మనసు తీరు తెలుసుకో!
మనిషి ఒక్కోసారి ఉన్నది పోగొట్టుకొని బాధపడతాడు. అర్హత లేకపోయినా లేనిదాని కోసం ఆరాటపడి, అహరహం శ్రమించి పని సాఫల్యం చేసుకుంటాడు. కార్యం సఫలం కాకపోతే ఖిన్నుడవుతాడు. నిజానికి తాను ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చేప్పుడు ఏమి తెచ్చాడని, తాను ఏదైనా కోల్పోయినప్పుడు బాధపడాలి?!
చిన్న పిల్లలు చూసిన ప్రతిదీ కావాలని మారాం చేస్తారు. ఏమీ తోచనప్పుడు ఏడుపు లంకించుకుంటారు. అప్పుడు వారు ఆడుకొనేందుకు తల్లి ఏదో ఒక ఆట వస్తువును ఇస్తుంది. సహజంగా సగటు మనిషి మనస్తత్వం చిన్న పిల్లల మనస్తత్వాన్ని పోలి ఉంటుందంటారు వైజ్ఞానికులు! మనిషి సహజ రీతిలో బాల్యం నుంచి కౌమార, యౌవన దశలకు చేరుకున్నవాడే. పసిబిడ్డలకు కావలసిన ఆట వస్తువులు పెద్దలకు అక్కరలేదు. కొందరు పెద్దలు శిశు మనస్తత్వంతో పెద్దపెద్ద కోరికలే కోరుకుంటారు. భారీ కోరికలు సులభంగా తీరేవి కాదు కాబట్టి మనిషి అసంతృప్తితో జీవించ వలసి వస్తుంది. అలౌకిక ఆనందాన్ని పొందగల జ్ఞానశక్తి, బుద్ధి కుశలత ఉండికూడా మానవుడు దుఃఖితుడై ఆనందానికి దూరం కావడం నిజానికి విచారించవలసిన విషయం!
భయం, కోపం, అసహ్యతా భావం, లోభం, పరవస్తు వ్యామోహం వంటివి రజో గుణ, తమోగుణ ప్రధాన లక్షణాలు! వీటికి దూరంగా ఉండాలని ధర్మశాస్త్రాలు బోధిస్తాయి. సాత్విక గుణ సంపన్నత, సాధించి తీరవలసిన అంశం. సత్వ రజస్తమో గుణ లక్షణాలకు అనుగుణంగా దేహం ప్రతిస్పందిస్తుంది. ఫలితంగా అనుభవాలు వస్తాయి. అవే సుఖదుఃఖాలు! మనిషి తీవ్రంగా భయపడినప్పుడు రోగలక్షణాలు పొడచూపుతాయి. చిత్తం ప్రశాంతమైనప్పుడు రోగాలు పూర్తిగా అదుపులో ఉంటాయి. భయం విసర్జనీయ లక్షణమని శాస్త్రాలు చెప్పిన అంశాన్ని మానవ దేహం రుజువు చేస్తున్నదా అన్నట్లు ప్రశాంత చిత్తాన్ని సాధించిన సాధకుడు ఆందోళనలు తగ్గి ఆనందభరిత జీవనం చేస్తాడు. భారతీయ తత్వచింతన, శాస్త్ర పరిజ్ఞానం ఒకే బండికి కట్టిన ఎద్దుల్లా సమన్వయం చెంది ముందుకు సాగడం సనాతన ఆధ్యాత్మికవాదులు హర్షించే విషయం!
కల్మషాలు తొలగించిన అనంతరం పరిసరాలు పరిశుభ్రమై ఆహ్లాద భరితమైనట్లు త్రిగుణాల్లోని దోషాలు తొలగిన అనంతరం సాధకుడి చిత్తస్థితి నిర్మలమై అమందానందానుభూతితో ప్రకాశిస్తుంది.
యోగా అధ్యాపకులు అభ్యాస సమయంలో శరీరంలో జరిగే మార్పులను గమనించమని విద్యార్థులకు చెబుతారు. శ్వాస నియంత్రణ భంగిమల వల్ల రక్త ప్రసరణలో ఆరోగ్యానికి మేలు చేసే సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయని యోగశాస్త్రం చెబుతుంది.
మనుషులందరూ ఒకే అవయవ అమరిక కలిగిఉన్నా స్వభావరీత్యా వారివి భిన్న మనస్తత్వాలు. కొందరు కలుపుగోలువారు. మరి కొందరు ముభావ స్వభావులు. కొందరు మనసులోని మంచి భావాలను వెల్లడించి తోటివారి మనసులు చూరగొనే అవకాశం వచ్చినా తమ అభిప్రాయాలను పంచుకోరు. సానుకూల మనస్తత్వ శోభితులు ఇంకొందరు, ఎదురుపడినవారిని పలకరించకుండా ముందుకు సాగరు. ఆప్యాయతలను వ్యక్తపరచడం వల్ల బంధాలు బలపడతాయి.
మనసు చంచలమేగానీ అది మాయా మర్మం ఎరగనిది. లోకానికి వెల్లడి కాకపోయినా అది మన నుంచి మనకు బోధపడగల ఏ సత్యాన్నీ దాచదు. మన (ఆత్మ)తీరుకు అనుగుణంగా మనసును మలచుకొని రాజమార్గంలో నడిపిస్తే అది కష్టాలను కొని తేదు. ఇరుకు దారుల్లో దాని పయనం సాగనీయకపోతే మన మనసు వల్ల మనకే కాదు, ఎదుటివారికీ కష్టాల బెడద ఉండదు. జీవితం శుభప్రదమై ఆనందాలు వెల్లివిరుస్తాయి.

విజయదశమి
ప్రతి ఏడాదీ ఆశ్వీయుజ మాసంలోని శుక్లపక్షంలో దశమీ తిథినాడు సాయం సంధ్యాకాలంలో ‘విజయం’ అనే పేరు గల ముహూర్తం సంభవిస్తుందని, అది సకలార్థసాధకమని శాస్త్రగ్రంథాలు చెబుతున్నాయి. మంగళకరమైన ఆ సమయంలో శమీవృక్షాన్ని (జమ్మిచెట్టును) పూజిస్తే జీవితంలో అన్నీ విజయాలే కలుగుతాయని సంప్రదాయం చెబుతోంది. శమీవృక్షాన్నే ఎందుకు పూజించాలనే సందేహానికి శాస్త్రగ్రంథాలు సమాధానం చెప్పాయి. జమ్మిచెట్టు పాపాలను దూరం చేస్తుంది. శత్రువులను తరిమికొడుతుంది. పూర్వం త్రేతాయుగంలో రావణాసురుణ్ని సంహరించే సమయంలో రాముడికి అద్వితీయ శక్తిని ప్రసాదించింది. ద్వాపరయుగంలో అర్జునుడికి దివ్యమైన ధనుర్బాణాలను ప్రసాదించి, యుద్ధంలో విజయుణ్ని చేసింది. ఇలా శమీవృక్షం విజయాలకు కారణం కావడం వల్ల ‘విజయదశమి’ గొప్ప పండుగగా రూపొందింది. ప్రాచీనకాలం నుంచి ప్రజాపాలకులైన రాజులకు విజయయాత్రా ముహూర్తంగా ఈ పవిత్రదినం పూజలను అందుకొంటున్నది. పూర్వం రాజులు వర్షకాలం ముగిసిన తరవాత శరత్కాలం ప్రారంభంలో విజయయాత్రలు చేసేవారు. ఆ శుభముహూర్తమే విజయదశమి.
ఆశ్వీయుజ శుక్లపాడ్యమి నుంచి నవమి వరకు గల తొమ్మిది దినాలు శక్తిపూజకు ఎంతో ముఖ్యమైనవి. నవరాత్రదీక్షతో తొమ్మిది రోజులు శక్తిని పూజించిన దీక్షాపరులు, విజయదశమినాడు దీక్షను ముగిస్తారు. ముగింపు సూచనగా గ్రామం పొలిమేరలు దాటి వెళ్లి, విజయసంకేతం అయిన పాలపిట్టను దర్శించి, జమ్మిచెట్టును పూజించడం పరిపాటి. పూజించిన జమ్మిఆకులను పవిత్రంగా భావించి, బంధుమిత్రులకు, ఆత్మీయులకు ఇచ్చి వారి శుభాకాంక్షలను, ఆశీస్సులను అందుకొంటారు.
విజయదశమినాడు ప్రకృతిలో ‘అపరాజిత’ అనే శక్తి ఆవహించి ఉంటుందని, ఆ శక్తిని పూజించడం వల్ల పరాజయాలు లేని భావిజీవితం సంప్రాప్తిస్తుందని లోకుల విశ్వాసం. అపరాజితాశక్తి విజయాలను మాత్రమే కాకుండా మోక్షాన్నీ ప్రసాదిస్తుందని స్కాందపురాణం చెబుతోంది.
శ్రవణానక్షత్రంతో కూడిన ఆశ్వీయుజ శుక్లదశమినాడే ‘విజయ’ముహూర్తం సంభవిస్తుందని ఆర్షవాక్కు. ఈ పుణ్యదినం రోజునే పూర్వం దేవదానవులు పాలకడలిని చిలికి, అమృతాన్ని సాధించారని పురాణాల కథనం. అమృతాన్ని సాధించి పెట్టిన దినం కనుక ఇది విజయదశమిగా సార్థకమైంది. అమృతసాధక పుణ్యదినమైంది!
విజయదశమిని ‘దసరా’ అనీ పిలుస్తారు. దశవిధాలైన పాపాలను హరించేది కనుక ‘దశహరా’ అనే పేరు వచ్చిందని, కాలక్రమంలో ‘దసరా’ అని వాడుకలోకి వచ్చిందని పెద్దలు అంటారు. దసరా నాడు రావణకుంభకర్ణుల బొమ్మలను కాల్చివేస్తూ ‘రావణదహనం’ అని, ‘రామలీల’ అని పెద్దయెత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే ఈ ఉత్సవాల్లోని పరమార్థంగా కనిపిస్తుంది.
ప్రాకృతికంగా పరిశీలించినప్పుడు శరదృతువు ప్రసన్నతకు నిలయంగా కనిపిస్తుంది. అప్పటిదాకా వర్షాలతో చిత్తడి చిత్తడిగా మారిన నేలలన్నీ శరదృతువు ప్రారంభంలో వర్షాలు ఆగిపోవడం వల్ల ఎండిపోయి నిర్మలం అవుతాయి. జలాశయాలన్నీ నిండుకుండలను తలపిస్తాయి.
శరత్కాలంలో చంద్రుడి కళలు ఉత్కృష్టంగా ఉంటాయి. పాడ్యమి నుంచి దినదిన ప్రవర్ధమానంగా పెరిగే ఈ దివ్యకళలను చూస్తే మనిషిలో కలిగే ఆనందోత్సాహాలు జీవితంపై ఆశాచంద్రికలను వెదజల్లుతాయి. ఈ కారణంతో విజయదశమి మానవాళికి ఆశాదీపమై కనిపిస్తుందనడంలో సందేహం లేదు.

జీవితం అంటే...
జీవితంలో నిజంగా మనం జీవిస్తున్నామా? ఇది అంతుచిక్కని ప్రశ్న. వ్యధలతో, బాధలతో, అసంతృప్తులతో, నిరాశా నిస్పృహలతో జీవితమంతా గడిచిపోయింది. వెనక్కి తిరిగి చూసుకుంటే చివరకు మిగిలేది ఏమిటి? అనంతమైన పశ్చాత్తాపం కళ్ల ముందు సాకారమవుతుంది. దేవుడిచ్చిన బహుమానమైన ఈ జీవితం ఇలా నిష్ఫలంగా ముగిసిపోతుందనే చింతన చరమాంకంలో వేధిస్తుంది. అందుకే ముందే మేల్కోవాలి. జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
శాశ్వతంకాని దేహం మీద మమత్వాన్ని వదిలిపెట్టి శాశ్వతుడైన పరబ్రహ్మను భజించమని జగద్గురువు ఆదిశంకరులు మహోపదేశం చేశారు. అవిద్య, రాగద్వేషాలు, జీవితంపట్ల నిర్లక్ష్యం, మానవీయత లేకపోవడం, జడత్వం- వీటిని పంచ మహాదుఃఖాలుగా పతంజలి మహర్షి అభివర్ణించారు. జీవితమంటే చావు వచ్చేంతవరకు కొనసాగించే పయనం ఎంత మాత్రమూ కాదు. ‘మృత్యువు నిన్ను నీడలా ఎల్లప్పుడూ అనుసరిస్తుంది. అది నిన్ను అక్కున చేర్చుకోకముందే, దాన్ని జయించాలి. మరణించే నువ్వు జీవించాలి’ అని ఉపనిషత్తులు ప్రబోధించాయి. అన్ని దుఃఖాలకంటే మరణ దుఃఖం అతి భయంకరమైనది. మరణ దుఃఖాన్ని, మృత్యుభీతిని అధిగమించడం ఎలా? పరమాత్ముడికి ప్రియమైన రీతిలో మనం జీవన సంవిధానాన్ని అవలంబించడం ద్వారా మృత్యువునైనా ప్రియమైన మిత్రుడిగా మార్చుకోవచ్చు. నిష్కామ భావంతో కర్మాచరణ చేస్తూ, ధర్మపథంలో పయనించడం ద్వారా, చింతనామృతాన్ని నిరంతరం ఆస్వాదించడం ద్వారా జీవన మార్గాన్ని సుగమం చేసుకోవచ్చు. మాననీయమైన మానవీయ విలువలతో కూడిన జీవితాన్ని గడిపినవారే చిరంజీవులు. అలాంటివారే అసలైన కీర్తిశేషులు!
మనిషి తన జీవితాన్ని ధర్మానికి అనుగుణంగా మలచుకుంటే మరణ భయం నుంచి బయట పడవచ్చు. తన కోసం, సమాజం కోసం, దైవం కోసం ఎలాంటి కర్తవ్యాల్ని ఆచరించి తరించాలో తెలుసుకుని మసలుకోవచ్చు. తనను తాను తెలుసుకోలేనివాడు సామాన్యుడు. ఆ జ్ఞానాన్ని పొందినవాడు మాన్యుడు. సమస్త ప్రాణులపట్ల అనురక్తిని ప్రదర్శిస్తూ, సర్వభూతాల పట్ల మిత్రత్వాన్ని కలిగి ఉంటూ, సకల జనుల పట్ల దయాభావాన్ని ప్రకటిస్తూ, అహంకార రహితులై, సుఖదుఃఖాల్లో సమభావం కలవారే తనకు ప్రియమైనవారని భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. క్షమ, నిగ్రహం, ప్రేమ, సత్యసంధత, రుజువర్తన, వినయం, భూతదయ, సేవాతత్పరత ఈ అష్టసూత్రాల్ని జీవితానికి అనుసంధానించుకోవడం ద్వారా లోకాన్ని వశం చేసుకోవచ్చని భాగవతం ప్రతిపాదించింది.
జీవన రథానికి ఇంధనం ఆత్మవిశ్వాసం. ‘బతుకు అనేది మెతుకుల కోసం పోరాటం కాదు. బతుకు గతుకుల మయం కాకూడదు. బతుకు అతుకుల బొంతగా కనిపించకూడదు. ఈ బతుకు దయగల భగవంతుడిచ్చిన అపురూప అవకాశం. దాన్ని అందిపుచ్చుకో. చరితార్థుడిగా మిగిలిపో!’- ఓ సూఫీ కవిత వెల్లడించిన జీవన సత్యమిది.
జీవితం పట్ల భయం ఉండకూడదు. భక్తి ఉండాలి. శేష ప్రశ్నగా మిగిలే భవిష్యత్ జీవితంపట్ల వర్తమానంలో ఆందోళన అనవసరం. ధీరచిత్తంతో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సదా సమాయత్తంగా ఉండాలి. ఇదే ఉదాత్త చరితుల ఉత్తమలక్షణం. ధైర్యం, నిర్భయత్వమనేవి ఆత్మజ్ఞానంతోనే సిద్ధిస్తాయి. సర్వశుభంకరమైన ధర్మకర్మల్ని ఆచరిస్తూ కర్మసాక్షి అయిన భగవంతుడు మనల్ని గమనిస్తున్నాడనే ఎరుకను కలిగిఉండాలి. తరతరాలుగా అనుసరిస్తున్న ఆధ్యాత్మిక జీవన సంవిధానాన్ని పాటించాలి. నైతికశీల సంపత్తితో వేదవిహితమైన విధివిధానాలతో జీవన సంగీతపు మధురిమల్ని ఆస్వాదించాలి. జీవితనౌకను వెలుగు తీరానికి చేర్చాలంటే ముందు అంతర్వీక్షణతో మనలో కాంతిని నింపుకోవాలి. హృదయాలయంలో జ్ఞానజ్యోతుల్ని ప్రజ్వలింపజేసుకోవాలి!

విజయ సారథ్యం
లోకంలో ప్రతి మనిషీ తన సంకల్పం సఫలీకృతం కావాలని, తన ప్రయత్నం విజయవంతం కావాలనే ఆకాంక్షను బలంగా కలిగి ఉంటాడు. కృషి ప్రారంభించకుండానే, ఫలితాలను ముందుగానే తమకు అనుకూలంగా ఉంటాయని కొందరు ప్రకటిస్తుంటారు. సర్వసాక్షి, సర్వేశ్వరుడు అహంకారం లేశమంత ఉన్నా సహించడు. ఆ దేవుని ఆత్మకాలుష్యం గిట్టదు. గర్వం తలెత్తినప్పుడల్లా ఎంతటి భక్తుడికైనా గుణపాఠం నేర్పకమానడు.
అర్జునుడు, బలరాముడు ఇలాంటి పాఠాలు నేర్చినవారే. మహాశివ భక్తుడైన రావణుడు, అహంకారంతో కైలాసగిరిని తలకెత్తుకుని, తలకిందులు కాక తప్పలేదు.
భక్తిలో సర్వశరణాగతి తప్ప ఇంకేమీ ఉండకూడదు. భక్తి ఒక మహామధుర భావన. దానిలో నలుసంత స్వార్థం కలిసినా మాధుర్యం కోల్పోతుంది. అందుకే సాధకులు, బంగారం కొలిమిలో కాల్చిన విధంగా అనేక కఠిన పరీక్షల్ని తట్టుకుని, చెదరని బుద్ధితో ఉండగలగాలి. దేవుడు మనలను పరీక్షలకు గురిచేస్తున్నాడంటే, ఆయన మనల్నెంతో ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ప్రతి పరీక్షకూ మూల్యాంకనం ఉంటుంది. అది నూటికి నూరు కాగానే ఇక పరీక్షలుండవు. మనం దేవునికి ఆంతరంగికులమైపోతాం. అదృష్టవంతులకు ఆయన నిత్య జీవితంలో ప్రమేయం పెట్టుకుంటున్న సందర్భాలు అనుభవంలోకి వస్తాయి. కొందరు వాటిని తమ అదృష్టమనుకుంటారు. దైవానుగ్రహమే మన అదృష్టంగా రూపొందుతుంది.
అద్భుతాలు చేయగలవాడు సర్వేశ్వరుడు ఒక్కడే. ఇతరులు గారడీలు మాత్రమే చేయగలరు. గారడీ అంటే భ్రమావిష్కరణ. అది అంతలోనే అదృశ్యమైపోతుంది. మన జీవితంలో ఎక్కువ భాగం నమ్మకం- అపనమ్మకం, సందేహాలు, సంకోచాల ఊగిసలాటలో గడిచిపోతుంది. నిజభక్తులు బహుకొద్దిమందే ఉంటారు.
పరమాత్మ ప్రతినిధులుగా ఇహంలో శ్రమిస్తున్నవారంతా అనేక పద్ధతుల్లో పరమసత్యాన్ని, దివ్యజ్ఞానాన్ని అందరికీ అందించాలని ఎంతో శ్రమిస్తూ ఉంటారు. ప్రసాదం రుచికరంగా ఉందని సంబరపడతారేగానీ, అందులోని దివ్య భావనను గ్రహించరు.
ప్రసాదం అంటే పరమాత్మ అనుగ్రహం.
భౌతిక భావన నుంచి ఆధ్యాత్మికంలోకి వెళ్తే- పరమాత్మ మందహాసం, అనుగ్రహవదనం ప్రసాదంలో అనుభవానికి వస్తాయి. అలా వచ్చినప్పుడు ప్రసాదం దివ్య ఆధ్యాత్మికానుభవాన్ని కలిగిస్తుంది.
ఇహానికి ప్రాధాన్యం ఇచ్చినంతకాలం ‘పరం’ అర్థంకాదు. ‘పరం’ అర్థమయ్యాక’, ఇహం’ మీద విరక్తి కలుగుతుంది. ‘భక్తి’ అనే పాయసంలో విశ్వాసమనే కుంకుమపువ్వు రుచి, రంగులీనుతూ ఉంటుంది.
అర్జునుడు, దుర్యోధనుడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు సహాయంకోసం శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లిన సన్నివేశం ఎన్నో సందేశాలకు నిలయం.
ఎక్కడ తప్పుచేస్తాడోనని ముందుగా కోరుకునే అవకాశాన్ని అర్జునుడికే ఇస్తాడు కృష్ణుడు. ఒకవేళ ముందుగా దుర్యోధనుడు తననే కోరుకుంటే, పాండవులు నిస్సహాయులు, వ్యర్థులుకాక తప్పదు, అందుకే, తాను ముందుగా చూశాననే వంకతో అర్జునుడికి అవకాశం ఇస్తాడు. ఆయుధం ధరించననడం- దుర్యోధనుడిని చిత్తభ్రమకు లోనుచెయ్యడానికే. అతడు దైవస్వరూపుడైన శ్రీకృష్ణుని ఒక సామాన్య వ్యక్తిగా భావించాడు తప్ప జయాపజయాలను శాసించగల సర్వేశ్వరుడిగా గ్రహించలేకపోయాడు.
అర్జునుడు అలాకాదు. స్థిరభక్తితో శ్రీకృష్ణుడినే కోరుకున్నాడు. అందుకే అన్నీ తానేఅయి కురుక్షేత్రంలో సంఖ్యాబలం తక్కువగా ఉన్నా పాండవులకు ధర్మవిజయాన్ని అనుగ్రహించాడు. సంఖ్యాబలాన్ని, యోధుల్ని నమ్ముకున్న దుర్యోధనుడు సర్వనాశనం కాకతప్పలేదు.
ప్రతి మనిషీ ప్రపంచమనే కురుక్షేత్రంలో రణవీరుడే. నమ్ముకోవాల్సింది ధన, జన బలాలను; అధికార హోదాలను కాదు. అంతరంగంలో కొలువుండి, అనుక్షణమూ మార్గదర్శనం చేయగల దేవుని. ఆయన విజయసారథ్యమే మన జన్మలను సార్థకం చేస్తుంది.

చిరంజీవ... సుఖీభవ!
వేదం నాదం
అపమృత్యు భయాన్ని పోగొట్టేది, ఆధ్యాత్మిక చింతనా ధోరణిని పెంచేది మృత్యుంజయ మంత్రం. దీన్నే మహా మృత్యుంజయ మంత్రం, త్య్రంబక మంత్రం, రుద్ర మంత్రం, మృత్యు సంజీవని మంత్రం అని కూడా అంటారు. జీవితంపైనే కాదు మృత్యువుపైనా అవగాహన కల్పిస్తుందీ మంత్రార్థం.
‘త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్’
ఇది రుగ్వేదం ఏడో మండలం యాభై తొమ్మిదో సూత్రంలో పన్నెండో మంత్రం. యజుర్వేదంలో, తైత్తరీయోపనిషత్తులోనూ ఈ మంత్ర ప్రస్తావన ఉంది. మార్కండేయుడు ఈ మంత్రాన్ని జపించే శివుడి అనుగ్రహాన్ని, చిరంజీవత్వాన్ని పొందాడని, అందుకే ఈ మంత్రం అపమృత్యు దోషాన్ని నివారిస్తుందని నమ్ముతారు. ఈ మంత్రంలోని ప్రకంపనలకు అనేక రోగాలను నయం చేసే శక్తి ఉందని కొందరు భావిస్తారు.
సుగంధ పరిమళం కలిగి పుష్టిని వృద్ధి చేసే మూడు కన్నులున్న ఓ పరమేశ్వరుడా నిన్ను నేను పూజిస్తున్నాను. ఈ పూజకు ప్రతిఫలంగా తొడిమ నుంచి దోసపండు విడిపోయినంత సులభంగా సంసార బంధనాల నుంచి విడిపోయేలా అనుగ్రహించు. అన్నది మంత్ర భావం. ఈ మంత్రంలో మోక్షం అనేదాన్ని అమృతంతో సమానమైందిగా చెబుతారు. సంసార బంధనాల్లో పడి కొట్టుకుంటూ, కనీసం దైవనామ స్మరణ చేయలేనివారు చాలా మంది ఉంటారు. వారంతా ఎలాంటి వారంటే తీగకు అంటిపెట్టుకుని ఉన్న దోసకాయల్లాంటి వారు. పచ్చి దోసకాయ తీగకు వేలాడుతున్నప్పుడు దాన్ని తెంపడం అంత సులభం కాదు. పైగా దాన్ని తెంచే ప్రయత్నం చేస్తే కాయతోపాటు తీగంతా కదిలి అల్లకల్లోలం అవుతుంది. కానీ దోసకాయ బాగా పండినప్పుడు తీగ నుంచి తొడిమ సులభంగా విడివడుతుంది. నిజానికి నా కుటుంబం, నా వాళ్లు, నా సంపద అనే భావన నుంచి బయటపడడం అంత సులభం కాదు. దీనికి ఏకైక మార్గం భగవంతుడిని ఆశ్రయించడమే. ప్రతివారూ ముక్తిసాధన కోసం భగవంతుడిని స్మరించాలి. ఆ ముక్తి అమృతం లాంటిదని, దాన్ని అనుగ్రహించమని పరమేశ్వరుడిని స్తుతిస్తున్నట్లు కనిపిస్తుందీ మంత్రం.
శివుడు త్య్రంబకుడు. త్రిగుణాతీతుడు. త్రిజన్మ పాప సంహారుడు. అలాగే ఆ శివుడి కరుణ సుగంధం వ్యాపించినట్లు భక్త జనావళి అందరిపై వ్యాపిస్తుంది. ఆ స్వామి పుష్టిని పెంపొందిస్తుంటాడు. అలాంటి స్వామి దయతో అమృతత్త్వంలాంటి ముక్తి లభించాలని కోరుకోవడమే ఈ మంత్రంలోని విశేషం.

దీపం జ్యోతి పరబ్రహ్మ
దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం
దీపదేవ నమోస్తుతే.
"దీపం" పరమాత్మకు ప్రతిరూపం.
"దీపం" మన సంస్కృతిలో విడదీయరాని భాగం.
"దీపం" పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీక.
మట్టి ప్రమిద భూతత్వానికి, తైలం జలతత్వానికి, వత్తి ఆకాశతత్వానికి, వెలగడానికి కదలాడే గాలి వాయుతత్వానికి, జ్యోతి అగ్నితత్వానికి ప్రతీకలు.

శివకేశవుల మాసం కార్తీకమాసం..!!
విష్ణుదేవుడితో సమానమైన దేవుడు,
గంగతో సమానమైన తీర్థం,
కార్తీకమాసంతో సమానమైన మాసం లేదని మహర్షులు చెపుతున్నారు.
కార్తీకమాసం శివకేశవులకు ఇష్టమైంది.
ఈ మాసం ఆధ్యాత్మిక సాధనకు అత్యంత పవిత్రం, మహిమాన్వితమైనది.
శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైన కార్తీకం నెల రోజులూ ఎంతో పవిత్రమైనవి.
కార్తీకమాసంలో వచ్చే పాడ్యమి నుండి కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి వరకు ఎంతో పవిత్రంగా వ్రతాలను చేస్తుంటారు
కార్తీకమాసంలో వచ్చే పాడ్యమి రోజున బలిపాడ్యమి, విదియనాడు వచ్చే భగనీహస్త భోజనం ఆధ్యాత్మిక సాధనకు అనువైన పండుగలు అని అంటారు.
కార్తీకమాసంలో చేసే దీప దానం చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది.
కార్తీకమాసంలో దానాలు, జపం, ఉపవాసం, వనభోజనం చాలా శుభప్రదం.
కార్తీకమాసంలోని మొదటి రోజు నుండీ సూర్యోదయానికి ముందే నదీస్నానం చేయడం శ్రేష్టమైనది.
కార్తీకమాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి చన్నీళ్ళతో స్నానం చేసిన తరువాత సూర్యాస్తమయం తరువాత సంధ్యాదీపం పెట్టడం, తులసి పూజ, గౌరీపూజ చేయడం ఈ మాసంలోని ప్రత్యేకతలు.
కార్తీకమాసంలో కార్తీక శుద్ధనవమిని అక్షయ నవమిగా, తరువాత వచ్చే ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని,
కార్తీక శుద్ధ ద్వాదశి రోజును క్షీరాబ్ధిద్వాదశి అని,
కార్తీక శుద్ధ త్రయోదశి రోజున స్వాయంభువ మన్వంతరం ప్రారంభమయిందని అంటారు.
కార్తీక శుద్ధ చతుర్థశిని మహాకార్తి అని కూడా అంటారు. అలాగే కార్తీకపౌర్ణమి రోజున గౌరీవ్రతం,
కార్తికేయ దర్శనాలు చేసుకుంటారు.
కార్తీక బహుళ ఏకాదశి రోజున బోధనా ఏకాదశి వ్రతాన్ని చేస్తారు.
కార్తీకమాసంలో ఎటువంటి మంచి పనిచేసినా 'కార్తికదామోదర ప్రీత్యర్థం' అని ఆచరించాలని శాస్త్రోక్తి. శరదృతువులో నదీప్రవాహంలో ఔషధాల సారం ఉంటుంది, అగస్త్య నక్షత్రం ఉదయించడం వల్ల దోషరహితమైన శరదృతువులోని పవిత్ర జలాన్ని 'హంసోదకం' అని అంటారు.
కార్తీకమాసంలో మానసిక శారీరక రుగ్మతులను తొలగించి ఆయుష్షు, ఆరోగ్యాన్ని ప్రసాదించే ఉషోదయ స్నానం ప్రముఖమైనది,
పైత్య ప్రకోపాలను తగ్గించడానికే హంసోదక స్నానం. సూర్యోదయానికి ముందే నదిలో ఉదరభాగం మునిగేలా స్నానం ఆచరిస్తే ఉదర సంబంధమైన వ్యాధులు నయమవుతాయని పండితులు చెబుతున్నారు.
అలాగే కార్తీకమాసం సూర్యోదయానికి పూర్వమే విష్ణు సన్నిధిలో విష్ణు కీర్తనలు గానం చేస్తే వేలగోవుల దానఫలం, కీర్తనలకు వాయిద్యం వాయించేవానికి వాహపేయ యజ్ఞఫలం,
నాట్యం చేసేవానికి సర్వతీర్థ స్నానఫాలం,
అర్చనా ద్రవ్యాలను సమర్పించి వానికి అన్ని ఫలాలూ, దర్శనాదులు చేసేవారికి ఈ ఫలాలలో ఆరవవంతు ఫలం లభిస్తుంది.
సూర్యోదయకాలంలో నిద్ర మేల్కొని విష్ణు, శివాలయాలలో భగవంతుణ్ణి ధ్యానం, స్తోత్రం, జపం చేయడం వల్ల వేల గోవులను దానం చేసిన ఫలం లభిస్తుంది.
విష్ణు, శివాలయాలు లేని ప్రదేశాలలో..
ఇతర దేవాలయాలలో..
లేకపొతే రావిచెట్టు మొదట్లో గాని,
తులసీవనంలో గాని ఉండి భగవత్ స్మరణ చేయాలి. ముఖ్యమైన సూచన ఏమిటంటే తడిబట్టలతో దీపారాధన చేయకూడదు అలాగే శివకేశవులకు ప్రీతికరమైన ఈ మాసంలో స్త్రీలు తులసిచెట్టు ముందు ప్రతిరోజూ దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజ చేయాలి.
తులసిలో సర్వతీర్థాలు ఉన్నాయని అంటారు.
యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా
యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహమ్
అని శ్లోకం చదువుతూ భక్తితో తులసికి నమస్కరించాలి. కార్తీకమాసంలో కృత్తికలో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కాబట్టి చంద్రని అనుగ్రహం పొందడానికి అభిషేక ప్రియుడు అయిన పరమేశ్వరుని ఆరాధించాలి.
కార్తీకమాస సోమవారాలు.
శివుడికి ప్రీతికరమైన రోజు సోమవారం.
అందులోనూ శివకేశవులకు యిష్టమైన కార్తీకమాసంలోని సోవారాలు స్నాన, జపాలు ఆచరించేవారు వెయ్యి అశ్వమేథాల ఫలాన్ని పొందుతారు.
కార్తీకమాస సోమవారాల్లో ఆరు రకాల వ్రత విధి ఉంది. అవి ...
ఉపవాసం:
శక్తి ఉన్నవారు కార్తీక సోమవారం రోజున పగలంతా ఉపవాసంతో (అభోజనం) గడిపి, సాయంకాలం శివుడికి అభిషేకం చేసి, నక్షత్ర దర్శనం తరువాత తులసితీర్థం మాత్రమే సేవించాలి.
ఏకభుక్తం:
ఏకభుక్తం అంటే ఒక్కసారి మాత్రమే భోజనం చేయాలన్నమాట.
ఉదయం స్నానం చేసి దాన, తపం, జపాలు చేసిన తరువాత మధ్యాహ్నం పూట భోజనం చేసి,
రాత్రి శైవతీర్థమో, తులసీ తీర్థమో మాత్రమే తీసుకోవాలి.
నక్తం:
పగలు అంతా ఉపవాసం ఉండి, రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం కానీ, ఉపాహారం కానీ స్వీకరించాలి.
అయాచితం:
భోజనం కోసం తాము ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితం
స్నానం :
పైవాటికి వేటికీ శక్తిలేని వాళ్ళు సమంతరం స్నానం, జపాలు చేసినా చాలు.
తిలదానం:
మంత్ర, జపవిధులు కూడా తెలియనివాళ్ళు కార్తీక సోమవారం రోజున నువ్వులను దానం చేసినా సరిపోతుంది.
పైన పేర్కొనబడిన వాటిల్లో ఏది చేసినా సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది అని పురాణాల ద్వారా తెలుస్తోంది. పరమశివుడి కుమారుడైన కుమారస్వామిని కృత్తికలు పెంచడం వల్ల వారి పేరుతొ ఉన్న కార్తీకమాసం అంటే పరమశివుడికి మహాప్రీతి.
గరళకంఠుడైన పరమశివుడు తమోగుణం స్వభావాన్ని చంద్రుడు మాత్రమే హరించగలడు
అందుకే ఈ నెలలో సోమవా

రానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
కార్తీకమాసంలో పాడ్యమి నుంచి కార్తీక వ్రతం ప్రారంభించాలి.
దామోదరుడైన (పద్మనాభుడైన మహావిష్ణువు)ను ఉద్దేశించి దీన్ని చేయాలి.
ఈ తులామాసంలో గోష్పాదమంత జలప్రదేశంలో కూడా అనంతశయనుడు అయిన శ్రీమహావిష్ణువు నివశించి ఉంటాడు.
నదులు, చెరువులు, బావులు, గుంటలలో స్నానాలు చేసి దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలు చేయాలి. త్రేతాయుగం కార్తీక శుద్ధ నవమి రోజున ప్రారంభం అయినట్లు పంచాంగాల ద్వారా తెలుస్తోంది.
కార్తీకమాసంలో కృత్తికా నక్షత్రం, గురు గ్రహం, సోమవారం కలిసివస్తే దాన్ని పరమపవిత్రమైన రోజుగా గుర్తించాలి అని వేదం చెబుతుంది.
శ్రీ మహావిష్ణువును నక్షత్ర పురుషుడిగా ఆరాధించే సంప్రదాయం కూడా ఉంది.
ఈ నక్షత్ర పురుషుని వర్ణన, విశ్వాంతరాళపు నక్షత్రసీమలను పురుషాకారంగా వర్ణించిన తీరుకు రూపకల్పన అనిపిస్తుంది.
నక్షత్ర పురుషునికి..
కృత్తికలు కటి (నడుము) స్థానంగా,
మూలా నక్షత్రం పాదాలుగా,
రోహిణి నక్షత్రం తొడలుగా,
అశ్విని నక్షత్రం మోకాళ్ళుగా ఉన్నాయి.
కాగా పూర్వాషాఢ నక్షత్రం, పురుషాఢ నక్షత్రం,
ఫల్గునీ నక్షత్రాలు మర్మస్థానాలుగా,
భాద్రపద నక్షత్రాలు భుజాలుగా,
రేవతి నక్షత్రం కుక్షిగా,
అనూరాధ నక్షత్రం వక్షస్థలంగా,
విశాఖ నక్షత్రం ముంజేతులుగా,
హస్త చేతులుగా,
పునర్వసు నక్షత్రం వేళ్ళుగా,
జ్యేష్ఠ కంఠంగా,
పుష్యమి నక్షత్రం ముఖంగా,
భరణి నక్షత్రం శిరస్సుగా మారిపోయాయి.
కార్తీక స్నాన సంకల్పం.
సర్వపాప హారం పుణ్యం స్నానం కార్తిక సంభవం !
నిర్విఘ్నం కురుమే దేవా దామోదర నమోస్తు తే !!
అనుకుంటూ ఆచమనం చేసిన తరువాత .సంకల్పం:
దేశాకాలౌ సంకీర్త్య గంగా వాలుకాభి సప్తర్షిమండల పర్యంతం కృతవారాశేః పౌన్దరీ కాశ్యమేధాది సమస్తక్రాటు ఫలా వాప్త్యార్థం, ఇహజన్మని జన్మాంతర రేచ బాల్య యౌవన కౌమార వార్థకేషు జాగృత్ స్వప్న సుషుప్త్యవస్థాసుజ్ఞానతో జ్ఞానతశ్చ, కామతో కామతః స్వతః ప్రేరణయా సంభావితానాం, సర్వేషాం పాపాన మపనోడ నార్థం, ధర్మార్థకామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ద్యర్థం, క్షేమ స్థైర్య విజయాయురారోగ్యైశ్వర్యాదీనాం ఉత్తరోత్తరాభి వృద్ధ్యర్థం, శ్రీ శివకేశావానుగ్రహ సిద్ద్యర్థం వర్షే వర్షే ప్రయుక్త కార్తికమాసే ... వాసర (వారం పేరు), యుక్తానాం ..... తిథౌ (తిథి) శ్రీమాన్ (గోత్రనామం) గోత్రాభిజాతః --- (పేరు) నామదేయోహం - పవిత్ర కార్తిక ప్రాతఃస్నానం కరిష్యే!
మంత్రం:
తులా రాశింగతే సూర్యే, గంగా త్రైలోక్యపావనీ !
నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తు తే!!
మంత్రం చదువుతూ ప్రవాహానికి ఎదురుగా, వాలుగా, తీరానికి పరాజ్ముఖంగా స్నానం చేసి కుడిచేతి బొటనవేలితో నీళ్ళను తీసుకుని, మూడు దోసిళ్ళ నీళ్ళు తీరం వైపు చల్లి, తీరం చేరుకొని, కట్టుబట్టల కొనలను నీళ్ళు కారిపోయేలా పిండాలి. దీన్నే యక్షతర్పణం అని అంటారు.
ఆలయానికి వెళ్ళి, శివుడు లేదా విష్ణువుకు అర్చన చేసి ఆవునేతితో దీపారాధన చేయాలి.
తరువాత స్త్రీలు తులసి మొక్కని..దీపాన్ని,
పురుషులు కాయలు ఉన్న ఉసిరి కొమ్మను..దీపాన్ని బ్రాహ్మణులకు దక్షిణతో దానం చేయాలి.
కార్తీక మాసంలో ముఖ్యమైన పండుగలు రెండు.
దానిలో ఒకటి క్షీరాబ్ధిద్వాదశి,
రెండవది కార్తీకపౌర్ణమి.
కార్తీక పౌర్ణమి రోజున దీపాలు తప్పనిసరిగా వెలిగించాలి. ఉసిరికాయల మీద వత్తులు పెట్టి దీపాలు పెడతారు, నదులలో దీపాలను వదలటంతో పాటు పండితులకు దీపదానం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.
కార్తిక పౌర్ణమి రోజున కృత్తికా శివయోగం అనే పూజా విధానాన్ని కొన్ని ప్రాంతాలలో చేస్తారు.
మరికొన్ని ప్రాంతాలలో శివాలయాల దగ్గర జ్వాలాతోరణం నిర్వహించి శివారాధన చేసి పాడిపంటలను రక్షించమని కోరుకుంటారు.
జ్వాలాతోరణం అంటే కార్తికపౌర్ణమి రోజున గడ్డిని తోరణాలుగా చేసి శివాలయంలో మంట వేసి పార్వతీదేవి విగ్రహాన్ని మూడుసార్లు ఆ మంటకిందుగా తిప్పుతారు.
జ్వాలాతోరణం నిర్వహించడానికి కారణం ఈ విధంగా చెబుతారు.
దేవతలు రాక్షసులు సముద్రమథన చేసిన సమయంలో హాలాహలం వచ్చినప్పుడు పార్వతీదేవి పరమశివుణ్ణి ప్రార్థించి మింగవలసిందిగా ప్రార్థించిన సందర్భంలో ప్రజారక్షణ చేసినందుకు సంకేతంగా జ్వాలాతోరణం జరుపుతారట.
ఉదయం పూట శ్రీహరి పూజ,
సంధ్య వేళ శివారాధన, దీపాల అలంకరణ, ఆకాశ దీపాలు పెట్టడం సంప్రదాయంగా వస్తున్నది.
దీపదాన మంత్రం:
సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వసంప చ్చుభావహం !
దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదా మమ !!
జ్ఞానం, సంపదలు, శుభాలనూ కలిగించేదైన,
దీపదానాన్ని చేస్తున్నాను.
దీనివల్ల నాకు నిరంతరం శాంతి సుఖాలు ఏర్పడుగాక' అని చెపుతూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణుడికి దానం చేయాలి..
ఓం నమః శివాయ...ఓం కార్తీక దామోదరాయ నమః..!
లోకా సమస్తా సుఖినోభవంతు..!!
శ్రీ మాత్రే నమః

హరిహరులకు ప్రీతికరం కార్తీక మాసం
తెలుగు మాసాల్లో ఒక్కో నెలకు ఒక్కో విశిష్టత ఉంది. ఇందులో కార్తికమాసం అత్యంత పవిత్రమైనది. ఈ నెలలో పూర్ణిమ రోజున చంద్రుడు కృత్తికా నక్షత్రం సమీపంలో తిరుగుతూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తికం అనే పేరు వచ్చింది. ఖగోళ విజ్ఞానంలో.. భూగోళ జీవరాశికి ఉన్న అవినాభావ సంబంధానికి కార్తికం ఒక అద్భుత ఉదాహరణ. శ్వేత వరాహకల్పపు వైవస్వత మన్వంతరంలో ఇది 28వ మహాయుగం. కృతయుగం వైశాఖ తదియ నాడు, త్రేతాయుగం కార్తిక శుద్ధ నవమి నాడు, ద్వాపరం భాద్రపద కృష్ణ త్రయోదశి నాడు, కలియుగం మాఘ పూర్ణిమ నాడు ప్రారంభమయ్యాయని ఖగోళ విజ్ఞాన వేత్తల ఉవాచ.
‘‘న కార్తిక సమో మాసః’’ అని స్కాంధపురాణం చెప్పినట్లు.. కార్తికంతో సరితూగే నెల లేదు. శివకేశవులిద్దరికీ ఇష్టమైన నెల ఇది. ఈ మాసంలో మహా విష్ణువును తులసీ దళాలు, జాజి పూలతో.. పరమశివుడిని మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, మారేడు దళాలు, జిల్లేడు పూలతో పూజిస్తే విశేష ఫలితం ఉంటుంది. ఆరుగురు కృత్తికలు తల్లులై పాలివ్వడంతో.. ఆరు ముఖాల కుమార స్వామిని కార్తికేయుడని అంటారు. ఆయన ఆధిపత్యం ఉన్న నెల కావడం వల్లే ఈ మాసానికి కార్తికం అని పేరు వచ్చింది. ఈ నెలలో కృత్తికా నక్షత్రం, బృహస్పతి గ్రహం, సోమవారం కలిసి వస్తే.. దాన్ని పరమ పవిత్ర దినంగా గుర్తించాలని వేదం ఘోషిస్తోంది. ఈ మాసంలో శుద్ధ చవితిని నాగుల చవితిగా, శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశిగా, ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశిగా.. చిలుక ద్వాదశిగా, పౌర్ణమిని కార్తిక పౌర్ణమిగా జరుపుకొంటాం. కార్తిక శుద్ధ చవితినాడు సూర్యోదయానికి ముందు ఆకాశంలో తూర్పు దిక్కున శేషుని నక్షత్ర రూపం కనిపిస్తుంది. ఇది సర్పాకారంలో ఉంటుంది. కాబట్టి.. నాగుల చవితిని జరుపుకొంటాం. ఆశ్వయుజ బహుళ అమావాస్య (దీపావళి) నుంచే కార్తిక స్నానాన్ని ఆరంభించాలి.
నెల రోజులూ కార్తిక స్నానం చేయడం వీలుకాని పరిస్థితుల్లో.. శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లోనైనా విధిగా ఆచరించాలి. ఈ మాసంలో పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనది. ఈ మాసంలో ప్రతిరోజూ తెల్లవారు జామున నదీస్నానాలు, సముద్ర స్నానాలు చేస్తే సకల పాపాలు తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. గరళ కంఠుడైన పరమేశ్వరుడి తమోగుణ స్వభావాన్ని చంద్రుడు మాత్రమే హరించగలడు. అందుకే.. ఈ నెలలో సోమవారాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. కార్తిక సోమవారాల్లో ఉపవాసం ఉండటం ఆనవాయితీ. ఈ నెలలో వెలిగించే దీపం కోటి పుణ్యాల ఫలాన్ని అందిస్తుంది. కార్తిక పౌర్ణమి రోజున చేసే దీపారాధన ఎన్నో రెట్ల పుణ్యాల ఫలాన్నిస్తుంది. ఈ మాసంలో దీపారాధన, దీపదానం స్వర్గలోకప్రాప్తిని కలిగిస్తుంది. వీటితోపాటు ఈ మాసంలో ఏకభుక్తం, నక్తం, అయాచితం, తిలదానం విధిగా పాటిస్తారు. వనాలలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసి, వన భోజనాలు చేయడం పుణ్యఫలాలనిస్తుంది. ఈ నెలలో కార్తిక పురాణం చదివినా.. విన్నా మంచిది. ఆ పురాణంలో చెప్పిన విధులన్నింటినీ నెరవేరుస్తూ.. సత్సంగత్యంతో సర్వ మానవాళి తరించాలని ఆశిద్దాం.

కార్తీకపురాణం 1 అధ్యాయం
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
కార్తీక మాసం విశేషం
ఒకరోజు నైమిశారణ్యంలో శౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూతమహర్షితో ఇలా కోరారు… ”ఓ మహాత్మా… మీ ద్వారా ఎన్నో పురాణేతిహాసాలను, వేదవేదాంగాల రహస్యాలను గ్రహించాము. కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. ఆ మాసం పవిత్రత, కార్తీకపురాణ ఫలితాలను కూడా వివరించండి..” అని కోరారు.
శౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూతమహర్షి ఇలా అంటున్నాడు… ”ఓ పునిపుంగవులారా… ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోకసంచారి అయిన నారదమహాముని బ్రహ్మదేవుడిని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు. అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు, పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు. అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణగాథను విన్నంతనే ఇహలోకంలో, పరలోకంలో సకలైశ్వర్యములు పొందగలరు. కాబట్టి శ్రద్ధగా వినండి” అని చెప్పసాగాడు.
పూర్వం ఒకరోజు పార్వతి పరమేశ్వరులు ఆకాశమార్గంలో విహరిస్తుండగా… పార్వతి దేవి పరమశివుడితో ”ప్రాణేశ్వరా… సకల ఐశ్వర్యాలను కలుగజేసి, మానవులంతా కులమత తారతమ్యం లేకుండా, వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతమేదైనా ఉంటే వివరించండి” అని కోరింది.
అంతట పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు ”దేవీ! నీవు అడిగే వ్రతమొక్కటి ఉంది. అది స్కంధపురాణంలో ఉప పురాణంగా విరాజిల్లుతోంది. దానిని వశిష్ట మహాముని మిథిలాపురాధీశుడైన జనక మహారాజుకు వివరించారు. అటు మిథిలానగరం వైపు చూడు….” అని ఆ దిశగా చూపించాడు.
మిథిలానగరంలో వశిష్టుడి రాకకు జనకమహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్యపాద్యాలతో సత్కరించారు. ఆపై కాళ్లు కడిగి, ఆ నీటిని తన తలపై జల్లుకుని ఇలా అడుగుతున్నాడు ”ఓ మహామునివర్యా… మీ రాకవల్ల నేను, నా శరీరం, నా దేశం, ప్రజలు పవిత్రులమయ్యాము. మీ పాద ధూళితో నా దేశం పవిత్రమైంది. మీరు ఇక్కడకు రావడానికి కారణమేమిటి?” అని కోరగా…. వశిష్ట మహాముని ఇలా చెబుతున్నాడు ”జనక మహారాజ! నేనొక మహాయజ్ఞము చేయాలని నిర్ణయించాను. అందుకు కావాల్సిన ధన, సైన్య సహాయానికి నిన్ను కోరాలని వచ్చాను” అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు.
దీనికి జనకుడు ”మునిపుంగవా… అలాగే ఇస్తాను. స్వీకరించండి. కానీ, ఎంతో కాలంగా నాకొక సందేహమున్నది. మీలాంటి దైవజ్ఞులైనవారిని అడిగి సంశంయం తీర్చుకోవాలని అనుకునేవాడిని. నా అదృష్టం కొద్ది ఈ అవకాశం దొరికింది. ఏడాదిలోని మాసాలన్నింట్లో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది? ఈ నెల గొప్పదనమేమిటి? కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా?” అని ప్రార్థించారు.
వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి ”రాజ! తప్పక నీ సందేహాన్ని తీర్చగలను. నేను చెప్పబోయే వ్రతకథ సకలమానవాళి ఆచరించదగినది. సకల పాపాలను హరించేది. ఈ కార్తీకమాసం హరిహర స్వరూపం. ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇదీ… అని చెప్పలేం. వినడానికి కూడా ఆనందదాయకమైనది. అంతేకాదు.. ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ, పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు. నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం. శ్రద్ధగా ఆలకించు….” అని చెప్పసాగాడు.
కార్తీక వ్రతవిధానం
”ఓ జనక మహారాజా! ఎవరైనా, ఏ వయసువారైనా పేద-ధనిక, తరతమ తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు. సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా…. వేకువ జామున లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమాచరించి, దానధర్మాలు, దేవతాపూజలు చేసినట్లయితే… దానివల్ల అనన్యమైన పుణ్యఫలితాన్ని పొందగలరు. కార్తీకమాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ… విష్ణుసహస్రనామార్చన, శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చేయాలి. ‘ఓ దామోదర నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానీయక నన్ను కాపాడు’ అని ధ్యానించి ప్రారంభించాలి” అని వివరించారు.
వ్రతవిధానం గురించి చెబుతూ… ”ఓ రాజా! ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, నదికిపోయి, స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారయణ, పరమేశ్వరులకు, బైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత నీటిలో మునిగి, సూర్యభగవానుడికి అర్ఘ్యపాదాలను సమర్పించి, పితృదేవతలకు క్రమప్రకారం తర్పణలు చేయాలి. గట్టుపై మూడు దోసిళ్ల నీరు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరీ, తుంగభద్ర, యుమన తదితర నదుల్లో ఏ ఒక్కనదిలోనైనా స్నానం చేసినట్లయితే… గొప్ప ఫలితం లభిస్తుంది. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని, శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకొచ్చి, నిత్యధూప, దీప, నైవేద్యాలతో భగవంతుని పూజచేయాలి. గంధము తీసి, భగవంతునికి సమర్పించి, తానూ బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత అతిథిని పూజించి, వారికి ప్రసాదం పెట్టి, తన ఇంటివద్దగానీ, దేవాలయంలోగానీ, రావిచెట్టు మొదటగానీ కూర్చొని కార్తీకపురాణం చదవాలి. ఆ సాయంకాలం సంధ్యావందనం చేసి, విశాలయంలోగానీ, వి

ష్ణు ఆలయంలోగానీ, తులసికోట వద్దగానీ, దీపారాధన చేసి, శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి, స్వామికి నివేదించాలి. అందరికీ పంచి, తానూ భుజించాలి. తర్వాతిరోజు మృష్టాన్నంతో భూతతృప్తిచేయాలి. ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు, మగవారు గతంలో, గతజన్మలో చేసిన పాపాలు, ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు, వీలు పడనివారు వ్రతాన్ని చూసినా, వ్రతం చేసినవారికి నమస్కరించినా… వారికి కూడా సమాన ఫలితం వస్తుంది.
ఇది స్కాంద పురాణంలోని వశిష్టమహాముని చెప్పిన కార్తీక మహత్యంలోని మొదటి అధ్యాయం సమాప్తం. మొదటిరోజు పారాయణం సమాప్తం.

Kartika Puranam - 2
కార్తీక పురాణము -- ద్వితీయాధ్యాయం
అథద్వితీయాధ్యాయ ప్రారంభః
శ్రుణురాజన్ ప్రవక్ష్యామి మహాత్మ్యం కార్తీకస్యచ! కర్మత్రయ కృతాత్పాపాత్ ముచ్యతే శ్రవణాదపి!! ఓ రాజా! కార్తీకమహాత్మ్యమును వినుము. విన్నంతనే మనోవాక్కాయములవలన చేయబడిన పాపమంతయు నశించును. కార్తీకమాసమందు శివప్రీతిగా సోమవార వ్రతమాచరించువాడు కైలాసనివాసియగును. కార్తీకమాసమున సోమవారమందు స్నానముగాని, దానమును గాని, జపమును గాని చేసినయెడల అశ్వమేధయాగముల ఫలమును పొందును. ఇందుకు సందేహములేదు. కార్తీకమాసమందు ఉపవాసము, ఒకపూట భోజనము, రాత్రి భోజనము, ఛాయానక్తభోజనము, స్నానము, తిలదానము, ఈఆరున్నూ ఉపవాస సమానములగునని ఋషులు చెప్పిరి. శక్తిగలవాడు కేవల ఉపవాసము చేయవలెను. అందుకు శక్తిలేనివాడు రాత్రిభోజనమును చేయవలెను. అందుకు శక్తిలేనివాడు చాయానక్తము జేయవలెను. అందు శక్తి లేనివాడు బ్రాహ్మణులకు భోజనముపెట్టి వారితో పగలే భోజనము చేయవలెను. ఛాయానక్తమనగా సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగలే భుజించుట. సాయంకాలము 4 ½ గంటలకు భుజించుట చాయానక్తమగును. మానవులు పైన చెప్పిన ఆరింటిలో దేనినయినను ఆచరించినయెడల యెనిమిది యుగములు నరకమందు కుంభీపాకనరకములోను, రౌరవనరకములోను బాధలనొందుదురు. కార్తీక సోమవారమందు విధవ యధావిధిగా ఉపవాసముచేసి శివుని పూజించినట్లయిన శివలోకమునుబొందును. స్త్రీలుగాని, పురుషులుగాని ఎవరు కార్తీకసోమవారమందు నక్షత్రములను జూచి రాత్రి భోజనము చేయుదురో వారి పాతకములు అగ్నియందుంచబడిన దూదివలె నశించును. కార్తీకసోమవారమందు శివలింగమునకు అభిషేకమును, పూజయుచేసి రాత్రి భుజించువాడు శివునకు ప్రియుడగును. ఈవిషయమునందొక కథగలదు. చెప్పెద వినుము. ఇది వినువారికిని చెప్పువారికిని పాపనాశనమగును.
కాశ్మీరదేశమందొక పురోహితుని కూతురు స్వాతంత్ర్యనిష్ఠురియనునొక స్త్రీగలదు. అతి చక్కని రూపముతో మంచి యౌవనముతో గూడియుండి తలదువ్వుకొని అలంకరించుకొని బహుగా మాట్లాడుచూ జారిణియై యుండెడిది. ఈమె దుర్గుణములను జూచి తల్లిదండ్రులును, అత్తమామలును ఆమెను విడిచిరి. ఆమె భర్త సౌరాష్ట్ర దేశశ్థుడు. అతని పేరు మిత్రశర్మ. అతడు వేదవేదాంగ పారంగతుడును, సదాచారవంతుడును, సమస్త భూతములందు దయగలవాడును, అనేక తీర్థముల సేవించినవాడును, అబద్ధమాడనివాడును, నిరంతరము దయగలవాడును భర్త ఇట్టి ఉత్తమగుణములు గలవాడైనప్పటికి ఆదుర్మార్గపు భార్య ఇతనిని నిత్యము కొట్టుచుండెడిది. అట్లు నిత్యము ఆమెచేత దెబ్బలు తినుచును గృహస్థధర్మమందుండు కోరికచేత భార్యను విడువలేక ఆమెతో కష్టపడుచుండెడివాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము, అంగములనగా శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము వీటిని సంపూర్ణముగా చదివినవాడు వేదవేదాంగ పారగుడనబడును. ఈమిత్రశర్మ భార్యకు కర్కశయనియు నామముగలదు. భర్యయైన మిత్రశర్మయు సంభోగవాంఛచేత ఆమెయందు రాగముతోనుండెను. అంతనొకనాడు ఆమె రంకుమొగుడు ద్రవ్యములను నగలను వస్త్రములును తృప్తిగా ఇచ్చి నిరంతరము నీభర్తవల్ల భంగము గలుగుచున్నది గాన నీభర్తను చంపుమని చెప్పగా ఆమె సమ్మతించి రాత్రి భర్త నిద్రించగానే తానులేచి పెద్ద రాతిని తెచ్చి భర్త శిరస్సును కొట్టెను. ఆ దెబ్బతో అతడు మృతినొందెను. తరువాత కర్కశస్వయముగా తన భత శవము వీపుమీద వేసుకొని తీసుకొనిపోయి పాడునూతిలో పడవేసెను. ఇట్లు భర్తను చంపి తరుణులును పరస్త్రీ సంగమాభిలాషులును, కామశాస్త్ర ప్రవీణులును, వర్ణ సంకరకారకులును, అయిన అనేకజాతి పురుషులతో ఆలింగన చుంబనాదులతో నిత్యము సంభోగముచేయుచుండెడిది. ఇంతేగాదు. భర్తయందనురాగముతో గూడియున్న భార్యలను దుర్బోధలచేత ఇతరులతో సంభోగము చేయించుచు ఏకపత్నీ వ్రతపరాయణులను భంగపరచి వారితో సంభోగించుచు నిత్యము పరనిందచేయుచు పరద్వేషము కలదై దేవతాద్వేషి అయియుండెను. నిరంతరము దయాశూన్యయై ఆడంబరము చేతగాని, నవ్వుచేతగాని, కపటముచేతగాని, విష్ణు పాదారవిందమును ధ్యానించలేదు. హరికథను విననూలేదు. ఇటుండగానే ఆమెకు యౌవనము పోయి ముసలితనము వచ్చినది. తరువాత వ్రణ వ్యాధి కలిగినది. ఆ కురుపునకు పురుగులు జనించి తరువాత దుర్గంధముతో కూడినదయ్యెను. తరువాత జారులందరు రూపవంతులు మదయుక్తులైవచ్చి చూచి విగతాశులై వేశ్య ఇంటికి వచ్చుట మానివేసిరి. తరువాత పాపాధిక్యముచేత చాలా బాధనొంది ఆవ్రణవ్యాధితోడనే మృతినొందెను. తరువాత భయంకరులయిన యమదూతలు వచ్చి ఆకర్కశను పాశములచేత కట్టి యమునికడకు తీసుకొని పోయి యమునికి అప్పగించిరి. యముడు దానిని చూచి కోపముచేత కళ్ళెర్రజేసి దీనిని భయంకరమగు ముళ్ళతో గూడినదియు, ఇనుముతో చేయబడిన స్తంభమును కాల్చి మండుచుండగా ఆలింగనము చేయించుడని కఠినమైన శిక్షను విధించెను. అంత యమాజ్ఞ మీద భటులు ఆకర్కశను చేసిన పాపములను జెప్పుచు ఆవేడి స్తంభమును సంభోగించుమనిరి. ఆమె పాదములు రెండు పట్టుకొని గిరగిర త్రిప్పి రాతిమీద కొట్టిరి. రక్తమును కాచి త్రాగించిరి. సీసమును కాచి రెండుచెవులలోను పోసిరి. యమకింకరులు యమాజ్ఞ చిత్రగుప్తాజ్ఞలచే అనేక నరక బాధలకు గురిచేసిరి. ఆకర్కశ ఇట్లు తన పితృ పతామహులతోను, తన బాంధవులతో తనకు పూర్వము పదితరములు తరువాత పదితరముల వారి

తో ఘోరములందు నరకములందు మహాబాధలుపొంది తరువాత భూమియందు జన్మించెను. భూమియందు పదిహేనుమార్లు కుక్కగ జన్మించినది. అందులో పదిహేనవ జన్మ కళింగదేశమందు బ్రాహ్మణుని ఇంటివద్ద కుక్కగా పుట్టి యింటింటికి తిరుగుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీకమాసమందు సోమవారము దినంబున పగలంతయి ఉపవాసముచేసి గృహమునందు శివలింగాభిషేక పూజాదులను జేసి నక్షత్రమండలమును జూచి గృహమునకు బోయి దేవ నివేదన చేసి పిమ్మట బలిదానము కొరకు బయటకువచ్చి భూమిమీద బలిని ఉంచి కాళ్ళు కడుగుకొని ఆచమనము చేసి తిరిగి యింటిలోనికి వెళ్ళెను. ఆకుక్క ఆనాడు పగలంతయి ఆహారము కొద్దియైనను దొరకనందున కృశించినదై కార్తీకసోమవారము రాత్రి విప్రుడువేసిన బలిని భక్షించెను. ఆబలిభోజనముచేత కుక్కకు పూర్వజాతిస్మృతిగలిగి బ్రాహ్మణోత్తమా! రక్షింపుము. రక్షింపుమని పలికెను. ఆమాటవిని బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యముతో గూడినవాడై ఓ శునకమా! మాఇంటిలో ఏమేమిచేసితివి. రక్షింపుమనుచున్నావు అని యడిగెను. కుక్క ఇట్లనెను. బ్రాహ్మణోత్తమా! వినుము. నేను పూర్వజన్మమందు బ్రాహ్మణస్త్రీని. పాపములను చేయుదానను. వర్ణసంకరము చేసినదానను. అన్యపురుషులను మరగి నిజభర్తను చంపితిని. ఈవిధిపాపములు అనేకములు చేసి చచ్చియమలోకమునకు పోయి అచ్చట అనేక బాధలనొంది తిరిగి భూమికి వచ్చి 15మార్లు కుక్కగా జన్మించితిని. చివరికి ఇప్పుడు నాకీ జాతిస్మరణ కలిగినది. ఎట్లు కలిగినదో చెప్పుము. విని తరించెదను. ఆబ్రాహ్మణోత్తముడీమాట విని జ్ఞానదృష్టితో చూచి తెలిసికొని యిట్లనియె. ఓ శునకమా! ఈకార్తీక సోమవారమునాడు ప్రదోషసమయము వరకు భుజింపక ఇప్పుడు నేను ఉంచిన బలిని భక్షించితివి గనుక నీకు జాతిస్మృతి గలిగినది. ఆమాటవిని కుక్క బ్రాహ్మణోత్తమా! ఈకుక్కజాతి నుండి నాకెట్లు మోక్షముగలుగునో చెప్పుమని విప్రుని అడిగెను. ఆకుక్క యిట్లు ప్రార్థించగా పరూపకార బుద్ధితో కార్తీకసోమవారములందు తానుజేసిన పుణ్యములో ఒక సోమవార పుణ్యమును కుక్కకు ధారపోసెను. బ్రాహ్మణుడు సోమవార పుణ్యమును ఈయగానే కుక్క దేహమును విడిచి ప్రకాశించుచున్న శరీరముగలదై ప్రకాశించెడి వస్త్రములను మాల్యములను, ధరించి ఆభరణాలంకృతయై తన పితరులతోగూడ కైలాసానికిబోయి అచ్చట పార్వతీదేవివలె శివునితోగూడ ఆనందించుచుండెను. కాబట్టి కార్తీకమాసమందు సోమవారవ్రతము ఆచరించదగినది. ఎవరు కార్తీక సోమవార వ్రతమును జేయుదురో వారికి మోక్షము హస్తమందుండును. కాబట్టి ఓ జనకమహారాజా! పుణ్యప్రదమైన కార్తీకవ్రతమును నీవు చేయుము.
ఇతి స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే ద్వితీయోsధ్యాయస్సమాప్తః

Kartika Puranam - 3
అథ తృతీయోధ్యాయ ప్రారంభః
శ్లో!! కార్తీకేమాసి రాజేంద్ర స్నానదాన జపాదికం!
లేశంవాకురుతేమర్త్యః తదక్షయ్య ఫలం స్మృతమ్!!
ఓ జనకమహారాజా! వినుము. కార్తీకమాసమందు స్నానము దానము జపము మొదలయిన పుణ్యములలో ఏదయినను స్వల్పమైనా చేసినయెడల ఆస్వల్పమే అనంతఫలప్రదమగును. స్త్రీలుగాని, పురుషులుగాని, అస్థిరమైన శరీరమును నమ్ముకుని శరీరకష్టమునకు భయపడి కార్తీకవ్రతమును జేయని యెడల నూరుమారులు కుక్కగా పుట్టుదురు. కార్తీక పున్నమిరోజున స్నానదానములు ఉపవాసమును జేయని మనుష్యుడు కోటిమారులు చండాలుడై జన్మించును. అట్లు చండాలుడై పుట్టి చివకు బ్రహ్మ రాక్షసుడైయుండును. ఈవిషయమందొక పూర్వకథ గలదు. చెప్పెదను వినుము.
ఆ ఇతిహాసము తత్వనిష్ఠునిదైయున్నది. గనుక దానిని వినుము. ఆంధ్రదేశమందు తత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు, అబద్ధమాడనివాడు, ఇంద్రిఅయములను జయించివాడు, సమస్త ప్రాణులందు దయగలవాడు, తీర్థయాత్రలందాసక్తి గలవాడు. రాజా! ఆబ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకుబోవుచు గోదావరీ తీరమందు ఆకాశమునంటియున్నట్లుండు ఒక మర్రిచెట్టు మీద ముగ్గురు బ్రహ్మరాక్షసులనుజూచెను. ఆ బ్రహ్మరాక్షసులకు తలవెంట్రుకలు పైకి నిక్కియున్నవి. నోరు వికటముగానున్నది. శరీరము నల్లగానున్నది. ఉదరము కృశించియున్నది. నేత్రములు, గడ్డము, ముఖము ఎర్రగానున్నవి. దంతములు పొడుగుగానున్నవి. చేతిలో కత్తులపైన పుర్రెలు కలిగి సర్వజంతువులను భయపెట్టుచుండిరి. ఆరాక్షసుల భయముచేత ఆవటవృక్షమునకు ఆరుక్రోశముల దూరము లోపల మనుష్యులు పక్షులు మృగములు సంచరించుటయే లేదు. ఆవట సమీపమందు పర్వతసమాన శరీరులగు ఆ బ్రహ్మరాక్షసులు నిత్యమును పశువులు, పక్షులు, మృగములు మొదలయిన జంతుజాలములయొక్క ప్రాణములకు భీతిని గొల్పు భయంకర శబ్దములను జేయుచుండెడివారు. అనేక కార్తీక వ్రతములాచరించిన ఆ తత్త్వనిష్ఠుడు దైవవశముచేత మార్గమున పోవుచు మర్రిచెట్టుమీదనున్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను జూచెను.
తత్త్వనిష్ఠుడు భయపడి శ్రీహరి పాదారవిందములను స్మరించుచు దేవేశా౧ నన్ను రక్షించుము. లోకేశా!నారాయణా!అవ్యయా!నామొర ఆలకించుము. సమస్త భయముల నశింపజేయు దేవా! నాభయమును పోగొట్టుము. నాకు నీవే దిక్కు. నీవు తప్ప నన్ను రక్షింపసమర్థులెవ్వరును లేరు. ఈప్రకారము హరిని గూర్చి మొరబెట్టుచు వారి భయమున పరుగెత్తుచున్న బ్రాహ్మణుని జూచి బ్రహ్మ రాక్షసులు వానిని భక్షించు తలంపుతో అతనివెంబడి పరుగెత్తసాగిరి. ఇట్లు కొంతదూరము పోగానే వెనుకకు తిరిగిన ఆబ్రాహ్మణుని దర్శనము వలన బ్రహ్మ రాక్షసులకు జాతి స్మృతిగలిగినది.
ఓరాజా! తరువాత వారు ఆ బ్రహ్మణునిముందు భూమియందు దండప్రణామములాచరించి అంజలిపట్టి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లనిస్తుతించిరి. బ్రాహ్మణోత్తమా! మీదర్శనమువలన మేము పాపరహితులమైతిమి. మీరాక మాకు ఉపకారము కొరకయినది. అది న్యాయమే, మహాత్ములు జీవించుట యాత్ర చేయుట లోకమును ఉద్ధరించుటకొరకే ఉపకారము కొరకే అగునుగదా. బ్రాహ్మణుడీమాటలను విని భయమును వదలి మంచి మనస్సుతో ఇట్లనియెను. మీరెవ్వరు. ఏకర్మచేత మీకిట్టి వికృతరూపములు గలిగినవి. లోకనిందితమైన ఏకర్మను మీరు పూర్వమందు చేసినారు. భయమును వదలి సర్వమును నాకు జెప్పుడు. తరువాత రాక్షులు తాము చేసిన నింద్య కర్మలను వేరువేరుగా తలంచుకొని ఆబ్రాహ్మణునితో ఇట్లని విన్నవించిరి. మొదటి బ్రహ్మరాక్షసుడు ఇట్లు పల్కెను. అయ్యా నేను పూర్వజన్మమందు ద్రావిడదేశములో మందరమను గ్రామమునకు గ్రామాధికారిని. బ్రాహ్మణులలో నీచుడను. కఠినముగా మాటలాడువాడను. ఇతరులను వంచించు మాటలను మాట్లాడుటలో నేర్పరిని. నాకుటుంబలాభము కొరకు బ్రాహ్మణుల ధనమును చాలా అపహరించితిని. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒకనాడయినను అన్నమును బెట్టియెరుగను. బ్రాహ్మణులసొమ్ము స్నేహముచేత హరించుటచేత ఏడుతరములు కుటుంబము నశించును. దొంగతనముగా బ్రాహ్మణుల ధనమపహరించిన యెడల సూర్యచంద్ర నక్షత్రములుండువరకు కుటుంబము నశించును. తరువాత మృతినొంది యమ బాధలను అనేకములనొందితిని. ఆదోషము చేతనే భూమియందు బ్రహ్మరాక్షసుడనై జన్మించితిని. కనుక బ్రాహ్మణోత్తమా! ఈ దోషము నశించు ఉపాయమును విచారించి క్చెప్పుము.
అందులో రెండవవాడిట్లు చెప్పెను. అయ్యా నేను ఆంధ్రదేశమందుండువాడను. నేను నిత్యము తల్లిదండ్రులతో కలహించుచుండి వారిని దూషించుచుండువాడను. ఇదిగాక నేనును, నా భార్యాపిల్లలును, షడ్రసోపేతమైన అన్నమును భుజించుచు నాతల్లిదండ్రులకు మాత్రము చద్ది అన్నమును పెట్టుచుండువాడను, బంధువులకుగాని, బ్రాహ్మణులకుగాని, ఒకనాడయినను అన్నమును పెట్టినవాడనుకాను. మరియు ధనమును విస్తారముగా ఆర్జించియుంటిని. పిమ్మట నేను చనిపోయి యమలోకమందు యెనిమిదియుగముల వకు యమబాధలనుబొంది బ్రహ్మరాక్షసుడనై భూమియందు జన్మించితిని. ఓబ్రాహ్మణోత్తమా! నాకీపాపము తొలగు ఉపాయము జెప్పి నన్ను ఉద్ధరింపుము. తరువాత మూడవవాడు నమస్కరించి తనస్థితిని ఇట్లు చెప్పెను. అయ్యా! నేను ఆంధ్రదేశ నివాసిని. బ్రాహ్మణుడను. విష్ణ్వాలయమందు స్వామికి అర్చకుడను. స్నాన సంధ్యావందనములను విడిచి స్వామి పూజను వదలి పరనిందలను జేయుచు విశేషముగా మాటలాడుచు కఠినుడనై దయాశూన్

యుడనై తిరుగుచు దేవాలయమందు భక్తులు వెలిగించు దీపములలోని నెయ్యి నూనెను అపహరించి వేశ్యాగృహమందు దీపములను పెట్టి ఆనేతిని వేశ్యకు యిచ్చి దేవతా నివేదితాన్నమును అపహరించి క్దానితో సంభోగించుచుండువాడను. ఆ దోషముచేత నరకములందు అనేక యాతనలను అనుభవించి తరువాత భూమికి వచ్చి నానా జన్మలందు జన్మించి చివరికి బ్రహ్మ రాక్షసుడనై బుట్టి ఈ మర్రిమీద ఉంటిని కనుక సమస్త భూతదయాపరా బ్రాహ్మణోత్తమా! నన్ను రక్షించుపు. నాకీ బ్రహ్మరాక్షస జన్మమును నశింపజేయుము.
తత్త్వనిష్ఠుడిట్లు బ్రహ్మరాక్షసుల మాటలను విని ఆశ్చర్యమునొంది మీకు కొంచెమైనను భయములేదు. మీదుఃఖము పోగొట్టెను. నేను కార్తీక స్నానార్థము పోవుచున్నాను. నాతో మీరుకూడా రండి అని వారిని తీసుకొనిపోయి కావేరి నదిలో బ్రహ్మరాక్షసుల నిమిత్తము రాక్షసులచే గూడ స్నానము చేయించి వారికి బ్రహ్మరాక్షసత్వమును నశింపజేసెను. "అముకానాం బ్రహ్మరాక్షసత్త్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్స్నానమహం కరిష్యే" ఇట్లు సంకల్పము చేసి ఆబ్రాహ్మణుడు విధిగా స్నానము చేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలమిచ్చెను. ఆ క్షణముననే ఆముగ్గురు దోషవిముక్తులై దివ్య రూపములను ధరించి వైకుంఠలోకమునకు బోయిరి. ఓ జనకమహారాజా! వినుము. మోహము చేతగాని, అజ్ఞానముచేత గాని కార్తీకమాసంబున శుక్ర నక్షత్రముదయించినప్పుడు (తెల్లవారుఝామున) సూర్యోదయకాలమందు కావేరీనది యందు స్నానము చేసి పిమ్మట శ్రీ విష్ణుపూజను జేసిన వానికి పదివేల యజ్ఞములు చేసిన ఫలము కలుగును. ఇందుకు సందేహము లేదు. కార్తీకమాసమందు ఏదో ఒక ఉపాయము చేత కావేరీ స్నామును తప్పక చేయవలయును. కార్తీకమాసమందు దామోదరప్రీతిగా ప్రాతస్స్నానముజేయని వాడు పదిజన్మలందు చండాలుడై జన్మించి తరువాత ఊరపందిగా జన్మించును. కాబట్టి స్త్రీగాని, పురుషుడుగాని కార్తీకమాసమందు ప్రాతస్స్నానము తప్పక చేయవలెను. ఈ విషయమై ఆలోచన చేయపనిలేదు.
ఇతి స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే తృతీయోధ్యాయస్సమాప్తః

నాగుల చవితి సందర్భంగా అపురూపమైన సర్ప గాయత్రి
ఓం మహా సర్పాయ విద్మహే
బహు రక్షాయ ధీమహి
తన్నో పితృ ప్రచోదయాత్ ||
అలాగే నిత్యం పఠించవలసిన సర్పశ్లోకం
అనంతం వాసుకిమ్ శేషం పద్మనాభంచ కంబళం |
శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకమ్ కాళీయం తథా ||
ఏతాని నవనామాని నాగానాంచ మహాత్మనాం |
సాయంకాలే పఠేనిత్యం ప్రాతఃకాలే విశేషతః ||
తస్య విషభయం నాస్తి సర్వత్రవిజయీ భవేత్ ||
ఈ శ్లోకాన్ని నిత్యం సాయంకాలంలో పఠించదగ్గది. ప్రాతఃకాలంలో పఠించడం విశేషం. ఈ శ్లోకాన్ని నిత్యం పఠించేవారికి విషభయం ఉండదు. అన్నింటా విజయమే లభిస్తుంది.
అందరికి నాగుల చవితి శుభాకాంక్షలు🙏

కార్తీకపురాణం - 4 వ అధ్యాయము
ఈ విధముగా వశిష్టుడు కార్తిక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొ౦దెదరని చెప్పుచుండగా జనకుడు 'మహితపస్విత ! తమరు తెలియజేయు యితిహాసములు వినిన కొలది తనివి తిరకున్నది. కార్తీక మాసము ముఖ్యముఘ యేమేమి చేయవలయునో, యెవరి నుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు' అని కోరగా వశిష్టుల వారు యిట్లు చెప్పదొడగిరి.
జనకా! కార్తీక మాసమందు సర్వ సత్కార్యములనూ చేయవచ్చును. దీపారాధన మందు అతి ముఖ్యము దీని వలన మిగుల ఫలము నొ౦ద వచ్చును. సూర్యాస్తమయ మందు, అనగా, సంధ్య చీకటి పడు సమయమున శివకేశవులు సన్నిధినిగాని ప్రాకారంబున౦దు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంట ప్రాప్తి నొ౦దుదురు. కార్తిక మాసమందు హరి హరాదులు సన్నిధిలో ఆవునేతితో గాని, కొబ్బరి నూనెతో గాని, విప్ప నూనెతో గాని, యేది దొరకనప్పుడు అముదముతో గాని దీపము వెలిగించి వుంచవలెను. దీపారాధన యే నూనెతో చేసిననూ మిగుల పుణ్యత్ములుగాను, భక్తి పరులగాను నగుటయేగాక అష్టైశ్వర్యములూ కలిగి శివ సన్నిధి కేగుదురు. ఇందు కొక కథ గలదు, వినుము.
శతృజిత్ కథ
పూర్వము పాంచాల దేశమును పాలించు చున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి, తుదకు విసుగుజెంది తీరమున నిష్ఠతో తపమాచరించు చుం డగా నచ్చుటకు
పికెదుడను ఇడీముని పుంగవుడు వచ్చి ' పాంచాల రాజా! నివెందుల కింత తపమాచరించు చున్నావు? ని కోరిక యేమి?' యని ప్రశ్ని౦చగా, ' ఋషిపుంగవా! నాకు అష్ఠ యిశ్వర్యములు, రాజ్యము, సంపదావున్ననూ, నావ౦శము నిల్పుటకు పుత్ర సంతానము లేక, కృంగి కృశించి యీ తీర్ధ స్థానమున తపమాచరించు చున్నాను' అని చెప్పెను. అంత మునిపున్గావుడు' ఓయీ! కార్తిక మాసమున శివ సన్నిధిని శివ దేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన యెడల ని కోరిక నేర వేరగలదు ' యని చెప్పి వెడలిపోయెను.
వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తి కై అతి భక్తి తో శివాలయమున కార్తిక మాసము నెలరొజులూ దీపారాధన చేయించి, దన ధర్మాలతో నియమను సారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు ప౦చిపెట్టుచు , విడువకుండా నెలదినములూ అటుల చేసెను. తత్పుణ్య కార్యమువలన నా రాజు భార్య గర్భవతియై క్రమముగా నవమాసములు నిండిన తరువాత నొక శుభ ముర్తుమున నొక కుమారుని గనెను. రాజ కుటు౦బికులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రో త్సవములు చేయించి, బ్రాహ్మణులకు దానధర్ములు జేసి, ఆ బాలునకు ' శత్రుజి' యని నామకరణ ము చేయించి అమిత గరబముతో పెంచుచు౦డిరి. కార్తిక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తిక మాస వ్రతములు, దీపారాధనలు చేయుడని రాజు శాసించెను.
రాకుమారుడు శత్రుజి దినదిన ప్రవర్థ మనుడగుచు సకల శాస్త్రములు చదివి, ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కాని, యవ్వనమునము రాగానే దుష్టుల సహవాసము చేతను, తల్లితండ్రుల గారాబము చేతను తన కంటి కింపగు స్రీలకు బలత్కరించుచు,యెదిరించిన వారిని దండి౦చుచు తన కమావా౦ఛా తిర్చుకోను చుండెను.
తల్లితండ్రులు కూడా, తమకు లేక లేక కలిగిన కుమారుని యెడల చూచి చూడనట్లు - విని విననట్లు వుండిరి. శత్రుజి ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పు వారలను నరుకుదున ని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను జేయుచుండెను. అటుల తిరుగుచుండగా నొక దినమున నొక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ భార్య మిగుల రూపవతి. ఆమె అందచందములను వ ర్ణి౦ చుట మన్మదునకై ననూ శక్యము గాదు. అట్టి స్రీ క౦టపడగానే రాజకుమారుని మతి మందగించి కోయ్యబోమ్మవలె నిశ్చే ష్టుడై కమవికరముతో నామెను సమీపించి తన కమవా౦ఛ తెలియచేసేను. ఆమె కూడా నాతని సౌదర్యానికి ముద్దురాలై కులము, శిలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొనిపొయి భోగములను భావించెను.
ఇట్లుఒకరికొకరు ప్రేమలో పరవశులగుటచేత వారు ప్రతి దినము నర్ద రాత్రివేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసు కొనుచు తమ కామవా౦చ తీర్చు కొనుచు౦డిరి. ఇటుల కొంత కాలం జరిగెను. ఎటులనో యీ సంగతి ఆమె మగనికి తెలిసి, పసిగట్టి, బార్యనూ, రాజకుమారుని ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచు౦డెను.
ఇట్లుండగా కార్తిక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురు శివాలయమును కలుసుకొనవలెనని నిర్ణయి౦చుకొని, యెవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి యెటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలు దేరి గర్భ గుడిలో దాగి యుండెను. అ కాముకులిద్దరూ గుడిలో కలుసుకొని గాడాలింగన మొనర్చు కొను సమయమున ' చీకటిగా వున్నది, దీపము౦డిన బాగుండును గదా,' యని రాకుమారుడనగా, ఆమె తన పైట చెంగును చించి అక్కడ నున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగెంచెను. తర్వాత వారిరువురూ మహానందముతో రతి క్రీడలు సలుపుటకు వుద్యుక్తులగుచుండగా, అదే యదనుగా నామె భర్త, తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భర్యనూ, ఆ రాజకుమారుని ఖండించి తనుకూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యం కొలది

ఆ రోజు కార్తిక శుద్ధ పౌర్ణమి, సోమవారమగుట వలనను, ఆ రోజు ముగ్గురునూ చనిపోవుట వలననూ శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకునూ - యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడకు వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు ' ఓ దూతలార! నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు ? కామా౦ధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన అ వ్యభిచారుల కొరకు శివ దూతలు విమానములో వచ్చుటేల? చిత్రముగా నున్నదే! అని ప్రశ్నించెను . అంత యమకింకరులు ' ఓ బాపడ!ఎ వరెంతటి నీచులైననూ, యీ పవిత్ర దినమున, అంగ, కార్తిక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయములో శివునిసన్నిదిన దీపం వేలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నియును నశి౦ఛిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొనిపోవుటకు శివధూతలు వచ్చినారు' అని చెప్పగా- యీ సంభాషణ మంతయు వినుచున్న రాజకుమారుడు ' అల యెన్నటికిని జరగనివ్వను. తప్పొప్పులు యెలాగునున్నపటికి మేము ముగ్గురమునూ ఒకే సమయములో ఒక స్థలములో మరణి౦చితిమి. కనుక ఆ ఫలము మా యందరికి వర్తి౦చ వలసినదే ' అని, తాము చేసిన దీపారాధన ఫలములో కొంత అ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమన మెక్కించి శివ సాన్నిద్యమునకు జేర్చిరి.
వింటివా రాజా ! శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు పాపములు పోవుటయేగాక, కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన, కార్తిక మాసములో నక్షత్రమాల యందు దీపముంచిన వారు జన్మరాహిత్య మొ౦దుదురు.
ఇట్లు స్కాంద పురాణా౦తర్గత త వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్యమందలి*.
నాలుగో అధ్యయము- నాల్గవ రోజు పారాయణము సమాప్తం.
🙏🙏🙏🙏🙏🙏🙏

Kartika Puranam - 5
అథ పంచమాధ్యాయ ప్రారంభః
వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పెను. ఓ జనకమహారాజా! వినుము. కార్తీకమాసమందు పాపక్షయము కొరకు పుణ్యమును జేయవలయును. పుణ్యముచేత పాము నశించుటయేగాక పుణ్యమధికమగును. కార్తీకమందు హరిసన్నిధిలో భగవద్గీతా పారాయణమును చేయువాడు పాము కుబుసమువలెపాపములను విడుచును. ఈమాసమందు తులసీ దళములతోను, తెల్లనివి నల్లనివి అయిన అవిశపూలతో కరవీర(గన్నేరు) పూలతో హరిని పూజించినయెడల వైకుంఠమునకు బోయి హరితో గూడా సుఖించును. భగవద్గీతయందు విభూతి విశ్వరూప సందర్శనాధ్యాయములను హరి సన్నిధిలో పారాయణ చేయువాడు వైకుంఠలోకమునకు అధిపతియగును. హరిసన్నిధిలో శ్లోకముగాని, శ్లోక పాదముగాని, పురాణము చెప్పిన వారును, విన్నవారును కర్మబంధ వినిర్ముక్తులగుదురు. కార్తీకమాసమందు శుక్లపక్షమందు వనభోజనము చేయువారికి సమస్త పాపములు నశించును. ఇతర కాలములలో జపకాలమందు, హోమకాలమందు, పూజాకాలమందు, భోజనకాలమందు, తర్పణకాలమందు, చండాలురయొక్కయు, పాపాత్ములయొక్కయు, శూద్రులయొక్కయు, అశౌచవంతులయొక్కయు సంభాషణలను వినినచో దోషపరిహారము కొరకు కార్తీకమాసమునందు వనభోజనమాచరించవలయును. అనేక జాతి వృక్షములతో గూడిన వనమందు ఆమలక(ఉసిరిక) వృక్షమువద్ద సాలగ్రామము నుంచి గంధపుష్పాక్షతాదులతో బూజించి శక్తి కొలది బ్రాహ్మణులను బూజించి భోజనము చేయవలెను. ఇట్లు కార్తీకమాసమందు వనభోజనము చేసినయెడల ఆయాకలమునందు చేసిన సమస్త పాపములు నశించి విష్ణులోకమునందు సుఖముగా నుండును. కాబట్టి తప్పక ఈమాసమందు వనభోజనమాచరించ వలయును. కార్తీకమహాత్మ్యమును భక్తితో విని బ్రాహ్మణుని కుమారుడు నీచ జన్మనుండి విముక్తుడాయెను. ఆకథ చెప్తాను వినుము అని వశిష్ఠుడు జనకమహారాజుకు ఈ విధంగా చెప్పెను.
కావేరీ తీరమందు దేవశర్మయను బ్రాహ్మణుడు వేదవేదాంగ పారంగతుడు గలడు. ఆదేవశర్మకు దురాచారవంతుడగు ఒక కుమారుడు గలడు. అతని దుర్మార్గమును జూచి తండ్రి నాయనా! నీకు పాపములు నశించెడి ఒక మాటను చెప్పెదను. కార్తీకమాసమందు ప్రాతస్స్నానము చేయుము. సాయంకాలమునందు హరిసన్నిధిలో దీపములను సమర్పించుము. ఈలాగున తండ్రిచెప్పిన మాటలను విని కుమారుడు కార్తీకమాస ధర్మమనగా యేమి ఇట్టి కార్యమునాచే ఎన్నటికీ చేయతగదు. ఆమాట విని తండ్రి ఓరి దుర్మార్గుడా! ఎంతమాట అంటివిరా, నీవు అరణ్యమందు చెట్టుతొర్రలో ఎలుకవై పుట్టి ఉండుమని శపించెను. తండ్రి శాపమును విని కుమారుడు పశ్చాత్తాప పడి శాప విముక్తి దురాచారుడనైన నాకు ఎట్లు కలుగును అని తండ్రిని అడిగెను. ఆతండ్రి ఇట్లనెను. కుమారకా! ఎప్పుడు నీవు కార్తీక మహాత్మ్యమును వినెదవో అప్పుడు నీకు మూషకత్వ విముక్తి గలుగునని చెప్పెను. తండ్రి ఇట్లు చెప్పి ఊరకున్నంతలో కుమారుడు గజారణ్యమందు ఎలుక అయ్యెను. చెట్టుతొర్రలో నివసించెను. అది అనేక జంతువులకు ఆధారమైనది. ఇట్లు కొంతకాలము గడచిన తరువాత ఒకప్పుడు విశ్వామిత్ర మునీశ్వరుడు శిష్యులతో సహా కార్తీకస్నానమాచరించి ఆ వృక్షముయొక్క మొదట కార్తీకమహాత్మ్యమును భక్తితో చెప్పుచుండెను. అంతలో దురాచారుడును, హింసకుడును అగు ఒక కిరాతుడును వేటనిమిత్తము అచ్చటికి వచ్చి బ్రాహ్మణులను జూచి పాపాత్ముడు గనుక దయాశూన్యుడై వారిని జంప నిశ్చయించెను. అంతలో విశ్వామిత్రాది ముని సందర్శనము వలన వానికి జ్ఞానము కలిగి సంతోషించి అయ్యా ఏమిటి ఈపనివల్ల ఏమిఫలము అనియడిగెను. కిరాతా! వినుము చెప్పెదను. నీబుద్ధి మంచిదైనది. ఇది కార్తీకధర్మము ఈధర్మము మనుష్యులకు కీర్తి పెంపొందించును. కార్తీకమాసమందు మోహముచేతనైనను స్నానదానాదికమును జేసినవాడు పాపవిముక్తుడై వైకుంఠమును జేరును. ఈమాసమందు భక్తిశ్రద్ధలతో కూడినవాడై స్నానదానాదివ్రతము ఆచరించువాడు జీవన్ముక్తుడగును. విశ్వామిత్రుడు ఇటుల కిరాతుని గురించి చెప్పిన కార్తీక ధర్మమును వృక్షము మీదనున్న ఎలుక విని అప్పుడే నీచదేహమును విడిచి విప్రుడయ్యెను. విశ్వామిత్రుడది చూచి ఆశ్చర్యమునొందెను. తరువాత బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంతమునంతను విశ్వామిత్రునికి దెల్పి అనుజ్ఞ తీసుకొని తన ఇంటికిబోయెను. కిరాతుడును మూషకదేహత్యాగమును బట్టి కార్తీకవ్రత ఫలమును తరువాత మునివలన సకల ధర్మములను విని వైకుంఠము జేరెను. సుగతిని గోరువాడు కార్తీకమహాత్మ్యమును వినవలెను. విన్నంతనే పుణ్యవంతులై పరమపదము పొందెను. కాని విద్వాంసుడు తెలిసి కార్తీక ధర్మమును విని అభ్యసించవలెను. కాబట్టి తప్పక కార్తీకవ్రతము ఆచరించదగినది. ఇది నిజము. నాకు బ్రహ్మ చెప్పినాడు. రాజా! నీవును పురాణములందు బుద్ధినుంచుము. అట్లయిన యెడల పుణ్యగతిక బోవుదువు. ఈ విషయమై విచారణతో పనిలేదు. నిశ్చయము.
ఇతి స్కాంద పురాణే కార్తీకమహాత్మ్యే పంచమోధ్యాయస్సమాప్తః

🌹. కార్తీక పురాణం - 6 🌹
🌻 6. దీపదాన విధి మహత్యం, లుబ్ద వితంతువు స్వర్గమున కేగుట. 🌻
శ్రీరామ జయ రామ జయజయ రామ
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
శ్రీ వశిష్ఠుడు చెబుతున్నాడు రాజర్షీ, జనకా! ఈ కార్తీక మాసము ముప్పయి రోజులు కూడా - ఎవరైతే శ్రీమహావిష్ణువును కస్తూరీ, గంథాదులతోనూ, పంచామృతములతోనూ అభిషేకిస్తారో వారికి పదివేల అశ్వమేధాలు చేసిన ఫలితము లభిస్తుంది. కార్తీక మాసములో సంధ్యావేళ విష్ణుసన్నిధిలో దీపారాధనమును చేసినా, దీపదానము చేసినా వారు విష్ణులోకాన్ని పొందుతారు. ప్రత్తిని శుభ్రపరచి దానితో వత్తిని చేసి, బియ్యప్పిండి లేదా గోధుమపిండితో ప్రమిదను చేసి ఆవునేతిని పోసి, ఆ ప్రతివత్తిని తడిపి వెలిగించి ఒకానొక సధ్భ్రాహ్మణుని ఆహ్వానించి, చివరి రోజున వెండి ప్రమిదను, భమిడి వత్తినీ చేయించి, వాటిని బియ్యపు పిండి మధ్యన వుంచి, పూజా నివేదనాదులను పూర్తిచేసి, బ్రహ్మణులకు భోజనము పెట్టి అనంతరము - తాము స్వయంగా*
🌻. దీపదాన మంత్రము
మంత్రం 🌺🌺
సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వసంప చ్చుభావహం ! దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ!
'జ్ఞానమునూ, సంపదలనూ,శుభములనూ కలిగించే దైవ, దీపదానాన్ని చేస్తున్నాను. దీని వలన నాకు నిరంతరము శాంతి, సుఖము లేర్పడుగాక' అని చెప్పుకుంటూ, పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునికి దానం చేయాలి. అలా చేసినవారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు. ఈ ఈ దీపదానము వలన విద్య, జ్ఞాన, ఆయుర్వృద్ధి, అనంతరము స్వర్గభోగాలూ కలుగుతాయి. మనోవాక్కాయ కృత పాపాలన్నీ సమసిపోతాయి. నిదర్శనార్ధమై ఒక కథను వినిపిస్తాను విను.*
🌻. లుబ్ధ వితంతువు మోక్షమందుట 🌻
పూర్వం ద్రావిడ దేశములో ఒక అనాథ వితంతు వుండేది. ఆమె రోజూ భిక్షాటనమును చేసి, వచ్చిన దానిలో - మంచి అన్నమునూ, కూరలని విక్రయించి తాను దూషితాన్నముతో తృప్తిపడుతూ డబ్బును వెనకేయసాగినది. ఇతరుల యిండ్లలో వంటపనులు, కుట్టుపనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలముగా వారి వద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ వుండేది. అదిగాక ద్రవ్యభిక్షాటన కూడా చేసేది. ఇలా నిత్య ధనార్జనాలగ్నమానసయైన ఆ వితంతువు డబ్బు సంపాదించడమే తప్ప యేనాడూ హరినామస్మరణ చేయడంగాని, హరికథనో, పురాణాన్నో వినడంగాని, పుణ్యతీర్ధ సేవనమునుగాని, ఏకాదశీ వుపవాసమును గాని చేసి యెరుగదు. ఇటువంటి లుబ్ధరాలింటికి దైవవశాన - శ్రీరంగ యాత్రీకుడైన ఒక బ్రహ్మనుడు వచ్చి - ఆమె స్ధితిని చూసి - ఆమెకు నరకము తప్పదని గుర్తించి, జాలిపడి - ఆమెను మంచి దారిలో పెట్టదలచి -
'ఓ అమాయకురాలా! నేను చెప్పేది శ్రద్దగా విని ఆలోచించుకో. ఈ కేవలము చీమూ - నెత్తురూ - మాంసమూ - ఎలుకలతో కూడుకుని సుఖదుఃఖ లంపటమై వున్నదే తప్ప, ఈ తోలు శరీరము వట్టి అశాశ్వతమని తెలుసుకో. నేల, నీరు, నిప్పు, నింగి, గాలి - అనే పంచభూతాత్మకమైనదే ఈ శరీరము. ఈ దేహము నశించగానే ఆ పంచభూతములు కూడా - ఇంటి కొప్పు మీద కురిసి నలుదిక్కులకూ చెదరిపోయే వాననీళ్లలా - చెదరిపోతాయి. నీటి మీద నురుగులాటి నీ తనువు నిత్యము కాదు. ఇది శాశ్వతమని నమ్ముకున్నట్లయితే - ఆశల అగ్నిలో పడే మిడతలవలె మసి కావడమే తప్ప మేలనేది లేదు. మోహాన్ని, భ్రమలనూ వదలి పెట్టు. దైవమొక్కడే శాశ్వతుడనీ, సర్వభూతదయకారుడనీ గుర్తించు. నిరతమూ హరిచరణాలనే స్మరించు. కామమంటే - కోరిక, కోపమంటే - దురాగ్రహం, భయమంటే - ఆత్మనాత్మీయ భంగత, లోభమంటే - ధనవ్యయచింత, మోహమంటే - మమతాహంకారాలు - ఇటువంటి ఈ ఆరింటినీ వదలిపెట్టు. నా మాటవిని, యికనుంచయినా కార్తీకమాసములో ప్రాతఃస్నానాన్ని ఆచరించు. విష్ణుప్రీతికై భగవదర్పణంగా దీపదానము చెయ్యి. తద్వారా అనేక పాపాల నుంచి రక్షించబడతావు' అని హితవు చెప్పి, తనదారిన తాను వెళ్లిపోయాడు.
అతగాడి వచోమహిమ వలన ఆమెకు జ్ఞానోదయమైంది. తను చేసిన పాపాలకై చింతించినది. తానుకూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించినది. అందుచేత ఆ సంవత్సరములో వచ్చిన కార్తీకమాసాననే వ్రతాచరణమును ప్రారంభించినది. సూర్యోదయ వేళకల్లా చన్నీళ్ల స్నానమును, హరిపూజ, దీపదానము, పిదప పురాణ శ్రవణము - ఈ విధముగా కార్తీక మాసము నెల రోజులూ ఆచరించి చివరిరోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసినది. తక్షణమే ఆమె బంధాలు నశించి పోయినదై, విగతాసువై విమానారూఢురాలై, శాశ్వత స్వర్గభోగ సౌఖ్యాలను పొందినది.
కాబట్టి 'రాజా! కార్తీకమాసములో అన్నిటికంటే ప్రధానమైనది దీపదానము. తెలిసిగాని, తెలియకగాని యెవరైతే దీపదానము చేస్తున్నారో వారు తమ పాపాలను నశింప చేసుకొన్నవారే అవుతున్నారు. దీనిని వినినా, చదివినా జన్మ సంసార బంధ విముక్తులై విష్ణుభక్తి పరాయణులవుతారు.
ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే షష్ఠోధ్యాయ స్సమాప్త:
🌹 🌹 🌹 🌹 🌹🙏🙏🙏🙏🙏
కార్తీక శని, ఆదివారాల్లో దీపాలు ఎలా వెలిగించాలంటే..!?

కార్తీక మాసంలో శివుడిని ప్రార్థిస్తూ దీపాలు వెలిగించడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయి. అలాగే కార్తీక మాసంలో వచ్చే శని, ఆదివారాల్లో ఉత్తర దిశలో నేతితో దీపమెలిగించిన వారికి కుబేర అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
తపోశక్తి