చరమగీతం
శ్రీరామ జనన సమయంలో ప్రకృతి పరవశించిందని, పక్షులు ఆనందంగా స్పందించాయని చెబుతారు. ఆయన అవతార పురుషుడు. కారణజన్ముడు. సహజంగానే సమస్త ప్రకృతీ పరవశించి స్వాగత గీతాలు పాడుతుంది.
మనిషి జనన సమయంలోనూ తల్లి మనసు పరవశంతో మౌనగీతం పాడుతుంది. అదే తొలి గీతం. అది బిడ్డ ఆత్మను తాకుతుంది. రక్త బంధువుల ఆనంద తరంగాలన్నీ స్వాగత గీతాలే. ప్రేమ నిండినవారి ఆలింగనాలు, శిరసు మీద ముద్దులు- మధురమైన మౌన గీతాలు.
సృష్టిలో మనం గమనించని మౌన సంగీతం ఎంతో ఉంది. అది చెవులకు వినిపించేది కాదు- మనసుతో విని, ఆత్మతో ఆనందించాల్సింది.
భగవంతుడు నాదప్రియుడని చెబుతారు. శివుడైనా, విష్ణువైనా సంగీత ప్రియులే. శివ పరివారమంతా సంగీత విద్వాంసులే. విశ్వమంతా ఓంకార ధ్వని తరంగాలతో పరవశిస్తుంటుంది. సూర్యగ్రహ తరంగాలు ఓంకార ధ్వనులని ‘నాసా’ శాస్త్రవేత్తలు గుర్తించారు.
సృష్టి అంతా సంగీతమయమే. స్వరాల మూలాలు పక్షులు, జంతువుల అరుపులని విద్వాంసులు చెబుతారు. సంగీతానికి మధుర స్వరం ఎలా కీలకమో గీతానికి ఉదాత్త భావన అంతే ముఖ్యం. సంగీత సాహిత్యాలు కవలలు. అవి కలిసి ఉంటేనే రససిద్ధి కలుగుతుంది.
అందరూ సంగీత విద్వాంసులు కాలేరు.
కానీ, సంగీత మాధుర్యాన్ని అందరూ ఆస్వాదించగలరు. త్యాగయ్య, అన్నమయ్య లాంటి వైతాళికులు తమ భక్తిగానామృతాన్ని పరమాత్మకు నివేదన చేసి ముక్తిని పొందారు. భక్త తుకారాం సశరీరంగానే వైకుంఠానికి వెళ్లాడని కథ ఉంది. ఆయన గీతాలకు భక్తి పరమళాన్ని మేళవించి పరమాత్మను మెప్పించాడు.
భజన కూడా సంగీతమే. భగవంతుడు భజన కీర్తనలతో ప్రసన్నుడవుతాడంటారు. శ్రీరామ భజన ఎక్కడ జరిగితే అక్కడ ఆంజనేయుడు ప్రసన్నుడై నర్తిస్తాడని ప్రతీతి.
వీటన్నింటి సారాంశం ఒక్కటే. మన జీవితంలో ప్రతి క్షణమూ దైవ స్మరణ, సేవ, కీర్తనలతో సత్ప్రవర్తనతో గడిచిపోవాలి. అలాంటి ప్రణాళికను మనకు మనమే రచించుకోవాలి. మన నిత్య కృత్యాలు, ఉద్యోగ ధర్మాలు ఈ కార్యక్రమానికి పెద్దగా ఆటంకాలు కావు. కర్తవ్య స్పృహ ఉండాలి. దైవంతో అవిచ్ఛిన్న అనుబంధం ఉండాలి.
మన హృదయం అనుక్షణం పని చేస్తూ దేహ రక్షణ, ప్రాణ రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. మనసు ప్రపంచాన్నంతా తనలో ఇముడ్చుకుని అనేక ఆలోచనలతో సతమతమవుతూ ఉంటుంది. ఒకటి కర్తవ్య పాలనతో ఏమరుపాటు లేకుండా ఉంటుంది. రెండోది కర్తవ్యం తెలియక మర్కటంలా చంచలంగా వ్యవహరిస్తుంది. ఈ రెండు సిరుల మధ్య సంయమనం సాధించాలి. హృదయ సంగీతం సాగినంత కాలం మనిషి భద్రం. అది చరమగీతం పాడేలోపల మనిషి మేలుకోవాలి. విజ్ఞతతో వ్యవహరించాలి. ఆధ్యాత్మిక సత్యాలను అవగతం చేసుకోవాలి. ‘ఇదే... ఈ క్షణమే చివరిది’ అనుకుంటూ ప్రతి క్షణాన్నీ అంతర్యామికి అంకితం చేయాలి. అప్పుడు చరమగీతం గొప్ప వీడ్కోలు గీతం అవుతుంది. అంతర్యామి మందిరం స్వాగతం పలుకుతుంది!విజేత
జీవితం బహు చిత్రమైనది. ఒడుదొడుకులు, ఆరాటం, పోరాటం మనిషి మనసును మధించి అశాంతికి గురిచేస్తాయి. గెలుపు, ఓటములు, కష్టసుఖాలు ఉంటాయి. మనసును సమాధానపరచుకొని ముందుకు సాగాలి. సాధారణంగా ఆటల్లో నెగ్గినవారిని, పాటల్లో గెలిచినవారిని విజేతలంటారు. కంటికి కనిపించకుండా మనల్ని ఆడిస్తుంది మనసు. దాని ఆట కట్టించగలిగితేనే మనిషి విజయం సాధించినట్లు!
మనసును అదుపులో పెట్టడం అంత సులభం కాదు. దానికి తగిన సాధన చెయ్యాలి. మనసును జయించడానికి ముందు ఇంద్రియ నిగ్రహం అలవరచుకోవాలి. మనసును మన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. అంతేకాని, దాని చేతుల్లో కీలుబొమ్మ కారాదు. అభ్యాస వైరాగ్యాల ద్వారా మనసును స్వాధీనం చేసుకోవచ్చని గీతాచార్యులు వెల్లడించారు.
‘దేవుడి కృపను పొందవచ్చు. గురువు కృపను, సాధుజనుల కృపను పొందవచ్చు. కాని మనసు కృపను పొందలేక నాశనమవుతాడు’ అని సామెత ఉంది. ‘వెయ్యిసార్లు వెయ్యిమందిని యుద్ధంలో ఓడించిన వాడికన్నా తన మనసును జయించినవాడే పరాక్రమవంతుడు’ అంటుంది ధమ్మపద. మనసును స్వాధీనం చేసుకోవడం ప్రపంచంలో అన్నింటికన్నా కష్టమైన పని. స్వాధీనం తప్పిన మనసు మనిషి వ్యక్తిత్వం సమగ్రంగా వికసించకుండా అడ్డుపడుతుంది. మనోనిగ్రహం లేని వ్యక్తి విపరీతమైన పోకడలకు, ఎడతెరిపి లేని అంతర్మథనం వల్ల కలిగే మానసిక పతనానికి గురవుతాడు.
ఈ స్థూల శరీరంలో మనసు ఒక సూక్ష్మమైన భాగం మాత్రమే. భౌతికమైన స్థూల శరీరం మనసుకు పైన ఒక పొర. మనసు వెనక ఆత్మ ఉంది. మనసు సర్వ స్వతంత్రమైనది కాకపోయినా, దానికున్న శక్తులు అపారమైనవి. ఆ శక్తులను జయించడానికి మనిషి విశ్వప్రయత్నం చేయాలి. అప్పుడే అతడు విజేత కాగలడు. మనసెప్పుడూ ఒకేలా ఉండదు. మూడు బలమైన శక్తుల కలయికే దానికి కారణం. అవి సత్వం, రజస్సు, తమస్సు అనేవి.
శ్రీ రామకృష్ణ ‘పరిశుద్ధమైన మనసే పరిశుద్ధమైన బుద్ధి. అదే పరిశుద్ధమైన ఆత్మ’ అన్నారు. మనసు నాలుగు విధాలైన విధులను కలిగి ఉంటుంది. అవి: మది, బుద్ధి, అహంకారం, చిత్తం. ఇవన్నీ అంతఃకరణ తాలూకు వేర్వేరు రూపాంతరాలు. ‘మది’ ఒక వస్తువు. మంచి చెడులను అంచనా వేస్తుంది. ‘బుద్ధి’ మంచి చెడులను నిర్ణయిస్తుంది. చిత్తం జ్ఞాపకశక్తిని కలిగిస్తుంది. ‘నేను’ అనే భావాన్ని కలిగించేది ‘అహంకారం’. మనసును స్వాధీనం చేసుకోవాలంటే అది పవిత్రంగా ఉండాలి. మనం తినే ఆహారం పరిశుద్ధంగా ఉంటే మనసు పవిత్రమవుతుంది.
మనసును గెలవాలనుకునేవారు తమ కలతలు, కక్షలు, స్పర్థలు లోలోపలే దాచుకోరాదు. మనసుకు సృజనాత్మకమైన, ఆరోగ్యకరమైన కాలక్షేపం కల్పించాలి. శ్రీమద్భాగవతం ‘దానం, కర్తవ్య నిష్ఠ, వ్రతాలు, పురాణ శ్రవణం, పుణ్యకర్మలు ఇత్యాది పనులు మనసును స్వాధీనపరచుకోవడానికి దోహదం చేస్తాయి’ అని చెబుతోంది. ముఖ్యంగా భగవంతుడి గురించి ధ్యానం చేయాలి. గాయత్రీ మంత్రాన్ని అనునిత్యం జపిస్తే, మనసు మీ ఆధీనంలోనికి రావడానికి తోడ్పడుతుంది. పతంజలి ఓంకారాన్ని జపించడం ద్వారా మనసును స్వాధీనం చేసుకోవచ్చని సూచించారు.
‘వివేక చూడామణి’లో శంకరాచార్యులు ‘మెట్లపై నుంచి జారవిడిచిన బంతి ఏ విధంగా ఒక్కొక్క మెట్టుమీద నుంచి దొర్లుతూ కిందికి పడిపోతుందో అలాగే, మనసు తన ఆదర్శం నుంచి ఏ కొంచెం పక్కకు తప్పుకొని భోగవస్తువుల మీదకు మరలినా క్రమక్రమంగా అది మరీ హీనస్థితికి జారిపోతుంది’ అన్నారు. మన సంకల్ప శక్తితో మనసు మీద పట్టు సాధించి నిలకడగా భగవంతుని ధ్యానించేటట్టు చెయ్యాలి. మనసును సుశిక్షితుడైన సైనికుడిలా మలచి మాట వినేలా చేయగలిగినవాడే విజేతగా విలసిల్లుతాడు.తపస్సు
తపస్సు అంటే మనసును దైవం మీద లగ్నం చేసి ఆధ్యాత్మికంగా చేసే ధ్యానం. మనిషి జిజ్ఞాసాపరుడై తానేమిటో, ఇతర జీవరాశులకన్నా అన్ని విషయాల్లో ఎలా అధికుడో తెలుసుకున్నాక మనసు ప్రాధాన్యం అవగతమైంది. అటు తరవాత బుద్ధి కుశలతా అర్థమైంది. మనసును కుదురుగా ఉంచుకుంటే మనిషిగా సాధించలేనిది ఏదీ లేదని తెలుసుకున్నాడు. కొంత సమయం ధ్యానానికి కేటాయించాడు. మానసిక శక్తిని పొంది శరీరంతో ఎన్నో అబ్బురపరచే అద్భుతాలు సాధించాడు.
తపస్సు అంటే కీకారణ్యంలో ఒక చెట్టు కింద కళ్లు, ముక్కు మూసుకుని కూర్చున్న రుషులు మన మనో ఫలకంపై మెదులుతారు. తపస్సు అంటే తీవ్రమైన ధ్యానం అనుకునేవాళ్లూ ఉన్నారు. భగవద్గీతలోని 17వ అధ్యాయంలో మనోవాక్కాయాలతో చేసే మూడు విధాల తపస్సులను గీతాచార్యుడు మనకు ఉపదేశించాడు.
దేవతలను, ద్విజులను, గురువులను, జ్ఞానులను గౌరవిస్తూ పూజించటం, శుచిగా ఉండటం, నిజాయతీగా ప్రవర్తించడం, బ్రహ్మచర్యాన్ని, అహింసను అవలంబించడం శారీరక తపస్సు అవుతుంది.
ఎదుటివారికి ఉద్వేగం కలిగించని, రెచ్చగొట్టని మాటలు, సత్యంగాను, అవతలివారికి ప్రియాన్ని, హితాన్ని కలిగించేవిగా ఉండే మాటలు పలకడం, విధిగా వేదాధ్యయనం చెయ్యడం- వీటిని వాక్ తపస్సుగా చెబుతారు.
మనసును సదా ప్రసన్నంగా ఉంచుకోవడం, సౌమ్య స్వభావం కలిగి ఉండటం, మౌనంగా (మనసులో ఎటువంటి భావ సంచలనం ఏర్పడకుండా) ఉంటూ, ఆత్మనిగ్రహం కలిగి ఉండటం, మనసులో అహర్నిశలూ పరిశుద్ధ భావనలే ఉత్పన్నమయ్యేలా చూసుకోవడం- వీటిని మానసిక తపస్సుగా అభివర్ణిస్తారు.
ఇవన్నీ ఆచరణీయాలే. నిత్య జీవనయానంలో కష్టసాధ్యమైనవేమీ కాదు. వీటికోసం కానలకు పోవలసిన అగత్యం లేదు. మనిషిగా గౌరవాన్ని పొందడానికి, విలువను పెంపొందించుకోవడానికి అత్యంత ఆవశ్యకమైనవి.
మనసు కలుషితం కావడానికి జ్ఞానేంద్రియాలు ప్రధాన కారణం. చూడకూడని దృశ్యాలు, వినకూడని మాటలు, ఆఘ్రాణించకూడని వాసనలు, చూడకూడని రుచులను పదేపదే అనుభవంలోకి తెచ్చుకోవడం వల్ల- మనసు తద్వారా శరీరం వాటికి దాసోహం అవుతాయి. అందుకే పూర్వపు రోజుల్లో రుషులు సమాజం నుంచి తమను తాము వేరు చేసుకుని అడవుల బాట పట్టింది. కానల్లోకి చేరడమంటే ప్రకృతిలోకి ప్రయాణించడం. భగవానుడి సహజ సృష్టిలో భాగం పంచుకోవడం. అప్పుడే మోక్ష మార్గం సులువవుతుంది.
నిన్నటిదాకా నిత్యావసరాల కోసం తపించిన మనిషి నేడు ఆడంబరాలను అన్వేషిస్తూ ఉరుకులు, పరుగులు పెడుతున్నాడు. తనను తాను యాంత్రికంగా మార్చుకుని డబ్బుకు అపరిమిత ప్రాధాన్యం ఇస్తున్నాడు. ధనమే అన్నింటికీ మూలం అన్న స్థాయికి చేరుకున్నాడు.
కఠోరమైన మనసు, వికృతమైన శరీరాలు కలిగిన రాక్షసులే తపస్సు చేసి భగవంతుణ్ని మెప్పించి అద్భుతమైన వరాలు పొందారు. మానవులు సున్నిత మనస్కులు.
అనుగ్రహించడానికి భగవంతుడు అందరికీ అందుబాటులోనే ఉంటాడు. ఆయనను అందుకోలేకపోతున్నారంతే.
మనసు ప్రశాంతమైతే, మనిషి కుదురుగా ఉంటాడు. నిలకడ కలిగిన మనిషికి మానసిక బలం, శారీరక శక్తి సంపూర్ణ ఆయుర్దాయాన్ని ప్రసాదిస్తాయి.భగవంతుడి పై ప్రేమతో ,.... అత్మరామమై..
తుమ్బీఫలం జలాన్తర్బలాదధః క్షిప్తమప్యు పైత్యూర్థ్వమ్
తద్వన్మనః స్వరూపే నిహితం యత్నాద్బహిర్యాతి
సొరకాయ బుర్రను బలవంతంగా నీటిలోకి నెట్టినా అది పైకేతేలుతుంది. అలాగే మనసును బలవంతంగా స్వస్వరూపంలో నిలిపినా అది మరలా బహిర్ముఖంగా వస్తూనే ఉంటుందని దీని అర్థం. ‘‘శంకరభగవత్పాదులు ‘ప్రబోధ సుధాకరము’లో చెప్పిన శ్లోకమిది. మనసు బాహ్యేంద్రియాల ద్వారా దేనినో ఒక దానిని అభిలషించి దాని వెంట పరిగెత్తుతుంది. అది లభించకపోతే తన సొమ్మేదో పోయినట్లుగా పరితపిస్తుంది. వర్షాకాలంలో జలాధిక్యం చేకూరి ప్రవాహాల్లో నీరు కలుషితమై సహజమాధుర్యాన్ని కోల్పోయి క్షారమవుతుంది. ఆ జలమే గ్రీష్మంలో శుష్కించి తిరిగి సహజ మాధుర్యాన్ని పొందుతుంది. అలాగే.. విషయ భోగాలతో మనసు ఉద్రేకించి తమోగుణ ప్రధానమై కలుషితమవుతుంది. అభ్యాస-వైరాగ్యాలతో విషయ వాసనలు నశించగానే.. మనసు తిరిగి సత్యగుణంతో విరాజిల్లుతుంది. మనసు చంచలమై, వాసనలతో కూడుకుని ఉంటుంది. అది కోరికలకు పుట్టినిల్లు. సుఖప్రాప్తికి అనేక కల్పనలను చేసుకుంటుంది. సముద్ర తరంగాల వలె కోరికలు ఎల్లవేళలా ఉత్పన్నమవుతుంటాయి.
ఇందుకు కారణాలు.. మలం, విక్షేపం, ఆవరణం. మలమనగా పాపచింతన. విక్షేపమనగా చంచలత్వం. ఆవరణమనగా దేహం తానని భ్రమించడం. మనసు మనిషిని నరక సదృశమైన పతనావస్థకు తీసుకుపోగలదు. లేదా భూసురునిలాగానూ మార్చగలదు. అనియంత్రతమైన మనసు.. ఇంద్రియ భోగాలు, అహంకార తృప్తి, ధనసంచయమనే మూడు క్షేత్రాలలోనే సుఖాన్ని వెతుక్కుంటుంది. మనసు స్వచ్ఛందంగా అన్ని దిశలలో పరెగెత్తడం వల్ల ‘బుద్ధి’ అనే అంకుశం లేక, ఒక ఆలోచనను వదలి వేరొక ఆలోచనలోకి వెళ్లగలుగుతుంది. మనసు ఏ ఆలోచనల మీద స్థిరపడుతుందో అదే జాతికి సంబంధించిన ఆలోచనలు మనవైపు ఆకర్షించబడతాయి. మన మనో భూమిని సాత్విక ఆలోచనలతో నింపితే తద్వారా ఆ ఆలోచనలు పరిపుష్టి చెందుతాయి. మహర్షుల మార్గదర్శనం, సహకారం పొందే వీలుంటుంది. అప్పుడు మనలో అంతర్యామిగా ఉన్న భగవచ్ఛక్తి పనిచేయగలదు.
పూజ్యేషు అనురాగో భక్తిః
అని నారద భక్తి సూత్రము. అనగా పూజ్యులయందు లేక పూజ్య వస్తువులయందు మనస్సు చేరగలిగెడు అనురాగ పూర్వక వృత్తి ‘భక్తి’ అనబడును. అందుకే ‘అనన్య దృష్టి చేత నన్ను భజించు వాడు సాధువే’ అని శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పాడు. పరమాత్మ యందు గల అనన్య భక్తి అమృత స్వరూపమైనది. భగవన్నామామృతము గ్రోలువాడు, అనగా నామ జపము చేయు సాధకుడు పర్యవసానముగా భగవత్స్వరూపుడే అవుతున్నాడు. భక్తి మార్గం భగవంతుని చేరుస్తుంది. ఏ విధమైన భక్తి మార్గాన్ని ఎంచుకున్నా సరే ఆయనపై ‘ప్రేమ’ ప్రాప్తిస్తే ‘ఆత్మారామోభవతి’ అనే స్థితిలో భక్తుడు ఉండిపోతాడు. మనసుకు శాశ్వతమైన ఆనందాన్ని అందించే మనోరంజకమైన విషయం లభిస్తే నిశ్చలమవుతుంది. తనలో తాను ఆనందిస్తూ ‘ఆత్మారామ’మవుతుంది. ప్రశాంతమైన పరమధామం చేరుతుంది.

ఆగస్టులో శ్రీవారికి రెండుసార్లు గరుడవాహన సేవ
తిరుమల శ్రీవారికి ఆగస్టులో రెండుసార్లు గరుడవాహన సేవ జరగనుంది. ఆగస్టు 5న గరుడ పంచమి, 15న శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా ఆయా రోజుల్లో రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీనివాసుడు గరుడవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు.

డివోషనల్ తెలుగు కుటుంబ సభ్యులందరికీ నమస్కారం, 🙏
మన ఆంధ్రరాష్ట్రంలో లో చాలా దేవాలయాలు ఉన్నాయి, ఈ దేవాలయాల విశేషాలు, చరిత్ర అందరికీ అందజేయాలన్న ఉద్దేశంతో, సరికొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం.
ఈ చానల్ ను ఫాలో అవ్వాలి అనుకుంటే ఈ క్రింది లింక్ నొక్కండి
@Templesinap

నిరాశ
ఈ పని ఎప్పటికీ జరిగేది కాదు. అది అసాధ్యం. అటువంటి మాటలు- ఆ మనిషి స్వశక్తి మీద నమ్మకం కోల్పోయి నిరాశతో మాట్లాడుతున్నాడనడానికి తొలి సంకేతాలు. ఆత్మస్థైర్యానికి ఉన్న శక్తి అపారం. అది తెలియకపోవడమే నిరాశ. భగవంతుడు ఎన్ని ప్రత్యామ్నాయాలు తన ముందుంచినా, మనసు నిరాశతో నిండి ఉన్నప్పుడు, ఈ పని జరిగే తీరుతుందని అతడికి అనిపించదు. అది జరిగేందుకు ఉన్న అవకాశాలు తన కళ్ల ముందే ఉన్నా, నిరాశ వాటిని అతడికి కనపడనీయదు. తనకున్న బలాన్ని తెలియనివ్వదు.
అందరు అతిరథ మహారథులైన వానరవీరులున్నా రాముడు సీతాన్వేషణ బాధ్యతను హనుమంతుడికే అప్పజెప్పినప్పుడు- అతడు ఇది నా వల్ల కాగల కార్యమా అనుకుంటాడు. సందిగ్ధావస్థకు చేరుకుంటాడు. సంకోచంతో సతమతమవుతాడు. హనుమంతుడిని సహచర వానరులంతా నువ్వు మాత్రమే ఈ పని చెయ్యగలవాడని ఏకకంఠంతో అన్నప్పుడు, శతయోజనాలకు ఆవల సముద్రంలో ఉన్న లంకా ద్వీపానికి లంఘించి సీతమ్మ జాడ తెలుసుకోవటం అతడికి కష్టమనిపించలేదు. నిరాశ తొలగిపోతే చేరే ఆత్మశక్తి అతడి దేహబలం కన్నా గొప్పది. ఆ విషయం గ్రహించిన తరవాత హనుమంతుడు చేసి చూపించినవన్నీ అద్భుతాలే.
మహాభారతంలో, యక్షప్రశ్నల ఉపాఖ్యానంలో, యక్షుడు ధర్మరాజును- లోకంలో అతి దట్టమైనది ఏది అని ప్రశ్నించినప్పుడు సమాధానంగా అతడు మనుషులకుండే నిరాశ అని సమాధానమిస్తాడు. నిరాశతో ఉన్న మనిషి అవకాశాలను వెదకటం అదొక శ్రమ అనుకుంటాడని, ఆశ ఏ కోశాన తనలో ఉన్నా, ఆ మనిషి శ్రమిస్తూ, అవి వెదుకుతూనే ఉంటాడని, ఆ వెదకటం శ్రమ అని అతడనుకోడని, ఆశా నిరాశలున్న వ్యక్తుల మధ్య తారతమ్యం అదేనని మానసిక విశ్లేషకులంటారు. సాధించలేని లక్ష్యాలు తమ ముందుంచుకున్న మనుషులకు నిరాశ తప్పదు. అందుబాటులో ఉన్న అవకాశాలను వృథా కానీయకుండా సమీక్షించుకుంటూ సాగిపోగలిగితే, మనిషికి ఆత్మహత్యల వంటి ఆలోచనలు రావటానికి అవకాశమే ఉండదు.
నిరాశ మనిషి నిజమైన వ్యక్తిత్వాన్ని తొక్కిపట్టి ఉంచుతుంది. అతడు ఉదాసీనత, ఆత్మన్యూనతలతో, సంఘర్షణలు-సవాళ్లు లేనిదే జీవితం అనుకుంటూ, అది ఎప్పటికైనా తనకు లభిస్తుందా అని నిట్టూరుస్తూ కాలయాపన చేస్తుంటాడు. భగవంతుడు తనకిచ్చిన జీవితం మహదవకాశమని మరచిపోతాడు.
ప్రయత్న లోపాల పరిణామమే నిరాశ. సాలెపురుగొకటి గూడు నిర్మించుకునేందుకు అవస్థలెన్నో పడుతూ ఉంటుంది. తన ప్రయత్నాలు సఫలమయ్యే వరకు అది తన పట్టు విడవదు. గూడు ఎట్టకేలకు నిర్మితమవుతుంది. వరస అపజయాలతో దేశ బహిష్కృతుడై, అక్కడ తలదాచుకుంటున్న స్కాట్లాండ్ దేశపు రాజైన రాబర్ట్ బ్రూస్ అది గమనించి ఉత్తేజితుడవుతాడు. ఆ చిన్నజీవి ప్రయత్నాల నుంచి పొందిన ప్రేరణతో శత్రువులను ఎదుర్కొని విజయం సాధిస్తాడు.
నిర్లక్ష్యం, నిరాశ, నిస్పృహలతో జీవితం గడిపే మనిషెప్పుడూ కర్మయోగి కాలేడని, కర్మ యోగులే జ్ఞానయోగులవుతారని గీతలో భగవానుడు చెప్పింది మనిషికెప్పుడూ గుర్తుండాలి. జీవిత కాలక్రమంలో ఆయన మనిషికి ఇచ్చినవి ఎన్నో ఉంటాయి. అవన్నీ పొందని మనుషులూ ఉంటారు. వారిలో తృప్తిగా జీవిస్తున్న వారూ ఉంటారు. వారికి అది సాధ్యమెలా అయిందో వారినే అడిగి తెలుసుకుంటే, తృప్తిగా జీవించటానికి కావలసినదేమిటో వేరే వెదకనక్కరలేదు. ప్రత్యేక సాధనల అవసరం ఉండదు.

భక్తి మోక్షానికి మార్గం
‘‘మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ
స్వస్వరూపాను సంధానం భక్తి రిత్యభిదీయతే’’
మోక్షాన్ని అన్వేషించే వస్తువుల్లో భక్తియే గొప్పది. ఆత్మ తత్త్వమును అన్వేషించడమే భక్తి, జీవాత్మలో పరమాత్మను దర్శించడమే భక్తి అని శంకర భగవత్పాదులు వివరించారు. ‘భజసేవాయం’ ధాతువు నుండి భక్తి అనే శబ్దం వచ్చింది. కనుక భక్తి అంటే సేవ అని అర్థం. పరమాత్మను సేవించుకోవడమే భక్తి. ఆ పరమాత్మను సాటి మనిషిలో దర్శించుకోవడమే అసలైన భక్తి. భక్తి అనేది మనిషిలోని దుర్గుణాలను సంస్కరిస్తూ మానవత్వాన్ని పెంచి అటునుండి పరతత్త్వం వైపు నడిపించగల మహత్తర శక్తి. వ్యక్తి ద్వారాసమాజం సంస్కరింపబడడానికి భక్తి ఒక సాధనం, సుఖ శాంతులకు నెలవు. భగవదనుగ్రహం పొందడానికి సులభోపాయం.
సాధారణంగా ఏవో కోరికెలు తీరాలని కొందరు, ఇంట్లోని వాతావరణం వలన కొందరు, బయట ఆధ్యాత్మిక వాతావరణ ప్రభావం వలన కొందరు, దేవునికి మొక్కకుంటే ఏమవుతుందో అనే భయంతో కొందరు భక్తి మార్గంలో ప్రయాణిస్తుంటారు.
చతుర్విధ పురుషార్థాలలో చివరిదైన మోక్షమే అసలైన పురుషార్థం అని భావించేవారున్నారు. మోక్షం అంటే ముక్తి, మళ్లీ జన్మించే అవసరం లేకపోవడం. బమ్మెర పోతన తాను భాగవతం ఎందుకు రాస్తున్నాడో తెలుపుతూ ప్రారంభ పద్యంలోనే ‘‘శ్రీ కైవల్య పదంబు జేరుటకై చింతించెదన్’’ అన్నారు. కైవల్యమే తన లక్ష్యం అన్నారు. భక్తినే మార్గంగా ఎంచుకున్నారు.
సమాజం సుఖశాంతులతో ఉండాలంటే ధర్మబద్దంగా జీవించాలి. ధర్మబద్దంగా జీవించడానికి ప్రేరణను ఇస్తుంది భక్తి. అందుకే భారతీయ జీవనంలో భక్తి అంతర్భాగం అయింది. మంత్రాలతో అర్చించడమే భక్తి అని కొందరు భావిస్తారు కానీ ఏ మంత్రమూ రాని సాలెపురుగు, సర్పము, ఏనుగు తమ తమ శక్తి కొలది పరమేశ్వరుని పూజించి మోక్షాన్ని పొందాయని శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో తెలుస్తుంది. వయసు ప్రధానం కాదని ధృవుని కథ వల్ల తెలుస్తుంది. తాత్కాలిక సుఖాలకో, శాశ్వతం కాని దేహం కోసమో ఆరాటపడకుండా తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను, బంధువులను, సాటి మనుషులను గౌరవిస్తూ, భావితరాలకు మంచి జీవనాన్ని అందించేలా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, సర్వప్రాణులలో భగవంతున్ని దర్శిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడడమే నిజమైన భక్తి.

అమ్మకు అన్నం పెడదాం!
పరమాత్మకు ప్రతీకాత్మకంగా పంచభూతాత్మక ప్రకృతిని ఆరాధించడం భారతీయ సనాతన వారసత్వంలో అనాదిగా వస్తున్న సంప్రదాయం. పంచభూతాల ముందు తమ శక్తిసామర్థ్యాలు చాలా పరిమితమైనవని అర్థం చేసుకున్న మానవుడు వాటికి దాసోహమన్నాడు. ఆరాధించడం మొదలుపెట్టాడు. తన ఆనందాన్నయినా, ఆవేదనైనా ఆ పంచభూతాలతోనే పంచుకున్నాడు. పంట బాగా పండితే అందులో భాగమిచ్చాడు. పండక బీడువారితే వాటి ముందే బాధపడ్డాడు. ప్రకృతి వైపరీత్యాల నివారణకు మార్గం వాటిని ప్రార్థించడమేనని నిర్ణయించుకున్నాడు. స్తుతించకపోయినా, షోడశోపచారాలు చేయలేకపోయినా తమకు ఉన్న తృణమో, ఫలమో నివేదించి ఆరాధించారు. ఈ సృష్టి ప్రకృతి, పురుషుల కలయిక వల్ల ఏర్పడింది. పురుషుడు తండ్రి అయితే ప్రకృతి తల్లి అయింది. తండ్రి కంటే తల్లి దగ్గర పిల్లలకు చనువు ఎక్కువ. ఏం కావాలన్నా ముందు అమ్మనే అడుగుతాం. ఎలాంటి తప్పులు చేసినా ఆమె కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది. అందుకే ప్రకృతి ఆరాధనలో అమ్మతత్త్వమే ముఖ్యమైంది. మీనాక్షి, కామాక్షి వంటి సౌమ్యమూర్తిగానే కాదు, కాళి, దుర్గ వంటి ఉగ్రమూర్తిగా కూడా అమ్మను కొలుచుకోవడం ఆనవాయితీ. ఇక ఊరి చివర కొలువుండి ప్రజలను కాపాడేదీ అమ్మేనని భావించి పూజలు చేయడం మొదలైంది. అలా తెలంగాణ ప్రాంతంలో అమ్మకు చేసే పూజలే బోనాలు.
మనం ప్రీతిగా ఆరగించే ఏ పదార్థమైనా ముందు దైవీ శక్తులకు సమర్పిస్తే శ్రేయోదాయకమని విశ్వాసం. యజ్ఞద్రవ్యమైన అన్నాన్ని ఆశ్రయించి దైవీశక్తులు ఉంటాయి. సకల జీవుల మనుగడకు ఆధారమైన ఈ అన్నానికి రూపాంతరమే బోనం. ఇక్కడ గ్రామదేవతలకు బోనం సమర్పించడమంటే ప్రకృతి శక్తులకు కృతజ్ఞత చెల్లించడమే. అందుకే అమ్మవారికి అన్నాన్ని సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. దీన్నే కాకతీయుల కాలంలో జానపదులు బోనం అన్నారు. రుతువులు మారి వ్యాధులు సంక్రమించే ఆషాఢమాసంలో గ్రామాలను కాపాడాలని కోరుకుంటూ దైవీశక్తులకు బోనాలు సమర్పించి ఉత్సవాలు నిర్వహించేవారు. హైదరాబాద్ ప్రాంతంలో తరచుగా వచ్చే అంటువ్యాధులు నివారించాలని కోరుకుంటూ భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా గ్రామదేవతల జాతరలను జరిపేవారు. అవే నేటికీ బోనాల ఉత్సవాలుగా కొనసాగుతున్నాయి.
జంటనగరాల్లో ఆషాఢ మాసంలో బోనాల వేడుక జరిగితే.. తెలంగాణ పల్లెల్లో శ్రావణ మాసంలో ఈ ఉత్సవం నిర్వహిస్తుంటారు.
* భాగ్యనగర శివారులోని పల్లెల్లో శ్రావణ మాసంలో బోనాలు సమర్పిస్తారు.
* ఉత్తర తెలంగాణలోని గ్రామాల్లో ఎల్లమ్మకు వైశాఖ, జ్యేష్ఠ మాసాల్లో, పోచమ్మకు శ్రావణ మాసంలో బోనాలిస్తారు. మల్లన్న బోనాలు సంక్రాంతి సమయంలో జరుగుతాయి.
* కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో వైశాఖ పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి సమయంలో బోనాల జాతర జరుగుతుంది.
* మహబూబ్నగర్ ప్రాంతంలో శ్రావణ మాసంలో పెద్దమ్మ, అంకాళమ్మ, పోశవ్వ తదితర గ్రామదేవతలకు బోనాలు సమర్పిస్తారు.
* వేములవాడ క్షేత్రంలో కొలువై ఉన్న పోచమ్మతల్లికి భక్తులు నిత్యం బోనాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.

ఏది దారి?
మనిషి తన జీవితాన్ని సఫలం చేసుకోవడానికి ఎన్నో మార్గాలను అనుసరిస్తాడు. సమాజంలో ఒక వ్యక్తిగా, శక్తిగా నిలిచేందుకు జ్ఞానవిజ్ఞానాలను ఆశ్రయిస్తాడు. తాను ఎన్నుకొన్న వృత్తిలో, ఉద్యోగంలో రాణించడానికి కృషిచేస్తాడు. సమాజంలో తనకు కీర్తిప్రతిష్ఠలు రావాలని కోరుకుంటాడు. ఇంతటితో మనిషి తన జీవితంలో పరిపూర్ణత సాధించినట్లు కాదు. భౌతికంగా ఎంతగా ఎదిగినా, మానసికంగా ఎదగకపోతే అన్ని ప్రయత్నాలూ బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి. మానసికంగా ఉన్నతిని సాధించాలంటే ఆధ్యాత్మికతవైపు అడుగులు వేయక తప్పదు.
ఆధ్యాత్మిక విచారధారలో ‘నేనెవరు, ఎందుకు పుట్టాను, నేను ఏమి సాధించాలి, దేనిలో మానసిక ప్రశాంతత దొరుకుతుంది?’ అనే ప్రశ్నలు ఉదయిస్తాయి. ఇలాంటి సందేహాలను తీర్చుకొనేందుకు మనిషి ఎన్నోదారులను ఎన్నుకుంటాడు. అన్ని దారులూ అనుకున్న గమ్యాన్ని చేరుస్తాయా, మధ్యలోనే ఆగిపోతాయా అని ఆలోచిస్తాడు. తనకు అమూల్యమైన మానవజన్మను ప్రసాదించిన భగవంతుడికి కృతజ్ఞతగా ఏదైనా సమర్పించుకోవాలనుకుంటాడు. పూజలు చేస్తాడు. నామ పారాయణం కొనసాగిస్తాడు. మంత్రాలను జపిస్తాడు. ఉపవాసదీక్షలతో తపిస్తాడు. హోమాలు చేస్తాడు. యాగాలను ఆచరిస్తాడు. వ్రతాలు చేస్తాడు. తీర్థయాత్రలు చేస్తాడు. సాధుసత్పురుషుల ఉపదేశాలు వింటాడు. దేవాలయాలను దర్శిస్తాడు. పవిత్ర నదీజలాల్లో స్నానాలు ఆచరిస్తాడు. దానధర్మాలు చేస్తాడు. భజనలు చేస్తాడు. నవవిధ భక్తులనూ ప్రదర్శిస్తాడు. సంకీర్తనలను గానం చేస్తాడు. ఇలా భగవంతుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి అనేక రీతుల్లో, ఎన్నో తీరుల్లో ప్రయత్నిస్తుంటాడు. ఇవన్నీ పరమాత్ముడి దగ్గరికి చేర్చే దారులే. ఇందులో ఏ దారి గొప్పది? అన్ని నదులూ సాగరంలోనే చేరతాయి. అలాగే అన్ని ఆధ్యాత్మిక మార్గాలూ భగవంతుడి దగ్గరకే చేరతాయి.
మనిషి తాను అనుసరిస్తున్నదే గొప్పదని, ఇతరులు అనుసరించేవి సరైనవి కావని అనుకుంటుంటాడు. ఆరు రుచుల్లో ఏది గొప్ప అంటే ఏమి చెప్పగలం? సందర్భాన్నిబట్టి రుచికి విలువ ఉంటుంది.
సంకుచితమైన మనసు కలవాళ్లు ‘వీడు నావాడు, వాడు పరాయివాడు’ అని మనుషుల్లో భేదాలను చూస్తారుగాని, ఉదారచరితులైన మహాత్ములు మాత్రం ఈ ప్రపంచం అంతా ఒకటే కుటుంబం అనే భావనతో చూస్తారని నీతికారులు చెబుతారు.
భగవంతుడికి ఒకరూపం లేదని, ఒకనామం లేదని వేదాంతాలు చెబుతున్నాయి. నామరూపాలు లేని భగవంతుడికి మనిషే వాటిని కల్పించాడు. మనిషి మనసు చంచలమైంది. ఒక్కక్షణం కూడా నిలకడగా ఉండదు. అలాంటి మనసును ఒకచోట స్థిరంగా నిలపాలంటే ఒకరూపం ఎదుట కనిపించాలి. ఏదో ఒకపేరు వినిపించాలి. అందుకే మనిషి భగవంతుడికి అనేక రూపాలను కల్పించుకొని ఉపాసన చేస్తున్నాడు. ఈ ఉపాసన వల్ల తన మనసును ఏకాగ్రంగా ఉంచుకొనగలుగుతున్నాడు. పేర్లుపెట్టి పిలుస్తూ తన మనోభావాలను ప్రకటించుకొంటున్నాడు. తాను మానసిక విశ్రాంతిని, ప్రశాంతిని పొందుగలుగుతున్నాడు. ఏది ఆచరిస్తే మనసు స్థిరంగా ఉంటుందో ఆ ప్రయత్నం సరైనదే. దాన్ని మనిషి తన ఆధ్యాత్మిక మార్గంగా మలచుకొంటున్నాడు.
మానవశరీరంలోని అన్ని ఇంద్రియాలు, మనసుతోనే పనిచేస్తాయి. మనసుతో అనుసంధానం లేకుంటే ఏ ఇంద్రియమూ చక్కగా పనిచేయదు. కనుక మనసును గొప్ప భావనలకు, ఆలోచనలకు వినియోగించాలని పెద్దలమాట. అన్నివైపుల నుంచీ వచ్చే మంగళకర భావనలను మనిషి మనసుతో స్వీకరించాలని వేదం చెబుతోంది. కనుక అన్ని దారులూ మంచివే. ఏ దారిలో వెళ్లినా అనుకున్న గమ్యాన్ని చేరడమేకదా కావలసింది? దారులు కాదు, గమ్యమే ముఖ్యం అన్నది జీవితసత్యం!

శ్రావణ మాస విశిష్టత
2-8-2019 శుక్రవారం నుండి 30-8-2019 వరకు శ్రావణ మాసం
శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు, నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. *ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పోలాల అమావాస్య, నాగ చతుర్థి(4.8.19 ఆదివారం); నాగ పంచమి, గరుడ పంచమి (5.8.19); పుత్రాదా ఏకాదశి(11.8.19 ఆదివారం),దామోదర ద్వాదశి(12.8.19 సోమవారం),వరాహ జయన్తి* ఇలా అనేక పండుగలు వస్తాయి. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా, చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావము చూపే మాసము. ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపును. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కలిగించుటకు, ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమైనది. మనస్సు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమార్ధము వైపు మనస్సును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకొనుటకు, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసం లో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశమైనది.
శ్రావణ సోమవారాలు (5.8.19; 12.8.19; 19.8.19; 26.8.19)
ఈ మాసం లో వచ్చే సోమవారాలలో శివ భక్తులు ఉపవాసాలుంటారు. దీక్షతో ఉపవాసం ఉండి, శివుడికి అన్ని రకాల అభిషేకాలు నిర్వహిస్తారు. పార్వతి దేవి కి కుంకుమ పూజ చేస్తే ఐదవతనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాడం గా నమ్ముతారు
శ్రావణ మంగళవారాలు (6.8.19; 13.8.18; 20.8.19; 27.8.19)
శ్రీ కృష్ణుడు ద్రౌపదీదేవికి, నారద మునీంద్రుడు సావిత్రిదేవికి ఉపదేశించిన మంగళగౌరి వ్రతము ఈ మాసం లో ఆచరించడం ఎంతో ప్రాసస్థ్యమైనవి. మంగళగౌరి కటాక్షం ఏ స్త్రీల పై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదు. సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్దిల్లుతారు. కొత్తగా పెళ్ళైన వారు తప్పక ఐదు సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. అలాగే కొన్ని ప్రాంతాల వారు ఈ వ్రతాన్ని పెళ్లి కాని పిల్లల చేత కూడా చేయిస్తారు. పెళ్లి కి ముందు నాలుగు సంవత్సరాలు చేయించి పెళ్ళైన తర్వాత మిగిలిన ఒక సంవత్సరం ఈ వ్రతాన్ని నోచుకొంటారు.
శ్రావణ శుక్రవారాలు (2.8.19; 9.8.19; 16.8.19; 23.8.19)
శ్రీ వరలక్ష్మి వ్రతం (9.8.2019 శుక్రవారం)
*ఈ మాసంలో పౌర్ణమి కి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి దేవిని షోడసోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, అయిదవతనం, సంతానాభివృద్ది కలకాలం ఉంటాయని శాస్త్రం చెప్తోంది. లక్ష్మి దేవి భక్త శులభురాలు. ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, బలం ఈ అష్ట శక్తులని అష్టలక్ష్ములు గా ఆరాదిస్తాము. శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటిని రక్షించేవాడు, ఈ శక్తులన్నీ ఈయన ద్వారా ప్రసరించేవే. అతీత విషయాలని సామాన్య మానవులు గ్రహించలేరు. ఈ శక్తులన్నీ సక్రమంగా ఉంటేనే మనకి ఆయురారోగ్య, ఐశ్వర్య, సంతోషాలు కలుగుతాయి. లక్ష్మి దేవికి అత్యంతప్రీతికరమైన శుక్రవారం నాడు పూజిస్తే ఇవన్నిచేకూరుస్తుందని శ్రీ సూక్తం వివరిస్తుంది. అష్టలక్ష్ములలో వరలక్ష్మి దేవికి ఓ ప్రత్యకత ఉంది. మిగిలిన లక్ష్మి పూజలకంటే వరలక్ష్మి పూజ శ్రేష్ఠమని శాస్త్రవచనం. శ్రీహరి జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసం లో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ వ్రతాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ సంప్రదాయాలలో ఆచరిస్తారు. ఎవరు ఏ రీతి లో ఆచరించిన సకల శుభకరమైన, మంగళప్రదమైన ఈ వరలక్ష్మి దేవి పూజ జగదానందకరమైనదని భక్తుల విశ్వాసం*
శ్రావణ శనివారాలు
ఈ మాసం లో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పు ని పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది. ఈ మాసం లో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపొయిన, కనీస ఒక్క శనివారమైన పూజా విధానాన్ని ఆచరించడం మంచిది.
శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి (15.8.2019 గురువారం)
శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, గాయత్రి జయంతి, హయగ్రీవ జయంతి, భారత స్వాతంత్ర్య దినోత్సవం ని ఈ రోజు జరుపుకొంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి హయగ్రీవుడిని ఈ రోజున పూజించందం ద్వారా, ఏకాగ్రత, బుద్ది కుశలత, జ్ఞానం, ఉన్నత చదువు, కలుగుతాయని ప్రతీతి .
జంధ్యాన్ని యగ్నోపవీతమని , బ్రహ్మసూత్రమని పిలుస్తారు. యజ్ఞోపవీతం సాక్ష్యాత్తు గాయత్రి దేవి ప్రతీక. యజ్ఞోపవీతం వేదాలకు ముందే ఏర్పడింది.
ఈ రోజు పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ది కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలం కలుగుతుందని వెదోక్తి. ఈ రోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు