఆవిర్భవించిన హాటకేశ్వర దేవాలయము క్షేత్రము కనుక దానిని ‘హాటకేశ్వరము అని పిలుస్తారు. అక్కడ మెట్లు బాగా క్రిందికి వస్తే ఫాల దారాలు, పంచ దారాలు అని అయిదు ధారలు పడుతుంటాయి. పరమశివుని లలాటమునకు తగిలి పడిన ధారా ఫాలధార. అనగా జ్ఞానాగ్ని నేత్రమయిన ఆ కంటినుండి, పైనుండి జ్ఞానగంగ మరింతగా తగిలి క్రింద పడిన ధార. ఇది శివుడి లలాటమును తగిలి వస్తున్నధార అని లోపలికి పుచ్చుకుంటే ఉత్తర క్షణం మీరు గొప్ప ఫలితమును పొందుతారు. ఎందుచేత ఇలా ఏర్పడింది? ఈశ్వరాలయంలో తీర్థం ఇవ్వరు కాబట్టి సాక్షాత్తు సాకార రూపుడయిన శంకరునికి తగిలి పడిన ధార ఫాలధార. పంచధారలు అయిదు రకములుగా ప్రకాశిస్తున్న భగవంతుని శిరస్సులకు తగిలి పడిన ధారలు. ఆ తీర్థం తీసుకునేటప్పుడు మర్యాద పాటించాలి. చెప్పులతో వెళ్ళకూడదు. శంకర భగవత్పాదుల వారు తపస్సు చేసి అక్కడే శివానందలహరి చెప్పారు. అక్కడ ఆయనకు భ్రమరాంబికా దేవి ప్రత్యక్షం అయింది. చంద్రశేఖర పరమాచార్య స్వామి తపస్సు చేసుకుంటూ ఉండిపోతాను అన్న ప్రదేశం అదే. అంత పరమమయిన ప్రదేశంలో పంచధారలు పడతాయి. అందులో ఒకటి బ్రహ్మధార. ఒకటి విష్ణు ధార, ఒకటి రుద్రధార, ఒకటి చంద్రధార, ఒకటి దేవధార. ఈ పంచధారలను స్వీకరించడం సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త లోక సాక్షులయిన సూర్యచంద్రులు ఈ అయిదు తీర్థములను అక్కడ తీసుకోవచ్చు. అంత పరమ పావనమయిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం.
శ్రీశైలంలో ఉండే భ్రమరాంబా అమ్మవారి దేవాలయం వెనకాతల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్లి చెవిని బాగా నొక్కిపెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మెద చేసిన ఝుంకారము వినపడుతుంది. దానిని భ్రామరీ నాదము అంటారు. అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మెదరూపంలో ఉన్న రెక్కలతో అలంకారం చేస్తారు. ఆ తల్లిముందు శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రములను వేశారు. అక్కడికి వెళ్లి అమ్మవారి శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లి అయినా కుంకుమార్చన చేస్తే ఆమె పూర్ణంగా మూడు తరములు చూసి హాయిగా పదిమంది చేత పండు ముత్తైదువ అని అనిపించుకుని వార్ధక్యంలో హాయిగా ఆవిడ భర్తగారి తొడమీద తల పెట్టుకొని ప్రాణం విడిచిపెట్టగలిగిన అదృష్టం కలుగుతుంది. శ్రీశైలలింగమునకు పట్టు తేనెతో అభిషేకం చేస్తే ఉత్తర జన్మలలో గంధర్వగానం వస్తుంది. భ్రమరాంబికా అమ్మవారి దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకోవాలి. నాలుగు మారేడు దళములు పట్టుకెళ్ళి ఆ శివలింగమును తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి. తల తాటించి నమస్కరించుకోవాలి.
పూర్వం అరుణాసురుడనే రాక్షసుడొకడు బయలుదేరాడు. వాడు బ్రహ్మ ఇచ్చిన వరముల వల్ల మిక్కిలి గర్వమును పొంది లోకముల నన్నిటిని క్షోభింపజేస్తున్నాడు. ఆ సమయంలో అమ్మవారు భ్రామరీ రూపమును పొందింది. భయంకరమయిన యుద్ధం చేసిన తరువాత భ్రామరీ రూపంతో వెళ్ళి ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది. ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపూవు అయితే అమ్మవారు సారగ్రాహి అని చెప్తారు. తుమ్మెద ఎప్పుడూ పువ్వుచుట్టూ తిరుగుతుంది. ఆయన మల్లికార్జునుడు. ఆవిడ భ్రమరాంబికా దేవి. ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతూ ఉంటుంది. అక్కడ శివుడు ఉన్నాడు. పైన శక్తి రూపంతో ఆవిడ ఉన్నది. అందుకే ఇప్పటికీ ఆనాదం వినపడుతూ ఉంటుంది. ఈ నాదమును ఆలిండియా రేడియో హైదరాబాద్, కర్నూల్, విజయవాడ స్టేషన్లు రికార్డుచేశాయి. శ్రీశైలం వెళ్లి అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారి కనుగుడ్లు స్పష్టంగా కనపడుతుంటాయి. ఆమె ముందు గల శ్రీచక్రం ముందు కూర్చుని కుంకుమార్చన చేసుకుని “అవిద్యానామంతస్తిమిర మిహిరద్వీపనగరీ” అని సౌందర్యలహరి లోని నాలుగు శ్లోకములు చెప్పుకుని వస్తే జన్మ ధన్యం అయిపోతుంది.
అక్కడ ఉన్న స్వరూపములలో వీరభద్రుడు ఒకడు. శ్రీశైల మల్లికార్జునుని దర్శనం చేసి బయటకు వచ్చి ఎడమ పక్కకు వెళ్ళినప్పుడు అక్కడ వీరభద్రుడు కనపడతాడు. అక్కడ బయలు వీరభద్రుడు అని క్షేత్ర పాలకుడు ఒకాయన ఉన్నాడు. రక్త సంబంధమయిన వ్యాధులు శరీరంలో పొటమరిస్తే అటువంటి వారు శ్రీశైల క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వరూపం దగ్గర కూర్చుని ప్రతిరోజూ ఒక గంట సేపు శివనామములు చెప్పుకుని కొద్దిరోజులు అక్కడ ఉండి వస్తే ఆ వ్యాధులు నయం అవుతాయి. అలా నయమయిన సందర్భములు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఉన్న వీరభద్ర మూర్తిలోంచి అటువంటి శక్తి ప్రసారం అవుతుంది అని పెద్దలు చెప్తారు.
చంద్రవతి అనే రాజకుమార్తె ఒక భయంకరమయిన గడ్డు కాలమును ఎదుర్కొంది. తన తండ్రే తనను మోహించాడు. ఆమె పరుగెత్తి శ్రీశైల క్షేత్రమును చేరుకొని గుళ్ళోకి వెళ్ళిపోయింది. రాజు ఆమె వెనుక తరుముకు వస్తున్నాడు. గుళ్ళోకి వెళ్ళిన ఆమె శివలింగమును చూసి దానిని శివలింగమని అనలేదు. అక్కడ మల్లికార్జునుడు ఉన్నాడు అని ఆమె చేతిలో ఉన్న మల్లెపూల దండను సిగకు చుట్టుకుని ‘మల్లికార్జున నేను నీకు ఇవ్వగలిగింది ఇదే – ఇది నీ సిగకు చుట్టుకుని నన్ను నీవు కాపాడు’ అని ప్రార్థించింది. అప

ురం మీద యిప్పటికీ చెక్కబడి ఉంటుంది. భవానీమాత ప్రత్యక్షమై ‘ఈ చంద్రహాసమును చేత పట్టుకో నీకు ఎదురు లేదు’ అని అనుగ్రహించి శివాజీకి చంద్రహాసమును బహూకరించింది. ఆ కత్తి పట్టుకునే మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యమును స్థాపించాడు. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ుడు లింగోద్భవ మూర్తి స్వామి వచ్చి ఆమెను తరుముకు వస్తున్నా రాజును చూసి నీవు పచ్చలబండవగుదువుగాక అని శపించాడు. అంతటి దుష్కృత్యమునకు ప్రయత్నించిన ఆ రాజు పచ్చలబండ అయి ఇప్పటికీ అలా పడి ఉన్నాడు. ఈవిడ ఇచ్చిన మల్లికా పుష్పముల మాలను తన సిగకు చుట్టుకుని స్వామి మల్లికార్జునా అని మరొకమారు పిలిపించుకున్నాడు.
శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జునుడు అని ఉన్నాడు. ఆ శివలింగం ముడతలు పడిపోయి ఉంటుంది. ఆ ముడతలు బాగా దగ్గరగా వచ్చేసి ఉంటాయి. ఈ మల్లికార్జునుడు ఎప్పుడు వెలసినదీ సాధికారికంగా చెప్పలేము. కానీ అక్కడ జరిగిన విచిత్రం ఒకటి ఉంది. మహీధర మహారాజు అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకు ఒక కుమార్తె. ఆమె శంకరుని సౌందర్యమును ఉపాసన చేసింది. సాధారణంగా ఈశ్వరుని తండ్రిగా ఉపాసన చేస్తారు. కానీ ఆమె శివుణ్ణి మోహించింది. తనకి శివుడి వంటి భర్త కావాలంది. ఈ పిల్ల ఏమి చేస్తుందో అని శంకరుడు ఆమె కలలోకి వచ్చి “నీకు నన్ను వివాహం చేసుకోవాలని ఉంటే శ్రీగిరి పర్వతం మీద ఉన్న తెల్ల మద్దిచెట్టు కిందవున్న మల్లెపొదలో ఉన్నాను. అక్కడకు రా నిన్ను వివాహం ఆడతాను’ అన్నాడు. ఆమె శంకరుడు చెప్పిన చోటికి వచ్చి ఆ చెట్టును, పొదను వెతుకుతోంది. అపుడు పార్వతీ దేవి “జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని చెప్తారు. కానీ మీకు ఈ బుద్ధి ఎప్పటినుంచి వచ్చింది అని శంకరుని అడిగింది. అపుడు శంకరుడు ఆమె నన్ను భక్తితో ఆరాధన చేసింది. ఇక్కడ వివాహం అనగా నేను ఆవిడను నాలోకి తీసుకోవడం అని చెప్పాడు. అపుడు పార్వతీ దేవి అయితే ఆమెకు ఉపాసనలో అంత భక్తి ఉన్నదా? అని అడిగింది. అపుడు శంకరుడు ఆమె ఎంత భక్తి తత్పరురాలో చూపిస్తాను చూడు అని వెంటనే 96 సంవత్సరముల వృద్ధునిగా మారి వెతుకుతున్న పిల్ల దగ్గరకు వెళ్ళి పిల్లా నీవు ఇక్కడ ఎవరి కోసం వెతుకుతున్నావు? అని అడిగాడు. ఆమె తాను శివుడి కోసం వెతుకుతున్నాను అని జవాబు చెప్పింది. అపుడు ఆయన నేనే శివుడిని, ఇంత వృద్ధుడిని కదా నన్ను పెళ్ళాడతావా? అని అడిగాడు. నీవు వృద్దుడవో యౌవనంలో ఉన్నవాడివో నాకు తెలుసు. నాకు నీవే భర్త. వేరొకరిని ఈ లోకంలో నేను భర్తగా అంగీకరించను అని చెప్పింది. ఆవిడకు కావలసింది ఆయనలో ఐక్యమవడం. చూశావా పార్వతీ, ఈమె భక్తి ఈమెను నాలో ఐక్యం చేసుకుంటున్నాను అని శివుడు ఆమెను తనలో ఐక్యం చేసుకుని ఈ పిల్లను స్మరించి ఇటువంటి భక్తి తత్పరురాలికోసం సృష్టిలో లేని విధంగా ముడతలు పడిపోయిన శివలింగమని, వృద్ధ మల్లికార్జున లింగమని తలచుకున్న వాళ్ళని, పొంగిపోతూ నేను చూస్తాను అని వృద్ధ మల్లికార్జునుడై వెలిశాడు. అందుకే ఇప్పుడు అక్కడ కళ్యాణములు చేస్తున్నారు. ఈవిధంగా శ్రీశైలం ఎన్నో విశేషములతో కూడుకున్న క్షేత్రం.
ఈ క్షేత్రంలోనే శంకరాచార్యుల వారు శ్రీశైల శిఖరం మీద ఉండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరాచార్యుల వారి శిరస్సు కావాలని అడిగాడు. అపుడు శంకరాచార్యుల వారు ‘నా శిరస్సును ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నీవు నా శిరస్సును తీసుకుంటే నా శిష్యులు బాధపడతారు. నా శిష్యులు ఉదయముననే పాతాళగంగ దగ్గరకు వెడతారు. అప్పుడు వచ్చి నా శిరస్సు ఉత్తరించి పట్టుకు వెళ్ళు’ అని చెప్పారు. మరునాడు ఉదయం ఆ కాపాలికుడు వచ్చి ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యుల వారి శిరస్సును ఉత్తరించడం కోసమని చేతిలో ఉన్న కత్తి పైకెత్తిన సమయంలో స్నానం చేస్తున్న పద్మపాదాచార్యుల వారికి ఏదో అమంగళం గోచరించి అక్కడి నుండే నరసింహ మంత్రోపాసన చేశారు ఆయన. ఎక్కడి నుండి వచ్చాడో మహానుభావుడు నరసింహుడు గబగబా వచ్చి కత్తినెత్తిన కాపాలికుడి శిరస్సును త్రుంచి అవతల పారేసి నిలబడ్డాడు. ఆ తేజోమూర్తిని శంకరాచార్యుల వారు నరసింహ స్తోత్రంతో ప్రార్థన చేశారు. ఈవిధంగా నరసింహ స్వామీ దర్శనం ఇచ్చిన క్షేత్రం. శివకేశవ అభేదంగా శంకర భగవత్పాదులు రక్షించబడిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. అది జగద్గురువులను రక్షించుకున్న కొండ. అది మన తెలుగునాట ఉన్న కొండ.
అక్కడ ప్రవహించే కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు. కృష్ణా నది శ్రీశైల పర్వతశిఖరమును పామువలె చుట్టుకొని ప్రవహిస్తుంది. శివుడిని విడిచి పెట్టలేక భక్తుల పాపములను తొలగించడానికి ఉత్తరమున ఉన్న గంగ దక్షినమునకు వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది కాబట్టి దానిని ‘పాతాళ గంగ అని పిలుస్తారు. ఆలయ ప్రాంగణంలో పంచపాండవులు అరణ్య వాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ఠ చేసిన లింగములు అయిదు ఉంటాయి. దేవాలయంలో తూర్పున కృష్ణ దేవరాయలు నిర్మించిన గోపురం దక్షిణమున హరిహర రాయలవారు నిర్మించిన గోపురములు కనపడతాయి. ఆ ఆలయ ప్రాంగణంలోనే త్రిఫల వృక్షమని ఒక పెద్ద వృక్షం ఒకటి ఉంటుంది. అది మేడి, జువ్వి, రావి – ఈ మూడూ కలిసి పెరిగిన చెట్టు. ఆ చెట్టు నాలుగు వేల సంవత్సరములు బ్రతికింది. అక్కడికి సమీపంలోనే వృద్ధ మల్లికార్జునుడు ఉంటాడు/ ఆ వెనుక రాజరాజేశ్వరీ దేవాలయం. సమీపంలో భ్రమరాంబ అమ్మవారి త్రిఫల వృక్షం ఉంటాయి. ఉత్తరమున శివాజీ గోపురం, కళ్యాణమంటపం, నందనవనం అనే పుష్పవాటిక ఉంటాయి. ఆ వనంలో సుబ్రహ్మణ్య స్వామీ నెమలితో ఉంటారు.
శివాజీ మహారాజు అక్కడికి వెళ్లి అమ్మవారి ప్రార్థన చేశాడు. ఆ దృశ్యం శివాజీ గోప

ద్వాదశలింగ స్తోత్రమ్
౧. సౌరాష్ట్ర దేశే వసధావకాశే జ్యోతిర్మయం చంద్రకళావతంసమ్!
భక్తి ప్రదానాయ కృతావతారం తం సోమనాథం శరణం ప్రపద్యే!!
౨. శ్రీశైల శృంగే వివధ ప్రసంగే శేషాద్రి శృంగేపి సదా వసంతమ్!
త మర్జునం మల్లికపూర్వమేనం నమామి సంసార సముద్రసేతుమ్!!
౩. అవంతికాయాం విహితావతారం ముక్తి ప్రదానాయ చ సజ్జనానామ్!
అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాళ మహం సురేశమ్!!
౪. కావేరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ!
సదైవ మాంధాతృపురే వసంత మోంకార మీశం శివ మేక మీడే!!
౫. పూర్వోత్తరే పారలికాభిధానే సదాశివం క్తం గిరిజా సమేతమ్!
సురా సురారాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం సతతం నమామి!!
౬. ఆమర్ద సంజ్ఞే నగరే చ రమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః!
సద్భుక్తి ముక్తి ప్రద మీశ మేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే!!
౭. సానంద మానందవనే వసంత మానందకందం హతపాపబృందమ్!
వారణాసీనాథ మనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే!!
౮. యో డాకినీ శాకినికా సమాజే నిషేవ్యమాణః పిశితాశనైశ్చ!
సదైవ భీమాది పద ప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి!!
౯. శ్రీతామ్రపర్ణీ జలరాశియోగే నిబధ్య సేతుం నిశి బిల్వపత్రైః!
శ్రీరామచంద్రేణ సమర్చితం తం రామేశ్వాఖ్యం సతతం నమామి!!
౧౦. సింహాద్రి పార్శ్వేపి తటే రమన్తం గోదావరీతీర పవిత్రదేశే!
యద్దర్శనాత్పాతక జాతనాశః ప్రజాయతే త్ర్యంబక మీశమీడే!!
౧౧. హిమాద్రి పార్శ్వేపి తటే రమన్తం సంపూజ్యమానం సతతం మునీంద్రైః!
సురాసురైర్యక్ష మహోరగాద్యైః కేదార సంజ్ఞం శివమీశమీడే!!
౧౨. ఏలాపురీ రమ్యశిలాలయేస్మిన్సముల్ల సంతం త్రిగద్వరేణ్యమ్!
వన్దేమహోదార తర స్వభావం సదాశివం తం ధిషణేశ్వరాఖ్యమ్!!
౧౩. ఏతాని లింగాని సదైవ మర్త్యాః ప్రతః పఠంతోమలమానసాశ్చ!
తే పుత్త్ర పౌత్త్రైశ్చ ధనై రుదారైః సత్కీర్తి భాజ స్సుఖినో భవన్తి!!
ఇతి శ్రీ మచ్ఛంకర భగవత్పాద కృతం ద్వాదశలింగ స్తోత్రం సంపూర్ణమ్!!

🕉🏵#కార్తీక_పురాణం - 9 🏵🕉
💮 9 వ అధ్యాయము : విష్ణు పార్షద, యమదూతల వివాదము. 💮
యమదూతల ప్రశ్నలకు చిరునగవుమోము కలవారైన విష్ణుదూతలు యిలా భాషించసాగారు, 'ఓ యమదూతలారా! మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు? పుణ్యాత్ములెవరు? యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ విపులీకరించి చెప్పండి?'
విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలిలా సమాధానమీయసాగారు. "సూర్యచంద్రాగ్ని వాయురాకాశ గోసంధ్యలూ దశదిశా కాలాలూ, వీనిని మానవుల యొక్క పాప పుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము.
ఓ విష్ణుదేవతలారా! శ్రద్ధగా వినండి - వేదమార్గాన్ని విడిచిన స్వేచ్చాచారులూ, సాధుజన బహిష్కృతులూ యమదండనార్హులు. బ్రహ్మణునీ, గురువునీ, రోగినీ పాదాలతో తాడించేవాడు - తల్లిదండ్రులతో కలహించేవాడూ, అసత్యవాదీ, జంతుహింసకుడూ, దానము చేసిన దానిని మరలా ఆశించేవాడూ, డాంబికుడూ, దయారహితుడూ, పరభార్యాసంగాముడూ, సొమ్ములను తీసుకొని పక్షాన్ని అవలంబించేవాళ్లనీ, చేసినదానాన్ని బైటపెట్టుకునే వానినీ, మిత్రద్రోహినీ, కృతఘ్నులనీ, ఇతరుల పురుష సంతతిని చూసి యేడ్చేవానినీ, కన్యాశుల్కాలతో జీవించేవానినీ, వాపీకూప తటాకాది నిర్మాణాటంకపరులనీ, తల్లిదండ్రుల శ్రాద్ధకర్మలను విడచినవానినీ, కేవలం భోజనం గురించే ఆలోచించేవానినీ, బ్రహ్మణాశ్వ గోహత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మాచేత దండించబడుతూంటారు. ఇక ఈ అజామిళుడంటారా? వీడు చేయని పాపమంటూ లేదు. బ్రహ్మణ జన్మమెత్తి, దాసీ సంగమ లోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికెలా అర్హుడు!"
యమదూతల సమాదానాన్ని విని - విష్ణుపార్షదులిలా చెప్పసాగారు.
"ఓ యమదూతలారా! ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణము వలన గాని దుస్సంగమాన్ని వదలి సత్సంగమములో కలిసేవాడు, నిత్యము దైవచింతనాపరుడు, స్నాన సంధ్యా జపహోమ తత్సరుడూ మీ యమలోక గమనానికి అర్హులు కారు.
ఓ యమదూతలారా! అసూయారహితులై, జపాగ్నిహోత్ర నిర్వాహకులై, సర్వ కర్మలనూ సగుణ బ్రహ్మార్పణము చేసేవారు - జలాన్నగోదాతలు. వృషోత్సర్జనా కర్తలూ యమలోకాన్ని పొందేందుకు అనర్హులు. విద్యాదాత (గురువులు), పరోపకార శీలురు, హరిపూజాప్రియులు, హరినామ జాపకులూ, వివాహ - ఉపనయనాలను చేయించే వారూ - అనాథ ప్రేత సంస్కారకర్తా - వీళ్లెవరూ మీ యమదండనల కర్హులు కారు. నిత్యము సాలగ్రామాన్ని అర్చించి, తత్తీర్థాన్ని పానము చేసే వాడూ - తులసీకాష్ఠ మాలికలను ధరించేవాడూ, వివేవాడూ - సూర్యుడు మేష - తులా - మకర సంక్రాంతులందుండగా ప్రాతఃస్నానమును ఆచరించేవాళ్లూ - వీళ్లెవరూ కూడా మీ యమలోకానికి అనర్హులు. తెలిసిగాని - తెలియకగాని హరినామ సంకీర్తనమును చేసే వాళ్లు - పాపవిముక్తులవుతారు. ఓ యమదూతలారా! ఇన్నిమాటలెందుకు? ఎవడైతే అవసానకాలంలో ఒక్కసారైనా హరినామస్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు.
ఈ విధముగా సాగుతున్న యమ, విష్ణుదూతల సంవాదాన్నంతటినీ వినిన అజామిళుడిలోని జీవుడు - తన శారీరక కృతదాసీ సాంగత్యాది పాపాలను తలంచుకుని దుఃఖిస్తూన్న జీవుడు - స్పృహామయుడై అచ్చెరువందాడు. "ఇదేమి ఆశ్చర్యం? ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతులు ఏమై పోయారు? నేనీ వైకుంఠములో యెలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యము కాకపోతే నా జిహ్వపై హరినామమెలా వచ్చింది? నాకీ వైకుంఠము ఎలా ప్రాప్తించింది?" అని తనలో తనే అనుకుంటూ హరిస్మరణమును చేయసాగాడు. కాబట్టి రాజా! కేవల హరినామస్మరణమే అంతటి ముక్తిప్రదమైనది. కాగా- హరి ప్రియంకరమైన కార్తీక వ్రతమును ఆచరిస్తే యెంత పుణ్యం కలుగుతుందో వూహించు అంటూ ఆపాడు వశిష్ఠుడు.
*ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే నవమోధ్యాయ స్సమాప్త:*
🌹 🌹 🌹 🌹 🌹

*యమ దీపం*
ఈ కార్తీక మాసంలో గుమ్మంలో పెట్టే దీపాలు ఆరుబయట పెట్టే దీపాలను యమ దీపాలు అంటారు ఇది అకాల మృతువుని గాండాలను తొలగిస్తుంది.
యమ దీపం పెట్టాల్సిన సమయం 5.40 pm - 7pm, సాయంత్రం....ఈ స్త్రోత్రం పారాయనఁ చేస్తే యమ "ధర్మరాజు" అనుగ్రహం ఆశీర్వాదం లభిస్తుంది. ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తారు .
తపసా ధర్మమారాధ్య పుష్కరే భాస్కరః పురా |
ధర్మం సూర్యసుతం ప్రాప ధర్మరాజం నమామ్యహమ్ || 1 ||
సమతా సర్వభూతేషు యస్య సర్వస్య సాక్షిణః |
అతో యన్నామ శమనమితి తం ప్రణమామ్యహమ్ || 2 ||
యేవాంతశ్చ కృతో విశ్వే సర్వేషాం జీవినాం పరమ్ |
కామామరూపం కాలేన తం కృతాంతం నమామ్యహమ్ || 3 ||
బిభర్తి దండం దండాయ పాపినాం శుద్ధిహేతవే |
నమామి తం దండధరం యః శాస్తా సర్వ జీవినామ్|| 4 ||
విశ్వం చ కలయత్యేవ యస్సర్వేషు చ సంతతమ్ |
అతీవ దుర్నివార్యం చ తం కాలం ప్రణమామ్యహమ్ || 5 ||
తపస్వీ వైష్ణవో ధర్మీ సంయమీ విజితేంద్రియః |
జీవినాం కర్మఫలదం తం యమం ప్రణమామ్యహమ్ || 6 ||
స్వాత్మారామం చ సర్వజ్ఞో మిత్రం పుణ్యకృతాం భవేత్ |
పాపినాం క్లేశదో యశ్చ పుణ్యం మిత్రం నమామ్యహమ్ || 7 ||
యజ్ఞన్మ బ్రహ్మణో వంశే జ్వలంతం బ్రహ్మతేజసా |
యో ధ్యాయతి పరం బ్రహ్మ బ్రహ్మవంశం నమామ్యహమ్ || 8 ||
ఇత్యుక్త్యా సా చ సావిత్రీ ప్రణనామ యమం మునే |
యమస్తాం విష్ణుభజనం కర్మపాకమువాచ హ || 9 ||
ఇదం యమాష్టకం నిత్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
యమాత్తస్య భయం నాస్తి సర్వపాపాత్పమ్రుచ్యతే || 10 ||
మహాపాపీ యది పఠేన్నిత్యం భక్త్యా చ నారద |
యమః కరోతి తం శుద్ధం కాయవ్యాహేన నిశ్చితం || 11

SIVA PURANAM – 9
మహాకాళేశ్వరం – ఉజ్జయిని
అవంతికాయాం విహితావతారం, ముక్తి ప్రదానాయచ సజ్జనానాం!
అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం!! (ద్వాదశ జ్యోతిర్లింగస్తోత్రం – 3)
ఈ శ్లోకం ద్వారా ఉజ్జయినిలో ఉన్న మహా కాళుడికి నమస్కారం చేస్తున్నాము. సజ్జనులకు ముక్తినిచ్చువాడు. అయితే సజ్జనుడు అనగా ఎవరు? పరమేశ్వరార్చన చేసేవాడికి సదాచారము తెలిసి ఉండాలి. శౌచము తెలిసి ఉండాలి. ఈ సదాచారం పథ్యం లాంటిది భగవద్భక్తి ఔషధం లాంటిది. ఈ ఔషధం వేసుకుని పథ్యం పాటిస్తే భవరోగమనే రోగం తగ్గుతుంది. కానీ లౌకికంగా బయటవచ్చే వ్యాధికి, భగవత్సంబంధంలో వచ్చే భవరోగమునకు ఒక తేడా ఉంది. ఒకనికి ఆచారం, శౌచం తెలియదు. తెలిసి మానిన వాడు కాదు. కానీ ఆయన గుండెల నిండా భక్తి ఉన్నది. కానీ శౌచం లేకపోయినా వాని భక్తి వృధా పోదు. సదాచారం తెలిసీ దానిని విడిచిపెట్టి భక్తిని పాటిస్తే అది మాత్రం అతని అక్కరకు రాదు. ఆచారం తెలిస్తే పాటించాలి. తెలిసి ఉన్నది అనుష్ఠాన పర్యంతం రావాలి. ఏమీ తెలియనప్పుడు ఆచారమయినా అది తెలియక పొరపాటు చేసినా ఈశ్వరుడు దానిని పక్కన పెట్టి ఏలుకుంటాడు. మాహాకాళ దర్శనమునందు ‘సజ్జనానాం’ అనేమాట ఎందుకు వాడారో గుర్తెరిగి ప్రవర్తించాలి. అందుకే మహాకాళుడన్నమాట. కామమును పోగొట్టు వాడు, కాలారి, కామారి అనే రెండు మాటలను పరమశివునికి వాడతారు. కాలారిగా అనుగ్రహం కావాలన్నా, కామారిగా అనుగ్రహం కావాలన్నా మీకున్న స్థాయిలో అనుష్ఠానమునకు తెచ్చుకుని మాత్రమే ఈశ్వరుని యందు ప్రవర్తించాలి.
పూర్వకాలంలో ఉజ్జయినికి అవంతి అని పేరు. అవంతి అనగా స్త్రీ అని, అక్క అని రెండు అర్థములు. అవంతి సాక్షాత్తు జగదంబ అయిన అమ్మవారి స్వరూపము. మనకి మోక్షపురులు ఏడు ఉన్నాయి. వీటిలో జగద్విఖ్యాతి గాంచిన పట్టణం అవంతి – ఉజ్జయిని. ఈ ఉజ్జయిని ఒకపక్క మహా కాళుడి చేత ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి చేత కూడా అంత ప్రసిద్ధి పొందింది. ఇక్కడ ఉన్న రెండు స్వరూపములు కూడా కాల స్వరూపములై ఉన్నవి. ఇవి లయకారకములై ఉంటాయి. ఉజ్జయిని ఒకానొకప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్న పట్టణం. భోజరాజు, మహాకవి కాళిదాసు ఇద్దరూ నడయాడిన ప్రాంతం ఉజ్జయిని. పూర్వకాలంలో ఈ ఉజ్జయిని పట్టణమునందు వేదప్రియుడు అనబడే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ వేదప్రియుడు త్రికాలములయందు సంధ్యావందనం చేస్తూ శివార్చనా శీలుడై శాత్కాలముల యందు శివపూజ చేసి వేదము ఏమి చెప్పిందో దానియందు అపారమయిన ధృతి కలిగిన బ్రాహ్మణుడు. వేదప్రియుడికి నలుగురు కుమారులు. నలుగురు సుగుణోపేతులే. తండ్రిగారు ఎంత ధర్మానుష్టాన పరుడో కొడుకులు కూడా అంతటి ధర్మానుష్టాన పరులు. దొరికిన దానితో తృప్తిగా జీవించేవారు. ఆయన పెద్ద కొడుక్కి దేవప్రియుడు, రెండవ వానికి ప్రియ మేథుడు, మూడ వానికి సుకృతుడు, నాల్గవ వానికి సువ్రతుడు అని పేర్లు పెట్టుకున్నాడు. ఆ నలుగురు పిల్లలు వృద్ధిలోకి వచ్చారు.
ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరములలో ఒక రాక్షసుడు బయలుదేరాడు. ఏదయినా కష్టం వచ్చినప్పుడే పరీక్షకు నిలబడినప్పుడే వాటి వాటి వ్యక్తిత్వములు ప్రకాశించి నిలబడతాయి. కాబట్టి ఈశ్వరుడు ఆ కుటుంబమును ప్రకాశింపచేయాలనుకున్నాడు. భగవంతుడు భక్తుల యెడ అంత ఉదారుడై ఉంటాడు. దూషణుడు అనే రాక్షసుడు లోకం అంతటా బాధలు పెడుతూ అందరినీ ఇబ్బంది పెడుతూ చిట్టచివరకు ఎక్కడా ఎవరూ ఈశ్వరార్చన చేయలేని స్థితిని కల్పించాడు. ఒక్క ఉజ్జయినిలో మాత్రం ఈ నలుగురు పిల్లలు శివార్చన చేస్తున్నారు అని తెలుసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు నన్ను మాత్రమే అర్చించాలి, మీరు శివపూజను విదిచిపెడతారా లేక లింగమును ధ్వంసం చేయనా? అని అడిగాడు వాళ్ళు కనీసం బెదరకుండా శంకరుని రక్షణ యందు మనం ఉండగా మనకు భయం ఏమిటి అని వాళ్ళు అనుకున్నారు. దూషణుడు ఈ నలుగురు బ్రాహ్మణుల మీద కత్తి ఎత్తి కంఠం మీద వేయబోతున్నాడు. అయినా వాళ్ళు కదలకుండా హర ఓం హర అంటూ అలానే ఆరాధన చేస్తూ కూర్చున్నారు. ఏ రూపంలో వస్తున్న మృత్యువునైనా ఈశ్వరుడు తప్పించగలడు. ఇక్కడ ఉన్న చిన్న పార్థివ లింగం నుండి మహాకాళ స్వరూపంతో పరమేశ్వరుడు బయటకు వచ్చాడు. ఇప్పుడు చూడబడే రూపం సామాన్యమయిన రూపం కాదు. స్వామి మహాకాళ రూపంలో వచ్చి ఒక్కసారి హుంకరించాడు. ఆ హుంకారమునకు దూషణుడి సైన్యములు బూడిద రాశులై పడిపోయాయి. ఆ రూపము అత్యంత వేడితో వచ్చింది కానీ ఆ వేడి అక్కడే కూర్చున్న బ్రాహ్మణ కుమారులను చెనకలేదు.బ్రాహ్మణ కుమారులు ఆ రూపమును చూసి ఆశ్చర్యం పొంది చచ్చిపోయే వారిని చంపకుండా మిగిల్చిన రూపంగా భావించి స్తోత్రం చేశారు. ఈశ్వరానుగ్రహం ఉన్నవాడికి అపమృత్యువు లేదు.

Contd….
ప్రదోష వేళలో శివమహాపురాణాంతర్గతంగా ఇటువంటి క్షేత్రములకు సంబంధించిన మాటలు చదవడం చేత మీరు శాబ్దికంగా ఉజ్జయినిలో మహాకాళ దర్శనం చేసినట్లే. ఆ ఫలితం ఉత్తరక్షణం మీ ఖాతాలో పడిపోతుంది. పిమ్మట ఆ స్వూపాన్ని చూసి దేవతలు పొంగిపోయారు. వాళ్ళందరూ వచ్చి స్తోత్రం చేశారు. ‘ఈశ్వరా, మీరు ఇక్కడ లింగరూపంలో వెలవండి. కేవలం ఈ బ్రాహ్మణ కుమారులే కాక మిమ్మల్ని నమ్మిన వారెందరో ఉంటారు. సజ్జనులు, నీమీద పూనిక ఉన్నవాళ్ళు, నీవు ఉన్నావని నమ్మినవాళ్ళు ఎవరు ఇక్కడకు వస్తున్నారో వారు కాలమునందు పడిపోకుండా చూడవలసిన బాధ్యతా అటువంటి అనుగ్రహ ప్రసరణ కొడకు నీవు ఇక్కడ స్వయంభూ లింగముగా ఉండాలి అని అడిగారు. అప్పుడు స్వామీ తప్పకుండా ఉంటాను అని ప్రసన్న మూర్తియై వెంటనే మహా కాళ లింగముగా ఆవిర్భవించాడు.
ఉజ్జయినిలో శివలింగములు మూడు అంతస్తులుగా ఉంటాయి. క్రిందను ఉండేది మహాకాళ లింగము, మధ్యలో ఓంకార లింగము, ఆపైన నాగేంద్ర స్వరూపమయిన లింగము ఉంటాయి. క్రింద ఉండే మహాకాళ లింగమును భక్తులు వెళ్లి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఉజ్జయినిలో ఈ శివలింగం దగ్గరే ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. చంద్రసేనుడు అనే ఒక మహారాజు ఉజ్జయినీ రాజ్యమును పరిపాలిస్తున్నాడు. గొప్ప శివభక్తుడు. ప్రతిరోజూ శివార్చన చేసేవాడు. ఈ శివార్చనకు మెచ్చి పరమశివునికి అత్యంత సన్నిహితుడయిన మణిభద్రుడు చంద్రసేనుడికి ఒక మణిని బహూకరించాడు. ఈ మణిని నీవు కంఠంలో పెట్టుకుంటే ఇది రాగి, ఇనుము, ఇత్తడి దేనిని తగిలినా అవి బంగారంగా మారిపోతాయి. దేశంలో క్షామం ఉండదు. అతివృష్టి ఉండదు. నీ దేశంలో అందరూ సుభిక్షంగా ఉంటారు అని చెప్పాడు. చంద్రసేనుడు ఆ మణిని కట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. మిగిలిన రాజులందరూ ఆ రాజు ఎందుకు అలా సుఖపడుతున్నాడో తెలుసుకుని ఆయన వద్దవున్న మణిని ఎత్తుకు వచ్చెయ్యాలని భావించారు. అందరూ కలిసి చంద్రసేనుడి మీదికి యుద్ధానికి బయలుదేరారు. లోపల వున్న వేగుల వలన విషయంతెలుసుకున్న రాజు యుద్ధం చేస్తే గెలవడం చాలా కష్టం అని గ్రహించి యుద్ధానికి వెళ్ళడం అంటే నాకు సంతోషమే. కానీ లోకంలో ఉన్న రాజులందరూ కట్ట కట్టుకుని వస్తే నేను ఏకాకిని’ అన్నాడు. ఆయనయందు ధర్మలోపం లేదు. యుద్ధం చేయడానికి వచ్చిన రాజులలో ధర్మలోపం ఉంది. కాబట్టి తానిప్పుడు ఏం చేయాలా అని ఆలోచించి ఎవరు నాకీ మణిని ఇవ్వడానికి కారకుడో వాడి పాదములే నేను గట్టిగా పట్టుకుంటాను అని భావించి వెంటనే దేవాలయమునకు వెళ్లి పూనికతో శివారాధన చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఆయన భక్తి పరిఢవిల్లి ఉంది.

Contd..
ఆ సమయంలో ఒక గోపాల బాలుడు దేవాలయంలో దర్శనం చేసుకోవడానికి వచ్చాడు. ఆ పిల్లవాడు తల్లితో కలిసి లోపలి వచ్చి నమస్కారం చేసి బయటకు వెళ్ళిపోయారు. ఇద్దరూ దర్శనం చేసినా గోపకాంత మనసు చిన్నపిల్లవాడి మనస్సంతగా భగవంతుని యందు కేంద్రీకరించబడలేదు. రాజు చేస్తున్న పూజను చూసిన పిల్లవాడు తానుకూడా అలాగే పూజచేయాలి అనుకున్నాడు. కానీ వాడికి పూజ చేయడం రాదు. వాడు తల్లితో ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ వాని దృష్టి అంతా రాజు చేస్తున్న లింగార్చన మీద ఉంది. ఇప్పుడతడు అర్చన చేయడానికి శివలింగం కోసం వెతకగా ఒక గుండ్రాయి కనిపించింది. వాడు దానిని రాయిగా కాక శివలింగంగా చూశాడు. పూజచేయడం రాదు కాబట్టి చుట్టుపక్కల చెట్ల నుంచి కొన్ని ఆకులు తెచ్చి పూజచేయడం ప్రారంభించాడు. రాజు చేస్తున్న పూజయందు సదాచారం ఉన్నది. కానీ ఈ పిల్లవాడు చేసున్న పూజయందు సదాచారం లేదు. కానీ భక్తి ఉన్నది. వాడికి అభిషేకం, పురుషసూక్తం తెలియదు. నైవేద్యం లేదు. కానీ వాడు ఒక్కొక్క ఆకు తీసి శివ అంటూ వేస్తున్నాడు. వాడు మనస్సులో అలాగే మహాకాళ లింగానికి పూజ చేస్తున్నాడు. పిల్లవానికి అన్నం పెడదామని గొల్లవనిత వచ్చి పిలిచినా వాడికి ఇవేమీ వినపడలేదు. నటిస్తున్నాడు అని ఆవిడకి కోపం వచ్చింది. గుండ్రాయిని తీసి విసిరి అవతల పారేసింది. ఆకులన్నిటిని కాలితో తోసేసింది. ఇంట్లోకి రా అన్నం పెడతాను అని లోపలికి వెళ్ళిపోయింది.
పిల్లవాడు కళ్ళు తెరిచాడు. ఎదురుగుండా ఉన్న శివలింగం కనపడలేదు. వెంటనే ఆర్తితో ఏడ్చాడు. ఇప్పుడు వారు రమ్మని తన స్వామిని పిలుస్తున్నాడు. స్వామీ కనపడలేదన్న బెంగతో మూర్ఛపడిపోయాడు. తనకోసం ఇంత పరితపించిపోయిన పిల్లవానిని శంకరుడు చూశాడు. అక్కడ బంగారు కాంతులతో గోపురంతో ఒక పెద్ద దేవాలయం, పెద్ద శివలింగం ఏర్పడ్డాయి. పిల్లవాడు బంగారు పువ్వులు తాపడం చేయబడిన పీటమీద పట్టు పంచెతో కూర్చుని పూజ చేస్తున్నాడు. వానికి సమస్తమయిన శివజ్ఞానము భాసించింది. తల్లికి ఆ ఘోష వినపడి బయటకు వచ్చి చూసి తెల్లబోయింది. నా వంశమే తరించిపోయిందిరా తండ్రీ ఈ పూజ చేశావని నాకు తెలియదు అని వెళ్లి బిడ్డడిని కౌగాలించుకుంది. ఆనందపడిపోయింది. ఈ సమయంలో స్వామి హనుమ అక్కడ ఆవిర్భవించి ఒకమాట చెప్పారు “ఎవడు నొసట భస్మరేఖలను పెట్టుకుంటాడో, లలాటమునందు బొట్టు పెట్టుకుంటాడో మెడలో రుద్రాక్షమాల దాల్చి ఉంటాడో నాలుక చివర శివనామము పలుకుతున్నాడో వానికి మోక్షము కరతలామలకము. ఈ పిల్లవాడికి ఏమీ తెలియక పోవచ్చు. కానీ పరమేశ్వరుడిని నమ్మాడు. దీనివలన ఈతడు పొందబోయే భాగ్యం ఏమిటంటే గొప్పగొప్ప వాళ్ళందరూ ఈ గొల్లవంశంలో పుడతారు. యితడు గొప్ప ఐశ్వర్యమును అనుభవిస్తాడు. వీని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎనిమిది తరములు గడిచిన తర్వాత సాక్షాత్తు పరబ్రహ్మమే గోపాలబాలుడై ఈ భూమి మీద నడయాడతాడు. అపుడు ఈ బాలుడు నందునిగా శ్రీకృష్ణ పరమాత్మకు తండ్రి అనిపించుకుంటాడు. మీ వంశం అటువంటి వంశం కాబోతోంది’ అని హనుమ ఆనాడు శివభక్తి విశేషమును ఆవిష్కరించి వెళ్ళాడు.
ఈవార్త ఊరంతా పాకింది. ఈవార్త బయట విడిది చేసిన శత్రు సైన్యములకు తెలిసింది. ఇది నిజంగా అలా ఏర్పడినది అయితే మాలో కొంతమంది ప్రతినిధులం స్నేహంగా లోపలికి వస్తాం మాకు చూపించండి అని రాజుకు కబురు పంపారు. అపుడు రాజు వారిని లోపలికి తీసుకువెళ్ళి దేవాలయదర్శనం చేయించాడు. ఇంత భక్తి పరిపుష్టి కలిగిన గోపాల బాలుడు ఈ రాజ్యంలో ఉంటే మన బతుకులు ఏమవుతాయో, మన వంశములు ఏమవుతాయో అని చంద్రసేనుడికి నమస్కారం చేసి వెళ్ళిపోదాము అని యుద్ధం చెయ్యకుండా వెనుతిరిగి వెళ్ళిపోయారు. చంద్రసేనుడు హాయిగా రాజ్యం చేశాడు. ఈవిధంగా ఆ ఉజ్జయిని యందు మహాద్భుతమయిన మహాకాళేశ్వరుని దేవాలయం ఆవిర్భవించింది.

Contd…
ఉజ్జయిని యందు సంవత్సరమునకు ఒకసారి వర్షాకాలమునకు ముందర ‘పర్జన్యానుష్టానము’ అని చేస్తారు. వర్షములు బాగా పడాలని, పంటలు బాగా పండాలని మహాకాళేశ్వరాలయంలో కూర్చుని అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతోంది. అంత గొప్ప ఆలయం ఆ ఆలయం.
ఈ ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం క్రిందనే శంఖ యంత్రం అనే యంత్రం ఉన్నది అని పెద్దలు నమ్ముతారు. శంఖం విజయమునకు గుర్తు. అందుకే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం ముందు ధృతరాష్ట్రుడు సంజయుడిని కౌరవులు ఏమి చేస్తున్నారని అడుగుతాడు. అపుడు సంజయుడు పాండవులు శంఖములు ఊదుతున్నారు అని చెప్పాడు. ఎవరు శంఖమును ఊదాడో వానికి విజయం కలుగుతుంది. మహాకాళేశ్వరుని క్రింద శంఖయంత్రం ఉంది. అందుకని ఆయన దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకున్నవాడు ఎటువంటి విజయమునయినా పొందుతాడు. అపమృత్యుదోషం పోతుంది. ఎటువంటి కోర్కెలు అయినా తీరతాయి.
అక్కడి అమ్మవారికి అవంతిక అని పేరు. ఇక్కడ ఉండే కాళికాదేవి ఒక కోటలో ఉంటుంది. ఆవిడ రాత్రివేళ పట్టణం అంతా సంచరించి తెల్లవారే సరికి దేవాలయంలోకి వెళ్ళిపోతుంటే కాళిదాస మహాకవి వెళ్లి తలుపులు వేసుకుని లోపల కూర్చున్నాడు. తెల్లవారి పోతోంది. లోపల కూర్చున్న ఆయన తనకు జ్ఞానం ఇవ్వమని అమ్మవారిని ప్రార్థించాడు. అపుడు అమ్మవారు కాళిదాసును తలుపు సందులోంచి నాలుకను బయట పెట్టమని చెప్పి ఆయన అలా పెట్టగానే నాలుక మీద బీజాక్షరములను రాసింది. అప్పుడు మహానుభావుడు తలుపులు తీసి అమ్మవారి మీద శ్యామలాదండకం చేశారు. ఈ విధంగా కాళిదాస మహాకవికి జ్ఞానమబ్బిన క్షేత్రము ఉజ్జయిని క్షేత్రం.
ఇప్పటికీ ఎన్ని వేల సంవత్సరముల నుంచో ఉజ్జయినిలో ఉన్న అంతరాలయమునందు రెండు జ్యోతులు వెలుగుతుంటాయి. ఈ రెండు జ్యోతులను అఖండ దీపములు అని పిలుస్తారు. ఈశ్వరుడిని మీరు దానిలో చూడవచ్చు.
ఉజ్జయిని దేవాలయంలో భస్మమందిరం అని ఉన్నది. అక్కడ ఆవుపేడతో విభూతిని తయారుచేస్తారు. భస్మ మందిరంలోనికి ఆవులను తీసుకువచ్చి ఆవులు వేసిన పేడను ఎంత వరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ విభూతి అభిషేకం రెండు రకములుగా ఉంటుంది. తెల్లని పల్చటి బట్టలో మెత్తటి విభూతిని పోసేసి మూట కట్టి ఆ మూటను పట్టుకుని కొడతారు. అలా కొట్టినప్పుడు ఒక్క శివలింగం ఉన్నచోటే కాదు అంతరాలయం అంతా భస్మంతో నిండిపోతుంది. అలా నిండిపోతున్నప్పుడు శంఖముకు, భేరీలు, పెద్ద పెద్ద మృదంగములు ఇవన్నీ మ్రోగిస్తారు. అపుడు అక్కడ మీరు ఒక అలౌకికమయిన స్థితికి వెళ్ళిపోయినా అనుభూతిని పొందుతారు. రెండవ రకం అభిషేకంలో అభిషేకం చేసుకోవాలి అనుకున్న పురుషులను సాంప్రదాయక వస్త్రాలతో తెల్లవారు జామున దేవాలయంలోపలికి పంపిస్తారు. అప్పుడు శ్మశానంలో కాలిన శవభస్మమును అర్చకులు పట్టుకు వచ్చి చుట్టూ కూర్చును ఆ శవ భస్మంతో అభిషేకం చేస్తారు. అప్పుడు నిజంగా మనం కైలాసపర్వతం మీద కూర్చున్నట్లే ఉంటుంది.
అసురసంధ్య వేళలో మహాకాళేశ్వరుడికి చిత్రవిచిత్రమయిన నీరాజనములను ఎత్తుతారు. దానికోసం ప్రత్యేక మహంతులు వస్తారు. ఈ దీపారాధనతో కూడిన జ్వాలని నీరాజనంగా చూపించేముందు ఇక్కడ ఒక నియమం ఉంది. మహా కాళేశ్వరుడికి సమీపంలోనే మరొక శివలింగం ఉంది. ఆ శివలింగం పేరు కోటేశ్వర మహాకాళుడు. ఆయనకు ముందు పూజ చేస్తే తప్ప అసలు మహా కాళుడికి పూజచేయడం నిషిద్ధం. కాబట్టి ముందు కోటేశ్వర మహా కాళుడికి నీరాజనములను ఎత్తుతారు. తరువాత కాళేశ్వరుడికి ఇస్తారు. అందుకని ఉజ్జయినిలో కోటేశ్వర మహాకాళ దర్శనం కూడా చేయవలసి ఉంటుంది.
ఏడాదికొక్కసారి స్వామివారు సవారీ వెడతారు. ఆయన కారుణ్యమునకు పరాకాష్ఠ ఈ సవారీ ఉత్సవం. దీనిని ఊరేగింపు/ఊరెరిగింపు అంటాం. అపుడు ఉజ్జయిని జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్, ఎన్నికయిన మంత్రి ఎవరయినా లేదా పరిపాలన చేసే మంత్రి ఈ ముగ్గురు ప్రతి ఏటా స్వామివారి సవారీ ఉత్సవమునకు వచ్చి తప్పనిసరిగా సవారీని మోయాలి. కొన్ని వేల సంవత్సరములనుంచి ఇదే ఆనవాయితీ.
ఉజ్జయినిలో శివరాత్రినాడు స్వామి పెళ్ళికొడుకు అవుతాడు. అపుడు ఆయన పుష్ప కిరీటం పెట్టుకుని పెళ్లికొడుకు అవుతాడు మహాశివరాత్రి వెళ్ళిపోయిన మరునాడు ఈ అలంకారం అంతా తీసేసి మరల భస్మాభిషేకమును అందుకుంటారు. అటువంటి సవారీ జరుగుతుంది. అక్కడే బలరామ కృష్ణులు ఇద్దరూ సాందీపని మహాముని ఆశ్రమంలో విద్యాభ్యాసం చేశారు. ఈవిధంగా ఉజ్జయిని అన్నిరకములుగా ప్రకాశిస్తున్నది. అటువంటి దివ్యక్షేత్రమును జీవితంలో ఒక్కసారయినా దర్శనం చేసి, అక్కడ కొన్నిరోజులు గడిపి, జన్మసార్థకం చేసుకోవాలి.