డివోషనల్ తెలుగు కుటుంబ సభ్యులందరికీ నమస్కారం, 🙏
మన ఆంధ్రరాష్ట్రంలో లో చాలా దేవాలయాలు ఉన్నాయి, ఈ దేవాలయాల విశేషాలు, చరిత్ర అందరికీ అందజేయాలన్న ఉద్దేశంతో, సరికొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం.
ఈ చానల్ ను ఫాలో అవ్వాలి అనుకుంటే ఈ క్రింది లింక్ నొక్కండి
@Templesinap

నిరాశ
ఈ పని ఎప్పటికీ జరిగేది కాదు. అది అసాధ్యం. అటువంటి మాటలు- ఆ మనిషి స్వశక్తి మీద నమ్మకం కోల్పోయి నిరాశతో మాట్లాడుతున్నాడనడానికి తొలి సంకేతాలు. ఆత్మస్థైర్యానికి ఉన్న శక్తి అపారం. అది తెలియకపోవడమే నిరాశ. భగవంతుడు ఎన్ని ప్రత్యామ్నాయాలు తన ముందుంచినా, మనసు నిరాశతో నిండి ఉన్నప్పుడు, ఈ పని జరిగే తీరుతుందని అతడికి అనిపించదు. అది జరిగేందుకు ఉన్న అవకాశాలు తన కళ్ల ముందే ఉన్నా, నిరాశ వాటిని అతడికి కనపడనీయదు. తనకున్న బలాన్ని తెలియనివ్వదు.
అందరు అతిరథ మహారథులైన వానరవీరులున్నా రాముడు సీతాన్వేషణ బాధ్యతను హనుమంతుడికే అప్పజెప్పినప్పుడు- అతడు ఇది నా వల్ల కాగల కార్యమా అనుకుంటాడు. సందిగ్ధావస్థకు చేరుకుంటాడు. సంకోచంతో సతమతమవుతాడు. హనుమంతుడిని సహచర వానరులంతా నువ్వు మాత్రమే ఈ పని చెయ్యగలవాడని ఏకకంఠంతో అన్నప్పుడు, శతయోజనాలకు ఆవల సముద్రంలో ఉన్న లంకా ద్వీపానికి లంఘించి సీతమ్మ జాడ తెలుసుకోవటం అతడికి కష్టమనిపించలేదు. నిరాశ తొలగిపోతే చేరే ఆత్మశక్తి అతడి దేహబలం కన్నా గొప్పది. ఆ విషయం గ్రహించిన తరవాత హనుమంతుడు చేసి చూపించినవన్నీ అద్భుతాలే.
మహాభారతంలో, యక్షప్రశ్నల ఉపాఖ్యానంలో, యక్షుడు ధర్మరాజును- లోకంలో అతి దట్టమైనది ఏది అని ప్రశ్నించినప్పుడు సమాధానంగా అతడు మనుషులకుండే నిరాశ అని సమాధానమిస్తాడు. నిరాశతో ఉన్న మనిషి అవకాశాలను వెదకటం అదొక శ్రమ అనుకుంటాడని, ఆశ ఏ కోశాన తనలో ఉన్నా, ఆ మనిషి శ్రమిస్తూ, అవి వెదుకుతూనే ఉంటాడని, ఆ వెదకటం శ్రమ అని అతడనుకోడని, ఆశా నిరాశలున్న వ్యక్తుల మధ్య తారతమ్యం అదేనని మానసిక విశ్లేషకులంటారు. సాధించలేని లక్ష్యాలు తమ ముందుంచుకున్న మనుషులకు నిరాశ తప్పదు. అందుబాటులో ఉన్న అవకాశాలను వృథా కానీయకుండా సమీక్షించుకుంటూ సాగిపోగలిగితే, మనిషికి ఆత్మహత్యల వంటి ఆలోచనలు రావటానికి అవకాశమే ఉండదు.
నిరాశ మనిషి నిజమైన వ్యక్తిత్వాన్ని తొక్కిపట్టి ఉంచుతుంది. అతడు ఉదాసీనత, ఆత్మన్యూనతలతో, సంఘర్షణలు-సవాళ్లు లేనిదే జీవితం అనుకుంటూ, అది ఎప్పటికైనా తనకు లభిస్తుందా అని నిట్టూరుస్తూ కాలయాపన చేస్తుంటాడు. భగవంతుడు తనకిచ్చిన జీవితం మహదవకాశమని మరచిపోతాడు.
ప్రయత్న లోపాల పరిణామమే నిరాశ. సాలెపురుగొకటి గూడు నిర్మించుకునేందుకు అవస్థలెన్నో పడుతూ ఉంటుంది. తన ప్రయత్నాలు సఫలమయ్యే వరకు అది తన పట్టు విడవదు. గూడు ఎట్టకేలకు నిర్మితమవుతుంది. వరస అపజయాలతో దేశ బహిష్కృతుడై, అక్కడ తలదాచుకుంటున్న స్కాట్లాండ్ దేశపు రాజైన రాబర్ట్ బ్రూస్ అది గమనించి ఉత్తేజితుడవుతాడు. ఆ చిన్నజీవి ప్రయత్నాల నుంచి పొందిన ప్రేరణతో శత్రువులను ఎదుర్కొని విజయం సాధిస్తాడు.
నిర్లక్ష్యం, నిరాశ, నిస్పృహలతో జీవితం గడిపే మనిషెప్పుడూ కర్మయోగి కాలేడని, కర్మ యోగులే జ్ఞానయోగులవుతారని గీతలో భగవానుడు చెప్పింది మనిషికెప్పుడూ గుర్తుండాలి. జీవిత కాలక్రమంలో ఆయన మనిషికి ఇచ్చినవి ఎన్నో ఉంటాయి. అవన్నీ పొందని మనుషులూ ఉంటారు. వారిలో తృప్తిగా జీవిస్తున్న వారూ ఉంటారు. వారికి అది సాధ్యమెలా అయిందో వారినే అడిగి తెలుసుకుంటే, తృప్తిగా జీవించటానికి కావలసినదేమిటో వేరే వెదకనక్కరలేదు. ప్రత్యేక సాధనల అవసరం ఉండదు.

భక్తి మోక్షానికి మార్గం
‘‘మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ
స్వస్వరూపాను సంధానం భక్తి రిత్యభిదీయతే’’
మోక్షాన్ని అన్వేషించే వస్తువుల్లో భక్తియే గొప్పది. ఆత్మ తత్త్వమును అన్వేషించడమే భక్తి, జీవాత్మలో పరమాత్మను దర్శించడమే భక్తి అని శంకర భగవత్పాదులు వివరించారు. ‘భజసేవాయం’ ధాతువు నుండి భక్తి అనే శబ్దం వచ్చింది. కనుక భక్తి అంటే సేవ అని అర్థం. పరమాత్మను సేవించుకోవడమే భక్తి. ఆ పరమాత్మను సాటి మనిషిలో దర్శించుకోవడమే అసలైన భక్తి. భక్తి అనేది మనిషిలోని దుర్గుణాలను సంస్కరిస్తూ మానవత్వాన్ని పెంచి అటునుండి పరతత్త్వం వైపు నడిపించగల మహత్తర శక్తి. వ్యక్తి ద్వారాసమాజం సంస్కరింపబడడానికి భక్తి ఒక సాధనం, సుఖ శాంతులకు నెలవు. భగవదనుగ్రహం పొందడానికి సులభోపాయం.
సాధారణంగా ఏవో కోరికెలు తీరాలని కొందరు, ఇంట్లోని వాతావరణం వలన కొందరు, బయట ఆధ్యాత్మిక వాతావరణ ప్రభావం వలన కొందరు, దేవునికి మొక్కకుంటే ఏమవుతుందో అనే భయంతో కొందరు భక్తి మార్గంలో ప్రయాణిస్తుంటారు.
చతుర్విధ పురుషార్థాలలో చివరిదైన మోక్షమే అసలైన పురుషార్థం అని భావించేవారున్నారు. మోక్షం అంటే ముక్తి, మళ్లీ జన్మించే అవసరం లేకపోవడం. బమ్మెర పోతన తాను భాగవతం ఎందుకు రాస్తున్నాడో తెలుపుతూ ప్రారంభ పద్యంలోనే ‘‘శ్రీ కైవల్య పదంబు జేరుటకై చింతించెదన్’’ అన్నారు. కైవల్యమే తన లక్ష్యం అన్నారు. భక్తినే మార్గంగా ఎంచుకున్నారు.
సమాజం సుఖశాంతులతో ఉండాలంటే ధర్మబద్దంగా జీవించాలి. ధర్మబద్దంగా జీవించడానికి ప్రేరణను ఇస్తుంది భక్తి. అందుకే భారతీయ జీవనంలో భక్తి అంతర్భాగం అయింది. మంత్రాలతో అర్చించడమే భక్తి అని కొందరు భావిస్తారు కానీ ఏ మంత్రమూ రాని సాలెపురుగు, సర్పము, ఏనుగు తమ తమ శక్తి కొలది పరమేశ్వరుని పూజించి మోక్షాన్ని పొందాయని శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో తెలుస్తుంది. వయసు ప్రధానం కాదని ధృవుని కథ వల్ల తెలుస్తుంది. తాత్కాలిక సుఖాలకో, శాశ్వతం కాని దేహం కోసమో ఆరాటపడకుండా తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను, బంధువులను, సాటి మనుషులను గౌరవిస్తూ, భావితరాలకు మంచి జీవనాన్ని అందించేలా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, సర్వప్రాణులలో భగవంతున్ని దర్శిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడడమే నిజమైన భక్తి.

అమ్మకు అన్నం పెడదాం!
పరమాత్మకు ప్రతీకాత్మకంగా పంచభూతాత్మక ప్రకృతిని ఆరాధించడం భారతీయ సనాతన వారసత్వంలో అనాదిగా వస్తున్న సంప్రదాయం. పంచభూతాల ముందు తమ శక్తిసామర్థ్యాలు చాలా పరిమితమైనవని అర్థం చేసుకున్న మానవుడు వాటికి దాసోహమన్నాడు. ఆరాధించడం మొదలుపెట్టాడు. తన ఆనందాన్నయినా, ఆవేదనైనా ఆ పంచభూతాలతోనే పంచుకున్నాడు. పంట బాగా పండితే అందులో భాగమిచ్చాడు. పండక బీడువారితే వాటి ముందే బాధపడ్డాడు. ప్రకృతి వైపరీత్యాల నివారణకు మార్గం వాటిని ప్రార్థించడమేనని నిర్ణయించుకున్నాడు. స్తుతించకపోయినా, షోడశోపచారాలు చేయలేకపోయినా తమకు ఉన్న తృణమో, ఫలమో నివేదించి ఆరాధించారు. ఈ సృష్టి ప్రకృతి, పురుషుల కలయిక వల్ల ఏర్పడింది. పురుషుడు తండ్రి అయితే ప్రకృతి తల్లి అయింది. తండ్రి కంటే తల్లి దగ్గర పిల్లలకు చనువు ఎక్కువ. ఏం కావాలన్నా ముందు అమ్మనే అడుగుతాం. ఎలాంటి తప్పులు చేసినా ఆమె కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది. అందుకే ప్రకృతి ఆరాధనలో అమ్మతత్త్వమే ముఖ్యమైంది. మీనాక్షి, కామాక్షి వంటి సౌమ్యమూర్తిగానే కాదు, కాళి, దుర్గ వంటి ఉగ్రమూర్తిగా కూడా అమ్మను కొలుచుకోవడం ఆనవాయితీ. ఇక ఊరి చివర కొలువుండి ప్రజలను కాపాడేదీ అమ్మేనని భావించి పూజలు చేయడం మొదలైంది. అలా తెలంగాణ ప్రాంతంలో అమ్మకు చేసే పూజలే బోనాలు.
మనం ప్రీతిగా ఆరగించే ఏ పదార్థమైనా ముందు దైవీ శక్తులకు సమర్పిస్తే శ్రేయోదాయకమని విశ్వాసం. యజ్ఞద్రవ్యమైన అన్నాన్ని ఆశ్రయించి దైవీశక్తులు ఉంటాయి. సకల జీవుల మనుగడకు ఆధారమైన ఈ అన్నానికి రూపాంతరమే బోనం. ఇక్కడ గ్రామదేవతలకు బోనం సమర్పించడమంటే ప్రకృతి శక్తులకు కృతజ్ఞత చెల్లించడమే. అందుకే అమ్మవారికి అన్నాన్ని సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. దీన్నే కాకతీయుల కాలంలో జానపదులు బోనం అన్నారు. రుతువులు మారి వ్యాధులు సంక్రమించే ఆషాఢమాసంలో గ్రామాలను కాపాడాలని కోరుకుంటూ దైవీశక్తులకు బోనాలు సమర్పించి ఉత్సవాలు నిర్వహించేవారు. హైదరాబాద్ ప్రాంతంలో తరచుగా వచ్చే అంటువ్యాధులు నివారించాలని కోరుకుంటూ భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా గ్రామదేవతల జాతరలను జరిపేవారు. అవే నేటికీ బోనాల ఉత్సవాలుగా కొనసాగుతున్నాయి.
జంటనగరాల్లో ఆషాఢ మాసంలో బోనాల వేడుక జరిగితే.. తెలంగాణ పల్లెల్లో శ్రావణ మాసంలో ఈ ఉత్సవం నిర్వహిస్తుంటారు.
* భాగ్యనగర శివారులోని పల్లెల్లో శ్రావణ మాసంలో బోనాలు సమర్పిస్తారు.
* ఉత్తర తెలంగాణలోని గ్రామాల్లో ఎల్లమ్మకు వైశాఖ, జ్యేష్ఠ మాసాల్లో, పోచమ్మకు శ్రావణ మాసంలో బోనాలిస్తారు. మల్లన్న బోనాలు సంక్రాంతి సమయంలో జరుగుతాయి.
* కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో వైశాఖ పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి సమయంలో బోనాల జాతర జరుగుతుంది.
* మహబూబ్‌నగర్ ప్రాంతంలో శ్రావణ మాసంలో పెద్దమ్మ, అంకాళమ్మ, పోశవ్వ తదితర గ్రామదేవతలకు బోనాలు సమర్పిస్తారు.
* వేములవాడ క్షేత్రంలో కొలువై ఉన్న పోచమ్మతల్లికి భక్తులు నిత్యం బోనాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.

ఏది దారి?
మనిషి తన జీవితాన్ని సఫలం చేసుకోవడానికి ఎన్నో మార్గాలను అనుసరిస్తాడు. సమాజంలో ఒక వ్యక్తిగా, శక్తిగా నిలిచేందుకు జ్ఞానవిజ్ఞానాలను ఆశ్రయిస్తాడు. తాను ఎన్నుకొన్న వృత్తిలో, ఉద్యోగంలో రాణించడానికి కృషిచేస్తాడు. సమాజంలో తనకు కీర్తిప్రతిష్ఠలు రావాలని కోరుకుంటాడు. ఇంతటితో మనిషి తన జీవితంలో పరిపూర్ణత సాధించినట్లు కాదు. భౌతికంగా ఎంతగా ఎదిగినా, మానసికంగా ఎదగకపోతే అన్ని ప్రయత్నాలూ బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి. మానసికంగా ఉన్నతిని సాధించాలంటే ఆధ్యాత్మికతవైపు అడుగులు వేయక తప్పదు.
ఆధ్యాత్మిక విచారధారలో ‘నేనెవరు, ఎందుకు పుట్టాను, నేను ఏమి సాధించాలి, దేనిలో మానసిక ప్రశాంతత దొరుకుతుంది?’ అనే ప్రశ్నలు ఉదయిస్తాయి. ఇలాంటి సందేహాలను తీర్చుకొనేందుకు మనిషి ఎన్నోదారులను ఎన్నుకుంటాడు. అన్ని దారులూ అనుకున్న గమ్యాన్ని చేరుస్తాయా, మధ్యలోనే ఆగిపోతాయా అని ఆలోచిస్తాడు. తనకు అమూల్యమైన మానవజన్మను ప్రసాదించిన భగవంతుడికి కృతజ్ఞతగా ఏదైనా సమర్పించుకోవాలనుకుంటాడు. పూజలు చేస్తాడు. నామ పారాయణం కొనసాగిస్తాడు. మంత్రాలను జపిస్తాడు. ఉపవాసదీక్షలతో తపిస్తాడు. హోమాలు చేస్తాడు. యాగాలను ఆచరిస్తాడు. వ్రతాలు చేస్తాడు. తీర్థయాత్రలు చేస్తాడు. సాధుసత్పురుషుల ఉపదేశాలు వింటాడు. దేవాలయాలను దర్శిస్తాడు. పవిత్ర నదీజలాల్లో స్నానాలు ఆచరిస్తాడు. దానధర్మాలు చేస్తాడు. భజనలు చేస్తాడు. నవవిధ భక్తులనూ ప్రదర్శిస్తాడు. సంకీర్తనలను గానం చేస్తాడు. ఇలా భగవంతుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి అనేక రీతుల్లో, ఎన్నో తీరుల్లో ప్రయత్నిస్తుంటాడు. ఇవన్నీ పరమాత్ముడి దగ్గరికి చేర్చే దారులే. ఇందులో ఏ దారి గొప్పది? అన్ని నదులూ సాగరంలోనే చేరతాయి. అలాగే అన్ని ఆధ్యాత్మిక మార్గాలూ భగవంతుడి దగ్గరకే చేరతాయి.
మనిషి తాను అనుసరిస్తున్నదే గొప్పదని, ఇతరులు అనుసరించేవి సరైనవి కావని అనుకుంటుంటాడు. ఆరు రుచుల్లో ఏది గొప్ప అంటే ఏమి చెప్పగలం? సందర్భాన్నిబట్టి రుచికి విలువ ఉంటుంది.
సంకుచితమైన మనసు కలవాళ్లు ‘వీడు నావాడు, వాడు పరాయివాడు’ అని మనుషుల్లో భేదాలను చూస్తారుగాని, ఉదారచరితులైన మహాత్ములు మాత్రం ఈ ప్రపంచం అంతా ఒకటే కుటుంబం అనే భావనతో చూస్తారని నీతికారులు చెబుతారు.
భగవంతుడికి ఒకరూపం లేదని, ఒకనామం లేదని వేదాంతాలు చెబుతున్నాయి. నామరూపాలు లేని భగవంతుడికి మనిషే వాటిని కల్పించాడు. మనిషి మనసు చంచలమైంది. ఒక్కక్షణం కూడా నిలకడగా ఉండదు. అలాంటి మనసును ఒకచోట స్థిరంగా నిలపాలంటే ఒకరూపం ఎదుట కనిపించాలి. ఏదో ఒకపేరు వినిపించాలి. అందుకే మనిషి భగవంతుడికి అనేక రూపాలను కల్పించుకొని ఉపాసన చేస్తున్నాడు. ఈ ఉపాసన వల్ల తన మనసును ఏకాగ్రంగా ఉంచుకొనగలుగుతున్నాడు. పేర్లుపెట్టి పిలుస్తూ తన మనోభావాలను ప్రకటించుకొంటున్నాడు. తాను మానసిక విశ్రాంతిని, ప్రశాంతిని పొందుగలుగుతున్నాడు. ఏది ఆచరిస్తే మనసు స్థిరంగా ఉంటుందో ఆ ప్రయత్నం సరైనదే. దాన్ని మనిషి తన ఆధ్యాత్మిక మార్గంగా మలచుకొంటున్నాడు.
మానవశరీరంలోని అన్ని ఇంద్రియాలు, మనసుతోనే పనిచేస్తాయి. మనసుతో అనుసంధానం లేకుంటే ఏ ఇంద్రియమూ చక్కగా పనిచేయదు. కనుక మనసును గొప్ప భావనలకు, ఆలోచనలకు వినియోగించాలని పెద్దలమాట. అన్నివైపుల నుంచీ వచ్చే మంగళకర భావనలను మనిషి మనసుతో స్వీకరించాలని వేదం చెబుతోంది. కనుక అన్ని దారులూ మంచివే. ఏ దారిలో వెళ్లినా అనుకున్న గమ్యాన్ని చేరడమేకదా కావలసింది? దారులు కాదు, గమ్యమే ముఖ్యం అన్నది జీవితసత్యం!

శ్రావణ మాస విశిష్టత
2-8-2019 శుక్రవారం నుండి 30-8-2019 వరకు శ్రావణ మాసం
శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు, నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. *ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పోలాల అమావాస్య, నాగ చతుర్థి(4.8.19 ఆదివారం); నాగ పంచమి, గరుడ పంచమి (5.8.19); పుత్రాదా ఏకాదశి(11.8.19 ఆదివారం),దామోదర ద్వాదశి(12.8.19 సోమవారం),వరాహ జయన్తి* ఇలా అనేక పండుగలు వస్తాయి. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా, చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావము చూపే మాసము. ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపును. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కలిగించుటకు, ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమైనది. మనస్సు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమార్ధము వైపు మనస్సును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకొనుటకు, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసం లో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశమైనది.
శ్రావణ సోమవారాలు (5.8.19; 12.8.19; 19.8.19; 26.8.19)
ఈ మాసం లో వచ్చే సోమవారాలలో శివ భక్తులు ఉపవాసాలుంటారు. దీక్షతో ఉపవాసం ఉండి, శివుడికి అన్ని రకాల అభిషేకాలు నిర్వహిస్తారు. పార్వతి దేవి కి కుంకుమ పూజ చేస్తే ఐదవతనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాడం గా నమ్ముతారు
శ్రావణ మంగళవారాలు (6.8.19; 13.8.18; 20.8.19; 27.8.19)
శ్రీ కృష్ణుడు ద్రౌపదీదేవికి, నారద మునీంద్రుడు సావిత్రిదేవికి ఉపదేశించిన మంగళగౌరి వ్రతము ఈ మాసం లో ఆచరించడం ఎంతో ప్రాసస్థ్యమైనవి. మంగళగౌరి కటాక్షం ఏ స్త్రీల పై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదు. సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్దిల్లుతారు. కొత్తగా పెళ్ళైన వారు తప్పక ఐదు సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. అలాగే కొన్ని ప్రాంతాల వారు ఈ వ్రతాన్ని పెళ్లి కాని పిల్లల చేత కూడా చేయిస్తారు. పెళ్లి కి ముందు నాలుగు సంవత్సరాలు చేయించి పెళ్ళైన తర్వాత మిగిలిన ఒక సంవత్సరం ఈ వ్రతాన్ని నోచుకొంటారు.
శ్రావణ శుక్రవారాలు (2.8.19; 9.8.19; 16.8.19; 23.8.19)
శ్రీ వరలక్ష్మి వ్రతం (9.8.2019 శుక్రవారం)
*ఈ మాసంలో పౌర్ణమి కి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి దేవిని షోడసోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, అయిదవతనం, సంతానాభివృద్ది కలకాలం ఉంటాయని శాస్త్రం చెప్తోంది. లక్ష్మి దేవి భక్త శులభురాలు. ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, బలం ఈ అష్ట శక్తులని అష్టలక్ష్ములు గా ఆరాదిస్తాము. శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటిని రక్షించేవాడు, ఈ శక్తులన్నీ ఈయన ద్వారా ప్రసరించేవే. అతీత విషయాలని సామాన్య మానవులు గ్రహించలేరు. ఈ శక్తులన్నీ సక్రమంగా ఉంటేనే మనకి ఆయురారోగ్య, ఐశ్వర్య, సంతోషాలు కలుగుతాయి. లక్ష్మి దేవికి అత్యంతప్రీతికరమైన శుక్రవారం నాడు పూజిస్తే ఇవన్నిచేకూరుస్తుందని శ్రీ సూక్తం వివరిస్తుంది. అష్టలక్ష్ములలో వరలక్ష్మి దేవికి ఓ ప్రత్యకత ఉంది. మిగిలిన లక్ష్మి పూజలకంటే వరలక్ష్మి పూజ శ్రేష్ఠమని శాస్త్రవచనం. శ్రీహరి జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసం లో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ వ్రతాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ సంప్రదాయాలలో ఆచరిస్తారు. ఎవరు ఏ రీతి లో ఆచరించిన సకల శుభకరమైన, మంగళప్రదమైన ఈ వరలక్ష్మి దేవి పూజ జగదానందకరమైనదని భక్తుల విశ్వాసం*
శ్రావణ శనివారాలు
ఈ మాసం లో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పు ని పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది. ఈ మాసం లో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపొయిన, కనీస ఒక్క శనివారమైన పూజా విధానాన్ని ఆచరించడం మంచిది.
శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి (15.8.2019 గురువారం)
శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, గాయత్రి జయంతి, హయగ్రీవ జయంతి, భారత స్వాతంత్ర్య దినోత్సవం ని ఈ రోజు జరుపుకొంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి హయగ్రీవుడిని ఈ రోజున పూజించందం ద్వారా, ఏకాగ్రత, బుద్ది కుశలత, జ్ఞానం, ఉన్నత చదువు, కలుగుతాయని ప్రతీతి .
జంధ్యాన్ని యగ్నోపవీతమని , బ్రహ్మసూత్రమని పిలుస్తారు. యజ్ఞోపవీతం సాక్ష్యాత్తు గాయత్రి దేవి ప్రతీక. యజ్ఞోపవీతం వేదాలకు ముందే ఏర్పడింది.
ఈ రోజు పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ది కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలం కలుగుతుందని వెదోక్తి. ఈ రోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు
రక్షా/రాఖీ బంధనం (15.8.2019 గురువారం
శ్రావణ పూర్ణిమ నాటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికీ అండగా ఉండదలచామో వారి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖి) దైవం ముందుంచి పూజించి, ఆ పూజా శక్తిని గ్రహించిన రక్షికను అపరాహ్ణసమయం లో కట్టడం చేయాలి. "అప అంటే పగలు", "అపరం అంటే మధ్యాహ్నం" అంటే 12 దాటాక, కాబట్టి "అపరాహ్ణం అంటే 12 నుండి 3 గంటల మధ్య."*ఈ విధానాన్ని గర్ఘ్యుడనే మహర్షి చెప్పాడని శాంతి కమలాకరం చెప్తోంది.
శ్రావణ మాసం అంటే శ్రీ మహావిష్ణువు కు అత్యంత ప్రీతి కరమైన రోజు కావున ఈ మాసంలో సత్యనారాయణ వ్రతాలు చేయడం కూడా మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి ఇది నేటి ఆచారం కాదనీ, ఇది ఎప్పటి నుండో వస్తున్న శాస్త్ర విజ్ఞాన సంప్రదాయమేనని తెలుస్తోంది.
సంకష్టహర చతుర్థీ (19.8.2019 సోమవారం)
ప్రతి మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థీ వ్రతాన్ని ఆచరించలేని వారు, శ్రావణ మాసములో నైనా దీనిని ఆచరించి గణపతి అనుగ్రహముతో కావ్యాల నుండి విముక్తి పొందవచ్చును.
శ్రీ కృష్ణ జయంతి/కృష్ణాష్టమి/గోకులాష్టమి (23.8.2019 శుక్రవారం)
షోడష కళల పరిపూర్ణ అవతారమైన శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించిన పుణ్య దినం. ఈ రోజు శ్రీ కృష్ణుని అర్చిస్తే సకల పాపాలు నశించాయి, చతుర్విధ పురుషార్థాలు(ధర్మార్థకామమోక్షములు) సిద్ధించడమే కాక మహా జయములు కలుగుతాయని స్కాంద పురాణ వచనం.
మాస శివరాత్రి (29.8.2019 బుధవారం)
శ్రావణ మాసమంతా శివ ప్రీతికరమైన, ఈ మాస శివరాత్రి నాడు చేసే శివార్చన విశేష ఫలితాన్నిస్తుంది.
పోలాల అమావాస్య (30.8.2019 శుక్రవారం)
అంధకాసుర సంహారంలో నంది ప్రకటించిన ప్రతాపానికి సంతోషించి, పరమేశ్వరుడు అతనికి "పోల" అనే బిరుదు ఇచ్చి, ఈ శ్రావణ అమావాస్య నాడు ఆవులతో కలసినప్పుడు వృషభములను పూజింపవలె అని నిర్ణయించడము వల్ల దీనికి "పోలా వ్రతం" అని పేరు.
*ॐॐॐॐॐॐॐ*

మనసు మాట కాదు బుద్ధి మాట వినాలి
శూరంగముడు మగధ సేనలో మంచి సైనికుడు. అతను సైనిక వృత్తి వదలి, భిక్షువుగా మారాడు. ఒక రోజు అతను రాజగృహ పట్టణంలో భిక్ష కోసం వెళ్ళాడు. బాగా దాహం వేసింది. ఒక ఇంటి ముందు ఆగాడు. ఆ ఇంటి ఇరుగు మీద అందమైన యువతి కూర్చొని ఉంది. అతణ్ణి చూసి, గౌరవంగా లేచి నిలబడి, నమస్కరించింది. అతను మంచినీరు అడిగాడు. చూడగానే ఆమె అంత అందగత్తె అని అతనికి అనిపించలేదు. నీరు అందించినప్పుడు ఆమె చేయి అతనికి తగిలింది. అతని చిత్తం చలించింది. అప్పుడు ఆమె చాలా అందగత్తెగా కనిపించింది.
చూపునకు తడబడని అతని మనసు స్పర్శకు తడబడిందని గుర్తించి- ‘‘భంతే! జ్ఞానేంద్రియాల గురించీ, వాటి జ్ఞానాల గురించీ నాకొక అనుమానం ఉంది. అడగమంటారా?’’ అంది నమ్రతగా.
అడగమన్నట్టు తల ఊపుతూ, అరుగుమీద కూర్చున్నాడు.
‘‘వేడి బెల్లాన్ని నాలుక మీద పెట్టుకున్నప్పుడు ముందుగా కలిగేది రుచి జ్ఞానమా? స్పర్శ జ్ఞానమా?’’ అని ఆమె అడిగింది.
శూరంగముడు ఆలోచనలో పడ్డాడు.
‘‘భంతే! సెలవియ్యండి! నాలుక రసేంద్రియమా? స్పర్శేంద్రియమా?’’ అని అమె అడిగింది మళ్ళీ.
ఏమీ చెప్పలేక మౌనంగా లేచి వచ్చేశాడు శూరంగముడు. ఆమె తెలివితేటలకు ముగ్ధుడయ్యాడు. అతని చిత్తం మరింత చలించింది. కానీ, 8 ఏళ్ళ భిక్షా జీవితం, అధ్యయనం అతని ఆలోచనలను కట్టడి చేస్తున్నాయి. మనో సంఘర్షణతో చాలాసేపు నిద్ర పట్టలేదు. అర్థరాత్రి దాటాక నిద్రలోకి జారుకున్నాడు.
శూరంగముడు కోరుకున్నట్టే ఆమె అతనికి దక్కింది. ఆమె చేయి పట్టుకొని, అడవిలో నడుస్తున్నారు. అతని నెత్తిమీద పెద్ద గంప ఉంది. మొలకు ఉన్న ఒరలో బలమైన కత్తి వేలాడుతోంది. గంప బరువుకు తోడు కత్తి బరువు. భారం తగ్గించుకుందామని ఒరను విప్పి, కత్తితోపాటు ఆమె చేతికి ఇచ్చాడు. వారు అడవి మధ్యకు చేరగానే, దొంగల గుంపు ఒకటి ఎదురైంది. దొంగల నాయకుడు వారి ముందుకు వచ్చి, గద్దిస్తూ నిలబడ్డాడు. వాడు బలశాలి. అందమైన వాడు. ఆమె చూపు అతని మీద పడింది.
శూరంగముడు వెంటనే గంప దించుకొని ‘‘కత్తి ఇటు ఇవ్వు’’ అని సుందరిని అడిగాడు. ఆమె కత్తి ఒరను శూరంగమునికి ఇచ్చి, కత్తిని దొంగల నాయకుడికి ఇచ్చింది. వాడి పక్కకు చేరి, నవ్వసాగింది. వాడు కత్తి దూసి, శూరంగముని తలను ఒక్క వేటుకు తెగనరికాడు.
శూరంగముడు ఒక్కసారిగా తుళ్ళిపడి లేచాడు. గొంతు ఎండిపోయింది. తనకు తెలియకుండానే కేకలు పెట్టాడు.
పక్కన ఉన్న భిక్షువులు నిద్ర లేచి-‘‘ఏమైంది?’’ అని అడిగారు.
‘‘కల వచ్చింది’’ అన్నాడు శూరంగముడు.
‘‘పీడకలా?’’ అని వారు అడిగారు.
‘‘కాదు, కాదు. పీడను వదిలించే కల!’’ అన్నాడు. ఆ తరువాత అసలు విషయం చెప్పి-‘‘నా కల నా మనసులోని జాడ్యాన్ని వదిలించింది. మురికిని కడిగేసింది. ముళ్ళను తొలగించింది. నా కలే నాకు గురువుగా ఉపదేశం చేసింది’’ అన్నాడు చిరునవ్వుతో.

Audio
శ్రావణమాసం మొదటి శుక్రవారం మణిద్వీప వర్ణన వింటే మీకన్ని శుభాలే -
#Manidweepa Varnana
#Manidweepa Varnana
మణిద్వీప వర్ణన
మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని
మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువైయుంది|| 1
సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు
అచంచలంబగు మనోసుఖాలు మణి ద్వీపానికి మహానిధులు|| 2
లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు
లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహనిధులు|| 3
పారిజాత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలు
గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు|| 4
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం|| 5
పద్మరాగములు సువర్ణమణులు పదిఆమడల పొడవున గలవు
మధుర మధురమగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు|| 6
అరువది నాలుగు కళామతల్లులు వరాలనొసగే పదారుశక్తులు
పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు|| 7
అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టదిక్కులూ దిక్పాలకులు
సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు|| 8
కోటి సూర్యులు ప్రచండకాంతులు కోటిచంద్రుల చల్లని వెలుగులు
కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు|| 9
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం||
కంచుగోడల ప్రాకారాలు రాగిగోదల చతురస్రాలు
ఏడామడల రత్నరాసులు మణి ద్వీపానికి మహానిధులు|| 10
పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు
ప్రపంచమేలే ప్రజాధిపతులు మణి ద్వీపానికి మహానిధులు|| 11
ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైఢూర్యాలు
పుష్పరాగమణి ప్రాకారాలు మణి ద్వీపానికి మహానిధులు|| 12
సప్తకోటి ఘన మంత్రవిద్యలు సర్వశుభప్రద ఇచ్చాశక్తులు
శ్రీగాయత్రీ జ్నానశక్తులు మణి ద్వీపానికి మహానిధులు|| 13
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం||
మిలమిలలాడే ముత్యపురాసులు తళతళలాడే చంద్రకాంతములు
విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు|| 14
కుబేర ఇంద్ర వరుణదేవుల శుభాలనొసగే అగ్నివాయువులు
భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు|| 15
భక్తిజ్నాన వైరాగ్యసిద్దులు పంచభూతములు పంచశక్తులు
సప్తఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు|| 16
కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలమహాగ్రహాలు
ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిదులు|| 17
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం||
మంత్రిణి దండిని శక్తిసేవలు కాళికరాళి సేనాపతులు
ముప్పది రెందు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు|| 18
సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు
గోమేధికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు|| 19
సప్తసముద్రము లనంత నిధులు యక్షకిన్నెర కింపురుషాదులు
నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు|| 20
మానవ మాధవ దేవగనములు కామధేనువు కల్పతరువులు
సృష్టిస్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు|| 21
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం||
కోటి ప్రకృతుల సౌందర్యాలు సకలవెదములు ఉపనిషత్తులు
పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు|| 22
దివ్య ఫలముల దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు
దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు|| 23
శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్నానముక్తి ఏకాంత భవనములు
మణి నిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు|| 24
పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేకశక్తులు
సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు|| 25
చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపురాసులు
వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు|| 26
ధుఃఖము తెలియని దేవీసేనలు నటనాట్యాలు సంగీతాలు
ధనకనకాలు పురుషార్ధాలు మణిద్వీపానికి మహానిధులు|| 27
పదునాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము గలదు
సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వతస్థానం || 28
చింతమణుల మందిరమందు పంచబ్రహ్మల మంచముపైన
మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో|| 29
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం||
మణిగణ ఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి
సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో|| 30
పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో
అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది||2|| 31
నూతన గృహములు కట్టినవారు మణిద్వీప వర్ణన తొమ్మిదిసార్లు
చదివిన చాలు అంతా శుభమే అష్టసంపదల తులతూగేరు||2|| 32
శివకవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివినచోట
తిష్ట వేసుకొని కూర్చొనునంటా కోటి శుభాలను సమకూర్చకొనుటకై||2|| 33
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం||
#Manidweepa #slokam

పదునాలుగు లోకాలకూ పరంజ్యోతియగు మణిద్వీప నివాసినీ,పరమేశ్వరిని,తొమ్మిది విధాలుగా కీర్తించుకొనుటకు 9దోహాలతో ఈ స్తోత్రం వ్రాయబడింది.అమ్మకు నవసంఖ్య ఇష్టం కాబట్టి దీనిని 9 పర్యాయములు ప్రతిరోజు చదివిన ప్రతి మనిషి తరించవచ్చు.దీనిని శుక్రవారమునాడు మీ పుజానతరం తొమ్మిదిసార్లు చదివిన దన,కనక,వస్తు,వాహనాది సంపదలు కలిగి భక్తి,జ్నాన వైరాగ్య సిద్దులతో ఆయురారోగ్య,అయిశ్వర్యాలతో తులతూగి చివరకు మణిద్వీపము చేరగలరు.ఇది శాస్త్రవాక్యం
కోపం
ఎవరి కోపం వారికే శత్రువు. అది నిప్పులాంటిది. దహించడం దాని గుణం. ఇతరులను దహించాలని తలచేవారు, చివరకు తామే కోపం అనే అగ్నికి ఆహుతి అవుతారు.
ఆగ్రహంతో ఉన్నవారు నిగ్రహం కోల్పోతారు. కళ్ళకు పొరలు కమ్ముతాయి. తుదకు దేవుణ్నీ లెక్కచేయని పరిస్థితి వస్తుంది! వృత్రాసుర సంహారం కోసం ఇంద్రుడు ప్రయోగించిన ఆయుధాలన్నీ విఫలమయ్యాయి. దధీచి ప్రసాదించిన వెన్నెముకతో ఇంద్రుడు వజ్రాయుధాన్ని నిర్మించాడు. దుష్టుడైన వృత్రాసురుణ్ని ఆ ఆయుధంతో సంహరించి, ఇంద్రుడు లోకాల్ని రక్షించాడు. దధీచి కుమారుడు పిప్పలాదుడు పెద్దవాడైన తరవాత తన తండ్రి మరణానికి కారకులైన దేవతలపై కోపించాడు. వారిని సర్వనాశనం చేయ సంకల్పించాడు. తల్లి వద్దని చెప్పినా వినకుండా తపస్సు చేయడానికి అరణ్యానికి వెళ్ళాడు. అతడు చేసిన తపస్సు ఫలితంగా పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకొమ్మన్నాడు. ‘స్వామీ! మీ మూడో కన్ను తెరచి దేవలోకాన్ని తగలబెట్టి, సర్వ నాశనం గావించండి... ఇదే నా కోరిక’ అన్నాడు పిప్పలాదుడు. శివుడు ఆశ్చర్యపోయాడు. ‘నా కంటి మంటవల్ల దేవతలే కాదు... సర్వప్రకృతీ మాడి మసి అయిపోతుంది’ అని శివుడు ఎంత చెప్పినా పిప్పలాదుడు తన మూర్ఖపు పట్టు వదల్లేదు. దాంతో శివుడు తన మూడో కన్ను కొద్దిగా తెరిచాడు. దాని నుంచి వెలువడిన అగ్ని జ్వాలలు మొదట పిప్పలాదుణ్నే తాకాయి. కొద్ది నిమిషాలైనా ఆ మంటలను తట్టుకోలేక అల్లాడిపోయాడు. ‘పరమేశ్వరా! దేవతల్ని తగలబెట్టమని నిన్ను ప్రార్థిస్తే, తుదకు నా ప్రాణాలకే ఎసరు పెట్టావా, ఇది న్యాయమా?’ అన్నాడు పిప్పలాదుడు శోకిస్తూ. ‘భక్తా! నేను నిన్ను బాధించడంలేదు. నీ కోపమే నిన్ను బాధిస్తున్నది. నువ్వు కోరినట్లు దేవతలను దహించడానికే మూడో కన్ను కొద్దిగా తెరిచాను. కానీ దాని సెగ నీకు తగిలింది. ఎందుకంటే నీ శరీరం దేవతలకు నిలయం. నీ చేతులకు అధిదేవత ఇంద్రుడు. కన్నులకు సూర్యుడు. ముక్కుకు అశ్వనీ దేవతలు. మనసుకు చంద్రుడు. నీ శరీరమంతటా దేవతలు నెలకొని ఉన్నారు. అందుకే అగ్నిజ్వాలలు నీపై ప్రసరించాయి’ అన్నాడు శివుడు. పిప్పలాదుడు తన తప్పు తెలుసుకొని ఈశ్వరుణ్ని స్తుతించాడు. శంకరుడు అగ్ని జ్వాలలను పరిహరించాడు.
క్షమాగుణం అలవరచుకుంటే కోపం శమిస్తుంది. కోపానికి విరుగుడు శాంతి. శాంతి సద్భావనకు దారి తీస్తుంది. ద్రౌపదికి జరిగిన అవమానాలు, అనుభవించిన కష్టాలు ఆమెకు కోపం తెప్పించడం సహజమే! ఆమె ప్రతిజ్ఞలు గొప్ప యుద్ధానికే దారితీశాయి. కాని, చివరకు ఆమె చూపిన ఔదార్యం అప్రతిమానమైనది. ఆమె మాటలు లోకానికి ఒక గుణపాఠం.
దుర్యోధనుణ్ని సంతోషపెట్టడానికి అశ్వత్థామ నిద్రపోతున్న ద్రౌపదీ పుత్రుల తలలుకోసి చంపాడు. ఈ వార్త తెలిసి ద్రౌపది కుప్పకూలిపోయింది. అర్జునుడు ఆమెను ఓదార్చ ప్రయత్నించాడు. ‘నా గాండీవంతో అశ్వత్థామ తల ఖండించి తెచ్చి, నీ పాదాల చెంత పడవేస్తాను’ అని ప్రతిజ్ఞ చేశాడు. అశ్వత్థామ అర్జునుణ్ని చూడగానే భయంతో పారిపోసాగాడు. అర్జునుడు అశ్వత్థామను పట్టి కట్టి తెచ్చి, ద్రౌపది సమక్షాన నిలిపాడు. సిగ్గుతో తలవంచుకొని నిలబడి ఉన్న అశ్వత్థామతో ద్రౌపది ఇలా అన్నది- ‘దయతో ఉండాల్సిన జాతిలో పుట్టిన నీకు పిల్లల్ని చంపడానికి చేతులెలా వచ్చాయి, వారు నీకేం ద్రోహం చేశారు? నిద్రపోతున్నవారిని, యుద్ధానికి సిద్ధంగాలేనివారిని చంపడం తగునా?’ అని నిలదీసింది. ఆమెకు అశ్వత్థామ తల్లి గుర్తుకు వచ్చింది.
‘ద్రోణుడితోపాటు చితిలో పడకుండా, కొడుకును చూసుకుంటూ ఆ తల్లి ఎలాగో బతుకుతూ ఉంది. నేనెలాగూ పిల్లల్ని పోగొట్టుకొని శోకిస్తూ ఉన్నాను. ఇంకో తల్లికీ నాలాంటి దుస్థితే పట్టాలా? ఆ తల్లి శోకాన్ని పోగొట్టండి’- అని కృష్ణార్జునులతో పలికింది. ద్రౌపది కోపం కరుణగా మారి, దయగా పరిణమించి, తుదకు శాంతిని స్థాపించింది.
#Kopam

వేంకటేశ్వర అవతారానికి 3 ప్రధానమైన కారణాలు
1. ఒక నాడు నారద ముని శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి అడిగారుట. కలియుగంలో మానవులు తక్కువ కాలం జీవిస్తున్నారు, భగవంతుడి మీద అస్సలు మనస్సు లేదని. అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారుట, నేను వారి పాపాలని కడగడానికి, వారిని ఉద్ధరించడానికి శ్రీ వేంకటేశ్వరునిగా అవతరిస్తాను. వారు ఒక్కసారి నా కొండకి వచ్చి, తల నీలాలు సమర్పించి, నా దర్శనం చేసుకుని, ఒక్క ఆర్జిత సేవ చేసినా (కలియుగంలో అశ్వమేథయాగం చేసినంత పుణ్యం. అసలు కలియుగంలో చెయ్యడం చాలా కష్టం మరియు నిషిద్ధం కూడా) వారి పాపాలని నేను తీసేస్తాను. వారి డబ్బు వెయ్యకపోయినా సరే, తల నీలాలు సమర్పిస్తే చాలు.
2. ద్వాపర యుగంలో యశోదమ్మ చిన్నికృష్ణున్ని పెంచే అదృష్టం కలిగింది. ఈ లోకంలో యశోదమ్మవంటి అదృష్టవంతురాలు ఇంక ఎవ్వరులేరు. యశోదమ్మ అడక్కుండా రెండు మూడు సార్లు విశ్వరూప దర్శనభాగ్యం ఆమెకి మాత్రమే కలిగింది. కృష్ణుడి బాల్య క్రీడలు అంత సాధారణమైనటువంటివి కావు. వ్యాస భగవానుడు సంస్కృతంలో భాగవతాన్ని రాస్తే, పోతనాచార్యుల వారు తెలుగులోకి ఆంధ్రీకరించారు. కానీ యశోదమ్మకి ఒక కోరిక మిగిలి పోయింది. రుక్మిణి కల్యాణం చూడలేకపోయింది. అప్పుడు ఆమె అడిగితే, కృష్ణుడు వాగ్థానం చేశాడుట నేను కలియుగంలో వేంకటేశ్వరునిగా అవతరిస్తాను, నీవు వకుళమాతగా వచ్చి నా కల్యాణం చేయించు అని.
3. వేదవతిని పరిగ్రహించాలి (వివాహ మాడాలి)
సీతమ్మ దొరికినట్లుగానే, ఈమె కూడా దర్భల మీద దొరికింది. నెమ్మదిగా పెరిగి యుక్త వయ్యస్సులోకి రాగానే, ఆమె తండ్రి వివాహం చేద్దామని సంకల్పించారు. అప్పుడు ఆమె చెప్పిందట నేను సాక్షాత్తు శ్రీనివాసుడిని వివాహమాడతాను అని. అప్పుడు తండ్రిగారు అన్నారు, శ్రీనివాసుడిని పరిణయమాడడమంటే మాటలా. పార్వతి దేవి చూడు ఎంత తపస్సు చేసింది శంకరుడు గురించి. అప్పుడు వేదవతి కూడా హిమవత్ పర్వతానికి వెళ్లి తపస్సు చేసిందిట. ఆమె తపస్సు చేస్తుంటే, రావణాసురుడు వచ్చి ఎత్తుకుపోవాలని చూస్తే, వేదవతి వాడిని శపించి (నువ్వు ఒక స్త్రీ వల్లే నాశనం అవుతావని, ఆమెయే సీతమ్మ) అగ్ని ప్రవేశం చేసింది. ఆ సమయంలో అగ్నిహోత్రుడు ఆమెను కాపాడి, కూతురిగా స్వీకరించాడు. కొన్నాళ్ళ తరువాత, రావణుడు సీతమ్మని ఎత్తుకు పోతుండగా అగ్నిహోత్రుడు తారసపడ్డాడు. రావణాసురుడు నమస్కారం కూడా చేయలేదని ఆగ్రహించి అన్నాడుట, నీ రథంలో ఉన్న సీత నిజ మైన సీత కాదు, మాయ సీత అని. అసలు సీత నా దగ్గర ఉందని. అప్పుడు రావణాసురుడు చాలా సంతోషపడి, అగ్ని హోత్రుడి దగ్గర ఉన్న మాయాసీతని నిజమైన సీత అనుకుని లంకకి తీసుకుపోయాడు. నిజమైన సీత మాత్రం అగ్ని హోత్రుడి దగ్గర ఉండిపోయింది. అసలుసీత తరపున వేదవతి అశోక వనంలో 12 నెలలు ఉండి, రాముడిని రప్పించి, రావణ వాత చేయించింది. వేదవతి తన కార్యం పూర్తి అయ్యాక, అగ్నిహోత్రుడు దగ్గరకి వెళ్ళిపోయింది.
వేదము యొక్క స్వరూపమే సీత. సీతమ్మ స్వరూపమే వేదవతి. నిజానికి ఇద్దరు లేరు, ఉన్నది ఒక్కరే. రావణాసురుడి గురుంచి చెబుతూ, రావణుడు వేదాలు చదివాడు, క్రమం తప్పకుండా సంధ్యా వందనం చేసేవాడు. చాలా తపస్సు చేసాడు కాని శ్రద్ధ లేదు, వక్ర బుద్ధి పోలేదు. అందుకే రాముడి చేతిలో మరణించాడు. శంకరుడుకి చాలా పూజలు చేసాడు కానీ, సీతయే పార్వతి అని తెలుసుకోలేక పోయాడు. తన కులదేవత స్వరూపాన్నే కావాలనుకున్నాడు. 12 నెలలు సీతమ్మ తరపున వేదవతి అశోకవనంలో ఉంది కనుక, అగ్నిహోత్రుడు రాముడితో వేదవతిని కూడా భార్యగా స్వీకరించమన్నాడు. అప్పుడు రాముడన్నాడు, ఈ అవతారం లో నేను ఏకపత్ని వ్రతున్ని. నేను కలియుగంలో శ్రీ వేంకటేశ్వరునిగా అవతరించి వేదవతిని (పద్మావతి అమ్మవారు) పరిణయమాడతనన్నాడు.

తెలంగాణ లో మొట్టమొదటి బంగారు ఆలయం
ఈ అందమైన బంగారు ఆలయం ఆధునిక మరియు ప్రాచీన ఆర్కిటెక్చర్ మిశ్రమానికి ఒక ఉదాహరణ. ఈ ఆలయంలో శ్రీ శ్రీ రాధా గోవింద, స్వయంభు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి, చతుర్భుజ జప ఆంజనేయ స్వామి, పంచజన్యేశ్వర స్వామి-శివుడు క్షేత్ర పాలకులు…
#Golden
హరే కృష్ణ ఫౌండేషన్‌కు చెందిన ఈ ఆలయం, హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ప్రాంతంలో ఉంది.ఈ అందమైన బంగారు ఆలయం ఆధునిక మరియు ప్రాచీన ఆర్కిటెక్చర్ మిశ్రమానికి ఒక ఉదాహరణ. ఈ ఆలయంలో శ్రీ శ్రీ రాధా గోవింద, స్వయంభు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి, చతుర్భుజ జప ఆంజనేయ స్వామి, పంచజన్యేశ్వర స్వామి-శివుడు క్షేత్ర పాలకులు…
#Golden
వేంటకేశ్వరశరణాగతి స్తోతమ్
శేషాచలం సమాసాద్య కశ్యపాద్యా మహర్షయ:,
వేంకటేశం రమానాథం శరణం ప్రాపురంజసా 1
కలిసంతారకం ముఖ్యం స్తోత్రమేత జ్జపేన్నర :
సప్తర్షి వాక్ప్రసాదేన విష్ణుస్తస్మై ప్రసీదతి. 2
కశ్యప ఉవాచ :-
కాదగిహ్రీమంతవిద్యాయా: ప్రాపై ్యవ పరదేవతా,
కలౌ శ్రీ వేంకటేశాఖ్యాతామహం శరణం భజే. 3
అత్రి ఉవాచ :-
అకారాది క్షకారాంత వర్ణైర్య: ప్రతిపాద్యతే,
కలౌ శ్రీ వేంకటేశాఖ్య శ్శరణం మే ఉమాపతి: 4
భరద్వాజ ఉవాచ :-
భగవాన్ భార్గవీకాంతో భక్తాభీప్సితదాయక:
భక్తస్య వేంకటేశాఖ్యో భరద్వాజస్యమేగతి: 5
విశ్వామిత్ర ఉవాచ :-
విరాడ్విష్ణుర్విధాతా చ విశ్వవిజ్ఞాన విగ్రహ:,
విశ్వామిత్రస్య శరణం వేంకటేశో విభుస్సదా. 6
గౌతమ ఉవాచ :-
గౌర్గౌరీశ ప్రియో నిత్యం గోవిందో గోపతిర్విభు:
శరణం గౌతమస్యాస్తు వేంకటాద్రి శిరోమణి: 7
జమదగ్ని ఉవాచ :-
జగత్కర్తా జగద్బర్తా జగద్ధర్తా జగన్మయ:
జమదగ్నే: ప్రపన్నస్య జీవేశో వేంకటేశ్వర: 8
వసిష్ఠ ఉవాచ :-
వస్తు విజ్ఞానమాత్రం యన్నిర్విశేషం సుఖం చ సత్, తద్బ్రహ్యై వాహమస్మీతి వేంకటేశం భజే సదా 9
సప్తర్షి రచితం స్తోత్రం సర్వదా య: ప ఠేన్నర:,
సో భయం ప్రాప్నుయాత్సత్యం సర్వత్ర విజయీ భవేత్. 10
ఇతి శ్రీ మత్సప్తర్షికృత వేంటకేశ్వరశరణాగతి స్తోతమ్
#Venkateshwarasaranagathi stotram

చాలా అరుదుగా దొరికే సూర్య మండల
స్త్రోత్రం..!!
రోజూ చడవలేకపోయినా..వారంలో ఒకరోజు..ఆదివారం నాడు చదివినా.. సమస్త పాపాల్ని హరించి..పుణ్యఫలం పెంచే స్తోత్రం..!!💐
నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే
సహస్రశాఖాన్విత సంభవాత్మనే |
సహస్రయోగోద్భవ భావభాగినే
సహస్రసంఖ్యాయుధధారిణే నమః || ౧ ||
యన్మండలం దీప్తికరం విశాలం |
రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ |
దారిద్ర్య దుఃఖక్షయకారణం చ |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౨ ||
యన్మండలం దేవగణైః సుపూజితం |
విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ |
తం దేవదేవం ప్రణమామి సూర్యం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౩ ||
యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం |
త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్ |
సమస్త తేజోమయ దివ్యరూపం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౪ ||
యన్మండలం గూఢమతి ప్రబోధం |
ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్ |
యత్సర్వ పాపక్షయకారణం చ |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౫ ||
యన్మండలం వ్యాధివినాశదక్షం |
యదృగ్యజుః సామసు సంప్రగీతమ్ |
ప్రకాశితం యేన చ భూర్భువః స్వః |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౬ ||
యన్మండలం వేదవిదో వదంతి |
గాయంతి యచ్చారణసిద్ధసంఘాః |
యద్యోగినో యోగజుషాం చ సంఘాః |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౭ ||
యన్మండలం సర్వజనైశ్చ పూజితం |
జ్యోతిశ్చకుర్యాదిహ మర్త్యలోకే |
యత్కాల కాలాద్యమరాది రూపం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౮ ||
యన్మండలం విష్ణుచతుర్ముఖాఖ్యం |
యదక్షరం పాపహరం జనానామ్ |
యత్కాలకల్పక్షయకారణం చ |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౯ ||
యన్మండలం విశ్వసృజం ప్రసిద్ధం |
ఉత్పత్తి రక్ష ప్రలయ ప్రగల్భమ్ |
యస్మిన్ జగత్సంహరతేఽఖిలం చ |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౦ ||
యన్మండలం సర్వగతస్య విష్ణోః |
ఆత్మా పరం ధామ విశుద్ధతత్త్వమ్ |
సూక్ష్మాంతరైర్యోగపథానుగమ్యం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౧ ||
యన్మండలం వేదవిదోపగీతం |
యద్యోగినాం యోగ పథానుగమ్యమ్ |
తత్సర్వ వేద్యం ప్రణమామి సూర్యం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౨ ||
సూర్యమండలసు స్తోత్రం యః పఠేత్సతతం నరః |
సర్వపాపవిశుద్ధాత్మా సూర్యలోకే మహీయతే ||
ఇతి శ్రీ భవిష్యోత్తరపురాణే శ్రీ కృష్ణార్జున సంవాదే సూర్యమండల స్తోత్రం..సంపూర్ణం..||💐
#Suryamandala