Devotional Telugu
3.46K subscribers
106 photos
23 videos
19 files
62 links
An attempt to bring our Hindu Devotional information
Download Telegram
తిధులు

వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిథి అంటారు లేదా శాస్త్రీయముగా సూర్యుడు మరియు చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు. తిధులు రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉన్నది. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి. శుక్లపక్షంలో పాడ్యమి నుండి పూర్ణిమ వరకు 15, మరల కృష్ణపక్షంలో పాడ్యమినుండి అమావాస్య వరకు 15. మొత్తం 30 తిథులు. రవి చంద్రుల మధ్య దూరం 0 డిగ్రీ ఉన్నప్పుడు అమావాస్య, 180 డిగ్రీలు దూరమున్నప్పుడు పూర్ణిమ ఏర్పడుతాయి. చంద్రుడు, రవి నుండి ప్రతి 12 డిగ్రీలు నడిచినపుడు తిథులు మారతాయి.

తిధులు అధిపతులు

పుణ్య తిధులు*
*మనం దేవతలను పలురకాలుగా, మనకు వీలైన రీతిలోపూజిస్తూ ఉంటాము. ఆ విధంగా చేసే పూజలు నియమనిష్టలతో చేసినట్లైతే తగిన ఫలితం వస్తుంది. దీనికిసంబందించిన తిధులు, వాటి ప్రత్యేకత, ఏ రోజు ఏదేవతను ఆరాధిస్తే ఎంతటి పుణ్య ఫలం కలుగుతుందోఅనే వివరణ *మనకు వరాహ పురాణం లో వివరించబడినది.వరాహ పురాణం లో శ్రీ మహా విష్ణువు స్వయంగాతిధులు వాడి విశేషాల గురించి భూదేవి కి వివరించారు*.

*తిధులు వాటి విశిష్టత* :

పాడ్యమి :
దేవతలలో ముందు పుట్టిన వాడు అగ్ని. కాబట్టి తిధులలోమొదటిదైన పాడ్యమి నాడు అగ్ని ని పూజించి, ఉపవాసంఉండినట్లైతే మంచి ఫలితం ఉంటుంది.

విదియ :
అశ్విని దేవతలను ఆరాధించాలి. వారు ఆ తిధి నాడుపుట్టినందు వల్ల, ఏడాదిపాటు అశ్విని దేవతలను ఉద్దేశించివిదియ వ్రతాన్ని నియమ నిష్టలతో చేస్తే శుభప్రదం.

తదియ :
గౌరీ దేవిని పూజించాలి. గౌరీ కళ్యాణం తదియ నాడుజరిగినందు వల్ల, గౌరీ దేవికి ఆ తిధి అంటే ఇష్టం. ఇదిప్రత్యేకంగా స్త్రీ ల కోసం ఏర్పాటు అయినది.

చవితి:
వినాయకుడు పుట్టిన తిధి. వినాయక చవితి నాదేకాకుండా ప్రతీ చవితినాడు వినాయకుడిని పూజించవచ్చు.

పంచమి:
పంచమి నాడు నాగులు జన్మించాయి. అందుకేనాగాదేవతలకు పంచమి తిధి / నాగుల చవితి అన్న చాలఇష్టం. ప్రతీ పంచమినాడు పుట్టలో పాలు పోసి నాగ పూజచేస్తే నాగుల వల్ల భయం ఉండదు.

షష్టి :
కుమారస్వామి /సుబ్రహ్మణ్య స్వామి జన్మతిధి. ఆ రోజునఅర్చన చేసినట్లైతే సుబ్రహమణ్య అనుగ్రహం పొందగలరు.

సప్తమి:
సూర్యుని జన్మ తిధి. రధసప్తమి నాడే కాకుండా ప్రతీ శుద్ధసప్తమి నాడు సూర్యుడిని ఆరాదించి క్షీరానాన్ని నైవేద్యంగాపెడితే ఆయురారోగ్యాలు కలుగుతాయి.

అష్టమి:
దుర్గాదేవి అష్టమాకృతులు ఆవిర్భవించిన తిధి.అష్టమాకృతులను, దుర్గా దేవిని పూజిస్తే శుభంకలుగుతుంది.

నవమి:
దుర్గాదేవి కి ప్రీతికరమైనది. ఆ తిధి నాడు దుర్గ నుపూజించి ఉపవాసం ఉంటే సంపదలు కలుగుతాయి.

దశమి:
దశమి నాడు దిక్కుల సృష్టి జరిగింది. ఇంద్రాది దేవతలుఈ దిక్కులకు పాలకులు. దిక్పాలకులను పూజిస్తే పాపాలుతొలగుతాయి.

ఏకాదశి:
కుబేరుడు పుట్టిన తిధి. ఈ తిధిన కుబేర పూజ చేస్తేఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది

ద్వాదశి:
విష్ణువు కి ఇష్టమైన తిధి. ఈ తిధి రోజే విష్ణు మూర్తి,వామన రూపం లో జన్మించారు. ద్వాదశి నాడు ఆవునెయ్యి తో వ్రతం చేస్తే పుణ్యం లభిస్తుంది.

త్రయోదశి:
ధర్ముడు పుట్టిన తిధి. ఈ రోజున ఎవరికీ ఇష్టమైన దేవుడినివారు తలచుకొని పూజిస్తే , ఫలం చేకూరుతుంది.

చతుర్దశి:
రుద్రుని తిధి. ఆనాడు రుద్రార్చన చేసినట్లైతే శుభప్రదం.కృష్ణ చతుర్దశి నాడు మాస శివరాత్రి వస్తుంది. ఆ తిధిశివుడికి ప్రీతికరం.

అమావాస్య:
పితృదేవతలకు ఇష్టమైన తిధి. దర్భలు, నువ్వులు, నీళ్ళతోపితృదేవతలకు తర్పనమిస్తే వారు సంతోషించి సంతానసౌక్యం అనుగ్రహిస్తారు.

*పౌర్ణమి:*
*పౌర్ణమికి చంద్రుడు అధిపతి. పౌర్ణమి నాడు పగలంతాఉపవాసం ఉంది రాత్రి కి చంద్రుడిని పూజించినట్లితేధనధాన్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలుసిద్దిస్తాయి.*

అగ్నిః ప్రతిపదః - పాడ్యమికి అగ్ని అధిపతి

బ్రహ్మా ద్వితీయాయాః - విదియకు బ్రహ్మ

పార్వతీ తృతీయాయాః - తదియకు పార్వతి

చతుర్ధాః గణపతిః - గణపతి చవితికి

పంచమ్యాః శేషః - పంచమికి ఆదిశేషుడు

కుమారః షష్ఠ్యా: - కుమారస్వామి షష్ఠికి

సూర్య: సప్తమ్యా: - సూర్యుడు సప్తమికి

శివోష్టమ్యా: - అష్టమికి సదాశివుడు

వసవ : నవమ్యా: - నవమికి అష్టవసుపులు

దిగ్గజా: దశమ్యా: - దిగ్గజములు దశమికి

యమ ఏకాదశ్యా: - ఏకాదశికి యమధర్మరాజు

విష్ణు : ద్వాదశ్యా: - ద్వాదశికి విష్ణువు

మన్మథ: త్రయోదశ్యా; - త్రయోదశికి మన్మధుడు

కలిపురుష: చతుర్దశ్యాః - చతుర్దశికి కలిపురుషుడు

చంద్ర: పౌర్ణమాస్యా: - పున్నమకు చంద్రుడు

అగ్నిష్వాత్తాదిపితర : అమావాశ్యా: - అగ్నిష్వాత్తు మొదలైన పితృ దేవలు అమావాస్యకు

క్రమాదధిపా: - క్రమముగా నధిపతులు,

ఉత్తమ తిధులు:- 11. శుక్ల ఏకాదశి,12. శుక్ల ద్వాదశి,13. శుక్ల త్రయోదశి,14. శుక్ల చతుర్దశి,15. పూర్ణిమ, 1. కృష్ణ పాడ్యమి,2. కృష్ణ విదియ,3. కృష్ణ తదియ,4. కృష్ణ చవితి,5. కృష్ణ పంచమి.

మద్యమ తిధులు:- 6. శుక్ల షష్ఠి,7. శుక్ల సప్తమి,8. శుక్ల అష్టమి,9. శుక్ల నవమి,10. శుక్ల దశమి, 6. కృష్ణ షష్ఠి7. కృష్ణ సప్తమి,8. కృష్ణ అష్టమి,9. కృష్ణ నవమి,10. కృష్ణ దశమి.

అధమ తిధులు:- 12. శుక్ల ద్వాదశి,3.శుక్ల తదియ,4.శుక్ల చవితి
,5.శుక్ల పంచమి.11.కృష్ణ ఏకాదశి,12.కృష్ణ ద్వాదశి,13.కృష్ణ త్రయోదశి,14.కృష్ణ చతుర్ధశి,15.అమావాస్య.

సంకల్పతిధి;-ఒక రోజు సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఏ తిధి ఉన్నదో ఆ తిధినే ఆ రోజంతా సంకల్పానికి చెప్పాలి.ఒక రోజు సూర్యోదయానికి ఒక తిధి ఉండి మరుసటి రోజు సూర్యోదయం లోపల ఇంకొక తిధి వస్తే మొదటి తిధి ‘ఉపరి’రెండవ తిధి అని చెప్పాలి.

తిధి సంధి:-పంచమి,షష్ఠి లయొక్కయు,దశమి,ఏకాదశి ల యొక్కయు 4 ఘడియలు తిధిసంధి అనబడును.ఈ సంధిన జననమైన యెడల పితృగండం.
గండతిధి:-పూర్ణ తిధులలో చివరి 48 నిమిషాలు,నంధ తిదులలో మొదటి 48 నిమిషాలు తిధి గండాతాలు అవుతాయి.శుభకార్యాలు చేయరాదు.

పంచ పర్వతిధులు :-అష్టమి,చతుర్ధశి,అమావాస్య,పౌర్ణమి,సూర్య సంక్రమణం ఉన్న తిధి పంచపర్వ తిధులు అంటారు.ఇవి శుభకార్యాలకు పనికిరావు.

పక్ష రంధ్ర తిధులు:-చవితి మొదటి 8 ఘడియలు,షష్ఠి మొదటి 9 ఘడియలు,అష్టమి మొదటి 14 ఘడియలు,నవమి మొదటి 25 ఘడియలు,ద్వాదశి మొదటి 10 ఘడియలు,చతుర్ధశి మొదటి 5 ఘడియలు.ఈ ఘడియలలో వివాహం చేయరాదు.మిగిలిన ఘడియలు శుభప్రధములు.

పితృకార్యములకు తిధి:-అహఃప్రమాణమును (పగటి ప్రమాణం)ను ఐదు భాగాలుగా చేస్తే అందులో మొదటిభాగం ప్రాతఃకాలం,రెండవ భాగం సంగమ కాలం,మూడవ భాగం మధ్యాన్నం,నాల్గవ భాగం అపరాహ్నం,ఐదోభాగం సాయంకాలం .ఏ తిధి మద్యాన్నం మించి అపరాహ్నం వరకు వ్యాపించి ఉన్నదో ఆ తిధి పితృకార్యములకు మంచిది.
Forwarded from utubebot
Audio
SRI LAKSHMI NRUSIMHA KARAVALAMBA STOTRAM WITH TELUGU MEANING
🙏ఓం హ్రీం ఘృణిః సూర్య ఆదిత్య శ్రీం
రోజుకు 108 సార్లు
48 రోజులు పటించడం వలన
ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుటే కాక మన శరీరం నందు, మన మున్నా ప్రదేశమందు ఉన్న ఋణావేస శక్తి నిర్ములన జరిగి, ధనవేశ శక్తి ప్రసరింపబడును
ప్రయత్నించి చుడండి🙏
🙏జై శ్రీరామ్🙏
''ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్''

అనే మహామృత్యుంజయ మంత్రాన్ని మహాశివరాత్రి రోజున పఠిస్తే అనుకున్న కార్యాలు విజయంవంతంగా పూర్తవుతాయి.

ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పునర్జన్మంటూ వుండదు.

మహాశివరాత్రి రోజున ''ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి.. తన్నో రుద్ర: ప్రచోదయాత్'' అనే శివ గాయత్రి నామంతో శివునిని పూజించే వారికి సకలసంపదలు చేకూరుతాయి.

ఈ మంత్ర జపంతో శివుని అనుగ్రహం పొందవచ్చు. ఈ రెండు మంత్రాలను శివరాత్రి రోజున 108 సార్లు జపించినట్లైతే దీర్ఘాయువు, ఆరోగ్యం చేకూరుతుంది. ప్రశాంతత, ఆనందం చేకూరుతుంది. భయం తొలగిపోతుంది. శరీరానికి బలం చేకూరుతుంది. ఏకాగ్రతను పెంచుతుంది. మహాశివరాత్రి రోజునే కాకుండా ఓ రోజైనా పగలు లేదా రాత్రి పూట ఈ మంత్ర జపంతో పరమేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు.
ప్రతీ మంగళవారం విజయనగరం పైడితల్లి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, నివేదన జరుగుతుంది. ఆ ఫోటోలను ఆలయ అధికారుల సహకారంతో కుదిరినంతవరకు ఈ గ్రూపు ద్వారా అందేలా ప్రతి వారం ప్రయత్నం చేస్తున్నాము.
ఇది నేటి అలంకరణ చిత్రం.🙏