తదియ నోములు మరియ వినాయక చవితి పండుగల వివరణ
తేదీ :- 2. సెప్టెంబర్. 2019 రోజున తదియ తిధి ఉదయము
గం౹౹ 9:10 ని ల వరకు ఉన్నది.
తదుపరి *చవితి* తిధి వస్తున్నది.
కావున.......
తదియ నోములు
2 సెప్టెంబర్ 2019 సోమవారం నాడు ఉదయం గం౹౹ 6:02 ని ల నుండి ఉదయము గం౹౹ 9:10 ని ల లోపల *తదియ నోములు* పూర్తి చేసుకొన వలెను
( రాహు కాలం )
ఉదయం గం౹౹ 7:30ని ల నుండి గం౹౹ 9:00 ని ల వరకు ఉన్నది
*తదియ నోములకు రాహు కాలం పాటించడం అవసరం లేదు*
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
వినాయక చవితి పండుగ
2. సెప్టెంబర్ 2019 సోమవారం
ఉదయము గం౹౹ 9:11 ని ల నుండి మధ్యానము గం౹౹ 12:20ని ల వరకు, తిరిగి
గం౹౹ 1:15 ని ల నుండి
గం౹౹ 2:50 ని ల వరకు శుభం
చేసుకొనుట మహా శుభప్రదము.
*వినాయక చవితి సంధర్భంగా శుభ ముహూర్తములు*
2.సెప్టెంబర్. 2019 సోమవారం రోజు
అ) ఉదయం గం౹౹ 10 నుండి మధ్యానము గం౹౹ 2 వరకు శుభము
ఆ) సాయంత్రము మన వీధి గణపతి మంటపాల లో
3:38pm ని ల నుండి 9pm వరకు , తిరిగి 10pm నుండి 11pm వరకు కూడా శుభము.
*శుభమస్తు*

ధర్మ సూత్రధారీ హే మురారీ
‘కృష్ణస్తు భగవాన్ స్వయమ్’... కృష్ణుడే పరమతత్త్వం... చరమ లక్ష్యం... ఆయన గురించి చదవడం, చెప్పడం, పాడడం, వినడం... అన్నీ అపురూపమైన అనుభవాలే. ‘నీలో లేని చోద్యాలు ఈ ప్రపంచంలో ఏం ఉంటాయి?’ అని అక్రూరుడన్నా... ‘అటువైపు కృష్ణుడున్నాడు... ఇటువైపు ఎవరున్నారు’ అని సంజయుడు హెచ్చరించినా... అవన్నీ పరమాత్మ విరాట్రూపాన్ని విశదీకరించే ఉదాహరణలే... క్రియ, బోధ కలగలిసిన అద్భుత తత్త్వం ఆయనది... యుగావసరాలకు అన్వయించుకోదగ్గ మహాగాథ శ్రీకృష్ణుడిది.
భక్తుల కోర్కెలు తీర్చే క్రమంలో భగవంతుడు రెండు రకాల విధానాలను అనుసరిస్తాడు. సర్వం తానే స్వయంగా నిర్వహించి, తనపై మనకున్న నమ్మకాన్ని పెంచుకోవడం మొదటి పద్ధతి. మన ప్రయత్నంలో రహస్యంగా సహకరించి, మనపై మనకు నమ్మకాన్ని పెంచి విజేతలుగా తీర్చిదిద్దడం రెండో పద్ధతి. ఇందులో మొదటి దాన్ని దైవికం అని, రెండోదాన్ని పౌరుషం అని శాస్త్రం నిర్వచించింది. పరమాత్మ ప్రతి అవతారంలో ఏదో ఒకమార్గాన్నే ఎంచుకున్నాడు. కానీ కృష్ణావతారంలో మాత్రం రెండు విధాలుగానూ మనకు ఆయన దర్శనమిస్తాడు. దుష్టశిక్షణ, శిష్ట రక్షణల్లో భాగవతంలోని కృష్ణుడు ఎవరి సహాయాన్నీ కోరలేదు. స్వయంగా తానే అవతార లక్ష్యం దిశగా సాగిపోయాడు. భారతంలోని కృష్ణుడు మాత్రం రెండో పద్ధతి అనుసరించాడు. చేసిందంతా తానే అయినా ఘనతను మాత్రం పూర్తిగా పాండవుల పరం చేశాడు. వారిని విజేతలుగా నిలబెట్టాడు. భాగవత కృష్ణుడు విశేష రసజ్ఞ మనోజ్ఞ మూర్తి. భారత కృష్ణుడు అసాధారణ అలౌకిక ప్రజ్ఞానిధి. కృష్ణ కథలో ఈ రెండూ విభిన్న కోణాలు. ఈ రెండు రకాల పాత్రల స్వభావాలు విభిన్నమైనవి, అదే సయమంలో సర్వసమగ్రమైనవి.
అదే కృష్ణమాయ!
భాగవత కృష్ణుడి బాల్యచేష్టలు ముగ్ధమోహనాలు. అదే సమయంలో లోకకల్యాణాలు. పసిబాలుడు భయంకర రాక్షస మూకలను మట్టుబెట్టినప్పుడు జనం నివ్వెరపోవడం సహజం. అవతార పురుషుడిగా అనుమానించడం సాధారణం. అలాంటి వారిని చిలిపి చేష్టల ముసుగులో ముంచేసేవాడు. ఇది లోకం దృష్టికి సమ్మోహనకరంగా, అదే సమయంలో లోచూపునకు సంక్లిష్టభరితంగా కనిపించేది. గోపబాలురకు చెలికాడిగా, గోపికలకు వెన్నెల వేలుపుగా ఆటపాటలతో అలరించిన అపూర్వ ఘట్టాలను అనుశీలించేటప్పుడు మనం కూడా వారిలా మారిపోవడాన్నే కృష్ణమాయ అంటారు. రమణీయ రసానుభూతులు పంచడంతో పాటు రాక్షస సంహారం కూడా ఆయన చేశాడు. ఒక పురాణ పురుషుడి సర్వసమగ్ర వ్యక్తిత్వానికి ఇది గొప్ప ఉదాహరణ.
సుస్థిర పాలన కోసం...
భారత కృష్ణుడు ధీరోదాత్తుడు, రాజనీతిజ్ఞుడు, వ్యూహనిర్మాణ చతురుడు, స్ఫూర్తిప్రదాత, మహానేత. ఆయన అవతరించే సమయానికి లోకంలో పరిస్థితులు విషమంగా ఉన్నాయి. కంస, జరాసంధ, కాలయవన, నరక, శిశుపాల, దుర్యోధనాది స్వార్థ పరుల చేతుల్లో అధికారం, సంపద ఖైదీలయ్యాయి. ఇవన్నీ దుష్టుల చేతుల్లో ఉన్నప్పుడు సామాజిక పరిస్థితులు కూడా దయనీయంగా ఉంటాయి. ధర్మంలేని చోట భద్రత, నీతిలేని చోట మనశ్శాంతి ఉండవు. అలాంటి రాజుల చేతుల్లోనుంచి ప్రజలను రక్షించాలి. సువ్యవస్థను స్థాపించాలి. రాజ్యం చిన్నచిన్న ముక్కలుగా చీలిపోయి ఉంది. అరాచకం, అనైక్యత పెరిగిపోయాయి. ఆ దుస్థితిని, క్లిష్టతను పారదోలేందుకు కేంద్ర రాజ్య వ్యవస్థను ఊహించిన, నిర్దేశించిన అద్భుత రాజనీతిజ్ఞుడు శ్రీ కృష్ణుడు.ధర్మం తప్పిన రాజులందరినీ స్వయంగానో, పాండవుల చేతనో తుదముట్టించాడు. తాను రాజ్యాధికారం కోరుకోకుండా ధార్మిక చింతనాశీలురను పాలకులుగా ఎంచి, రూపొందించి సుపరిపాలనా కేంద్ర వ్యవస్థను నిర్మించాడు. ధర్మజుని నాయకునిగా తీర్చిదిద్దిన నాయక నిర్ణేత శ్రీకృష్ణుడు.
యుద్ధం కూడా యజ్ఞమే!
భగవద్గీత ఆవిర్భావం కూడా ఈ యుగావసరమే. అడవిలో ముక్కు మూసుకుని కూర్చున్న సర్వసంగపరిత్యాగి తన శిష్యులకు ఏకాంతంగా నూరిపోసిన ధర్మోపదేశం కాదిది.. పద్దెనిమిది అక్షౌహిణల మహాసైన్యం యుద్ధరంగంలో మోహరించి, కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్కంఠ స్థితి. తాత్కాలిక నిర్వేదానికి గురై ధర్మసంకటంలో పడిన మహాయోధుణ్ణి కార్మోన్ముఖుణ్ణి చేసేందుకు ప్రవచించిన ఉపదేశం. ఈ లోకానికంతటికీ వర్తించే ధీరవచనం. గీతాచార్యుడిగా శ్రీకృష్ణుడి వ్యక్తిత్వం శిఖరసమానమైంది. ఆయుధాన్ని పట్టనని ప్రకటించిన శ్రీకృష్ణుడు, భీమార్జునులను ఆయుధాలుగా మలుచుకుని కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని సాగించాడు. యుద్ధాన్ని క్రతువు అన్నాడు పరమాత్మ. క్రతువు అంటే యజ్ఞం. ‘న మమ’ అనుకోవడం యజ్ఞంలో ప్రధానాంశం. ‘నాది కాదు’ అని ఆ మాటకు అర్థం. ఏం చేసినా, ఏం పొందినా ‘న మమ’ అనే భావనతో ఉండడం యోగి లక్షణం. అహంకార, మమకారాలను ఆహుతి చేసే మహోన్నత పరిణిత త్యాగశీలతనే కృష్ణుడు కర్మయోగం పేరిట అర్జునుడికి బోధించాడు. అది ఎప్పటికీ, సర్వమానవాళికీ అనుసరణీయం.
.

..అప్పుడలా ఎందుకు చేశానంటే!
స్నేహితుడి కోసం గీతాసారం
కృష్ణా! ఓ మాట అడుగుతాను. నిజం చెబుతావా...? మనం ఆపదలో ఉన్నప్పుడు అడగకపోయినా వచ్చి మనకు సాయం చేసేవాడే స్నేహితుడని నువ్వే చెప్పావు కదా. మరి పాండవులు అన్ని కష్టాల్లో కూరుకుపోయినప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు చెబితే ధర్మరాజు జూదం ఆడేవాడు కాదు కదా? లేదా నువ్వే ధర్మరాజు పక్షాన ఆడి అతడిని గెలిపించవచ్చుకదా. మరి నువ్వెందుకు అలా చూస్తుండిపోయావు? అంటూ నేరుగా కృష్ణుడినే అడిగాడు ఉద్ధవుడు. మరొకరైతే కృష్ణుడిని ఈ ప్రశ్న అడగటానికి కూడా ధైర్యం చేసేవారు కాదు. కానీ, ఇక్కడ అడిగినవాడు ఉద్ధవుడు. కృష్ణుడికి పరమ ప్రాణమిత్రుడు. రూపంలో కూడా అచ్చం కృష్ణుడిలాగా ఉండేవాడు.ఎంతటి ప్రాణమిత్రుడంటే నిద్రలో కూడా కృష్ణుడి పేరునే కలవరించేవాడు. అంతటి మిత్రుడు అడిగేసరికి శ్రీకృష్ణుడు కూడా మొహమాటం లేకుండా సమాధానం చెప్పాడు. ఉద్ధవా! విజయం ఎప్పుడూ వివేకవంతుడినే వరిస్తుంది. దుర్యోధనుడు వివేకవంతుడు. అందుకు ఆటలో నైపుణ్యం ఉన్న శకునితో తన ఆట ఆడించాడు. ధర్మరాజు మాత్రం తానే ఆట ఆడాలని అనుకున్నాడు. పైగా నేను అటువైపు రాకూడదని కోరుకున్నాడు. అందుకే అతడు పిలిచేవరకు రాకూడదని నిశ్చయించుకున్నా. పిలిస్తే మాత్రం తప్పకుండా వెళ్లేవాడిని అన్నాడు. అంటే కృష్ణా! తీవ్రమైన ఆపదల్లో కూరుకుపోయి పిలిస్తే గానీ రావా అంటూ మరోప్రశ్న వేశాడు ఉద్ధవుడు. మిత్రమా! జీవితంలో ప్రతిదీ కర్మానుసారమే జరుగుతుంది. నేను పక్కన ఉండి చూస్తుంటాను కానీ కర్మను మార్చలేను అన్నాడు కృష్ణుడు. అదేంటి కృష్ణా! నీ భక్తుల పక్కనే ఉంటూ వారు ఆపదలో ఉంటే చూస్తూ ఊరుకుంటావా? అన్యాయం కదూ అన్నాడు ఉద్ధవుడు. కృష్ణుడు నవ్వుతూ... మిత్రమా! నేను పక్కన ఉన్నాననే భావన ఉంటే అసలు తప్పే చెయ్యరు కదా భక్తులు అన్నాడు. తత్త్వం బోధపడింది ఉద్ధవుడికి. ఇంకా ఎన్నో సందేహాలు అడిగాడు. అన్నిటికీ తృప్తిగా సమాధానాలు చెప్పాడు పరమాత్మ. అవతార పరిసమాప్తి కాలంలో ఉద్ధవుడి పేరు మీద లోకం తన మీద వేసే నిందలు, వేసే ప్రశ్నలన్నింటికీ పరమాత్మ సమాధానం చెప్పాడు. ఈ సమాధానాల సమాహారమే ‘ఉద్ధవగీత’గా ప్రసిద్ధిపొందింది.

Audio
Lalanuchu Noocheru లాలనుచు నూచేరు | Beautiful Sleep song of Lord Krishna | Annamacharya Keerthana
God's of Hindu
Let's See Different Images of God Everyday and fill our Heart with the Image of Almighty
https://t.me/GodsofHindu

Telegram
God's of Hindu
Let's See Different Images of God Everyday and fill our Heart with the Image of Almighty
జీవితంలో చీకటి వెలుగులు
జీవితంలో కొందరికి ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. చాలాసార్లు సవాళ్లను ఎదుర్కోలేక ఓడిపోయి అన్యమనస్కంగా జీవిస్తుంటారు. మనసులో ధైర్యం ఉండదు. దేహంలో శక్తి తగ్గినట్లు నీరసపడి పోతారు.
ఓటమి నుంచి జయానికి దారి చూపేదే ఆశ. చీకటి నుంచి వెలుగులోకి రావాలంటే నమ్మకం, విశ్వాసం, సంకల్పం ఉండాలి. వీటికోసం వెతకాలి. మనిషన్నాక వ్యాధులు రావచ్చు. ఆర్థిక సమస్యలు సతమతం చేయవచ్చు. సమాజంలో గౌరవ భంగం కలగవచ్చు. కొన్నిసార్లు బతుకులో చీకటి కోణాలు భయానికి కారణమవుతాయి. ఈ చీకట్లను చూసి అంధత్వం కొనితెచ్చుకోకూడదు. ఇక నావల్ల కాదు, నా పరిధిలో లేదు అని వ్యాకులతకు గురికావడం సాధకుడి బలహీనతే!
సాఫల్యం, విజయం గురించిన ఆలోచనలే మనసులో కదలాడుతూ ఉండాలి. నిరాశావాది ఏదీ సాధించలేడు సరికదా...ఇతరులను సైతం నిరాశకు గురిచేస్తాడు. సమస్యలను, కష్టనష్టాలను పరిశీలించాలి. ప్రశ్నించుకొంటే సమాధానం లభిస్తుంది. ఎందుకంటే, ప్రతి ప్రశ్నకూ సమాధానం ఉంటుంది. జీవితమే సమస్యల సమాహారం. మనిషి బతుకు వడ్డించిన విస్తరి కాదు.
మనిషి జీవితమే బాధలమయం. అతడి సమస్యలకు పరిష్కారం ఏమిటన్నది ప్రశ్న. పిప్పలాదుడు ఈ ప్రశ్నకు బదులిస్తూ- మనిషి సాధనకు సహాయపడటానికి పంచేంద్రియాలు, కాళ్ళూచేతులు, శక్తిని ప్రకృతి ఇచ్చింది. వీటి సహాయంతో మానవుడు పరిష్కరించుకోలేని సమస్యే లేదు. మనకు ఇన్ని వనరులున్నా ఎవరో వచ్చి ఏదో చేసి కష్టాలనుంచి గట్టెక్కిస్తారనుకోవడం సరైనది కాదు. భగవద్గీతలో అర్జునుణ్ని విషాదయోగం నుంచి శ్రీకృష్ణుడు స్పష్టమైన, సూటి మాటలతో వెలుపలికి తీసుకొచ్చి కర్తవ్య సాధనకు సన్నద్ధం చేశాడు. అజ్ఞానమనే చీకట్లను దూరం చేసి తేజోవంతుణ్ని చేశాడు. చివరకు విజయం పాండవులనే వరించింది. నిస్పృహతో ధనుర్బాణాలు కింద పడేసిన అర్జునుడే కడకు విజయుడయ్యాడు.
జ్ఞానం, ధైర్యం ఉన్నచోట అపజయం ఉండదు. మనిషి జీవితం చీకట్లో మగ్గుతోందంటే మనసులో ఆశల వెలుగులు నింపుకోవడానికి ప్రయత్నించాలి. జీవితాన్ని కాంతిమయం చేసుకోవాలి. మనిషి మౌలికంగా ఆశాజీవి. మనమే వెలుగు. మన ఆత్మ గొప్ప జ్యోతి. ప్రకృతితో మనిషి మమేకం కాగలిగితే కాంతి అతణ్ని అంటిపెట్టుకునే ఉంటుంది. చీకటి మనిషి దరి చేరదు. చీకటి లేని జీవితంలో అంతా మంచే. ప్రతి మనిషి ఆత్మలో వెలుగు పుంజాలు ఉంటాయి. మనం భౌతిక ప్రపంచంలోని చీకట్లను, భ్రమలను విడిచి ఆత్మావలోకనం చేసుకొంటే వెలుగులు జీవితంలోకి విరజిమ్ముతాయి. ఆలోచన, మననం సాధన చేయగలిగితే మన కంటికి ఆ వెలుగు రేఖలు ప్రస్ఫుటమవుతాయి. అవమానం, అప్రతిష్ఠ, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులన్నీ చీకటి కోణాలే! జీవితంలో ఇవన్నీ ఆకాశంలో సాగిపోతున్న మేఘాల్లాంటివే. అవి తొలగిపోయాయా... అంతా వెలుగే! చీకటి వెనకే వెలుగు వస్తుంది. కాళరాత్రి గడిచి వేకువ అయ్యిందంటే వెలుగు కిరణాలు జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. కాంతి శాశ్వతమైంది. అంధకారం అనిత్యమైంది. సూర్యుణ్ని మేఘం కమ్ముకున్నంత మాత్రాన వెలుగు జాలువారక మానదు. కష్టాలు కలకాలం నిలువవని అంటారు. అన్వేషణ, నేర్పు వికసించగానే ఆనందం, సుఖం అందివస్తాయి. ఈ సత్యం తెలుసుకొంటే చాలు... బతుకు బాట వెలుగుల తోట!

ఇచ్ఛ
ఇచ్ఛ మనిషికి ప్రకృతి ప్రసాదించిన దివ్యశక్తి. కోరిక, వాంఛ, ఆశ, తపన, వ్యామోహం... ఇవన్నీ ఈ శక్తి నుంచే పుడతాయి. బంధమోక్షాలు రెండింటికీ ఇదే కారణం. దుఃఖానికి, ఆనందానికి ఇదే మూలం. ఇదే స్థితప్రజ్ఞతను అందిస్తుంది, పతనాన్నీ శాసిస్తుంది. అందుకే శాస్త్రాలన్నీ దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతాయి. మనిషి జీవన ప్రయాణానికి ఇచ్ఛ తెరచాప వంటిది. దీన్ని ఎక్కడ ఎలా దించాలో, ఎప్పుడు ఎలా పైకెత్తాలో తెలిస్తే జీవన ప్రయాణం ఆనందంగా సాగుతుంది.
సృష్టిలో ఏ ఇచ్ఛా లేని మనిషి ఉండడు. ఉన్నా జీవించలేడు. జీవించాలన్నదీ ఒక ఇచ్ఛే. అలాగే ఇచ్ఛ లేని దేవతా లేదు. పరమాత్మ ప్రతి అవతారం వెనక ఒక ఇచ్ఛ దాగి ఉంది. దుష్ట సంహరణేచ్ఛతో దుర్గ అవతరించింది. ధర్మాన్ని ఆచరించి చూపేందుకు శ్రీరాముడు అవతరించాడు. సృజించాలని బ్రహ్మ, పాలించాలని విష్ణువు, లయించాలని రుద్రుడు ఇచ్ఛ కలిగి ఉన్నారు.
ఇచ్ఛే లేకపోతే సృష్టి ఉనికే లేదు. సృష్టి చేయాలనే ఈశ్వరేచ్ఛ నుంచే సకల జగత్తు ఉద్భవించింది. ఆయన ఇచ్ఛానుసారమే నడుస్తోంది. ఆయన ఇచ్ఛాశక్తి నుంచి పుట్టిన మనిషీ ఆ శక్తిని పూర్ణంగా పొందాడు. స్వేచ్ఛా (స్వ+ఇచ్ఛ) జీవి అయ్యాడు. తన ఇచ్ఛానుసారం జీవించగలుగుతున్నాడు. తన జీవనమార్గాన్ని తానే ఎంచుకోగలుగుతున్నాడు. ప్రకృతి మనిషికి శ్రేయస్సు, ప్రేయస్సు అనే రెండు మార్గాలను చూపింది. ఏ మార్గంలో నడవాలో ఎంచుకునే స్వేచ్ఛనూ ఇచ్చింది. ఏ మార్గంలో నడిస్తే, ఏ ఫలితాలుంటాయో తెలుసుకునే బుద్ధి కుశలతనూ ఇచ్చింది. తనకు ఏది ఉచితమో గ్రహించి ఆ మార్గంలో అడుగిడితే, తన ఇచ్ఛాశక్తి మనిషికి ఆ మార్గంలో తోడవుతుంది.
ప్రేయోమార్గంలో నడిస్తే ఇంద్రియ సుఖాలే పరమావధి అవుతాయి. అంతులేని కోరికలతో, అంతంలేని ఆశలతో ఇది నిండి ఉంటుంది. జీవించి ఉన్నంత కాలం, మరణంలోనూ కోరికలు మనిషిని వెంటాడతాయి.
ఇంద్రియ సుఖాల పరిధిని గ్రహించిన వ్యక్తి మాత్రమే ఆదర్శ జీవితాన్ని కోరతాడు. శ్రేయోమార్గంలో నడుస్తాడు. మనిషికి, జంతువుకు తేడాను పరిశీలిస్తాడు. మనిషి జన్మ ఎత్తింది ఇష్టానుసారం జీవించడానికి కాదు. ఉన్నతమైన ఆదర్శాలకోసం అని గ్రహిస్తాడు. దీనికి అనువైన ఇచ్ఛాప్రవృత్తిని అలవరచుకుంటాడు.
కోరికలను జయించడం మనిషికి అంత సులభం కాదు. దీనికి అభ్యాసం కావాలి. ఏ ఘనకార్యమైనా, ప్రతిఘటన లేకుండా సాగదు. దైవాన్ని, సంఘాన్ని, ఆదర్శాలను అంటిపెట్టుకున్న మనసు అన్ని అవరోధాలను అధిగమిస్తుంది. సన్మార్గాన్ని బోధించే మిత్రబృందాన్ని ఏర్పరచుకొని సత్సాంగత్యం చేయాలి. ధర్మం, దైవం అనే దివ్యాయుధాలతో దుర్భేద్యమైన ఇంద్రియ వ్యామోహాలను మనిషి జయించగలడనే వేద వాక్కును ఆచరణలో పెట్టాలి. ధర్మాన్ని ఆదర్శంగా తీసుకుని ఆచరించాలి. దైవాన్ని దైవంగానే భావించాలి తప్ప కోరికలు తీర్చే ఇంద్రజాలంగా భావించరాదు. దైవానికి భక్తుడికి మధ్య కోరిక అనే తెరను తొలగించాలి. ఏ పని దైవానికి దగ్గర చేస్తుందో దానిపైన కోరిక ఉంచాలి. ఈ కోరిక నన్ను పరమాత్మ ముందు దోషిగా నిలబెడుతుందని భావిస్తే వెంటనే ఆ కోరికను వదిలిపెట్టేయాలి.
ఈ భక్తితత్వం మనిషిలో సత్వగుణాధిక్యత పెంచుతుంది. సత్వగుణం పెరిగేకొద్దీ ఆశావ్యామోహాలతో నిండిన రజోగుణం, ఇంద్రియ వాంఛలతో నిండిన తమోగుణం క్రమంగా క్షీణిస్తాయి. సత్వగుణమంతా దివ్యత్వంతో నిండిఉంది. దీనినుంచి పుట్టిన ప్రతీ ఇచ్ఛ, దైవేచ్ఛ అవుతుంది. ఇచ్ఛను జయించాలి. ముక్తి పొందాలి అనే కోరిక కోరిక కాదు. నిస్వార్థపు కోరికా కోరిక కాదు. ఇవి మనిషిని బంధించవు, బాధించవు. ఉన్నతిని మాత్రం ప్రసాదిస్తాయి.
https://t.me/devotional

Devotional Telugu
An attempt to bring our Hindu Devotional information
వినాయకుడు
తెల్లని వస్త్రాలు ధరించినవాడూ, అంతటా వ్యాపించియున్నవాడూ, చంద్రునిలా తెల్లనైన శరీరవర్ణం గలవాడూ, నాలుగు చేతులు గలవాడూ, అనుగ్రహదృష్టితోడి ముఖంగలవాడూ అయిన వానిని (వినాయకుని) అన్ని అడ్డంకులు నివారించుటకై ధ్యానించవలెను
అగజానన పద్మార్కం గజాననమ్ అహర్నిశంఅనేకదమ్ తమ్ భక్తానాం ఏకదంతమ్ ఉపాస్మహే
శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
(అగజ) పార్వతి ముఖపద్మమును వెలిగించువాడు, ఏనుగు ముఖము గలవాడు, అన్నివేళలా ఎన్నోవిధములైసంపదలను తన భక్తులకు ఇచ్చువాడు అయిన ఏకదంతుని స్మరిస్తున్నాను.
ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమంజ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శ్రుణ్వన్నూతిభిః సీద సాధనం
హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి (గణనాయకుడు, గణపతి, గణేశుడు). అన్ని అడ్డంకులు తొలగించు వాడు (విఘ్నేశ్వరుడు), అన్నికార్యములకూ, పూజలకూ ప్రథమముగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు. హిందూ సంప్రదాయములో శైవములో మాత్రమే వినాయకుని, వైష్ణవములో మాత్రము విష్వక్సేన ని పూజిస్తారు. అన్ని ప్రాంతములంలో, అన్ని ఆచారములంలో వినాయకుని ప్రార్థన, పూజ సామాన్యము. తెలుగువారి పండుగలలో వినాయకచవితి ముఖ్యమైన పండుగ. పంచాయతనపూజా విధానంలో వినాయకుని పూజకూడా ఒకటి (వినాయకుడు, శివుడు, శక్తి, విష్ణువు, సూర్యుడు - వీరి పూజా సంప్రదాయాలు పంచాయతన విధానములు)
వినాయకుడు శివపార్వతుల పెద్దకొడుకు (కుమారస్వామి వారి రెండవ కొడుకు). వినాయకుని ఆకారం హిందూమతంలో విశిష్టమైనది. ఏనుగు ముఖము, పెద్ద బొజ్జ, పెద్ద చెవులు, ఒకే దంతము, ఎలుక వాహనము, పొట్టకు పాము కట్టు, నాలుగు చేతులు - ఒక చేత పాశము, మరొకచేత అంకుశం, ఒక చేత ఘంటము లేదా లడ్డూ, మరొక అభయహస్తము - ఇది నమ్మినవారికి సర్వ మంగళ ప్రథము. హిందూ సంప్రదాయముతో పరిచయము లేనివారికి ఆశ్చర్యకరము.
Contd...

హిందూమతంలో వినాయకునిప్రాముఖ్యత
భారతదేశంలో వినాయకుడిని గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు, గణనాధుడు, పిల్లైయార్ వంటి అనేక నామాలతో అర్చిస్తారు. హిందూమతంలో పూజింపబడే అనేక దేవతామూర్తులలో దాధాపు అన్ని సంప్రదాయాలలోను అన్ని ప్రాంతాలలోను బహుళంగా అర్చింపబడే దేవుడు వినాయకుడు. శైవం, వైష్ణవం, శాక్తేయం, జైనం, బౌద్ధంలలోను, భారతదేశం వెలుపల చీనా, నేపాల్, టిబెట్, జపాన్, ఇండొనీడియా వంటి దేశాలలోను కూడా వినాయకుడి అర్చన ఉంది.
వినాయకునికి అనేక నామములు, పేర్లు ఉన్నాయి. కాని అంతటా అత్యంత ప్రస్ఫుటంగా గుర్తింపబడే లక్షణాలు - ఏనుగు ముఖం, ఎలుక వాహనం అడ్డంకులు తొలగించే గుణం, విద్యా, బుద్ధి ప్రదాత . ధార్మిక, లౌకిక కార్యక్రమాల (వ్రతము, యజ్ఞము, పరీక్షలు వ్రాయడం, ఇల్లు కట్టడం వంటివి) ఆరంభంలో వినాయకుడిని స్తుతించే లేదా పూజించే ఆనవాయితీ సర్వసాధారణం
వైదిక కాలంనుండి, అంతకుముందు ఉన్న కొన్ని విశ్వాసాలు వినాయకుని సూచిస్తున్నప్పటికీ క్రీ.శ. 4వ, 5వ శతాబ్దాలలో, ప్రత్యేకించి గుప్తుల కాలంలో వినాయకునికి ఇప్పుడు మనం పూజించే రూపం, లక్షణాలు, సంప్రదాయాలు ధార్మిక సమాజంలో రూపుదిద్దుకున్నట్లుగా అనిపిస్తుంది. తరువాత వినాయకుని పూజ చాలా వేగంగా ప్రాచుర్యం పొందింది. 9వ శతాబ్దంలో స్మార్తుల పంచాయతనంలో ఒక విభాగం అయ్యింది. వినాయకుడు అందరికంటే అత్యున్నతమైన భగవంతుడు (దేవదేవుడు) అని విశ్వసించే గాణపత్య సమాజం ఈ కాలంలో ఏర్పడింది. వినాయకుని గురించి తెలిపే ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు - గణేశ పురాణము, ముద్గల పురాణము, మరియు గణపతి అథర్వశీర్షము.

స్వరూపం
భారతీయ శిల్ప, చిత్ర కళలలో వినాయకుని మూర్తీకరణ విస్తృతంగా, చాలా వైవిధ్యంతో కనిపిస్తుంది. కాల క్రమంలో వినాయకుని చిత్రించే, శిల్పించే విధానం మారుతూ వస్తున్నది. నిలబడినట్లుగాను, నృత్యం చేస్తున్నట్లుగాను, రాక్షసులతో యుద్ధం చేస్తున్నట్లుగాను, కుటుంబంలో బాలునిగా ఆడుకొంటున్నట్లుగాను, నేలపై కూర్చున్నట్లు, సింహాసనాశీనుడైనట్లు - ఇలా వివిధ సన్నివేశాలలో గణపతి శిల్పాళు, చిత్రాలు కనిపిస్తుంటాయి.
క్రీ.శ. 2వ శతాబ్దం నాటికి శ్రీలంకలో వినాయకుడి విగ్రహాలు ఉన్నట్లు తెలుస్తున్నది. మిహింతలెలోని కంటకచైత్యంలో లభించిన వినాయక విగ్రహం క్రీ.పూ. 1వ శతాబ్దానికి చెందినదని అంచనా వేశారు. మనకు లభించిన గణేశ విగ్రహాలలో ఇదే అత్యంత పురాతనమైనది. ఇందులో ఒకే దంతం కలిగిన మరుగుజ్జు, ఇతర మరుగుజ్జులతో పరివేష్టింపబడినట్లుగా చూపబడింది. 6వ శతాబ్దం నాటికి భారతదేశంలో వినాయకుని విగ్రహాలు సాధారణమయ్యాయి. వినాయకుడు ఒక ప్రత్యేకమైన దేవునిగా గుర్తింపబడిన తరువాత, వినాయక పూజా సంప్రదాయం స్థిరపడిన తరువాత - అంటే 900-1200 కాలం తరువాత - వినాయకుని ఆకారం సాధారణంగా కుడిప్రక్క చూపిన విగ్రహంవలె ఉంటూ వచ్చింది. ఏనుగు తల, బానపొట్ట, ఒకచేత విరిగిన దంతం, మరొకచేతిలో ఉన్న లడ్డూను స్పృశిస్తున్న తొండం - ఇవి సాధారణంగా కనిపించే చిహ్నాలు. ఎల్లోరా గుహలలో మరింత పురాతనమైన (7వ శతాబ్దానికి చెందిన) గణేశ విగ్రహం లభించింది కాని అందులో చేతుల చిహ్నాలు స్పష్టంగా తెలియడంలేదు. సాధారణంగా వినాయకుని విగ్రహాలలోని పైచేతులలో ఒకచేత అంకుశం మరొక చేత పాశం కనిపిస్తాయి. క్రింది చేతులలో ఒకచేత దంతం, మరొకచేత లడ్డూ ఉన్నట్లు చూపుతారు. ఆధునిక రూపాలలో దంతం ఉన్న చేతిబదులు అభయముద్రలో ఉన్న చేతిని చూపుతున్నారు. నృత్యం చేస్తున్నట్లున్న గణపతి మూర్తులలో కూడా నాలుగు చేతులను ఇలానే చూపుతుంటారు.

విగ్రహాలు, చిత్రాలు
ఆదినుండి వినాయకుడిని ఏనుగుతలతోనే చిత్రీకరిస్తున్నారనిపిస్తున్నది. ఇలా ఏనుగు తల ఉండడానికి అనేక పురాణ గాథలున్నాయి. "హేరంబ గణపతి"ని ఐదు తలలతో చూపుతారు.
వినాయకునికి ఏక దంతుడు అన్న పేరు మొదటినుండి ఉంది. చాలా పురాతనమైన విగ్రహాలలో కూడా వినాయకుడు తన విరిగిన దంతాన్ని చేతబట్టుకొన్నట్లుగా చూపారు. ముద్గల పురాణం ప్రకారం వినాయకుని రెండవ అవతారం "ఏకదంతావతారం". అలాగే పెద్ద పొట్టకూడా మొదటినుండి (గుప్తుల కాలంనుండి) వినాయకుని శిల్పాలలో కనిపిస్తున్న అంశం. ముద్గల పురాణంలో చెప్పిన రెండు అవతారాలు (హేరంబుడు, మహోదరుడు) ఈ పెద్దపొట్ట అనే అంశంయొక్క ప్రాముఖ్యతను సూచిస్తున్నాయి. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు చెందిన సకల జగత్తూ తన ఉదరంలో ఉంచుకొన్నందున అతనికి "లంబోదరుడు" అనే పేరు వచ్చిందని బ్రహ్మాండ పురాణములో ఉంది. వినాయకునికి రెండు చేతులనుండి, 16 చేతుల వరకు చూపుతారు. సాధారణంగా నాలుగు చేతులతో శిల్పాలు, చిత్రాలు చేస్తారు. పురాతనమైన విగ్రహాలలో మాత్రం రెండు చేతులనే చూపారు. 9వ, 10వ శతాబ్దాలలో 14 నుండి 20 చేతులవరకు ఉన్న ప్రతిమలు చెక్కారు. వినాయకుని చిత్రీకరణలో పాము కూడా చాలా సాధారణంగా కనిపిస్తుంది. ఇది అనేక విధాలుగా చూపబడుతుంది. గణేశ పురాణము ప్రకారము వినాయకుడు వాసుకి (పాము) ని తన కంఠానికి చుట్టుకొన్నాడు. మరి కొన్ని మూర్తులలో పాము యజ్ఞోపవీతంగా చూపబడింది. ఇంతే కాకుండా పాము ఉదరాభరణంగా (బెల్టులాగా), చేతిలో ఉన్నట్లుగా, కాళ్ళవద్ద చుట్టుకొని ఉన్నట్లుగా, సింహాసనంగా - ఇలా అనేక విధాలుగా చూపబడింది. వినాయకుడి నుదురుమీద తిలకం, కొన్ని సార్లు మూడవ నేత్రం చూపుతారు. గణేశ పురాణం ప్రకారం వినాయకుని తలమీద తిలక చిహ్నం మరియు చంద్రవంక కూడా ఉంటాయి. ముఖ్యంగా "బాలచంద్ర వినాయకుడు" అనే రూపంలో చంద్రవంకను చూపుతారు
వినాయకుని వివిధ రూపాలకు వివిధ వర్ణాలు ఆపాదింపబడ్డాయి. వీటిని గురించి శ్రీతత్వనిధి అనే శిల్పగ్రంధంలో చెప్పబడింది. ఉదాహరణకు హేరంబ గణపతిని మరియు ఋణమోచన గణపతిని తెలుపు రంగులోను, ఏకదంత గణపతిని నీలిరంగులోను, దుర్గాగణపతిని బంగారు వర్ణంలోను, సృష్టిగణపతిని ఎరుపు రంగులోను చూపుతారు.