వినాయకుడు
తెల్లని వస్త్రాలు ధరించినవాడూ, అంతటా వ్యాపించియున్నవాడూ, చంద్రునిలా తెల్లనైన శరీరవర్ణం గలవాడూ, నాలుగు చేతులు గలవాడూ, అనుగ్రహదృష్టితోడి ముఖంగలవాడూ అయిన వానిని (వినాయకుని) అన్ని అడ్డంకులు నివారించుటకై ధ్యానించవలెను
అగజానన పద్మార్కం గజాననమ్ అహర్నిశంఅనేకదమ్ తమ్ భక్తానాం ఏకదంతమ్ ఉపాస్మహే
శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
(అగజ) పార్వతి ముఖపద్మమును వెలిగించువాడు, ఏనుగు ముఖము గలవాడు, అన్నివేళలా ఎన్నోవిధములైసంపదలను తన భక్తులకు ఇచ్చువాడు అయిన ఏకదంతుని స్మరిస్తున్నాను.
ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమంజ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శ్రుణ్వన్నూతిభిః సీద సాధనం
హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి (గణనాయకుడు, గణపతి, గణేశుడు). అన్ని అడ్డంకులు తొలగించు వాడు (విఘ్నేశ్వరుడు), అన్నికార్యములకూ, పూజలకూ ప్రథమముగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు. హిందూ సంప్రదాయములో శైవములో మాత్రమే వినాయకుని, వైష్ణవములో మాత్రము విష్వక్సేన ని పూజిస్తారు. అన్ని ప్రాంతములంలో, అన్ని ఆచారములంలో వినాయకుని ప్రార్థన, పూజ సామాన్యము. తెలుగువారి పండుగలలో వినాయకచవితి ముఖ్యమైన పండుగ. పంచాయతనపూజా విధానంలో వినాయకుని పూజకూడా ఒకటి (వినాయకుడు, శివుడు, శక్తి, విష్ణువు, సూర్యుడు - వీరి పూజా సంప్రదాయాలు పంచాయతన విధానములు)
వినాయకుడు శివపార్వతుల పెద్దకొడుకు (కుమారస్వామి వారి రెండవ కొడుకు). వినాయకుని ఆకారం హిందూమతంలో విశిష్టమైనది. ఏనుగు ముఖము, పెద్ద బొజ్జ, పెద్ద చెవులు, ఒకే దంతము, ఎలుక వాహనము, పొట్టకు పాము కట్టు, నాలుగు చేతులు - ఒక చేత పాశము, మరొకచేత అంకుశం, ఒక చేత ఘంటము లేదా లడ్డూ, మరొక అభయహస్తము - ఇది నమ్మినవారికి సర్వ మంగళ ప్రథము. హిందూ సంప్రదాయముతో పరిచయము లేనివారికి ఆశ్చర్యకరము.
Contd...

హిందూమతంలో వినాయకునిప్రాముఖ్యత
భారతదేశంలో వినాయకుడిని గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు, గణనాధుడు, పిల్లైయార్ వంటి అనేక నామాలతో అర్చిస్తారు. హిందూమతంలో పూజింపబడే అనేక దేవతామూర్తులలో దాధాపు అన్ని సంప్రదాయాలలోను అన్ని ప్రాంతాలలోను బహుళంగా అర్చింపబడే దేవుడు వినాయకుడు. శైవం, వైష్ణవం, శాక్తేయం, జైనం, బౌద్ధంలలోను, భారతదేశం వెలుపల చీనా, నేపాల్, టిబెట్, జపాన్, ఇండొనీడియా వంటి దేశాలలోను కూడా వినాయకుడి అర్చన ఉంది.
వినాయకునికి అనేక నామములు, పేర్లు ఉన్నాయి. కాని అంతటా అత్యంత ప్రస్ఫుటంగా గుర్తింపబడే లక్షణాలు - ఏనుగు ముఖం, ఎలుక వాహనం అడ్డంకులు తొలగించే గుణం, విద్యా, బుద్ధి ప్రదాత . ధార్మిక, లౌకిక కార్యక్రమాల (వ్రతము, యజ్ఞము, పరీక్షలు వ్రాయడం, ఇల్లు కట్టడం వంటివి) ఆరంభంలో వినాయకుడిని స్తుతించే లేదా పూజించే ఆనవాయితీ సర్వసాధారణం
వైదిక కాలంనుండి, అంతకుముందు ఉన్న కొన్ని విశ్వాసాలు వినాయకుని సూచిస్తున్నప్పటికీ క్రీ.శ. 4వ, 5వ శతాబ్దాలలో, ప్రత్యేకించి గుప్తుల కాలంలో వినాయకునికి ఇప్పుడు మనం పూజించే రూపం, లక్షణాలు, సంప్రదాయాలు ధార్మిక సమాజంలో రూపుదిద్దుకున్నట్లుగా అనిపిస్తుంది. తరువాత వినాయకుని పూజ చాలా వేగంగా ప్రాచుర్యం పొందింది. 9వ శతాబ్దంలో స్మార్తుల పంచాయతనంలో ఒక విభాగం అయ్యింది. వినాయకుడు అందరికంటే అత్యున్నతమైన భగవంతుడు (దేవదేవుడు) అని విశ్వసించే గాణపత్య సమాజం ఈ కాలంలో ఏర్పడింది. వినాయకుని గురించి తెలిపే ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు - గణేశ పురాణము, ముద్గల పురాణము, మరియు గణపతి అథర్వశీర్షము.

స్వరూపం
భారతీయ శిల్ప, చిత్ర కళలలో వినాయకుని మూర్తీకరణ విస్తృతంగా, చాలా వైవిధ్యంతో కనిపిస్తుంది. కాల క్రమంలో వినాయకుని చిత్రించే, శిల్పించే విధానం మారుతూ వస్తున్నది. నిలబడినట్లుగాను, నృత్యం చేస్తున్నట్లుగాను, రాక్షసులతో యుద్ధం చేస్తున్నట్లుగాను, కుటుంబంలో బాలునిగా ఆడుకొంటున్నట్లుగాను, నేలపై కూర్చున్నట్లు, సింహాసనాశీనుడైనట్లు - ఇలా వివిధ సన్నివేశాలలో గణపతి శిల్పాళు, చిత్రాలు కనిపిస్తుంటాయి.
క్రీ.శ. 2వ శతాబ్దం నాటికి శ్రీలంకలో వినాయకుడి విగ్రహాలు ఉన్నట్లు తెలుస్తున్నది. మిహింతలెలోని కంటకచైత్యంలో లభించిన వినాయక విగ్రహం క్రీ.పూ. 1వ శతాబ్దానికి చెందినదని అంచనా వేశారు. మనకు లభించిన గణేశ విగ్రహాలలో ఇదే అత్యంత పురాతనమైనది. ఇందులో ఒకే దంతం కలిగిన మరుగుజ్జు, ఇతర మరుగుజ్జులతో పరివేష్టింపబడినట్లుగా చూపబడింది. 6వ శతాబ్దం నాటికి భారతదేశంలో వినాయకుని విగ్రహాలు సాధారణమయ్యాయి. వినాయకుడు ఒక ప్రత్యేకమైన దేవునిగా గుర్తింపబడిన తరువాత, వినాయక పూజా సంప్రదాయం స్థిరపడిన తరువాత - అంటే 900-1200 కాలం తరువాత - వినాయకుని ఆకారం సాధారణంగా కుడిప్రక్క చూపిన విగ్రహంవలె ఉంటూ వచ్చింది. ఏనుగు తల, బానపొట్ట, ఒకచేత విరిగిన దంతం, మరొకచేతిలో ఉన్న లడ్డూను స్పృశిస్తున్న తొండం - ఇవి సాధారణంగా కనిపించే చిహ్నాలు. ఎల్లోరా గుహలలో మరింత పురాతనమైన (7వ శతాబ్దానికి చెందిన) గణేశ విగ్రహం లభించింది కాని అందులో చేతుల చిహ్నాలు స్పష్టంగా తెలియడంలేదు. సాధారణంగా వినాయకుని విగ్రహాలలోని పైచేతులలో ఒకచేత అంకుశం మరొక చేత పాశం కనిపిస్తాయి. క్రింది చేతులలో ఒకచేత దంతం, మరొకచేత లడ్డూ ఉన్నట్లు చూపుతారు. ఆధునిక రూపాలలో దంతం ఉన్న చేతిబదులు అభయముద్రలో ఉన్న చేతిని చూపుతున్నారు. నృత్యం చేస్తున్నట్లున్న గణపతి మూర్తులలో కూడా నాలుగు చేతులను ఇలానే చూపుతుంటారు.

విగ్రహాలు, చిత్రాలు
ఆదినుండి వినాయకుడిని ఏనుగుతలతోనే చిత్రీకరిస్తున్నారనిపిస్తున్నది. ఇలా ఏనుగు తల ఉండడానికి అనేక పురాణ గాథలున్నాయి. "హేరంబ గణపతి"ని ఐదు తలలతో చూపుతారు.
వినాయకునికి ఏక దంతుడు అన్న పేరు మొదటినుండి ఉంది. చాలా పురాతనమైన విగ్రహాలలో కూడా వినాయకుడు తన విరిగిన దంతాన్ని చేతబట్టుకొన్నట్లుగా చూపారు. ముద్గల పురాణం ప్రకారం వినాయకుని రెండవ అవతారం "ఏకదంతావతారం". అలాగే పెద్ద పొట్టకూడా మొదటినుండి (గుప్తుల కాలంనుండి) వినాయకుని శిల్పాలలో కనిపిస్తున్న అంశం. ముద్గల పురాణంలో చెప్పిన రెండు అవతారాలు (హేరంబుడు, మహోదరుడు) ఈ పెద్దపొట్ట అనే అంశంయొక్క ప్రాముఖ్యతను సూచిస్తున్నాయి. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు చెందిన సకల జగత్తూ తన ఉదరంలో ఉంచుకొన్నందున అతనికి "లంబోదరుడు" అనే పేరు వచ్చిందని బ్రహ్మాండ పురాణములో ఉంది. వినాయకునికి రెండు చేతులనుండి, 16 చేతుల వరకు చూపుతారు. సాధారణంగా నాలుగు చేతులతో శిల్పాలు, చిత్రాలు చేస్తారు. పురాతనమైన విగ్రహాలలో మాత్రం రెండు చేతులనే చూపారు. 9వ, 10వ శతాబ్దాలలో 14 నుండి 20 చేతులవరకు ఉన్న ప్రతిమలు చెక్కారు. వినాయకుని చిత్రీకరణలో పాము కూడా చాలా సాధారణంగా కనిపిస్తుంది. ఇది అనేక విధాలుగా చూపబడుతుంది. గణేశ పురాణము ప్రకారము వినాయకుడు వాసుకి (పాము) ని తన కంఠానికి చుట్టుకొన్నాడు. మరి కొన్ని మూర్తులలో పాము యజ్ఞోపవీతంగా చూపబడింది. ఇంతే కాకుండా పాము ఉదరాభరణంగా (బెల్టులాగా), చేతిలో ఉన్నట్లుగా, కాళ్ళవద్ద చుట్టుకొని ఉన్నట్లుగా, సింహాసనంగా - ఇలా అనేక విధాలుగా చూపబడింది. వినాయకుడి నుదురుమీద తిలకం, కొన్ని సార్లు మూడవ నేత్రం చూపుతారు. గణేశ పురాణం ప్రకారం వినాయకుని తలమీద తిలక చిహ్నం మరియు చంద్రవంక కూడా ఉంటాయి. ముఖ్యంగా "బాలచంద్ర వినాయకుడు" అనే రూపంలో చంద్రవంకను చూపుతారు
వినాయకుని వివిధ రూపాలకు వివిధ వర్ణాలు ఆపాదింపబడ్డాయి. వీటిని గురించి శ్రీతత్వనిధి అనే శిల్పగ్రంధంలో చెప్పబడింది. ఉదాహరణకు హేరంబ గణపతిని మరియు ఋణమోచన గణపతిని తెలుపు రంగులోను, ఏకదంత గణపతిని నీలిరంగులోను, దుర్గాగణపతిని బంగారు వర్ణంలోను, సృష్టిగణపతిని ఎరుపు రంగులోను చూపుతారు.

వాహనం
అధికంగా వినాయకునికి వాహనంగా ఎలుకను చూపుతారు. మొట్టమొదటి కాలంలో వచ్చిన వినాయకవిగ్రహాలలో వాహనాన్ని చూపలేదు. ముద్గలపురాణంలో వినాయకుని ఎనిమిది అవతారాలు చెప్పబడినాయి. (వక్రతుండ, ఏకదంత, మహోదర, గజవక్త్ర, లంబోదర, వికట, విఘ్నరాజ, ధూమ్రవర్ణ అవతారాలు). ఆ ఎనిమిది అవతారాలలో ఐదు అవతారాలకు వాహనం ఎలుక. వక్రతుండ అవతారం వాహనం సింహం. వికట అవతారం వాహనం నెమలి. విఘ్నరాజ అవతారం వాహనం శేషువు. గణేశ పురాణంలో నాలుగు అవతారాలు ప్రస్తావింపబడినాయి. అందులో మహోటక అవతారం వాహనం సింహం. మయూరేశ్వర అవతారం నెమలి. ధూమ్రకేతు అవతారం గుర్రం. గజాననుని అవతారం ఎలుక. జైనుల సంప్రదాయాలలో గణేశునికి ఎలుక, ఏనుగు, తాబేలు, పొట్టేలు, నెమలి వాహనాలు వివిధ సందర్భాలలో చెప్పబడినాయి. (చూపబడినాయి)
7వ శతాబ్దంనుండి మధ్య, పశ్చిమ భారతంలో వచ్చిన శిల్పాలలో ఎలుకను చూపడం మొదలయ్యిందని అభిప్రాయపడతారు. లిఖిత గ్రంథాలలో మత్స్య పురాణములో మొట్టమొదటగా ఎలుక వాహనం గురించి వ్రాయబడింది. తరువాత బ్రహ్మాండ పురాణము, గణేశ పురాణములలో ఈ విషయం ఉంది. చివరి అవతారంలో ఎలుకను వాహనంగా చేసుకొన్నట్లు గణేశపురాణంలో ఉంది. గణపతి అధర్వశీర్షం అనే గ్రంథంలో ఒక ధ్యాన శ్లోకం ప్రకారం వినాయకుని ధ్వజంమీద ఎలుక ఉంటుంది.. గణపతి సహస్రనామాలలో "మూషిక వాహన", "అఖుకేతన" అనే పేర్లున్నాయి.
ఎలుక వాహనం సంకేతాన్ని అనేకవిధాలుగా వివరిస్తారు - ఎలుక తామస ప్రవృత్తికి చిహ్నం. కనుక కామక్రోధాలను అణగ ద్రొక్కడం అనగా ఎలుకపై స్వారీ చేయడం. పంటలకు హాని కలిగించే ఎలుకను అదుపు చేయడం అనగా విఘ్నాలను నివారించడం అని మరొక వివరణ ఉంది. ఇది గ్రామదేవత లక్షణాలలో ఒకటి ఎలుకనెక్కినందున వినాయకుడు ఎక్కడికైనా వెళ్ళగలడని (సర్వాంతర్యామి) మరొక అభిప్రాయం ఉంది.

ఓంకారము
హిందూమతంలో ప్రణవ మంత్రం అయిన ఓంకారము స్వరూపమే వినాయకుడని అంటారు. వినాయకుడి రూపము ఓంకారంలా ఉంటుందని చెబుతుంటారు. (ముఖ్యంగా దేవనాగరి, తమిళ లిపులలో) గణపతి అధర్వశీర్షంలో ఈ విషయం ఇలా ఉంది:
గణపతీ! నీవే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులవు. నీవే ఇంద్రుడవు. నీవే అగ్నివి, వాయువువు, సూర్యుడవు, చంద్రుడవు, నీవే భూలోకము, అంతరిక్షము, స్వర్గము. నీవే ఓంకారము.
మూలాధార చక్రము
కుండలినీ యోగము ప్రకారంము షట్చక్రాలలో మొదటిదైన మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు. ఈ చక్రంలోనే కుండలినీ శక్తి సాధారణంగా అంతస్థితమై (చుట్టు చుట్టుకొని, నిద్రాణమై) ఉంటుంది. వినాయకుని రూపంలో పామను చూపడానికి, మూలాధార చక్రంతో ఉన్న సంబంధానికి సాఱూప్యం చెబుతుంటారు. గణపతి అధర్వశీర్షంలో కూడా ఈ విషయం చెప్పబడింది. కనుక వినాయకుడు అన్నింటికీ "మూలాధారము" అని కూడా వివరిస్తుంటారు

వినాయకుని కుటుంబం
వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల పుత్రుడని సాధారణ ప్రవచనం. కాని ఇతని జన్మ గురించి పురాణాలలో గాథా భేదాలున్నాయి. ఇతనిని శివుడు సృష్టించాడని , ఇతనికి తన వంటి నలుగుతో పార్వతి ప్రాణం పోసిందని, పుణ్యక వ్రతం ఆచరించి పార్వతీదేవి ఈ బిడ్డను కన్నదని, పార్వతీ పరమేశ్వరులు వినాయకుని సృష్టించారని, స్వయంభువువైన ఇతనిని పార్వతీపరమేశ్వరులు కనుగొన్నారని ఇలా అనేక గాథలున్నాయి.
వినాయకుని తమ్ముడు స్కందుడు (మురుగన్, కార్తికేయుడు, కుమారస్వామి). వీరి గురించి కూడా కథలలో వైవిధ్యం ఉంది. సాధారణంగా ఉత్తర భారతదేశంలోని కథల ప్రకారం కుమారస్వామి పెద్దవాడు. దక్షిణ భారతదేశంలోని కథల ప్రకారం వినాయకుడు పెద్దవాడు. ఉత్తర భారతదేశంలో క్రీ.పూ. 500 నుండి క్రీ.శ. 600 వరకు స్కందుని పూజ (వీర పూజ) అధికంగా ఉండేది కాని క్రమంగా తగ్గింది. వినాయకుని పూజకు ప్రాముఖ్యత పెరిగింది. (ఇద్దరు సోదరుల మధ్య అధిపత్యపు పోటీ గురించి కూడా ఒక కథ ఉంది) . ఇది కొన్ని జాతుల మధ్య పోటీని సూచించవచ్చును.
వినాయకుడు బ్రహ్మచారి అని కొన్ని కథలలోను, అతనికి సిద్ధి, బుద్ధి అనే భార్యలున్నారని కొన్ని కథలలోను ఉంది. దక్షిణ భారతదేశంలోను, ఉత్తర భారతంలో కొన్ని ప్రాంతాలలోను వినాయకుని బ్రహ్మచారిగా కొలుస్తుంటారు. బుద్ధి, సిద్ధి, వృద్ధి అనే మూడు భాగ్యాలను వినాయకుడు కలిగిస్తాడు గనుక ఈ గుణాలను మూర్తీభవించిన దేవతా స్వరూపులుగా భావించి వినాయకునికి భార్యలుగా ఆపాదించారని ఒక అభిప్రాయం. ఇంకా కొన్ని బొమ్మలలో వినాయకుని చదువుల తల్లి సరస్వతితోను, సిరిసంపదల తల్లి లక్ష్మీదేవితోను కలిపి చిత్రీకరిస్తారు. బెంగాల్ ప్రాంతంలో అరటిచెట్టుతో పాటు వినాయకుని చూపే సంప్రదాయం ఉంది.
శివ పురాణం ప్రకారం వినాయకునికి ఇద్దరు కుమారులు - క్షేమము, లాభము. ఉత్తర భారతంలో వీరిని శూభము, లాభము అని వ్యవహరిస్తారు. 1975లో వెలువడిన హిందీ సినిమా జై సంతోషీ మాలో వినాయకునికి వృద్ధి, సిద్ధి అనే వారితో వివాహం జరిగినట్లు, వారికి సంతోషీ మాత అనే కుమార్తె కలిగినట్లు చూపారు. ఈ విషయం పురాణాలలో లభించడంలేదు కాని సంతోషీమాత కథ దేశంలో బాగా ప్రసిద్ధమైనది.

32 గణపతులు
ప్రధానంగా గణపతుల సంఖ్య 21 (కనుకనే ఏకవింశతి పత్రపూజ చేస్తారు). ఇంకా అవాంతర భేదగణపతులు 11 - మొత్తం 32
1 శ్రీ గణపతి
2 వీర గణపతి
3 శక్తి గణపతి
4 భక్త గణపతి
5 బాల గణపతి
6 తరుణ గణపతి
7 ఉచ్చిష్ట గణపతి
8 ఉన్మత్త గణపతి
9 విద్యా గణపతి
10 దుర్గ గణపతి
11 విజయ గణపతి
12 వృత్త గణపతి
13 విఘ్న గణపతి
14 లక్ష్మీ గణపతి
15 నృత్య గణపతి
16 శక్తి గణపతి
17 మహా గణపతి
18 బీజ గణపతి
19 దుంఢి గణపతి
20 పింగళ గణపతి
21 హరిద్రా గణపతి
22 ప్రసన్న గణపతి
23 వాతాపి గణపతి
24 హేరంబ గణపతి
25 త్ర్యక్షర గణపతి
26 త్రిముఖ గణపతి
27 ఏకాక్షర గణపతి
28 వక్రతుండ గణపతి
29 వరసిద్ధి గణపతి
30 చింతామణి గణపతి
31 సంకష్టహర గణపతి
32 త్రైలోక్యమోహనగణపతి

నిజమైన సంపద
పెద్దపెద్ద భవంతులు, ఎకరాలకొద్దీ పొలాలు, విలాసవంతమైన జీవితం, ఖరీదైన వాహనాల్లో ప్రయాణం, డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయడం సంపదగా పరిగణిస్తాం. డబ్బుతోనే గొప్పతనం, గౌరవం వస్తాయనే ఆలోచన కొంతవరకు వాస్తవమే అయినా నిజమైన సంపద ఇది కాదు!
మనిషి ఏదైనా సాధించడానికి శరీరమనే ఉపాధి కావాలి. ఇది ఉన్నంతవరకే మనమేమి చేయాలనుకున్నా, ఏ లక్ష్యాన్ని చేరాలనుకున్నా సాధ్యమయ్యేది. అందువల్ల దీన్ని జాగ్రత్తగా పోషించుకోవాలి. అందుకే పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు. ఇహపర సాధనకు సాధనం ఈశరీరమే.
కష్టకాలంలో మన పక్కన స్నేహితులను కలిగి ఉండటమన్నది, ఎంతో గొప్ప సంపద. సంస్కారవంతులుగా, జ్ఞానవంతులుగా మనల్ని తీర్చిదిద్దేది చదువు. విచక్షణ, వివేకాలనే చక్షువులనిచ్చి మనిషిని సన్మార్గంలో పయనించేటట్లు చేస్తుంది. తన పుట్టుకకు ఇతర ప్రాణుల పుట్టుకకు భేదాన్ని తెలుసుకునే మేధనిస్తుంది. ఈ సకల చరాచర సృష్టిలో తన స్థానాన్ని, ప్రాముఖ్యాన్ని, కర్తవ్యాన్ని మనిషికి బోధపరచేది చదువే. అది చాలా విలువైన సంపద.
మనిషి ఒంటరిగా జీవించలేడు. ఎదుటివారితో ఎలా మసలుకోవాలో, ఎలా సంభాషించాలో ప్రథమంగా తన కుటుంబ సభ్యులనుంచి, తన పెద్దలనుంచి గ్రహించాలి. వారి సత్ప్రవర్తనను అలవరుచుకోవాలి. అది సమాజంలో తోటివారితో ప్రవర్తించే తీరుపై ప్రతిబింబించి సత్ఫలితాలనిస్తుంది. సంబంధ, బాంధవ్యాలను నిలుపుకొనే విధంగా మన ప్రవర్తన ఉండాలి. అప్పుడే మన బంధాలు హాయిగా సాగిపోతాయి. అందరినీ కలుపుకొనే స్నేహపూర్వక ప్రవర్తన మనకు ఐశ్వర్యం లాంటిదే.
సంపదంటే ధనాన్ని ఎక్కువగా సంపాదించడం కాదు. మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేయడం అంతకన్నా కాదు. అలాగని ఎక్కువగా పొదుపు చేయడమూ కాదు! సంపాదన ఒక స్థాయికి చేరుకున్న తరవాత ఇక సంపాదించవలసిన అవసరంలేదన్న భావన కలగడం. దాన్నే తృప్తి అంటారు. అది మనిషికి కలగనినాడు అశాంతికి గురవుతాడు. మనశ్శాంతి కరవవుతుంది. కంటిమీద కునుకే ఉండదు. తృప్తి కొంతమందికే దక్కే అరుదైన సంపద.
తమ సృజనతో అద్భుతమైన రచనలు చేసేవారు, నిష్ణాతులైన కళాకారులు, రోగుల ప్రాణాలు కాపాడే వైద్యులు, ప్రయోగశాలలో అహరహం పరిశోధనలు చేస్తూ మానవాళికి ఉపకరించే అనేక వస్తువులకు రూపకల్పన చేసే శాస్త్రవేత్తలు, భావితరాలను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దే అధ్యాపకులు, ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో దేశాన్ని రక్షించే సైనికులు... ఏ దేశానికైనా విలువైన సంపద.
మహాపురుషులందించిన జ్ఞానసంపద, మన పూర్వీకులందించిన విజ్ఞానం, పెద్దలు మనకోసం ఏర్పరచిన సదాచారాలు, సత్సంప్రదాయాలు, మన జీవితానికొక క్రమశిక్షణను, పథాన్ని ఇస్తాయి. వాటిని పాటిస్తూ, వారు చూపిన ధర్మపథంలో కొనసాగడమే ఆ వారసత్వ సంపదకు మనమివ్వగలిగే నిజమైన గౌరవం. అది ఘనమైన సంపద.
దాస్యశృంఖలాలను బద్దలుచేసి దేశమాతకు స్వేచ్ఛా ఊపిరులూదడంలో తమ ధన, మాన, ప్రాణాలను కోల్పోయిన ఎందరో త్యాగధనులు తరతరాలు మనసులో నిలుపుకోవలసినవారు. వారు జాతికి అమూల్యమైన సంపద.
‘మనిషి కడవరకు తోడు ఉండాల్సిదేమిటి?’ అని యక్ష ప్రశ్నల్లో యక్షుడు ధర్మరాజును అడుగుతాడు. మనోబలమని సమాధానమిస్తాడు యుధిష్ఠిరుడు. మనవెంట ఎవరున్నా, ఎంత సంపద ఉన్నా మనోబలానికి సాటిరావు. మనిషి తుదిశ్వాస వరకు ఉండవలసిన ఈ సుగుణం ఎంతో అద్భుత సంపద.
సంపద అనగానే మనకు వచ్చే లౌకిక దృష్టి, భావనల నుంచి బయటపడి నిజమైన సంపదను గుర్తెరగాలి. జీవితానికొక ఔన్నత్యం చేకూరేదప్పుడే!
https://t.me/devotional

Telegram
Devotional Telugu
An attempt to bring our Hindu Devotional information
Audio
శ్రీ గణపతి తాళం... శ్రీ గణపతి తాళం... శ్రీ గణపతి తాళం.. శ్రీ గణపతి తాళం..
గణపతి తాళం
అగణిత ఫణి ఫణ మణి గణ కిరణై |
రరు నిత నిజ తను రవి థథ వధన, థట థట లుట ధలి కుల కళ వినధో
గణపతి రభ మత మీహ దిశ తనుః
లంభోధర వర కుంజా వస్తిత కుంకుమ వర్ణ ధరం
శ్వేత శృంగం బీనసుహస్తం ప్రీతిత సఫల ఫలం
నాగత్రయ యుత నాగ విభూషణ నా నా గణపతి తం
త తం నా నా గణపతి తం
త తం నా నా గణపతి తం
తత్ పురుషాయ విద్మహే వక్రాతుండాయ ధీమహి తనో దంతి ప్రచొదయాథ్
వికటోత్కట సుందర దంతి ముఖం | భుజగేంద్రసుసర్ప గదాభరణం ||
గజ నీల గజేంద్ర గణాధిపతిమ్ | ప్రణతోస్మి వినాయక హస్తి ముఖం ||
సుర సుర గణపతి సుందర కేశమ్ | ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానమ్ ||
భవ భవ గణపతి పద్మ శరీరమ్ | జయ జయ గణపతి దివ్య నమస్తే ||
గజ ముఖ వక్త్రమ్ గిరిజా పుత్రమ్ | గణ గుణ మిత్రం గణపతిమీశప్రియమ్ ||
కరద్రుత పరశుమ్ కంకణ పాణిం కబలిత పద్మ రుచిం | సురపతి వంద్యం సుందర వక్త్రం సుందరచిత మణి మకుటమ్ ||
ప్రణమత దేహం ప్రకటిత కాలం షడ్గిరి తాళమిదం, తత్ తత్ షడ్గిరి తాళమిదం తత్ తత్ షడ్గిరి తాళమిదమ్ |
లంబోదర వర కుంజా సురకృత కుంకుమ వర్ణ ధరమ్ | శ్వేతసశృంగం మోదక హస్తం ప్రీతి సపనసఫలమ్||
నయనత్రయ వర నాగ విభూషిత నానా గణపతిదం, తత్తం నయన త్రయ వర నాగ విభూషిత నానా గణపతితం తత్తం నా నా గణపతిదం, తత్తం నా నా గణపతిదం, తత్తం నా నా గణపతిదమ్ ||
ధవలిత జల ధర ధవలిత చంద్రం ఫణి మణి కిరణ విభూషిత ఖడ్గం | తను తను విషహర శూల కపాలం హర హర శివశివ గణపతి మభయం, ధవలిత జల ధర ధవలిత చంద్రం ఫణి మణి కిరణ విభూషిత ఖడ్గం | తను తను విషహర శూల కపాలం హర హర శివశివ గణపతి మభయమ్||
కట తట విగలిత మద జల జలధిత గణపతి వాద్యమిదమ్ | కట తట విగలిత మద జల జలధిత గణపతి వాద్యమిదం తత్ తత్ గణపతి వాద్యమ్ ఇదమ్, తత్ తత్ గణపతి వాద్యమిదమ్||
తక తకిట తక తకిట తక తకిట తతోం, శశి కలిత శశి కలిత మౌళినం శూలినమ్ |
తక తకిట తక తకిట తక తకిట తత్తోం, విమల శుభ కమల జల పాదుకం పాణినమ్ |
ధిక్ తకిట ధిక్ తకిట ధిక్ తకిట తత్తోం, ప్రమథ గణ గుణ ఖచిత శోభనం శోభితమ్|
ధిక్ తకిట ధిక్ తకిట ధిక్ తకిట త తోం, మృదుల భుజ సరసి జభి షానకం పోషణం |
థక తకిట థక తకిట థక తకిట తతోం, పనస ఫల కదలి ఫల మోదనం మోదకం |
ధిక్ తకిట ధిక్ తకిట ధిక్ తకిట తతోం, ప్రమథగురు శివ తనయ గణపతి తాళనం |
గణపతి తాళనం ! గణపతి తాళనం !!
🙏🙏🙏

హిందూ సనాతన ధర్మము లో స్త్రీల జడ యెక్క రహస్యం.....
హిందూ సనాతన ధర్మము యొక్క పరిజ్ఞానం, విశిష్టత ఆంగ్ల శాస్త్రవేత్తలకె ఇంత వరకు అంతు చిక్కని యదార్థం...
స్త్రీల జడ.. మూడూ పాయలు ఉంటాయి...
జడలోని ఆ మూడు పాయలు...
౧. ఇడా
౨. పింగళ
౩. సుషుమ్న
అనే మూడు నాడులకు సంకేతాలు. వెన్నెముకు సమాంతరముగా చివర వరకూ సాగే ఈ జడ మూలాధారమునుండి సహస్రారమునకు
చేరుకొనే కుండలినీ సంకేతము.
జడ పై భాగము తలపై విప్పారిన పాము పడగవలే
సహస్రార పద్మమునకు సాంకేతికము. మూడు పాయల ముడుల వలె ఇడా, పింగళ నాడులు
పెనవేసుకు ఉంటాయి. అంతర్లీనముగా ఉన్న మూడవ పాయ సుషుమ్న నాడికి సంకేతము.
ఇంత ఆధ్యాత్మిక రహస్యాన్ని మన హిందూ సనాతన ధర్మము యొక్క సంస్కృతి స్త్రీల జడలలో దాచింది. ఈ విధముగా స్త్రీలకు మాత్రమే కలుగు కొన్ని వ్యాధులనుండి వారి స్వయం రక్షణకు మార్గము లను మన పూర్వీకులు పొందు పరిచారు...
|| ఓం నమః శివాయ ||

కదిలిపోయేదే కాలం
కష్టాన్ని నిలువరించే సులభోపాయాలేమీ లేవు. అడ్డదారులు, దొడ్డిదారులు ఉండవు. నష్టం అనగానే కన్నీళ్లు ఉంటాయి. కలతపడటమూ ఉంటుంది. దానికి నివారణోపాయం- మనోధైర్యంతో ఎదుర్కోవడమే. సంయమనంతో సమాధానపడటమే. అప్పుడు స్థిరంగా పాతుకుపోతుందనుకుని భయపడిపోయిన మేరు పర్వతమంత కష్టమైనా కదిలిపోతుంది, ఎగిరిపోతుంది. కష్టం కాలంలాంటిది. కదలడమే దాని లక్షణం. కదిలిపోవడమే దాని స్వభావం. కాలంతోపాటు ఆ కాలంలో సంభవించిన కష్టమూ కదిలిపోతుంది.
జీవితం చాలా విలువైంది. నిజానికి విలువ కట్టలేనిది. జీవితంలోని ప్రతిక్షణం కూడా. ఏ కష్టం దాని విలువను తగ్గించగలదు? మనం లోతుగా ఆలోచించాలి. కష్టాలు, కన్నీళ్లు... ఇవన్నీ అధిగమించగలిగినవి. కాలం అంటే క్షణాల కూర్పు. క్షణాల మార్పు. ఏ శక్తీ ఏ క్షణాన్నీ ఆపలేదు. కరిగిపోయేదాని కోసం, కదిలిపోయే దానికోసం మన ప్రయాణం, మన ప్రగతి ఆగిపోకూడదు.
ఏ కష్టం కోసమైనా సరే జీవితం తాలూకు ఏ క్షణాన్ని పోగొట్టుకోకూడదు. కాలంలో సంభవించిన ఏ కష్టమైనా సరే, దానితోపాటు కదిలిపోతూనే ఉంటుంది. కొత్త క్షణం వస్తుంది. దానితోపాటే కొంత సుఖం రావచ్చు. కొత్త సుఖం రావచ్చు. పోనీ... కనీసం కొత్త కష్టమైనా రావచ్చు. వచ్చి స్థిరపడిపోతుందని భయపెట్టిన కష్టం కంటే కొత్త నష్టం కొంత మేలుకదా? అలవోకగా వచ్చిన కష్టానికి అవగాహనలేక... ఆయాసపడి ఆగిపోతే- లోకంలో భగవంతుడిచ్చిన జీవితాన్ని పూర్ణంగా జీవించేవాడే ఉండేవాడు కాదు. లోకంలో విజేత అనేవాడు ఒక్కడూ ఉండేవాడు కాదు. మార్పు ప్రకృతి సహజం. రుతువులు మారతాయి. రాత్రింబవళ్లు మారతాయి. సూర్యచంద్రులూ. మారనిదేదీ లేదు.
మార్పే జీవితం! జీవితం అంటే కూడా మార్పే. పిల్లలు పిల్లకాలువలో వేసిన కాగితపు పడవలా కాలం కదిలిపోతుంది. మనం పిల్లల్లా వినోదంగా చూడాలి. వాళ్లకు తెలుసు. పడవ చాలా కష్టపడి చేశామని. నీళ్లలో వదిలేస్తే కాసేపటికి మునిగిపోతుందని, తడిసిపోతుందని. అయినా క్రీడావినోదం కావాలంటే ఆ కష్టానికి వెరవకూడదు. ఆ నష్టానికి బెదరకూడదు. సిద్ధపడే ఉండాలి. పిల్లలు మునిగిపోతున్న పడవకేసే చూస్తూ బాధపడుతూ కూర్చోరు. పరుగున వెళ్లి మరో కాగితం తెచ్చుకొని మరో పడవ తయారుచేస్తారు. టైటానిక్ చేసినంత ఉత్సాహంతో. మనం పిల్లలపాటి చేయమా? ఆ మాత్రం అనర్థాలను, ఆటంకాలను అధిగమించలేమా? దేవుడు ఈ క్షణాన్ని యథాతథంగా అనుభవించమన్నాడేగానీ క్షణంలోనే స్థిరంగా ఉండిపొమ్మని చెప్పలేదు- అది సుఖమైనా, కష్టమైనా! కష్టాన్ని కదిలిపోతున్న క్షణంతోపాటు మరచిపోవాలి. కదిలిపోతున్న క్షణాన్ని మనం మూర్ఖత్వంతో ఆపివేస్తున్నాం. పదేపదే ఆ క్షణాన్ని, అది ఇచ్చిపోయిన కష్టాన్ని నెమరువేసుకుంటూ అనుభవిస్తున్నాం. అది సరికాదు. మనముందు ఎవరూ ఆపలేని మరో అద్భుత క్షణం ఉంది. మరెన్నో అమృత క్షణాలున్నాయి. వాటికి అవకాశం ఇస్తూ గడిచిపోయిన క్షణాన్ని సంతోషంగా సాగనంపుదాం.
నెమరువేసే అలవాటు పశువులది. మనది కాదు!

నమస్కారం
మీకు క్లాసికల్ మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ కింది గ్రూపులో లో జాయిన్ అవ్వండి

ప్రకృతి సత్యం......!
ఎవరినీ మీ నోటితో కానీ మనస్సుతో కానీ నాశనం అవ్వమని, పాడవ్వమని కాని తిట్టకండి.
బుద్ది బాగుపడాలి బావుండాలి అని కోరుకోండి.
ఒకడు బాగుపడితే వాడి వలన పదిమందికి ఉపయోగం కలుగుతుంది.
అంతేకాకుండా ఒకరి మేలు కోరుకున్న మీకు మంచే జరుగుతుంది.
ఎందుకంటే
ఈ సృష్టిలో మనం మనస్ఫూర్తిగా ఏది తలిస్తే అది జరగడం ఈ సృష్టి రహస్యం.
ఏది మనం ఇస్తామో దానికి పదింతలు లభిస్తుంది.
చెట్టుకి నీరు పోస్తేనే కదా వృక్షమై పువ్వులు ఫలాలు ఇస్తుంది.
సూర్యుడు నీరు స్వీకరించే కదా వర్షాలు ఇస్తున్నాడు అలాగే ఇది కూడా ..
కనుక ఈరోజు నుండి కయ్యానికి కాలు దువ్వకుండా బుద్ధిమారి మంచివారిగా మారాలని కోరుకోండి.
అందుకే కదా
భార్యని అపహరించిన రావణుడిని రాముడు క్షమిస్తాను అని చెప్పి దేవుడయ్యాడు. అది వినని రావణుడు మృతుడయ్యాడు.
యుధిష్ఠిరుడు కూడా మహామహా పాపాత్ములని క్షమించాడు. చివరికి దుర్యోధనుడిని కూడా క్షమిస్తాను అయిదు ఊళ్ళు ఇవ్వమంటే వినకుండా కాలుదువ్వాడు. చివరికి చచ్చాడు.
మేలు కోరుకోవడం మనవంతు. వినకపోతే ఆఫలితం అనుభవించడం వాళ్ళ వంతు. మంచి చెప్పి మహాత్ములు అవ్వండి.