శ్రీ విద్యా గణపతి జ్యోతిషాలయం🚩🚩🚩
70 subscribers
34 photos
4 videos
Download Telegram
⚜️🚩 #వాగ్దేవి కి వందనం🙏

🌹సర్వజీవులలో చైతన్య స్వరూపిణిగా ప్రవహించే శక్తి స్వరూపిణే #సరస్వతీ.

🌹వాక్, బుద్ధి, జ్ఞానాది ధీశక్తులకు అధిష్ఠాత్రి.
సృష్టిలోని సమస్త జీవులకు ఆ తల్లి వల్లనే ఉలుకూ, పలుకూ ఎరుక ఏర్పడుతున్నాయి.

🌹మన బుద్ధి శక్తులను ప్రేరేపించే విద్యాస్వరూపిణి సరస్వతీదేవి.
అందుకే సూర్యుడు👇

♦️సర్వ చైతన్య రూపాం తాం ఆద్యం విద్యాంచ
ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్♦️
అని ప్రార్థించాడు.

ఏ విద్యను గ్రహించాలన్నా అమ్మ అనుగ్రహం తప్పదు.

🌹వాక్యం యొక్క స్వరూపం నాలుగు విధాలుగా ఉంటుంది.
1. పరా
2. పశ్యంతీ
3. మధ్యమా
4. వైఖరీ

🌹మనలో మాట పలకాలన్నా భావం స్ఫురింపచేసేదే “#పరా”.
మాట పలికే ముందు ‘పర’ ద్వారా ప్రేరితమై భావాత్మకంగా గోచరించేదే ‘#పశ్యంతీ’.
ఆ భావం మాటలుగా కూర్చుకున్న స్థితి ‘#మాధ్యమా.’
ఆ మాటలు శబ్దరూపంలో పైకి వినబడేదే ‘#వైఖరీ.

🌹యోగశాస్త్ర పరంగా వీటి యొక్క ప్రయాణం గురించి చెప్పాలంటే, మూలాధారం నుండి నాభి, హృత్, కంఠ, నాలుకలు.
వీటన్నింటికీ మూలమైన నాదం కూడ సరస్వతీరూపమే🙏

♦️చత్వారి వాక్పరిమితా పదాని తానీ
విదుర్భ్రాహ్మాణా యే మనీషిణీః
గుహాత్రీణి నిహితా నేజ్గ్యంతి
తురీయం వాచో మనుష్యా వదంతి♦️

👉భావప్రకటన కోసం చెట్లు ‘పరా’ వాక్కుని,
పక్షులు ‘పశ్యంతీ’ వాక్కును,
జంతువులు ‘మధ్యమా’ వాక్కును,
మనుషులు ‘వైఖరీ’ వాక్కును ఉపయోగిస్తున్నారు.

🌹ఆ తల్లి శ్వేతపద్మవాసిని కనుక "#శారదా"🙏అని అన్నారు.

#పోతనామాత్యుడు –

♦️శారదనీరడెందు ఘనసార పటీర మరాళ మల్లికా

హార తుషార పేనరజతాచలకాశ ఫణీశకుంద మం

దార సుధాపయోధిసిత తామర సామరవాహిని శుభా

కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ

అని ప్రార్థించాడు🙏

⚜️🚩 శ్రీ సరస్వతి స్తోత్రం🌷🙏🌷

యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా

యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా,

యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైః సదా వందితా

సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా||
🌷🌼🌷🌼🌷🌼🌷
ఓం వీణాపాణినే నమః
⚜️♦️⚜️♦️⚜️♦️⚜️♦️⚜️♦️⚜️
*శ్రావణమాసం పరమ పవిత్రం :* *నిత్యం విశేషాలే:*👌
**********************
*శ్రావణమాసము:-*
ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణతో మారు మోగుతాయి.
శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. శ్రావణమాసము తెలుగు సంవత్సరంలో ఐదవ నెల. ప్రస్తుతం వాడుకలో ఉన్న గ్రెగొరీయన్ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం జూలై, ఆగష్టు నెలల్లో వచ్చును. వర్షఋతువు మూలంగా విరివిగా వర్షాలు పడతాయి.

పంచాంగ ప్రకారంగా ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణానక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది. వర్ష రుతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుని ధర్మపత్ని అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసంగా చెప్పుకుంటారు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వలన విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు.

శ్రీ మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో అనుకూలమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి. గొప్ప పవిత్రమాసం ప్రారంభమైంది. అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు ఉన్నాయి.

*శ్రావణమాసంలో పండుగలు:*
*********************
శ్రావణ శుద్ధ పాడ్యమి *
శ్రావణ శుద్ధ విదియ అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి జయంతి.
శ్రావణ శుద్ధ తదియ *
శ్రావణ శుద్ధ చతుర్థి నాగుల చవితి
శ్రావణ శుద్ధ పంచమి గరుడ పంచమి , కల్కి జయంతి
శ్రావణ శుద్ధ షష్ఠి*
శ్రావణ శుద్ధ సప్తమి *
శ్రావణ శుద్ధ అష్ఠమి *
శ్రావణ శుద్ధ నవమి *
శ్రావణ శుద్ధ దశమి *
శ్రావణ శుద్ధ ఏకాదశి పుత్రదా ( సర్వేషాం) ఏకాదశి
శ్రావణ శుద్ధ ద్వాదశి వరలక్ష్మి వ్రతం, దామోదర ద్వాదశి.
శ్రావణ శుద్ధ త్రయోదశి శని త్రయోదశి
శ్రావణ శుద్ధ చతుర్దశి వరాహజయంతి ( స్నేహితుల దినోత్సవం )
శ్రావణ పూర్ణిమ రాఖీ ( జంధ్యాల ) పూర్ణిమ, హయగ్రీవ జయంతి
శ్రావణ బహుళ పాడ్యమి *
శ్రావణ బహుళ విదియ *
శ్రావణ బహుళ తదియ *
శ్రావణ బహుళ చవితి సంకటహర చతుర్ధి
శ్రావణ బహుళ పంచమి *
శ్రావణ బహుళ షష్ఠి *
శ్రావణ బహుళ సప్తమి *
శ్రావణ బహుళ అష్ఠమి కృష్ణాష్టమి
శ్రావణ బహుళ నవమి *
శ్రావణ బహుళ దశమి *
శ్రావణ బహుళ ఏకాదశి మతత్రయ ఏకాదశి, స్వాతంత్ర్య దినోత్సవం
శ్రావణ బహుళ ద్వాదశి *
శ్రావణ బహుళ త్రయోదశి *
శ్రావణ బహుళ చతుర్దశి మాసశివరాత్రి
శ్రావణ బహుళ అమావాస్య పొలాల అమావాస్య

శ్రావణమాసం వచ్చిందంటే, పిల్లల నుండి పెద్దల వరకు ఆనందించని వారుండరు. నూతన వధువులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు, లౌకికానందాన్నే కాక ఆధ్యాత్మికానందాన్ని కూర్చేది శ్రావణం. ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, పచ్చని మామిడాకు తోరణాలతో ఏర్పడిన లక్ష్మీశోభతో నిండి, ఉజ్జ్వలంగా ప్రకాశిస్తాయి.

ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు వర్షఋతువు అనగా శ్రావణ, భాద్రపద మాసముల కాలం, ఈ సమయంలో వేదాధ్యయన కాలంగా చెప్పబడినది. అసలు 'శ్రావణ'మనే ఈ మాస నామమునందే వేదకాలమనే అర్ధం ఉన్నది. శ్రవణమనగా "వినుట"అని అర్థం. వేదము గ్రంధమువలె పఠనం చేసేది కాదు. విని నేర్వదగినది. దీనిని వినిపించేవాడు గురువు. విని నేర్చుకొనే వారు శిష్యుడు. ఈ వేదమునకే 'స్వాధ్యాయ'మనేది మరో నామం.

వేదాధ్యయనం చేసే వానికి మోహం తొలగి బ్రహ్మ స్వరూపం అర్ధమౌతుందని రామాయణమందు చెప్పబడినది. దీనిని బట్టి శ్రావణ మాసం వేదాధ్యయన సమయమని త్రేతాయుగమునందే చెప్పబడినట్లు తెలుస్తున్నది. స్త్రీలకూ వేదపఠనంతో సమానమైన లలితా సహస్ర నామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు, మోహమును తొలగించి సౌభాగ్యము నిచ్చేవి. అందుచేతనే ఈ మాసం రాగానే నూతన వధువులు మంగళ గౌరీ వ్రతమును ఐదు సంవత్సరాల పాటు నిర్వర్తిస్తారు.

పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. పూర్ణిమనాడు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కట్టి వారితో సోదర ప్రేమను పంచుకొంటూ ఈ ఆనందానికి సంకేతంగా వారినుండి బహుమతులను పొంది హృదయానందాన్ని పొందుతారు. "గృహిణీ గృహముచ్యతే" అని చెప్పినందున ఏ ఇంట్లో గృహిణులు ఆనందంగా ఉంటారో ఆ గృహంలోని వారందరూ ఆనందంగానే ఉంటారు. శ్రావణం ఈ విధంగా సంతోషాన్ని కలిగించేదవుతున్నది.

ఈ మాసంలోనే బహుళ అష్టమినాడు శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన రోజు. కృష్ణాష్టమీ వ్రతాచరణం ఒక ముఖ్యమైన విషయంగా పరిగణించాలి. శ్రావణ పూర్ణిమ రోజు బ్రహ్మచారులు గాని గృహస్థులు గాని శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన సిద్ధికి నూతన యజ్ఞోపవీత ( జంధ్యం ) ధారణ అనేది అనాది ఆచారంగా వస్తున్నది. రైతులకు తమ వ్యవసాయ సాగుకు కావలసిన వర్షాలు విస్తారంగా కురిసి వాతవరణంలో మార్పు చెందడం వలన వ్యవసాయ సాగు కార్యములు నిర్విఘ్నంగా సాగగలవని, తమ మనోరథాలు నెరవేరబోతున్నాయని ఆనందిస్తారు. ఈ విధంగా శ్రావణ మాసం అందరికీ ఆనందాన్నిస్తుంది.
రాఖీపౌర్ణమి, హయగ్రీవ జయంతి, శ్రీకృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగుల పంచమి, వరలక్ష్మీ వ్రతం తదితర పండుగలు ఈ నెలలో వస్తాయి.
ఈ మాసం ప్రధానంగా మహిళలకు ప్రత్యేకమైనది. ప్రతి ఇంట్లో పూజలతో అధ్యాత్మిక వాతావరణం ఉంటుంది.

ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు, ఇతర విశేషాలు జరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో.ఆలయాల్లో అంతస్థాయిలో రద్దీ లేదు. ఇంట్లోనే తోచిన విధంగా పూజలు చేసుకుంటున్నారు.

*శ్రావణమాసం ప్రత్యేకతలు, ఆచరించాల్సిన నియమాలు : -*

ఏడు రోజుల్లో.సోమవారం : - విశిష్టమైనదిగా చెబుతుంటారు. ముక్కంటికి సోమవారం ప్రీతీకరమైనది. ఈ రోజున స్వామిని పూజిస్తే..సమస్త శుభాలు కలుగుతాయని చెబుతుంటారు. లింగస్వరూపుడికి అభిషేకాలు, అర్చనలు చేయాలని, దీనివల్ల శుభాలు కలుగుతాయని పండితులు వెల్లడిస్తున్నారు.

మంగళవారం : - శ్రావణమాసంలో వచ్చే ప్రతి మంగళవారం ఎంతో ప్రీతీకరమైన రోజు. దేవతలందరినీ భక్తి శ్రద్ధలతో పూజిస్తే శుభాలు కలుగుతాయని నమ్మకం. గౌరీదేవికి పూజలు చేస్తారు. పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ పూలు అద్ది అక్షింతలతో పూజలు నిర్వహిస్తుంటారు. ఇక కొత్తగా పెళ్ళైన వారు ఈ వ్రతాన్ని ఆచరించాలంటారు. అవివాహితులు కూడా వ్రతాన్ని చేస్తారు.

బుధవారం, గురువారం : ఈ రెండు వారాలకు కూడా ప్రాముఖ్యత ఉంది. బుధవారం అయ్యప్పకు, గురువారం రాఘవేంద్ర స్వామి, సాయిబాబా, దక్షిణమూర్తికి ప్రీతికరమైన రోజులు.

శుక్రవారం : ప్రతి శుక్రవారం ఎంతో ప్రాధాన్యమైంది. వరలక్ష్మీ వ్రతాన్ని కొంతమంది ఆచరిస్తుంటారు. మహాలక్ష్మి విగ్రహానికి అలంకరణ చేసి ఇరుగు, పొరుగు, బంధువులను పిలిచి వ్రతాన్ని నిర్వహిస్తారు. వచ్చిన వారికి తాంబూళం, శనగల ప్రసాదం ఇస్తారు.

ప్రతి ముత్తైదువును మహాలక్ష్మి రూపంగా భావించి గౌరవిస్తారు. వ్రతం చేసిన ముత్తైదువులు తోటి ముత్తైదువులకు గారెలు, పూర్ణాలు, తోచిన విధంగా వాయినాలు ఇస్తుంటారనే సంగతి తెలిసిందే. ఈ వ్రతాన్ని చేసే వారికి అన్ని శుభ శకునాలే కలుగుతాయని నమ్మకం. ఆలయాల్లో, ఇంట్లో కుంకుమార్చనలు చేస్తుంటారు. నవ వధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తుంటారు.

శనివారం : శ్రీనివాసుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజున కొంతమంది ఉపవాస దీక్షలు చేస్తుంటారు. స్వామి వారికి పూజలు, అర్చనలు నిర్వహిస్తారు. ఈ మాసంలో ప్రతి శనివారం స్వామి వారిని కొలిస్తే..శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం.

శ్రావణ మాసంలో మొదటి పండుగ మంగళగౌరి వ్రతంగా చెప్పవచ్చు. ఆ తర్వాత నాగుల పంచమి, వరలక్ష్మీ వ్రతం, శ్రావణ పూర్ణిమ, గురు రాఘవేంద్ర స్వామి ఆరాధానోత్సవాలు,
శ్రీకృష్ణాష్టమి పండుగలు వస్తాయి.

శివారాధనకు ఎంతో విశిష్టత..
శ్రావణమాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి. ఈ మాసం శివపూజకు విశిష్టమైనది. ముఖ్యంగా భగవదారాధనలో శివ, కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్నిస్తుందని ప్రతీతి. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్ర వచనం.

*శ్రావణమాసం విశిష్టత: ఏ రాశులవారు ఏం చేయాలి?*

ప్రతిరోజూ ఇంట్లో అంతా పండుగ వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు నూతన వస్త్రాలు కాని, పట్టు వస్త్రాలు కాని ధరించి పూజలు చేసుకుంటారు. నియమ నిష్ఠలతో ఉంటారు.

పూర్ణిమనాడు శ్రవణా నక్షత్రం ఉన్న మాసాన్ని శ్రావణమాసం అంటారు. శ్రావణమాసం అంటేనే స్త్రీలకు ఇంటిల్లిపాది పండుగులతో కూడుకుని ఉంటుంది. దాదాపుగా ఎక్కువ పండుగలు, నోములు వ్రతాలు ఈ మాసంలోనే వస్తాయి. ఈ మాసంలో ప్రతి వారం ఏదో ఒక విశిష్టతను కూడుకుని ఉంటుంది. సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం, పౌర్ణమి, నాగుల చవితి చాలా విశిష్టతను కలిగినవి. సోమవారం శివుడి పూజకు, మంగళవారం వివాహమైన వనిత నోచుకునే మంగళవారం నోములు, శుక్రవారం ఏదో ఒక పూజ చేస్తూ ఉంటారు. శనివారం వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు. పౌర్ణమి రాఖీ పూర్ణిమ, హయగ్రీవ జయంతి, కృష్టాష్టమి, పోలాల అమావాస్య. ప్రతిరోజూ ఇంట్లో అంతా పండుగ వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు నూతన వస్త్రాలు కాని, పట్టు వస్త్రాలు కాని ధరించి పూజలు చేసుకుంటారు. నియమ నిష్ఠలతో ఉంటారు.
శ్రావణ, భాద్రపద మాసాలు వర్షాకాలం. ఈ కాలంలో వర్షాలు పడతాయి కాబట్టి అన్ని రకాల ఆహార పదార్థాలు తినకుండా జాగ్రత్తపడేవారు. శరీరంలో వేడి పుట్టించే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఆకు కూరలు పురుగు పట్టడం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోరు.
వర్షాకాలం కావడం వల్ల ఒంట్లోని నరాలు అన్నీ గట్టిపడి పనిచేయకుండా ఉంటాయి కాబట్టి ఆషాఢ మాసం నుంచి దేవీ పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ మాసంలో ఆచారాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఆచారాల వల్ల తప్పనిసరిగా శరీరాన్ని ఒంచి పనులు చేయాలి. నోములు, వ్రతాల పేరిట నియమ నిష్ఠలతో ఉంటారు. కాళ్ళకు ప్రతిరోజూ పసుపు రాసుకోవడానికి కారణం పసుపు యాంటీ బ్యాక్టీరియాగా పని చేసి ఈ కాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.
భారతీయ సంప్రదాయంలో ప్రతి నోముకు వ్రతానికి ప్రాధాన్యం అధికం. సోమవారాలు శివునికి ప్రాధాన్యం ఇస్తూ, బ్రాహ్మణులను శివునిగా భావించి దానం ఇవ్వడం, మంగళ శుక్రవారాలు స్త్రీలను శక్తి స్వరూపంగా భావించి దానం ఇవ్వడం ఆచారం. తమకు ఏది కావాలో ఆ వస్తువులను దానం ఇవ్వాలనేది శాస్త్ర వచనం. స్త్రీలకు ఐదవతనం అవసరం కాబట్టి ఆ వస్తువులను మంగళ శుక్రవారాల్లో దానాలు ఇస్తారు.
చంద్రమా మనసో జాతః అంటే చంద్రుడు మనస్సుకు కారకుడు. శివుడి తలపైన నెలవంక ఉంటుంది. సోమవారాలు చంద్రునికి సంబంధించిన పాలు, బియ్యం, తెల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల చిత్త చాంచల్యం నుంచి బయటపడగలుగుతారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. బుద్ధిలో విశ్లేణశక్తి పెరుగుతుంది.
మంగళవార వ్రతాలు చేసుకునేవారు గురునికి సంబంధించిన వస్తువులు, శనగలు, పసుపురంగు వస్త్రాలు, పళ్ళు, స్వీట్స్‌ దానం చేయడం వల్ల సంతాన లోపాలు నివారించబడతాయి. గురుడు సంతానానికి కారకుడు కావున వివాహమైన స్త్రీలు మొదటి 5 సంవత్సరాలు మంగళగౌరి వ్రతాలు ఆచరిస్తారు. ఆరోజు శనగలు, పళ్ళు దానం చేయడం వల్ల సంతానసంబంధ దోషాలు నివారించి సకాలంలో సంతానం లుగుతుంది.

శుక్రవార వ్రతాలలో దానాలు శుక్రుని లోపాల నివారణకు కారణం అవుతాయి. శుక్రుడు అన్ని రకాల సంపదలు, ఆనందానికి కారకుడు. సంపద అనేది కేవలం ధనరూపం ఒకటి మాత్రమే కాదు. ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని రకాల సంపదలు సంపదలే. ఈ దానాలు అన్ని రాసుల వారు చేసుకోవచ్చు. ఆ గ్రహ లోపాలు ఉన్నవారు, సంతాన సమస్యలు ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి.

*శ్రావణమాసం.. మంచి భర్త రావాలంటే ఈ వ్రతం చేయాలట!*

చంద్రమానాన్ని అనుసరించి తెలుగు నెలల క్రమంలో శ్రావణం ఐదో మాసం. ఇది సర్వదేవతలకు అత్యంత ప్రీతికరమైన మాసం. తిథులు, రోజులతో సంబంధం లేకుండా చేసే పూజలు, వ్రతాలు అనేక శుభఫలితాలను ప్రసాదిస్తాయి.

సకలదేవతలకు ప్రీతికరమైనది శ్రావణమాసం. ప్రతిరోజూ పండుగలా ఆడపడుచులు సంతోషంగా ఉండే మాసం. కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుడు జన్మించిన శ్రావణా నక్షత్రం పేరులో ఉచ్చే ఈ మాసమంటే శ్రీమహావిష్ణువుకి ఎంతో ఇష్టం. వరలక్ష్మి, గౌరీ, సుబ్రమణ్య, రాఘవేంద్ర , వృషభాది దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వాటి వైశిష్ట్యం చాలా ఉంది. లక్ష్మీ దేవికి ఇష్టమైన ఈ నెలలో రోజూ ఉదయం, సాయంత్రం మహిళలు దీపారాధన చేస్తే దీర్ఘసుమంగళీయోగం, అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు. తిథులతో సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పండుగలు, పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మాసం ఇదే.

శ్రావణ మాసం అంటే శుభమాసం. దీనిని నభో మాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ మాసంలోని ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి , గరుడ పంచమి పుత్రాదా ఏకాదశి, దామోదర ద్వాదశి, వరహ జయంతి ఇలా అనేక పండుగలు వస్తాయి.

అత్యంత పవిత్రంగా భావించే శ్రావణమాసంలో ఇల్లు, ఆలయాలు భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. వివాహాలు, నోములు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలతో సందడిగా ఉంటుంది. ఈ మాసంలోని ప్రతి శుక్రవారం మహిళలు మహాలక్ష్మిలా అలంకరించుకుని తమకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని సముద్ర తనయకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

పురాణాల ప్రకారం పాలసముద్ర మథనంలో ఉద్భవించిన హలాహలాన్ని పరమ శివుడు శ్రావణమాసంలోనే సేవించి నీలకంఠుడిగా లోకాన్ని ఉద్ధరించాడు. ఈ మాసంలో ఒక్కోరోజు ఒక్కో దేవతను పూజిస్తారు. సోమవారాల్లో శివుడికి అభిషేకాలు, మంగళవారం గౌరీ వ్రతం, బుధవారం విఠలుడికి పూజలు, గురువారం గురుదేవుని ఆరాధన, శుక్రవారం లక్ష్మీ, తులసి పూజలు, శనివారం హనుమంతుడు, వేంకటేశ్వరుడు, శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. వీటితోపాటు గరుడ పంచమి, పుత్రదైకాదశి, వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, రుషి పంచమి, గోవత్సబహుళ, సీతల సప్తమి, శ్రీకృష్ణాష్టమి, పోలాల అమావాస్య లాంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి.

శివుడికి శ్రావణమాసం అత్యంత ప్రీతికరమైంది. ఈ మాసంలో వచ్చే సోమవారం నాడు ఆవుపాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె లాంటి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. బిల్వ పత్రాలు, ఉమ్మెత్తు, కలువ, తుమ్మి లాంటి ఇష్టమైన పుష్పాలతో ఈశ్వరారాధన చేస్తారు.

శుభ మంగళాలు పలికే మంగళవారానికి ప్రత్యేకత ఉంది. ఈ రోజున గౌరీదేవిని పూజిస్తారు. పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ, పూలు అక్షింతలతో పూజలు నిర్వహిస్తారు. కొత్తగా వివాహమైన మహిళలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. మంచి భర్త లభించాలని అవివాహితులు, తమ వైవాహిక బంధం సజావుగా సాగాలని వివాహితులు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు.
శ్రావణమాసం మొదలైన నాలుగో రోజునే వచ్చే పండుగ నాగపంచమి. శివుడి ఆభరణమైన నాగేంద్రుడిని పూజించడం హైందవ ఆచారం. పాలు, మిర్యాలు, పూలతో నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి, చెక్కలతో చేసిన నాగ పడగలకు భక్తులు అభిషేకం చేస్తారు.

సంతానం లేని వారు భక్తి శ్రద్ధలతో శ్రావణ శుక్ల ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు చేసి, ఉపవాసం ఉంటే మంచి సంతానం కలుగుతుంది. అందుకే దీన్ని పుత్రదై ఏకాదశి అన్నారు.

శ్రావణ మాసంలోని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. నవ వధువులతో తొలి శ్రావణంలో ఈ వ్రతాన్ని తప్పనిసరిగా చేయిస్తారు. వరాలిచ్చే దేవత వరలక్ష్మీ వ్రతం వల్ల భర్తలకు ఆరోగ్యం, పరిపూర్ణ ఆయుష్షు కలుగుతాయని విశ్వాసం. పురాణాల ప్రకారం చారుమతి దేవి అనే భక్తురాలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అష్టైశ్వర్యాలను పొందింది.

శ్రావణం చంద్రుడి మాసంకూడా. చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణంగా మనస్సు మీద ప్రభావం చూపే మాసం. ఈ మాసంలో రవి సంచరించే నక్షత్రాల ప్రభావం చంద్రుని మూలంగా మన మీద ప్రభావం చూపుతాయి. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించి, మంచి కలిగించడానికి, ధర్మాచరణాలను పండుగగా ఆచరించడం నియమం. మనస్సు మీద మంచి ప్రభావం ప్రసరించి పరమార్ధం వైపు మళ్లించి మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వల్ల కలిగే అస్తవ్యస్త అనారోగ్యాల నుంచి తప్పించుకోవడానికి, మంచి ఆరోగ్యాన్ని పొందడమే శ్రావణ మాసంలో వచ్చే పండుగలలోని ఆచారాల ముఖ్యోద్దేశం.



*సేకరణ
🌹 🌹 ॐ 卐 ॐ 🌹 🌹
🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏
🌞 *సెప్టెంబర్ 4, 2021* 🌝
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*దక్షిణాయనం*
*కృష్ణ ఋతువు*
*శ్రావణ మాసం*
*కృష్ణ పక్షం*
తిధి: *ద్వాదశి* ఉ6.24
తదుపరి త్రయోదశి
వారం: *శనివారం*
(స్థిరవాసరే)
నక్షత్రం: *పుష్యమి* సా5.09
తదుపరి ఆశ్రేష
యోగం: *వరీయాన్* ఉ10.03
తదుపరి పరిఘము
కరణం: *తైతుల* ఉ6.24
తదుపరి *గరజి* మ2.21
ఆ తదుపరి వణిజ
వర్జ్యం: *లేదు*
దుర్ముహూర్తం: *ఉ5.49 - 7.26*
అమృతకాలం: *ఉ10.21 - 12.03*
రాహుకాలం: *ఉ9.00 - 10.30*
యమగండం: *మ1.30 - 3.00*
సూర్యరాశి: *సింహం*
చంద్రరాశి: *కర్కాటకం*
సూర్యోదయం: *5.49*
సూర్యాస్తమయం: *6.11*

☘️ *శనిత్రయోదశి* ☘️

*లోకాః సమస్తాః*
*సుఖినోభవంతు*
*సర్వే జనాః సుఖినోభవంతు*
🙏
🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉
*శివాలయానికి సేవ చేయడం వలన కలిగే విశేష ఫలితాలు :*
*ॐ⚜️⚜️⚜️⚜️ॐ*

👉 శివాలయ రోజూగానీ, వారానికోసారి కానీ, ఏదైనా పండుగలు, ఉత్సవాలు జరిగే సమయంలో ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేస్తాం. ఏవైనా మొక్కుబడులు ఉంటే తీర్చుకుంటాం. అక్కడ విశేషమైన ఆర్జిత సేవలు జరిపించుకుంటాం. అవకాశాన్ని బట్టి అక్కడి ఇతర ఆలయాలను, సందర్శనీయ స్థలాలను దర్శిస్తాం. క్షేత్రంలో నిద్రచేస్తాం. అంతవరకే చాలా మందికి తెలిసిన విషయం.

👉 భక్తులకు తెలియాల్సిన మరో విషయం ఏంటంటే ఆలయంలో ఎన్నో సేవలను మనం స్వచ్ఛందంగా నిర్వహించవచ్చు. అలా చేస్తే కలిగే ఫలితం చాలా విశేషంగా చెప్పబడింది.

👉 శివాలయం నిర్మాణం చేస్తే.. నిర్వహణ చేస్తే.. పునరుద్ధరణ చేస్తే ఎంతైతే ఫలితం ఉంటుందో దానితో సమానమైన ఫలితాలు శివాలయ సేవ ద్వారా పొందవచ్చని శివధర్మశాస్త్రంలో వివరించబడింది.

👉 *దర్శిస్తే చాలు...*

*దూరతః శిఖరం దృష్ట్వా నమస్కుర్యాచ్ఛివాలయమ్ |*
*సప్తజన్మకృతం పాపం క్షిప్రమేవ వినశ్యతి ||*

👉 దూరం నుండి ఆలయశిఖరాన్ని దర్శించిన వెంటనే నమస్కరించాలి. అలా చేస్తే ఏడుజన్మలలో తాను చేసిన పాపాలనుండి వెంటనే విముక్తుడౌతాడు.

👉 *పరిశుభ్రం చేస్తే...*

*పశ్యన్ పరిహరన్ జంతూన్ మార్జన్యా మృదుసూక్ష్మయా |*
*శనైస్సమ్మార్జనం కుర్యాత్ చాంద్రాయణఫలం లభేత్ ||*

👉 శివాలయానికి వెళ్లిన భక్తులు అక్కడ ఏవైనా ప్రాణులు, పశువులు తిరుగుతుంటే వాటిని హింసించకుండా బయటకు పంపి మెత్తటి మార్జని (చీపురు)తో ఆలయాన్ని తుడిచి పరిశుభ్రం చేస్తే చాంద్రాయణ వ్రతం ఆచరించిన ఫలితం కలుగుతుంది.

👉 *ఆవు పేడతో అలికితే...*

ఆవు పేడతో ఆలయాన్ని శుభ్రంగా అలికితే కూడా ఎంతో ఫలితం ఉందని చెప్పబడుతోంది. ఆ ఆవు పేడను మంచి ఆవుల నుండి సేకరించాలి. తన ఇంటినుంచి తీసుకురావాలి. లేదా పవిత్రమైన చోటునుండి తేవచ్చు. ఆ గోమయాన్ని కూడా పైభాగం, కిందభాగం వదిలి మధ్యలో శుద్ధం, మలినం కాని ఆవుపేడనే తీసుకోవాలని స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాంటి గోమయంతో శివాలయ పరిసర ప్రాంతాన్ని చక్కగా అలికితే తమ పూర్వీకులు తరించి గోలోకం చేరుకుంటారు. అంతేకాక అలా చేస్తే సిరిసంపదలతో తులతూగుతారు.

👉 *నీటితో శుభ్రపరిస్తే....*

*యః కుర్యాత్ సర్వకార్యాణి వస్త్రపూతేన వారిణా |*
*స ముని స్స మహాసాధు స్స యోగీ స శివం ప్రజేత్ ||*

వస్త్రంతో వడగట్టిన నీటితో ఆలయాన్ని పరిశుభ్రం చేసినవారు సజ్జనులు. అతడు యోగియై శివుని చేరుకుంటాడు. అలాగే శివాలయం నేలను అద్దంలా.. అంటే నేలవైపు చూస్తే, తన ప్రతిబింబం కనపడేలా తుడిచినా ఎంతో గొప్ప ఫలితం ఉంటుంది.

👉 *పూలతో అలంకరిస్తే....*

*యావద్ధస్తా భవే ద్భూమిః సమన్తా దుపశోభితా*
*తావద్యుగసహస్రాణి రుద్రలోకే మహీయతే!*

👉 శివాలయాన్ని రకరకాల పుష్పాలతో అలంకరించినా.. అందంగా తీర్చిదిద్దినా...ఎంత ప్రదేశం తీర్చిదిద్దాడో దాన్ని అంగుళాలతో కొలిచి అంతకాలం రుద్రలోకంలో నివసిస్తారని చెప్పబడుతోంది. పుష్పవనాలను పాదుగొల్పినా... శివలోకం చేరతాడు.

*శివరూపాలను చిత్రిస్తే....*

*యావంతి రుద్రరూపాణి స్వరూపాణ్యపి లేఖయేత్ |*
*తావద్యుగసహస్రాణి రుద్రలోకే మహీయతే ||*

చిత్రకారులను రప్పించి వారితో శివాలయంలో వేదపురాణాలలో పేర్కొనబడిన శివుని అవతారాలు, లీలలకు సంబంధించిన చిత్రాలు వేయించాలి. అలా ఎన్ని బొమ్మలు చిత్రిస్తారో అంతకాలం రుద్రకాలంలో గొప్పగా ప్రకాశిస్తారు.

*వెల్ల వేయిస్తే...*

*సుధావిలిప్తం యః కుర్యాత్ సర్వయత్నైశ్శివాలయమ్ |*
*తావత్పుణ్యం భవేత్ సోపి యావదాయతనే కృతే ||*

⚜️ శివాలయానికి, ప్రాకారం గోడలకు సుధాకర్మ (సున్నం పూయించడం) చేయించినవారికి ఆలయనిర్మాణం చేసిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది. అలాగే ప్రతి సంవత్సరం విడువకుండా, పాలవంటి తెల్లసున్నంతో లేదా వేరే రంగులతో అందంగా వెల్లవేయించినా అతడికి శివలోకవాసపుణ్యం లభిస్తుంది.

*ఎన్నోసేవలు......*

👉 అలాగే ఆలయంలోని గోడలకు సుగంధాలు పూయడం, గుగ్గిలంతో ధూపం వేయడం, చక్కగా రంగురంగుల ముగ్గులు పెట్టడం, పూలతోటలను బాగుచేయడం, ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలను తీసివేయడం, దీపాలకు కావాల్సిన వత్తులను సిద్ధం చేయడం, తోటి భక్తులకు సాయం చేయడం, ఆలయంలో భక్తులకు మంచినీరు ఇవ్వడం, ప్రసాదవితరణ ఇలా ఎన్నో సేవలను భక్తులు ఆచరించవచ్చు. ఈ అవకాశం మనం గ్రామాల్లో ఉండే ఎన్నో ఆలయాల్లో మనం నిర్వహించుకుంటే ప్రతీ దేవాలయం దివ్యమైన భవ్యమైన శోభతో అలరారుతుంది. భక్తులకూ కల్పవృక్షమై నిలుస్తుంది. మరింకెందుకాలస్యం ?

*సేకరణ :*
🌹 🌹 ॐ 卐 ॐ 🌹 🌹
🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏
🌞 *సెప్టెంబర్ 5, 2021* 🌝
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*దక్షిణాయనం*
*వర్ష ఋతువు*
*శ్రావణ మాసం*
*కృష్ణ పక్షం*
తిధి: *త్రయోదశి* ఉ6.57
తదుపరి చతుర్ధశి
వారం : *ఆదివారం*
(భానువాసరే)
నక్షత్రం: *ఆశ్రేష* సా6.07
తదుపరి మఖ
యోగం: *పరిఘము* ఉ9.24
తదుపరి శివం
కరణం: *వణిజ* ఉ6.57 వ
*భద్ర* సా6.58
వర్జ్యం: *ఉ6.27 - 8.07*
దుర్ముహూర్తం: *సా4.30 - 5.19*
అమృతకాలం: *సా4.27 - 6.07*
రాహుకాలం: *సా4.30 - 9.00*
యమగండం: *మ12.00 - 1.30*
సూర్యరాశి: *సింహం*
చంద్రరాశి: *కర్కాటకం*
సూర్యోదయం: *5.49*
సూర్యాస్తమయం: *6.09*

🔱 *మాస శివరాత్రి* 🔱

*లోకాః సమస్తాః*
*సుఖినోభవంతు*
*సర్వే జనాః సుఖినోభవంతు*
🌞🌞🌞🙏🌞🌞🌞
🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉
*తెలుగు సంవత్సరాల పేర్లు...*
*వాటి అర్థాలు*
✍️

*1. ప్రభవ అంటే... ప్రభవించునది!అంటే... పుట్టుక.*

*2. విభవ - వైభవంగా ఉండేది.*

*3. శుక్ల... అంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక.*

*4. ప్రమోదూత.... ఆనందం. ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత.*

*5. ప్రజోత్పత్తి... ప్రజ ఆంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి.*

*6. అంగీరస... అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది అని అర్థం.*

*7. శ్రీముఖ... శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్ధం.*

*8. భావ.... భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు.*

*9. యువ.... యువ అనేది బలానికి ప్రతీక.*

*10. ధాత... అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు.*

*11. ఈశ్వర... పరమేశ్వరుడు.*

*12. బహుధాన్య... సుభిక్షంగా ఉండటం.*

*13. ప్రమాది... ప్రమాదమున్నవాడు అని అర్థమున్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు.*

*14. విక్రమ... విక్రమం కలిగిన వాడు.*

*15. వృష ... చర్మం.*

*16. చిత్రభాను... భానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం. చిత్రమైన ప్రకాశమంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం.*

*17. స్వభాను... స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం!*
*18. తారణ... తరింపచేయడం అంటే దాటించడం. కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అని అర్థం.*

*19. పార్థివ... పృధ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికున్నంత సహనం, పనిచేసేవాడని అర్థం.*

*20. వ్యయ... ఖర్చు కావటం. ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం అర్థం.*

*21. సర్వజిత్తు.... సర్వాన్ని జయించినది.*

*22. సర్వధారి -...సర్వాన్ని ధరించేది.*

*23.విరోధి.... విరోధం కలిగినట్టువంటిది.*

*24. వికృతి... వికృతమైనటువంటిది.*

*25. ఖర.... గాడిద, కాకి, ఒక రాక్షసుడు, వాడి, వేడి, ఎండిన పోక అనే అర్థాలున్నాయి.*

*26. నందన ... కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలుగజేసేది.*

*27. విజయ... విశేషమైన జయం కలిగినది.*

*28. జయ.... జయాన్ని కలిగించేది.*

*29. మన్మథ... మనస్సును మధించేది.*

*30. దుర్ముఖి... చెడ్డ ముఖం కలది.*

*31. హేవిలంబి... సమ్మోహన పూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం.*

*32. విలంబి... సాగదీయడం.*

*33. వికారి.... వికారం కలిగినది.*

*34. శార్వరి... రాత్రి.*

*35. ప్లవ... తెప్ప. కప్ప, జువ్వి... దాటించునది అని అర్థం.*

*36. శుభకృత్... శుభాన్ని చేసి పెట్టేది.*

*37. శోభకృత్... శోభను కలిగించేది.*

*38. క్రోధి... క్రోధాన్ని కలిగినది.*

*39. విశ్వావసు... విశ్వానికి సంబంధించినది.*

*40. పరాభవ ... అవమానం.*

*41. ప్లవంగ... కోతి, కప్ప.*

*42. కీలక.... పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య.*

*43. సౌమ్య... మృదుత్వం.*

*44. సాధారణ... సామాన్యం.*

*45. విరోధికృత్... విరోధాలను కలిగించేది.*

*46. పరీధావి... భయకారకం.*

*47. ప్రమాదీచ... ప్రమాద కారకం.*

*48. ఆనంద... ఆనందమయం.*

*49. రాక్షస... రాక్షసత్వాన్ని కలిగినది.*

*50. నల.... నల్ల అనే పదానికి రూపాంతరం.*

*51. పింగళ... ఒక నాడి, కోతి, పాము, ముంగిస.*

*52. కాలయుక్తి... కాలానికి తగిన యుక్తి.*

*53. సిద్ధార్థి... కోర్కెలు సిద్ధించినది.*

*54. రౌద్రి... రౌద్రంగా ఉండేది.*

*55. దుర్మతి... దుష్ట బుద్ధి.*

*56. దుందుభి ... వరుణుడు.*

*57. రుధిరోధ్గారి... రక్తాన్ని స్రవింప చేసేది.*

*58. రక్తాక్షి... ఎర్రని కన్నులు కలది.*

*59. క్రోదన... కోప స్వభావం కలది.*

*60. అక్షయ... నశించనిది.*

✍️
*సేకరణ :*
వినాయక చవితి పూజ చేసేవాళ్ళకు చాలా మందికి నిజమైన పత్రి ఏమిటో తెలియదు. గరిక చిగుళ్ళు తెలియనివారు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

21 రకాల పత్రులు అనేవి సాధారణమైన ఆకులు కావు. ఇవన్నీ మహాత్కృష్టమైన, శక్తివంతమైన ఔషధులు. వాటితో పూజ చేయడంవల్ల కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిసి వీచే గాలి మనలో ఉండే అనారోగ్యాలని హరించేస్తుంది. . 9 రోజుల పూజ తర్వాత నిమజ్జనం ఎందుకు చేయాలీ అని సందేహం రావచ్చు.
చెరువులు, బావులు, నదులు- వీటిలో వర్షాలవల్ల నీరు కలుషితం కావడం సర్వసాధారణం.

వీటిని శుభ్రం చేయడానికి 21 పత్రాలతో చేసిన పత్రియే సమాధానం. అందుకే 9 రోజుల పూజ తర్వాత ఆ పత్రితోబాటు మట్టి విగ్రహాన్ని కూడా నదుల్లో, చెరువుల్లో, బావుల్లో నిమజ్జనం చేయడం, అలా నీటిలో కలిపిన మట్టి, 21 రకాల పత్రి కలిసి 23 గంటలయ్యాక తమలో ఉన్న ఔషధీయుత గుణాల ఆల్కలాయిడ్స్‌ని ఆ జలంలోకి వదిలేస్తాయి.

అవి బాక్టీరియాను నిర్మూలించి, జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి. ఇదీ వినాయక నిమజ్జనం వెనక ఉండే 'పర్యావరణ పరిరక్షణ' రహస్యం. పత్రిని అమ్మే వారు శాస్త్రము లో చెప్పినవి కాక వారికి దొరికినవి తెచ్చి అమ్ముతున్నారు. అటువంటి మొక్కల వలన కొన్ని రకాల అల్లెర్జిలు రావడానికి అవకాశం వుంది.
🌹 🌹 ॐ 卐 ॐ 🌹 🌹
🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏
🌞 *సెప్టెంబర్ 6, 2021* 🌝
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*దక్షిణాయనం*
*వర్ష ఋతువు*
*శ్రావణ మాసం*
*కృష్ణ పక్షం*
తిధి: *చతుర్ధశి* ఉ7.00 వరకు
వారం: *సోమవారం*
(ఇందువాసరే)
నక్షత్రం: *మఖ* సా6.35 వరకు
యోగం: *శివం* ఉ8.22
కరణం: *శకుని ఉ7.00*
&
తదుపరి *చతుష్పాత్* సా6.45
వర్జ్యం: *ఉ6.21 - 7.59*
&
*రా2.35 - 4.11*
దుర్ముహూర్తం: *మ12.23 - 1.12*
&
*మ2.50 - 3.40*
అమృతకాలం: *సా4.08 - 5.46*
రాహుకాలం: *ఉ7.30 - 9.00*
యమగండం: *ఉ10.30 - 12.00*
సూర్యరాశి: *సింహం*
చంద్రరాశి: *సింహం*
సూర్యోదయం: *5.49*
సూర్యాస్తమయం: *6.09*

🌑 *పోలాల అమావాస్య* 🌑

*లోకాః సమస్తాః*
*సుఖినోభవంతు*
*సర్వే జనాః సుఖినోభవంతు*
🙏
🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉
🌹 🌹 ॐ 卐 ॐ 🌹 🌹
🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏
🌞 *సెప్టెంబర్ 7, 2021* 🌝
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*దక్షిణాయనం*
*వర్ష ఋతువు*
*శ్రావణ మాసం*
*కృష్ణ పక్షం*
తిధి: *అమావాస్య*
ఉ6.31వరకు
తదుపరి *భాద్రపద శుక్ల*
*పాడ్యమి* తె5.28
వారం: *మంగళవారం*
(భౌమ్యవాసరే)
నక్షత్రం: *పుబ్బ* సా6.35 వరకు
యోగం: *సిద్ధం* ఉ6.56 వరకు
తదుపరి *సాధ్యం* తె5.04
కరణం: *నాగవం ఉ6.31వ.*
తదుపరి *కింస్తుఘ్నం*
*సా5.59వ. బవ* తె5.27
వర్జ్యం: *రా1.39 - 3.13*
దుర్ముహూర్తం: *ఉ8.16 - 9.05*
&
*రా10.47 - 11.34*
అమృతకాలం: *మ12.11 - 1.47*
రాహుకాలం: *మ3.00 - 4.30*
యమగండం: *ఉ9.00 - 10.30*
సూర్యరాశి: *సింహం*
చంద్రరాశి: *సింహం*
సూర్యోదయం: *5.49*
సూర్యాస్తమయం: *6.09*
*లోకాః సమస్తాః*
*సుఖినోభవంతు*
*సర్వే జనాః సుఖినోభవంతు*
🌹🌹🌹🙏🌹🌹🌹
🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉
🌹 🌹 ॐ 卐 ॐ 🌹 🌹
🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏
🌞 *సెప్టెంబర్ 8, 2021* 🌝
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*దక్షిణాయనం*
*వర్ష ఋతువు*
*భాద్రపద మాసం*
*శుక్ల పక్షం*
తిధి: *విదియ* తె4.08 వరకు
వారం: *బుధవారం*
(సౌమ్యవాసరే)
నక్షత్రం: *ఉత్తర* సా6.09
తదుపరి హస్త
యోగం: *శుభం* రా2.53
తదుపరి శుక్లం
కరణం: *బాలువ సా4.48వరకు*
తదుపరి *కౌలువ తె4.08 వరకు*
వర్జ్యం: *రా2.15 - 3.48*
దుర్ముహూర్తం: *ఉ11.33 - 12.23*
అమృతకాలం: *ఉ11.05 - 12.39*
రాహుకాలం: *మ12.00 - 1.30*
యమగండం: *ఉ7.30 - 9.00*
సూర్యరాశి: *సింహం*
చంద్రరాశి: *కన్య*
సూర్యోదయం: *5.50*
సూర్యాస్తమయం: *6.07*

🙏 *బలరామ జయంతి* 🙏

*లోకాః సమస్తాః*
*సుఖినోభవంతు*
*సర్వే జనాః సుఖినోభవంతు*
🙏
🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉
🌺 *వినాయక చవితి పత్రిలోని విశేష గుణాలు* *మరియు ఔషద గుణాలు*🌺

వినాయక చవితి భాద్రపద మాసం శుక్ల పక్షంలో హస్త నక్షత్రానికి దగ్గరగా చంద్రుడు ఉన్నప్పుడు శుద్ధ చవితి రోజున వస్తుంది.

వర్షాకాలానికి, చలి కాలానికి వారధిగా ఈ పండుగ వస్తుంది. సూర్యరశ్మి తక్కువగా ఉండి పగలు తక్కువ, రాత్రి ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో సూక్ష్మజీవులు స్వైరవిహారంచేసి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశాలు అధికం. ఈ పండుగ పేరుతో మనం రకరకాల ఆకులను చెట్లనుంచి త్రుంచి వాటిని దేవునికి సమర్పిస్తాం. ఈ సందర్భంగా ఆయా పత్రాల స్పర్శ, వాటినుంచి వెలువడే సువాసన మనకు మేలు చేస్తాయి.

గణపతి పూజావిధాపంలోనే 'పత్రం సమర్పయామి' అని వల్లిస్తాం. పత్రం మాత్రమే పూజలో చోటుచేసుకున్న ప్రత్యేక పండుగ వినాయక చవితి. ఆ రోజున మాత్రమే ఏకవింశతి (21) పత్రాలను పూజలో వినియోగిస్తాం. అదే విధంగా వినాయక చవితి ముందు రోజున 'తదియ గౌరి' వ్రతం గౌరిదేవికి చేస్తారు. ఈ పూజలో గౌరిదేవికి 16 రకాలైన పత్రాలు సమర్పిస్తారు. అందులో ముఖ్యమైనది 'అపామార్గ పత్రం' అంటే ఉత్తరరేణి ఆకు. దానికి ప్రాధాన్యం ఎక్కువ.

జ్యోతిర్‌ వైద్యం ఆధారంగా నక్షత్రాలకు, రాశులకు, గ్రహాలకు ఈ పత్రాలతో అవినాభావ సంబంధముంది. జ్యోతిషంలో ఆకుపచ్చరంగు బుధునిది. ఆకులన్నీ బుధ కారకత్వాన్ని కలిగి ఉంటాయి. అలాగే తత్వాలను పరిశీలిస్తే... అగ్నితత్వానికి రవి, కుజ, గురువు; భూతత్వానికి బుధుడు, వాయుతత్వానికి శని, చంద్ర, శుక్రులు; జలతత్వానికి, పిత్త తత్వానికి రవి, కుజ, గురువు; వాత తత్వానికి శని, కఫానికి చంద్ర శుక్రులుగా శాస్త్రం నిర్వచించినది. అయితే బుధునికి వాత, పిత్త, కఫతత్వం (త్రిగుణం) ఉంది.

ఏకవింశతి 21 పత్రాలు, వాటి పేర్లు, వాటివల్ల దూరమయ్యే రోగాలు, గ్రహకారకత్వాలు .

1. మాచీ పత్రం (దవనం ఆకు) : ఈ ఆకును తాకడం, సువాసన పీల్చడంద్వారా నరాల బలహీనతలు, ఉదరకోశ వ్యాధులు నెమ్మదిస్తాయి. మనోవైకల్యం, అలసట తగ్గుతాయి. ఆస్తమా నియంత్రణలో ఉంటుంది. వ్రణాలకు, కుష్టువ్యాధికి మందులా పనిచేస్తుంది. తలనొప్పి, వాతం నొప్పులను తగ్గిస్తుంది. కళ్లకు చలువ చేకూర్చి మానసిక వికాసం కలుగజేస్తుంది. ఉదరానికి మాచీపత్రం చాలా మంచిది.

2. బృహతీ పత్రం (నేల మునగ ఆకు) : దీనినే 'వాకుడు ఆకు' అని అంటారు. ఇది అత్యుత్తమ వ్యాధి నిరోధిని. దగ్గు, ఉబ్బసం వంటివి తగ్గుముఖం పడతాయి. హృదయానికి చాలా మంచిది. వీర్యవృద్ధిని కలుగజేస్తుంది. మూత్రం సాఫీగా కావడానికి, తాప నివారణకు, హృద్రోగ శాంతికి నేల మునగాకు సహకరిస్తుంది.

3. బిల్వ పత్రం (మారేడు ఆకు) : దీనికే మరో పేరు 'బిలిబిత్తిరి'. 'త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం, త్రిజన్మపాప సంహారం, ఏక బిల్వం శివార్పణం' అని పూజిస్తాం. బిల్వ పత్రమంటే శివునికి ఎంత ప్రీతికరమో ఈ శ్లోకంద్వారా తెలుస్తోంది. ఈ మారేడు ఆకువల్ల నెమ్మదించే రోగగుణాలను పరిశీలిస్తే... బంక విరోచనాలు కట్టడిపోతాయి. అతిసార, మొలలు, చక్కెర వ్యాధిగ్రస్తులకు మేలైనది. నేత్రసంబంధమైన రుగ్మతలను అరికడుతుంది. శ్రీమహాలక్ష్మి తపస్సువల్ల ఈ వృక్షం జన్మించినదట. మారేడు దళంలో మూడు ఆకులు, ఐదు, ఏడు, తొమ్మిది చొప్పున ఆకులుంటాయి. ఎక్కువగా మూడు ఆకుల దళమే వాడుకలో ఉంది.

4. దూర్వాయుగ్మం (గరిక) : చర్మరోగాలకు, మానసిక రుగ్మతలకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. అజీర్తిని నివారించడంలో, అంటువ్యాధులు నిరోధించడంలో, వాంతులు, విరోచనాలు అరికట్టడంలో గరిక చక్కటి గుణాన్నిస్తుంది. గజ్జిని నియంత్రిస్తుంది. గాయాలకు కట్టుకడితే క్రిమి సంహారిణి (aఅ్‌ఱ పఱశ్‌ీఱష)లా పనిచేసి మాడ్చేస్తుంది.

5. దత్తూర పత్రం (ఉమ్మెత్త ఆకు) : దీనిలో నల్ల ఉమ్మెత్త చాలా శ్రేష్టమైనది. ఉబ్బసం, కోరింత దగ్గు తగిస్తుంది. ఉదరకోశ వ్యాధులకు, చర్మరోగాలకు, కీళ్ల నొప్పులకు, లైంగిక సంబంధ సమస్యలకు, గడ్డలు, ప్రణాలకు ఉమ్మెత్త ఆకు చాలా బాగా పనిచేస్తుంది.

6. బదరీ పత్రం (రేగు ఆకు) : జీర్ణకోశ వ్యాధులను అరికడుతుంది. వీర్యవృద్ధికి దోహదపడుతుంది. రక్త దోషాలను రూపుమాపి రుచిని కలిగిస్తుంది. శరీరానికి సత్తువను చేకూరుస్తుంది. అరికాళ్ల మంటలు, అరిచేతుల దురదలు తగ్గుతాయి.

7. అపామార్గ పత్రం (ఉత్తరేణి) : పంటి జబ్బులకు వాడితే మంచి గుణం లభించగలదు. ఆరోగ్య సంరక్షిణిగా చెప్పవచ్చు. కడుపు శూల, అజీర్తి, మొలలు, వేడిసెగ గడ్డలు, చర్మపుపొంగుకు ఉత్తరేణి చాలా మంచిది. దీనితో పళ్లు తోముకున్నట్టయితే దంతాలు గట్టిపడతాయి. దీనికే పాపసంహారిణి, రాక్షస సంహారిణి అనికూడా పేర్లున్నాయి.

8. కశ్యపాయ పత్రం (తులసి ఆకు) : ఇందులో చాలా రకాలున్నాయి. జలుబు, దగ్గు, చర్మరోగాలు, గొంతు సంబంధ వ్యాధులు, అజీర్ణ వ్యాధులు తగ్గించగలదు. రక్తస్రావాన్ని, అతిసారను అదుపుచేస్తుంది. వాంతులు, కడుపుశూల అరికడుతుంది. విషాన్ని హరించే గుణంకూడా తులసి ఆకులో ఉంది. యాంటిసెప్టిక్‌గా పనిచేస్తుంది. కలియుగ కల్పతరువుగా కశ్యపాయ పత్రాన్ని చెప్పాలి.
9, చూత పత్రం (మామిడి ఆకు) : దీనిని ఏ శుభకార్యమైనా, పర్వదినమైనా గుమ్మానికి తోరణంలా అలంకరించడం పరిపాటి. మామిడాకు తోరణం కడితే ఆ ఇంటికి వింత శోభ చేకూరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మామిడి ఆకులతో విస్తరి కుట్టుకుని భోజనం చేస్తే ఆకలిని పెంచుతుంది. శరీరంలో మంటలు, రక్త అతిసార, నోటిపూత, చిగుళ్ల బాధలు, పాదాల పగుళ్లు వంటివి మామిడాకుతో నివారించుకోవచ్చు. చక్కెర వ్యాధికి ఉపశమనమిస్తుంది. దీని పండ్ల రసం డిప్తీరియా నుంచి విముక్తి కలిగిస్తుంది.

10. కరవీర పత్రం (ఎర్ర గన్నేరు ఆకు) : పేలను నివారించి శిరోజాలకు రక్షణనిస్తుంది. గుండె జబ్బులు, మూత్రవ్యాధులు, కుష్టు రోగం, దురదల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కణుతులను కరిగించే గుణం పుష్కలంగా ఉంది.

11. విష్ణుక్రాంత పత్రం (విష్ణు క్రాంతి) : జ్ఞాపకశక్తిని పెంచుతుంది. నరాల బలహీనతను అరికడుతుంది. జ్వరం, పైత్యం, కఫం, వాపులకు ఈ ఆకు చాలా మంచిది. ఉబ్బసపు దగ్గు, రొమ్ము పడిశం, దగ్గు తగ్గించగలదు.

12. దాడిరి పత్రం (దానిమ్మ ఆకు) : రక్తవృద్ధి కలుగజేస్తుంది. పిత్తహరిణి, అతిసార, మలేరియా, ఇతర జ్వరాలనుంచి ఉపశమనం కలిగిస్తుంది. నోటిపూత, జీర్ణకోశ, మలాశయ వ్యాధులను నివారిస్తుంది. పిల్లలకు కడుపులో నులిపురుగులను, నలికెల పాములను చేరనివ్వదు.

13. దేవదారు పత్రం (దేవదారు ఆకు) : జ్ఞానవృద్ధి, జ్ఞాపక శక్తి పెంపుదలకు దోహదకారి. పుండ్లు, చర్మవ్యాధులు, జ్వరాలు, విరోచనాలు తగ్గించగలదు. దీని తైలం కళ్లకు చలువనిస్తుంది.

14. మరువక పత్రం (మరువం) : శ్వాసకోశ వ్యాధులు, కీళ్ల నొప్పులను నివారిస్తుంది. జీర్ణ శక్తిని పెంచుతుంది. ఇంద్రియ పుష్టి చేకూరుస్తుంది. దీని నూనె తలకు పట్టిస్తే మెదడుకు చలువనిచ్చి జుట్టు రాలనివ్వదు.

15. సిందూర పత్రం (వావిలాకు) : తలనొప్పి, జ్వరం, కాలేయ వ్యాధులు, గుండె జబ్బులు, పంటి నొప్పులు, వాతపు నొప్పులు, బాలింత నొప్పులకు బాగా పనిచేస్తుంది. కలరాను తగ్గుముఖం పట్టించగలదు. కీళ్ల వాపులు తగ్గించి కీళ్ల నొప్పులను అరికడుతుంది.

16. జాజి పత్రం (జాజి ఆకు) : తలనొప్పి, చర్మవ్యాధులు, నోటి పూత, నోటి దుర్వాసన, వాతం, పైత్యం వంటివాటికి చాలా మంచిది. బుద్ధిబలాన్ని పెంపొందిస్తుంది. కామెర్లు, శరీరంపై మచ్చలు, పక్షవాతం, కాలేయం సమస్యలు నివారిస్తుంది. గవద బిళ్లలకు జాజి ఆకు మంచి మందు. జాజికాయ, జాపత్రికి చెందినదీ ఆకు. సన్నజాజి ఆకు కాదు.

17. గండకి లేదా గానకి ఆకు (సీతాఫలం ఆకు) : ఇది రక్తశుద్ధి చేసి వీర్యవృద్ధిని కలుగజేస్తుంది.

18. శమీ పత్రం (జమ్మి ఆకు) : చర్మ వ్యాధి, అజీర్ణం, దగ్గు, ఉబ్బసం, ఉష్ణం వంటి రుగ్మతలనుంచి విముక్తి చూపించి ప్రశాంతతను చేకూరుస్తుంది. జీర్ణశక్తిని వృద్ధి చేయగలదు. కుష్టువ్యాధిని నియంత్రిస్తుంది.

19. అశ్వత్థ పత్రం (రావి ఆకు) : కంటివ్యాధులు, అతిసార, సంభోగ రోగాలు, ఉన్మాదం వంటివి నిర్మూలిస్తుంది. జీర్ణకారిగా పనిచేస్తుంది. చర్మం పగుళ్లు, చర్మ రోగాలు, పుండ్లు తగ్గిస్తుంది. స్త్రీ పురుషుల్లో ఉత్తేజాన్ని రగిలించి సంతానలేమిని నివారిస్తుంది. జ్వరాలకు, నోటిపూతకు, ఆస్తమాకు ఇది మంచి మందుగా పనిచేస్తుంది.

20. అర్జున పత్రం (తెల్లమద్ది ఆకు) : దీనిలో నల్లమద్ది ఆకుకూడా ఉంది. తెల్లమద్ది ఆకునే ఎక్కువగా పూజలకు వినియోగిస్తారు. వ్రణాలకు, శరీరంలో మంటలకు, చెవిపోటుకు పనిచేస్తుంది. గుండెకు బలాన్ని చేకూరుస్తుంది. శ్వాసకోశ వ్యాధులను దరిచేరనివ్వదు. వాత పిత్త కఫాలకు మంచిది. పితృకర్మలలో వినియోగిస్తారు. దీని రసం రుమాటిజమ్‌ను అరికడుతుంది. నల్లమద్ది ఆకు కడుపులో నులిపురుగులను నివారిస్తుంది.

21. అర్క పత్రం (జిల్లేడు ఆకు) : సూర్యునికి ప్రీతికరమైన ఆకు ఇది. పక్షవాతం, కుష్టు, చర్మవ్యాధులు, ఉబ్బసం, వాతం, కడుపు శూల వంటి దీర్ఘరోగాలను నివారిస్తుంది. అమిత ఉష్ణతత్వంనుంచి విముక్తి కలిగిస్తుంది. రథసప్తమినాడు ఆత్మకారకుడైన సూర్యభగవానుడి ప్రీతికోసం జిల్లేడు ఆకులను తల, భుజాలపై పెట్టుకుని తలారా స్నానంచేయడం ఆనవాయితీ.

అరటి ఆకులో భోజనం అనేది జీర్ణప్రక్రియలో ఒక భాగం. అలాగే మృష్టాన్న భోజనం అనంతరం తాంబూలం పేరుతో తమలపాకును తినటం జీర్ణప్రక్రియకు ఎంతగానో ఉపయోగం. ఇంకా చర్మవ్యాధులకు, పొంగు, ఆటలమ్మలకు ఈనాటికీ గ్రామాల్లో వేపాకుతో వైద్యం చేస్తారు. దగ్గు, ఉబ్బసంలాంటివాటికి తమలపాకు, సంతానలేమికి రావిచెట్టు ప్రదక్షిణం, విరోచనానికి సునామికాకు, సౌందర్యపోషణలో కలబంద, మునగాకు, వాపులకు వావిలాకు... ఇలా ప్రతి పత్రంలోనూ ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి

*21 *రకాల పత్రి - *ఔషధ మూలికలు*

1) మాచీపత్రం : మన దేశంలో ప్రతి చోట కనిపిస్తుంది. మన ఇళ్ళ చుట్టుప్రక్కల, రోడ్ల మీద ఇది విపరీతంగా పెరుగుతుంది. కానీ ఇది గొప్ప ఆయుర్వేద మూలిక. ఇది నేత్రరోగాలకు అద్భుత నివారిణి. మాచీపత్రి ఆకుల్ని నీళ్ళలో తడిపి కళ్ళకి కట్టుకుంటే నేత్రవ్యాధులు నయమవుతాయి. ఇది చర్మరోగాలకు మంచి మందు. ఈ ఆకును పసుపు, నువ్వుల నూనెతో కలిపి నూరి ఆ ముద్దను చర్మవ్యాధి ఉన్న చోట పైపూతగా రోజు రాస్తూ ఉంటే వ్యాధి తొందర్లో నివారణ అవుతుంది.
రక్తపు వాంతులకు, ముక్కు నుండి రక్తం కారుటకు మంచి విరుగుడు.

ఇది సమర్పించి గణపతిని 'ఓం సుముఖాయ నమః - మాచీపత్రం పూజయామి' అని అర్చించాలి.

2) బృహతీ పత్రం. భారతదేశమంతటా విస్తారంగా ఎక్కడపడైతే అక్కడ పెరుగుతుంది బృహతీ పత్రం. దీనే మనం 'వాకుడాకు', 'నేలమునగాకు' అని పిలుస్తాం. ఇది కంఠరోగాలను, శరీర నొప్పులను నయం చేస్తుంది. ఎక్కిళ్ళను తగ్గిస్తుంది. కఫ, వాత దోషాలను, ఆస్తమాను, దగ్గను, సైనసైటిస్‌ను తగ్గిస్తుంది. అరుగుదలను పెంచుతుంది, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. బృహతీపత్రం చూర్ణం దురదలకు, నొప్పులకు పనిచేస్తుంది. బృహతీ పత్రం యొక్క కషాయంతో నోటిని శుభరపరచుకుంటే నోటి దుర్వాసన తొలగిపోతుంది. రక్తశుద్ధి చేయగల శక్తి బృహతీపత్రానికి ఉంది. ఇంకా బృహతీపత్రానికి అనేకానేక ఔషధీయ గుణాలున్నాయి.

అటువంటి బృహతీపత్రాన్ని 'ఓం గణాధిపాయ నమః - బృహతీ పత్రం పూజయామి' అంటూ గణపతికి సమర్పించాలి.

3) బిల్వపత్రం : దీనికే మారేడు అని పేరు. శివుడికి అత్యంత ప్రీతికరం. బిల్వ వృక్షం లక్ష్మీస్వరూపం. ఇది మధుమేహానికి(షుగర్‌కు) దివ్యౌషధం. ఈ వ్యాధి గలవారు రోజు రెండూ ఆకులను నిదానంగా నములుతూ ఆ రసాన్ని మింగితే వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. మారేడు గుజ్జును ఎండబెట్టి పోడిచేసుకుని, రోజూ ఒక చెంచా పొడిని మజ్జిగలో వేసుకుని త్రాగితే వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. తాజా మారేడు ఆకుల రసన్ తీసి కంట్లో వేసుకోవడం వలన కండ్ల కలక నుంచి త్వరిత ఉపశమనం లభిస్తుంది. నువ్వుల నూనె, మారేడు కాయలతో చేసిన ఔషధీయ రసాయనం చెవిటి రోగాన్ని పోగొడుతుంది. మారేడూ వ్రేళ్ళతో చేసిన కషాయం టైఫాయిడ్ జ్వరానికి విరుగుడు. పచ్చి మారేడు కాయలు విరోచనాలను తగ్గిస్తాయి, ఆకలిని పెంచుతాయి. మారేడు వ్రేళ్ళు, ఆకులు జ్వరాలను తగ్గిస్తాయి. ఇలా ఇంకా ఎన్నో ఔషధ గుణాలు బిల్వం సొంతం.

అటువంటి బిల్వపత్రాన్ని 'ఓం ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పుజాయామి' అంటూ గణపతికి అర్పించి పూజించాలి.

4) దూర్వాయుగ్మం(గరిక) : గణపతికి అత్యంత ఇష్టమైనవస్తువు గరిక. ఒక్క గరిక సమర్పిస్తే చాలు, మహాసంతోషపడతాడు బొజ్జగణపయ్య. తులసి తరువాత తులసి అంత పవిత్రమైనది గరిక. దూర్వాయుగ్మం అంటే రెండు కోసలు కలిగివున్న జంటగరిక. ఇది ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది. ఈ గరిక మహాఔషధమూలిక. గరికను పచ్చడి చేసుకుని తింటే మూత్రసంబంధిత వ్యాధులు నయమవుతాయి. మగవారికి సంతాన నిరోదకంగా కూడా పనిచేస్తుంది. కఫ, పైత్య దోషాలను హరిస్తుంది. చర్మ, రక్త సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. ముక్కునుండి రక్తం కారుటను నిరోధిస్తుంది. గరికను రుబ్బి నుడిటి మీద లేపనం వేసుకోవడం ద్వారా పైత్య దోషం వలన కలిగిన తలనొప్పి తగ్గిపోతుంది. హిస్టీరియా వ్యాధికి ఔషధం గరిక.

ఓం గజననాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి అంటూ స్వామికి గరికను సమర్పించాలి.

5) దత్తూర పత్రం : దీనిని మనం ఉమ్మెత్త అని కూడా పిలుస్తాం. ఉష్ణతత్వం కలిగినది. కఫ, వాతా దోషాలను హరిస్తుంది. కానీ 'నార్కోటిక్' లక్షణాలు కలిగినది కనుక వైధ్యుని పర్యవేక్షణ తీసుకోకుండా ఉపయోగించకూడడు. మానిసక వ్యాధి నివారణకు పనిచేస్తుంది. మానసిక వ్యాధి ఉన్నవారికి గుండు చేయింది, ఈ ఉమ్మెత్త ఆకుల రసాన్ని రెండు నెలల పాటూ మర్దన చేయిస్తే స్వస్థత చేకూరుతుంది. దేని ఆకులు, వ్రేర్లు, పువ్వులు అమితమైన ఔషధ గుణములు కలిగినవే అయినా, దెని గింజలు(విత్తనాలు) మామూలుగా స్వీకరిస్తే విషంగా పనిచేస్తాయి. జ్వరాలు, అల్సర్లు, చర్మరోగాలకు, చుండ్రుకు ఉమ్మెత్త ఔషధం.

ఇలా ఎన్నో, ఇంకెన్నో ఔషధ గుణములు కలిగిన దత్తూర(ఉమ్మెత్త) పత్రాన్ని 'ఓం హరసూనవే నమః - దత్తూరపత్రం పూజయామి' అంటూ వరసిద్ధి వినాయకుడికి సమర్పించాలి.

ఓం గం గణపతయే నమః

6) బదరీ పత్రం : దీనినే రేగు అని పిలుస్తాం. బదరీ వృక్షం సాక్షాత్తు శ్రీ మన్నారాయణ స్వరూపం. చిన్నపిల్లల వ్యాధుల నివారణకు పనిచేస్తుంది. 3 ఏళ్ళ పైబడి 12 ఏళ్ళలోపు వయసులో ఉన్న పిల్లల్లో సామాన్యంగా వచ్చే అన్ని రకాల సాధారణ వ్యాధులకు ఉపయోగిస్తారు. ఒకటి లేదా రెండు రేగు ఆకులను వ్యాధిగ్రస్తుల చేత వ్యాధి నివారణ అయ్యేంతవరకు తినిపించాలి, కానీ రేగు ఆకులు ఎక్కువగా తింటే కఫం వచ్చే ప్రమాదముంది. రేగు ఆకులు జుట్టుకు మంచి ఔషధం. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి రేగు ఆకులు బాగా ఉపయోగపడతాయి. అరుగుదల సమస్యలకు, గాయాలకు కూడా రేగు ఆకులు ఔషధంగా పనిచేస్తాయి.

'ఓం లంబోదరాయ నమః - బదరీ పత్రం పూజయామి' అంటూ గణపతికి బదరీ పత్రం సమర్పించాలి.

7) అపామార్గ పత్రం: దీనికే ఉత్తరేణి అని వ్యవహారనామం. దీని కొమ్మలతో పళ్ళు తోముకుంటే దంతవ్యాధులు, ఆకులు నూరి పైపూతగా రాస్తే చర్మవ్యాధులు నివారణమవుతాయి. దీని పుల్లలు యజ్ఞయాగాదుల్లో, హోమాల్లో వినియోగించడం వలన హోమగుండం నుంచి వచ్చిన పొగను పీల్చడం చేత శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి. స్తూలకాయానికి, వాంతులకు, పైల్స్‌కు, ఆమం(టాక్షిన్స్) వలన వచ్చే వ్యాధులకు మంచి ఔషధం ఉత్తరేణి. ఉత్తెరేణి ఆకులను రుబ్బి గాయాలపై రాయడం వలన గాయాలు త్వరగా మానిపోతాయి. నొప్పి తగ్గిపోతుంది.
రాజా ఉత్తరేణి ఆకుల రసం గాయాల నుండి రక్తం కారడాన్ని అరికడుతుంది. ఉత్తరేణి ఆకులతో తయారుచేసిన ఔషధ నూనె చెవుడుకు మందుగా పనిచేస్తుంది. మూత్రసంబంధిత వ్యాధులకు పనిచేస్తుంది ఉత్తరేణి.

పిల్లలు చెడుమార్గంలో వెళ్తున్నారని, చెడ్డ అలవాట్లకు లోనవుతున్నారని బాధపడే తల్లిదండ్రులు ఉత్తరేణి మొక్కను పూజించి, దాని వేర్లను పిల్లల మెడలో కడితే బుద్ధిమంతులవుతారు. రోజు ఉత్తరేణి కొమ్మలతో పళ్ళు తోముకునే అలవాటు ఉన్నవారు ఎక్కడకు వెళ్ళినా, ఆహారానికి లోటు ఉండదు. ఆహరం దొరకని ఎడారిలో కూడా ఎవరో ఒకరు పిలిచి భోజనం పెడతారట. అది ఉత్తరేణి మొక్క మహిమ. ఇంకా ఉత్తరేణికి అనేక ఔషధ విలువలు ఉన్నాయి. ఇంత గొప్ప ఉత్తరేణి మన దేశంలో ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది.

'ఓం గుహాగ్రజాయ నమః - అపామర్గ పత్రం పూజయామి'

8.తులసి: 'తులానాం నాస్తు ఇతి తులసి' - ఎంత చెప్పుకున్నా, తరిగిపోని ఔషధ గుణములున్న మొక్క తులసి. పరమ పవిత్రమైనది, శ్రీ మహాలక్ష్మీ స్వరూపం, విష్ణు మూర్తికి ప్రీతికరమైనది. తులసి మొక్క లేని ఇల్లు ఉండరాదు అంటుంది మన సంప్రదాయం. అంత గొప్ప తులసి గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం.

కఫ, వాత, పైత్య దోషాలనే మూడింటిని శృతిమించకుండా అదుపులో ఉంచుతుంది తులసి. కాలుష్యాన్ని తగ్గిస్తుంది, తులసి వాసనకు దోమలు దరిచేరవు. తులసి ఆకులు, వేర్లు, కొమ్మలల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. చర్మరోగాలను నయం చేస్తుంది. తులసి ఆకులు నమలడం చేత పంటి చిగుళ్ళకున్న రోగాలు నయమవుతాయి. అరుగుదలను, ఆకలిని పెంచుతుంది. కఫం వలన వచ్చే దగ్గును, ఆస్తమాను తగ్గిస్తుంది. తులసిరసాన్ని తేనెలో కలిపి తీసుకోవడం వలన ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. తులసి శరీరంలో ఉన్న ఆమాన్ని(టాక్సిన్స్/విషాలను) విశేషంగా తీసివేస్తుంది. ఈ మధ్య జరిగిన పరిశోధనల ప్రకారం ఒక్క తులసి చెట్టు మాత్రమే రోజుకు 22 గంటల పాటు ప్రాణవాయువు(ఆక్సిజెన్)ను విడుదల చేస్తుంది. ఇంత గొప్ప లక్షణం మరే ఇతర మొక్కకు లేదు.

కానీ పురాణ కధ ఆధారంగా గణపతిని తులసిదళాలతో ఒక్క వినాయక చవితి నాడు తప్ప ఇంకెప్పుడు ఆరాధించకూడదు. 'ఓం గజకర్ణాయ నమః - తులసి పత్రం పూజయామి' అంటూ గణపతికి తులసి పత్రాన్ని సమర్పించాలి.

9) చూత పత్రం : మామిడి ఆకులను చూత పత్రం అని సంస్కృత బాషలో అంటారు. మామిడి మంగళకరమైనది.

లేతమామిడి ఆకులను పెరుగులో నూరి సేవిస్తే అతిసారం తగ్గుతుంది. మామిడి జిగురులో ఉప్పు చేర్చి వేడీచేసి ఔషధంగా పూస్తే కాళ్ళపగుళ్ళు, చర్మవ్యాధులు ఉపశమిస్తాయి. చిగుళ్ళ వాపు సమస్యతో బాధపడేవారికి మామిడి లేత చిగురు మంచి ఔషధం. చెట్టు నుంచి కోసిన కొన్ని గంటల తరువాత కూడా ఆక్సిజెన్(ప్రాణవాయువు)ను విడుదల చేయగల శక్తి మామిడి ఆకులకుంది. మామిడి దేవతావృక్షం. అందువల్ల ఇంట్లో ఏ దిక్కులో మామిడి చెట్టున్నా మంచిదే. ఆఖరికి ఈశాన్యంలో మామిడి చెట్టున్నా, అది మేలే చేస్తుంది. మామిడి చెట్టును సాధ్యమైనంతవరకు కాపాడాలని, ఇంటి ఆవరనలో పెరుగుతున్న మామిడి చెట్టును నరికేస్తే, ఆ ఇంటి సభ్యుల అభివృద్ధిని నరికేసినట్లేనని వాస్తు శాస్త్రం గట్టిగా చెప్తోంది. ఏ శుభకార్యంలోనైనా, కలశ స్థాపనకు ముందు కలశంలో 5 రకాల చిగుళ్ళను వేయాలి. అందులో మామిడి కూడా ఒకటి.

ఓం ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి అంటూ గణపతికి ఇన్ని విశిష్టతలున్న మామిడి ఆకులను సమర్పించాలి.

10) కరవీర పత్రం : దినినే మనం గన్నేరు అని పిలుస్తాం. గన్నేరుకు శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా పూజకు కోసిన పువ్వులు, అవి చెట్టు నుంచి కోసే సమయంలో చెట్టు మొదట్లో క్రింద పడితే ఫర్వాలేదు కానీ, మరొకచోట(అది దేవుడుముదైనా, పూజ స్థలంలోనైనా సరే) క్రింద పడితే ఇక పూజకు పనిరావు. కానీ గన్నేరు పూలకు ఈ నిబంధన వర్తించదు. గన్నేరు పూలు మరే ఇతర ప్రదేశంలో క్రింద పడినా, నీటిని చల్లి పరమాత్మకు అర్పించవచ్చు. గన్నేరు చెట్టు తప్పకుండా ఇంట్లో ఉండాలి. గన్నేరు చెట్టు నుంచి వచ్చిన గాలి పీల్చినా చాలు, అది అనేక రోగాలను దూరం చేస్తుంది. గన్నేరు ఆకులు తెఉంచి పాలు కారిన తరువాత, పాలు లేకుండా తడిబట్టలో పెట్టి శరీరానికి కట్టుకుంటే జ్వరతీవ్రత తగ్గిపోతుంది. కానీ గన్నేరు పాలు ప్రమాదకరం కనుక కాస్త జాగ్రత్త వహించాలి.

'ఓం వికటాయ నమః - కరవీర పత్రం పూజయామి' అంటూ గణపతికి గన్నేరు ఆకులను సమర్పించాలి.

11) విష్ణుక్రాంత పత్రం : మనం వాడుకబాషలో అవిసె అంటాం. దీని ఆకును నిమ్మరసంతో కలిపి నూరి తామరవ్యాధి ఉన్న చోట పూస్తే తామరవ్యాధి నశిస్తుంది. ఆకును కూరగా చేసుకుని భుజిస్తే రక్తదోషాలు నివారణావుతాయి. విష్ణుక్రాంతం మేధస్సును పెంచుతుంది.

ఓం భిన్నదంతాయ నామః - విష్ణుక్రాంత పత్రం పూజయామి

12) దాడిమీ పత్రం : అంటే దానిమ్మ. భారతదేశమంతటా పెరిగే చెట్టు ఇది. లలితా సహస్రనామాల్లో అమ్మవారికి 'దాడిమికుసమప్రభ' అనే నామం కనిపిస్తుంది. దానిమ్మ రసాన్ని శరీరం మీద రాయడం చేత అలర్జీలు, కిటకాలు కుట్టడం వలన వచ్చిన పొక్కులు మానిపోతాయి. దానిమ్మ పండు తొక్క గాయాలకు ఔషధం, వాపును అరికడుతుంది. పైత్య దోషాన్ని అధుపులో ఉంచుతుంది. దానిమ్మ పండు ఆకలిని, అరుగుదలను పెంచుతుంది. విరోచనాలను తగ్గిస్తుంది.
గొంతురోగాలకు ఔషధం దానిమ్మ. దానిమ్మ పళ్ళు, పువ్వులు, ఆకులు, వేర్లు అన్ని ఔషధ గుణాలు కలిగినవై ఉంటాయి.

దానిమ్మ ఆకులను కొద్దిగా దంచి కాచి కషాయం చేసి దాన్లో తగినంత చక్కెర కలిపి సేచ్సితే ఉబ్బసం, అజీర్తి వంటి దీర్ఘకాలిక రోగాలు, దగ్గు, వడదెబ్బ, నీరసం ఉపశమిస్తాయి. దేని ఆకులకు నూనె రాసు వాపు ఉన్నచోట కడితే కల్లవాపులు తగ్గుతాయి.

ఓం వటవే నమః - దాడిమీ పత్రం పూజయామి

13) దేవదారు : ఇది వనములలో, అరణ్యాలలో పెరిగే వృక్షం. పార్వతీ దేవికి మహాఇష్టమైనది. చల్లని ప్రదేశంలో, ముఖ్యంగా హిమాలయ పర్వతాల వద్ద పెరుగుతుంది ఈ వృక్షం. దేవదారు ఆకులను తెచ్చి ఆరబెట్టి, తరువాత ఆ ఆకులను నునెలో వేసి కాచి, చల్లార్చిన తరువాత నూనె తలకి రాసుకుంటే మెదడు కంటి సంబంధ రోగాలు దరిచేరవు. దేవదారు మాను నుంచి తీసిన నూనె చుక్కలను వేడినీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి.

ఓం సర్వేశ్వరాయ నమః - దేవదారు పత్రం పూజయామి

14) మరువక పత్రం : మనం దీన్ని వాడుక బాషలో మరువం అంటాం. ఇది అందరి ఇళ్ళలోనూ, అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నవారు కుండిల్లో కూడా పెంచుకోవచ్చు. మంచి సువాసనం కలది. మరువం వేడినీళ్లలో వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే శరీరానికున్న దుర్వాసన తొలగిపోతుంది.

ఓం ఫాలచంద్రాయ నమః - మరువక పత్రం పూజయామి

15) సింధువార పత్రం : వావిలి ఆకు. ఇది తెలుపు-నలుపు అని రెండు రకాలు. రెండింటిన్లో ఏదైనా వావికి ఆకులను నీళ్ళలో వేసి మరిగించిన నీటితో బాలింతలకు స్నానం చేయిస్తే బాలింతవాతరోగం, ఒంటినొప్పులు ఉపశమిస్తాయి. ఈ ఆకులను దంచి దానిని తలమీద కట్టుకుంటే రొంప, శిరోభారం ఉపశమిస్తాయి.

ఓం హేరంభాయ నమః - సింధువార పత్రం పూజయామి

16) జాజి పత్రం: జాజి పత్రానికి అనేక ఔషధ గుణాలున్నాయి. ఇది అని చోట్ల లభిస్తుంది. జాజిపూలు మంచి సువాసన కలిగి మనిషికి ఉత్తేజాన్ని, మనసుకు హాయిని కలిగిస్తాయి. ఈ సువాసన డిప్రేషన్ నుంచి బయటపడడంలో బాగా ఉపకరిస్తుంది. జాజి ఆకులు వెన్నతో నూరి ఆ మిశ్రమంతో పళ్ళుతోముకుంటే నోటి దుర్వాసన నశిస్తుంది. జాజి కాషాయన్ని రోజు తీసుకోవడం వలన క్యాన్సర్ నివారించబడుతుంది. జాజి చర్మరోగాలకు దివ్యౌషధం. కామెర్లను, కండ్లకలకను, కడుపులో నులుపురుగులను నయం చేయడంలో జాజిపూలు ఉపయోగిస్తారు. జాజిమొగ్గలతో నేత్రవ్యాధులు, చర్మరోగాలు నయం చేస్తారు.

ఓం శూర్పకర్ణాయ నమః - జాజి పత్రం సమర్పయామి

17) గండకీపత్రం: దీనిని మనం దేవకాంచనం అని పిలుస్తాం. థైరాయిడ్ వ్యాధికి ఔషధం గండకీ పత్రం. అరణ్యాలలో లభించే ఈ గండకీ చెట్టు ఆకు మొండి, ధీర్ఘవ్యాధులకు దివౌషధంగా పనిచేస్తుంది. చర్మరోగాలను, పైత్య రోగాలను హరిస్తుంది. దగ్గు, జలుబును హరిస్తుంది.

ఓం స్కంధాగ్రజాయ నమః - గండకీ పత్రం సమర్పయామి

18) శమీ పత్రం: దేని వ్యవహార నామం జమ్మి. మహాభారతంలో విరాటపర్వంలో పాండవులు దేనిమీదనే తమ ఆయుధాలను దాచిపెడతారు. జమ్మి ఆకుల పసరు తీసి దానిని పుళ్ళు ఉన్నచోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది. జమ్మిపూలను చెక్కరతో కలిపి సేవించడం వలన గర్భస్రావం జరగకుండా నిరోధించబడుతుంది. జమ్మి చెట్టు బెరడు దగ్గు, ఆస్తమా మొదలైన వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది.

ఓం ఇభవక్త్రాయ నమః - శమీ పత్రం సమర్పయామి

19) ఆశ్వత్థపత్రం: రావి వృక్షం. తులసి లేని ఇల్లు, వేపలేని వీధి, ఒక్క రావి చెట్టు కూడా లేని ఊరు ఉండరాదన్నది మన పెద్దలమట. రావి సాక్షాత్ శ్రీ మహావిష్ణుస్వరూపం. పరమాత్మయే తనును తాను రావిచెట్టుగా చెప్పుకున్నాడు. రావిమండలను ఎండబెట్టి, ఎండిన పుల్లలను నేతితీ కలిపి కాల్చి భస్మం చేసి, ఆ భస్మాన్ని తేనేతో కలిపి సేవిస్తూ ఉంటే శ్వాసకోశవ్యాధులు నివారణ అవుతాయి. అందుకే యజ్ఞయాగాదులు, హోమాల్లో రావికొమ్మలను వాడుతారు. రావి వేర్లు దంతవ్యాధులకు మంచి ఔషధం. దీని ఆకులను హృద్రోగాలకు వాడతారు. రావి ఆకులను నూరి గాయాలపై మందుగా పెడతారు. రావి చర్మరోగాలను, ఉదరసంబంధ వ్యాధులను నయం చేస్తుంది, రక్తశుద్ధిని చేస్తుంది.

ఓం వినాయకాయ నమః - అశ్వత్థ పత్రం సమర్పయామి

20) అర్జున పత్రం: మనం దీనినే మద్ది అంటాం. ఇది తెలుపు-ఎరుపు అని రెండు రంగులలో లభిస్తుంది. మద్ది చెట్టు హృదయ సంబంధిత జబ్బులకు మంచి ఔషధం. హృదయానికి సంబంధించిన రక్తనాళాలను గట్టిపరుస్తుంది. భారతదేశంలో నదులు, కాలువల వెంట, హిమాలయాలు, బెంగాలు, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో విరివిగా పెరుగుతుంది. ఇది శరీరానికి చలువ చేస్తుంది. కఫ, పైత్య దోషాలను హరిస్తుంది కానీ, వాతాన్ని పెంచుతుంది. పుండు నుంచి రక్తం కారుటను త్వరగా ఆపుతుంది. మద్ది బెరడును రుబ్బి, ఎముకలు విరిగినచోట పెడితే గాయం త్వరగా మానిపోతుంది. దీని బెరడును నూరి, వ్రణమున్న ప్రదేశంలో కడితే, ఎలాంటి వ్రణములైనా తగ్గిపోతాయి.

ఓం సురసేవితాయ నమః - అర్జున పత్రం సమర్పయామి
21) అర్క పత్రం: జిల్లేడు ఆకు. జిల్లేడు చెట్టు గణపతి స్వరూపం. జిల్లేడు పాలు కళ్ళలో పడడం వలన కంటికి తీవ్రమైన హాని కలుగుతుంది, కానీ జిల్లేదు ఆకులు, పూలు, వేర్లు, కొమ్మలు, పాలు అన్నీ ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఆస్తమా, దగ్గు మొదలైన వ్యాదులకు జిల్లేడు పూలను వాడటం ఆయుర్వేద గ్రంధాల్లో కనిపిస్తుంది. జిల్లేడుతో చేసిన నూనె చెవుడుకు ఔషధం. జిల్లేడు రక్త శుద్ధిని చేస్తుంది.

ఓం కపిలాయ నమః - అర్క పత్రం సమర్పయామి

శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః - ఏకవింశతి పత్రాణి సమర్పయామి🌹
(సేకరణ)