Devotional Telugu
3.46K subscribers
106 photos
23 videos
19 files
62 links
An attempt to bring our Hindu Devotional information
Download Telegram
ప్రకృతి సత్యం......!

ఎవరినీ మీ నోటితో కానీ మనస్సుతో కానీ నాశనం అవ్వమని, పాడవ్వమని కాని తిట్టకండి.

బుద్ది బాగుపడాలి బావుండాలి అని కోరుకోండి.

ఒకడు బాగుపడితే వాడి వలన పదిమందికి ఉపయోగం కలుగుతుంది.

అంతేకాకుండా ఒకరి మేలు కోరుకున్న మీకు మంచే జరుగుతుంది.
ఎందుకంటే

ఈ సృష్టిలో మనం మనస్ఫూర్తిగా ఏది తలిస్తే అది జరగడం ఈ సృష్టి రహస్యం.

ఏది మనం ఇస్తామో దానికి పదింతలు లభిస్తుంది.

చెట్టుకి నీరు పోస్తేనే కదా వృక్షమై పువ్వులు ఫలాలు ఇస్తుంది.

సూర్యుడు నీరు స్వీకరించే కదా వర్షాలు ఇస్తున్నాడు అలాగే ఇది కూడా ..

కనుక ఈరోజు నుండి కయ్యానికి కాలు దువ్వకుండా బుద్ధిమారి మంచివారిగా మారాలని కోరుకోండి.

అందుకే కదా
భార్యని అపహరించిన రావణుడిని రాముడు క్షమిస్తాను అని చెప్పి దేవుడయ్యాడు. అది వినని రావణుడు మృతుడయ్యాడు.

యుధిష్ఠిరుడు కూడా మహామహా పాపాత్ములని క్షమించాడు. చివరికి దుర్యోధనుడిని కూడా క్షమిస్తాను అయిదు ఊళ్ళు ఇవ్వమంటే వినకుండా కాలుదువ్వాడు. చివరికి చచ్చాడు.

మేలు కోరుకోవడం మనవంతు. వినకపోతే ఆఫలితం అనుభవించడం వాళ్ళ వంతు. మంచి చెప్పి మహాత్ములు అవ్వండి.
వామన జయంతి

భాద్రపద శుక్లపక్షంలో శ్రవణానక్షత్రయుక్తమైన ద్వాదశినాడు వామన జయంతి జరుపుకొంటారు. వామనావతారం శ్రీమహావిష్ణువు అయిదో అవతారం. మానవావతారాల్లో మొదటిది. మానవ జీవితాన్ని ఆదర్శవంతంగా మలచుకోవడానికి ఎన్నో సందేశాలు ఇస్తుంది వామనావతారం.

కశ్యపుడి భార్య అదితి దేవతలకు తల్లి. రాక్షసులు తన పుత్రులను తరచూ హింసిస్తుంటే భరించలేక శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థించింది. స్వామి ‘తగిన సమయంలో నీకు బిడ్డగా జన్మించి నీ బాధలు పోగొడతాను’ అని ఓదార్చి అంతర్థానమవుతాడు. కొంతకాలానికి అదితి బ్రహ్మతేజోమయుడైన ఒక శిశువుకు జన్మనిచ్చింది. అయిదేళ్ల వయస్సు వచ్చేసరికి ఆ బాలుడు అఖండమేధావిగా ప్రకాశించడం గమనించిన తండ్రి కశ్యపుడు గాయత్రీ మంత్రోపదేశం చేసి సకల శాస్త్రాలూ నేర్పాడు. వయసు పెరిగినా శరీరం అలాగే ఉండటంతో అతడికి వామనుడనే పేరు స్థిరపడింది.

రాక్షసరాజు బలిచక్రవర్తి ప్రహ్లాదుడి మనవడు. స్వర్గంమీద దాడిచేసి, ఇంద్రుణ్ని ఓడించి అమరావతిని ఆక్రమించుకున్నాడు. ఓసారి నర్మదా నదీతీరాన గల ‘భృగుకచ్ఛ’ అనే రమణీయ ప్రదేశానికి వెళ్లి అశ్వమేధయాగం చేశాడు. కపటబుద్ధిగల రాక్షస గురువు శుక్రాచార్యుడు ఆ యాగానికి ప్రధాన సంచాలకుడు. బ్రాహ్మణులకు, పేదలకు ఎవరేది అడిగినా భూరిదానాలు చేశాడు బలి. బ్రహ్మతేజస్సుతో వెలిగే వటుడైన వామనుడు దండం, కమండలం, గొడుగు తీసుకుని యజ్ఞప్రాంగణానికి వెళ్ళాడు. ప్రసన్నవదనంతో బలిని ఆశీర్వదించి, అతడి వంశకీర్తిని శ్లాఘించాడు. వామనుడి వాక్చమత్కృతికి పరమానందభరితుడైన బలి- నా సర్వసంపదలను, రాజ్యాన్ని ఇస్తాను కోరుకొమ్మన్నాడు. బలి ఆ వటువును కూర్చోబెట్టి పాద ప్రక్షాళన, అర్ఘ్య పూజ చేసి, పంచామృతాలు సమర్పించాడు.

ఎంతో సంతోషంతో పొంగిపోతున్న బలిని చూసి వామనుడు ‘కేవలం నా పాదాలచే పరిమితమైన మూడు అడుగుల భూమిని మాత్రమే నిన్ను అడుగుతున్నాను’ అన్నాడు. ‘నేను త్రిలోకాధిపతిని. మీ కోరిక నాకు తగినట్లు గొప్పదిగా ఉండాలి’ అన్నాడు బలి. అది విని వామనుడు- ‘నేను బ్రహ్మచారిని. నీ సంపద నేనేం చేసుకుంటాను. నా ఇంద్రియాలు నా వశంలోనే ఉన్నాయి. మూడడుగుల భూమినిస్తే చాలు’ అన్నాడు ఎంతో లౌక్యంగా. వామనుడి ఆంతర్యం గ్రహించాడు శుక్రుడు. ‘వచ్చినవాడు సాక్షాత్తు విష్ణువు... నీ రాజ్యాన్ని, జీవితాన్ని హరించి నిన్ను పాతాళానికి తొక్కివేయాలని వచ్చాడు. అతడి కోరికను అంగీకరించొద్దు’ అని ఎంతగా హెచ్చరించినా బలి వినలేదు. చివరి ప్రయత్నంగా శుక్రాచార్యుడు తన శిష్యుణ్ని కాపాడే ఉద్దేశంతో ఒక పురుగు రూపంలో ఉదకం విడిచే చెంబుకొమ్ముకు అడ్డం పడ్డాడు. అది గమనించిన బలి దర్భపుల్లతో కొమ్ములో పొడిచాడు. దానితో శుక్రాచార్యుడి కన్నుపోయింది. బయటికి వచ్చేశాడు శుక్రుడు. బలి ఉదకం విడిచి దానం పూర్తిచేశాడు. క్రోధితుడైన గురువు బలిని ‘నీ సంపదలన్నీ నశించు గాక’ అని శపించాడు.

వామనుడు అకస్మాత్తుగా ఊర్ధ్వముఖంగా ఎదిగాడు. ఒక అడుగుతో భూమిని, రెండో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి- ‘మూడో అడుగు ఎక్కడ పెట్టాలి?’ అని అడిగాడు బలిని. బలి తన తలను చూపించాడు. వామనుడు మూడో పాదాన్ని బలి తలమీదపెట్టి పాతాళంలోకి తొక్కివేశాడు. బలినుంచి స్వీకరించిన భూమిని, స్వర్గాన్ని ఇంద్రుడికిచ్చాడు. బలి గొప్ప విష్ణుభక్తుడు కావడంతో వామనుడు బలిభవనానికి ద్వారపాలకుడిగా ఉన్నట్లు పురాణ కథనం. సాపర్ణిమనువు కాలంలో బలి దేవేంద్రుడవుతాడని విష్ణువు వరం ఇచ్చాడు. వామనద్వాదశిని విజయద్వాదశి, శక్రద్వాదశి, శ్రవణ ద్వాదశి, మహాద్వాదశి అనీ పిలుస్తారు.
ఆలయం ఆగమం

ఆలయ విమానం పైభాగంలో కనిపించే కలశంలాంటి నిర్మాణాన్నే ఆగమ, శిల్పశాస్త్ర పరిభాషలో స్తూపిక అంటారు. చాలామంది శిఖర కలశం అని పిలుస్తారు. ఆలయంలో ఇది అంతిమభాగం, అతి ముఖ్యమైన భాగమని సంప్రదాయం చెప్తోంది. ఆలయంలోనికి అనంతశక్తిని ప్రసరింపజేయడంలో ఈ స్తూపిక కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆలయానికి బ్రహ్మభాగంలో అంటే నట్టనడిమిన ఇది ప్రతిష్ఠించబడుతుంది. ఇందులో అమృతం నిండి ఉంటుంది. అందుకే ఇది బిందుస్థానం(మధ్యభాగం)లో ఉండి నిరంతరం అమృతాన్ని స్రవిస్తుందని విశ్వకర్మీయ శిల్పశాస్త్రం చెప్పింది.

ఆలయానికి శ్రీయంత్రానికి (శ్రీచక్రం) అవినాభావ సంబంధం ఉంది. ఈ యంత్రం నుండి పైకి లేచి ఆలయం రూపు దాలిస్తే సరిగ్గా బిందుస్థానంలో స్తూపి ఉంటుంది. బిందువు శక్తి అంశ. అందుకే ఈ స్తూపి అత్యంత శక్తివంతమైనది. సాధారణంగా స్తూపిని అరటిమొగ్గవలె రూపొందిస్తారు. అయితే కొన్ని చోట్ల త్రిశూలం, చక్రం వంటి లాంఛనాలు కూడా కనిపిస్తాయి.

మొగ్గ వికసించని సృష్టికి ప్రతీక. అంటే ఇక్కడే సృష్టి ప్రారంభం అవుతోందని గమనించాలి. బిందువు నుండి ప్రారంభమై క్రమక్రమంగా విస్తరిస్తూ ఆలయం పూర్ణాకృతి పొందుతుంది. ఇది అవరోహణక్రమం. పూర్ణదేవాలయం క్రమ క్రమేపి చిన్నదవుతూ ఈ స్తూపి మూలంగానే శూన్యంలో కలిసిపోతుంది. ఇది ఆరోహణ క్రమం. ఉన్నది ఒకటే ’సత్‌’ అని ఋగ్వేదం చెప్పిన మాటకు ప్రతీకగా ఈ స్తూపి కనిపిస్తుంది. త్రిశూలస్తూపి ద్వారా త్రిశూలంలోని మూడు శూలాలతో త్రిమూర్తి తత్త్వం ఆవిష్కృతమౌతుంది. చక్రస్తూపికతో సమస్త విశ్వం ప్రతిబింబిస్తుంది.

ఆలయానికైనా, విమానానికైనా ఒకటి మొదలు ఇరవై ఒక్క స్తూపికల వరకు ప్రతిష్ఠించవచ్చు. అలాగే పారలౌకిక కాములు అంటే మోక్షం కోరువారు సమసంఖ్యా కలశాలను, ఐహిక ఫలాన్ని కోరువారు బేసిసంఖ్యలో కలశాలను ప్రతిష్ఠించుకోవచ్చని ఆగమశాసనం.
Audio
Panchayudha Stotram For Strength | Vishnumurthy strotram
పంచాయుధ స్త్రోత్రం

స్ఫురత్‌ సహస్రార శిఖా తితీవ్రం
సుదర్శనం భాస్కర కోటి తుల్యమ్‌|
సురద్విషాం ప్రాణవినాశి విష్ణో:
చక్రం సదాహం శరణం ప్రపద్యే||

తాత్పర్యము : రంపమునకు చివర సూదిగ ముళ్ళవలె నుండు పదునైన భాగమును ‘ఆకు’ లేక ‘అర’ అంటారు. వేలాది అరలతో ఘోరమైన అగ్రిశిఖలను క్రక్కుచూమిరుమిట్లు గొలుపు కాంతులీను ఓ ”సుదర్శన చక్రమా!” ఎంత చూచినా తృప్తి తీరని సుందర మంగళవిగ్రహము కల్గి, దివ్య సౌందర్య రాశియగు స్వామిని దర్శింపజేయుచున్నావు, కోట్ల సూర్యులుదయించినపుడు ఉండెడి కాంతితో సాటియగు ప్రకాశము నీకున్నది. భగవదాజ్ఞానువర్తులగు దేవతలను హింసించు పాపుల ప్రాణములను సమూలంగ పెకలించి నశింపజేయుచున్నావు. సర్వవ్యాపియగు శ్రీమహావిష్ణువు యొక్క దక్షిణ హస్తతలము నలంకరించిన నిన్ను నేనెల్లప్పుడూ శరణువేడుచున్నాను.

శ్లో|| విష్ణో ర్ముఖోత్థా నిల పూరితస్య
యస్య ధ్వని ర్దానవ దర్ప హంతా|
తం పాంచజన్యం శశికోటి శుభ్రం
శంఖం సదాహం శరణం ప్రపద్యే||

తాత్పర్యము : శ్రీమహావిష్ణువు యొక్క అధరామతమే ఆహారముగ గైకొనుచు, ఆయన పూరించు వాయువతోనిండి, ఆనందాతిశయముచే నీవు చేయు ధ్వని చెవిసోకినంతనే రాక్షసమూక లందరియొక్క గర్వములను అణగిపోవును. అట్టి భీకర ధ్వనినీది. కోటి సంఖ్యాకమైన పూర్ణిమనాటి చంద్రులకాంతి ఒక్కచోట చేరినదా యనునట్లుండు తెల్లని చల్లని స్వచ్ఛమైన కాంతులనీవి . శ్రీవిష్ణువు యొక్క వామహస్తమున ప్రకాశించు శ్రీ పాంచజన్య శంఖమా! నిన్ను నేను ఎ ల్లప్పుడూ శరణు వేడుచున్నాను.


శ్లో|| హిరణ్యయీం మేరు సమానసారాం
కౌమోదకీం దైత్య కులైన హంత్రీమ్‌|
వైకుంఠ వామాగ్ర కరాభి మృష్టాం
గదాం సదాహం శరణం ప్రపద్యే||

తాత్పర్యము : బంగారమువలె స్పృహణీయమైన, మేరు పర్వతముతో సమానమైన బలము కల్గినట్టి రాక్షస కులములను నిర్మూలించుటలో ఇతర సహాయమునపేక్షించని శ్రీ వైకుంఠనాథుని యొక్క క్రింద వామహస్తము యొక్క కనుసన్నలలో సంచరించు ”కౌమోదకీ” యను ఓ గదాయుధమా! నిన్ను నే సదా శరణవేడు చున్నాను


శ్లో|| రక్షో సురాణాం కఠినోగ్ర కంఠ-
చ్ఛేదక్షర చ్ఛోణిత దిగ్ధధారమ్‌|
తం నందకం నామ హరే: ప్రదీప్తం
ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే||

తాత్పర్యము : జ న్మత: రాక్షసులై పుట్టి దుష్టబుద్ధి నిండి అసురులైన వారి యొక్కయు, ఏ జాతిలో పుట్టినా విష్ణుద్వేషముతో బుద్ధిచెడి దుష్ట ప్రవృత్తితో భగవద్దూషణ – భాగవత తిరస్కారములను చేయుచు అసురులుగ పిలువబడు వారి యొక్కయు, క్రూరమై మదమెక్కి బలసిన కంఠములను తెగ నరకుట నీ పని, తద్వారా నిరంతర ధారా ప్రవాహముగ కారుచున్న రక్తముతో మరింత వాడిగా జ్వాలలను క్రక్కుచు శ్రీ మహావిష్ణుని దివ్య హస్తమందు ప్రకాశించు చున్నావు. ”నందక” మను ఓ ఖడ్గరాజమా! నిన్ను నే నెల్లప్పుడు శరణువేడు చున్నాను.
భగవంతుడు ఈ విశ్వాన్నంతా సృష్టిస్తున్నాడు. కానీ ఏమైనా శబ్దం చేస్తున్నాడా? సూర్య భగవానుడు కాలనియమాన్ని అనుసరించి ఉదయిస్తూ, అస్తమిస్తూ లోకాన్ని రక్షిస్తున్నాడు. చంద్రుడు చల్లదనాన్ని ఇస్తూ ప్రశాంతతను కలిగిస్తున్నాడు. ఇలాగే గొప్పగొప్ప కార్యాలు నిర్వర్తించే వారందరూ మౌనంగా ఉండి లేదా తక్కువగా మాట్లాడి ఆ పనులు చేస్తున్నారు. సనక సనందనాదులకు ఒకసారి ప్రణవాన్ని గురించి సందేహం రాగా బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు. అక్కడ వారి సందేహం తీరలేదు. దీంతో వైకుంఠానికి వెళ్లారు. అక్కడా వారికి సరైన సమాధానం లభించలేదు. వెంటనే కైలాసానికి వెళ్లారు. మహేశ్వరుడు ముందుగానే వీరి రాకను గమనించి.. పార్వతీ దేవిని, కైలాసాన్ని వీడి ఒక అక్షయ వట వృక్షం క్రింద దక్షిణాభిముఖుడై, నవ యౌవనాకారంలో అర్థనిమిలిత నేత్రుడై చిన్ముద్రను ధరించి కూర్చున్నాడు.

చిత్రం వట తరోర్మూలే వృద్ధాఃశిష్యా గురోర్యువా

గురోస్తు మౌనం వ్యాఖ్యనం శిష్యాస్తుచ్ఛిన్న సంశయాః

సాధారణంగా గురువులు పెద్దవారుగానూ, శిష్యులు చిన్నవారిగానూ ఉంటారు. కానీ ఇక్కడ గురువు చిన్నవాడై, శిష్యులు పెద్దవారుగా ఉన్నారు. అంతే కాదు.. వారు గురువును ఎలాంటి ప్రశ్నలూ వేయలేదు. గురువు కూడా ఏ సమాధానమూ చెప్పలేదు. ‘గురోస్తు మౌనం వ్యాఖ్యానమ్‌’ అన్నట్లుగా గురువుగారి మౌనమే వారి సందేహాలను నివృత్తి చేసింది. ఆయన చిన్ముద్రయే వారికి జీవ బ్రహ్మైక్య జ్ఞానోపదేశం కలిగించింది. నిగూఢమైన తత్వ విషయంలోనే మహేశ్వరుడు మౌనంతో ఎదుటివారి సంశయాన్ని నివృత్తి చేశారంటే మౌనం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా! ‘యోగ వాసిష్ఠ నిర్వాణ ప్రకరణం’లో మౌనాన్ని నాలుగు రకాలుగా నిర్వచించారు. మొదటిది వాజ్మౌనం. అనగా వాక్కును నిరోధించుట.

 

రెండవది యక్షమౌనం. అనగా ఇంద్రియ నిగ్రహం. మూడవది కాష్ఠ మౌనం. అనగా ప్రయత్నములన్నింటినీ విడిచిపెట్టడం. నాలుగోది సుషుప్తిమౌనం. అనగా తురీయావస్థ. అంటే.. జీవన్ముక్తులు ఆత్మతత్వాన్ని అవలంబించడం. ‘నేనెవరు?’ అనే స్థితికి చేరుకోవాలంటే అంతర్దర్శనం కావాలి. అంతర్దర్శనం కావాలంటే మౌనంగా ఆత్మవిచారం చేయాలి. మౌనం అంటే మాట్లాడకుండా ఉండటమే కాదు, మాట్లాడాలని అనిపించకపోవడం. మిత భాషణము కూడ కొంత వరకు మౌనమేనని భారతం చెబుతోంది. భాషలన్నింటికన్నా అత్యంత శక్తివంతమైనది మౌనం. దానికి పదాలులేవు. కానీ సమస్తాన్నీ వ్యక్తం చేస్తుంది. వినమ్రత దాని లక్షణం. ఓర్పు సహనాలకు అది సంకేతం. కోపంపై నియంత్రణను చూపించే అతి నమ్మకమైన మార్గమిది. మాటలు వట్టివి. చేతలు గట్టివి కనుక మౌనం బంగారంతో సమానం.
🌹సర్వరోగాస్త్రానికి విరుగుడు నమత్రేయాస్త్రం..!!🙏🌹

శ్రీ అచ్యుతాయ నమః,
శ్రీ అనంతాయనమః,
శ్రీ గోవిందాయనమః🙏🌺

ఈ కలియుగంలో మనల్ని పడద్రోయడానికి కలిపురుషుడు అనేక రూపాలతో మనమీద దాడికి దిగుతాడు.

వీటిలో అనేకరకాలు..
వాటిలో ముఖ్యంగా శారీరకంగా కూడా అనేక రోగాలను సృష్టిస్తాడు.
ఆ రోగాలన్ని ఒక ఆయుధంగా మలిచి సంధిస్తాడు.
దానిపేరు సర్వారోగాస్త్రం.🙏🌺

దీనికి విరిగుడు మనకి తెలిసినంతలో ఏదైనా పెద్ద ఆసుపత్రికి వెళ్లి వేలు, లక్షలు వదిలించుకోవడం.
కాని మన శాస్త్రంలో ఈ అస్త్రానికి విరుగుడుగా లలితామాతా ఒక శస్త్రం సంధించింది

దానిపేరు నామత్రేయాస్త్రం.
నామత్రయం అంటే మూడు నామాలు.
అవి..🙏🌺🌺🌺

శ్రీ అచ్యుతాయ నమః,🌹
శ్రీ అనంతాయ నమః,🌹
శ్రీ గోవిందాయ నమః🌹

ఈ మూడు నామాలు నిత్యం చదివేవారికి
కలి ప్రేరితమైన రోగాలు రావు
జబ్బులు ఏమైనా ఉంటే అనతికాలంలోనే తగ్గిపోతాయి.
ఈ నామాలు ఒక దివ్యౌషధం మీరు స్మరించండీ 🙏

అచ్యుత, అనంత, గోవింద నామాలలో ఉన్న అద్భుత మహిమ:-
సాధు పరిత్రాణం కొరకుా,
దుష్టవినాశం కొరకుా,
ధర్మసంస్థాపన కొరకుా
పరమాత్మ ఈ లోకంలో అవతరిస్తుా ఉంటానని చెప్పాడు.

భగవన్నామాలలో ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. అద్భుత మహిమ ఉంది.
అందునా కొన్ని నామాలు మరీ విశిష్టమైనవి.
అట్టి విశిష్ట నామాలలో మరీ విశిష్ట నామాలు
అచ్యుత, అనంత, గోవింద ఉన్నవి.🙏🌺

సంధ్యావందనం మెుదలుకొని ఏ వైదీక కర్మ చేసినా
ఓం అచ్యుతాయ నమః,
ఓం అనంతాయ నమః,
ఓం గోవిందాయ నమః
అని ఆచమించి ఆరంభిస్తాం.

క్షీరార్ణవ మథన సమయంలో అవతరించిన మహా మహిమాన్విత పురుషుడు శ్రీ ధన్వంతరి. ఆయుర్వేదవైద్య విద్యకు రాయనే ప్రధమ స్థానం.

అచ్యుతానంత గోవింద
నామెాచ్ఛారణ భేషజాత్
నశ్యంతి సకలారోగాః
సత్యం సత్యం వదామ్యహ.!🙏🌺

ఈ నామాలను పలకటం అనే మందు చేత సర్వరోగాలు నశించి తీరుతాయి.
ఇది సత్యం, నేను సత్యం చెబుతున్నాను".
ఇలా రెండు మార్లు సత్యం అని చెప్పటం ద్వారా
శ్రీ ధన్వంతరి ప్రమాణం చేసి చెప్పారన్న మాట.
వైద్యవిద్యా గురువైన ధన్వంతరి వచనం కంటే
ఇంకొక ప్రమాణం అవసరమా" !.
ఇది పరమ ప్రమాణం. 🙏🌺

పద్మపురాణంలో ఈ నామ మహిమ మిక్కలి గొప్పగా వర్ణించబడింది.

పార్వతీదేవి అడుగగా శంకరులవారు శ్రీమన్నారయణుని లీలలను వివరిస్తుా, కుార్మావతార సందర్భంలో క్షీరసాగరమథన గాథ వినిపిస్తుా ఇలా అన్నారు.
పార్వతీ! పాలకడలిలో లక్ష్మీ దేవి అవతరించింది. దేవతలు, మునులు లక్ష్మీనారాయణుని స్తుతింస్తున్నారు. ఆ సందర్భంలోనే భయంకరమైన హాలాహలం పాలకడలి నుంచి ఉద్భవించింది.

ఆ హాలాహలం చుాసి దేవతలుా, దానవులుా భయపడి తలో దిక్కుకి పారిపోయారు.
పారిపోతున్న దేవతలను, దానవులను ఆపి, భయపడవద్దని చెప్పి, ఆ కాలకుాటాన్ని
నేను మ్రింగుతానని ధైర్యం చెప్పాను.
అందరుా నా పాదాలపై బడి నన్ను పుాజించి స్తుతించ సాగారు.
అపుడు నేను ఏకాగ్ర చిత్తంతో సర్వదుఃఖహరుడైన శ్రీమన్నారాయణుని ధ్యానం చేసుకుని ఆయన నామాల్లో ప్రధానమైన ముాడు నామాల్ని --
అచ్యుత, అనంత, గోవింద
అన్న మహా ముాడు మంత్రాల్ని స్మరించుకుంటుా
ఆ మహా భయంకరమైన కాలకుాట విషాన్ని త్రాగివేశాను. సర్వవ్యాపి అయిన విష్ణుభగవానుని యెుక్క
ఆ నామత్రయం యెుక్క మహిమ వల్ల సర్వలోక సంహారకమైన ఆ విషాన్ని సునాయాసంగా త్రాగేశాను.
ఆ విషం నన్నేమి చెయ్యలేక పోయింది.

కనుక ఈ మంత్రములతో ఆచమించేటపుడు
ఈ మహిమంతా జ్ఞాపకముంచుకుని,
విశ్వాసం పెంచుకుని అందరుా భగవత్ కృపకు పాత్రులగుదురు గాక !.
🌺🌺🌺🙏🙏🙏🌺🌺🌺
( ఒక చిన్న కథ మీ కోసం)

ఒక పెద్ద మనిషి ఓ బ్యాంకులోంచి డబ్బులు తీసుకుని డబ్బుల పెట్టెను భుజాన వేసుకుని ద్విచక్రవాహనంలో వెళ్తున్నాడు. ఆ పెట్టెలో వంద రూపాయల కట్టలు దాదాపు వంద ఉన్నాయి. అయితే మార్గమధ్యంలో గతుకుల రోడ్డుపై వెళ్తుండడంతో పెట్టె మూత కొద్దిగా తెరచుకుంది. అందులోంచి ఓ వంద రూపాయల కట్ట కింద పడిపోయింది. అది చూసుకోకుండానే అతను వేగంగా వెళ్ళిపోతున్నాడు.
కిందపడిన నోట్ల కట్టలోంచి ఒక్క నోటు మాత్రం బయటికొచ్చి గాల్లో ఎగిరెళ్ళి కాస్తంత దూరంగా పడిపోయింది.

ఆ నోటు పడిన పక్కగా ఒకతను నడుచుకుంటూ వచ్చాడు. అతను ఆ ఒక్క నోటూ తీసుకుని దగ్గర్లో ఉన్న ఇరానీ కేఫ్‌కి వెళ్ళాడు. ప్లేటు దోసె, ప్లేటు ఇడ్లీ తిని, ఒక కాఫీ తాగాడు. ఆ తర్వాత అక్కడికి దగ్గర్లో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళాడు. అక్కడి హుండీలో ఓ పదిరూపాయల నోటు వేసి, దేవుడికి కృతజ్ఞతగా దణ్ణం పెట్టుకున్నాడు.సంతోషంతో ఇంటికి చేరాడు.పడిపోయిన నోట్ల కట్టలో 99 అక్కడే ఉన్నాయి. ఆ దార్లో కాస్సేపటికి ఒకడు వచ్చాడు.అతను ఆ నోట్ల కట్ట తీసుకున్నాడు. వెంటనే లెక్కపెట్టాడు.వంద రూపాయల నోట్లు 99 ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ లెక్కించాడు.ఎన్నిసార్లు లెక్కించినా 99 ఉన్నాయి.
బ్యాంకులో 99 నోట్లున్న కట్ట ఇవ్వరు. కనుక మిగిలిన నోటు ఆ పక్కనే ఎక్కడో పడి ఉండవచ్చని అనుకుని వెతకడం మొదలుపెట్టాడు.చాలాసేపు వెతికాడు. కానీ ఫలితం లేకపోయింది. అయినా వెతుకులాట మానలేదు.

ఈ కథను చెప్పి గురువు ఫకాలున నవ్వాడు.ఒక్కనోటు దొరికిన వ్యక్తి దర్జాగా హోటల్‌ కు వెళ్ళి ఇడ్లీ తిన్నాడు. కాఫీ తాగాడు.కానీ 99 నోట్లు దొరికిన వ్యక్తి వాటిని ఖర్చు పెట్టుకోక మరో నోటు కోసం వెతకడం మొదలుపెట్డాడు.మనలో చాలా మంది ఈ తరహానే.లభించిన దానినో ఉన్నదానినో అనుభవించరు. దాంతో తృప్తిపడరు.లేని దానికోసం బుర్రలు పాడుచేసుకుంటారు. ఉన్నదాని పట్ల శ్రద్ధ ఉండదు. దేహం ఓ వైపు లాగుతుంటే మనసు మరోవైపు పోతుంటుంది. ఈ రెండింటి మధ్య సమన్వయం లేకుంటే ఎంతున్నా అసంతృప్తి తప్పదు.
#కాశీ...(స్వయంగా శివుడు నివాసముండె నగరం)..

#కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు. సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం...

కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది. కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు.

విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి, సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న
ప్రత్యేక స్థలం.

ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని.
ప్రపంచ సాంస్కృతిక నగరం.
స్వయంగా శివుడు నివాసముండె నగరం.

ప్రళయ కాలంలో మునగని అతి ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు.

కాశీ భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశీ పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది. పద్నాలుగు భువన భాండాలలో విశేషమైన స్థలం.

కాశీలో గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి,
కాలభైరవ దర్శనము
అతి ముఖ్యం....

ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని కాశీ లోనికి అనుమతించడు. కాశీలో మరణించిన వారికీ యమ బాధ పునర్ జన్మ ఉండదు.

కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రాగుప్తుని నుండి మాయం అయి కాలభైరవుని వద్దకు చేరుతుంది....
డిండి గణపతి, కాల భైరవుడు పరిశీలించి యమ యాతన కంటే 32 రేట్లు అధిక శిక్షలు విధించి మరు జన్మ లేకుండా చేస్తాడు ...

కాబట్టే కాశీలో కాల భైరవ దర్శనం తరవాత పూజారులు వీపు పై కర్రతో కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్లి పోయినా పాపాలు అంటకుండా రక్ష నల్లని కాశి దారం కడతారు.

కాశీ వాసం చేసే వారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయి.కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు.

అందుకే కాశ్యాన్తు మరణాన్ ముక్తి అని శాస్త్ర వచనం కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీలో గడుపుతారు.
మరణించిన వారి ఆస్తికలు కాశి గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే ఉద్దరింప బడతారు.

గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్నుసాకారపు కాశీి పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదు.

శివుని కాశీలోని కొన్ని వింతలు.
కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.

కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ జాడ దొరకకుండా ఉంటుంది.

కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్య పోయ్యారు.

అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి, అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు
అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.

కాశీి విశ్వేశ్వరునికి శవ భస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు, కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది.

కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది, పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది.

విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.

ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి. ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీిలోనే వున్నది.

కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి... ఇందులో దేవతలు, ఋషులు, రాజులతో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి
ఎన్నో వున్నాయి.

అందులో కొన్ని.....

1) దశాశ్వమేధ ఘాట్...

బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజూ సాయకాలం విశేషమైన గంగా హారతి జరుగుతున్నది.

2) ప్రయాగ్ ఘాట్...

ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి.

3) సోమేశ్వర్ ఘాట్...

చంద్రుని చేత నిర్మితమైనది.

4) మీర్ ఘాట్...

సతీదేవీ కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తి పీఠం. ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.

5) నేపాలీ ఘాట్...

పశుపతి నాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు.

Contd.....
.........
6) మణి కర్ణికా ఘాట్...

ఇది కాశీలో మొట్ట మొదటిది.
దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు.
ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది.
ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలిగి పోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట.

7) విష్వేవర్ ఘాట్...

ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు.
ఇక్కడే అహల్యా బాయి తప్పసు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు.

8) పంచ గంగా ఘాట్...

ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి.

9) గాయ్ ఘాట్...

గోపూజ జరుగుతున్నది.

10) తులసి ఘాట్...

తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం పొందినది.

11) హనుమాన్ ఘాట్...

ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం వున్నది ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు.

12) అస్సి ఘాట్...

పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్బవించింది.

13) హరిశ్చంద్ర ఘాట్...

సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహన కూలీగా పని చేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు. నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది...

14) మానస సరోవర్ ఘాట్...

ఇక్కడ కైలాసపర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తున్నది. ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తున్నది.

15) నారద ఘాట్..

నారదుడు లింగం స్థాపించాడు.

16) చౌతస్సి ఘాట్...

ఇక్కడే స్కంధపురాణం ప్రకారం ఇక్కడ
64 యోగినిలు తపస్సు చేసినారు.
ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం...
ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలిగి
64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి.

17) రానా మహల్ ఘాట్...

ఇక్కడే పూర్వం బ్రహ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు.

18) అహిల్యా బాయి ఘాట్...

ఈమె కారణంగానే మనం ఈరోజు
కాశీవిశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము.

కాశీలోని గంగా నది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి.

పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది.

కానీ మహమ్మదీయ దండ యాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి ధ్వంసం చేసిన తరవాతి కాశిని మనం చూస్తున్నాము. విశ్వనాథ, బిందు మాధవ తో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు.

నేటికీ విశ్వనాథ మందిరంలో నంది,
మసీదు వైపు గల కూల్చబడ్డ మందిరం వైపు చూస్తోంది. అక్కడే శివుడు త్రిశూలంతో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది.

#కాశీ స్మరణం మోక్షకారకం...🙏🙏

#ఓం నమః శివాయ.. హరహర మహదేవ శంబో శంకర నమః శివాయ.. 🙏🙏
Audio
మనం మారడానికి ప్రయత్నించాలి
🙏🙏దయచేసి పైన ఆడియో పూర్తిగా వినండి 🙏🙏
రేపటి నుండి మహాలయ పక్ష ప్రారంభం మహాలయ పక్షం అంటే ఏమిటి? మహాలయ అమావాస్య ఎప్పుడొస్తుంది?



మహాలయ పక్షం ఈ నెల సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 28 తేదీ మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది. ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి, మీ పితృదేవతలను స్మరించి, వారికి నమస్కారము చేస్తూ, ” నేను పితృ పక్షము పాటించుటకు అశక్తుడను. కావున నన్ను మన్నించి, మీ దీవెనలు అందచేయండి’ అని మనస్సులో ప్రార్ధన చేయడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి. ఇంకా మహాలయా పక్షమున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు.

భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో, బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని, మహాలయ పక్షమని పేరు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో, ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి.

తండ్రి జీవించి, తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య (ఈ నెల సెప్టెంబర్ 28) నైనా చేసి తీరాలి.

దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది.

ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పిక యినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది.

స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి, తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా ‘‘కర్ణా! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ, కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది’’అని అశరీరవాణి పలుకులు వినిపించాయి.

కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా, ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి, మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.

ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు.

ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి, తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.
పెళ్లిళ్లలో చేస్తున్న పొరపాట్లు

మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం

ఫలితం: దీనివలన వచ్చే నష్టం మనోవైకల్యం,చిత్తచాంచల్యం,అన్యోన్యత లేకపోవటం భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం

జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో ఒకరు చూపులు నిలపకపోవటం

ఫలితం: దీనివల్ల (వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం)
(పోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం‌ ఆచరించాకే మిగతావి)
కలిగే నష్టం
వారిమధ్య ప్రేమ లోపించటం

ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం

ఫలితం: దీనివలన కలిగే నష్టం సంస్కారం లోపించటం

తలంబ్రాల కు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం

ఫలితం: దీనివలన
బంధు ద్వేషం ఆర్థిక ఇబ్బదులు

బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి రావటం వధూవరులని ఆశీర్వదించటం

ఫలితం: దీనివలన మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోయి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనటం

బఫే భోజనాలు

ఫలితం:
దీనివలన అన్నదాన ఫలితం పొందక పోవటం

వేదమంత్రాలు మైకుల్లో వినకుండా వాటిస్థానంలో సినిమా పాటలు వినటం

ఫలితం:
దీనివలన దైవ కటాక్షం దూరమవ్వటం
ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని భగవంతుడి కృపకు పాత్రులై మంచి జీవితం గడుపుతూ మంచి సంతానం పొంది పదిమందికీ ఆదర్శంగా నిలవండి....
అందరికి చెప్పండి, చెప్పక పోతే తప్పు, చెప్పినా వాడు పాటించక పోతే వాడి కర్మఇవి శాస్త్రం లో ప్రతి పనీ ఒక నిర్దుష్ట లక్ష్యం కోసం ఏర్పాటు చేశారు. వాటిని పాటించకుండా వెర్రి తలలు వేస్తే ఏమి జరుగుతుంది అని, ఆలోచన తో ఒక 15000 మంది దంపతులపై గడచిన 20 సంవత్సరాల నుంచి observe చేస్తున్న ఒక పండితుల టీం చేసిన కృషికి అక్షర రూపం ఈ వ్యాసం. అందరికి అందించండి. అందరూ హిందూ వివాహ వ్యవస్థ నిర్దేశించిన లక్ష్యం నెరవేరే టట్లుగా తెలియచెప్పి ఆచరింపచేస్తారని ఆశిస్తూ ఉన్నాను.
☝దొంగలు పడ్డారు !☝
౼౼౼౼౼౼౼౼౼౼౼
ఒక కవి ఇంట్లో
దొంగలు పడ్డారు!
ఆరు వారాల నగలు
మూడు లక్షల నగదు
ఐదు పుస్తకాలు పోయాయి!!

పుస్తకాలది ఏముందయ్యా...నగలు నగదు చోరీ జరిగిందని కేసు నమోదు చేసుకున్నాడు పోలీసు.

పోలీసుల దర్యాప్తు జరుగుతోంది..నెలలు గడుస్తున్నా జాడలేదు...ఇక వడిసెను సుమతీ అనుకున్నాడు కవి....

ఐదు నెలల తర్వాత ఇంటికి ఒక పార్సిల్ వచ్చింది.. అందులో నగలు నగదు భద్రంగా పంపించారెవరో...కవి గారి భార్య పిల్లలు వాటిని కళ్ళకు అద్దుకుని ఆనందించారు...

పుస్తకాలు పోతేపోయినయి.. సొమ్ము దొరికింది అంతేచాలు అన్నారు భార్యాపిల్లలు..

ఆ పుస్తకాలు నా పంచప్రాణాలు అన్నాడు కవి...
" పోద్దురు బడాయి "

" పదేళ్లు కష్టపడి ఐదు పుస్తకాలు రాశానే...అవి నా పంచప్రాణాలు... పంపించినవాడు పుస్తకాలు పంపించి...నగదు నగలు పంపించకపోయినా బాధపడక పోయేవాడిని...కష్టపడితే సొమ్ము సంపాదించగలను..మళ్ళీ ఆ పుస్తకాలు రాయలేనే...అవి సరస్వతీ దేవి అమ్మవారు "... ఎడ్వడం మొదలెట్టాడు.

" నీ పుస్తకాలు సరస్వతీదేవీ ఐతే.. నా నగలు నగదు సాక్షాత్తు లక్ష్మీదేవి.. ఆ దొంగేవడో పిచ్చోడు " ఆనంద పడింది.ఇంతలో ఆ పార్సిల్లో ఒక కవర్ కనిపించింది.దాన్ని చించి అందులోని చీటి ఆసక్తిగా చదవడం ప్రారంభించింది ఆవిడ.

కవి గారికి
నమస్కారములు...
బీరువా తాళాలు పగులగొట్టి చూశా..నగలు నగదు పక్కన పుస్తకాలు కనిపించగానే ఇవేవో ఖరీదైనవని భావించి దోచుకెళ్లా..బీరువాలో ఎందుకు దాచారు...వీటిలో నిధి రహస్యాలు ఏమైనా ఉన్నాయేమోనని ఓపిగ్గా వాటిని చదివా..నగదు నగలుకన్నా గొప్ప నిధి దొరికింది.. అది జ్ఞాన నిధి..తప్పుచేశానని తెలుసుకున్నా..
ఈ లోగా నాభార్య పాతికవేలు ఖర్చుచేసింది.. చమటోడ్చి సంపాదించి కొద్దినెలల్లో మనియార్థర్ చేస్తా..డబ్బుతో పాటు పుస్తకాలు పంపిస్తా.. ఐతే వాటి జిరాక్స్ ప్రతులు మాత్రం తీసుకుని నావద్ద ఉంచుకుంటా... వాటిని మా పిల్లలతో పాటు తోటివారితో చదివిస్తా.. ఒకవేళ పుస్తకాలు దొంగిలించకపోతే నగలు నగదు తిరిగి పంపించేవాడినికాదు.. ఇప్పుడు నా దృష్టిలో నగలు నగదు కన్నా పుస్తకాలే విలువైనవిగా కనిపిస్తున్నాయి...ఈ రోజు నుంచి దొంగతనాలు మానేస్తున్నా... పుస్తకాలు అచ్చేసుకునేందుకు తోచిన డబ్బుకూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తా...
ఇట్లు
దొంగతనాలు మానిన దొంగ

ఇప్పుడు కవి ముఖంలో ఆనందం..
ఆయన భార్య ముఖంలో ఆలోచనలు
లక్ష్మీదేవి గొప్పదా?
సరస్వతీ దేవి గొప్పదా?
💰📒💰📒💰📒💰📒

📍సరదాకైనా అనకూడదు!📍
➖➖➖✍

ఒక ముసలాయన పక్కింటి కుర్రాడు దొంగ అని ప్రచారం మొదలు పెట్టాడు, రోజుకి ఒకరితో ఇలా చెబుతూ ఉండేసరికి ఈనోటా
ఆ నోటా విషయం పోలీస్ వరకూ వెళ్ళింది.

అనుమానం కొద్దీ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కేసు నడిచింది. విచారణ అనంతరం ఈయనే ఆ పుకార్లకు కారణం అని తేలింది. అతడిని వదిలి పెట్టేశారు.

ఆ యువకుడికి అవమానంగా తోచి ముసలాయన పై కేసు పెట్టాడు.

కేసు విచారణలో... ముసలాయన “ఊరికే నేను అన్నాను అంతే, దాని వలన అతడికి హాని ఏమీ జరగలేదు కదా!” అన్నాడు .

“నీవు అతడి గురించి ఏమేమి అన్నావో అవి అన్నీ ఒక పేపర్ రాసి, ఆ పేపర్ చిన్న చిన్న ముక్కలు చేసి నువ్వు ఇంటికి వెళ్ళే దారిలో విసిరెయ్యి. కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను. రేపు తీర్పు చెబుతాను " అని జడ్జి అన్నారు.

జడ్జి చెప్పిన ప్రకారం చేశాడు ముసలాయన మర్నాడు కోర్ట్ కి వెళ్ళాడు.

" నిన్న నువ్వు పారేసిన ముక్కలు అన్నీ తీసుకురా!" అన్నారు జడ్జి .

" అదెలా సాధ్యం? అవి గాలికి ఎక్కడెక్కడికో వెళ్లి పోయి ఉంటాయి. వాటిని తేవడం అసాధ్యం " అన్నాడు ముసలాయన.

" నువ్వు చేసిన చిన్న చిన్న కామెంట్స్ అతడి జీవితాన్ని ఎంతో మార్చేశాయి. అది తిరిగి యధాస్థితికి రావడం అసాధ్యం. నువ్వు ఒకరి గురించి మంచి మాట్లాడక పోతే పోయావు. చెడు ఎప్పడూ మాట్లాడకు " అని మందలించి శిక్షవిధించారు ✍
🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు
మనసు మాట కాదు బుద్ధి మాట వినాలి

శూరంగముడు మగధ సేనలో మంచి సైనికుడు. అతను సైనిక వృత్తి వదలి, భిక్షువుగా మారాడు. ఒక రోజు అతను రాజగృహ పట్టణంలో భిక్ష కోసం వెళ్ళాడు. బాగా దాహం వేసింది. ఒక ఇంటి ముందు ఆగాడు. ఆ ఇంటి ఇరుగు మీద అందమైన యువతి కూర్చొని ఉంది. అతణ్ణి చూసి, గౌరవంగా లేచి నిలబడి, నమస్కరించింది. అతను మంచినీరు అడిగాడు. చూడగానే ఆమె అంత అందగత్తె అని అతనికి అనిపించలేదు. నీరు అందించినప్పుడు ఆమె చేయి అతనికి తగిలింది. అతని చిత్తం చలించింది. అప్పుడు ఆమె చాలా అందగత్తెగా కనిపించింది.

చూపునకు తడబడని అతని మనసు స్పర్శకు తడబడిందని గుర్తించి- ‘‘భంతే! జ్ఞానేంద్రియాల గురించీ, వాటి జ్ఞానాల గురించీ నాకొక అనుమానం ఉంది. అడగమంటారా?’’ అంది నమ్రతగా.

అడగమన్నట్టు తల ఊపుతూ, అరుగుమీద కూర్చున్నాడు.

‘‘వేడి బెల్లాన్ని నాలుక మీద పెట్టుకున్నప్పుడు ముందుగా కలిగేది రుచి జ్ఞానమా? స్పర్శ జ్ఞానమా?’’ అని ఆమె అడిగింది.

శూరంగముడు ఆలోచనలో పడ్డాడు.

‘నాలుక రసేంద్రియమా? స్పర్శేంద్రియమా?’’ అని అమె అడిగింది మళ్ళీ.

ఏమీ చెప్పలేక మౌనంగా లేచి వచ్చేశాడు శూరంగముడు. ఆమె తెలివితేటలకు ముగ్ధుడయ్యాడు. అతని చిత్తం మరింత చలించింది. కానీ, 8 ఏళ్ళ భిక్షా జీవితం, అధ్యయనం అతని ఆలోచనలను కట్టడి చేస్తున్నాయి. మనో సంఘర్షణతో చాలాసేపు నిద్ర పట్టలేదు. అర్థరాత్రి దాటాక నిద్రలోకి జారుకున్నాడు.

శూరంగముడు కోరుకున్నట్టే ఆమె అతనికి దక్కింది. ఆమె చేయి పట్టుకొని, అడవిలో నడుస్తున్నారు. అతని నెత్తిమీద పెద్ద గంప ఉంది. మొలకు ఉన్న ఒరలో బలమైన కత్తి వేలాడుతోంది. గంప బరువుకు తోడు కత్తి బరువు. భారం తగ్గించుకుందామని ఒరను విప్పి, కత్తితోపాటు ఆమె చేతికి ఇచ్చాడు. వారు అడవి మధ్యకు చేరగానే, దొంగల గుంపు ఒకటి ఎదురైంది. దొంగల నాయకుడు వారి ముందుకు వచ్చి, గద్దిస్తూ నిలబడ్డాడు. వాడు బలశాలి. అందమైన వాడు. ఆమె చూపు అతని మీద పడింది.

శూరంగముడు వెంటనే గంప దించుకొని ‘‘కత్తి ఇటు ఇవ్వు’’ అని సుందరిని అడిగాడు. ఆమె కత్తి ఒరను శూరంగమునికి ఇచ్చి, కత్తిని దొంగల నాయకుడికి ఇచ్చింది. వాడి పక్కకు చేరి, నవ్వసాగింది. వాడు కత్తి దూసి, శూరంగముని తలను ఒక్క వేటుకు తెగనరికాడు.

శూరంగముడు ఒక్కసారిగా తుళ్ళిపడి లేచాడు. గొంతు ఎండిపోయింది. తనకు తెలియకుండానే కేకలు పెట్టాడు.

పక్కన ఉన్న భిక్షువులు నిద్ర లేచి-‘‘ఏమైంది?’’ అని అడిగారు.

‘‘కల వచ్చింది’’ అన్నాడు శూరంగముడు.

‘‘పీడకలా?’’ అని వారు అడిగారు.

‘‘కాదు, కాదు. పీడను వదిలించే కల!’’ అన్నాడు. ఆ తరువాత అసలు విషయం చెప్పి-‘‘నా కల నా మనసులోని జాడ్యాన్ని వదిలించింది. మురికిని కడిగేసింది. ముళ్ళను తొలగించింది. నా కలే నాకు గురువుగా ఉపదేశం చేసింది’’ అన్నాడు చిరునవ్వుతో.
ఈ ఫోటో ని చూస్తూ ఈ స్త్రోత్రం రోజూ చదవండి చాలా కష్టంగా అవుతున్న పనులు సులభంగా అవుతుంది, అవుతుందో కాదో అని అనుమానంగా ఉన్నవి ఆటంకాలు తొలగి పోతాయి, చాలా రోజులుగా అవుతునట్టే ఉండి కాకుండా వెనక్కి పోతున్న పనులు చేతికి అందుతుంది. ఎవరి వల్ల అయినా భయం కానీ, బాధ కానీ ఉంటే ఆ సమస్య తిరిపోతుంది.. అనారోగ్యంతో చాలా రోజుల నుండి బాధ పడుతూ ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది...

ఇది అమ్మవారిని అనుగ్రహం కోసం ప్రసన్నం చేసుకునే శ్లోకం, మొదలు పెట్టే ముందు మీ సమస్య సంకల్పములో చెప్పుకొని ప్రారంభించాలి, ఏ సమస్య లేని వారు కూడా ఆ తల్లి అనుగ్రహం కోసం ఈ స్త్రోత్రం నిత్యం పారాయనఁ చేయవచ్చు.. పరిహారంగా చేసే వాళ్ళు ఉదయం సాయంత్రం చదవాలి.. కచ్చితంగా దీపం వెలిగించి బెల్లం ముక్క అటుకులు, కుదిరితే దానిమ్మ గింజలు కూడా నైవేద్యంగా పెట్టి చదివి హారతి ఇవ్వాలి...

అస్యశ్రీ అర్గళా స్తోత్ర మంత్రస్య విష్ణుః ఋషిః| అనుష్టుప్ఛందః| శ్రీ మహాలక్షీర్దేవతా| మంత్రోదితా దేవ్యోబీజం|

సంకల్పమ్: మీ పేరు గోత్రం మీ కోరిక చెప్పుకుని పారాయణ చేయండి...

ధ్యానం
ఓం బంధూక కుసుమాభాసాం పంచముండాధివాసినీం|
స్ఫురచ్చంద్రకలారత్న ముకుటాం ముండమాలినీం||
త్రినేత్రాం రక్త వసనాం పీనోన్నత ఘటస్తనీం|
పుస్తకం చాక్షమాలాం చ వరం చాభయకం క్రమాత్||
దధతీం సంస్మరేన్నిత్యముత్తరామ్నాయమానితాం|

అథవా
యా చండీ మధుకైటభాది దైత్యదళనీ యా మాహిషోన్మూలినీ
యా ధూమ్రేక్షన చండముండమథనీ యా రక్త బీజాశనీ|
శక్తిః శుంభనిశుంభదైత్యదళనీ యా సిద్ధి దాత్రీ పరా
సా దేవీ నవ కోటి మూర్తి సహితా మాం పాతు విశ్వేశ్వరీ||

ఓం నమశ్చండికాయై
మార్కండేయ ఉవాచ

ఓం జయత్వం దేవి చాముండే జయ భూతాపహారిణి|
జయ సర్వ గతే దేవి కాళ రాత్రి నమోఽస్తుతే||1||

మధుకైఠభవిద్రావి విధాత్రు వరదే నమః
ఓం జయంతీ మంగళా కాళీ భద్రకాళీ కపాలినీ ||2||

దుర్గా శివా క్షమా ధాత్రీ స్వాహా స్వధా నమోఽస్తుతే
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||3||

మహిషాసుర నిర్నాశి భక్తానాం సుఖదే నమః|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||4||

ధూమ్రనేత్ర వధే దేవి ధర్మ కామార్థ దాయిని|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||5||

రక్త బీజ వధే దేవి చండ ముండ వినాశిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||6||

నిశుంభశుంభ నిర్నాశి త్రైలోక్య శుభదే నమః
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||7||

వంది తాంఘ్రియుగే దేవి సర్వసౌభాగ్య దాయిని|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||8||

అచింత్య రూప చరితే సర్వ శతృ వినాశిని|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||9||

నతేభ్యః సర్వదా భక్త్యా చాపర్ణే దురితాపహే|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||10||

స్తువద్భ్యోభక్తిపూర్వం త్వాం చండికే వ్యాధి నాశిని
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||11||

చండికే సతతం యుద్ధే జయంతీ పాపనాశిని|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||12||

దేహి సౌభాగ్యమారోగ్యం దేహి దేవీ పరం సుఖం|
రూపం ధేహి జయం దేహి యశో ధేహి ద్విషో జహి||13||

విధేహి దేవి కల్యాణం విధేహి విపులాం శ్రియం|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||14||

విధేహి ద్విషతాం నాశం విధేహి బలముచ్చకైః|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||15||

సురాసురశిరో రత్న నిఘృష్టచరణేఽంబికే|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||16||

విధ్యావంతం యశస్వంతం లక్ష్మీవంతంచ మాం కురు|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||17||

దేవి ప్రచండ దోర్దండ దైత్య దర్ప నిషూదిని|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||18||

ప్రచండ దైత్యదర్పఘ్నే చండికే ప్రణతాయమే|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||19||

చతుర్భుజే చతుర్వక్త్ర సంస్తుతే పరమేశ్వరి|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||20||

కృష్ణేన సంస్తుతే దేవి శశ్వద్భక్త్యా సదాంబికే|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||21||

హిమాచలసుతానాథసంస్తుతే పరమేశ్వరి|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||22||

ఇంద్రాణీ పతిసద్భావ పూజితే పరమేశ్వరి|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||23||

దేవి భక్తజనోద్దామ దత్తానందోదయేఽంబికే|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||24||

భార్యాం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||25||

తారిణీం దుర్గ సంసార సాగర స్యాచలోద్బవే|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||26||

ఇదంస్తోత్రం పఠిత్వా తు మహాస్తోత్రం పఠేన్నరః|
సప్తశతీం సమారాధ్య వరమాప్నోతి దుర్లభం ||27||

|| ఇతి శ్రీ అర్గలా స్తోత్రం సమాప్తం ||
ఈ గ్రూపులో పోస్ట్ చేసిన సమాచారం బాగుందా? మీ అభిప్రాయం తెలుపండి
Anonymous Poll
98%
బాగా ఉన్నాయ్
2%
బాగోలేదు
Audio
Totakashtakam