Akhanda Bharath
91 subscribers
20 photos
3 videos
78 links
Patriotic songs in telugu - దేశభక్తి గీతాలు
Independence Day Songs, Republic Day Songs.
Motivational Videos in Telugu
Inspirational Videos in Telugu
Download Telegram
దేశం కోసం జీవిద్దాం -
జీవితమంతా అర్పిద్దాం
దేశం కోసం జీవిద్దాం -
జీవితమంతా అర్పిద్దాం
మనం మనం మహాగణం - మహాగణమ్మే ప్రభంజనం

నేనోక్కడినని అనుకుంటే - నేతాజీ ఎట్లగుదువోయి
శివమెత్తక నువు కూర్చుంటే - శివాజీ ఎట్లగుదువోయి
చీమల గుంపును గమనిద్దాం - పక్షుల పయనం పరికిద్దాం
నీటిన నిప్పును రగిలిద్దాం - నింగిన చుక్కల శాసిద్దాం
చరిత్రలోని మహాపురుషులను – ప్రతినిత్యమ్ముస్మరించుదాం
|| మనం మనం ... ||

ఇది భూతల స్వర్గమ్మేలే - ఇక్కడ అందరు బంధువులే
మనమూ మనదంటే సరిలే - కాదంటే ఇక కుదరదులే
ఇంటిదొంగలను గమనిద్దాం - ఇజాలనిజాల ఛేదిద్దాం
రక్కసి మూకల గుర్తిద్దాం - రామ బాణమును సందిద్దాం
చరిత్ర నేర్పిన గుణపాఠాలను - ప్రతినిత్యమ్ము పఠించుదాం
|| మనం మనం ... ||

ఈ మట్టిన పుట్టిన కుందేలే - వేట కుక్కలను తరిమెనులే
ఈ చెట్టున ఆడిన ఆ ఉడతే - సేతు బంధనం చేసెనులే
జఠాయువయ్యి జన్మిద్దాం - జన్మ సార్ధకంబొనరిద్దాం
తను మన ధనములనర్పిద్దాం - తల్లి భారతిని సేవిద్దాం
పరంపరాగత చరిత్రలోని - పరమార్ధమ్మును గ్రహించుదాం
|| మనం మనం ... ||
వికారి నామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు

తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఉగాది శుభాకాంక్షలు
_*మూడు జల్లెడ్ల పరీక్ష*_
_*(Triple Filter Test)*_

_-{ఇప్పటితరానికీ ఉపయోగపడే కథ }-_

_*స్నేహానికి విలువ తెలిసిన వారికి మాత్రమే ఈకథ !*_

_ఒక సారి ఉత్తమ బ్రాహ్మణుడైన చాణిక్యునిదగ్గరకు అతని మిత్రుడు ఒకడు వచ్చి నీకు తెలుసా నీ మిత్రుడు గురించి నేను ఒక విషయం విన్నాను” అని ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతున్న అతన్ని చాణిక్యుడు ఆపి “నీవు నా మిత్రుడు గురించి చెప్పబోయే ముందు ఒక్క నిముషం సావధానంగా నీవు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడ పడదాం దీన్ని నేను “మూడు జల్లెడ్ల పరీక్ష (Triple Filter Test)” అంటాను అని అడగటం మొదలు పెట్టాడు._

_మొదటి జల్లెడ “నిజం” – “నీవు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమైనదని నీకు తెలుసా ?” అని అడిగాడు._

_అందుకు ఆ స్నేహితుడు “లేదు, ఎవరో అంటుండగా విన్నాను” అని అన్నాడు._
_“అంటే నీవు చెప్పబోయే విషయం నిజమైనదే అని నీకు తెలీదన్న మాట” అని చాణిక్యుడు అన్నాడు._

_సరే రెండో జల్లెడ “మంచి” – ”నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించిన మంచి విషయమా ?” అని అడిగాడు చాణిక్యుడు >_

_“కాదు”అన్నాడు చాణిక్యుని స్నేహితుడు._

_“అంటే నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలను కున్నావు, అది కుడా నీకు ఖచ్చితంగా నిజమని తెలీని విషయం- సరే ఇంక మూడో జల్లెడకు వెళదాం” అన్నాడు చాణిక్యుడు._

_మూడో జల్లెడ “ఉపయోగం” – “నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగమైనదా ?” అని చాణిక్యుడు అడిగాడు._

_“లేదు” అన్నాడు ఆ మిత్రుడు._

_“అయితే నీవు చెప్పబోయే విషయం నిజమైనది, మంచిది, ఉపయోగకరమైనది కానపుడు నాకు చెప్పటం ఎందుకు ?” అని అన్నాడు చాణిక్యుడు._

_*నీతి :* మన గురించి, మన వాళ్ళ గురించి చెడు వార్తలను, విషయాలను మోసే వాళ్ళు చాలా మంది వుంటారు. ఒక విషయం (చాడి) వినేముందు ఈ మూడు జల్లెడల పద్ధతి అనుసరిస్తే, మన బంధాలు నిలబడతాయి, మంచి పెంపొందుతుంది. చాడీలు నివారించబడతాయి._

_*స్నేహానికి విలువ తెలిసిన వారికి మాత్రమే ఈకథ !*_

🙏🇮🇳
శ్రీరామచంద్రునితో వశిష్ట మహర్షి ....

"శ్రీరామా! ప్రపంచంలో విధి అనే మాటే లేదు. ఉన్నదల్లా నీ పాత కర్మా, నీ కొత్త కర్మా రెండే! ఒకడు నిన్న పాపం చేసాడు. ఇవాళ అది గుర్తించి శాస్త్రంలో చెప్పిన ప్రాయశ్చిత్తం చేసాడు. దానితో నిన్నటి పాపం పోతుంది. అలాగే క్రిందటి జన్మలో చేసిన పాపకర్మకు, ఈ జన్మలో చేసిన పుణ్యకర్మ విరుగుడు.

శ్రీరాముడు : మహర్షి, ఒకే తొడిమకి రెండు కాయలు కాచాయి. అందులో నేనొకటి తీసుకున్నాను, నా మిత్రుడు ఒకటి తీసుకొన్నాడు. కొరికి చూస్తే నా పండు నిండా కండ తియ్యగా ఉంది. నా మిత్రుడు తీసుకొన్న పండు నిండా తొర్రే, పైగా వగరు. ఒకే తొడిమకు పుట్టిన రెండు పండ్లలో ఈ భేదం విధిబలం కాక మరేమటంటారు?

వశిష్ఠుడు : అక్కడ కూడా విధి లేదు. ఎందుకంటే తినేవాడి పుణ్యం కొద్దీ వస్తువులు దొరుకుతాయి. పుణ్యం అంటే పూర్వం చేసుకున్న కర్మ. నీ మిత్రుడికి అది సరిగా లేదు. అతని కోసం ఆ తొర్ర పండు పుట్టింది. ఆ పండు నీ మిత్రుడి యొక్క పూర్వఫలం తప్పితే మరొకటి కాదు".
(యోగవాశీష్ఠ హృదయము, ముముక్షువ్యవహార ప్రకరణం) (భక్తిమాల నుండి)

"భగవంతుడి నామాన్ని జపించడమే జపయజ్ఞం

"శ్రీరామ జయరామ జయ జయ రామ"
"శ్రీరామ జయరామ జయ జయ రామ"
"శ్రీరామ జయరామ జయ జయ రామ"