తోబుట్టువు కోసం
ఈనెల 15న రాఖీ పున్నమి
ఒకనాడు కోసల రాజు ప్రసేనజిత్తు రాజమందిరంలో దొంగతనం జరిగింది. ముగ్గురు దొంగలు పారిపోతూ భటుల కంటపడ్డారు. భటులు వారి వెంటపడ్డారు. దొంగలు నగరం దాటి పొలాల దారి పట్టారు. ఆ పొలాల చివర అడవి ఉంది. వారు చాలా వేగంగా పరుగులు తీసి అడవిలోకి పారిపోయారు. ఆ వెనుకే వెంబడించి వస్తున్న భటులకు, అడవి మొదట్లో తమ పొలంలో పని చేసుకుంటున్న ముగ్గురు రైతులు కనిపించారు.
భటులు వారి దగ్గర ఆగి ‘‘ఓరి దొంగ వెధవల్లారా! రాజమందిరంలో దూరి, దొంగతనం చేసి, పారిపోయి ఇటుగా వచ్చారు. దొంగిలించిన సొమ్ము దాచేసి, రైతుల్లా వేషం మార్చి ఇలా నటిస్తున్నారా! ఎక్కడరా దొంగిలించిన సొమ్ము?’’ అని నిలదీశారు, గద్దించారు.
‘‘మాకు ఆ దొంగతనంతో సంబంధం లేదు. మేము పక్కఊరి రైతులం. ఉదయం నుంచి ఇక్కడే పని చేసుకుంటున్నాం’’ అని వారు మొత్తుకున్నారు.
అయినా భటులు వారి మాటలు నమ్మలేదు. ముగ్గురినీ బంధించి, రాజుగారి దగ్గరకు లాక్కుపోయారు.
‘‘వీరు ముగ్గురినీ ఉరితీయండి!’’ అంటూ మరణదండన విధించాడు రాజు.
ఈ విషయం తెలిసి, ఆ ఇంటి ఇల్లాలు బుద్ధుని దగ్గరకు వెళ్ళి, విషయం చెప్పింది. ఆమె బుద్ధ సేవిక. ఉపాసిక. ఆమెకు బుద్ధుడు ధైర్యం చెప్పాడు.
‘‘ఉపాసికా! రేపు ఉదయం నీవే రాజు కొలువుకు వెళ్ళు. నీ ప్రజ్ఞే నిన్ను కాపాడుతుంది’’ అని చెప్పి పంపించాడు.
మరునాడు ఆమె రాజాస్థానానికి బోరున ఏడుస్తూ వెళ్ళింది.
‘‘ఎందుకమ్మా, అలా ఏడుస్తావు? నీ దుఃఖానికి కారకులు ఎవరు?’’ అని రాజు అడిగాడు. ఆమె మౌనం వహించింది.
‘‘నీకేం కావాలి?’’ అని అడిగాడు రాజు.
‘‘రాజా! నాకు కప్పుకోవడానికి వస్త్రాన్ని ప్రసాదించండి’’ అని అంది.
‘‘ఓ...! అంతేనా! నీకు విలువైన వస్త్రాన్ని ఇస్తాను’’ అన్నాడు చిరునవ్వుతో.
‘‘రాజా! మీకు ధర్మం తెలియనిది కాదు. భార్యకు భర్తే వస్త్రం. భర్తకు భార్యే వస్త్రం. కాబట్టి నా భర్తను నాకు ప్రసాదించండి.’’
ఆమె మాటలకు రాజు ఆశ్చర్యపడ్డాడు. ‘‘ఎవరమ్మా నీ భర్త?’’ అని అడిగాడు.
‘‘మహారాజా! తమరు మరణదండన విధించిన ముగ్గురిలో ఒకరు నా భర్త. ఇంకొకరు నా బిడ్డ. మరొకరు నా సోదరుడు. వారు ముగ్గురూ నిరపరాధులు’’ అంది.
‘‘వారు అపరాధులా, నిరపరాధులా అని తేల్చాల్సింది నువ్వు కాదు, మేము. అయితే... ముందు నువ్వు ఈ విషయం తేల్చుకో. ఆ ముగ్గురిలో ఒకరిని మాత్రమే విడిచిపెట్టగలను. వారిలో నీకు ఎవరు కావాలో తేల్చుకో!’’ అని అన్నాడు రాజు.
‘‘మహారాజా! భర్త పోతే మరో వ్యక్తిని భర్తగా పొందగలను. అతని ద్వారా బిడ్డల్ని కూడా పొందగలను. కానీ, ఇప్పుడు నా తల్లితండ్రులు లేరు. వారు మరణించారు. కాబట్టి ఎప్పటికీ నా తోబుట్టువును పొందలేను. కాబట్టి నాకు సోదరుణ్ణే ఇవ్వండి!’’ అంది.
రాజు సింహాసనం నుంచి లేచాడు. ఆనందంతో చప్పట్లు కొట్టాడు. సభ మొత్తం హర్షధ్వానాలతో మారుమోగింది.
‘‘తల్లీ! నీలాంటి ప్రాజ్ఞాని నా రాజ్యంలో ఉన్నందుకు గర్విస్తున్నాను. ఒక్కరిని కాదు, ముగ్గురినీ ఇచ్చేస్తాను. అన్నాచెల్లెళ్ళ బంధాన్ని అజరామరం చేశావు’’ అంటూ అభినందించాడు రాజు.
తోబుట్టువుల బంధాన్ని అతి శ్రేష్ఠంగా, ఎంతో నిర్మలంగా బౌద్ధులు భావించేవారు. భిక్షువులకు సమాజంలోని స్త్రీలందరూ తోబుట్టువులే. శ్రావణ పౌర్ణమి నుంచి భిక్షువులు వర్షావాస దీక్ష చేపట్టేవారు. శ్రావణ, భాద్రపద, కార్తీక మాసాలు మూడు నెలలూ గ్రామాల వెంట భిక్షకు వెళ్ళకూడదు. ఆరామంలోనో, అడవుల్లోనో భిక్షువులు గడపాలి. ‘వర్షాకాలం భిక్ష పేరుతో జనం మీద భారం మోపకూడదు’ అనేది నియమం. అయితే, గృహస్థులు తమకు తాముగా వెళ్ళి, భిక్షను అందించవచ్చు. అలా చాలామంది గృహిణులు భిక్ష తీసుకొని వెళ్ళేవారు. ‘అరణ్యవాసంలో ఉన్నా నీ తోబుట్టువుగా ఆహారం అందించే బాధ్యత మాది’ అని స్త్రీలు తమ బాధ్యతకు గుర్తుగా భిక్షువుల చేతికి ఎర్రటి తాళ్ళు కట్టేవారు. ఆ తాళ్ళు తోబుట్టువుకు గుర్తు.
అలా ఆ సంప్రదాయం రక్షాబంధనంగా అనంతర కాలంలో వాడుకలోకి వచ్చింది. ఇప్పటికీ టిబెట్, బర్మా, చైనా, మంగోలియా దేశాల్లో ఈ రక్షాబంధనం బౌద్ధుల సంప్రదాయంగా కొనసాగుతోంది.
https://t.me/devotional

Telegram
Devotional Telugu
An attempt to bring our Hindu Devotional information
విజయోత్సవం
అపజయాల్ని పట్టించుకోవద్దు. అవి అత్యంత సహజం. ఒక్కోసారి అపజయాలే జీవితానికి అందాన్ని ఇస్తాయి. అవి లేకుండా జీవితంలో ఏమీలేదు. పోరాటాలు లేని జీవితం అసలు జీవించదగినదే కాదు. జీవితంలో నవరసాలు ఉంటాయి. బాధలే కీలకం. ఏ విజయచరిత్రలోనూ అపజయం పాత్ర లేకుండా పోదు. అపజయాల స్తంభాలమీద విజయభవనం నిలిచి ఉంటుంది.
ఎన్నో అపజయాలను చూసి, పనిలోనే విశ్రాంతి పొందుతూ ప్రయోగశాలలోనే నిద్రపోయిన థామస్ ఆల్వా ఎడిసన్ చివరకు లోకాన్ని వెలుగులతో నింపాడు. పనికిరాదనుకున్న నాచు పెన్సిలిన్గా మారి లోకరక్షకురాలవుతుందని ఫ్లెమింగ్ కలగనలేదు. విజేతలందరి చేతుల్లో విజయాలు మాత్రమే రేఖలుగా గీసిలేవు. అపజయాల అష్టవంకరలు ఎన్నో ఉన్నాయి. వాళ్లు చేతుల్నికాక చేతల్ని నమ్మారు. జీవనగతిని మార్చుకున్నారు. విధిని ఎదిరించారు.
ప్రయత్నించకపోవడమే పెద్ద లోపం. రింగులోలేని ఆటగాడు ఎన్నడైనా గెలిచాడా? మనసులో విజయాన్ని స్పష్టంగా చూడనివాడు జయకేతనం ఎగురవెయ్యలేడు. గెలుపు తర్ఫీదు పొందినవాడు మొదట మనసును జయిస్తాడు. ఆ తరవాత ప్రత్యర్థులను జయిస్తాడు. అర్జునుడికి ఈ స్పష్టత ఇవ్వడానికే శ్రీకృష్ణుడు సర్వప్రయత్నాలూ చేశాడు. విజయం సాధించాడు!
వదలొద్దు. వదిలితే గెలవలేవు. వదిలితే విజయం నీది కాదు. వదిలినవాడు ఎన్నటికీ గెలవలేడు. పట్టి విడవరాదు. పట్టి విడుచుట కంటే పడిచచ్చుట మేలు అన్నాడు బమ్మెర పోతన. తన ప్రయోజనం కోసం రావణాసురుడు కూడా పట్టుదలతో వెయ్యి సంవత్సరాలు తపస్సుచేసి శివుణ్ని మెప్పించాడు. మహా శివభక్తుడని అనిపించుకున్నాడు. కైలాసాన్ని కదిలించాడు. విజయం సాధించాడు. ‘గెలవాలని అనుకోకపోతే అది నీ ఇష్టం, అనుకుంటే గెలుస్తావు... నువ్వు ఏదంటే అది జరుగుతుంది’ అన్నాడు హెన్రీ ఫోర్డ్. సంకల్ప బలానికి మించింది లేదని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.
అపజయాన్ని అసలు నమ్మకు. విజయానికి మారురూపమైన నన్ను నమ్ము అని చెప్పకనే చెప్పాడు శ్రీకృష్ణుడు. బలహీనుడిగా మారిపోతున్నవాడిని మహాబలవంతుడిగా చేశాడు. అప్పుడు విజయం అంటే ఏమిటో, వీరస్వర్గం అంటే ఏమిటో, మరణ రహస్యం ఏమిటో, దాని కీలకం ఏమిటో క్షుణ్నంగా తెలుసుకున్నాడు అర్జునుడు.
అడ్డులు, అవరోధాలు లేని ప్రయాణం బ్రహ్మపుత్రుడికైనా లభించదు. సీతాన్వేషణలో భగవంతుడైన శ్రీరాముడు లంకను దాటడానికి సముద్రుణ్ని ప్రార్థించవలసి వచ్చింది. మహా శక్తిమంతురాలు, జగజ్జనని అయిన సీతమ్మ అశోకవనంలో కాలం గడపవలసి వచ్చింది. అపజయానికి వ్యతిరేక పదమైన హనుమంతుడు లంకలో సవాలక్ష చిక్కుల్ని ఎదుర్కోవలసి వచ్చింది.
బంగారుపళ్లెంలో పెట్టి, ఎర్ర తివాచి పరచి, మన ముందుకు తీసుకువచ్చి విజయాన్ని ఎవరూ వినయంగా నిలబడి ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా అది విజయం కాదు. అది ఒక భ్రమ అయి ఉంటుంది. నిజమైన విజయాన్వేషి దాన్ని తెలుసుకోవాలి. విజయానికి సూత్రాలు, సిద్ధాంతాలు ఉన్నా అది పూలబాట కాదు. రహదారి అసలు కానేకాదు.
రథం కురుక్షేత్రం మధ్యలోకి నడిపించకుండా ఇంటి దగ్గర అర్జునుడికి ఎన్ని బోధలు చేసినా విజేత కాలేడు. ఎదురు వెళ్లాలి. రణరంగంలోకి దూకాలి. ఎదుర్కోవాలి. అపజయాలు ఎదురొచ్చినా స్వీకరించడానికి సిద్ధపడాలి. విషాద భారాన్ని మోయాలి. మానసిక ఆటుపోట్లకు కుంగిపోకూడదు. విజయం రాసిపెట్టి ఉన్నా, దాని కోసం పడాల్సిన కష్టం కూడా రాసిపెట్టి ఉంటుందని మరిచిపోకూడదు.
భూమ్మీదకు మనిషి వచ్చింది విజయోత్సవాలు చేసుకుంటూ బతకడానికి. సత్యం తెలుసుకొని కీర్తి పొందడానికి. ఏం కావాలో స్పష్టంగా తెలిసిన తరవాత మన అడుగులు విజయంవైపే పడతాయి!
భరతవాక్యం
నాటకం చరమాంకానికి చేరాక, తెరపడుతుంది. అంతవరకు ఓపికతో నాటకాన్ని తిలకించిన ప్రేక్షకులకు, శుభం కలగాలని కోరుతూ వారికి వీడ్కోలు పలకడం ఆనవాయితీ. ప్రేక్షకుల ఆనందానికి అంతరాయం రాకూడదన్న ఉద్దేశంతో కావ్యపఠనానికి ఫలశ్రుతి చెప్పినట్లు, అప్పట్లో భరతవాక్యం వినిపించేవారు ప్రదర్శకులు. జీవితమే ఒక నాటకరంగం అన్నాడు మహాకవి షేక్స్పియర్. కాని, అది విషాదాంతం కాకూడదన్నదే భారతీయ సంప్రదాయం. ప్రపంచమనే నాటకరంగం చాలా విశాలమైనది. రాజు, పేద అన్న తేడా ఉండదు. జీవిత పరమార్థం తెలిసినవాడు రాజు; అది తెలుసుకోలేక ఎండమావి వెంట లేడిలా పరుగెత్తేవాడు కడుపేద.
భగవద్గీతలో ప్రథమ అధ్యాయం చివర ఒక వాక్యం కనిపిస్తుంది. అది చదివేవారు, చదివి అర్థంచేసుకునేవారు అరుదుగా ఉంటారు. చలనచిత్రం అయ్యాక హాలీవుడ్ సంప్రదాయం- అందులోని పాత్రలను, దర్శక నిర్మాతల పేర్లను, మిగతా సాంకేతిక వర్గీయులను ప్రకటించడం. అది చాలామంది ప్రేక్షకులు పట్టించుకోకపోవడం సహజమే.
అలా కాకుండా- భగవద్గీతలోని ఈ చరమశ్లోకం తప్పక చదవాలి, అర్థం చేసుకోవాలి. లేకపోతే అధ్యయనం అసంపూర్ణం అవుతుంది. అందులో మనం తెలుసుకోవలసిన విషయాలు, అద్భుతమైన రహస్యాలు ఉన్నాయి. అసలు భగవద్గీత మహాభారతంలో ఒక భాగమేనా అన్న అనుమానం కలుగుతుంది. బహుశా, కాలాంతరాన ఏదో కారణాంతరంవల్ల అందులో చేర్చిఉండవచ్చునేమో అనిపిస్తుంది.
భగవద్గీతను గీతోపనిషత్తు అనడం కద్దు. గీతలోని ప్రతి శ్లోకం ఒక్కో ఉపనిషత్తుతో సమానం. దేనికదే స్వయంసంపూర్ణం. ఒక్క శ్లోకం (ఏకశ్లోకి) చదివినా, పరిపూర్ణమైన ఫలితం ఇచ్చే కల్పవృక్షం. బ్రహ్మవిద్య, యోగవిద్య, గంగా యమునలవలె జ్ఞాన, కర్మమార్గాలు కలిపి బోధించే చేతిపుస్తకం. భక్తిలో రసీభవింపజేసి, ముక్తిశిఖరం చేర్చగల కరదీపం.
రథికుడికి, సారథికి మధ్య వివాదంగా మొదలై, కృష్ణార్జున సంవాదమై, పామరుల పాలిట ప్రబోధ గీతమై అనునిత్యం అలరించే నిత్యపారాయణ గ్రంథమది. శ్యామసుందరుడైన కృష్ణుడు, శ్వేతవాహనుడైన అర్జునుడికి గీత బోధించటంలో ఒక అంతరార్థం ఉంది. నలుపు-తెలుపుల అంతరంగ నాటకం ఇది. లౌకిక జీవనం తెలుపు అనుకుని మోసపోతున్నాం. ఆధ్యాత్మిక జీవితం చీకటిగా ఊహించుకుని భయపడుతున్నాం. చీకటి కడుపులో వెలుతురు ఉన్నదన్న విషయాన్ని విస్మరిస్తున్నాం.
‘భోగికి పగలు- యోగికి రాత్రి
యోగికి రాత్రి- భోగికి పగలు’
అన్న గీతావాక్యం ప్రత్యక్ష ప్రమాణం. నిజంగా, అర్జున విషాదయోగం పగటిపూట చీకటి లాంటి ఒక మోహాంధకారం. ఒక యోధుడు విషాదాన్ని, సంశయాన్ని, శోకాన్ని, పిరికితనాన్ని తరిమికొట్టే ప్రణాళికకు పీఠిక. అర్జునుడు ఊహించుకుంటున్న వియోగ బాధకు పరమ ఔషధం లాంటి యోగవిద్య రెండో అధ్యాయం 11వ శ్లోకంతో మొదలవుతుంది.
గీత దుర్యోధనుడి విషాదంతో మొదలవుతుంది. ‘ఎలా గెలవడం?’ అని అతడు ఒకవైపు ఏడుస్తుంటే,
‘ఎలా చంపటం?’ అని అర్జునుడు మరోవైపు కన్నీరు మున్నీరవుతున్నాడు. అజ్ఞానపు తెరతీయగానే కర్తవ్యం గుర్తుకువచ్చింది. కర్తవ్యపాలన అర్జునుడి పాలిట యోగంగా మొదలైంది. అది దుర్యోధనుడి పాలిట దుర్యోగంగా పరిణమించింది. అర్జునుడి విషాదం రసార్ద్రం; దుర్యోధనుడిది రసాభాసం.

ఒక పెద్ద కొండ,
అందులో ఒక గుహ,
అనంతపురం జిల్లా,సింగనమల, మండలం,తరిమేల, ఆనందరావు పేట, గుమ్మేపల్లి కి అతి దగ్గరలో,గంప్పమళ్ళయ కొండలో దేవాలయం ఉంది.
ఇక్కడ ఏమిటి ప్రత్యేకత అంటే,
ఇక్కడ కొండపైన నూనె దీపాలు,
వెలిగించి ఉంటారు.అందులో
పోసిన చమురు ధారలుగా,
కొండపైనుంచి రాతి బండలు,
మీదగా కిందకు నూనె పడివుంటుంది.
కాలు గారి కిందపడతె అంతే,
గంప్పమళ్లయ్య స్వామి పూజరిగారు,
ఒక చేతితో, గంట,మరో చేతితో,
హారతి,కొబ్బరి కాయలు తీసుకుని,
కొండ పైనుంచి చమురు ధారలుగా,
ఉన్న రాతి పై నుంచి కిందన,
ఉన్న గుహలో లోకి వెళ్లి,
గంప్పమళ్లయ్య స్వామి వారికి,
కొబ్బరికాయ కొట్టి,మంగలహారతి,
ఇచ్చి తిరిగి కొండ పైకి రావడం,
🙏🏻🙏🏻🙏🏻

ఋణ విమోచన గణేశ స్తోత్రం
అస్య శ్రీ ఋణహర్తృ గణపతి స్తోత్ర మంత్రస్య | సదాశివ ఋషిః | అనుష్టుప్ ఛందః | శ్రీ ఋణహర్తృ గణపతి దేవతా | గౌం బీజం | గం శక్తిః | గోం కీలకం | సకల ఋణనాశనే వినియోగః |
శ్రీ గణేశ | ఋణం ఛింది | వరేణ్యం | హుం | నమః | ఫట్ |
ఇతి కర హృదయాది న్యాసః |
ధ్యానం
సిందూరవర్ణం ద్విభుజం గణేశం లంబోదరం పద్మదళే నివిష్టం
బ్రహ్మాదిదేవైః పరిసేవ్యమానం సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవం ||
స్తోత్రం
సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్పూజితః ఫలసిద్ధయే
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౧ ||
త్రిపురస్యవధాత్పూర్వం శంభునా సమ్యగర్చితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౨ ||
హిరణ్యకశ్యపాదీనాం వదార్థే విష్ణునార్చితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౩ ||
మహిషస్యవధే దేవ్యా గణనాథః ప్రపూజితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౪ ||
తారకస్య వధాత్పూర్వం కుమారేణ ప్రపూజితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౫ ||
భాస్కరేణ గణేశోహి పూజితశ్చ సుశిద్ధయే
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౬ ||
శశినా కాంతివృద్ధ్యర్థం పూజితో గణనాయకః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౭ ||
పాలనయ చ తపసాం విశ్వామిత్రేణ పూజితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౮ ||
ఇదం ఋణహరం స్తోత్రం తీవ్ర దారిద్ర్య నాశనం
ఏకవారం పఠేన్నిత్యం వర్షమేకం సమాహితః || ౯ ||
దారిద్ర్యం దారుణం త్యక్త్వా కుబేర సమతాం వ్రజేత్
పఠంతోఽయం మహామంత్రః సార్థ పంచదశాక్షరః || ౧౦ ||
శ్రీ గణేశం ఋణం ఛింది వరేణ్యం హుం నమః ఫట్
ఇమం మంత్రం పఠేదంతే తతశ్చ శుచిభావనః || ౧౧ ||
ఏకవింశతి సంఖ్యాభిః పురశ్చరణ మీరితం
సహస్రవర్తన సమ్యక్ షణ్మాసం ప్రియతాం వ్రజేత్ || ౧౨ ||
బృహస్పతి సమో జ్ఞానే ధనే ధనపతిర్భవేత్
అస్యైవాయుత సంఖ్యాభిః పురశ్చరణ మీరితః || ౧౩ ||
లక్షమావర్తనాత్ సమ్యగ్వాంఛితం ఫలమాప్నుయాత్
భూత ప్రేత పిశాచానాం నాశనం స్మృతిమాత్రతః || ౧౪ ||
ఇతి శ్రీకృష్ణయామల తంత్రే ఉమా మహేశ్వర సంవాదే ఋణహర్తృ గణేశ స్తోత్రం సమాప్తం ||

రక్షా బంధన్. ....1
రక్షా బంధన్ అనేది సోదరీమణులు మరియు సోదరుల మధ్య జరుపుకునే పండుగ, ఇది స్వచ్ఛత మరియు రక్షణ యొక్క బంధం. అంతకుముందు అనుసరించిన ఆచారాలు ఈనాటి నుండి భిన్నంగా ఉన్నాయి. అంతకుముందు ప్రతి కుటుంబానికి ఒక పూజారి ఉండేవాడు, అతను ప్రార్థనలు శుద్దీకరణ కోసం ఇంటికి ఆహ్వానించబడ్డాడు. పూజారి ప్రతి ఒక్కరి మణికట్టుకు పవిత్రమైన దారాన్ని కట్టేవాడు. ఈ పవిత్రమైన దారం ప్రతిజ్ఞ యొక్క దారం. ప్రతి కుటుంబ సభ్యుడు సరైన చర్యలతో జీవించమని వాగ్దానం చేస్తాడు. క్రమంగా ఆచారం మారడం ప్రారంభమైంది - కుటుంబంలోని యువతులు పవిత్రమైన దారాన్ని కట్టి, ఆపై అది తమ సోదరులకు దారం కట్టే సోదరీమణులుగా మారింది.
ఒక సోదరుడు పిల్లవాడు అయితే, అతను తన సోదరిని రక్షించగలడా? ఆమె రక్షణ కోసం ఒక సోదరుడుతన సోదరి చుట్టూ ఎప్పుడూ ఉండగలడా? రక్షణ అవసరం సోదరికి కి కి మాత్రమేనా? పండుగ శారీరక రక్షణను మాత్రమే బోధిస్తుందా? మనం చేసే ప్రతి పండుగ మరియు ఆచారం ఒక అర్ధాన్ని తెలియజేస్తాయి. కర్మ అనేది సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మనం అనుసరించాల్సిన వాటికి ప్రతీక. రక్షా బంధన్ ఒక రాఖీని కట్టడం మరియు సోదరుడిని సోదరిని రక్షించడం కంటే ఎక్కువ. పండుగ స్వచ్ఛత మరియు రక్షణ మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని గుర్తు చేస్తుంది

వినాయకచవితి. సందర్భంగా ప్రజలందరికి ఒక విన్నపం.
మనము తెలిసి తెలిసి కొన్ని క్షమించరాని తప్పులు చేస్తున్నాము. ప్రతీ వినాయక చవితికి ఇదే తంతు జరుగుతుంది. ఏంటంటే అసలు వినాయకుణ్ణి మనం మండపాలల్లో ఎందుకు ప్రతిష్టిస్తున్నాము ? అందులో అంతరార్థం ఏంటి ? ఈ విషయం లో చాలా మంది తప్పుదోవ పడుతున్నారు.
వినాయకుడి రూపం ఎలా ఉంటుందో అలానే పూజించి అనుగ్రహం పొందండి . వినాయక సహస్ర నామాలలో వెయ్యి రకాలు చెప్పబడాయి . అలాంటి వినాయక ప్రతిమలు ఎంతో భక్తి పారవశ్యాన్ని కలుగజేస్తాయి.
కానీ ప్రస్తుత కాలంలో ఎవరి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా విగ్రహాలు తయారుచేయించుకుని పూజిస్తున్నారు. ఇది పూర్తిగా శాస్త్ర విరుద్ధం.
ఫిధ గణపతి,
గబ్బర్ సింగ్ 2 గణపతి, బాహుబలి 2 గణపతి, స్పైడర్ మాన్ గణపతి బుల్లెట్ గణపతి ...ఇలా చిత్ర విచిత్ర పద్ధతుల్లో తయారు చేస్తున్నారు. ఎందుకు ఇంతటి దుర్మార్గపు కృత్యాలు ..? కాలనీలోని పెద్దలు, మత పెద్దలు, యువకుల తల్లి తండ్రులు , నాయకులు ఇలాంటివి చూసి కూడా ఎందుకు నోరు మెదపడం లేదు....? ఎందుకు ప్రోత్సహిస్తున్నారు ..?
ఇలా పెట్టేవారి కుటుంబీకులు ఎవరైనా చనిపోయిన వారుంటే వారి ఫోటోలు ఇలా తయారు చేసి పెడుతున్నారా...?
మన బుద్ధి రాను రాను వక్రీకరించడం వల్లనే దేశంలో ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి.
ఇతర మతాల వారు ఇలా మనలాగా వాళ్ళ దేవుణ్ణి కించపరిచినట్టు ప్రవర్తించరు.
ముఖ్యంగా ఈ విషయంలో యువత తప్పు దారి పడుతుంది. ఇక నవరాత్రులు చివరి రోజు చాలా హంగామా చేస్తారు. తాగడం , ఎగరడం - దూకడం లాంటి కృత్యాలు చేసి మన హిందూ సంస్కృతీ పరువు మనమే తీస్తున్నాము. ఊరేగింపులో బూతు పాటలు. భారీగా ఖర్చు , భయకరమైన సౌండ్ సిస్టం , ఇలా .....
అసలు అంత ఖర్చు ఎందుకు పెడ్తున్నారు . మనకు మన ఋషులు ధారపోసిన జ్ఞానం ఇదేనా? ఒక్కసారి ఆలోచించండి.
మండపాల దగ్గర సినిమా పాటలు పెట్టకండి. వీలైతే భజనలు చేయండి లేదా ఏమీ చేయకుండా ఉండండి. బలవంతంగా చందాలు వసూలు చేసి మరీ మండపం ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకు ఇలా అడగడం. మీకు శక్తి లేకపోతే పెట్టకండి. పక్క వాళ్ళని చూసి మీకు పోటీలు వద్దు. అవన్నీ మూర్ఖపు పనులు. దయచేసి మానండి.
మోరీల పైన మండపాలు, రోడ్డు మీద మండపాలు, ఒక్క కాలనిలో 100 మండపాలు. విపరీత పోటీ రాజకీయం... అన్నీ వికృత చేష్టలే .
చాలా జాగ్రత్తగా గమనించండి....ఒక మండపం నుండి ఒక్కో మండపం పెరిగితే మనలో ఐక్యమత్యం తగ్గుతున్నట్లు , 100 మండపాల నుండి ఒక్కొక్క మండపం తగ్గుతూ ఒక కాలనిలో ఒకే మండపం అయితే ఐక్యమత్యo పెరిగినట్లు .
దీన్ని సరిదిద్దడం ఒక్కరితోనే మొదలవ్వాలి. ఆ ఒక్కరు మీరే ఎందుకు కాకూడదు. ధర్మాన్ని కాపాడి దేశ భవిష్యత్తుకు పునాది వేయండి. సంస్కతిని కాపాడే బాధ్యత మననుండే మొదలవ్వాలి.
ఆలోచించండి.
ధర్మో రక్షతి రక్షితః

అద్వైత జ్యోతి
పరబ్రహ్మం వల్లనే ప్రపంచం వెలుగుతోంది. వెలుగులో కనబడుతోంది. సమస్త జీవకోటీ వెలుగునందే ఉంది. జీవకోటిలో ఉన్న వెలుగే పరంజ్యోతి. వెలిగేది వెలుగే. వెలిగించేదే జ్యోతి. అది అద్వైత జ్యోతి, చూస్తున్నది, చూపిస్తున్నది ఒకచోటే ఉన్నందున. జగత్ అంటేనే పుట్టేది, పోయేదని అర్థం. ఉండేది కాదది. పోయేదాకా ఉన్నట్లు కనపడుతుందంతే. కానీ కదిలే జగత్తుకూ కదలని పరబ్రహ్మమే ఆధారం. ‘జ్యోతిశ్చరణాభిధానాత్’ అని సూత్రం. జ్యోతికి నాలుగు పాదాలు. ఒకటి జీవుడియందు అంతర్గతంగా ఉంటుంది. మిగిలిన మూడూ అమృతం, అంటే మార్పెరగని బ్రహ్మమే. కదలనిది దారి. కదిలేవాడు ప్రయాణికుడు. ఒకటి స్థిరం. మరొకటి చరం. స్థిరంగా ఉండే బ్రహ్మమే కీలకం. జఠరాగ్ని, నేత్రాగ్ని, చంద్రుడు, సూర్యుడు.. యివన్నీ బ్రహ్మం మీద ఆధారపడినవే. వీటన్నిటినీ వెలిగించేది జ్యోతి. జీవుడిలో ఉన్న జ్యోతి, వాంగ్మయం, శ్రీమయం, పరాత్పరమయం! ‘ప్రాణాస్తధానుగమాత్’ అని సూత్రం. ప్రాణమంటే బ్రహ్మమే. అది ఆనందస్వరూపం. దానిది అమృతస్థితి. జీవుడికి ప్రాణమంటే యిష్టం. ధనం ప్రాణం, జనం ప్రాణం, సంతానం ప్రాణం, సంపద ప్రాణం, కీర్తి ప్రాణం. ప్రాణమంటే లోవెలుగు. ప్రాణమంటే వాయువు. దాని వలన ఏర్పడే ఆయువు. లౌకిక భౌతిక వస్తువుల మీద ఇష్టాన్ని సర్వమూలమైన బ్రహ్మమునందు నిలుపుకోగలిగితే, అది ఆనందాన్నే యిస్తుంది.
ఆనందం, బ్రహ్మనందంవైపు నడిపిస్తుంది. నిజానికి ప్రాణం, పరబ్రహ్మంతోనే సంబంధం నిలుపుకొనే ప్రయత్నం చేస్తుంటుంది. రెండూ విడదీయరానివి. అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అనే నాలుగు మహావాక్యాలయందున్న ‘నేను’.. ప్రాణమే. పరబ్రహ్మాన్ని ఎరుగనంతవరకూ అది జీవబ్రహ్మ. ఎరుక కలిగిన తరువాత, ప్రాణం జ్యోతిర్మయమవుతుంది. ‘సర్వత్ర ప్రసిద్ధోపదేశాత్’ అని సూత్రం. ఉన్నదంతా బ్రహ్మమే. జగత్తుకున్న ఉనికి, దాని అస్తిత్వం, గుణం, స్వభావం, స్థితి, గతి.. అంతా బ్రహ్మమే. హేతువూ బ్రహ్మమే. రాగ, ద్వేషాలు, అహంకార మమకారాలు ఏకత్వాన్ని అనేకంగా చూపిస్తయ్. శాంతి, ప్రేమ, సత్యం, ధర్మం వంటి మానవీయ దివ్యభావనల వలన, అనేకంగా ఉన్నదంతా ఏకమేననే అనుభవం కలుగుతుంది. మనసు స్థిమితపడుతుంది. ఉదాహరణకు.. వ్యక్తి ఒకడే. బాంధవ్యాన్ని అనుసరించి వరుసలు ఏర్పడతాయి. ఒకరికి తండ్రిగా, మరొకరికి కొడుకుగా, వేరొకరికి మనవడుగా, భర్తగా, స్నేహితుడిగా, యజమానిగా, బంటుగా కనిపించేదంతా బాంధవ్యమే.
తల్లి గర్భం నుంచి జన్మించినపుడు కంఠమాలలు లేవు, బంగారు కడియాలు లేవు. కానీ.. పూర్వజన్మల కర్మలను గుదిగుచ్చిన కర్మమాల లేకుండా లేదు. మంచి-చెడు, పాపం-పుణ్యం, జననం-మరణం, వంటివన్నీ బ్రహ్మ భావనలే. ఈ స్పృహ ఉన్నట్లయితే, స్పర్థ ఉండదు. స్పష్టత లభిస్తుంది. సృష్టి సమస్తమూ స్పష్టమే. జీవుడి దృష్టి లోపం వలన సృష్టి లోపభూయిష్టంగా కనబడుతుంది. బ్రహ్మవిద్యాభ్యాసం వలన అజ్ఞానం తొలిగి, సృష్టి సమస్తమూ ఆనందవనంగా, శాంతిధామంగా, ప్రశాంతి నిలయంగా అనుభవంలోకి వస్తుంది. సృష్టి యొక్క సంక్షిప్త రూపమే వ్యష్టి. వ్యష్టి అంటే వ్యక్తి. వ్యక్తి పరిణామం, సృష్టి పరిణామం భిన్నం కావు. ధ్వని-ప్రతిధ్వని వలె ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. నిరంతర విచారణ అత్యవసరం. సత్సాంగత్యం, సజ్జనమైత్రి, సత్సంగం వంటి వాటిని జీవుడు కోరుకోవాలి. పొందాలి. తెలుసుకోవలసిన దానిని తెలుసుకోవాలి. తెలుసుకుని జీవించాలి. వెలుగు దారిలో ప్రయాణించాలి, వెలగాలి, వెలిగించాలి. ఆ జ్యోతే అద్వైతం.

అసలైన ఆభరణం
ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని, నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను అదుపులో ఉంచుకోగలిగితే మన జీవితం అదుపు తప్పకుండా ఉంటుంది. నాలుకను అదుపు చేసుకోగల విద్య తెలిస్తే, అనేక విద్యలు అవలీలగా ఒంటపడతాయి.
నోటిని అదుపులో పెట్టుకుని అందరితో మర్యాదగా మాట్లాడుతూ, పద్ధతిగా నడుచుకుంటూ ఉంటే ఎక్కడైనా, ఎప్పుడైనా మంచే జరుగుతుంది.
చెట్టు సారం పండులో వ్యక్తమైనట్లుగా, మనిషి సారం అతడి మాటలో తొంగి చూస్తూ ఉంటుంది. మంగళకరమైన మాట తీరు మనిషి సంస్కారానికి గీటురాయి.
మనిషికి నిజమైన అలంకారం అతడి మాట తీరే. ‘వాగ్భూషణమొక్కటే మనిషికి సుభూషణం’ అన్నాడు భర్తృహరి.
సంభాషణం మిత భాషణం, హిత భాషణం, స్మిత భాషణం, ప్రియ భాషణం, పూర్వ భాషణం, సత్య భాషణం అయినప్పుడు- అంతకన్నా భూషణం మరొకటి లేదు.
‘మితంగా, హితంగా మాట్లాడాలి. మనిషికి గౌరవం తెచ్చేవి ఇవే’ అనేవారు గాంధీజీ.
ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడుతూ ఉండాలి. మధుర భాషణం వల్ల మర్యాద లభిస్తుంది.
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది కదా. ప్రియంగా మాట్లాడాలి.
ఎదుటి వారిని ముందుగా మనమే పలకరించడం పూర్వ భాషణం.
రాముడు స్మిత పూర్వ భాషి- మాట కన్నా ముందు ఆయన చిరునవ్వు ఎదుటివారిని పలకరించేది.
సత్యమే సర్వోన్నతమైంది కనుక నిర్భయంగా సత్యాన్ని పలుకు. ఆ సత్యాన్ని ప్రేమగా, నేర్పుగా చెప్పాలి. మర్యాదగా, హుందాగా మాట్లాడాలి.
ఆలోచించకుండా మాట్లాడటం, గురి చూడకుండా బాణం వేయడం లాంటిది. మాట్లాడిన తరవాత ఆలోచించాల్సిన అవసరం రాకూడదు. కాబట్టి ఆలోచించి ఆచి తూచి మాట్లాడాలి.
‘తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు. తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు’ అన్నారు స్వామి వివేకానంద.
ఎవరైతే తమ మాటలవల్ల, చేతల వల్ల ఇతరులకు బాధ కలిగించకుండా ఉంటారో వారే ఉత్తములు.
ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఆదరణ పూర్వకంగా చెప్పే మాటలకు ఆచరణ ఎక్కువ.
ఆకట్టుకునేలా మాట్లాడటం ఓ కళ. అయితే ఆ మాటలను ఎప్పుడు మొదలుపెట్టాలో, ఎప్పుడు ఆపాలో తెలియడం మరీ గొప్ప కళ.
మాటలే మంత్రాలు, చెట్లే ఔషధాలు. మాటలు చాలా పదునైనవి కనుక జాగ్రత్తగా వాడాలి, బలమైనవి కనుక సున్నితంగా వాడాలి, ఖరీదైనవి కనుక పొదుపుగా వాడాలి.
మాట్లాడటం అందరూ చేస్తారు. అయితే అందరిలాగా కేవలం నోటితో మాట్లాడితే సరిపోదు. మరింత ప్రభావాన్వితంగా ఉండాలంటే మనసుతో, శరీరంతో మాట్లాడాలి.
మాటే సంపదలకు, మానవ సంబంధాలకు మూలం.
మాటే స్నేహితుల్ని సంపాదించి పెడుతుంది,
శత్రువుల్నీ తయారు చేస్తుంది.
నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు. అలాంటివారికి శత్రువులే ఉండరు.
మాటలు గాయపరచగలవు, అదే గాయాన్ని నయం చేయనూగలవు. సరైన మాటతీరు- చంపడానికి వచ్చిన శత్రువు మనసునైనా మార్చగలదు.
మాటల మధ్యలో సందర్భానుసారంగా సామెతలు, లోకోక్తులు వాడితే పాయసంలో జీడిపప్పులా మరింత మధురంగా, వినసొంపుగా అనిపిస్తుంది. సంభాషణ సరస చతురత కలిగి ఉండాలి. తిడుతూనే నవ్వించే హాస్య కుశలత కలిగి ఉండాలి.
ఎవరితో, ఎప్పుడు, ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి. ఈ విషయంలో రామాయణంలో నాయకుడైన మర్యాదా పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు, సుందరకాండకు నాయకుడైన సుందరమూర్తి హనుమంతుడు మనకు ఆదర్శం కావాలి.
మనిషికి భావ వ్యక్తీకరణ గొప్ప ఆస్తి. ఏం చెప్పారనేదానిక న్నా ఎలా చెప్పారనే దాన్నిబట్టి భావప్రసరణ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. భావవ్యక్తీకరణ ఎంత గొప్పగా ఉంటే ఫలితం అంత మహత్తరంగా ఉంటుంది!
రక్షా బంధన్ ... విశిష్టత (పార్ట్ 2)
స్వచ్ఛత, స్వీయ రక్షణ
రక్షా బంధన్ అంటే "రక్షణ బంధం". మనకు హాని కలిగించే లేదా బాధ కలిగించే అన్నిటి నుండి మనకు రక్షణ అవసరం. ప్రపంచంలో భౌతిక క్షేత్రంలో జరుగుతున్న అన్ని ప్రతికూల సంఘటనలు భీభత్సం, నష్టాలు భావోద్వేగం, అల్లకల్లోలం మనస్సుకు అశాంతిని చేకూరుస్తాయి. కామంతో పూడుకు పోయిన ఆత్మ, అత్యాచారానికి పాల్పదడంలో వెనుకాడదు. దురాశతో కూడిన ఆత్మ దొంగతనానికి పాల్పడుతుంది; దూకుడుతో కూడిన ఆత్మ హింసలో మునిగిపోతుంది. 5 దుర్గుణాలు - కామం, కోపం, దురాశ, స్వార్థం, అహం ఆత్మ యొక్క మానసిక సంఘర్షణకు, ఈతి బాధలకు కారణాలు, ఇవి క్రియాశీలక చర్యలలో పాల్గొన్నప్పుడు, మనం ఇతరులకు హాని కలిగిస్తాము. ప్రతి ఆత్మ అహం, కామం, కోపం, చికాకు, అసూయ, ముట్టడి, దురాశ, ద్వేషం, బాధ, స్వార్థం, విమర్శ, ఆధిపత్యం వంటి కలుషిత చర్యల నుండి తనను తాను రక్షించుకోవాలి ... మనల్ని మనం రక్షించుకోవటానికి మన స్వచ్ఛత, శాంతి, ప్రేమ, నిస్వార్థం, శక్తి, జ్ఞానం మరియు ఆనందం అనే ఏడు లక్షణాలను అలవరచు కోవాలి. మనం చేసే ప్రతి చర్య స్వఛ్చంగా వుండాలి. మన పనులు ఇతరులు వేలెత్తి చూపే విగా వుండకూడదు.
మనం స్వచ్ఛమైన నడవడికను అలవాటు చేసుకోవడమే కాక,ఆ నడవడికకు కట్టుపడి, మన ప్రతి చర్యలోను ఒక నిబద్ధతను కలిగి, చక్కని క్రమశిక్షణతో కూడుకున్న జీవితాన్ని అనునిత్యం సాధన చేయడానికి శ్రద్ధ, పట్టుదల,ఓర్పు అనే సాధనాలకు కట్టుబడి ఉండేట్లు, సమయ పాలనను పాటిస్తూ..కృషితో ఏదైనా సాధించగలమని వాగ్ధానం చేయాలి -
(1) జ్ఞానం - స్వచ్ఛమైన సమాచారంతో మన ఆత్మను నింపడానికి ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అధ్యయనం
(2) యోగా - మన ఆత్మను శక్తివంతం చేయడానికి ధ్యానం మరియు దేవునితో అనుసంధానం
(3) ధర్మం - ఆధ్యాత్మిక సూత్రాలను మన జీవన విధానంలో, కార్య దీక్షలో ఉపయోగించడం
(4) సేవ - మానసికంగా, శారీరకంగా, నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయడం
(5) సాత్వికము (స్వచ్ఛమైన) తినడం మరియు త్రాగే అలవాటు
"రక్షా బంధన్" దివ్యమైన పండుగ, బంధాలను దగ్గర చేసే పండుగ. మనకు స్వచ్ఛత, వాగ్దానం,ప్రేమను రాగాలు, సోదర సోదరీ ప్రేమ, రక్షణ ల అంతః సంబంధాలను బోధిస్తుంది. రక్షా బంధన్ ప్రతి కర్మ యొక్క ఆధ్యాత్మిక ప్రతి ఫలాన్ని, ప్రాముఖ్యతను తెలుపుతుంది. విశ్వమానవ కళ్యాణాన్ని ప్రోత్సహిస్తుంది.
సోదర సోదరీ బంధానికి పుష్టిని చేకూరుస్తుంది. సర్వేజనా సుఖినోభవంతు.

హయగ్రీవ జయంతి
శ్రావణ్యాం శ్రవణజాత:
పూర్వం హయశిరా హరి:
జగాద సామవేదంతు
సర్వ కల్మష నాశనం
స్నాత్వా సంపూజ యేత్ తంతు
శంకచక్ర గదాధరం
అని కల్పతరువు అనే గ్రంథంలో చెప్పబడింది. శ్రావణ పూర్ణిమ నాడు శ్రవణా నక్షత్ర యోగమున శ్రీహరి హయగ్రీవ రూపంలో అవతరించారు. హయశిరము గల హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మగూర్చి తపస్సు చేసి తన వంటి ఆకారం ఉన్న వానితోనే తాను మరణించాలని వరం కోరుకున్నాడు. తనవంటి వాడు ఇంకొకడు ఉండడు కావున తనకు మరణం లేదన్న గర్వంతో ఎన్నో దుష్కుృత్యములను ఆచరిస్తూ లోకాలను పీడించాడు. బ్రహ్మ నిద్రిస్తున్న సమయంలో అతని నిశ్వాసముల నుంచి వచ్చిన వేదములను అపహరించుకుని సముద్రంలో దాక్కొనెను. బ్రహ్మ ప్రార్థించగా శ్రీమహా విష్ణువు హయగ్రీవ రూపంతో అవతరించి సముద్రంపైన నిలిచి సామగానం చేసెను. ఆ సామనాద మాధుర్యానికి మైమరిచిన
హయగ్రీవ రాక్షసుడు ఆ గానాన్ని దగ్గరనుంచి వినాలని సముద్రంపైకి వచ్చెను. అపుడు హయగ్రీవ స్వామి సముద్రం లోపలికి వెళ్ళి దాచి ఉంచిన వేదాలను తీసుకుని వస్తుండగా రాక్షసుడు ఎదురై పోరు సలిపెను. ఆ విధంగా ఆ యుద్ధంలో రాక్షసుడను సంహరించి వేదాలను బ్రహ్మకు అందించినవాడు హయగ్రీవ స్వామి.
హయగ్రీవ స్వామి సకల విద్యాది దేవత. విద్య, జ్ఞానం కావాలన్నా హయగ్రీవ స్వామిని ఆరాధించాలి. సుప్రసిద్ధమైన మహా పండితులు, వేదాంత దేశికులు అనే వారు గరుడ మంత్రాన్ని జపించగా గరుత్మంతుడు ప్రత్యక్షమై వేదాంత దేశికులకు హయగ్రీవ మంత్రమును ఉపదేశించెను. ఆ మంత్రమును జపం చేసి హయగ్రీవ సాక్షాత్కారాన్ని పొంది ఆ స్వామి అనుగ్రహంతో అద్భుతమైన కావ్యములు, స్తోత్రములు రచించి ప్రసిద్ధి పొందారు. ఒకానొక సందర్భంలో వేదాంత దేశికులు రాత్రి 11 నుంచి తెల్లవారు జామున 4 లోపు స్వామివారి పాదుకల పైన ‘పాదుకా సహస్రం’ అని వెయ్యి శ్లోకములను అందించెను. ఇంతటి విజ్ఞాన, కవితా, మేధా వైభవం, వాగ్వైభవం హయగ్రీవ స్వామిని ఆరాధించినచో కలుగును.
జ్ఞానానంద మయం దేవం
నిర్మల స్ఫటికా కృతం
ఆధారాం సర్వ విద్యానాం
హయగ్రీవ ముపాస్మహే

జన్మాష్టమి వేడుకలు ప్రారంభం
హిందువులు అత్యంత విశిష్టంగా జరుపుకునే పండుగలలో ప్రధానమైనది శ్రీకృష్ణాష్టమి. సాక్షాత్తు భగవంతుడే శ్రావణ బహుళ అష్టమి తిధి నాడు భూమి మీద ఆవిర్భవించిన రోజు కావున ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటాము. రేపటి నుంచి 11 రోజులు జన్మాష్టమి వేడుకలు ప్రారంభమవుతాయి. 23, 24 తేదీలలో జన్మాష్టమి పండుగ జరపుకుంటాం. స్మార్త సాంప్రదాయం ప్రకారం 23న, వైష్ణవ సాంప్రదాయం ప్రకారం 24న కృష్ణాష్టమి పండుగను జరుపుకుంటాం. ఈ 11 రోజులు వైష్ణవ దేవాలయాలు ప్రత్యేక పూజలతో, వ్రతాలతో, భక్తుల రద్ధీతో కిటకిటలాడుతూ ఉంటాయి. ప్రత్యేకించి శ్రావణ బహుళ పాడ్యమి నుంచి శ్రావణ బహుళ ఏకాదశి వరకు అంటే 16th ఆగష్టు నుంచి 26th ఆగష్టు వరకు ఈ 11 రోజులు కృష్ణాష్టమి ఉత్సవాలను నిర్వహిస్తారు. భక్తులు ఈ 11 రోజులు ఒక దీక్షలాగా తీసుకొని మాంసాహారం, మద్యపానాది వంటి వాటికి దూరంగా ఉంటూ ప్రతిరోజూ కృష్ణ నామ స్మరణ చేస్తుంటారు. కొంతమంది సామూహికంగా రామకోటి వలే కృష్ణ నామ కోటి పుస్తకాలను రాస్తుంటారు. ఈ 11 రోజులు ఇంట్లో కృష్ణ పరమాత్మ పటానికి లేదా స్వామి వారి విగ్రహ మూర్తికి పూల మాలలు అలంకరించి, తులసీ దళాలతో కృష్ణుడిని పూజించి అటుకుల పాయసం, పులిహోర, పొంగలి, వెన్నను నైవేద్యంగా పెడతారు.
*జన్మాష్టమి*
ఎప్పుడెప్పుడు ఈ భూమి పై పాపం పెరిగిపోయి, ధర్మం నశిస్తుందో, అప్పుడప్పుడు భక్తులను రక్షించి దుష్టులను శిక్షించడం కోసం పరమాత్మ అవతారాన్ని దాల్చుతున్నారు. శ్రావణ కృష్ణ అష్టమి నాడు 33 కోట్ల మంది దేవతలు, ఋుషులు, సిద్ధులు స్తుతిస్తూ ఉండగా భగవంతుడు దేవకీదేవి గర్భం నుండి ఆవిర్భవించారు. ఎన్నో అద్భుతమైన లీలలు చేసి ఎంతో మంది భాగవతులకు మోక్షాన్ని ప్రసాదించాడు. ఈ కంటికి గోచరం కాని పరమాత్మ భక్తులను అనుగ్రహించడం కోసం పరిపూర్ణమైన అవతారంగా భూమి మీదకు వచ్చిన మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో కృష్ణార్పణంగా చేసే ఏ పుణ్యకార్యమైనా చాలా గొప్ప ఫలితాన్నిస్తుంది.
జాతక రీత్యా నవగ్రహాలు అనుకూలంగా లేని వారికి, ఏలినాటి శనితో బాధపడుతుండేవారికి, అపమృత్యు దోషం ఉన్నవారికి, వ్యాపారాలలో, ఉద్యోగాలలో సరిగ్గా కలిసిరాని వారు ఈ మాసమంతా ఇంటి పూజా మందిరంలో కృష్ణ పరమాత్మ చిత్రపటాన్ని తెచ్చి ప్రతిరోజూ తులసి దళాలతో పూజించడం వలన చాలా మంచి ఫలితముంటుంది. చాలా కాలం నుంచి పరిష్కారం కాని సమస్యలు సత్వరమే పరిష్కరింపబడుతాయి. అలాగే పర దేవతయైన మహాలక్ష్మికి కుంకుమతో పూజ చేయటం వలన దారిద్ర్యం నశించి, ఐశ్వర్యం సంప్రాప్తిస్తుంది.
ఊరిలోని వైష్ణవ దేవాలయాలలో ఈ 11 రోజులు కృష్ణాష్టమి ఉత్సవాలను విష్ణు ప్రీతిగా నిర్వహించడం వలన వంశాభివృద్ధి కలుగుతుంది. చక్కటి సంతానం కలుగుతుంది. భక్తులు ఈ 11 రోజులు స్వామి వారికి వివిధ రకాల సేవలు, కృష్ణ భజన మండపాలు, వివిధ భక్తి మరియు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారు. భాగవతం, భగవద్గీత, రుక్మిణీ కళ్యాణం, లక్ష్మీ ఆవిర్భావ ఘట్టాలను పారాయణ చేస్తుంటారు. కృష్ణాష్టమి రోజున పిల్లలకు బాలకృష్ణ వేషధారణ చేయించి, చిన్న చిన్న అడుగులను అచ్చులాగా వేసి లోపలికి ఆహ్వానిస్తారు. అలా చేయడం వలన సాక్షాత్తు కృష్ణ పరమాత్మను తమ ఇంటిలోకి ఆహ్వానించినట్లు భావిస్తారు. జన్మాష్టమి నాడు రంగులు జల్లుకుంటూ, ఉట్టి కార్య క్రమాలను నిర్వహిస్తారు. దేవాది దేవుడైన ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆశీస్సులు మనందరికీ కలగాలని మరియు ఆ స్వామి మనల్ని, మన కుటుంబ సభ్యులను చల్లగా చూడాలని కోరుకుంటూ... శ్రీకృష్ణ చరణం శరణం మమ
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

రిప్ ( RIP )అంటే అర్థం తెలుసా?
తెలియక వాడుతున్నారా?
సోషల్ మీడియా విస్తృతమయ్యాకా .తెలిసిన వ్యక్తి ఎవరైనా చనిపోయారు అని తెలియగానే ఓక ఫోటో పెట్టేసి రిప్ RIP అని పోస్ట్లు చేస్తున్నారు. అసలు రిప్ అంటే అర్థం తెలుసా?
రిప్ అంటే రెస్ట్ ఇన్ పీస్ అని అర్థం. ప్రస్తుతం చాలామంది రిప్ అంటే ఎందుకు వ్రాస్తున్నారో తెలియకుండానే గుడ్డిగా అనుసరిస్తున్నారు.
క్రైస్తవ మతం ప్రకారం మరణించాక , జడ్జిమెంట్ డే వరకు ఆత్మ నిరీక్షించాలి . ఇస్లాం మతం ప్రకారం కూడా ఒకరోజు వరకు నిరీక్షించాలి.
ఆరోజు వరకు ఆత్మ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి అని రిప్ RIP ద్వారా కోరుతున్నట్టు.
మరి మన సనాతన ధర్మం ( హిందూ సమాజం) ప్రకారం ఆత్మకు నాశనం లేదు.
ఆత్మకు అలసటలేదు
అలాంటప్పుడు విశ్రాంతి ఎక్కడ మిత్రుమా ?
అలాగే మరణానంతరం జీవి పాప పుణ్యాలను బట్టి, తరువాత జన్మ పొందడమో , స్వర్గ నరకాలకు వెళ్ళడమో లేదా మోక్షానికి వెళ్ళడమో వంటి ప్రతి చర్యలు ఉంటాయి.
మోక్షం వరకు ఓక చక్రం లాగ తిరుగుతూ ఉంటుంది. నిరీక్షించాల్సన అవసరం ఉండదు
రిప్ RIP అనేది హిందూ ధర్మం కాదు.
కాబట్టి మరణానంతరం
ముక్తి కలగాలని
స్వర్గ ప్రాప్తి కలుగాలని
శాశ్వత పుణ్య లోకాలకు కలగాలని
ప్రార్థించాలి తప్ప
RIP అని పోస్ట్ చెయ్యరాదు ...
#RIP

శ్రుతి, స్మృతి, స్తుతి
సృష్టి ప్రారంభం కాకముందే మహర్షులు, దేవర్షులు దైవవాణిని వేదవాక్కులుగా విన్నారని చెబుతుంది మన వాంగ్మయం. భగవంతుడి తొలివాక్కులు వినగలిగిన మహా అదృష్టవంతులు వారు. వేదాలే భగవంతుడి తొలివాక్కులు. అలా విన్నవన్నీ శ్రుతులుగా చెబుతారు.
విన్నవాటిని జ్ఞాపకం చేసుకుని, తిరిగి తమ శిష్యులకు బోధించడంలో స్మృతి ఉంది. అలా వచ్చినవే యాజ్ఞవల్క్య స్మృతి వంటివి. అప్పట్లో రచనా సామగ్రి వంటివేమీ లేవంటారు. కేవలం గ్రహణ, స్ఫురణల ద్వారానే జ్ఞానప్రసారం జరిగేదట. అమృతం కంటే కూడా వేదవిజ్ఞానమే గొప్పది.
మరణాన్ని నివారించగల శక్తి అమృతానికుంటే- మనిషి మరణించినా జీవించగల శక్తి జ్ఞానానికి ఉంది. సూర్యకిరణాల్లా జ్ఞాన తేజం లోకాలను వెలిగించగలదు.
అమూల్యం, అపారమైన జ్ఞానాన్ని మేధలో నిక్షిప్తం చేసుకోవడానికి అసాధారణమైన గ్రహణ, జ్ఞాపకశక్తి ఉండాలి. అందుకు తపోజీవనమే ఉత్తమ సాధనంగా చెబుతారు.
తపస్సు అనగానే అరణ్యాల్లోనే సాధ్యం అనుకోకూడదు. ఏకాగ్రత ఉండాలేకాని, ఎక్కడైనా తపస్సు సాధ్యమే. శ్రీరమణులు, శ్రీరామకృష్ణులు, మహర్షి అరవిందులు... అలా జనారణ్యాల్లో తపస్సు చేసినవారే.
జీవనయానం సాగుతున్నంత కాలం ఇది ఎక్కడో, ఎప్పుడో ముగిసిపోతుందనే స్పృహ కలగదు. తీరా ఆ సమయం వచ్చేసరికి గాబరాపడిపోతారు.
‘అయ్యో... కాలమంతా వ్యర్థం చేశానే. అలా చేసి ఉండాల్సింది. ఇలా చెయ్యకుండా ఉండాల్సింది. నా తరవాత పిల్లలు సమర్థించుకోగలరో లేరో...’ అనే ఆలోచనలతో కలవరపడతారు.
‘అంత్యకాలంలో నన్ను స్మరించినవారు నన్ను పొందుతారు’ అంటాడు కృష్ణుడు. జీవితమంతా లేని స్మరణ అంత్యకాలంలో ఎలా వస్తుంది?
జ్ఞానం మూడు విధాలు- శ్రుతి, స్మృతి, స్తుతిగా ఉంటుందంటారు. మొదటి రెండూ సరే. స్తుతిని జ్ఞానంగా ఎలా అనుకోవడం. మనం స్తుతి అనగానే పొగడ్త స్ఫురణకొస్తుంది. ప్రాపంచిక భావనలను పక్కనపెడితే, సామాన్యులకు దైవంతో అనుబంధం కలిగించేదే- స్తుతి.
భగవంతుడెవరు, ఎలా ఉంటాడు, ఆయనకు గల శక్తి సామర్థ్యాలు ఏమిటి, గతంలో ఆయన చేసిన లోక రక్షణ కార్యక్రమాలు ఏమిటి?
ఈ ప్రశ్నలన్నింటికీ ‘స్తుతి’లో సమాధానాలు దొరుకుతాయి. ‘దైవస్తుతి’లో రూపభేదాలే తప్ప, ఆదిదైవం ఒక్కడే. ఈ విషయాన్నే యోగవాసిష్టం నొక్కి చెబుతుంది. ‘సర్వమూ బ్రహ్మమే. ఇతరమేదీ లేదు’ అన్నదే ఆధ్యాత్మిక మూల సూత్రం.
పండితులకు, జ్ఞానులకు మాత్రమే శ్రుతి, స్మృతి అక్కరకొస్తాయి. మిగిలిన అందరినీ ఆదుకోగలది ‘దైవస్తుతి’ మాత్రమే. అన్ని మతాలవారు స్తుతి, స్తోత్ర పద్ధతులు పాటించడం మనం గమనించవచ్చు.
మనకు ఉపకారం చేసినవాళ్లను ఎంతో అభినందిస్తాం. కొందరు పొగడ్తలతో ముంచెత్తుతారు.
పొగడ్తలతో బోల్తా కొట్టించడం, పబ్బం గడుపుకొన్నాక మొహం చాటెయ్యడం మనకు నిత్యానుభవాలు. స్థిరచిత్తం కలవారు పొగడ్తలకు ప్రభావితం కారు. ప్రశంసలు మోతాదు మించితే పొగడ్తలుగా మారిపోతాయి. అందువల్ల మనం ప్రశంసల పరిధిని దాటకుండా జాగ్రత్తపడాలి.
భగవంతుడికిది వర్తించదు. స్తుతి, స్తోత్రాలెన్ని చేసినా, అవన్నీ ఆయన అసలు శక్తి కన్నా చాలా తక్కువ ప్రమాణంలోనే ఉంటాయి. వేదాలు, వేయి తలల ఆదిశేషువే అశక్తత వెల్లడిస్తే, మనం ఏపాటి?

🦌🦌🦌🦌🦌🦌🦌🦌🐐
వేదాంతంలో కస్తూరీమృగం కధ చెబుతారు.కస్తూరీమృగం అంటే ఒక రకమైన జింక. సీజన్ వచ్చినపుడు దాని బొడ్డు నుంచి ఒక రకమైన ద్రవం ఊరుతూ ఉంటుంది.అది మంచి మదపువాసనగా ఉంటుంది.అప్పుడు ఆ వాసన ఎక్కణ్ణించి వస్తున్నదా అని ఆ జింక వెదకడం మొదలుపెడుతుంది.ఆ వాసన తనవద్ద నుంచే వస్తున్నదని అది గ్రహించలేదు.ఆ అన్వేషణలో అలా అడవంతా తిరిగీ తిరిగీ చివరికి ఏదో ఒక పులి నోట్లో అది పడిపోతుంది. ప్రాణాలు కోల్పోతుంది.వేదాంత గ్రంధాలలో ఉన్న ఈ కధ అందరికీ తెలిసినదే.
మనిషి కూడా తనలోనే ఉన్న ఆత్మను తెలుసుకోలేక లోకమంతా వ్యర్ధంగా ఇలాగే తిరుగుతూ ఉంటాడు.పుణ్యక్షేత్రాలనీ తీర్ధయాత్రలనీ అనవసరంగా తిరిగి డబ్బునీ కాలాన్నీ వృధా చేసుకుంటూ ఉంటాడు.నిజానికి వీటివల్ల పెద్దగా ఆధ్యాత్మిక ఉపయోగం అంటూ ఏమీ ఉండదు.
పాండవులు తీర్ధయాత్రలకు వెళుతూ కృష్ణుణ్ణి కూడా తోడు రమ్మని పిలుస్తారు.సాక్షాత్తు భగవంతుడైన కృష్ణునికి తీర్ధయాత్రల అవసరం ఏముంది? ఆ సంగతి మాయామోహితులైన పాండవులకు తెలియదు.కనుక కృష్ణుని కూడా తమలాగే మామూలు మానవుడిగా వారు భావించి తీర్ధయాత్రలకు రమ్మని ఆహ్వానిస్తారు.ఆయన చిరునవ్వు నవ్వి వారికొక దోసకాయ నిచ్చి 'నా ప్రతినిధిగా దీనిని తీసుకువెళ్ళి మీరు మునిగిన ప్రతి గంగలోనూ దీనిని ముంచండి.'అని చెబుతాడు.వారు అలాగే చేసి తీర్ధయాత్రలు ముగించి తిరిగి వస్తారు.
అప్పుడు ఏర్పాటు చేసిన విందులో అదే దోసకాయతో వంటకం చేయించి వారికి వడ్డింపచేస్తాడు కృష్ణుడు.ఆ వంటకం పరమ చేదుగా ఉంటుంది.
'అదేంటి బావా?ఇది చేదు దోసకాయ.కటికవిషంలాగా ఉంది.ఇలాంటి వంటకం చేయించావేమిటి?' అని వారు అడుగుతారు.
దానికి కృష్ణుడు నవ్వి.' బావా.ఎన్ని గంగలలో మునిగినా ఈ దోసకాయ చేదు పోలేదు చూచావా?' అంటాడు.
ఎన్ని తీర్ధయాత్రలు చేసినా,మనిషిలో మౌలికంగా ఎలాంటి మార్పూ రాదని కృష్ణుడు ఈ సంఘటన ద్వారా వారికి సూచించాడు.ఆధ్యాత్మిక జీవితంలో ఇది అత్యున్నతమైన సత్యం.
మనిషి ప్రయాణం బయటకు కాదు.లోపలకు జరగాలి.యాత్ర అనేది బయట కాదు.అంతరిక యాత్రను మనిషి చెయ్యాలి.ప్రపంచమంతా మనిషి తిరిగినా చివరకు ఆధ్యాత్మికంగా ఏమీ సాధించలేడు.అదే తనలోనికి తాను ప్రయాణం చేస్తే ఉన్న గదిలోనుంచి కదలకుండా జ్ఞానాన్ని పొందవచ్చు.పాతకాలపు మహర్షులు దేశాలు పట్టుకుని ఎప్పుడూ తిరగలేదు.ఒకచోట స్థిరంగా కూచుని తపస్సు చేశారు.జ్ఞానసిద్ధిని పొందారు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏