Devotional Telugu
3.46K subscribers
106 photos
23 videos
19 files
62 links
An attempt to bring our Hindu Devotional information
Download Telegram
ర్గత్రయంలో తన తండ్రి తాత ముత్తాతల్లో ముత్తాతను ముందు జరిపి ఆయన ఖాళీలో తాతను, తాత స్థానంలో తండ్రిని, తండ్రి స్థానంలో తాను చేరుకుంటుంది. పితృదేవతాస్థానం పొందుతుంది._

_దీనికి కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్టశ్రాద్ధాల రూపంలో అందుతుంది. నిన్నటి బాహ్యశరీరాన్ని విడిచి కారణశరీరం, యాతనా శరీరం కోల్పోయి ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు._

_వీటిలో మొదటి పిండం ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది. దీన్నే కలనం అన్నాడు._

_దీని తరువాత మాంసం చర్మం రెండో పిండం ద్వారా ఏర్పడతాయి._

_మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. (మెదడు)._

_నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి._

_ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి._

_ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు ఏర్పడతాయి._

_ఆయుప్రమాణం ఏడో పిండం ద్వారా కలుగుతుంది._

_ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి._

_తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి._

_పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది._

_ఈ విధంగా మాసికాలలోని పిండదానం వలన పిండశరీరం నుంచీ సంపూర్తి శరీరం పిండాల వలన కలుగుతుంది. ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి శరీరం ఇచ్చిన తల్లి తండ్రులకు మాసికాలు నిర్వహించి వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి వారి ఋణం తీర్చుకోవాలి._

_నిజానికి మొత్తం 16 పిండాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తారు. వీటిలో 10 పిండాల గురించి మృతుడు క్రొత్త శరీరాలు పొందడానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగిస్తాయని పిండోపనిషత్తు చెప్పింది, మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి._

_అంతేకాక మృతుని శరీరం నుంచీ పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి. ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది. ఆ తరువాత అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతోంది._

_కనుక మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే. మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు. ఏది వదిలితే అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైలక్యం కలుగుతుంది. మనకు కోట్లు ఖరీదు చేసినా దొరకని భోగశరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఇంత పిండం పెట్టకపోవడం వలన అతనికి వైకల్యం కలిగించినవారమవుతాము. మహాఘోరమయ్యే తప్పు చేయకూడదు._

_మాసికాలు మానివేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది. సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు. తండ్రికి ప్రేతత్త్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నీ ప్రేతత్త్త్వంలోనే ఉండిపోతాయి. కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది._

_ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞరహస్యాలు._

_ఇవన్నీ సమాన్యంగా తప్పనిసరిగా చేయవలసినవి. ఇవే మరింత ప్రేమగా చేయాలనుకుంటే పుణ్యక్షేత్రాలైన కురుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయా వంటి వాటిలో చేయాలి. ఇలా చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలిగించిన వారమవుతాము. దాని వల్ల మనకే ప్రయోజం ఉంటుంది. వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మరింతగా సకల సంపదలు మనకు ఇస్తారు._

_*పిండాలు ప్రేతాలకు వెళతాయా ?* అని వితండవాదం చేసే వారికి సమాధానమే ఈ పిండోపనిషత్తు._

_నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు. అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్యపదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి. అవి కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే అందుకోగలుగుతారు. వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయండి అనిమాత్రమే చెబుతారు. గయలో ఎందుకు చేయాలి ? ప్రయాగలో ఎందుకు చేయాలి అంటే వాటికి అనేక రకాలైన కారణాలు కూడా చెబుతారు. పుణ్యక్షేత్రాలుగా చెబుతున్న ప్రాంతాలు అన్నీ పరమాత్మ శరీరాంగాలు. ఒకటి శిరస్సు, మరొకటి హృదయం, కాళ్ళు, చేతులు.... వంటివి._

_ఇలా ఆ ప్రాంతాలలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటునైనా చేయాలి. వెళ్ళగలిగిన వారు ప్రయాగ కుంభమేళాల వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు పితృదేవతానందం వలన కలుగుతాయి. వెళ్ళలేని వారు మానసికంగా అయినా వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు._

_ఇవే మాసికాలు పిండప్రధానాల రహస్యాలు._

_దివ్యాత్మస్వరూపులారా!_

_ఇప్పటి వరకూ స్వధానామసాధన, స్వధాస్తోత్రపఠనం చేసిన సాధకులకు ఇదిసాధనలో రెండో సోపానం. సాక్షాత్తూ బ్రహ్మదేవుడు చెప్పగా వ్యాసభగవానుడు ప్రసాదించిన దివ్యమైన పితృస్తోత్రం అందిస్తున్నాము. దీన్ని చదువుకున్న వారి సర్వపాపాలూ పితృదేవతైన తండ్రి తొలగిస్తాడు. ఇది మూడు కాలాలలో లేదా రెండు కాలాలలో లేదా కనీసం రోజుకు ఒక సారి
Audio
Shiridi Sai Baba Mahatyam Movie || Maa Paapalu Video Song || Vijayachander, Chandra Mohan
హిందూ సంప్రదాయంలో కృష్ణుని ప్రత్యేకతే వేరు. తల్లులకు బాలకృష్ణునిగా, చిన్నవారికి చిలిపి కృష్ణునిగా, స్త్రీలకు గోపికా వల్లభునిగా, పెద్దలకు గీతాకారునిగా... ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటాడు. అందుకే కృష్ణుని జన్మదినం అంటే, మన ఇంట్లో మనిషి పుట్టినరోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటాం. ఇంతకీ ఆ రోజు కృష్ణుని పూజ ఎలా జరుగుతుందో తెలుసుకుందామా!

శ్రావణబహుళ అష్టమి రోజున, రోహిణి నక్షత్రంలో కృష్ణుడు జన్మించాడు. ఈ కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. గుమ్మానికి తోరణాలు, గడపకు పసుపుకుంకుమలు, పూజగదిలో ముగ్గులు అద్ది పూజకు సిద్ధం కావాలి. ఆ బాలకృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ, ఇంటి బయట నుంచి లోపలివరకు కృష్ణుని పాదాలను ముగ్గుతో వేయాలి. ఇతర పూజలకు భిన్నంగా కృష్ణాష్టమి పూజను మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభించడం ఆనవాయితీ. వీలైతే ఆ సమయానికే పూజ సాగేలా చూసకోవాలి.

కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం. అందుకని పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెబుతారు. ఆయన ప్రతిమను కూడా తులసిమాలతో అలంకరించమని సూచిస్తారు. కృష్ణునికి పొన్నచెట్టుతోనూ అనుబంధం ఉంది. వీలైతే ఆ పొన్న పూలతో ఆయనను పూజిస్తే మంచిది. ఆయనకు ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజించినా శుభమే! కృష్ణాష్టకమ్‌, కృష్ణ అష్టోత్తరం వంటి స్తోత్రాలను చదువుతూ, పరిమళభరితమైన పుష్పాలతో ఆయనను అర్చించాలి.

కృష్ణాష్టమి రోజున ఉపవాసం, జాగరణ చేసే ఆచారం ఉంది. కాబట్టి కృష్ణునికి కూడా సాత్వికమైన ఆహారాన్నే నివేదిస్తారు. వడపప్పు, పానకం, పళ్లు వంటి నివేదనలు సాధారణం. వీటితో పాటు ఆయనకు ఇష్టమైన పాలు, వెన్న, మీగడను కూడా ప్రసాదంగా సమర్పించవచ్చు. మరికొందరు... బాలింతలకు పెట్టే మినపపిండి, పంచదార కలిపి పెడతారు. కృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి, ఆయన తల్లిని బాలింతరాలుగా భావిస్తూ ఈ ఆచారం మొదలై ఉండవచ్చు. చలికాలానికి శరీరాన్ని సిద్ధం చేయడం కూడా ఈ ప్రసాదం వెనుక పరమార్థంగా కనిపిస్తుంది.

కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా ఆయన స్మరణ కూడా ముఖ్యమే! ఆ గోపాలుని వైభవాన్ని తెలియచేసే భాగవతం, భగవద్గీతలను ఈ రోజు ఎంతో కొంత పఠించాలి. అలా కృష్ణుని తలుస్తూ, కొలుస్తూ, భజిస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి, కొందరు రాత్రివేళ్లే కృష్ణపూజ చేస్తారు. అలా కృష్ణుని పూజించాలనుకునే ప్రదేశంలో బియ్యం పోసి.... దాని మీద ఒక కుండని పెడతారు. ఆ కుండ మీద కృష్ణుని ప్రతిమను ఉంచి, పూజని నిర్వహిస్తారు. అర్ధరాత్రి వేళ శంఖంలో నీటిని తీసుకుని చంద్రునికి, కృష్ణునికి అర్ఘ్యమిస్తారు. మర్నాడు ఉదయాన్నే దగ్గరలోని వైష్ణవాలయాన్ని దర్శించి ఉపవాసాన్ని విరమిస్తారు.

ఇక కృష్ణాష్టమి రోజు రాత్రి జరిగే ఉట్టి కార్యక్రమం గురించి తెలిసిందే. బాలకృష్ణుని చిలిపి చేష్టలను తల్చుకుంటూ... పాలు, పెరుగు, వెన్న, అటుకులు, పళ్లులాంటి పదార్థాలు ఉంచిన ఈ ఉట్టిని కొడతారు. మరికొందరు హోళీ తరహాలో గులాల్‌ చల్లుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. ఇంకొందరు చిన్న బాలకృష్ణుని ప్రతిమను మనసారా అలంకరించిచి, ఊయలలో ఉంచి రాత్రంతా ఆయన కోసం కీర్తనలు, భజనలు పాడుతూ ఉంటారు. మరి ఈ కృష్ణాష్టమిని మీరెలా జరుపుకోవాలని అనుకుంటున్నారు?
✍*గుడికి ఎందుకు వెళ్ళాలి?*🙏
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
💐మనలో చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. ఆడ-మగ, పెద్ద-చిన్న అనే తేడా లేకుండా మనలో చాలామంది గుళ్ళు గోపురాలను దర్శించుకుంటారు. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా దిగుళ్ళు ఉంటే మర్చిపోవడం కోసం అనుకుంటే పొరపాటు.
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
💐గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. అసలు గుడి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడింది? దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి, ఈ విషయమై వేదాలు ఏం చెప్తున్నాయి మొదలైన అంశాలు తెలుసుకోవడం చాలా అవసరం.
⛳మనదేశంలో చిన్నా పెద్దా వేలాది దేవాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, నిర్దుష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు. అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. స్థలమహత్యాన్ని సంతరించుకున్నాయి.
🏹భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే తనువూ, మనసూ ప్రశాంతత పొందుతాయి.
⛳దేవాలయ గర్భగృహంలో ఉత్క్రుష్టమైన ఆకర్షణా తరంగాలు కేంద్రీకృతమైన చోట మూలవిరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని (రాగి రేకు) నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆవిధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది.
🌷అందువల్ల రోజూ గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళేవారిలో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలీదు. కానీ నిత్యం గుడికి వెళ్ళేవారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది.
ఇకపోతే గర్భగుడి మూడువైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే.
⛳ఆలయాల్లో గంటలు మోగిస్తారు. వేద మంత్రాలు పఠిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి.
⛳గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడంవల్ల శక్తి విడుదల అవుతుంది.
🙏మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడిగంటలు, మంత్ర ఘోష, పూల పరిమళాలు, కర్పూరం, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం, తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతుంది.
🌷గుడిలో దేవుడికి కొబ్బరికాయ , అరటిపళ్ళు నైవేద్యం పెడతారు. ఈ కొబ్బరిని, అరటిపళ్ళని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి.
⛳తీర్థంలో పచ్చ కర్పూరం (Cinnamomum camphora) యాలుకలు (Cardamom) సాంబ్రాణి (సంబరేను చెట్టునుండి వచ్చే ధూపద్రవ్యం లేదా సాంబ్రాణి తైలము - benzoin), తులసి పత్రాలు (holy basil), లవంగాలు (Clove) మొదలైనవి కలుపుతారు. ఆయా పదార్థాలు అన్నీ ఔషధగుణాలు కలిగినవే. అలా గుడికి వెళ్ళినవారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆయురారోగ్యాలను ఇస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
💐ఇప్పుడు చాలామంది పాటించడంలేదు కానీ పూర్వం ఆలయానికి వెళ్ళేప్పుడు పురుషులు చొక్కా (షర్టు) లేకుండా వెళ్ళేవారు. దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు వేగంగా పురుషుల శరీరంలో ప్రవేశిస్తాయి. స్త్రీలు నిండుగా దుస్తులు వేసుకుని అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడటం మన సంప్రదాయం కనుక అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవారు.
🌄లోహానికి శక్తి తరంగాలను త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది. ఆవిధంగా స్త్రీపురుషులిద్దరికీ ప్రయోజనం కలుగుతుంది.
🎇భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతుంటుంది.
🙏 కర్పూరహారతి వెలిగిస్తారు. గంటలు మోగుతాయి.తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలూ సమీకృతమై భక్తులకు ఆనందం, ఆరోగ్యం లభిస్తాయి. మనలో దివ్య శక్తి ప్రవేశించి, తేజస్సు అనుభూతికొస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదు, ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి.🙏🙏
తదియ నోములు మరియ వినాయక చవితి పండుగల వివరణ

తేదీ :- 2. సెప్టెంబర్. 2019 రోజున తదియ తిధి ఉదయము
గం౹౹ 9:10 ని ల వరకు ఉన్నది.
తదుపరి *చవితి* తిధి వస్తున్నది.
కావున.......
తదియ నోములు
2 సెప్టెంబర్ 2019 సోమవారం నాడు ఉదయం గం౹౹ 6:02 ని ల నుండి ఉదయము గం౹౹ 9:10 ని ల లోపల *తదియ నోములు* పూర్తి చేసుకొన వలెను
( రాహు కాలం )
ఉదయం గం౹౹ 7:30ని ల నుండి గం౹౹ 9:00 ని ల వరకు ఉన్నది
*తదియ నోములకు రాహు కాలం పాటించడం అవసరం లేదు*
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
వినాయక చవితి పండుగ
2. సెప్టెంబర్ 2019 సోమవారం
ఉదయము గం౹౹ 9:11 ని ల నుండి మధ్యానము గం౹౹ 12:20ని ల వరకు, తిరిగి
గం౹౹ 1:15 ని ల నుండి
గం౹౹ 2:50 ని ల వరకు శుభం
చేసుకొనుట మహా శుభప్రదము.
*వినాయక చవితి సంధర్భంగా శుభ ముహూర్తములు*
2.సెప్టెంబర్. 2019 సోమవారం రోజు
అ) ఉదయం గం౹౹ 10 నుండి మధ్యానము గం౹౹ 2 వరకు శుభము
ఆ) సాయంత్రము మన వీధి గణపతి మంటపాల లో
3:38pm ని ల నుండి 9pm వరకు , తిరిగి 10pm నుండి 11pm వరకు కూడా శుభము.

*శుభమస్తు*
ధర్మ సూత్రధారీ హే మురారీ


‘కృష్ణస్తు భగవాన్‌ స్వయమ్‌’... కృష్ణుడే పరమతత్త్వం... చరమ లక్ష్యం... ఆయన గురించి చదవడం, చెప్పడం, పాడడం, వినడం... అన్నీ అపురూపమైన అనుభవాలే. ‘నీలో లేని చోద్యాలు ఈ ప్రపంచంలో ఏం ఉంటాయి?’ అని అక్రూరుడన్నా... ‘అటువైపు కృష్ణుడున్నాడు... ఇటువైపు ఎవరున్నారు’ అని సంజయుడు హెచ్చరించినా... అవన్నీ పరమాత్మ విరాట్‌రూపాన్ని విశదీకరించే ఉదాహరణలే... క్రియ, బోధ కలగలిసిన అద్భుత తత్త్వం ఆయనది... యుగావసరాలకు అన్వయించుకోదగ్గ మహాగాథ శ్రీకృష్ణుడిది.

భక్తుల కోర్కెలు తీర్చే క్రమంలో భగవంతుడు రెండు రకాల విధానాలను అనుసరిస్తాడు. సర్వం తానే స్వయంగా నిర్వహించి, తనపై మనకున్న నమ్మకాన్ని పెంచుకోవడం మొదటి పద్ధతి. మన ప్రయత్నంలో రహస్యంగా సహకరించి, మనపై మనకు నమ్మకాన్ని పెంచి విజేతలుగా తీర్చిదిద్దడం రెండో పద్ధతి. ఇందులో మొదటి దాన్ని దైవికం అని, రెండోదాన్ని పౌరుషం అని శాస్త్రం నిర్వచించింది. పరమాత్మ ప్రతి అవతారంలో ఏదో ఒకమార్గాన్నే ఎంచుకున్నాడు. కానీ కృష్ణావతారంలో మాత్రం రెండు విధాలుగానూ మనకు ఆయన దర్శనమిస్తాడు. దుష్టశిక్షణ, శిష్ట రక్షణల్లో భాగవతంలోని కృష్ణుడు ఎవరి సహాయాన్నీ కోరలేదు. స్వయంగా తానే అవతార లక్ష్యం దిశగా సాగిపోయాడు. భారతంలోని కృష్ణుడు మాత్రం రెండో పద్ధతి అనుసరించాడు. చేసిందంతా తానే అయినా ఘనతను మాత్రం పూర్తిగా పాండవుల పరం చేశాడు. వారిని విజేతలుగా నిలబెట్టాడు. భాగవత కృష్ణుడు విశేష రసజ్ఞ మనోజ్ఞ మూర్తి. భారత కృష్ణుడు అసాధారణ అలౌకిక ప్రజ్ఞానిధి. కృష్ణ కథలో ఈ రెండూ విభిన్న కోణాలు. ఈ రెండు రకాల పాత్రల స్వభావాలు విభిన్నమైనవి, అదే సయమంలో సర్వసమగ్రమైనవి.

అదే కృష్ణమాయ!
భాగవత కృష్ణుడి బాల్యచేష్టలు ముగ్ధమోహనాలు. అదే సమయంలో లోకకల్యాణాలు. పసిబాలుడు భయంకర రాక్షస మూకలను మట్టుబెట్టినప్పుడు జనం నివ్వెరపోవడం సహజం. అవతార పురుషుడిగా అనుమానించడం సాధారణం. అలాంటి వారిని చిలిపి చేష్టల ముసుగులో ముంచేసేవాడు. ఇది లోకం దృష్టికి సమ్మోహనకరంగా, అదే సమయంలో లోచూపునకు సంక్లిష్టభరితంగా కనిపించేది. గోపబాలురకు చెలికాడిగా, గోపికలకు వెన్నెల వేలుపుగా ఆటపాటలతో అలరించిన అపూర్వ ఘట్టాలను అనుశీలించేటప్పుడు మనం కూడా వారిలా మారిపోవడాన్నే కృష్ణమాయ అంటారు. రమణీయ రసానుభూతులు పంచడంతో పాటు రాక్షస సంహారం కూడా ఆయన చేశాడు. ఒక పురాణ పురుషుడి సర్వసమగ్ర వ్యక్తిత్వానికి ఇది గొప్ప ఉదాహరణ.

సుస్థిర పాలన కోసం...
భారత కృష్ణుడు ధీరోదాత్తుడు, రాజనీతిజ్ఞుడు, వ్యూహనిర్మాణ చతురుడు, స్ఫూర్తిప్రదాత, మహానేత. ఆయన అవతరించే సమయానికి లోకంలో పరిస్థితులు విషమంగా ఉన్నాయి. కంస, జరాసంధ, కాలయవన, నరక, శిశుపాల, దుర్యోధనాది స్వార్థ పరుల చేతుల్లో అధికారం, సంపద ఖైదీలయ్యాయి. ఇవన్నీ దుష్టుల చేతుల్లో ఉన్నప్పుడు సామాజిక పరిస్థితులు కూడా దయనీయంగా ఉంటాయి. ధర్మంలేని చోట భద్రత, నీతిలేని చోట మనశ్శాంతి ఉండవు. అలాంటి రాజుల చేతుల్లోనుంచి ప్రజలను రక్షించాలి. సువ్యవస్థను స్థాపించాలి. రాజ్యం చిన్నచిన్న ముక్కలుగా చీలిపోయి ఉంది. అరాచకం, అనైక్యత పెరిగిపోయాయి. ఆ దుస్థితిని, క్లిష్టతను పారదోలేందుకు కేంద్ర రాజ్య వ్యవస్థను ఊహించిన, నిర్దేశించిన అద్భుత రాజనీతిజ్ఞుడు శ్రీ కృష్ణుడు.ధర్మం తప్పిన రాజులందరినీ స్వయంగానో, పాండవుల చేతనో తుదముట్టించాడు. తాను రాజ్యాధికారం కోరుకోకుండా ధార్మిక చింతనాశీలురను పాలకులుగా ఎంచి, రూపొందించి సుపరిపాలనా కేంద్ర వ్యవస్థను నిర్మించాడు. ధర్మజుని నాయకునిగా తీర్చిదిద్దిన నాయక నిర్ణేత శ్రీకృష్ణుడు.

యుద్ధం కూడా యజ్ఞమే!
భగవద్గీత ఆవిర్భావం కూడా ఈ యుగావసరమే. అడవిలో ముక్కు మూసుకుని కూర్చున్న సర్వసంగపరిత్యాగి తన శిష్యులకు ఏకాంతంగా నూరిపోసిన ధర్మోపదేశం కాదిది.. పద్దెనిమిది అక్షౌహిణల మహాసైన్యం యుద్ధరంగంలో మోహరించి, కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్కంఠ స్థితి. తాత్కాలిక నిర్వేదానికి గురై ధర్మసంకటంలో పడిన మహాయోధుణ్ణి కార్మోన్ముఖుణ్ణి చేసేందుకు ప్రవచించిన ఉపదేశం. ఈ లోకానికంతటికీ వర్తించే ధీరవచనం. గీతాచార్యుడిగా శ్రీకృష్ణుడి వ్యక్తిత్వం శిఖరసమానమైంది. ఆయుధాన్ని పట్టనని ప్రకటించిన శ్రీకృష్ణుడు, భీమార్జునులను ఆయుధాలుగా మలుచుకుని కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని సాగించాడు. యుద్ధాన్ని క్రతువు అన్నాడు పరమాత్మ. క్రతువు అంటే యజ్ఞం. ‘న మమ’ అనుకోవడం యజ్ఞంలో ప్రధానాంశం. ‘నాది కాదు’ అని ఆ మాటకు అర్థం. ఏం చేసినా, ఏం పొందినా ‘న మమ’ అనే భావనతో ఉండడం యోగి లక్షణం. అహంకార, మమకారాలను ఆహుతి చేసే మహోన్నత పరిణిత త్యాగశీలతనే కృష్ణుడు కర్మయోగం పేరిట అర్జునుడికి బోధించాడు. అది ఎప్పటికీ, సర్వమానవాళికీ అనుసరణీయం.

.
..అప్పుడలా ఎందుకు చేశానంటే!

స్నేహితుడి కోసం గీతాసారం

కృష్ణా! ఓ మాట అడుగుతాను. నిజం చెబుతావా...? మనం ఆపదలో ఉన్నప్పుడు అడగకపోయినా వచ్చి మనకు సాయం చేసేవాడే స్నేహితుడని నువ్వే చెప్పావు కదా. మరి పాండవులు అన్ని కష్టాల్లో కూరుకుపోయినప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు చెబితే ధర్మరాజు జూదం ఆడేవాడు కాదు కదా? లేదా నువ్వే ధర్మరాజు పక్షాన ఆడి అతడిని గెలిపించవచ్చుకదా. మరి నువ్వెందుకు అలా చూస్తుండిపోయావు? అంటూ నేరుగా కృష్ణుడినే అడిగాడు ఉద్ధవుడు. మరొకరైతే కృష్ణుడిని ఈ ప్రశ్న అడగటానికి కూడా ధైర్యం చేసేవారు కాదు. కానీ, ఇక్కడ అడిగినవాడు ఉద్ధవుడు. కృష్ణుడికి పరమ ప్రాణమిత్రుడు. రూపంలో కూడా అచ్చం కృష్ణుడిలాగా ఉండేవాడు.ఎంతటి ప్రాణమిత్రుడంటే నిద్రలో కూడా కృష్ణుడి పేరునే కలవరించేవాడు. అంతటి మిత్రుడు అడిగేసరికి శ్రీకృష్ణుడు కూడా మొహమాటం లేకుండా సమాధానం చెప్పాడు. ఉద్ధవా! విజయం ఎప్పుడూ వివేకవంతుడినే వరిస్తుంది. దుర్యోధనుడు వివేకవంతుడు. అందుకు ఆటలో నైపుణ్యం ఉన్న శకునితో తన ఆట ఆడించాడు. ధర్మరాజు మాత్రం తానే ఆట ఆడాలని అనుకున్నాడు. పైగా నేను అటువైపు రాకూడదని కోరుకున్నాడు. అందుకే అతడు పిలిచేవరకు రాకూడదని నిశ్చయించుకున్నా. పిలిస్తే మాత్రం తప్పకుండా వెళ్లేవాడిని అన్నాడు. అంటే కృష్ణా! తీవ్రమైన ఆపదల్లో కూరుకుపోయి పిలిస్తే గానీ రావా అంటూ మరోప్రశ్న వేశాడు ఉద్ధవుడు. మిత్రమా! జీవితంలో ప్రతిదీ కర్మానుసారమే జరుగుతుంది. నేను పక్కన ఉండి చూస్తుంటాను కానీ కర్మను మార్చలేను అన్నాడు కృష్ణుడు. అదేంటి కృష్ణా! నీ భక్తుల పక్కనే ఉంటూ వారు ఆపదలో ఉంటే చూస్తూ ఊరుకుంటావా? అన్యాయం కదూ అన్నాడు ఉద్ధవుడు. కృష్ణుడు నవ్వుతూ... మిత్రమా! నేను పక్కన ఉన్నాననే భావన ఉంటే అసలు తప్పే చెయ్యరు కదా భక్తులు అన్నాడు. తత్త్వం బోధపడింది ఉద్ధవుడికి. ఇంకా ఎన్నో సందేహాలు అడిగాడు. అన్నిటికీ తృప్తిగా సమాధానాలు చెప్పాడు పరమాత్మ. అవతార పరిసమాప్తి కాలంలో ఉద్ధవుడి పేరు మీద లోకం తన మీద వేసే నిందలు, వేసే ప్రశ్నలన్నింటికీ పరమాత్మ సమాధానం చెప్పాడు. ఈ సమాధానాల సమాహారమే ‘ఉద్ధవగీత’గా ప్రసిద్ధిపొందింది.
Audio
Lalanuchu Noocheru లాలనుచు నూచేరు | Beautiful Sleep song of Lord Krishna | Annamacharya Keerthana
Audio
ONE HOUR #OM #CHANTING HEALING AMAZING MEDITATION
God's of Hindu
Let's See Different Images of God Everyday and fill our Heart with the Image of Almighty
https://t.me/GodsofHindu
Anjaneya Suprabhatam || Sri Ramanjaneya || Chalisa || Stuthi ||…
MyBhaktitv
ఆంజనేయ సుప్రభాతం
#hanuman Suprabhatam
#anjaneya
జీవితంలో చీకటి వెలుగులు

జీవితంలో కొందరికి ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. చాలాసార్లు సవాళ్లను ఎదుర్కోలేక ఓడిపోయి అన్యమనస్కంగా జీవిస్తుంటారు. మనసులో ధైర్యం ఉండదు. దేహంలో శక్తి తగ్గినట్లు నీరసపడి పోతారు.

ఓటమి నుంచి జయానికి దారి చూపేదే ఆశ. చీకటి నుంచి వెలుగులోకి రావాలంటే నమ్మకం, విశ్వాసం, సంకల్పం ఉండాలి. వీటికోసం వెతకాలి. మనిషన్నాక వ్యాధులు రావచ్చు. ఆర్థిక సమస్యలు సతమతం చేయవచ్చు. సమాజంలో గౌరవ భంగం కలగవచ్చు. కొన్నిసార్లు బతుకులో చీకటి కోణాలు భయానికి కారణమవుతాయి. ఈ చీకట్లను చూసి అంధత్వం కొనితెచ్చుకోకూడదు. ఇక నావల్ల కాదు, నా పరిధిలో లేదు అని వ్యాకులతకు గురికావడం సాధకుడి బలహీనతే!
సాఫల్యం, విజయం గురించిన ఆలోచనలే మనసులో కదలాడుతూ ఉండాలి. నిరాశావాది ఏదీ సాధించలేడు సరికదా...ఇతరులను సైతం నిరాశకు గురిచేస్తాడు. సమస్యలను, కష్టనష్టాలను పరిశీలించాలి. ప్రశ్నించుకొంటే సమాధానం లభిస్తుంది. ఎందుకంటే, ప్రతి ప్రశ్నకూ సమాధానం ఉంటుంది. జీవితమే సమస్యల సమాహారం. మనిషి బతుకు వడ్డించిన విస్తరి కాదు.

మనిషి జీవితమే బాధలమయం. అతడి సమస్యలకు పరిష్కారం ఏమిటన్నది ప్రశ్న. పిప్పలాదుడు ఈ ప్రశ్నకు బదులిస్తూ- మనిషి సాధనకు సహాయపడటానికి పంచేంద్రియాలు, కాళ్ళూచేతులు, శక్తిని ప్రకృతి ఇచ్చింది. వీటి సహాయంతో మానవుడు పరిష్కరించుకోలేని సమస్యే లేదు. మనకు ఇన్ని వనరులున్నా ఎవరో వచ్చి ఏదో చేసి కష్టాలనుంచి గట్టెక్కిస్తారనుకోవడం సరైనది కాదు. భగవద్గీతలో అర్జునుణ్ని విషాదయోగం నుంచి శ్రీకృష్ణుడు స్పష్టమైన, సూటి మాటలతో వెలుపలికి తీసుకొచ్చి కర్తవ్య సాధనకు సన్నద్ధం చేశాడు. అజ్ఞానమనే చీకట్లను దూరం చేసి తేజోవంతుణ్ని చేశాడు. చివరకు విజయం పాండవులనే వరించింది. నిస్పృహతో ధనుర్బాణాలు కింద పడేసిన అర్జునుడే కడకు విజయుడయ్యాడు.

జ్ఞానం, ధైర్యం ఉన్నచోట అపజయం ఉండదు. మనిషి జీవితం చీకట్లో మగ్గుతోందంటే మనసులో ఆశల వెలుగులు నింపుకోవడానికి ప్రయత్నించాలి. జీవితాన్ని కాంతిమయం చేసుకోవాలి. మనిషి మౌలికంగా ఆశాజీవి. మనమే వెలుగు. మన ఆత్మ గొప్ప జ్యోతి. ప్రకృతితో మనిషి మమేకం కాగలిగితే కాంతి అతణ్ని అంటిపెట్టుకునే ఉంటుంది. చీకటి మనిషి దరి చేరదు. చీకటి లేని జీవితంలో అంతా మంచే. ప్రతి మనిషి ఆత్మలో వెలుగు పుంజాలు ఉంటాయి. మనం భౌతిక ప్రపంచంలోని చీకట్లను, భ్రమలను విడిచి ఆత్మావలోకనం చేసుకొంటే వెలుగులు జీవితంలోకి విరజిమ్ముతాయి. ఆలోచన, మననం సాధన చేయగలిగితే మన కంటికి ఆ వెలుగు రేఖలు ప్రస్ఫుటమవుతాయి. అవమానం, అప్రతిష్ఠ, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులన్నీ చీకటి కోణాలే! జీవితంలో ఇవన్నీ ఆకాశంలో సాగిపోతున్న మేఘాల్లాంటివే. అవి తొలగిపోయాయా... అంతా వెలుగే! చీకటి వెనకే వెలుగు వస్తుంది. కాళరాత్రి గడిచి వేకువ అయ్యిందంటే వెలుగు కిరణాలు జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. కాంతి శాశ్వతమైంది. అంధకారం అనిత్యమైంది. సూర్యుణ్ని మేఘం కమ్ముకున్నంత మాత్రాన వెలుగు జాలువారక మానదు. కష్టాలు కలకాలం నిలువవని అంటారు. అన్వేషణ, నేర్పు వికసించగానే ఆనందం, సుఖం అందివస్తాయి. ఈ సత్యం తెలుసుకొంటే చాలు... బతుకు బాట వెలుగుల తోట!
ఇచ్ఛ

ఇచ్ఛ మనిషికి ప్రకృతి ప్రసాదించిన దివ్యశక్తి. కోరిక, వాంఛ, ఆశ, తపన, వ్యామోహం... ఇవన్నీ ఈ శక్తి నుంచే పుడతాయి. బంధమోక్షాలు రెండింటికీ ఇదే కారణం. దుఃఖానికి, ఆనందానికి ఇదే మూలం. ఇదే స్థితప్రజ్ఞతను అందిస్తుంది, పతనాన్నీ శాసిస్తుంది. అందుకే శాస్త్రాలన్నీ దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతాయి. మనిషి జీవన ప్రయాణానికి ఇచ్ఛ తెరచాప వంటిది. దీన్ని ఎక్కడ ఎలా దించాలో, ఎప్పుడు ఎలా పైకెత్తాలో తెలిస్తే జీవన ప్రయాణం ఆనందంగా సాగుతుంది.

సృష్టిలో ఏ ఇచ్ఛా లేని మనిషి ఉండడు. ఉన్నా జీవించలేడు. జీవించాలన్నదీ ఒక ఇచ్ఛే. అలాగే ఇచ్ఛ లేని దేవతా లేదు. పరమాత్మ ప్రతి అవతారం వెనక ఒక ఇచ్ఛ దాగి ఉంది. దుష్ట సంహరణేచ్ఛతో దుర్గ అవతరించింది. ధర్మాన్ని ఆచరించి చూపేందుకు శ్రీరాముడు అవతరించాడు. సృజించాలని బ్రహ్మ, పాలించాలని విష్ణువు, లయించాలని రుద్రుడు ఇచ్ఛ కలిగి ఉన్నారు.

ఇచ్ఛే లేకపోతే సృష్టి ఉనికే లేదు. సృష్టి చేయాలనే ఈశ్వరేచ్ఛ నుంచే సకల జగత్తు ఉద్భవించింది. ఆయన ఇచ్ఛానుసారమే నడుస్తోంది. ఆయన ఇచ్ఛాశక్తి నుంచి పుట్టిన మనిషీ ఆ శక్తిని పూర్ణంగా పొందాడు. స్వేచ్ఛా (స్వ+ఇచ్ఛ) జీవి అయ్యాడు. తన ఇచ్ఛానుసారం జీవించగలుగుతున్నాడు. తన జీవనమార్గాన్ని తానే ఎంచుకోగలుగుతున్నాడు. ప్రకృతి మనిషికి శ్రేయస్సు, ప్రేయస్సు అనే రెండు మార్గాలను చూపింది. ఏ మార్గంలో నడవాలో ఎంచుకునే స్వేచ్ఛనూ ఇచ్చింది. ఏ మార్గంలో నడిస్తే, ఏ ఫలితాలుంటాయో తెలుసుకునే బుద్ధి కుశలతనూ ఇచ్చింది. తనకు ఏది ఉచితమో గ్రహించి ఆ మార్గంలో అడుగిడితే, తన ఇచ్ఛాశక్తి మనిషికి ఆ మార్గంలో తోడవుతుంది.

ప్రేయోమార్గంలో నడిస్తే ఇంద్రియ సుఖాలే పరమావధి అవుతాయి. అంతులేని కోరికలతో, అంతంలేని ఆశలతో ఇది నిండి ఉంటుంది. జీవించి ఉన్నంత కాలం, మరణంలోనూ కోరికలు మనిషిని వెంటాడతాయి.

ఇంద్రియ సుఖాల పరిధిని గ్రహించిన వ్యక్తి మాత్రమే ఆదర్శ జీవితాన్ని కోరతాడు. శ్రేయోమార్గంలో నడుస్తాడు. మనిషికి, జంతువుకు తేడాను పరిశీలిస్తాడు. మనిషి జన్మ ఎత్తింది ఇష్టానుసారం జీవించడానికి కాదు. ఉన్నతమైన ఆదర్శాలకోసం అని గ్రహిస్తాడు. దీనికి అనువైన ఇచ్ఛాప్రవృత్తిని అలవరచుకుంటాడు.

కోరికలను జయించడం మనిషికి అంత సులభం కాదు. దీనికి అభ్యాసం కావాలి. ఏ ఘనకార్యమైనా, ప్రతిఘటన లేకుండా సాగదు. దైవాన్ని, సంఘాన్ని, ఆదర్శాలను అంటిపెట్టుకున్న మనసు అన్ని అవరోధాలను అధిగమిస్తుంది. సన్మార్గాన్ని బోధించే మిత్రబృందాన్ని ఏర్పరచుకొని సత్సాంగత్యం చేయాలి. ధర్మం, దైవం అనే దివ్యాయుధాలతో దుర్భేద్యమైన ఇంద్రియ వ్యామోహాలను మనిషి జయించగలడనే వేద వాక్కును ఆచరణలో పెట్టాలి. ధర్మాన్ని ఆదర్శంగా తీసుకుని ఆచరించాలి. దైవాన్ని దైవంగానే భావించాలి తప్ప కోరికలు తీర్చే ఇంద్రజాలంగా భావించరాదు. దైవానికి భక్తుడికి మధ్య కోరిక అనే తెరను తొలగించాలి. ఏ పని దైవానికి దగ్గర చేస్తుందో దానిపైన కోరిక ఉంచాలి. ఈ కోరిక నన్ను పరమాత్మ ముందు దోషిగా నిలబెడుతుందని భావిస్తే వెంటనే ఆ కోరికను వదిలిపెట్టేయాలి.

ఈ భక్తితత్వం మనిషిలో సత్వగుణాధిక్యత పెంచుతుంది. సత్వగుణం పెరిగేకొద్దీ ఆశావ్యామోహాలతో నిండిన రజోగుణం, ఇంద్రియ వాంఛలతో నిండిన తమోగుణం క్రమంగా క్షీణిస్తాయి. సత్వగుణమంతా దివ్యత్వంతో నిండిఉంది. దీనినుంచి పుట్టిన ప్రతీ ఇచ్ఛ, దైవేచ్ఛ అవుతుంది. ఇచ్ఛను జయించాలి. ముక్తి పొందాలి అనే కోరిక కోరిక కాదు. నిస్వార్థపు కోరికా కోరిక కాదు. ఇవి మనిషిని బంధించవు, బాధించవు. ఉన్నతిని మాత్రం ప్రసాదిస్తాయి.

https://t.me/devotional
Devotional songs
అన్నమాచార్య సంకీర్తనలు మరియు దైవ కీర్తనలు
https://t.me/DevotionalAudio
Audio
Ekadantaya Vakratundaya Shankar Mahadevan
ఏకదంతాయ వక్రతుండాయ
వినాయకుడు

తెల్లని వస్త్రాలు ధరించినవాడూ, అంతటా వ్యాపించియున్నవాడూ, చంద్రునిలా తెల్లనైన శరీరవర్ణం గలవాడూ, నాలుగు చేతులు గలవాడూ, అనుగ్రహదృష్టితోడి ముఖంగలవాడూ అయిన వానిని (వినాయకుని) అన్ని అడ్డంకులు నివారించుటకై ధ్యానించవలెను

అగజానన పద్మార్కం గజాననమ్‌ అహర్నిశంఅనేకదమ్‌ తమ్‌ భక్తానాం ఏకదంతమ్‌ ఉపాస్మహే

శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోప శాంతయే

(అగజ) పార్వతి ముఖపద్మమును వెలిగించువాడు, ఏనుగు ముఖము గలవాడు, అన్నివేళలా ఎన్నోవిధములైసంపదలను తన భక్తులకు ఇచ్చువాడు అయిన ఏకదంతుని స్మరిస్తున్నాను.

ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమంజ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శ్రుణ్వన్నూతిభిః సీద సాధనం

హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి (గణనాయకుడు, గణపతి, గణేశుడు). అన్ని అడ్డంకులు తొలగించు వాడు (విఘ్నేశ్వరుడు), అన్నికార్యములకూ, పూజలకూ ప్రథమముగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు. హిందూ సంప్రదాయములో శైవములో మాత్రమే వినాయకుని, వైష్ణవములో మాత్రము విష్వక్సేన ని పూజిస్తారు. అన్ని ప్రాంతములంలో, అన్ని ఆచారములంలో వినాయకుని ప్రార్థన, పూజ సామాన్యము. తెలుగువారి పండుగలలో వినాయకచవితి ముఖ్యమైన పండుగ. పంచాయతనపూజా విధానంలో వినాయకుని పూజకూడా ఒకటి (వినాయకుడు, శివుడు, శక్తి, విష్ణువు, సూర్యుడు - వీరి పూజా సంప్రదాయాలు పంచాయతన విధానములు)

వినాయకుడు శివపార్వతుల పెద్దకొడుకు (కుమారస్వామి వారి రెండవ కొడుకు). వినాయకుని ఆకారం హిందూమతంలో విశిష్టమైనది. ఏనుగు ముఖము, పెద్ద బొజ్జ, పెద్ద చెవులు, ఒకే దంతము, ఎలుక వాహనము, పొట్టకు పాము కట్టు, నాలుగు చేతులు - ఒక చేత పాశము, మరొకచేత అంకుశం, ఒక చేత ఘంటము లేదా లడ్డూ, మరొక అభయహస్తము - ఇది నమ్మినవారికి సర్వ మంగళ ప్రథము. హిందూ సంప్రదాయముతో పరిచయము లేనివారికి ఆశ్చర్యకరము.

Contd...