Devotional Telugu
3.46K subscribers
106 photos
23 videos
19 files
62 links
An attempt to bring our Hindu Devotional information
Download Telegram
కార్తికపురాణం - ప్రథమాధ్యాయము

శ్లో!! వాగీశాద్యాస్సుమనసః సర్వార్థానాముపక్రమే!
యన్నత్వా కృతకృత్యాస్స్యుః తం నమామి గజాననమ్!!
ఋషయ ఊచుః
శ్లో!! వశిష్ఠేన విదేహాయ కథితం బ్రూహినో మునే!
శ్రోతుకామావయంత్వత్తః కార్తీకవ్రతముత్తమమ్!!
తా!! నైమిశారణ్యమందు సత్రయాగ దీక్షితులయిన శౌనకాది మహామునులు ఒకప్పుడు జనకునకు వశిష్ఠ మహాముని చేత చెప్పబడిన కార్తీక మహాత్మ్యమును సవిస్తారముగా మేము మీవలన వినగోరితిమి అని సూతుని అడిగిరి.
సూతుడు ఇట్లు చెప్పెను. శౌనకాది సమస్తమునీశ్వరులారా! వినుడు. ఈ కార్తీకమహాత్మ్యమును వశిష్ఠమహాముని జనకమహారాజుకు చెప్పెను. పూర్వము నారదునకు బ్రహ్మయు, పార్వతికి శివుడు, లక్ష్మీదేవికి విష్ణువు చెప్పినారు. దీనివలన సమస్త సంపత్తులు ప్రాప్తించును. దీనిని విన్నవారు జననమరణ రూప సంసార బంధనమును త్రెంచుకుని మోక్షము పొందుదురు.
ఒకానొకప్పుడు దైవవశముచేత సిద్ధాశ్రమమునకు బోవుచు వశిష్ఠమహాముని జనకమహారాజు గృహమునకు జేరెను. అంత జనకమహారాజు వచ్చిన వశిష్ఠుని చూచి సింహాసనమునుండి త్వరగా దిగి సాష్టాంగ దండ ప్రణామముజేసెను. సంతోష పులకాంకితుడై అర్ఘ్యపాద్యాదులచేత పూజించి మునిపాదోదకమును తన శిరస్సున చల్లుకొనెను. బంగారపు ఆసనమునిచ్చి వికసించిన తామరపువ్వుల వంటి కన్నులు గలవాడును, సమస్త జంతువులయందును దయగలవాడును, బాలసూర్యసమాన కాంతిగలవాడును, సమస్త సుగుణ సంపన్నుడును అగు మునికి భక్తి భావముతో ఇట్లని విన్నవించెను.
బ్రాహ్మణోత్తమా! మీదర్శనము వలన ధన్యుడనైతిని. నేను చేయదగిన పుణ్యమింకేమియు లేదు. ఇప్పుడు మా పితరులందరును తృప్తినొందినారు. మహాత్ములయొక్క దర్శనము సంసారులకు దుర్లభము, కనుక ఇప్పుడు మీరాక నాకు శుభములకు కారణమైనది.
సూతుడిట్లు చెప్పెను. తరువాత వశిష్ఠమహర్షి వికసించిన ముఖముగలవాడై దయతో గూడినవాడై సంతోషించి చిరునవ్వుతో ఇట్లని పలికెను. రాజోత్తమా! నీకు క్షేమమగుగాక. నేను మా యాశ్రమమునకు బోవుచున్నాను. రేపు మా ఇంటివద్ద యజ్ఞముజరుగును. దానికి ద్రవ్యమును ఈయగోరుదును.
ఆరాజిట్లు పల్కెను. మునీశ్వరా! యజ్ఞమునకు చాలా ద్రవ్యమును ఇచ్చెదను. గాని వినువారి పాపములను పోగొట్టు ధర్మరహస్యములను నీవలన వినగోరితిని. నీకు తెలియని ధర్మరహస్యములు లేవు కాబట్టి అధికఫలమునిచ్చెడి సూక్ష్మధర్మములను నాకు చెప్పుము. మునీశ్వరా! ధర్మజ్ఞా కార్తీకమాసము సమస్త మాసములకంటెను సమస్త ధర్మములకంటెను ఎట్లధికమైనదో దానిని వినగోరితిని నాకు చెప్పుము.
వశిష్ఠుడిట్లు పల్కెను. రాజా! పూర్వ పుణ్యమువలన సత్వశుద్ధి గలుగును. సత్వశుద్ధి గలిగిన పుణ్యమార్గమందు అభిలాషగలుగును. లోకోపకారార్థమై నీవడిగిన మాట చాలా బాగున్నది. చెప్పెదను. వినుము. విన్నంతనే పాపములు నశించును. సత్త్వగుణము కలుగును. రాజా! సూర్యుడు తులారాశియందుండగా కార్తీకమాసములో చేసిన స్నానము దానము అర్చనము మొదలైనవి మంచి మనస్సుతో ఏవి చేసినను అవి అక్షయములగునని మునీశ్వరులు చెప్పిరి. కార్తీకవ్రతమును తులాసంక్రమణము = సూర్యుడు తులారాశిలో ప్రవేశించుట మొదలుకొని గాని, కార్తీక శుక్ల ప్రతిపత్ మొదలుకొని గాని, ఆరంభించి నెలరోజులు చేయవలెను. ఆరంభమందు ఓ దామోదరా! నేను కార్తీకవ్రతము ఆరంభించుచున్నాను. దానిని నిర్విఘ్నముగా పూర్తిజేయుము అని సంకల్పము చేసి కార్తీకస్నానమారంభించవలెను. కార్తీకమాసమునందు సూర్యోదయసమయమున కావేరీనదియందు స్నానమాచరించిన వారికి మహాఫలము కలుగగలదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించినతోడనే మూడులోకములను పవిత్రముజేయుచు గంగ ద్రవరూపమును ధరించి సమస్త జలములయందును ప్రవేశించును. తులారాశియందు కార్తీకమున చెరువులందును, దిగుడుబావులందును, నూతులందును, చిన్నకాలువలందును హరి నివసించియుండును. కార్తీకమందు వ్రతము అన్ని వర్ణాలవారు జేయవచ్చును.
బ్రాహ్మణుడు కార్తీకమాసమందు గంగకుబోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళుచేతులు కడుగుకొని ఆచమనము చేసి శుద్ధుడై మంత్రములచేత భైరవానుజ్ఞను పొంది మొలలోతు జలమందు స్నానము చేయవలెను. తరువాత దేవర్షిపితృతర్పణ మాచరించి హరిభక్తితో అఘమర్షణ మంత్రమును పఠించుచు బొటనవ్రేలి కొనతో ఉదకమును ఆలోడనము చేసి తీరమునకు వచ్చి అచ్చట యక్ష్మతర్పణమును చేసి ధరించిన వస్త్రమును పిడిచికట్టుకొని ఉదకమును వదలి ఆచమనము చేసి శిరస్సును వదలి మిగిలిన శరీరమంతయు తడి వస్త్రముతో తుడుచుకొని నారాయణ ధ్యానమాచరింపుచు ధౌతవస్త్రమును ధరించవలెను. తరువాత గోపీచందనముతో ఊర్ధ్వపుండ్రములను ధరించి సంధ్యావందనముచేసి గాయత్రీజపము చేయవలెను. స్త్రీలు గౌరీజపము చేయవలెను. తరువాత ఔపాసనముగావించి బ్రహ్మయజ్ఞము చేసి తన తోటలోనుండి పుష్పములు తెచ్చి శంఖచక్రములను ధరించిన హరిని భక్తితో సాలగ్రమమందు షోడశోపచారములతో పూజించవలెను. తరువాత కార్తీక పురాణమును పఠించి లేక విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి వైశ్వేదేవమును నెరవేర్చి భోజనము చేసి ఆచమనముగావించి, తరువాత పురాణకాలక్షేపమును చేయవలయును. సాయంకాలముకాగానే ఇతర వ్యాపారములన్నింటినీ ఆపివేసి, విష్ణ్వాలయమునందుగాని, శివాలయమునందుగాని, తన శక్తి కొలది దీపములుబెట్టి భక్ష్యభోజ్యాదులతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణుస్తోత్రమును గాని
శివస్తోత్రమునుగాని పఠించి నమస్కారములాచరించవలయును. ఎవడు కార్తీకవ్రతము భక్తితో చేయుచున్నాడో వాడు పునరావృత్తివర్జితమైన వైకుంఠమును బొందుచున్నాడు. పూర్వజన్మార్జితములున్ను ఈజన్మార్జితములున్ను అయిన సమస్త పాపములు కార్తీకవ్రతమాచరించిన యెడల నశించును. బ్రాహ్మణుడుగాని, క్షత్రియుడుగాని, వైశ్యుడుగాని, శూద్రుడుగాని, ఋషీశ్వరుడుగాని, స్త్రీలుగాని భక్తి శ్రద్ధలతో కార్తీకవ్రతమును జేసిన యెడల వానికి పునరావృత్తిలేని వైకుంఠమునొందుదురు. ఎవ్వడు కార్తీకవ్రతమాచరించు వానిని జూచి సంతోషించునో వానియొక్క పగటికాలమందాచరించిన పాతకము నశించును. ఇందుకు సందేహము లేదు.
ఇతి స్మాందపురాణ కార్తీకమహాత్మ్యే ప్రథమాధ్యాయ స్సమాప్తః
1 తారీఖున సోదరి ఇంట భోజనం చేయాలి..
భగినీ హస్త భోజనం విశిష్టత ఏమిటి ప్రవచన చక్రవర్తి, పూజ్యగురువుల వివరణ
కార్తీక మాసంలో మొదటిగా వచ్చేది యమ విదియ.. దీనినే భగినీ హస్త భోజనం.. అన్నా చెల్లెళ్ల పండుగ అని కూడా అంటారు.ఈ పండుగ నవంబరు 1వ తేదీన వస్తోంది. యమధర్మరాజు సోదరి యమనా దేవి ఒక రోజు అలక చెందగా ఆయన ఆమెకు ఒక వరం ఇస్తారు. యమ విదియ రోజున ఎవరు తన సోదరి ఇంట భోజనం చేస్తారో వారికి నరక భాదలు ఉండవని చెబుతారు.అందుకే ఈ రోజున సోదరి ఇంట భోజనం చేసి ఆశీర్వచనాలు అందిస్తారు. ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది
ఇంట్లో పాటించాల్సిన-పాటించకూడని ఆచారాలు.


కాలం మారిపోయింది. హైటెక్ హంగుల మాయలో పడి పూర్వ కాలం నుండి వస్తున్న మన సాంప్రదాయాలను, ఆచారాలను చాలా మంది పాటించడం లేదు. ఒక వ్యక్తి ఇంట్లో ఎలాంటి ఆచారాలు పాటించాలి, ఎలాంటి ఆచారారాలు పాటించకూడదో ధర్మం ఆచారాలు తెలిసిన వారు చెప్పిన మాటలివి.
- కొంత మంది వేళ పాళ లేకుండా చేతి గోళ్ళను కత్తిరించడం, తల వెంట్రుకలను తీయడం చేస్తుంటారు. కానీ అలా చేయడం తగదు. చాలా మందికి చేతి వేళ్ళ గోళ్ళను కొరుకుతుంటారు. చేతి గోళ్ళను తిన్నవాడు విశానమును పొందుతారు.
- లేత ఎండ, శవధూమము, విరిగిపోయిన ఆసనము - ఇవి తగవు. ఊరక మట్టిని మర్థించువాడు, గడ్డి పరకలను తుంచువాడు, ఎదుటి వాని ఉన్న దోషములను కాని, లేని దోషములను కాని వెల్లడించు వాడు, శుభ్రత లేనివాడు శీఘ్ర వినాశము పొందుదురు.
- రెండు చేతులతోను తలగోక కూడదు. ఎంగిలి చేతులతో తలను ముట్టుకొనరాదు. శిరస్సును విడిచి కేవలము కంఠ స్నానము చేయరాదు. (శిరః స్నానము ఆరోగ్య భంగకరమైనప్పుడు స్నానము చేసియే కర్మానుష్ఠానము చేసి కొనవచ్చునని జాబాలి వచనము).
- ప్రాకారము కల్గిన గ్రామమును గాని, ఇంటిని కాని ద్వారము గుండా ప్రవేశింపవలయునే కాని ప్రాకారము దాటి ప్రవేశింపకూడదు. రాత్రులందు చెట్ల కింద ఉండరాదు. దూరముగా ఉండవలయును.
- ఎక్కువ కాలం జీవించాలనుకునే వాడు వెంట్రుకలను, బూడిదలను, ఎముకలను, కుండ పెంకులను, దూదిని, ధాన్యపు ఊకను తొక్కరాదు.
- చాలా మంది సరదా కోసం పాచికలు (జూదము) ఆడుతారు అలా ఆడటం సరికాదంటున్నారు. పాదరక్షలను చేతితో మోసికొనిపోరాదు. పక్క మీద కూర్చుని ఏమియు తినరాదు. చేతిలో భోజ్య వస్తువును పెట్టుకొని కొంచెం కొంచెంగా తినకూడదు. ఆసనము మీద పెట్టుకొని ఏ వస్తువును తినరాదు.
- రాత్రి సమయంలో నువ్వులతో గూడిన ఏ వస్తువును తినకూడదు. వస్తహ్రీనుడై పడుకోకూడదు. ఎంగిలి చేతితో ఎక్కడకును వెళ్ళరాదు.
- కాళ్ళు తడిగా ఉన్నప్పుడే భోజనము చేయవలయును. దాని వలన దీర్ఘీయువు కలుగును. తడి కాళ్ళతో నిద్రకు ఉపక్రమించకూడదు.
నాగ పంచమి, నాగులచవితి ఎందుకు ఆచరిస్తారు ?
వైజ్ఞానిక విశ్లేషణ, మన సాంప్రదాయంలోని, విశిష్ట సద్భావన.

సనాతన మన భారత దేశం వ్యవసాయ ప్రధాన దేశం. దక్షిణ భారత దేశంలో
ఆషాఢం తో గ్రీష్మం సమాప్తమై, శ్రావణంతో వర్ష ఋతువు ప్రారంభమౌతుంది.
వర్షాలు విస్తారంగా పడతాయి. కృషీవలుల వ్యవసాయ కార్య క్రమములు,
తీవ్ర తరమౌతాయి. అంతవరకు,చల్లదనముకొరకు, పుట్టలలో దాగున్న సర్పసంతతి,తమ ఆహారాన్వేషణకొరకు బయటకువచ్చి, పొలాలలో, సంచరించు
ఎలుకలు, కప్పలకొరకు విచచచలవిడిగా సంచరించ ప్రారం భిస్తాయి.
అర్ధరాత్రి, అపరాత్రి, పొలాలలో సంచరించు, కృషీవలులకు వానివలన ప్రాణ హాని కలుగవచ్చును. ఇటువంటి ప్రమాదములనప ను నివారిచుటకొరకు,
విజ్ఞులై మనపెద్దలు, ఈ శ్రావణ మాసంలో నువ్వులు, బెల్లం, చలిమిడి (బియ్యంపిండితోచేసిన తీపి పదార్థం) పాలతో కలిపి చేలగట్టులయందున్న పుట్టలలో సమర్పించమని చెప్పినారు.ఈ కార్య క్రమములో ఆధ్యాత్మికతనుకూడా
జోడించుటవలన,జనులకు భక్తి, భయము ఏర్పడినాయి.
పాములు పాలుతాగవనునది జగమెరిగినసత్యము. మరి పుట్టలలో పాలు, ఇతరపదార్థములు ఎందుకువేయుచున్నారనగా ఆపిండిపదార్థములు, నూవులు, బెల్లం ఇత్యాదులను తినుటకు, చిన్నక్రిములు, చీమలు, వాటిని తినుటకు, కప్పలుమరియు ఎలుకలు ఆపుట్టల బొరియలలో ప్రవేసించునుగదా, సర్ప సంతతికి బొరియలనుండి బయటికిరాకుండగనే, వాటిస్థానమందు, తమ ఆహారము
లభించుటవలన,ప్రశాంతముగా తమ ఆహారమునారగించున వగుచున్నవి.
ఇందువలన వాటికి ప్రాణహాని, వాటివలన జనుల ప్రాణ హాని, రెండూ నివారింప
బడినవి.ఎలుకలను సర్పములారగించుటవలన, రైతులకు పంట హానికూడా కొంత
తగ్గును.
అందువలన నిజమై న పుట్టలయందు పాలుపోయుటవలన ప్రయోజనమున్నదికాని, రాతి ప్రతిమలకు పాలుపోయుటవలన కేవలంసాంకేతికమే కాని ప్రయోజనము నెరవేరదు. దేవస్థాములందు ఇట్టుల చేయుటవలన, క్రిమి కీటకాదుల కొరకు, కప్పలు, ఎలుకలు, వాటి నారగించుటకు.సర్ప సంతతి ఆలయములలో ప్రవేసించవచ్చును.
సర్పములవలన మనుష్యులకు జరుగు హానికన్నా, మనుష్యలవలన సర్ప సంతతికి ఎక్కువ కీడు జరుగుచున్నది.మనిషికి కరుస్తుందని భయము, మరి వాటికో మనుష్యులనుండి తప్పించుకొని పారిపోవుటయే ప్రాణ సంకటము.
సమస్త సర్ప సంతతి తమ నెలవులందు, నిర్భయముగా జీవిచుగాక.
అందుకే ఇలాప్రార్థిస్తారు.చలిమిడి,నూవువులతో, బెల్లంతో చేసిన పదార్థములు సమర్పణ చేయుచూ
'' తోకతొక్కితే తొలగిపో, నడుంతొక్కితే నావాడనుకో, పడగతొక్కితే పారిపో"
యజుర్వేద మంత్రం.
'' ఓం నమోఁ- స్తు సర్పేభ్యో యేకేచ పృధివి మను,
యే అంతరిక్షే యే దివి తేభ్యః సర్పేభ్యో నమః ll
భూమి మీద దివ్యలోకమున, ఈ రెంటి మధ్యగల అంతరిక్షమందున్న సర్పముకు
మరలా మరలా నమస్కారము.
'' ఓం యశ స్కరం బలవంతం ప్రభుత్వం తమేవవ రాజాధిపతిర్భభూవ l
సంకీర్ణ నాగాశ్వపతి ర్నరాణాం సుమాంగల్యం సతతం దీర్ఘమాయుః ll
శుభంభవతు.
4వ అధ్యాయము - దీపారాధన మహిమ

ఈ విధముగా వశిష్ఠుడు కార్తిక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మనుండి కూడా విముక్తి నొ౦దెదరని చెప్పుచుండగా జనకుడు 'మహితపస్వీ! తమరు తెలియజేయు యితిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీకమాసములో ముఖ్యముగా యేమేమి చేయవలయునో, యెవరినుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు' అని కోరగా వశిష్ఠుల వారు యిట్లు చెప్పదొడగిరి.

జనకా! కార్తీక మాసమందు సర్వసత్కార్యములనూ చేయవచ్చును. దీపారాధన మందు అతి ముఖ్యము. దీని వలన మిగుల ఫలము నొ౦దవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థము, శివాలయమునగాని, విష్ణ్వాలయమునందుగాని దీపారాధనము చేయవచ్చును. సూర్యాస్తమయ మందు, అనగా, సంధ్య చీకటిపడు సమయమున శివకేశవుల సన్నిధినిగాని ప్రాకారంబున౦దుగాని దీపముంచినవారు సర్వపాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తినొ౦దుదురు. కార్తిక మాసమందు హరిహరాదులు సన్నిధిలో ఆవునేతితోగాని, కొబ్బరినూనెతోగాని, విప్పనూనెతోగాని, యేదీ దొరకనప్పుడు అముదముతోగాని దీపము వెలిగించి వుంచవలెను. దీపారాధన యే నూనెతో చేసిననూ మిగుల పుణ్యత్ములుగాను, భక్తిపరులగాను నగుటయేగాక అష్టయిశ్వర్యములూ కలిగి శివసన్నిధి కేగుదురు. ఇందు కొకకథ గలదు, వినుము.

శతృజిత్కథ

పూర్వము పాంచాలదేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి, తుదకు విసుగుజెంది గోదావరీ తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా నచ్చుటకు పిప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి "పాంచాల రాజా! నీవెందులకింత తపమాచరించుచున్నావు? నీకోరిక యేమి?" యని ప్రశ్ని౦చగా, "ఋషిపుంగవా! నాకు అష్టయిశ్వర్యములు, రాజ్యము, సంపదావున్ననూ, నావ౦శము నిల్పుటకు పుత్రసంతానము లేక, కృంగి కృశించి యీ తీర్ధస్థానమున తపమాచరించుచున్నాను" అని చెప్పెను. అంత మునిపున్గావుడు "ఓయీ! కార్తికమాసమున శివసన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసినయెడల నీ కోరిక నెరవేరగలదు" యని చెప్పి వెడలిపోయెను.

వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీకమాసము నెలరొజులూ దీపారాధన చేయించి, దానధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు ప౦చిపెట్టుచు, విడువకుండా నెలదినములూ అటుల చేసెను. తత్పుణ్యకార్యమువలన నారాజు భార్య గర్భవతియై క్రమముగా నవమాసములు నిండిన తరువాత నొక శుభముహూర్తమున నొక కుమారుని గనెను. రాజకుటు౦బీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి, బ్రాహ్మణులకు దానధర్ములు జేసి, ఆ బాలునకు 'శత్రుజి' యని నామకరణ ము చేయించి అమిత గారాబముతో పెంచుచు౦డిరి. కార్తీకమాస దీపారాధన వలన పుత్రసంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తికమాస వ్రతములు, దీపారాధనలు చేయుడని రాజు శాసించెను.

రాకుమారుడు శత్రుజి దినదిన ప్రవర్థమానుడగుచు సకల శాస్త్రములు చదివి, ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కాని, యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను, తల్లితండ్రుల గారాబము చేతను తన కంటికింపగు స్రీలకు బలాత్కరించుచు, యెదిరించిన వారిని దండి౦చుచు తన కమావా౦ఛ తీర్చుకొనుచుండెను.

తల్లితండ్రులు కూడా, తమకు లేక లేక కలిగిన కుమారుని యెడల చూచీచూడనట్లు - వినీవిననట్లు వుండిరి. శతృజి ఆరాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పువారలను నరుకుదునని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను జేయుచుండెను. అటుల తిరుగుచుండగా నొకదినమున నొక బ్రాహ్మణపడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణి౦చుట మన్మధునకైననూ శక్యము గాదు. అట్టి స్రీ క౦టపడగానే రాజకుమారుని మతి మందగించి కోయ్యబోమ్మవలె నిశ్చేష్టుడై కామవికారముతో నామెను సమీపించి తన కామవా౦ఛ తెలియచేసెను. ఆమె కూడా నాతని సౌందర్యానికి ముగ్దురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొనిపొయి భోగములననుభవించెను. ఇట్లొకరికొకరు ప్రేమలో పరవశులగుటచేత వారు ప్రతి దినము నర్దరాత్రివేళ ఒక అజ్ఞాతస్థలములో కలుసుకొనుచు తమ కామవా౦ఛ తీర్చుకొనుచు౦డిరి. ఇటుల కొంతకాలం జరిగెను. ఎటులనో యీ సంగతి ఆమె మగనికి తెలిసి, పసిగట్టి, భార్యనూ, రాజకుమారునీ ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచు౦డెను.

ఇట్లుండగా కార్తిక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురును శివాలయమున కలుసుకొనవలెనని నిర్ణయి౦చుకొని, యెవరికి వారు రహస్యమార్గమున బయలుదేరిరి. ఈ సంగతి యెటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగియుండెను. అ కాముకులిద్దరును గుడిలో కలుసుకొని గాఢాలింగన మొనర్చుకొను సమయమున "చీకటిగా వున్నది, దీపము౦డిన బాగుండును గదా",యని రాకుమారుడనగా, ఆమె తన పైటచెంగును చించి అక్కడనున్న ఆముదపుప్రమిదలో ముంచి దీపము వెలిగించెను. తర్వాత వారిరువురునూ మహానందముతో రతిక్రీడలు సలుపుటకు వుద్యుక్తులగుచుండగా, అదే యదనుగా నామె భర్త, తన మొలనున్న కత్తితీసి ఒక్క వ్రేటుతో తన భర్యనూ, ఆ రాజకుమారుని ఖండించి తానుకూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యం
కొలది ఆ రోజు కార్తికశుద్ధ పౌర్ణమి, సోమవారమగుటవలనను, ఆ రోజు ముగ్గురునూ చనిపోవుటవలననూ శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకునూ - యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకునూ అక్కడకు వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు "ఓ దూతలారా! నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు? కామా౦ధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన అ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటేల? చిత్రముగా నున్నదే!" అని ప్రశ్నించెను. అంత యమకింకరులు "ఓ బాపడా! వారెంతటి నీచులైననూ, యీ పవిత్రదినమున, అనగా, కార్తికపౌర్ణమీ సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిని దీపం వేలిగించుట వలన అప్పటి వరకూ వారు చేసిన పాపములన్నియును నశి౦చిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొనిపోవుటకు శివదూతలు వచ్చినారు" అని చెప్పగా - యీ సంభాషణమంతయు వినుచున్న రాజకుమారుడు "అలా యెన్నటికిని జరుగనివ్వను. తప్పొప్పులు యేలాగున్నప్పటికి మేము ముగ్గురమునూ ఒకే సమయములో ఒకే స్థలములో మరణి౦చితిమి. కనుక ఆ ఫలము మా యందరికి వర్తి౦చవలసినదే" అని, తాము చేసిన దీపారాధన ఫలములో కొంత అ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమాన మెక్కించి శివసాన్నిద్యమునకు జేర్చిరి.

వింటివా రాజా ! శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయేగాక, కైలాసప్రాప్తి కూడా కలిగెను. కాన, కార్తిక మాసములో నక్షత్రమాల యందు దీపముంచిన వారు జన్మరాహిత్యమొ౦దుదురు.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి నాలుగో అధ్యయము- నాల్గవ రోజు పారాయణము సమాప్తం.