Devotional Telugu
3.46K subscribers
106 photos
23 videos
19 files
62 links
An attempt to bring our Hindu Devotional information
Download Telegram
చతుర్భుజ గణపతి - నూర్పూర్ శైలి చిత్రం - 1810 కాలానికి చెందినది.
విగ్రహాలు, చిత్రాలు


ఆదినుండి వినాయకుడిని ఏనుగుతలతోనే చిత్రీకరిస్తున్నారనిపిస్తున్నది. ఇలా ఏనుగు తల ఉండడానికి అనేక పురాణ గాథలున్నాయి. "హేరంబ గణపతి"ని ఐదు తలలతో చూపుతారు.

వినాయకునికి ఏక దంతుడు అన్న పేరు మొదటినుండి ఉంది. చాలా పురాతనమైన విగ్రహాలలో కూడా వినాయకుడు తన విరిగిన దంతాన్ని చేతబట్టుకొన్నట్లుగా చూపారు. ముద్గల పురాణం ప్రకారం వినాయకుని రెండవ అవతారం "ఏకదంతావతారం". అలాగే పెద్ద పొట్టకూడా మొదటినుండి (గుప్తుల కాలంనుండి) వినాయకుని శిల్పాలలో కనిపిస్తున్న అంశం. ముద్గల పురాణంలో చెప్పిన రెండు అవతారాలు (హేరంబుడు, మహోదరుడు) ఈ పెద్దపొట్ట అనే అంశంయొక్క ప్రాముఖ్యతను సూచిస్తున్నాయి. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు చెందిన సకల జగత్తూ తన ఉదరంలో ఉంచుకొన్నందున అతనికి "లంబోదరుడు" అనే పేరు వచ్చిందని బ్రహ్మాండ పురాణములో ఉంది. వినాయకునికి రెండు చేతులనుండి, 16 చేతుల వరకు చూపుతారు. సాధారణంగా నాలుగు చేతులతో శిల్పాలు, చిత్రాలు చేస్తారు. పురాతనమైన విగ్రహాలలో మాత్రం రెండు చేతులనే చూపారు. 9వ, 10వ శతాబ్దాలలో 14 నుండి 20 చేతులవరకు ఉన్న ప్రతిమలు చెక్కారు. వినాయకుని చిత్రీకరణలో పాము కూడా చాలా సాధారణంగా కనిపిస్తుంది. ఇది అనేక విధాలుగా చూపబడుతుంది. గణేశ పురాణము ప్రకారము వినాయకుడు వాసుకి (పాము) ని తన కంఠానికి చుట్టుకొన్నాడు. మరి కొన్ని మూర్తులలో పాము యజ్ఞోపవీతంగా చూపబడింది. ఇంతే కాకుండా పాము ఉదరాభరణంగా (బెల్టులాగా), చేతిలో ఉన్నట్లుగా, కాళ్ళవద్ద చుట్టుకొని ఉన్నట్లుగా, సింహాసనంగా - ఇలా అనేక విధాలుగా చూపబడింది. వినాయకుడి నుదురుమీద తిలకం, కొన్ని సార్లు మూడవ నేత్రం చూపుతారు. గణేశ పురాణం ప్రకారం వినాయకుని తలమీద తిలక చిహ్నం మరియు చంద్రవంక కూడా ఉంటాయి. ముఖ్యంగా "బాలచంద్ర వినాయకుడు" అనే రూపంలో చంద్రవంకను చూపుతారు
వినాయకుని వివిధ రూపాలకు వివిధ వర్ణాలు ఆపాదింపబడ్డాయి. వీటిని గురించి శ్రీతత్వనిధి అనే శిల్పగ్రంధంలో చెప్పబడింది. ఉదాహరణకు హేరంబ గణపతిని మరియు ఋణమోచన గణపతిని తెలుపు రంగులోను, ఏకదంత గణపతిని నీలిరంగులోను, దుర్గాగణపతిని బంగారు వర్ణంలోను, సృష్టిగణపతిని ఎరుపు రంగులోను చూపుతారు.
వాహనం

అధికంగా వినాయకునికి వాహనంగా ఎలుకను చూపుతారు. మొట్టమొదటి కాలంలో వచ్చిన వినాయకవిగ్రహాలలో వాహనాన్ని చూపలేదు. ముద్గలపురాణంలో వినాయకుని ఎనిమిది అవతారాలు చెప్పబడినాయి. (వక్రతుండ, ఏకదంత, మహోదర, గజవక్త్ర, లంబోదర, వికట, విఘ్నరాజ, ధూమ్రవర్ణ అవతారాలు). ఆ ఎనిమిది అవతారాలలో ఐదు అవతారాలకు వాహనం ఎలుక. వక్రతుండ అవతారం వాహనం సింహం. వికట అవతారం వాహనం నెమలి. విఘ్నరాజ అవతారం వాహనం శేషువు. గణేశ పురాణంలో నాలుగు అవతారాలు ప్రస్తావింపబడినాయి. అందులో మహోటక అవతారం వాహనం సింహం. మయూరేశ్వర అవతారం నెమలి. ధూమ్రకేతు అవతారం గుర్రం. గజాననుని అవతారం ఎలుక. జైనుల సంప్రదాయాలలో గణేశునికి ఎలుక, ఏనుగు, తాబేలు, పొట్టేలు, నెమలి వాహనాలు వివిధ సందర్భాలలో చెప్పబడినాయి. (చూపబడినాయి) 
7వ శతాబ్దంనుండి మధ్య, పశ్చిమ భారతంలో వచ్చిన శిల్పాలలో ఎలుకను చూపడం మొదలయ్యిందని అభిప్రాయపడతారు. లిఖిత గ్రంథాలలో మత్స్య పురాణములో మొట్టమొదటగా ఎలుక వాహనం గురించి వ్రాయబడింది. తరువాత బ్రహ్మాండ పురాణము, గణేశ పురాణములలో ఈ విషయం ఉంది. చివరి అవతారంలో ఎలుకను వాహనంగా చేసుకొన్నట్లు గణేశపురాణంలో ఉంది. గణపతి అధర్వశీర్షం అనే గ్రంథంలో ఒక ధ్యాన శ్లోకం ప్రకారం వినాయకుని ధ్వజంమీద ఎలుక ఉంటుంది.. గణపతి సహస్రనామాలలో "మూషిక వాహన", "అఖుకేతన" అనే పేర్లున్నాయి.

ఎలుక వాహనం సంకేతాన్ని అనేకవిధాలుగా వివరిస్తారు - ఎలుక తామస ప్రవృత్తికి చిహ్నం. కనుక కామక్రోధాలను అణగ ద్రొక్కడం అనగా ఎలుకపై స్వారీ చేయడం. పంటలకు హాని కలిగించే ఎలుకను అదుపు చేయడం అనగా విఘ్నాలను నివారించడం అని మరొక వివరణ ఉంది. ఇది గ్రామదేవత లక్షణాలలో ఒకటి ఎలుకనెక్కినందున వినాయకుడు ఎక్కడికైనా వెళ్ళగలడని (సర్వాంతర్యామి) మరొక అభిప్రాయం ఉంది.
ఓంకారము

హిందూమతంలో ప్రణవ మంత్రం అయిన ఓంకారము స్వరూపమే వినాయకుడని అంటారు. వినాయకుడి రూపము ఓంకారంలా ఉంటుందని చెబుతుంటారు. (ముఖ్యంగా దేవనాగరి, తమిళ లిపులలో)  గణపతి అధర్వశీర్షంలో ఈ విషయం ఇలా ఉంది:

గణపతీ! నీవే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులవు. నీవే ఇంద్రుడవు. నీవే అగ్నివి, వాయువువు, సూర్యుడవు, చంద్రుడవు, నీవే భూలోకము, అంతరిక్షము, స్వర్గము. నీవే ఓంకారము.

మూలాధార చక్రము
కుండలినీ యోగము ప్రకారంము  షట్చక్రాలలో మొదటిదైన మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు. ఈ చక్రంలోనే కుండలినీ శక్తి సాధారణంగా అంతస్థితమై (చుట్టు చుట్టుకొని, నిద్రాణమై) ఉంటుంది. వినాయకుని రూపంలో పామను చూపడానికి, మూలాధార చక్రంతో ఉన్న సంబంధానికి సాఱూప్యం చెబుతుంటారు. గణపతి అధర్వశీర్షంలో కూడా ఈ విషయం చెప్పబడింది. కనుక వినాయకుడు అన్నింటికీ "మూలాధారము" అని కూడా వివరిస్తుంటారు
వినాయకుని కుటుంబం

వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల పుత్రుడని సాధారణ ప్రవచనం. కాని ఇతని జన్మ గురించి పురాణాలలో గాథా భేదాలున్నాయి. ఇతనిని శివుడు సృష్టించాడని , ఇతనికి తన వంటి నలుగుతో పార్వతి ప్రాణం పోసిందని,  పుణ్యక వ్రతం ఆచరించి పార్వతీదేవి ఈ బిడ్డను కన్నదని, పార్వతీ పరమేశ్వరులు వినాయకుని సృష్టించారని, స్వయంభువువైన ఇతనిని పార్వతీపరమేశ్వరులు కనుగొన్నారని  ఇలా అనేక గాథలున్నాయి.
వినాయకుని తమ్ముడు స్కందుడు (మురుగన్, కార్తికేయుడు, కుమారస్వామి). వీరి గురించి కూడా కథలలో వైవిధ్యం ఉంది. సాధారణంగా ఉత్తర భారతదేశంలోని కథల ప్రకారం కుమారస్వామి పెద్దవాడు. దక్షిణ భారతదేశంలోని కథల ప్రకారం వినాయకుడు పెద్దవాడు. ఉత్తర భారతదేశంలో క్రీ.పూ. 500 నుండి క్రీ.శ. 600 వరకు స్కందుని పూజ (వీర పూజ) అధికంగా ఉండేది కాని క్రమంగా తగ్గింది. వినాయకుని పూజకు ప్రాముఖ్యత పెరిగింది. (ఇద్దరు సోదరుల మధ్య అధిపత్యపు పోటీ గురించి కూడా ఒక కథ ఉంది) . ఇది కొన్ని జాతుల మధ్య పోటీని సూచించవచ్చును.
వినాయకుడు బ్రహ్మచారి అని కొన్ని కథలలోను, అతనికి సిద్ధి, బుద్ధి అనే భార్యలున్నారని కొన్ని కథలలోను ఉంది.  దక్షిణ భారతదేశంలోను, ఉత్తర భారతంలో కొన్ని ప్రాంతాలలోను వినాయకుని బ్రహ్మచారిగా కొలుస్తుంటారు. బుద్ధి, సిద్ధి, వృద్ధి అనే మూడు భాగ్యాలను వినాయకుడు కలిగిస్తాడు గనుక ఈ గుణాలను మూర్తీభవించిన దేవతా స్వరూపులుగా భావించి వినాయకునికి భార్యలుగా ఆపాదించారని ఒక అభిప్రాయం. ఇంకా కొన్ని బొమ్మలలో వినాయకుని చదువుల తల్లి సరస్వతితోను, సిరిసంపదల తల్లి లక్ష్మీదేవితోను కలిపి చిత్రీకరిస్తారు. బెంగాల్ ప్రాంతంలో  అరటిచెట్టుతో పాటు వినాయకుని చూపే సంప్రదాయం ఉంది.
శివ పురాణం ప్రకారం వినాయకునికి ఇద్దరు కుమారులు - క్షేమము, లాభము. ఉత్తర భారతంలో వీరిని శూభము, లాభము అని వ్యవహరిస్తారు. 1975లో వెలువడిన హిందీ సినిమా జై సంతోషీ మాలో వినాయకునికి వృద్ధి, సిద్ధి అనే వారితో వివాహం జరిగినట్లు, వారికి సంతోషీ మాత అనే కుమార్తె కలిగినట్లు చూపారు. ఈ విషయం పురాణాలలో లభించడంలేదు కాని సంతోషీమాత కథ దేశంలో బాగా ప్రసిద్ధమైనది.
32 గణపతులు

ప్రధానంగా గణపతుల సంఖ్య 21 (కనుకనే ఏకవింశతి పత్రపూజ చేస్తారు). ఇంకా అవాంతర భేదగణపతులు 11 - మొత్తం 32

1 శ్రీ గణపతి

2 వీర గణపతి

3 శక్తి గణపతి

4 భక్త గణపతి

5 బాల గణపతి

6 తరుణ గణపతి

7 ఉచ్చిష్ట గణపతి

8 ఉన్మత్త గణపతి

9 విద్యా గణపతి

10 దుర్గ గణపతి

11 విజయ గణపతి

12 వృత్త గణపతి

13 విఘ్న గణపతి

14 లక్ష్మీ గణపతి

15 నృత్య గణపతి

16 శక్తి గణపతి

17 మహా గణపతి

18 బీజ గణపతి

19 దుంఢి గణపతి

20 పింగళ గణపతి

21 హరిద్రా గణపతి

22 ప్రసన్న గణపతి

23 వాతాపి గణపతి

24 హేరంబ గణపతి

25 త్ర్యక్షర గణపతి

26 త్రిముఖ గణపతి

27 ఏకాక్షర గణపతి

28 వక్రతుండ గణపతి

29 వరసిద్ధి గణపతి

30 చింతామణి గణపతి

31 సంకష్టహర గణపతి

32 త్రైలోక్యమోహనగణపతి
Audio
Ganesha Pancharathnam
గణేష పంచరత్నం
నిజమైన సంపద

పెద్దపెద్ద భవంతులు, ఎకరాలకొద్దీ పొలాలు, విలాసవంతమైన జీవితం, ఖరీదైన వాహనాల్లో ప్రయాణం, డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయడం సంపదగా పరిగణిస్తాం. డబ్బుతోనే గొప్పతనం, గౌరవం వస్తాయనే ఆలోచన కొంతవరకు వాస్తవమే అయినా నిజమైన సంపద ఇది కాదు!
మనిషి ఏదైనా సాధించడానికి శరీరమనే ఉపాధి కావాలి. ఇది ఉన్నంతవరకే మనమేమి చేయాలనుకున్నా, ఏ లక్ష్యాన్ని చేరాలనుకున్నా సాధ్యమయ్యేది. అందువల్ల దీన్ని జాగ్రత్తగా పోషించుకోవాలి. అందుకే పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు. ఇహపర సాధనకు సాధనం ఈశరీరమే.
కష్టకాలంలో మన పక్కన స్నేహితులను కలిగి ఉండటమన్నది, ఎంతో గొప్ప సంపద. సంస్కారవంతులుగా, జ్ఞానవంతులుగా మనల్ని తీర్చిదిద్దేది చదువు. విచక్షణ, వివేకాలనే చక్షువులనిచ్చి మనిషిని సన్మార్గంలో పయనించేటట్లు చేస్తుంది. తన పుట్టుకకు ఇతర ప్రాణుల పుట్టుకకు భేదాన్ని తెలుసుకునే మేధనిస్తుంది. ఈ సకల చరాచర సృష్టిలో తన స్థానాన్ని, ప్రాముఖ్యాన్ని, కర్తవ్యాన్ని మనిషికి బోధపరచేది చదువే. అది చాలా విలువైన సంపద.
మనిషి ఒంటరిగా జీవించలేడు. ఎదుటివారితో ఎలా మసలుకోవాలో, ఎలా సంభాషించాలో ప్రథమంగా తన కుటుంబ సభ్యులనుంచి, తన పెద్దలనుంచి గ్రహించాలి. వారి సత్ప్రవర్తనను అలవరుచుకోవాలి. అది   సమాజంలో తోటివారితో ప్రవర్తించే తీరుపై ప్రతిబింబించి సత్ఫలితాలనిస్తుంది. సంబంధ, బాంధవ్యాలను నిలుపుకొనే విధంగా మన ప్రవర్తన ఉండాలి. అప్పుడే మన బంధాలు హాయిగా సాగిపోతాయి. అందరినీ కలుపుకొనే స్నేహపూర్వక ప్రవర్తన మనకు ఐశ్వర్యం లాంటిదే.
సంపదంటే ధనాన్ని ఎక్కువగా సంపాదించడం కాదు. మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేయడం అంతకన్నా కాదు. అలాగని ఎక్కువగా పొదుపు చేయడమూ కాదు! సంపాదన ఒక స్థాయికి చేరుకున్న తరవాత ఇక సంపాదించవలసిన అవసరంలేదన్న భావన కలగడం. దాన్నే తృప్తి అంటారు. అది మనిషికి కలగనినాడు అశాంతికి గురవుతాడు. మనశ్శాంతి కరవవుతుంది. కంటిమీద కునుకే ఉండదు. తృప్తి కొంతమందికే దక్కే అరుదైన సంపద.
తమ సృజనతో అద్భుతమైన రచనలు చేసేవారు, నిష్ణాతులైన కళాకారులు, రోగుల ప్రాణాలు కాపాడే వైద్యులు, ప్రయోగశాలలో అహరహం పరిశోధనలు చేస్తూ మానవాళికి ఉపకరించే అనేక వస్తువులకు రూపకల్పన చేసే శాస్త్రవేత్తలు, భావితరాలను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దే అధ్యాపకులు, ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో దేశాన్ని రక్షించే సైనికులు... ఏ దేశానికైనా విలువైన సంపద.
మహాపురుషులందించిన జ్ఞానసంపద, మన పూర్వీకులందించిన విజ్ఞానం, పెద్దలు మనకోసం ఏర్పరచిన సదాచారాలు, సత్సంప్రదాయాలు, మన జీవితానికొక క్రమశిక్షణను, పథాన్ని ఇస్తాయి. వాటిని పాటిస్తూ, వారు చూపిన ధర్మపథంలో కొనసాగడమే ఆ వారసత్వ సంపదకు మనమివ్వగలిగే నిజమైన గౌరవం. అది ఘనమైన సంపద.
దాస్యశృంఖలాలను బద్దలుచేసి దేశమాతకు స్వేచ్ఛా ఊపిరులూదడంలో తమ ధన, మాన, ప్రాణాలను కోల్పోయిన ఎందరో త్యాగధనులు తరతరాలు మనసులో నిలుపుకోవలసినవారు. వారు జాతికి అమూల్యమైన సంపద.
‘మనిషి కడవరకు తోడు ఉండాల్సిదేమిటి?’ అని యక్ష ప్రశ్నల్లో యక్షుడు ధర్మరాజును అడుగుతాడు. మనోబలమని సమాధానమిస్తాడు యుధిష్ఠిరుడు. మనవెంట ఎవరున్నా, ఎంత సంపద ఉన్నా మనోబలానికి సాటిరావు. మనిషి తుదిశ్వాస వరకు ఉండవలసిన ఈ సుగుణం ఎంతో అద్భుత సంపద.
సంపద అనగానే మనకు వచ్చే లౌకిక దృష్టి, భావనల నుంచి బయటపడి నిజమైన సంపదను గుర్తెరగాలి. జీవితానికొక ఔన్నత్యం చేకూరేదప్పుడే!

https://t.me/devotional
Forwarded from God's of Hindu
విజయవాడ చందన గ్రాండ్ వద్ద 7000 ఆత్రేయపురం పూతరేకు లతో చేసిన వినాయకుడు
Audio
శ్రీ గణపతి తాళం... శ్రీ గణపతి తాళం... శ్రీ గణపతి తాళం.. శ్రీ గణపతి తాళం..
గణపతి తాళం

అగణిత ఫణి ఫణ మణి గణ కిరణై |
రరు నిత నిజ తను రవి థథ వధన, థట థట లుట ధలి కుల కళ వినధో
గణపతి రభ మత మీహ దిశ తనుః
లంభోధర వర కుంజా వస్తిత కుంకుమ వర్ణ ధరం
శ్వేత శృంగం బీనసుహస్తం ప్రీతిత సఫల ఫలం
నాగత్రయ యుత నాగ విభూషణ నా నా గణపతి తం
త తం నా నా గణపతి తం
త తం నా నా గణపతి తం

తత్ పురుషాయ విద్మహే వక్రాతుండాయ ధీమహి తనో దంతి ప్రచొదయాథ్

వికటోత్కట సుందర దంతి ముఖం | భుజగేంద్రసుసర్ప గదాభరణం ||
గజ నీల గజేంద్ర గణాధిపతిమ్ | ప్రణతోస్మి వినాయక హస్తి ముఖం ||
సుర సుర గణపతి సుందర కేశమ్ | ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానమ్ ||
భవ భవ గణపతి పద్మ శరీరమ్ | జయ జయ గణపతి దివ్య నమస్తే ||
గజ ముఖ వక్త్రమ్ గిరిజా పుత్రమ్ | గణ గుణ మిత్రం గణపతిమీశప్రియమ్ ||

కరద్రుత పరశుమ్ కంకణ పాణిం కబలిత పద్మ రుచిం | సురపతి వంద్యం సుందర వక్త్రం సుందరచిత మణి మకుటమ్ ||
ప్రణమత దేహం ప్రకటిత కాలం షడ్గిరి తాళమిదం, తత్ తత్ షడ్గిరి తాళమిదం తత్ తత్ షడ్గిరి తాళమిదమ్ |
లంబోదర వర కుంజా సురకృత కుంకుమ వర్ణ ధరమ్ | శ్వేతసశృంగం మోదక హస్తం ప్రీతి సపనసఫలమ్||
నయనత్రయ వర నాగ విభూషిత నానా గణపతిదం, తత్తం నయన త్రయ వర నాగ విభూషిత నానా గణపతితం తత్తం నా నా గణపతిదం, తత్తం నా నా గణపతిదం, తత్తం నా నా గణపతిదమ్ ||

ధవలిత జల ధర ధవలిత చంద్రం ఫణి మణి కిరణ విభూషిత ఖడ్గం | తను తను విషహర శూల కపాలం హర హర శివశివ గణపతి మభయం, ధవలిత జల ధర ధవలిత చంద్రం ఫణి మణి కిరణ విభూషిత ఖడ్గం | తను తను విషహర శూల కపాలం హర హర శివశివ గణపతి మభయమ్||

కట తట విగలిత మద జల జలధిత గణపతి వాద్యమిదమ్ | కట తట విగలిత మద జల జలధిత గణపతి వాద్యమిదం తత్ తత్ గణపతి వాద్యమ్ ఇదమ్, తత్ తత్ గణపతి వాద్యమిదమ్||

తక తకిట తక తకిట తక తకిట తతోం, శశి కలిత శశి కలిత మౌళినం శూలినమ్ |
తక తకిట తక తకిట తక తకిట తత్తోం, విమల శుభ కమల జల పాదుకం పాణినమ్ |
ధిక్ తకిట ధిక్ తకిట ధిక్ తకిట తత్తోం, ప్రమథ గణ గుణ ఖచిత శోభనం శోభితమ్|
ధిక్ తకిట ధిక్ తకిట ధిక్ తకిట త తోం, మృదుల భుజ సరసి జభి షానకం పోషణం |
థక తకిట థక తకిట థక తకిట తతోం, పనస ఫల కదలి ఫల మోదనం మోదకం |
ధిక్ తకిట ధిక్ తకిట ధిక్ తకిట తతోం, ప్రమథగురు శివ తనయ గణపతి తాళనం |
గణపతి తాళనం ! గణపతి తాళనం !!

🙏🙏🙏
హిందూ సనాతన ధర్మము లో స్త్రీల జడ యెక్క రహస్యం.....

హిందూ సనాతన ధర్మము యొక్క పరిజ్ఞానం, విశిష్టత ఆంగ్ల శాస్త్రవేత్తలకె ఇంత వరకు అంతు చిక్కని యదార్థం...

స్త్రీల జడ.. మూడూ పాయలు ఉంటాయి...

జడలోని ఆ మూడు పాయలు...

౧. ఇడా
౨. పింగళ
౩. సుషుమ్న

అనే మూడు నాడులకు సంకేతాలు. వెన్నెముకు సమాంతరముగా చివర వరకూ సాగే ఈ జడ మూలాధారమునుండి సహస్రారమునకు
చేరుకొనే కుండలినీ సంకేతము.

జడ పై భాగము తలపై విప్పారిన పాము పడగవలే
సహస్రార పద్మమునకు సాంకేతికము. మూడు పాయల ముడుల వలె ఇడా, పింగళ నాడులు
పెనవేసుకు ఉంటాయి. అంతర్లీనముగా ఉన్న మూడవ పాయ సుషుమ్న నాడికి సంకేతము.

ఇంత ఆధ్యాత్మిక రహస్యాన్ని మన హిందూ సనాతన ధర్మము యొక్క సంస్కృతి స్త్రీల జడలలో దాచింది. ఈ విధముగా స్త్రీలకు మాత్రమే కలుగు కొన్ని వ్యాధులనుండి వారి స్వయం రక్షణకు మార్గము లను మన పూర్వీకులు పొందు పరిచారు...

|| ఓం నమః శివాయ ||
Devotional songs
అన్నమాచార్య సంకీర్తనలు మరియు దైవ కీర్తనలు
https://t.me/DevotionalAudio
కదిలిపోయేదే కాలం


కష్టాన్ని నిలువరించే సులభోపాయాలేమీ లేవు. అడ్డదారులు, దొడ్డిదారులు ఉండవు. నష్టం అనగానే కన్నీళ్లు ఉంటాయి. కలతపడటమూ ఉంటుంది. దానికి నివారణోపాయం- మనోధైర్యంతో ఎదుర్కోవడమే. సంయమనంతో సమాధానపడటమే. అప్పుడు స్థిరంగా పాతుకుపోతుందనుకుని భయపడిపోయిన మేరు పర్వతమంత కష్టమైనా కదిలిపోతుంది, ఎగిరిపోతుంది. కష్టం కాలంలాంటిది. కదలడమే దాని లక్షణం. కదిలిపోవడమే దాని స్వభావం. కాలంతోపాటు ఆ కాలంలో సంభవించిన కష్టమూ కదిలిపోతుంది.

జీవితం చాలా విలువైంది. నిజానికి విలువ కట్టలేనిది. జీవితంలోని ప్రతిక్షణం కూడా. ఏ కష్టం దాని విలువను తగ్గించగలదు? మనం లోతుగా ఆలోచించాలి. కష్టాలు, కన్నీళ్లు... ఇవన్నీ అధిగమించగలిగినవి. కాలం అంటే క్షణాల కూర్పు. క్షణాల మార్పు. ఏ శక్తీ ఏ క్షణాన్నీ ఆపలేదు. కరిగిపోయేదాని కోసం, కదిలిపోయే దానికోసం మన ప్రయాణం, మన ప్రగతి ఆగిపోకూడదు.

ఏ కష్టం కోసమైనా సరే జీవితం తాలూకు ఏ క్షణాన్ని పోగొట్టుకోకూడదు. కాలంలో సంభవించిన ఏ కష్టమైనా సరే, దానితోపాటు కదిలిపోతూనే ఉంటుంది. కొత్త క్షణం వస్తుంది. దానితోపాటే కొంత సుఖం రావచ్చు. కొత్త సుఖం రావచ్చు. పోనీ... కనీసం కొత్త కష్టమైనా రావచ్చు. వచ్చి స్థిరపడిపోతుందని భయపెట్టిన కష్టం కంటే కొత్త నష్టం కొంత మేలుకదా? అలవోకగా వచ్చిన కష్టానికి అవగాహనలేక... ఆయాసపడి ఆగిపోతే- లోకంలో భగవంతుడిచ్చిన జీవితాన్ని పూర్ణంగా జీవించేవాడే ఉండేవాడు కాదు. లోకంలో విజేత అనేవాడు ఒక్కడూ ఉండేవాడు కాదు. మార్పు ప్రకృతి సహజం. రుతువులు మారతాయి. రాత్రింబవళ్లు మారతాయి. సూర్యచంద్రులూ. మారనిదేదీ లేదు.
మార్పే జీవితం! జీవితం అంటే కూడా మార్పే. పిల్లలు పిల్లకాలువలో వేసిన కాగితపు పడవలా కాలం కదిలిపోతుంది. మనం పిల్లల్లా వినోదంగా చూడాలి. వాళ్లకు తెలుసు. పడవ చాలా కష్టపడి చేశామని. నీళ్లలో వదిలేస్తే కాసేపటికి మునిగిపోతుందని, తడిసిపోతుందని. అయినా క్రీడావినోదం కావాలంటే ఆ కష్టానికి వెరవకూడదు. ఆ నష్టానికి బెదరకూడదు. సిద్ధపడే ఉండాలి. పిల్లలు మునిగిపోతున్న పడవకేసే చూస్తూ బాధపడుతూ కూర్చోరు. పరుగున వెళ్లి మరో కాగితం తెచ్చుకొని మరో పడవ తయారుచేస్తారు. టైటానిక్‌ చేసినంత ఉత్సాహంతో. మనం పిల్లలపాటి చేయమా? ఆ మాత్రం అనర్థాలను, ఆటంకాలను అధిగమించలేమా? దేవుడు ఈ క్షణాన్ని యథాతథంగా అనుభవించమన్నాడేగానీ క్షణంలోనే స్థిరంగా ఉండిపొమ్మని చెప్పలేదు- అది సుఖమైనా, కష్టమైనా! కష్టాన్ని కదిలిపోతున్న క్షణంతోపాటు మరచిపోవాలి. కదిలిపోతున్న క్షణాన్ని మనం మూర్ఖత్వంతో ఆపివేస్తున్నాం. పదేపదే ఆ క్షణాన్ని, అది ఇచ్చిపోయిన కష్టాన్ని నెమరువేసుకుంటూ అనుభవిస్తున్నాం. అది సరికాదు. మనముందు ఎవరూ ఆపలేని మరో అద్భుత క్షణం ఉంది. మరెన్నో అమృత క్షణాలున్నాయి. వాటికి అవకాశం ఇస్తూ గడిచిపోయిన క్షణాన్ని సంతోషంగా సాగనంపుదాం.
నెమరువేసే అలవాటు పశువులది. మనది కాదు!
నమస్కారం
మీకు క్లాసికల్ మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ కింది గ్రూపులో లో జాయిన్ అవ్వండి
ప్రకృతి సత్యం......!

ఎవరినీ మీ నోటితో కానీ మనస్సుతో కానీ నాశనం అవ్వమని, పాడవ్వమని కాని తిట్టకండి.

బుద్ది బాగుపడాలి బావుండాలి అని కోరుకోండి.

ఒకడు బాగుపడితే వాడి వలన పదిమందికి ఉపయోగం కలుగుతుంది.

అంతేకాకుండా ఒకరి మేలు కోరుకున్న మీకు మంచే జరుగుతుంది.
ఎందుకంటే

ఈ సృష్టిలో మనం మనస్ఫూర్తిగా ఏది తలిస్తే అది జరగడం ఈ సృష్టి రహస్యం.

ఏది మనం ఇస్తామో దానికి పదింతలు లభిస్తుంది.

చెట్టుకి నీరు పోస్తేనే కదా వృక్షమై పువ్వులు ఫలాలు ఇస్తుంది.

సూర్యుడు నీరు స్వీకరించే కదా వర్షాలు ఇస్తున్నాడు అలాగే ఇది కూడా ..

కనుక ఈరోజు నుండి కయ్యానికి కాలు దువ్వకుండా బుద్ధిమారి మంచివారిగా మారాలని కోరుకోండి.

అందుకే కదా
భార్యని అపహరించిన రావణుడిని రాముడు క్షమిస్తాను అని చెప్పి దేవుడయ్యాడు. అది వినని రావణుడు మృతుడయ్యాడు.

యుధిష్ఠిరుడు కూడా మహామహా పాపాత్ములని క్షమించాడు. చివరికి దుర్యోధనుడిని కూడా క్షమిస్తాను అయిదు ఊళ్ళు ఇవ్వమంటే వినకుండా కాలుదువ్వాడు. చివరికి చచ్చాడు.

మేలు కోరుకోవడం మనవంతు. వినకపోతే ఆఫలితం అనుభవించడం వాళ్ళ వంతు. మంచి చెప్పి మహాత్ములు అవ్వండి.
వామన జయంతి

భాద్రపద శుక్లపక్షంలో శ్రవణానక్షత్రయుక్తమైన ద్వాదశినాడు వామన జయంతి జరుపుకొంటారు. వామనావతారం శ్రీమహావిష్ణువు అయిదో అవతారం. మానవావతారాల్లో మొదటిది. మానవ జీవితాన్ని ఆదర్శవంతంగా మలచుకోవడానికి ఎన్నో సందేశాలు ఇస్తుంది వామనావతారం.

కశ్యపుడి భార్య అదితి దేవతలకు తల్లి. రాక్షసులు తన పుత్రులను తరచూ హింసిస్తుంటే భరించలేక శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థించింది. స్వామి ‘తగిన సమయంలో నీకు బిడ్డగా జన్మించి నీ బాధలు పోగొడతాను’ అని ఓదార్చి అంతర్థానమవుతాడు. కొంతకాలానికి అదితి బ్రహ్మతేజోమయుడైన ఒక శిశువుకు జన్మనిచ్చింది. అయిదేళ్ల వయస్సు వచ్చేసరికి ఆ బాలుడు అఖండమేధావిగా ప్రకాశించడం గమనించిన తండ్రి కశ్యపుడు గాయత్రీ మంత్రోపదేశం చేసి సకల శాస్త్రాలూ నేర్పాడు. వయసు పెరిగినా శరీరం అలాగే ఉండటంతో అతడికి వామనుడనే పేరు స్థిరపడింది.

రాక్షసరాజు బలిచక్రవర్తి ప్రహ్లాదుడి మనవడు. స్వర్గంమీద దాడిచేసి, ఇంద్రుణ్ని ఓడించి అమరావతిని ఆక్రమించుకున్నాడు. ఓసారి నర్మదా నదీతీరాన గల ‘భృగుకచ్ఛ’ అనే రమణీయ ప్రదేశానికి వెళ్లి అశ్వమేధయాగం చేశాడు. కపటబుద్ధిగల రాక్షస గురువు శుక్రాచార్యుడు ఆ యాగానికి ప్రధాన సంచాలకుడు. బ్రాహ్మణులకు, పేదలకు ఎవరేది అడిగినా భూరిదానాలు చేశాడు బలి. బ్రహ్మతేజస్సుతో వెలిగే వటుడైన వామనుడు దండం, కమండలం, గొడుగు తీసుకుని యజ్ఞప్రాంగణానికి వెళ్ళాడు. ప్రసన్నవదనంతో బలిని ఆశీర్వదించి, అతడి వంశకీర్తిని శ్లాఘించాడు. వామనుడి వాక్చమత్కృతికి పరమానందభరితుడైన బలి- నా సర్వసంపదలను, రాజ్యాన్ని ఇస్తాను కోరుకొమ్మన్నాడు. బలి ఆ వటువును కూర్చోబెట్టి పాద ప్రక్షాళన, అర్ఘ్య పూజ చేసి, పంచామృతాలు సమర్పించాడు.

ఎంతో సంతోషంతో పొంగిపోతున్న బలిని చూసి వామనుడు ‘కేవలం నా పాదాలచే పరిమితమైన మూడు అడుగుల భూమిని మాత్రమే నిన్ను అడుగుతున్నాను’ అన్నాడు. ‘నేను త్రిలోకాధిపతిని. మీ కోరిక నాకు తగినట్లు గొప్పదిగా ఉండాలి’ అన్నాడు బలి. అది విని వామనుడు- ‘నేను బ్రహ్మచారిని. నీ సంపద నేనేం చేసుకుంటాను. నా ఇంద్రియాలు నా వశంలోనే ఉన్నాయి. మూడడుగుల భూమినిస్తే చాలు’ అన్నాడు ఎంతో లౌక్యంగా. వామనుడి ఆంతర్యం గ్రహించాడు శుక్రుడు. ‘వచ్చినవాడు సాక్షాత్తు విష్ణువు... నీ రాజ్యాన్ని, జీవితాన్ని హరించి నిన్ను పాతాళానికి తొక్కివేయాలని వచ్చాడు. అతడి కోరికను అంగీకరించొద్దు’ అని ఎంతగా హెచ్చరించినా బలి వినలేదు. చివరి ప్రయత్నంగా శుక్రాచార్యుడు తన శిష్యుణ్ని కాపాడే ఉద్దేశంతో ఒక పురుగు రూపంలో ఉదకం విడిచే చెంబుకొమ్ముకు అడ్డం పడ్డాడు. అది గమనించిన బలి దర్భపుల్లతో కొమ్ములో పొడిచాడు. దానితో శుక్రాచార్యుడి కన్నుపోయింది. బయటికి వచ్చేశాడు శుక్రుడు. బలి ఉదకం విడిచి దానం పూర్తిచేశాడు. క్రోధితుడైన గురువు బలిని ‘నీ సంపదలన్నీ నశించు గాక’ అని శపించాడు.

వామనుడు అకస్మాత్తుగా ఊర్ధ్వముఖంగా ఎదిగాడు. ఒక అడుగుతో భూమిని, రెండో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి- ‘మూడో అడుగు ఎక్కడ పెట్టాలి?’ అని అడిగాడు బలిని. బలి తన తలను చూపించాడు. వామనుడు మూడో పాదాన్ని బలి తలమీదపెట్టి పాతాళంలోకి తొక్కివేశాడు. బలినుంచి స్వీకరించిన భూమిని, స్వర్గాన్ని ఇంద్రుడికిచ్చాడు. బలి గొప్ప విష్ణుభక్తుడు కావడంతో వామనుడు బలిభవనానికి ద్వారపాలకుడిగా ఉన్నట్లు పురాణ కథనం. సాపర్ణిమనువు కాలంలో బలి దేవేంద్రుడవుతాడని విష్ణువు వరం ఇచ్చాడు. వామనద్వాదశిని విజయద్వాదశి, శక్రద్వాదశి, శ్రవణ ద్వాదశి, మహాద్వాదశి అనీ పిలుస్తారు.
ఆలయం ఆగమం

ఆలయ విమానం పైభాగంలో కనిపించే కలశంలాంటి నిర్మాణాన్నే ఆగమ, శిల్పశాస్త్ర పరిభాషలో స్తూపిక అంటారు. చాలామంది శిఖర కలశం అని పిలుస్తారు. ఆలయంలో ఇది అంతిమభాగం, అతి ముఖ్యమైన భాగమని సంప్రదాయం చెప్తోంది. ఆలయంలోనికి అనంతశక్తిని ప్రసరింపజేయడంలో ఈ స్తూపిక కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆలయానికి బ్రహ్మభాగంలో అంటే నట్టనడిమిన ఇది ప్రతిష్ఠించబడుతుంది. ఇందులో అమృతం నిండి ఉంటుంది. అందుకే ఇది బిందుస్థానం(మధ్యభాగం)లో ఉండి నిరంతరం అమృతాన్ని స్రవిస్తుందని విశ్వకర్మీయ శిల్పశాస్త్రం చెప్పింది.

ఆలయానికి శ్రీయంత్రానికి (శ్రీచక్రం) అవినాభావ సంబంధం ఉంది. ఈ యంత్రం నుండి పైకి లేచి ఆలయం రూపు దాలిస్తే సరిగ్గా బిందుస్థానంలో స్తూపి ఉంటుంది. బిందువు శక్తి అంశ. అందుకే ఈ స్తూపి అత్యంత శక్తివంతమైనది. సాధారణంగా స్తూపిని అరటిమొగ్గవలె రూపొందిస్తారు. అయితే కొన్ని చోట్ల త్రిశూలం, చక్రం వంటి లాంఛనాలు కూడా కనిపిస్తాయి.

మొగ్గ వికసించని సృష్టికి ప్రతీక. అంటే ఇక్కడే సృష్టి ప్రారంభం అవుతోందని గమనించాలి. బిందువు నుండి ప్రారంభమై క్రమక్రమంగా విస్తరిస్తూ ఆలయం పూర్ణాకృతి పొందుతుంది. ఇది అవరోహణక్రమం. పూర్ణదేవాలయం క్రమ క్రమేపి చిన్నదవుతూ ఈ స్తూపి మూలంగానే శూన్యంలో కలిసిపోతుంది. ఇది ఆరోహణ క్రమం. ఉన్నది ఒకటే ’సత్‌’ అని ఋగ్వేదం చెప్పిన మాటకు ప్రతీకగా ఈ స్తూపి కనిపిస్తుంది. త్రిశూలస్తూపి ద్వారా త్రిశూలంలోని మూడు శూలాలతో త్రిమూర్తి తత్త్వం ఆవిష్కృతమౌతుంది. చక్రస్తూపికతో సమస్త విశ్వం ప్రతిబింబిస్తుంది.

ఆలయానికైనా, విమానానికైనా ఒకటి మొదలు ఇరవై ఒక్క స్తూపికల వరకు ప్రతిష్ఠించవచ్చు. అలాగే పారలౌకిక కాములు అంటే మోక్షం కోరువారు సమసంఖ్యా కలశాలను, ఐహిక ఫలాన్ని కోరువారు బేసిసంఖ్యలో కలశాలను ప్రతిష్ఠించుకోవచ్చని ఆగమశాసనం.
Audio
Panchayudha Stotram For Strength | Vishnumurthy strotram